న్యూయార్క్ నగరంలో అనూహ్య ప్రమాదంలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటన కొంత సంతోషాన్నివ్వగా, మరింత విషాదాన్ని నింపింది. అవును.. విషాదం ఎందుకంటే ఫెర్నాండో బాల్బునా (45) అనే వ్యక్తి తన పాప (5)తో సహా రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఫెర్నాండో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పాప ప్రాణాలతో బైటపడింది. సోమవారం ఉదయం బ్రోంక్స్ లోని కింగ్స్‌బ్రిడ్జ్ రోడ్ స్టేషన్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
ప్రత్యక్ష సాక్షలు కథనం ప్రకారం పాపను ఎత్తుకున్న ఒకవ్యక్తి పాపతో సహా రైలు పట్టాలపై దూకేశాడు. దీంతో ఇద్దరు సహ ప్రయాణికులు వారి రక్షించేందుకు ట్రాక్‌లపైకి వెళ్లారు. కానీ అప్పటికే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అదృష్టవశాత్తూ పాప బైటపడింది. అయితే పట్టాలపై ఇరుక్కున్న పాపకు జైరో టోర్రెస్ ధైర్యం చెప్పి కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. ‘నాన్నకు ఏమైంది.. అంటూ బెదిరిపోతున్న పాపను ఊరడించిన జైరో.. నాన్నవైపు చూడకు..నన్నుచూడు..నాదగ్గరకు రా..పప్పీలా పాకుతూ నావైపు రా అంటూ ఆమెను పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంకి తీసుకొచ్చాడు. ఈ ఘనటపై మృతుని భార్య, పాప తల్లి తన పాపను రక్షించింనందుకు కృతజ్ఞతలు తెలిపింది.
మరోవైపు ఉద్దేశపూర్వకంగానే ఫెర్నాండో సబ్వే ట్రాక్‌పైకి దూసుకెళ్లినట్లు సాక్షులు చెప్పారనీ, సంఘటనా స్థలంలోనే అతను మృతి చెందినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment