ప్రతీకాత్మక చిత్రం
క్రిష్ణగిరి(బెంగళూరు): స్నేహితుని చెల్లెలిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కొత్త వరుని హత్యకు కారణమని తేలింది. సొంత బావ అనే జాలి లేకుండా రక్తం కళ్లచూశారు. బి.కొత్తపల్లికి చెందిన సంతోష్ (23) హత్య కేసులో నిందితులను అరెస్టు చేశారు. సంతోష్, హోసూరు కుముదేపల్లికి చెందిన మురుగేషన్ (24) మిత్రులు. గత ఏడాది క్రితం సంతోష్, మురుగేష్ సహోదరి మీనాను ప్రేమించాడు. అది తెలిసి మురుగేష్ సంతోష్‌ను నిలదీశాడు.
అయినప్పటికీ సంతోష్ మీనాను ఇటీవల పెళ్లి చేసుకొన్నాడు. ఇది సహించని మురుగేష్... సంతోష్‌ను హత్యకు కుట్ర పన్నాడు. గత శనివారం అతని మిత్రుల సహాయంతో బి. కొత్తపల్లి వద్ద మామిడి తోటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులు మురుగేష్, అతని మిత్రుడు సంతోష్‌కుమార్ (24), 17 ఏళ్ల బాలున్ని అరెస్ట్ చేశారు.
చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment