love marriage
-
నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్(Himani Mor)తో జనవరి 16న అతడి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ షేర్ చేసిన తర్వాతే.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.ఈ నేపథ్యంలో నీరజ్ భార్య హిమానీ మోర్ బ్యాగ్రౌండ్‌తో పాటు.. అత్తామామల నుంచి అతడు తీసుకున్న కట్నకానుకలు, అల్లుడిగా అందుకున్న బహుమతులు ఏమిటన్న అంశాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్‌కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ప్రేమ పెళ్లి‘‘దేవుడి దయ వల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు. దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో నా కూతురి పెళ్లి కావడం సంతోషంగా ఉంది. నీరజ్, హిమానీలకు గత రెండేళ్లుగా పరిచయం ఉంది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు’’ అని మీనా మోర్ దైనిక్ భాస్కర్‌కు తెలిపారు.‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?అదే విధంగా.. తమ అల్లుడు తమ నుంచి కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడని హిమానీ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇది కాకుండా ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు.. ఆఖరికి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, దుస్తులను కూడా స్వీకరించలేదని తెలిపారు. తమ కూతురిని అచ్చంగా వాళ్లింటి అమ్మాయిని చేసుకున్నారని సంతోషంతో పొంగిపోయారు.కాగా హర్యానా అథ్లెట్లు నీరజ్- హిమానీల వివాహం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఇక ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 14న నిశ్చితార్థం జరుగగా.. జనవరి 15న హల్దీ, మెహందీ, సంగీత్ నిర్వహించారు. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తికాగా.. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇక కొత్త జంట ఇప్పటికే హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎవరీ హిమానీ మోర్?హర్యానాలోని లార్సౌలీ హిమానీ స్వస్థలం. సోనిపట్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్‌ఫిజికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకుంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు హిమానీ అమెరికాకు వెళ్లింది.ప్రస్తుతం హిమానీ మెక్‌కోర్మాక్ ఐసెంబర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2018లో హిమానీ ఆలిండియా టెన్సిస్ అసోసియేషన్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. కెరీర్లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది.నికర ఆస్తుల విలువ?కాగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో గల ఖాంద్రా గ్రామంలో నీరజ్ చోప్రా ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గతంలో ఆర్మీ సుబేదార్‌గా పనిచేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా.. ‘గోల్డెన్ బాయ్’గా ప్రసిద్ధి పొందాడు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నీరజ్ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి. మనసులు కలవడానికి భాషా, సంస్కృతులు అడ్డంకులు కాబోవని చాటింది. తాను ఇష్టపడిని పరదేశీయుడిని పెద్దల అనుమతితో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమపెళ్లిని అందరూ మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు చెబుతున్నారు.సేలం : కోవైకు చెందిన మహిళ నెదర్లాండ్ దేశానికి చెందిన తన ప్రియుడిని కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకుంది. కోవై జిల్లా పెరియ నాయకన్ పాలయానికి చెందిన ప్రమీలా.. నెదర్లాండ్ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్లో పని చేస్తున్న స్టీన్హీస్ అనే యువకుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. ఆ మేరకు ఇరు కుటుంబీకుల సమ్మతితో ప్రమీలాకు, నెదర్లాండ్ యువకుడికి కోవైలో తమిళ సాంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. நெதர்லாந்து நாட்டு இளைஞரை காதலித்து தமிழ் பாரம்பரியப்படி தாலி கட்டி கரம் பிடித்த தமிழ் பெண்..#Coimbatore | #Netherland | #marriage | #TamilCulture pic.twitter.com/QPzEn6aPCY— Polimer News (@polimernews) January 20, 2025video credit To Polimer Newsచదవండి: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ! -
తెలంగాణ అబ్బాయి.. కేరళ అమ్మాయి
మెట్‌పల్లిరూరల్(జగిత్యాల జిల్లా): దుబాయ్‌లో పరిచయమైన తెలంగాణ అబ్బాయి.. కేరళ అమ్మాయి పెళ్లితో ఒక్కట య్యారు. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం అ ల్లూరి సీతారామరాజు తండాకు చెందిన గుగ్లావత్ అజయ్ నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ తాను పని చేస్తున్న కంపెనీలో కేరళకు చెందిన అజితతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని, తమ పెద్దలను ఒప్పించారు. ఆదివారం కేరళలో అక్క డి సంప్రదాయం ప్రకా రం పెళ్లి చేసుకున్నారు. -
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
కృష్ణుడు నవ్వడు. తెగ నవ్విస్తాడు. కృష్ణుడు అమాయకంగా కనిపిస్తాడు. కానీ అల్లరల్లరి చేస్తాడు. ‘అయ్ బాబోయ్... మా రాజోలులో ఇలా కాదండీ’ అనేది ‘వినాయకుడు’ సినిమాలో కృష్ణుడి మార్క్ డైలాగ్. కృష్ణుడు నటుడు మాత్రమే కాదు ్రపొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ‘కూడా’కు మరో ‘కూడా’ కలిపితే వంటలు చేయడంలో దిట్ట కూడా! కృష్ణుడు కోనసీమ బిడ్డ. ఉమ్మడి కుటుంబాల విలువ తెలిసిన కృష్ణుడు ఈస్ట్, వెస్ట్ స్పెషల్ పాకుండల గురించి నోరూరించేలా చెబుతాడు. అంతేనా! ‘అయ్ బాబాయ్. మా రాజోలులో అలా కాదండి. ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ఎలా చేయాలో కూడా చెబుతామండీ’... మరి ఆయన మాటల్లోనే... పాకుండలు, పెద్ద చెగోడీలతో పాటు... తన స్వీట్ ఫ్యామిలీ కబుర్లు...కనుల పండగ చేసే రంగవల్లులే కాదు... సంక్రాంతి అంటే కమ్మని కర కరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ్రపాంతానికి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. పెద్ద పండగ రోజు ఆ కరకరల స్వరాలు వినాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న గీతాభాస్కర్ చేసే సకినాల రుచి ఇంతా అంతా కాదు. కృష్ణుడు అంటే అల్లరి. వెండితెర కృష్ణుడు అంటే నవ్వుల సందడి. కోనసీమ బిడ్డ కృష్ణుడు పాకుండల గురించి చెబితే తీయగా నోరూరాల్సిందే. తమకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పడమే కాదు... ఎలా చేయాలో కూడా చెబుతున్నారు గీతాభాస్కర్, కృష్ణుడు. ఆ కబుర్ల కరకరలు... కృష్ణుడు: ట్రెడిషనల్ పిండి వంటలు చేయడం అనేది నాకు చిన్నప్పుడు అలవాటు. మా అమ్మ చేసేవారు. అలాగే మా ఇంట్లో సుబ్బయ్య అని కుక్ ఉండేవారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. బియ్యం నానబెట్టి, తర్వాత ఆరబెట్టి, దంచేవాళ్లు. నా చిన్నప్పుడు బాగా గుర్తున్నది అంటే ఇదే. ఇప్పుడంటే మిషన్‌లో పిండి ఆడిస్తున్నారు కానీ అప్పట్లో దంచడమే. మన చిన్నప్పుడు మనం తిన్నంత టేస్టీగా ఇప్పుడు ఉండటంలేదు. చిన్నప్పుడు టేస్ట్ చూశాం కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్‌కి ఆ తేడా తెలియదు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి రోజుకొక ఇంటికి అన్నట్లు వండేవారు. అది చాలా బాగుండేది.మాకు పాకుండలు ఫేమస్మేం ఈ సంక్రాంతికి పాకుండలు చేశాం. మాకు అదే ప్రత్యేకత. ఈస్ట్, వెస్ట్‌లో సంక్రాంతికి పాకుండలు ఫేమస్. విడిగా పెద్దగా చేయరు. ఈ పండగకే చేస్తుంటారు. అరిసెల పిండి ఫార్మాట్లోనే పాకుండల పిండి కూడా ఉంటుంది. బియ్యాన్ని ఓ రోజంతా కానీ 30 గంటలు కానీ నానబెట్టి, పిండి పట్టించుకోవాలి. బెల్లం పాకం పట్టి చేసుకోవాలి. పాకం సరిగ్గా కుదరడానికి కొలతలు ముఖ్యం. నాలుగు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల బెల్లం వాడాలి. ఒక అరగ్లాసు నీళ్లు పోసి, పాకం పట్టాలి. పాకుండలలో కొబ్బరి ముక్కలు వేస్తారు. అది టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి అరిసెలు ఉంటాయి కానీ కోనసీమ జిల్లాల్లో పాకుండలనే ప్రిఫర్ చేస్తారు.ఆ మంచు... అదో అందంచిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ఇరుగుపొరుగు కలిసి పిండి వంటలు వండుకోవడం... ఊర్లో ఇలాంటి సందడి ఉండేది. ఇప్పటికీ ఊళ్లో ఉన్నాయి. కానీ సిటీలో అంత సందడి కనిపించదు. చిన్నప్పుడు ఆ మంచులో భోగి మంటలు వేయడం, హరిదాసులు రావడం, పెద్ద పెద్ద ముగ్గులు చూడటం... అంతా ఓ అందంగా ఉండేది. అదో మంచి అనుభూతి. సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి మంటలు అవి వేస్తారు కానీ ఊళ్లో ఉన్నంత సందడి ఇక్కడ కనిపించదు. అందుకే చాలామంది పండగలకి ఊరు వెళ్లిపోతుంటారు. నేను కూడా వీలున్నప్పుడల్లా వెళుతుంటాను. మా పాపకి ఆ కల్చర్ తెలియాలని తనని కూడా తీసుకెళుతుంటాను. ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీల్లో స్థిరపడుతున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది పండగకి ఊరికి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అంటే అందర్నీ కలిపే పండగ. బయటి ఫుడ్ తినదుమాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ (లలితా గాయత్రి) వాళ్లది నిజామాబాద్. ఆ వంటల స్టయిల్ వేరు. ఏ ్రపాంతం రుచి ఆ ్రపాంతానిది. నేను బేసిక్‌గా ఫుడ్ లవర్ని. బాగా వండిన ప్రతిదీ నాకు ఇష్టం. ఇక మా ఆవిడకి కూడా పాకుండలు చేడయం వచ్చు. నిజానికి పెళ్లయ్యాక నేను వంట చేయడం మానేశాను. అయితే అప్పుడప్పుడూ చేస్తుంటాను. ఈ పండగకి నేనే చేశాను... తను పక్కనే ఉండి, కాస్త హెల్ప్ చేసింది. మా పాపకు నచ్చిన పిజ్జా, గార్లిక్ బ్రెడ్ అవన్నీ కూడా చేస్తుంటాను. మా పాప బయటి ఫుడ్ దాదాపు తినదు. ఇంట్లోనే చేసి పెడతాం.పండగకి పెద్ద చెగోడీలూ చేస్తాంసంక్రాంతికి మేం పాకుండలతో పాటు పెద్ద చెగోడీలు చేస్తుంటాం. మా రాజోలులో ఈ చెగోడీలు ఫేమస్. కారపొ్పడితో చేస్తాం. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఊరెళ్లినప్పుడుల్లా తింటాను. ఇప్పుడు పాకుండలతోపాటు అవి కూడా వండాను. చెగోడీలకు కూడా బియ్యం పిండినే వాడతాం. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసు నీళ్ల రేషియోతో చేయాలి. పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర... మూడూ నూరి, వేడి నీళ్లలో కలిపి, ఉప్పు వేసి, అందులో బియ్యం పిండి వేసి, కలపాలి. ఆ తర్వాత చెగోడీలను లావుగా వత్తి, పెసరపప్పు అద్ది, నూనెలో వేసి వేయించుకోవాలి. -
విద్యార్థినితో లెక్చరర్ ప్రేమపెళ్లి
మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. -
12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు లాటిన్ కవి జువెనాల్. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్‌గా మారింది. పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్ ఏంటంటే..12 ఏళ్ల క్రితం ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఘర్ కా కాలేశ్ అనే యూజర్ ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బిహార్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024 ; -
కన్నతల్లిని కాదని.. ప్రియుడి వెంట నడిచి..
రొంపిచెర్ల: ప్రేమ వివాహం వద్దని ప్రియుడు కట్టిన తాళిబొట్టును తెంచినా ఆ యువతి కన్నతల్లిని ఎదిరించి ప్రేమికుడి వెంట వెళ్లిన సంఘటన రొంపిచెర్ల మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గానుగచింతకు చెందిన యువకుడు రెడ్డెప్ప (21), తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన చిట్టి ప్రసన్న(19) అన్నమ్మయ్య జిల్లా పీలేరులో డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే చిట్టి ప్రసన్నకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో చిట్టి ప్రసన్న ఇంటి నుంచి మంగళవారం ఉదయం రొంపిచెర్లకు చేరుకుని జరిగిన విషయం ప్రియుడు రెడ్డెప్పకు చెప్పింది. దీంతో వారిద్దరూ కట్టకింద శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిట్టి ప్రసన్న తల్లి కుమారై మెడలో ఉన్న తాళిబొట్టును తెచ్చి ఇంటికి రావాలని కుమారైను పిలిచింది. అయితే దీనికి కుమారై అంగీకరించలేదు. దీంతో ఈ పంచాయితీ రొంపిచెర్ల పోలీసుస్టేషన్‌కు చేరింది. ఎస్ఐ సుబ్బారెడ్డి ప్రేమికులను విచారించారు. పోలీసుల విచారణలో ప్రేమికురాలు తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాని తెలిపింది. తాను మేజర్‌నని తనకు తన భర్త కావాలని తెగేసి చెప్పింది. దీంతో పోటీసులు చేసేదేమీ లేక వారిని కలసి ఉండమని చెప్పారు. దీంతో ఇరువురు గానుగచింతకు చేరుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మానకొండూర్: తల్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. తండ్రి 10 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో ఐదేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఆ దంపతుల పాప, బాబు అనాథలయ్యారు.. ఈ విషాద ఘటన మానకొండూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కోండ్ర పవన్‌కల్యాణ్, ప్రహర్ష(24) 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప, బాబు సంతానం. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్ 10 నెలల క్రితం ఇంట్లో ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రహర్ష కరీంనగర్‌లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పని చేస్తోంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పిల్లలను స్కూల్‌కు పంపించి వస్తానని మామ లక్ష్మణ్‌తో చెప్పి, వెళ్లింది. తిరిగి రాకపోవడంతో అతను చుట్టుపక్కల వెతికాడు. సమీప బావిలో ఆమె శవమై కనిపించింది. అయితే, ఉదయం ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి, ప్రహర్షతో మాట్లాడి వెళ్లాడని మృతురాలి అత్త భాగ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రహర్ష చనిపోవడానికి ఆ వ్యక్తే కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని మృతురాలి సోదరి నిర్మిట్ల ప్రసన్న అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పసితనంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూసి, వారి నానమ్మ, తాతయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. అది చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. -
ప్రేమ పెళ్లితో ఒక్కటైన అత్తా,కోడలు
మేనకోడలిపై మనసు పారేసుకున్న ఓ అత్త భర్తను వదిలేసింది. మేనకోడల్ని మనువాడింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలో బెల్వా గ్రామంలో వింతఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉండే అత్త తన మేనకోడలిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను విడిచిపెట్టింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నఈ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. బంధువుల సమక్షంలో స్థానిక దుర్గా భవాని ఆలయంలో అత్త మేనకోడలు వివాహం చేసుకున్నారు. కోడలి మెడలో అత్త మంగళ సూత్రం కట్టింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. ఏడు జన్మలు ఒకరితో ఒకరు కలిసుంటామని వాగ్దానం కూడా చేశారు. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతో మేన కోడలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చిందని, వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అత్త,మేనకోడలి వివాహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. Shockingly, an aunt and her niece got married in Bihar’s Gopalganj.The two had been having an affair for three years, which has now culminated in marriage. pic.twitter.com/TllfEUf7K0— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) August 12, 2024 -
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపెట్టిన లావణ్య..
-
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్‌కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
అత్తారింటికి దారేది?
శంకరపట్నం (మానకొండూర్): పొరుగింటి వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు తమ కూతురుపై కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై ఇటుకలతో గోడకట్టారు. దీనిపై గ్రామ పెద్దలతో చెప్పించినా వారు వినకపోవడంతో కూతురు తన తల్లిదండ్రులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లుసైతం తన సమస్యను పట్టించుకోవడం లేదని శుక్రవారం మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింటి వ్యక్తి అయిన కనకం రత్నాకర్‌ను 2023 ఫిబ్రవరి 16న ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ కేశవపట్నంలో అద్దెకుంటున్నారు. అక్కడే జిరాక్స్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివాసం ఉంటున్నారు. మమత తల్లి ఇంటి ఎదుట నుంచే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబసభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఇప్పటి నుంచి దొడ్డిదారి గుండా నడుస్తున్నామని, తన అత్తారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి, ఇబ్బందులు పెడుతున్న తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని మమత నాలుగు రోజల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మమత కోరింది. -
ప్రేమ పరీక్షలు పెట్టా!
‘‘మథియాస్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మథియాస్ కన్నా ముందు నేను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ మథియాస్ పరిచయమై, తనతో మాట్లాడటం మొదలుపెట్టాక ఫైనల్‌గా నా అభిప్రాయానికి తగ్గ మనిషిని కనుగొనగలిగాను అనిపించింది’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్, తాప్సీ ఈ ఏడాది మార్చి 23న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు.ఈ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. అయితే మథియాస్‌తో ప్రేమలో పడే ముందు కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టానని తాప్సీ చెబుతూ – ‘‘నాకు క్రీడాకారులంటే ఇష్టం. దేశం కోసం వాళ్లు ఆడుతుంటారు. ఇక మథియాస్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అలాగే ఒక నెలలో పుట్టిన ప్రేమ కూడా కాదు. మా మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టాను. అన్నింటిలోనూ మథియాస్ గెలిచాడు.ఒక అనుబంధం బలంగా నిలవడం ముఖ్యం. అందుకే నేను తొందరపడలేదు. అంతకు ముందు నాకు పరిచయం ఉన్న అబ్బాయిలు వేరు... మథియాస్ వేరు. ఆ అబ్బాయిల్లో ఏ ఒక్కరినీ మథియాస్‌తో పోల్చలేం. పరిణతి, భద్రతాభావం... ఇవే అతను నాకు సరైన వ్యక్తి అని నిర్ణయించుకునేలా చేశాయి’’ అన్నారు. -
Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా
బంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్‌నగర్‌లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్‌ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్‌లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
కర్ణాటక: ఇది అలాంటి ఇలాంటి పెళ్లి కాదు. గొప్ప ప్రేమ పెళ్లి అని అందరూ కొనియాడిన మూడు ముళ్ల కథ ఇది. ఈ జంట 25 సంవత్సరాలు ప్రేమించుకుని ఐదు పదులు దాటాక మాంగళ్య ధారణ చేసుకున్నారు. జిల్లాలోని తరికెరె సమీపంలోని అమృత్‌పూర్‌లోని అమృతేశ్వరస్వామి ఆలయంలో తోటలో నిరాడంబరంగా సుధ (54), మోహన్‌కుమార్ (52)ల వివాహం జరిగింది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాకు చెందిన మోహన్‌కుమార్, సుధది అజ్జాపూర్. ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగులు వీరిద్దరూ మైసూరులోని అబ్దుల్ నజీర్‌సాబ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చే రిసోర్స్ మాస్టర్ ట్రైనర్లుగా పనిచేస్తున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాగా, ఆమె మరాఠీ మహిళ. మోహన్‌కుమార్ యువకునిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల పట్ల ఆకర్షితులై సీపీఎంలో చేరారు. చిక్కమగళూరు జిల్లాలో రైతు సంఘంలో పోరాటం, ఉద్యమంలో పాల్గొన్న వారు. 90వ దశకం ప్రారంభంలో బి.కె.సుందరే కి ఇష్టమైన శిష్యునిగా ఉండేవాడు. తరువాత బెంగళూరు హెచ్ఏఎల్లో కార్మికుడిగా పనిచేశారు నవ కర్ణాటక ప్రచురణలో వ్యాసాలు రాసేవారు. అదే సమయంలో సుధ కూడా కమ్యూనిస్టు కార్యకర్తగా సామాజిక ఉద్యమాలలో పాల్గొనేవారు. అలా ఇద్దరికీ పరిచయమై గాఢమైన ప్రేమగా మారింది. 2005లో ఇద్దరూ మైసూరులో పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రిసోర్స్ పర్సన్లుగా ఎంపికయ్యారు. మోహన్, సుధ అన్యోన్యతను చూసిన అక్కడి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వీరిద్దరూ భార్యాభర్తలై ఉండొచ్చని అనుకునేవారు. అయితే అనేక ప్రేమ కథల్లో ఉన్నట్లే వీరి ప్రేమను కూడా కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి చేసుకోకుండానే ప్రేమను కొనసాగించారు. సన్నిహితుల చొరవతో చివరికి ఈ అపురూప జంటకు పెళ్లి చేసి ప్రేమకు సార్థకత తేవాలని కొందరు ఆప్తులు, స్నేహితులు నిర్ణయించారు. వారి ప్రోత్సాహంతో గత గురువారం అత్యంత నిరాడంబరంగా సుధ మెడలో మోహన్‌కుమార్ తాళి కట్టారు. ఈ పెళ్లి నేటిరోజుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేసే గ్రాండ్ వెడ్డింగ్‌లకు భిన్నంగా సరళంగా ఉంది. ఆథిత్యం పేరుతో విపరీతంగా ఖర్చుపెట్టి కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కథలున్నాయి. ఈ నిరాడంబర జంటను బంధుమిత్రులు సుఖీభవ అని ఆశీర్వదించారు. -
శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి
రాయికల్: ఉద్యోగం కోసం జోర్డాన్ దేశం వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూసాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మెట్పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి గ్రామానికి చెందిన జొరిగె అశోక్ ఉద్యోగం కోసం జోర్దాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ శ్రీలంక దేశానికి చెందిన సమన్వి పరిచయమైంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో అశోక్ అక్కాబావలైన రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన చేగంటి శేఖర్–పూజితలు హిందూ సాంప్రదాయ ప్రకారం భూపతిపూర్‌లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వీరి వివాహం జరిపారు. దంపతులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ సర్పంచులు వాసరి రవి, మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రావు ఆశీర్వదించారు. -
లవ్ మ్యారేజ్ ఆపై విడాకులు.. మరో వ్యక్తితో పెళ్లి.. మళ్లీ మొదటి భర్తతో..
మల్యాల(చొప్పదండి): వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య కలాహాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో యువతిని మరో వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. అయినప్పటికీ ఆమె తన మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఆమెను గొంతునులిమి హతమార్చి చెట్లపొదల్లో పడేశాడు. ఈ సంఘటన మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన కరిపే అంజలి.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబకలహాల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనంతరం అంజలిని సిద్దిపేటకు చెందిన వ్యక్తికిచ్చి మరో పెళ్లి చేశారు. అయినా మొదటి భర్త నరేశ్ అంజలితో ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడు. రెండురోజుల క్రితం సిద్దిపేట నుంచి జగిత్యాలలోని పుట్టింటికి వచ్చిన అంజలికి ఫోన్ చేసిన నరేశ్.. ఈనెల 17న తన బైక్‌పై తీసుకెళ్లాడు. మ్యాడంపల్లి శివారులోకి చేరగానే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె గొంతునులిమి చంపి చెట్లపొదల్లో పడేశాడు. సోమవారం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
చెల్లెలి భర్తను నరికి చంపిన యువకుడు
సాక్షి, చైన్నె: తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని ఓ అన్న తన స్నేహితులతో కలిసి హతమార్చాడు. ఈ పరువు హత్య చైన్నె శివార్లలో కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని పళ్లికరణై పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. స్థానిక అంబేడ్కర్ వీధికి చెందిన ప్రవీణ్(26) ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఎలిటియన్ పేటకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో ఈ ప్రేమ జంట గత ఏడాది చివర్లో ఇంటి నుంచి పారిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. తమ కుటుంబ పరువును బజారు కీడ్చిన ప్రవీణ్‌పై ఆ యువతి కుటుంబం కక్ష పెంచుకుంది. ఆమె సోదరుడు దినేష్(24) తన మిత్రులతో కలిసి ప్రవీణ్ కదలికలపై నిఘా పెట్టాడు. శనివారం రాత్రి వేళచ్చేరి నుంచి పళ్లికరణై టాస్మాక్ రోడ్డు వైపుగా వెళ్తున్న ప్రవీణ్‌ను దినేష్ తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టాడు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి పడేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న దినేష్‌ను ఆ పరిసర వాసులు 108లో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పళ్లికరణై ఇన్స్పెక్టర్ నెడుమారన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. అతడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించింది. ఆ పరిసరాలలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పారి పోయిన మార్గంలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయాన్నే దినేష్‌తో పాటు అతడి స్నేహితులు చిత్తాల పాక్కం శ్రీరాం(23), స్టీఫన్(24), విష్ణు రాజు(23), జ్యోతిలింగం(23) మాంబాక్కం వద్ద ఓ చోట తలదాచుకుని ఉండడంతో వారిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. తన చెల్లెల్ని కులాంతరం వివాహం చేసుకున్నందుకే ప్రవీణ్‌ను మట్టుబెట్టినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ప్రేమజంటకు పెద్దల బ్రేక్
సాక్షి, బళ్లారి: కూతురు మరో కులం యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపగించుకున్న తల్లిదండ్రులు వారి రిజిస్టర్ పెళ్లిని అడ్డుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా బీజీకెరెలో జరిగింది. వివరాలు.. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్, పద్మజ అనే ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుని గత వారం క్రితం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కులాలు వేర్వేరని వారి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రేమికులిద్దరూ మంగళవారం రిజిస్టర్ పెళ్లి చేసుకోవాలని మొళకాళ్మూరుకు బయల్దేరారు. ఇంతలో పద్మజను వారి బంధువులు అడ్డుకుని బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అయింది. బీజీకెరె గ్రామానికి చెందిన ప్రవీణ్‌నాయక్ ఎస్టీ అయితే, కోనసాగర గ్రామానికి చెందిన పద్మజ బీసీ కులం యువతి. పద్మజ మంగళూరు నర్సింగ్ కళాశాలలో అతిథి లెక్చరర్‌గా పని చేస్తుండేది. ఆమె బంధువులు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రవీణ్ ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Valentines Day: వ్యాపార దిగ్గజాలు.. ఈ ప్రేమ పక్షులు
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. ఆపినా ఆగదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమికుల రోజును వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కానీ నిత్యం వ్యాపారం చేస్తూ ప్రేమికులుగానే ఉండనున్నట్లు కొన్ని ప్రేమవివాహం చేసుకున్న జంటలు తెలుపుతున్నాయి. ఆ ప్రేమజంటలు చేస్తున్న వ్యాపారం విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ - షుగర్ కాస్మోటిక్స్ వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ 2015లో షుగర్ కాస్మొటిక్స్‌ను స్థాపించారు. వీరు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో కలిసి చదువుకున్నారు. బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు - మొబిక్విక్ ఉపాసన టకు, బిపిన్ ప్రీత్ సింగ్ 2009లో మొబిక్విక్ కంపెనీని ప్రారంభించారు. ఇది మొబైల్ ఫోన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్లతో సహా అనేక రకాల సేవలను అందించే కంపెనీ. ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ - వెడ్మి గుడ్ ఆనంద్ సహానీ, మెహక్ సాగర్ హెల్త్ న్యూట్రిషన్ కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్క్లైన్లో ఇంటర్న్‌షిప్ సమయంలో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ జంటకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. దాంతో బ్యాండ్-బాజా, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్స్ వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో వారి పెళ్లి అనంతరం వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం అందిస్తూ దాన్ని బిజినెస్‌గా మలుచుకున్నారు. తర్వాత 2014లో వెడ్మి గుడ్ కంపెనీను స్థాపించారు. శుభ్ర చద్దా, వివేక్ ప్రభాకర్-చుంబక్ శుభ్ర, వివేక్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముదురు రంగుల్లో ఉండే ‘కిట్చీ-చిక్’ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాని అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఏకంగా తమ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. 2009లో చుంబక్ కంపెనీను స్థాపించారు. ప్రత్యేకమైన గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. గజల్ అలఘ్, వరుణ్ అలఘ్-మామా ఎర్త్ గజల్ అలఘ్ టాక్సిన్ ఫ్రీ బేబీ కేర్ ఉత్పత్తులను తయారుచేయాలని భావించి హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మామాఎర్త్ను ఆగష్టు 2016లో తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించారు. తల్లిదండ్రులు, పిల్లల కోసం సహజమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు మామాఎర్త్ తెలిపింది. రోహన్, స్వాతి భార్గవ - క్యాష్‌కరో ఇదీ చదవండి: దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి.. స్వాతి, రోహన్ భార్గవ క్యాష్‌కరో, క్యాష్‌బ్యాక్, కూపన్ వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఏప్రిల్ 2011లో వీరు యూకేలో పోరింగ్ పౌండ్స్ పేరుతో క్యాష్‌బ్యాక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2013లో లండన్ నుంచి గుర్గావ్కు తిరిగి వచ్చిన తర్వాత అదే బిజినెస్ మోడల్‌ను క్యాష్‌కరో పేరుతో భారత్‌లో ప్రారంభించారు. క్యాష్కరోలో టాటా, కలారీ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాయి. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. టాలీవుడ్ ప్రేమ జంటలు!
మరో ఏడాదిలో వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు. ప్రేమ అనే రెండు అక్షరాలను.. పెళ్లి వరకు తీసుకెళ్లిన వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. రెండు అక్షరాలతో మొదలై.. అదే రెండక్షరాల పెళ్లిగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ సక్సెస్ అయిన ప్రేమకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాగార్జున-అమల: మొదట కిరాయి దాదా మూవీ సెట్స్‌లో కలుసుకున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992లో (జూన్ 11న) వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కూడా ఒకటి,రెండు సినిమాల్లో నటించింది. 2. రాజశేఖర్-జీవిత: తెలుగు స్టార్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే రాజశేఖర్‌కు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్‌మాస్టర్, అంకుశం, బావ మరుదుల సవాల్ లాంటి చిత్రాలు వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. 3. శ్రీకాంత్-ఊహా: 1994లో ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997 జనవరి 20న పెళ్లితో పదిలపర్చుకున్నారు. వీరి పెళ్లయిన ఏడాది తర్వాత ఆయనగారు చిత్రం విడుదలైంది. 4. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్: 2000వ సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్ - నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగించారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 5. అల్లు అర్జున్-స్నేహ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా.. అల్లు అర్జున్ ఓ స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం.. రోజూ ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్- స్నేహరెడ్డిల 2011న మార్చి 6న జరిగింది. 6. రామ్ చరణ్-ఉపాసన: మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరేంజ్’ సినిమా నుంచి వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమాలతో సంబంధం లేదు. 7. లక్ష్మి మంచు-ఆండీ శ్రీనివాసన్: మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు.. ఆండీ శ్రీనివాసన్ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి వివాహానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు అతన్ని మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆండీ, లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట ఆగస్ట్ 4న 2006లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 8. నాని-అంజనా యలవర్తి: టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రేమజంట నాని-అంజనా యలవర్తి. నాని భార్య అంజన సాఫ్ట్వేర్ ఇంజినీర్. నాని విశాఖపట్నంలో వీడియో జాకీ(వీజే)గా ఉన్నప్పుడు అంజనా ఓ పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్లో స్నేహితులుగా మారిన వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించారు. ఐదేళ్లపాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత చివరకు 27 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు. 9. నాగ చైతన్య-సమంత: 2009లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్స్‌లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. చైతూ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంలో సామ్ అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే 2021లోనే నాగచైతన్య- సమంత తమ వివాహాబంధానికి ముగింపు పలికారు. 10. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్.. నవంబర్ 1న 2023న పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో జంటగావరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. 11.మంచు మనోజ్- భూమా మౌనిక టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. మంచు లక్ష్మీ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. 12.సూపర్ స్టార్ కృష్ణ- విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. ఇద్దరి మనసులు కలవడంతో 1969లో రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు ఇంకా టాలీవుడ్లో ప్రేమవివాహం చేసుకున్నా స్టార్స్ కూడా ఉన్నారు. సుమంత్- కీర్తి రెడ్డి, బాలాజీ-మధుమిత, వరుణ్ సందేశ్- వితికా షేరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. -
ప్రేమ వివాహం.. కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు
తమిళనాడు: తిరుపూర్ జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన పెరుమాళ్ కూతురు ఐశ్వర్య (19). పూవలూరుకు చెందిన భాస్కర్ కుమారుడు నవీన్ (19). డిప్లమో చదివాడు. చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తిరుపూర్ జిల్లా అరవప్పాలయంలోని ఓ ప్రైవేటు బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు వర్గాలకు చెందిన వీరిద్దరూ గత డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయమై ఐశ్వర్య తండ్రి పెరుమాళ్ పల్లడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ తేదీన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో పంపారు. ఈ స్థితిలో గత 3వ తేదీన ఐశ్వర్యని ఆమె తండ్రి, బంధువులు కొట్టి వేధించి హత్య చేసి దహనం చేసినట్లు నవీన్‌కు అతని స్నేహితులు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఒరత్తనాడుకు వచ్చిన నవీన్ ఈ విషయాన్ని వట్టతిక్కోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెయ్‌వడుతి, పూవలూరు గ్రామంలో బుధవారం తంజావూరు ఎస్పీ అసిస్రావత్ ఆధ్వర్యంలో పోలీసులు ఐశ్వర్య మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటికను సందర్శించారు. మృతదేహాన్ని దహనం చేసిన తరువాత బూడిద కూడా లేకపోవడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, భార్య రోజా, ఐశ్వర్య అమ్మమ్మ మలర్, అతని సోదరి అగదాసి, 16 ఏళ్లబాలిక సహా 11 మందిని అరెస్టు చేసి విచారణ కోసం వట్టతిక్కోట్టై పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
సినిమాకు మించిన ట్విస్టులు.. కారులో పెళ్లి.. అంతలోనే..
సాక్షి, బళ్లారి: సినిమా తరహాలో కారులోనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవడం సంచలనం కలిగించింది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన కిరాతక సినిమాలో ప్రేమ పెళ్లి జరిగిన విధంగా నగరంలో ఓ ప్రేమజంట కారులో మూడుముళ్లు వేసుకోవడం చూసి నగరవాసులు ఔరా అని నోరెళ్లబెట్టారు. కులాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వల్ల ప్రేమపక్షులు ఇలా చేశాయి. కొప్పళ అమ్మాయి, బళ్లారి అబ్బాయి.. వివరాలు... కొప్పళ జిల్లాకు చెందిన యువతి అమృత, బళ్లారి జిల్లాలోని తెక్కలకోటకు చెందిన యువకుడు శివప్రసాద్ ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరంటూ యువతి తల్లిదండ్రులు అడ్డు చెబుతూ వచ్చినా వారు పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని బళ్లారి నగరంలోని శాంతిధామ సాంత్వన కేంద్రం వద్దకు చేరారు. ఇద్దరు కారులో పూలదండలు మార్చుకొని పెళ్లి అయిందనిపించారు. ఇరువర్గాల వాగ్వాదం.. ఇంతలో ఇరువర్గాల పెద్దలు వారిని అటకాయించారు. యువతి కొంతసేపు తనకు తల్లిదండ్రులు కావాలని, మరి కొంతసేపు ప్రేమికుడు కావాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం నడిచింది. వధూవరులు కూడా గొడవలో తలదూర్చడంలో హైడ్రామా సాగింది. పోలీసులు వచ్చి ప్రేమికులను తెక్కలకోట పోలీస్ స్టేషన్‌కు తరలించి మాట్లాడారు, తరువాత యువతిని శాంతిధామ కేంద్రానికి తరలించారు. ఈ పెళ్లి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లయిన క్షణాల్లోనే జంటను విడదీయడం విశేషం.