Sidhu Moose Wala
-
ఉగ్రవాది గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు
వాషింగ్టన్: పంజాజీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది గోల్డీ బ్రార్ మృతి చెందినట్లు వచ్చిన వార్తలను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు కొట్టిపారేశారు. గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని చెప్పారు. ప్రెస్నో సిటీలో మంగళవారం సాయంత్రం రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో గోల్డీ బ్రార్ మరణించాడని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, హతుడిని 37 ఏళ్ల జేవియర్ గ్లాండీగా ప్రెస్నో పోలీసులు బుధవారం గుర్తించారు. గోల్డీ బ్రార్ హతమైనట్లు భారత మీడియాలోనూ ప్రసారమైంది. -
మూసేవాలా తల్లి ఐవీఎఫ్ చికిత్సపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్‌కు 58 ఏళ్ల వయసులో ప్రసవానికి కారణమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్సపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సేవలు పొందే మహిళ వయసు 21– 50 మధ్య ఉండాలి. మూసేవాలా హత్యకు గురైన రెండేళ్లకు ఆయన తల్లి చరణ్ కౌర్ మార్చి 17న మగబిడ్డను ప్రసవించారు. -
ఐవీఎఫ్ ట్రీట్మెంట్పై కేంద్రం ఫైర్!
పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకు మరణం జీర్ణించుకోలేని సిద్దు తల్లిదండ్రులు తమ కొడుకును మళ్లీ చూసుకోవాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే సిద్దూ మూసేవాలే తల్లిదండ్రులు మరోసారి అమ్మనాన్నలయ్యారు. సిద్దూ బల్కౌర్ సింగ్ తండ్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు ఒక బాబు పుట్టాడని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ సిద్దూ తల్లి 58 ఏళ్ల చరణ్ సింగ్ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇప్పుడూ ఈ అంశం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వయసులో పిల్లలను కనడం కరెక్టేనా అని ప్రశ్న లేవనెత్తింది. నిజానికి ఇలా ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి గల వయో పరిమితిపై ఆరా తీసింది. అంతేగాదు సిద్దు మూస్ వాలా తల్లి చరణ్ సింగ్‌క ఐవీఎఫ్ చికిత్సపై కూడా నివేదిక ఇమ్మని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021లోని సెక్షన్ 21(జీ)(i) ప్రకారం..21 నుంచి 50 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవాళ్లు మాత్రమే ఐవీఎఫ్ ద్వారా బిడ్డకి జన్మనివ్వడం సురక్షితం అని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం సిద్దూ మూసే వాలే తండ్రిని శిశువుకి సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో సిద్దూ తండ్రి బల్కౌర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలో.." జిల్లా అధికారులు నన్ను వేధిస్తున్నారు. చిన్నారికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేశాను. అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి, అధికారులు జోక్యం చేసుకోవాలి. ట్రీట్మెంట్ జరిగేంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కావాల్సినప్పుడల్లా నేను అందుబాటులోనే ఉంటాను. లీగల్ డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా సబ్మిట్ చేస్తాను" View this post on Instagram A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu) (చదవండి: దిగ్గజ ర్యాపర్ మళ్లీ పుట్టాడు.. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి -
మొన్నే తూచ్ అన్నాడు.. ఇప్పుడేమో బాబుతో దర్శనం!
పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దు మూసేవాలా మరణం ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసు చివుక్కుమంటుంది. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఈ సింగర్‌ను 2022లో దారుణంగా హత్య చేశారు. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని సిద్దూ పేరెంట్స్ జీర్ణించుకోలేకపోయారు. లెజెండ్స్‌కు చావు ఉండదని నమ్మారు. తన కొడుకును మళ్లీ చూసుకోవాలని మురిసిపోయారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో సిద్దు తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ స్పందిస్తూ అదంతా ఏమీ లేదని, ఏ రూమర్స్‌నూ పట్టించుకోవద్దని చెప్పాడు. బాబుకు జన్మనిచ్చిన ర్యాపర్ తల్లి కట్ చేస్తే సిద్దూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఓ బాబుకు జన్మనిచ్చారు. బల్కౌర్ సింగ్ ఓ బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆదివారం (మార్చి 17న) సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 'శుభ్‌దీప్ (సిద్దు మూసేవాలా అసలు పేరు)ను ప్రేమించిన లక్షలాది మంది ఆశీర్వాదాలతో అతడికి ఓ తమ్ముడు పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. సిద్దు మూసేవాలా మళ్లీ పుట్టాడు అని కామెంట్లు చేస్తున్నారు. పుస్తకం.. ఇకపోతే సిద్దూ జీవిత కథ ఆధారంగా ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్' అనే పుస్తకం కూడా వచ్చింది. జుపిందర్ జీత్ సింగ్ ఈ పుస్తకాన్ని రచ్చించారు. పంజాబ్‌లో గ్యాంగ్స్టర్ల ఆధిపత్యం, మాదకద్రవ్యాల వినియోగం, ఆ రాష్ట్రంలో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను ఈ పుస్తకం చూపించింది. View this post on Instagram A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu) చదవండి: ఒక్క సీన్ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార -
58 ఏళ్ల వయసులో ప్రెగెన్సీ?.. క్లారిటీ ఇచ్చిన సింగర్ తండ్రి!
దేశవ్యాప్తంగా పేరు మోసిన సింగర్ సిద్దూ మూసేవాలా రెండేళ్లక్రితం ప్రాణాలు విడిచారు. 2022లో ఆయన్ను దారుణంగా హత్య చేసి చంపారు. ఒక్కగానొక్క కొడుకు తమను విడిచి వెళ్లిపోవడంతో సిద్దు పేరెంట్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చిందని, 58 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతోందని ప్రచారం జరిగింది. తనకు ఈ నెలలో కవలలు పుట్టబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ సదరు వార్తలను ఖండించాడు. మా కుటుంబాని గురించి ఆరా తీస్తున్న సిద్దు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురించి లేనిపోనివన్నీ రాస్తున్నారు. అనేక రూమర్లు పుట్టిస్తున్నారు. దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా ఉంటే మేమే మీకు స్వయంగా తెలియజేస్తాం అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. అయితే చరణ్ తల్లికాబోతున్న విషయాన్ని సిద్దు మూసేవాలా అంకుల్ చాంకౌర్ సింగ్ ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడేమో తన గురించి వస్తున్న ఏ వార్తలనూ నమ్మవద్దని బల్కౌర్ కోరడం ఆసక్తికరంగా మారింది. చదవండి: డిప్రెషన్.. ముద్ద దిగలేదు.. ఏడుస్తూ ఉండిపోయా.. నటి కన్నీళ్లు -
సింగర్ తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో!
రెండేళ్ల క్రితం పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2022 మేలో జరిగిన ఈ దారుణహత్యతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దూ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పంజాబీ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తాజాగా సిద్దు మూసేవాలా తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ 58 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమైంది. ఐవీఎఫ్ ద్వారా మరో గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె ప్రసవం కోసం సిద్ధమవుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా డాక్టర్లు సలహాలు పాటిస్తున్నారు. సిద్దూ మూసేవాలా హత్య పంజాబీ సింగర్ అయినా సిద్దూ మూసేవాలాను మే, 2022లో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితులతో కలిసి ఉండగా సిద్దూని కాల్చి చంపినట్లు వార్తలొచ్చాయి. ఈ హత్య కేసులో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్‌పూరియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. సిద్దూ మూసేవాలా సో హై, సేమ్ బీఫ్, ది లాస్ట్ రైడ్, జస్ట్ లిసెన్, 295లాంటి సాంగ్స్ తో పాపులర్ అయ్యాడు. కాగా.. గతంలో సిద్దూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ విచారణలో అంగీకరించాడు. అతితి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పాడు. తమ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నట్లు సంచలన కామెంట్స్ చేశాడు. -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
సెల్యులాయిడ్‌పై సిద్ధూ మూసేవాలా జీవితం!
ముంబై: పంజాబ్ యువ గాయకుడు, దివంగత సిద్దూ మూసేవాలా జీవితగాథ త్వరలో సినిమాగా తెరకెక్కే అవకాశముంది. సిద్దూ మూసేవాలా తన జీవితంలో చవిచూసిన పేరుప్రఖ్యాతలు, గ్యాంగ్స్టర్ల బెదిరింపులు, విషాదం అన్నింటినీ స్పృశిస్తూ జుపిందర్జీత్ సింగ్ రాసిన ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్’ పుస్తకంపై హక్కులను చిత్ర నిర్మాణరంగ సంస్థ మ్యాచ్బాక్స్ షాట్స్ కొనుగోలుచేసింది. మూసేవాలా జీవితాన్ని వెబ్ సిరీస్‌గా లేదంటే సినిమాగా తెరకెక్కించే అవకాశముంది. ‘శుభ్‌దీప్ సింగ్ సిద్దూ.. సిద్దూ మూసేవాలాగా ఎదిగిన క్రమాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించింది. పంజాబ్‌లో గ్యాంగ్స్టర్ల ఆధిపత్యం, వారి మధ్య మనస్పర్థలు, మాదకద్రవ్యాల వినియోగం, పంజాబ్‌లో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలనూ ఈ పుస్తకం చూపించింది’ అని మ్యాచ్బాక్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్‌పోర్ట్‌తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ యోగేష్ కాద్యాన్‌పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్‌లోని బాబిన్హా గ్యాంగ్‌లో చేరిన కాద్యాన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్‌పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. మైనర్‌కు స్పెషల్ టాస్క్!
న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మే 9న జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ఓ జువైనల్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేసే పనిని అరెస్టైన జువైనల్ (మైనర్)కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌తో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసిన మరో వ్యక్తిని అర్షదీప్ సింగ్‌గా గుర్తించారు. ఆగస్టు 4న హరియాణాలో ఐఈడీని స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితుడు లారెన్స్ బిష్ణోయ్, జగ్గూ భగ్వాన్ పూరియాలు.. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని మైనర్‌తో పాటు దీపక్ సురాక్పుర్, మోను దగర్‌కు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్ దాడిలో అరెస్టయిన జువైనల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా.. దీపక్ హరియాణాలోని సురఖ్పుర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ‘మహారాష్ట్ర నాందెడ్‌లో ఏప్రిల్ 5న బిల్డర్ సంజయ్ బియాని హత్య కేసులో జువైనల్ నిందితుడు. అలాగే.. గత ఏడాది ఆగస్టు 4న అమృత్‌సర్‌లో గ్యాంగ్‌స్టర్ రాణా కండొవాలియా హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. పంజాబ్‌లోని తరణ్ తరణ్ ప్రాంతానికి చెందిన అర్షదీప్ సింగ్.. కరుక్షేత్ర ప్రాంతంలో ఐఈడీ రికవరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే.. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాలో నిందితుడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జువైనల్‌తో పాటు అర్షదీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్, సురఖ్పుర్, దగర్‌లు తనకు టాస్క్ ఇచ్చినట్లు జువైనల్ తెలిపాడు. ఆ తర్వాత ఖాన్ కన్నా ముందు కొండవాలియాను హత్య చేయాలని సూచించటంతో అతడిని హతమార్చారు. దర్యాప్తులో వెల్లడించిన మరిన్ని కేసులను పరిశీలిస్తున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వైరల్ వీడియో -
సిద్ధూ హత్య కేసు: పోలీసు కస్టడీ నుంచి గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్!
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్ దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి పోలీసు కస్టడీ నుంచి దీపక్ తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇవ్వెస్టిగేషన్ ఏజెన్సీ(సీఐఏ) సిబ్బంది ప్రైవేటు వాహనంలో మాన్సా నుంచి కపుర్థలా జైలుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తరలిస్తున్న క్రమంలో అదును చూసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్.. గ్యాంగ్‌స్టర్, ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు పథకం రచించటం నుంచి అమలు చేసే వరకు పాల్గొన్నట్లు భావిస్తున్న 15 మంది జాబితాలో దీపక్ పేరును చేర్చారు పోలీసులు. ప్రొడక్షన్ వారెంట్‌పై ఢిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితమే దీపక్‌ను పంజాబ్ తీసుకొచ్చారు. శనివారం జరిగిన సంఘటనతో పోలీసుల నుంచి దీపక్ పారిపోవటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. గతంలో 2017లో అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు దీపక్. ఆ సమయంలో పెప్పర్ స్ప్రే ఉపయోగించి పారిపోయాడు. ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్లగా తప్పించుకున్నాడు. ఇదీ చదవండి: సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు -
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. పకడ్బందీగా రెక్కీ ప్లాన్, ఇలా లీక్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు ముంబైలో రెక్కీ నిర్వహించారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితులే సల్మాన్ హత్యకు కూడా ప్లాన్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గైరవ్ యాదవ్ వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు ఈ రెక్కీ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన కపిల్ పండిట్‌ను విచారించగా ఈ రెక్కీ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో చాలామంది ఉన్నారని అలాంటి వారిలో సల్మాన్ కీలక టార్గెట్ అని పండిట్ తెలిపాడు. ముంబైలో సల్మాన్ఇంటి వద్ద సుమారు మూడురోజుల పాటు ఈ రెక్కీ నిర్వహించినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీజీపీ తెలిపారు. కాగా సిద్ధూ మూసేవాలాను హత్యకేసులో 35మంది నిందితుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 23 మందిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా సల్మాన్‌ని చంపుతామని బెదిరింపులు వచ్చాయి. తాజాగా అతన్ని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో సల్మాన్‌కి సెక్యూరిటీ పెంచారు. -
నార్కో టెర్రరిజం కేసులో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా తేవడం, వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఉగ్రవాదం వ్యాప్తికి వాడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో సోదాలు జరిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధమున్న గ్యాంగ్స్టర్ల నివాసాల్లోనూ సోమవారం దాడులు కొనసాగాయి. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులైన గ్యాంగ్స్టర్లు గోల్డీ బ్రార్, జగ్గూ భగ్‌వాన్‌పురియా ఇళ్లలో అధికారులు సోదా చేశారు. ఢిల్లీసహా 50 చోట్ల దాడులు చేసి ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారుల మధ్య ఏర్పడుతున్న కొత్త నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నంచేశామని ఒక ఎన్ఐఏ అధికారి చెప్పారు. దేశ, విదేశాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న గ్యాంగ్స్టర్లపై గత నెల 26లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ ముమ్మర సోదాలు జరిపింది. ఈ గ్యాంగ్స్టర్లలో కొందరు భారత్ నుంచి పారిపోయి కెనడా, పాకిస్తాన్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి నుంచే భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
చండీగఢ్: సిద్ధూమూవేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్ మాన్సా కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మహిపాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఇతడు సిద్ధూ తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజే లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సిద్ధూ తండ్రికి మహిపాల్ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ హత్యకు సంబంధించి కెన్యాలో అన్మోల్ బిష్ణోయ్, అజర్బైజాన్లో సచిన్ తాపన్ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం సెప్టెంబర్ 1న ధ్రువీకరించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది. చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర -
నీ కుమారుడి కంటే దారుణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు
చండీగఢ్: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రిని దారుణంగా చంపుతామని బెదిరింపులు రావడం కుటుంభసభ్యులను ఆందోళనకు గురిచేసింది. సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని సభ్యుడు ఈమెయిల్ ద్వారా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్ధూ మెయిల్ ఐడీకి షూటర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. తమ అనుచరుడి హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్లు నిందితుడు ఈమెయిల్లో పేర్కొన్నాడు. గ్యాంగ్స్టర్ల గురించి గానీ తమ భద్రత గురించి ఏ విషయమైనా లేవనెత్తితే సిద్ధూ కంటే దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు. నోరుమూసుకొని సైలెంట్‌గా ఉండాలని లేకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. కొందరు దుండగులు సిద్ధూ మూసేవాలను కొద్ది నెలల క్రితం దారుణంగా హత్య చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం తన కుమారుడి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ డిమాండ్ చేశారు. నిందితుల కుటుంబసభ్యులకు పోలీసు భద్రత కల్పించడంపై మండిపడ్డారు. సిద్ధూ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్టు చేశారు. చదవండి: గుజరాత్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు .. ఆరుగురు మృతి -
పంజాబ్: పొలీసులు, గ్యాంగ్స్టర్స్ మధ్య భీకర కాల్పులు
-
పంజాబ్‌లో ఎన్కౌంటర్.. సిద్ధూ హత్యకేసులో ఇద్దరు నిందితులు హతం
చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో సంబంధమున్న గ్యాంగ్స్టర్స్ చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అమృత్సర్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించి పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. వీరిని చూసిన గ్యాంగ్స్టర్స్ కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‌కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు షార్ప్ షూటర్లు జగ్దీప్ సింగ్ రూప, మన్ను కుసా(మన్‌ప్రీత్ సింగ్) ఇక్కడే తలదాచుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు నిందితులు చనిపోయినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. #WATCH | Punjab: Encounter underway between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab (Visuals deferred by unspecified time) pic.twitter.com/hfVkTH0oTH — ANI (@ANI) July 20, 2022 చదవండి: సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం -
28 ఏళ్లకే కొడుకును విగ్రహంగా చూసి తండ్రి కన్నీటి పర్యంతం
చండీగఢ్: సిద్ధూ మూసేవాలా తండ్రి కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మే 29న దారుణ సిద్ధూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి బాల్కౌర్ సింగ్ ఆవిష్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లకే కొడుకును విగ్రహం రూపంలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు గుర్తుగా ఆయన అభిమానులు 6.5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. సిద్ధూ అంత్యక్రియలు జరిగిన మాన్సా జిల్లాలోని మూసా గ్రామంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధూ తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమారుడ్ని విగ్రహం రూపంలో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ అభిమానులు భారీగా తరలివచ్చారు. Sidhu Moosewala’s parents got emotional while they were installing statue of their son where he got cremated #SidhuMooseWala pic.twitter.com/4qdlmXGWKn — Gagandeep Singh (@Gagan4344) July 17, 2022 విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాల్కౌర్ సింగ్ మాట్లాడారు. తన కుమారుడ్ని హత్య చేసిన వారు దేశ, విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూను చంపామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి ప్రభుత్వం భద్రత కల్పించడమేంటని మండిపడ్డారు. మే 29న సిద్ధూను ఓ వాహనంలో వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగి సరిగ్గా 50 రోజులవుతున్న సమయంలోనే అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వస్తున్నకీలక విషయాలు
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...పంజాబ్ సింగర్ సిద్ధూని హత్యకు సంబంధించిన కుట్రదారుల్లో ఒక వ్యక్తి హత్యకు నెలరోజుల మందుగానే నకిలీ పాస్పోర్టుతో భారత్ వదిలి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి సచిన్ బిష్ణోయ్ అని, అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహిత సహచరుడని పేర్కొన్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసి తర్వాతే నకీలీ పాస్‌పోర్ట్ సహాయంతో ఇండియా వదిలి పారిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందుగానే గుర్తించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21 వరకు భారత్‌లోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్‌తో పాటు రాపర్‌ని హత్య చేసిన ఇద్దరు ప్రధాన కుట్రదారులలో ఒకరుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ చిరునామాతో తిలక్ రాజ్ తోటేజా పేరుతో సచిన్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ను పొందినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసే వాలేని హత్య చేసింది మే 29న అయితే సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21నే భారత్‌ని వదలి దూబాయ్ పారిపోయాడని అక్కడి నుంచి అజర్బైజాన్ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సచిన్ బిష్ణోయ్ ఢిల్లీలో ఉన్నప్పుడే మూస్ వాలా హత్యకు సంబంధించిన మొత్తం ప్లాన్‌ని సిద్ధం చేసి, షూటర్లకు షెల్టర్లు, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదీగాక సిద్ధూ మూసే వాలేకి ఉన్న 424 భద్రతా సిబ్బంది తొలగించిన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం. (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
సింగర్ సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వచ్చిన మరో వీడియో!
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ హత్య కేసులో అసలు నిందుతుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది నిందితులను కూడా అరెస్టు చేశారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ షార్ప్ షూటర్ల ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బస్ టెర్మినల్‌లో 18 ఏళ్ల అంకిత్ సిర్సా అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడు దోషిగా తేలిని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అంకిత్ సిర్సా మొబైల్‌ని స్కాన్ చేసి చూడగా....సిద్ధూని హత్య చేసి అనంతరం నిందితులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూ హత్యలో ఆ యువకుడే ప్రధాన షూటర్‌గా పోలీసులు తెలిపారు. అంతేకాదు అంకిత్ సిర్సానే గాయకుడు సిద్ధూ వద్దకు వెళ్లి నేరుగా అతనిపై ఆరు బుల్లెట్టు కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతని సహచరుడు సచిన్ వీరమణిని కూడా అరెస్టు చేశారు. #WATCH | In a viral video, Sidhu Moose Wala's murder accused Ankit Sirsa, Priyavrat, Kapil, Sachin Bhivani, & Deepak brandished guns in a vehicle pic.twitter.com/SYBy8lgyRd — ANI (@ANI) July 4, 2022 (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
సిద్ధూ హత్య కేసు: ప్రధాన సూత్రధారి ఎవరంటే..
ఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ హత్య కేసులో ఊహించిందే జరిగింది. ఈ హత్య కుట్రకు మాస్టర్ మైండ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనే తేల్చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. అయితే పంజాబ్ సిట్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. గోల్డీ బ్రార్, బిష్ణోయ్ అనుచరుడు. దీంతో హత్య జరిగిన నాటి నుంచే బిష్ణోయ్‌పై పోలీసులకు అనుమానం నెలకొంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా లారెన్స్ పేరును చేర్చారు. అయితే నేరాన్ని అంగీకరించని లారెన్స్ బిష్ణోయ్.. తన ప్రమేయం లేకుండానే తన గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు గోల్డీ బ్రార్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వాళ్లిచ్చిన సమాచారం మేరకు లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య కుట్రకు మూలకారణంగా తేల్చారు. ప్రస్తుతం ఢిల్లీ తీహార్‌జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను ఇప్పటికే పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు కూడా. ఇక పోలీసుల అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు ఆరు బృందాలను ఏర్పాటు చేసిన పంజాబ్ పోలీసులు.. ఆరుగురు షార్ప్‌షూటర్ల కోసం నాలుగు రాష్ట్రాలను జల్లెడ పట్టేందుకు సిద్ధమయ్యారు. -
సిద్ధూ హత్య కేసు: నలుగురు నిందితుల గుర్తింపు!
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్యలో పాల్గొన్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు తెలిపారు. హత్య కుట్రకు సహకరణ, రెక్కీ నిర్వహణ, షూటర్లకు ఆశ్రయం కల్పించారనే నేరారోపణలపై ఈ ఎనిమిది మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో సిద్ధూతో ఘటనకు ముందు సెల్ఫీ తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అంతేకాదు.. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీళ్ల కోసం వేట కొనసాగుతోందని ప్రకటించారు పోలీసులు. అరెస్టయిన వాళ్లను.. సందీప్ సింగ్ అలియాస్ కేక్డా(సిస్రా), మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నా(బతింద), మన్‌ప్రీత్ బావు(ఫరీద్కోట్), ఇంకా అమృత్‌సర్‌తో పాటు హర్యానాకు చెందిన ప్రాంతాల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే హత్యలో పాల్గొన్న షూటర్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. మే 29వ తేదీన.. పంజాబీ ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణంగా కాల్పుల ఘటనలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. చదవండి: సిద్ధూ అలా చేసి ఉంటే ప్రాణాలతో ఉండేవాడేమో! -
సింగర్ సిద్ధూ హత్య కేసు: కీలకంగా మారునున్న సెల్ఫీ!
చండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్‌లో సిద్ధూ ఎస్యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. (చదవండి: యస్.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు) -
సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఇదొక ప్రతీకార హత్యే అని వెల్లడించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్, పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటిదాకా(గురువారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్. ఈ క్రమంలో తాజాగా.. విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టి ఉంటుందని బిష్ణోయ్ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ హత్యలో తన ప్రమేయం లేదని, తీహార్ జైల్లో ఉన్న తాను కనీసం తన ఫోన్‌ను కూడా ఉపయోగించడం లేదని బిష్ణోయ్ వెల్లడించాడు. అంతేకాదు సిద్ధూ హత్యను జైలులోని టీవీ ద్వారానే తెలుసుకున్నా అని బిష్ణోయ్ తెలిపాడు. ఇదిలా ఉంటే పంజాబీ పాపులర్ సింగర్ సిద్ధూ.. మే 29న మాన్సా జిల్లాలో ఘోరంగా హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే పోలీసుల అనుమానం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మీదకు మళ్లింది. ఆ మరుసటి రోజే.. జైల్లో తనకు భద్రత కల్పించాలంటూ పటియాలా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు లారెన్స్ బిష్ణోయ్. సింగర్ సిద్దూ హత్యలో కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రమేయం ఉందని తేలింది. బ్రార్.. బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు కూడా. బిష్ణోయ్ సోదరుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో సిద్దూ మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ఘటన తర్వాత షగన్‌ప్రీత్.. విదేశాలకు పారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో సిద్ధూనే షగన్‌ప్రీత్‌కు సహకరించి ఉంటాడని బిష్ణోయ్ అనుచరులు నమ్మారు. అందుకే నాలుగు రోజులు రెక్కీ వేసి మరీ సింగర్ సిద్ధూని కిరాతకంగా కాల్చి చంపారు. సిద్ధూ కుటుంబానికి సీఎం పరామర్శ సింగర్ సిద్ధూ మూసే వాలా కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పరామర్శించారు. శుక్రవారం మన్సా జిల్లా మూసే గ్రామానికి వెళ్లి.. సిద్ధూ కుటుంబాన్ని ఓదర్చారు. దారిపోడవునా.. నిరసనకారులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎలాగోలా సిద్ధూ ఇంటికి చేరారు సీఎం భగవంత్. ఈ సందర్భంగా.. తమకు న్యాయం చేయాలని సిద్ధూ కుటుంబం సీఎంని కోరింది. చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా? -
సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం!
ఛండీగడ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా దారుణహత్యకు.. ప్రతీకారం తీర్చుకుంటామని, అదీ రెండు రోజుల్లోనే అని సోషల్ మీడియాలో ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. సిద్ధూ మూసే వాలా మా హృదయం.. సోదరుడి లాంటి వాడు. రెండు రోజుల్లో ఫలితం ఏంటో చూస్తారు అంటూ ఫేస్బుక్ స్టోరీలో ఉంది ఆ హెచ్చరిక. పోస్ట్‌లో బావ్నా అని ఉండడంతో.. ఇది గ్యాంగ్‌స్టర్ నీరజ్ బావ్నాకు చెందిన ముఠా పని అని భావిస్తున్నారు పోలీసులు. పలు హత్య కేసుల్లో దోషిగా తేలిన నీరజ్ బావ్నా, అతని అనుచరులు టిల్లు తజాపూరియా, దేవిందర్ బంభియాలు.. తీహార్ జైలులో ఉన్నారు. అయితే పై హెచ్చరిక పోస్ట్ ఎవరు రాశారనేదానిపై స్పష్టత లేకపోయినా.. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో విస్తరించి ఉన్న నీరజ్ బావ్నా అనుచరుల పని అయ్యి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్‌లను ఉద్దేశించి ఆ ఫేస్బుక్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్.. ప్రాణ భయంతో సెక్యూరిటీ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జైలు నుంచి అంత పెద్ద హత్యకు ఎలా కుట్ర పన్నుతాడంటూ బిష్ణోయ్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సిద్ధూ మూసే వాలా హత్యను గ్యాంగ్‌వార్-ప్రతీకార హత్యగానే భావిస్తోంది పంజాబ్ పోలీస్ శాఖ. చదవండి: సింగర్ సిద్ధూ పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్