attari border
-
పంజాబ్: పొలీసులు, గ్యాంగ్స్టర్స్ మధ్య భీకర కాల్పులు
-
పంజాబ్‌లో ఎన్కౌంటర్.. సిద్ధూ హత్యకేసులో ఇద్దరు నిందితులు హతం
చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో సంబంధమున్న గ్యాంగ్స్టర్స్ చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అమృత్సర్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించి పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. వీరిని చూసిన గ్యాంగ్స్టర్స్ కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‌కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు షార్ప్ షూటర్లు జగ్దీప్ సింగ్ రూప, మన్ను కుసా(మన్‌ప్రీత్ సింగ్) ఇక్కడే తలదాచుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు నిందితులు చనిపోయినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. #WATCH | Punjab: Encounter underway between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab (Visuals deferred by unspecified time) pic.twitter.com/hfVkTH0oTH — ANI (@ANI) July 20, 2022 చదవండి: సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం -
‘సంఝౌతా’ నిలిపివేత
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్‌లోని లాహోర్ నుంచి ఢిల్లీకి వస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్ అధికారులు భద్రతను సాకుగా చూపుతూ వాఘా సరిహద్దు వద్దే నిలిపివేశారు. ఈ సమయంలో రైలులో 48 మంది పాకిస్తానీలు సహా 117 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత బలగాలు, రైల్వే సిబ్బంది సాయంత్రం 5.15 గంటలకు అక్కడికి చేరుకున్నారు. రైలుకు భారత ఇంజిన్‌ను బిగించి భారత సరిహద్దు అట్టారి వద్దకు తీసుకొచ్చారు. పాక్ నిర్ణయంతో సరిహద్దుకు ఇరువైపులా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. చివరికి సాయంత్రం 6.41 గంటల సమయంలో 10 మంది పాకిస్తానీలు సహా 103 మంది ప్రయాణికులతో రైలు అట్టారి నుంచి లాహోర్‌కు బయలుదేరింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సంఝౌతా సర్వీసును నిలిపేస్తున్నట్లు పాక్ రైల్వే మంత్రి రషీద్ ప్రకటించారు. అయితే ఈ సర్వీసు కొనసాగుతుందని భారత అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇంకోసారి ఆలోచించుకోండి: భారత్ తమతో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంపై పాకిస్తాన్ పునరాలోచించాలని భారత్ కోరింది. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్నట్లు ప్రపంచదేశాలకు చూపించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్‌కు కరణ్‌సింగ్ షాక్.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని తాను గుడ్డిగా వ్యతిరేకించబోనని కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయంలో పలు సానుకూల అంశాలున్నాయి. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అని తెలిపారు. సంయమనం పాటించండి: అమెరికా కశ్మీర్, ఇతర సమస్యలపై భారత్–పాకిస్తాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమవ్వాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. సమస్యను ఇరుదేశాల చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తమకుందని యూఏఈ విదేశాంగ మంత్రి అన్వర్ తెలిపారు. ఎలాంటి సవాళ్లకైనా సిద్ధం: రాజ్‌నాథ్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి క్షేత్రస్థాయి పనులు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘భారత మిలటరీ బలంగా కశ్మీరీలను అణచివేయగలమని బీజేపీ భావిస్తోందా? కశ్మీర్లో ప్రజల పోరాటం త్వరలో ఊపందుకోనుంది. ఈ సందర్భంగా చెలరేగే హింసను ఆపే దమ్ము ప్రపంచదేశాలకు ఉందా?’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రశ్నించారు. భారతీయ సినిమాల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత విమానాలు తమ గగనతలం గుండా రాకపోకలు సాగించడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది. ఆజాద్ అడ్డగింత కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను అధికారులు శ్రీనగర్ విమానాశ్రయంలో గురువారం అడ్డుకున్నారు. స్థానిక కశ్మీర్ నేతలతో మాట్లాడేందుకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను అధికారులు తిరిగి ఢిల్లీకి పంపారు. జాతీయ భద్రతా సలహాదారు దోవల్ కశ్మీర్లో పర్యటించడం, ఆ సందర్భంగా స్థానికులతో భోజనం చేయడంపై ఆజాద్ స్పందిస్తూ.. ‘డబ్బులిస్తే ఎవరైనా మనతోపాటు వస్తారు’ అని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ ఈ వ్యాఖ్యలను అనుకూలంగా చేసుకునే చాన్సుందని బీజేపీ మండిపడింది. లాహోర్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారత్‌కు రానున్న బంధువును పట్టుకుని రోదిస్తున్న ఓ మహిళ -
రూ. 2,700 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
అమృత్సర్ (పంజాబ్): పాక్ నుంచి అక్రమంగా వాణిజ్య మార్గం ద్వారా భారత్‌కు తీసుకొస్తున్న 532 కిలోల హెరాయిన్‌ను సరిహద్దులోని అట్టారి చెక్ పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2,700 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా పాకిస్తాన్ నుంచి అట్టారి చేరుకున్న ట్రక్కులోని హెరాయిన్, మరో 52 కిలోల అనుమానాస్పద డ్రగ్స్‌ను వందలాది రాతి ఉప్పు బస్తాల కింద దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు దేశంలోనే కస్టమ్స్ విభాగానికి ఇది భారీ విజయమని వెల్లడించారు. కశ్మీర్‌కు చెందిన హెరాయిన్ స్మగ్లింగ్ సూత్రధారి తారిఖ్ అన్వర్ని అరెస్ట్ చేసిన అధికారులు రాతి ఉప్పును దిగుమతి చేసుకుంటున్న అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని దీపక్‌కుమార్ వెల్లడించారు. -
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్
-
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా
లాహోర్: భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్–ఢిల్లీ మధ్య మళ్లీ పరుగులు పెడుతోంది. సంఝౌతా సర్వీసును పునరుద్ధరించినట్లు పాక్ సోమవారం ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సంఝౌతా రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్‌లో బయలుదేరినట్లు పాక్ రేడియో ప్రకటించింది. ఈ రైలు లాహోర్ నుంచి ప్రతి సోమ, గురువారాల్లోనూ, ఢిల్లీ నుంచి ఆది, బుధవారాల్లోనూ బయలుదేరుతుంది. ఈ రైలు మన దేశంలో ఢిల్లీ నుంచి అటారీ వరకు, ఆ తర్వాత పాకిస్తాన్లో వాఘా నుంచి లాహోర్ వరకు నడుస్తుంది. సాధారణంగా ఈ రైలులో ఆక్యుపెన్సీ 70 శాతం ఉంటుండగా.. పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రదాడి అనంతరం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 1976లో భారత్–పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. సంఝౌతా అనే పదానికి హిందీలో ‘ఒప్పందం’అనే అర్థం. 1976లో జూలై 22న రెండు దేశాల మధ్య తొలి సర్వీసు నడిపారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 6 స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీటైర్ కోచ్ ఉన్నాయి. -
దేశం మీసం మెలేస్తోంది
దేశమంతా ఇప్పుడు ఒకటే నినాదం. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను భారతం ముక్తకంఠంతో అభినందిస్తోంది. పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. మిగ్–21 బైసన్ యుద్ధ విమానం కూలిన తర్వాత పాక్ సైనికులకు అభినందన్ చిక్కడం.. ఆ తర్వాత స్థానికులు ఆయన్ను రక్తం కారేలా హింసించినా.. వీరుడి ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. పాక్ సైన్యం కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి విరిచికట్టినా ముఖంపై చిరునవ్వు కోల్పోలేదు. కులాసాగా టీ తాగుతూ తనను పాక్ ఆర్మీ బాగానే చూసుకుంటోందని చెప్పడం.. ఆయనలోని జెంటి ల్మన్కు నిలువెత్తు నిదర్శనం. పాక్ మేజర్ ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. తన పేరు అభినందన్ అని, తాను పైలట్‌నని, సర్వీస్ నంబర్ 27981 అని చెప్పారే తప్ప ఒక్క రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు. అనవసర ప్రశ్నలకు సారీ సర్ అంటూ సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియోలతో ఇప్పుడు దేశంలో విక్రం అభినందన్ హీరోగా మారిపోయారు. భారత సైనికుడి సత్తా ఇదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరదపారుతోంది. వెన్నెముకకు గాయమైనా..! బుధవారం ఉదయం వాస్తవాధీనరేఖకు 7 కిలోమీటర్ల దూరంలో హోర్రా గ్రామంలో భారత్‌కు చెందిన రెండు యుద్ద విమానాలు మంటల్లో చిక్కుకొని కుప్పకూలిపోయాయంటూ డాన్ పత్రిక పేర్కొంది. ఒక విమానం నుంచి పైలట్ ప్యారాచూట్ సాయంతో కిందకి దిగడాన్ని స్థానికులు గుర్తించారు. చేతిలో పిస్టల్‌తో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను స్థానికులు చుట్టుముట్టారు. అభినందన్ ఇది భారతా? పాకిస్తానా? అని వారిని ప్రశ్నించారు. అభినందన్‌ను పక్కదారి పట్టించడానికి వారు భారత్ అని చెప్పారు. ఊపిరి పీల్చుకున్న అభినందన్ తన వెన్నెముకకు దెబ్బతగిలిందని.. దాహంతో నోరెండిపోతోందని మంచినీళ్లు కావాలని అడిగారు. అభినందన్‌ను చుట్టముట్టిన స్థానికుల్లో కొందరు యువకులు భావోద్వేగాలు ఆపుకోలేక పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అభినందన్‌కి తాను పాక్‌లో ఉన్నానని అర్థమైంది. వెంటనే చేతిలో ఉన్న పిస్టల్‌తో గాల్లో కాల్పులు జరుపుతూ.. పరుగులు తీశారు. వెన్నెముకకు గాయమై బాధిస్తున్నా పరుగు ఆపలేదు. ఆయనను పట్టుకోవడానికి స్థానికులు వెంబడిస్తే ఒక నీటి కుంటలోకి దూకేశారు. భారత్ రహస్యాలు పరాయి దేశస్తుల చేతుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తన దుస్తుల్లో దాచుకున్న కీలక డాక్యుమెంట్లను నమిలి మింగడానికి ప్రయత్నించారు. మరికొన్ని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నీళ్లలో ముంచేశారు. ఆయన్ను వెంబడిస్తూ వచ్చిన స్థానికులు నిర్బంధించి రక్తం కారేలా కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన పాక్ ఆర్మీ గ్రామస్తులు నుంచి అభినందన్‌ను రక్షించి తమ అధీనంలోకి తీసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అభినందన్ కనబరిచిన తెగువ దేశ ప్రజల మనసులను గెలుచుకుంది. ఎఫ్–16నే కూల్చేశారు ఆయన నడుపుతున్న మిగ్ 21 బైసన్ కుప్పకూలడానికి కొద్ది సెకండ్ల ముందు కూడా అభినందన్ తాను చేయాల్సిన పని పైనే దృష్టి పెట్టారు. శత్రుదేశ యుద్ధ విమానం ఎఫ్–16ను గురితప్పకుండా కాల్చి కూల్చేశారు. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే ఆర్–73 క్షిపణిని ప్రయోగించి అభినందన్ ఈ పని పూర్తి చేశారు. ఎప్పుడో 1960 కాలం నాటి క్షిపణిని ప్రయోగించి గురితప్పకుండా ప్రత్యర్థి అత్యాధునిక విమానాన్ని కూల్చివేయడం అరుదైన ఘటన అని వైమానిక వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాలు భారత్ భూభాగంలోకి 7 కి.మీ. దూరంలోకి చొచ్చుకు వచ్చినా అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోయాయి. వీటి రాకను గుర్తించి గస్తీ తిరుగుతున్న రెండు మిగ్–21 బైసన్ విమానాలువెంబడించాయి. ఈ ప్రయత్నంలో రెండు ఎఫ్–16 విమానాల మధ్యకు అభినందన్ మిగ్ దూసుకెళ్లింది. తర్వాత విమానం అదుపుతప్పింది. పరిస్థితి చేయిదాటుతున్నా.. మిగ్ కూలిపోవడానికి ఆఖరి నిమిషంలో ఎఫ్–16ని కూల్చేశారు. వాఘా వద్ద అభినందన్‌కు ఆహ్వానం న్యూఢిల్లీ: ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సాయంత్రం భారత్–పాక్ సరిహద్దుల్లోని వాఘా పోస్ట్ వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టనున్నారు. ఐఏఎఫ్ అధికారుల బృందం వాఘా వద్ద ఆయనకు స్వాగతం పలకనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన్ను పాక్ సైన్యం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించనుందా లేక భారత అధికారులకు అప్పగిస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. పంజాబ్‌లోని అట్టారి వద్ద భారత్–పాక్ సరిహద్దుల్లో వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీని కోరారు. ‘పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శిస్తున్నాను. ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఉన్నాను. అట్టారి వద్ద ఆయన్ను దేశంలోకి ఆహ్వానించటాన్ని గౌరవంగా భావిస్తాను. నాకు మాదిరిగానే అభినందన్, ఆయన తండ్రి కూడా నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ పొందినవారే. నాకు అవకాశం ఇవ్వండి’అంటూ ఆయన ప్రధానిని ట్విట్టర్లో కోరారు. -
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకు
లాహోర్/న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తొలుత ఈ రైల్వే సేవలను నిలిపేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత భారత్ కూడా సంఝౌతాను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ వెల్లడించగా, రైలులో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఢిల్లీ నుంచి పాక్‌కు వెళ్లేందుకు భారత్ నుంచి వెళ్లే రైలులో 27 మంది ప్రయాణికులు గురువారమే సరిహద్దు వద్ద ఉన్న భారత్‌లోని అట్టారీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ పాకిస్తాన్ నుంచి రావాల్సిన రైలును ఆ దేశ అధికారులు నిలిపేశారు. దీంతో 27 మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. రెండు రైళ్ల సేవలు నిలిచిపోవడంతో అట్టారీ స్టేషన్ వద్ద ఇరు దేశాలకు చెందిన దాదాపు 40 మంది చిక్కుకుపోయారని సమాచారం. సిమ్లా ఒప్పందంతో.. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి. లాహోర్ స్టేషన్లో రోదిస్తున్న భారత ప్రయాణికురాలు -
పాక్ సరిహద్దుల్లో.. అత్యంత ఎత్తయిన పతాకం
దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఎక్కడుంది అంటే.. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో అని చెప్పబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీ సమీపంలో మన దేశంలోనే ఇంతవరకు అత్యంత ఎత్తయిన జాతీయపతాకాన్ని సోమవారం ఉదయం ఆవిష్కరించారు. దీని ఎత్తు 360 అడుగులు. జెండా పొడవేప 12 అడుగులు ఉంటుందని చెబుతున్నారు. ఇంతకుముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్‌రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగులు ఎక్కువ ఎత్తులో అమృతసర్ వద్ద ఈ కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.