సింగర్ తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో! | Punjabi singer Sidhu Moosewala parents will welcome another child soon | Sakshi
Sakshi News home page

Sidhu Moosewala: 58 ఏళ్ల వయసులో గర్భం ధరించిన సింగర్ తల్లి!

Feb 27 2024 6:27 PM | Updated on Feb 27 2024 6:42 PM

Punjabi singer Sidhu Moosewala parents will welcome another child soon - Sakshi

రెండేళ్ల క్రితం పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2022 మేలో జరిగిన ఈ దారుణహత్యతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దూ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పంజాబీ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

అయితే తాజాగా సిద్దు మూసేవాలా తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.  సిద్దూ తల్లి చరణ్ సింగ్ 58 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమైంది. ఐవీఎఫ్ ద్వారా మరో గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె ప్రసవం కోసం సిద్ధమవుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా డాక్టర్లు సలహాలు పాటిస్తున్నారు. 

సిద్దూ మూసేవాలా హత్య

పంజాబీ సింగర్ అయినా సిద్దూ మూసేవాలాను మే, 2022లో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితులతో కలిసి ఉండగా  సిద్దూని కాల్చి చంపినట్లు వార్తలొచ్చాయి. ఈ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్‌పూరియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. సిద్దూ మూసేవాలా సో హై, సేమ్ బీఫ్, ది లాస్ట్ రైడ్, జస్ట్ లిసెన్, 295లాంటి సాంగ్స్ తో పాపులర్ అయ్యాడు.

కాగా.. గతంలో సిద్దూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ విచారణలో అంగీకరించాడు. అతితి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పాడు. తమ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నట్లు సంచలన కామెంట్స్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement