Congress Leader Punjabi Singer Sidhu Moose Wala Assassinated - Sakshi
Sakshi News home page

Sidhu Moose Wala Death: కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ దారుణ హత్య

Published Sun, May 29 2022 6:59 PM | Last Updated on Tue, Jun 7 2022 5:26 PM

Congress leader Punjabi singer Sidhu Moose Wala Assassinated - Sakshi

చంఢీగడ్‌: కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వివరాల ప్రకారం .. జవహర్‌ కే గ్రామం వైపు సిద్ధూ జీపులో వెళ్తుండగా కొందరు దుండగులు ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్ధూని అస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సిద్ధూ చికిత్స పొందుతూ మృతి చెందారు. పంజాబ్‌లో వీఐపీలకు భద్రతను శనివారమే ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement