ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం
చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్ చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అమృత్‌సర్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించి పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. వీరిని చూసిన గ్యాంగ్‌స్టర్స్ కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‍కు దారితీసినట్లు అధికారులు తెలిపారు.
సిద్ధూ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు షార్ప్ షూటర్లు జగ్‌దీప్ సింగ్ రూప, మన్ను కుసా(మన్‌ప్రీత్ సింగ్) ఇక్కడే తలదాచుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు నిందితులు చనిపోయినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
#WATCH | Punjab: Encounter underway between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab
— ANI (@ANI) July 20, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/hfVkTH0oTH
చదవండి: సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం
Comments
Please login to add a commentAdd a comment