kill
-
విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణ హత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు. -
KILL ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ..
-
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా
ఓటీటీల వల్ల సినిమా చూడటం చాలా సులభమైపోయింది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల చిత్రాల్ని సింపుల్‌గా చూసేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మూవీస్.. కొన్ని సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే రీసెంట్గా రిలీజై హిట్ కొట్టిన హిందీ మూవీ విషయంలో జరగనుంది.పాన్ ఇండియా ట్రెండ్ వల్ల హిందీ సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. 100లో ఒకటో రెండో మాత్రం ఉన్నంతలో నిలబడుతున్నాయి. అలాంటిది జూలై 5న 'కిల్' అనే మూవీ బాలీవుడ్లో రిలీజైంది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో తీయగా.. హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకురానున్నారు. సోమవారం (జూలై 22) రాత్రి 9 గంటల నుంచి 'కిల్' మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి హిట్ సినిమా రావడం ఏంటని నెటిజన్లు అనుకుంటున్నారు.'కిల్' విషయానికొస్తే.. అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఎన్ఎస్జీ కమాండో. ఇతడి ప్రియురాలు తులికా (తాన్య మనక్తిలా)కు ఆమె తండ్రి, వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేస్తాడు. దీంతో తనతో వచ్చేయాలని తులికాని అమిత్ అడగ్గా.. ఆమె నో చెబుతుంది. ఆ తర్వాత తులికా ఫ్యామిలీ.. ఢిల్లీ నుంచి రాంచీకి ట్రైన్లో వెళ్తుంటారు. తులికాకు తెలియకుండా అమిత్ కూడా ఇదే ట్రైన్ ఎక్కుతాడు. కాసేపటి తర్వాత బందిపోట్ల ముఠా ట్రైన్‌పై దాడి చేస్తుంది. తులికా కుటుంబంతో పాటు ప్రయాణికులు ప్రమాదంలో పడతారు. మరి బందిపోట్ల నుంచి తులికా, ప్రయాణికులను లక్ష్య కాపాడగలిగాడా? లేదా అనేది స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్టీఎస్ఎస్) అని అంటారు.జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆరీ్మ(పీఎల్జీఏ) ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. హోరాహోరీగా కాల్పులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్ పూనెం నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్‌లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్‌పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
ఆయిల్ ట్యాంకర్ పేలి.. 40 మంది మృతి
మన్రోవియా: లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు -
పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం? భారత్ స్పందన ఇది
ఖలిస్థానీ వేర్పాటువాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఓ కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కుట్రను తాము భగ్నం చేశామని, పైగా ఈ విషయాన్ని భారత్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అమెరికా ప్రకటించడంతో మరింత దుమారం రేపింది. అమెరికా గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను.. తాము భగ్నం చేశామని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అందులో సారాంశం.. ‘‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ వర్గాలు తదుపరి దర్యాప్తు చేస్తాయని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్ వాట్సన్ పేరిట కథనం ప్రచురితమైంది. ఇదీ చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరో తెలుసా? మరోవైపు ఈ కథనంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగశాఖ.. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’’ అని అన్నారు. మరోవైపు పన్నూ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించి అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందట. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. ఇదీ చదవండి: గురపత్వంత్కు భారత్ దెబ్బ.. అదుర్స్ -
ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి.. ‘పాపమంతా ఫేస్‌బుక్‌దే’
అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. కానీ తాను కావాలని చంపలేదని, తనను ఫేస్బుక్ ప్రభావితం చేసిందని వింత కారణం చెబుతోంది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఈ ఘోరం చేసిన మహిళను 32 ఏళ్ల టిఫానీ యాన్ కేథరీన్ లూకాస్గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కొడుకులు ఆరేళ్ల మారిస్ బేకర్ జూనియర్, తొమ్మిదేళ్ల జేడెన్ హోవార్డ్లను నవంబరు 8న కెంటకీలోని తమ నివాసంలో తుపాకీతో కాల్చింది. రక్తపు మడుగులో పడివున్న పిల్లలను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇంతటి ఘోరం చేసిన ఆమె ఇతరులకూ ప్రమాదకరమని పేర్కొన్న న్యాయమూర్తి.. విచారణ ముగిసే వరకూ 2 మిలియన్ డాలర్ల (రూ.16.6 కోట్లు) పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. నవంబర్ 14న కోర్టు విచారణ సందర్భంగా బుల్లిట్ కౌంటీ షెరీఫ్ అనే దర్యాప్తు సంస్థకు చెందిన డిటెక్టివ్ రిచర్డ్ బీల్.. తాను విచారించినప్పుడు నిందితురాలు లూకాస్ తనతో ఏం చెప్పిందో కోర్టుకు తెలియజేసింది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఇద్దరు పిల్లలను తలపై దాదాపు 30 సెకన్లలో నాలుగు షాట్లు కాల్చారని బీల్ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తనను ఎవరో ఫేస్బుక్ ద్వారా "మానిప్యులేట్" చేశారని లూకాస్ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే లూకాస్ వాదనను మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి మిచెల్ రైస్ ఖండించారు. ఆమె కావాలనే పిల్లలను చంపేసిందని, ఇంత క్రూరమైన పని చేసేలా ఎవరూ ప్రభావితం చేయరని రైస్ తెలిపినట్లు ఫాక్స్ అనుబంధ డబ్ల్యూడీఆర్బీ కథనం పేర్కొంది. -
దారుణం: ఫోన్ లిఫ్ట్ చేయని భార్యపై అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ..
అనుమానం.. పెనుభూతం అంటారు. అతని విషయంలో అది ఉన్మాదం వైపు అడుగులేయించింది. పెళ్లి అయిన తొలినాటి నుంచే భార్యపైనా అనుమానం పెంచుకున్నాడు. అది అతన్ని ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పరిశీలిస్తూ.. మాట్లాడే ప్రతి ఒక్కరి గురించి ఆరా తీసే స్థాయికి దిగజార్చింది. చివరకు.. పండటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను గొంతు నులిమి కడతేర్చే కిరాతకానికి పాల్పడ్డాడు. తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. అత్తగారింటికి వెళ్లి తన భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదకొండు రోజుల క్రితమే ఈ దంపతులకు ఓ పాప పుట్టడం గమనార్హం. కిషోర్(32) ప్రతిభ(24) నవంబర్ 13, 2022న వివాహం చేసుకున్నారు. 11 రోజుల క్రితమే వారికి ఓ పాప పుట్టింది. ప్రతిభ హోస్కోట్ సమీపంలోని ఆమె అమ్మ ఇంటి వద్ద ఉంది. ప్రతిభకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కిశోర్ నిత్యం అనుమానించేవాడు. ఆమె మెసేజ్‌లు, కాల్ రికార్డులను తరచుగా పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే ప్రతి వ్యక్తి గురించి ఆరా తీసేవాడు. కాలేజీ నాటి పురుష స్నేహితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ప్రతిభ ఫోన్లో విలపించడంతో ఆమె తల్లి జోక్యం చేసుకుని కాల్ డిస్కనెక్ట్ చేసింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్‌కు సమాధానం ఇవ్వవద్దని ఆమె ప్రతిభకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం కిషోర్ తనకు 150 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించిన ప్రతిభ.. తన తల్లిదండ్రులకు తెలిపింది. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కిషోర్ రగిలిపోయాడు. చామరాజనగర్ నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కిషోర్.. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ప్రతిభ తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగి, నవజాత శిశువుతో ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసాడు. దుపట్టాతో ప్రతిభ గొంతునులిమి హత్య చేశాడు. ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టినా స్పందన రాలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చిన కిశోర్.. ఘటనాస్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. చికిత్స పూర్తి కాగానే కిషోర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్‌కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో కనీసం 9 మంది అమెరికా పౌరులు మరణించారు. మరెందరో ఆచూకీ తెలియకుండా పోయారని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లో జాడ తెలియకుండా పోయిన 8 మంది ఫ్రాన్స్ దేశస్తులు కూడా హమాస్ మిలిటెంట్లకు చిక్కడమో, వారి చేతిలో మరణించడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. 10 మంది బ్రిటిష్ పౌరులు కూడా హమాస్ దాడుల్లో మరణించడమో, జాడ తెలియకుండా పోవడమో జరిగిందని చెబుతున్నారు. -
వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే..
హోసూరు: మహిళ ఇంట్లో ప్రియుడు హత్యకు గురైన సంఘటన బేరికె పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. బేరికె సమీపంలోని కొళదాసపురం గ్రామానికి చెందిన జ్యోతి (39), ఈమె భర్త కేశవమూర్తి పదేళ్ల క్రితం మృతి చెందాడు. జ్యోతి అంగన్వాడీ ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చింది. బేరికె సమీపంలోని మహాదేవపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (40)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. వెంకటేష్ తరచూ జ్యోతి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇది తెలిసి జ్యోతి సోదరి కొడుకు హరీష్ (23) మీ వల్ల పరువు పోతోందని వారిద్దరినీ మందలించాడు. దీంతో ఆమె ప్రియున్ని ఇంటికి రావద్దని చెప్పింది. అయినప్పటికీ మంగళవారం వెంకటేష్ జ్యోతి ఇంటికి రాగా తలుపు వేసి జ్యోతి, హరీష్ కలిసి కట్టెలతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన ఇతన్ని స్థానికులు చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని జ్యోతి, హరీష్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: 15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు -
15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు
మండ్య(బెంగళూరు): అనుమానంతో భార్యను కడతేర్చిన ఉదంతం మండ్య జిల్లా నాగమంగల పట్టణంలో జరిగింది. ఇక్కడి టీబీ లేఔట్‌లోని ముళకట్టె రోడ్డులో నివాసం ఉంటున్న పుట్ట స్వామి, గిరిజ దంపతుల కుమార్తె మధుశ్రీ(25)కి నాగమంగళ తాలూకా కరడహళ్లికి చెందిన గంగాధర్ కుమారుడు మంజునాథ్‌తో వివాహమైంది. వీరికి నాలుగు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంజునాథ్ బెంగళూరులో ఉంటూ 15 రోజులకు ఒక పర్యాయం వచ్చి వెళ్తుండేవాడు. అయితే మధుశ్రీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. మంగళవారం కూడా దంపతులు గొడవ పడ్డారు. ఓ దశలో భార్య కడుపులో కత్తితో దాడి చేసి కుమారుడితో కలిసి ఉడాయించాడు. బుధవారం ఉదయం ఎంతసేపైనా మధుశ్రీ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. నాగమంగల పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో
శివాజీనగర: నాలుగు రోజుల క్రితం హాసన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో గురువారం జేడీఎస్ నాయకుడు కృష్ణగౌడ (53)ను దుండగులు మారణాయుధాలతో కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 6 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈయన గ్రానైట్, రియాల్టీ వ్యాపారాలు చేయడంతో పాటు జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్ణకు అనుచరుడు కావడంతో సంచలనం కలిగించింది. వివరాలు.. గతంలో యోగానంద అనేవ్యక్తి కృష్ణేగౌడతో పరిచయమై వాహిని సినిమాకు పెట్టుబడి పెట్టారు. ఇందులో తనను మోసగించారని యోగానందతో కృష్ణగౌడ గొడవపడ్డాడు, ఆపై 2022 నవంబర్‌లో యోగానందను కొందరు కిడ్నాప్ చేసి దాడి చేయడంతో అతడు హాసన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మరోవైపు యోగానందపై కృష్ణగౌడ చీటింగ్ కేసు పెట్టారు. ఇలా ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరిగాయి. అప్పటినుంచి కృష్ణగౌడను అంతమొందించాలని కుట్ర మొదలైంది. కారులో వెళ్తుండగా నరికి చంపి ఈ నెల 9న మధ్యాహ్నం కృష్ణగౌడ నగర శివార్లలో కారులో వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు అడ్డుకుని నరికి చంపి పరారయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి యోగానంద కుటుంబీకుల పాత్ర ఉందని గుర్తించారు. యోగానంద, అతని భార్య సుధారాణి, అతని స్నేహితురాలు, మామ కృష్ణకుమార్, బంధువు విజయ్–చైత్ర దంపతులు, అలాగే స్థానిక టీవీ చానెల్ భాగస్వామి సురేశ్ అనేవారిని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రాణం తీసిన రీల్స్ వ్యసనం.. చంపి నదిలో పడేశాడు
బెంగళూరు: నిత్యం మొబైల్లో మునిగిపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వెరసి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి శవాన్ని నదిలో పడేసిన ఘటన మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం తాలూకా మండ్యకొప్పళు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ, శ్రీనాథ్ భార్యభర్తలు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, పూజా గంటల తరబడి మొబైల్ వాడేది. టిక్‌టాక్ చేసే పూజా అది లేకపోవడంతో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఆమె ఇతరులతో చాటింగ్ చేయడాన్ని భర్త గుర్తించాడు. సహించలేక మరో వ్యక్తితో కలిసి చంపేసి శవాన్ని నదిలో పడేశాడు. ఈ విషయం మూడు రోజుల తరువాత బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టాల్లో ఏముందంటే..? -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో విషాదం.. ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. చదవండి: Dr Radha Murder Case: డా.రాధా మర్డర్ కేసులో భర్తే హంతకుడు -
నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను..
పతనంథిట్ట: ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకు నర్సు వేషాన్ని వేసింది. ఇంజెక్షన్‌ను వేసి చంపేయాలని వ్యూహం పన్నింది. మనిషికి ఇంజెక్షన్ చేయడం అంత సులువు అనుకుందో.. ఏమో? కానీ తీరా అక్కడికి వెళ్లాక తటపటాయించింది. అనుమానం వచ్చిన బాధితులు యాజమాన్యాన్ని పిలవగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పతకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అంతమొందించాలనుకుంది అనూష. గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. నర్సుగా స్నేహ గదిలోకి వెళ్లి మరో ఇంజెక్షన్ వేసుకోవాలని తెలిపింది. బాధితురాలి శరీరంలోకి మందు ఇంజెక్ట్ చేసే క్రమంలో తటపటాయించింది. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లి డాక్టర్లను పిలిచింది. దీంతో అనూష బండారం బయటపడింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: Madhya Pradesh: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు.. -
మొసలి దాడిలో ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్‌లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్‌గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్‌ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి
మదనపల్లె: ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్కే ఖదీర్ అహ్మద్‌తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్‌అహ్మద్ పట్టణంలోని అవంతి థియేటర్ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మింంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్‌అహ్మద్ తనకు దూరమవుతాడనే భయంతో ఆయిషా పోలీస్‌స్టేషన్‌లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడంటూ ఖదీర్ అహ్మద్‌తో పాటు రుక్సానాపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళుతున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుముకుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్‌అహ్మద్ మాట్లాడుతూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
సిగరెట్ కొనివ్వలేదని.. బాలుడిని కిరాతకంగా చంపాడు
హోసూరు(బెంగళూరు): అడిగిన వెంటనే సిగరెట్ కొనివ్వలేదని ఓ వ్యక్తి బాలుడి ప్రాణం తీసిన ఘటన క్రిష్ణగిరి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని పాంచాలియూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్ (14) అదే ప్రాంతంలోని మద్యంషాపు వద్ద బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడున్న ఓ మందుబాబు బాలున్ని పిలిచి దుకాణంలో సిగరెట్ కొనిపెట్టాలన్నాడు. అందుకు బాలుడు నిరాకరించాడు. ఆగ్రహంతో బాలుడిపై మందుబాబు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకొన్న బాలుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. క్రిష్ణగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో శాంతి చర్చలు జరిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగాలు ప్రతి ఒక్కరినీ కాపాడలేవని అన్నారు. రాష్ట్ర పౌరులు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. కొన్నిసార్లు సైన్యం, పోలీసులు ఇందుకు హామీ ఇవ్వలేకపోవచ్చని చెప్పారు. హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. నష్టపరిహారం ఎవరిస్తారు..? అల్లర్లలో జరిగిన నష్టానికి పరిహారాన్ని ఎవరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఖట్టర్ వివాదాస్పదంగా మాట్లాడారు. అల్లర్లకు కారణమైనవారే నష్టాన్ని బర్తీ చేస్తారని అన్నారు. ప్రభుత్వం నష్టాన్నంతటికీ పరిహారాలు ఇవ్వబోదని అన్నారు. కేవలం నష్టపోయిన ప్రభుత్వ ఆస్తులకు మాత్రమే పరిహారాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం జవాబుదారీ కాదని వెల్లడించారు. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు.. -
జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పులు.. అకారణంగా కాల్చేశాడా?
ముంబయి: జైపూర్-ముంబయి సూపర్‌ఫాస్ట్ రైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రన్నింగ్ ట్రైన్లో తోటి సహోద్యోగులతో సహా ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జైపూర్-ముంబయి సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12956) జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న క్రమంలో ఘటనకు పాల్పడ్డాడు. బాధితుడు ఏఎస్ఐ టికారమ్ మీనాగా గుర్తించారు. టికారమ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు చేతన్ సింగ్ షార్ట్ టెంపర్ అని పశ్చిమ రైల్వే ఎన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పీఎఫ్ అధికారి ప్రవీణ్ సిన్హా తెలిపారు. ఎస్కార్ట్ డ్యూటీలో అధికారుల మధ్య ఎలాంటి వివాదం జరగలేదని వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి మహారాష్ట్రాలోని పాల్ఘర్కు చేరగానే కానిస్టేబుల్ చేతన్ సింగ్ అకారణంగానే కోపానికి లోనై తోటి అధికారులపై కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. సీనియర్ అధికారిపై కాల్పులు జరిపిన అనంతరం బోగీ నెంబర్ బీ5 లో ఓ ప్రయాణికునిపై ఫైరింగ్ జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బోగీ బీ6లో మరో ఇద్దరు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. నిందితుడు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీనియర్ అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా సమయంలో విధుల్లో మొత్తం ముగ్గురు కానిస్టేబుల్స్‌తో పాటు సీనియర్ ఏఎస్ఐ అధికారి ఉన్నట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం దాహితార్ స్టేషన్ పరిధిలో రైలు చైన్ లాగి నిందితుడు పారిపోయాడని పోలీసులు గుర్తించారు. అయితే.. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి వస్తున్న క్రమంలో గుజరాత్‌లోని సూరత్ రాగానే.. ఈ ఆర్ఫీఎఫ్ పోలీసులు ఎస్కార్ట్ డ్యూటీ విధుల్లో చేరారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అధికారి టికారమ్ మీనాకు రూ.15 లక్షల పరిహారాన్ని పశ్చిమ రైల్వే ప్రకటించింది. కాగా.. టికారమ్‌కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. 80 ఏళ్ల తల్లి ఉంది. 2025లో ఆయన రిటైర్మెంట్ తీసుకోనుండగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: 'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'