పట్టుబడిన డ్రగ్స్ సంచులు
అమృత్‌సర్ (పంజాబ్): పాక్ నుంచి అక్రమంగా వాణిజ్య మార్గం ద్వారా భారత్‌కు తీసుకొస్తున్న 532 కిలోల హెరాయిన్‌ను సరిహద్దులోని అట్టారి చెక్ పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2,700 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా పాకిస్తాన్ నుంచి అట్టారి చేరుకున్న ట్రక్కులోని హెరాయిన్, మరో 52 కిలోల అనుమానాస్పద డ్రగ్స్‌ను వందలాది రాతి ఉప్పు బస్తాల కింద దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు దేశంలోనే కస్టమ్స్ విభాగానికి ఇది భారీ విజయమని వెల్లడించారు. కశ్మీర్‌కు చెందిన హెరాయిన్ స్మగ్లింగ్ సూత్రధారి తారిఖ్ అన్వర్‌ని అరెస్ట్ చేసిన అధికారులు రాతి ఉప్పును దిగుమతి చేసుకుంటున్న అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని దీపక్‌కుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment