అన్నానగర్: కుణ్ణం సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పెరంబలూరు జిల్లా కుణ్ణం సమీపంలోని పుదువైట్టికుడి గ్రామానికి చెందిన దేవేంద్రన్ కుమారుడు దేవరాజ్ (28). పుదువెట్టికుడి సమీపంలోని కాడూరు గ్రామానికి చెందిన దురైరాజ్–ముత్తులక్ష్మి కుమార్తె సత్య(23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీరికి ఏడాది వయసున్న కుమారుడు సంజీవ్ దేవ్ ఉన్నాడు. ఈ క్రమంలో దేవరాజ్, సత్య మధ్య తరచూ కలహాలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన సత్య, భర్త నిద్రపోతుంటే ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సత్య తల్లి ముత్తులక్ష్మి కుణ్ణం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుణ్ణం సబ్ ఇన్‌స్పెక్టర్ పిచ్చుమణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతితో ఏడాది కుమారుడిని చూసి అక్కడి వారు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment