Tariq Anwar
-
రూ. 2,700 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
అమృత్సర్ (పంజాబ్): పాక్ నుంచి అక్రమంగా వాణిజ్య మార్గం ద్వారా భారత్‌కు తీసుకొస్తున్న 532 కిలోల హెరాయిన్‌ను సరిహద్దులోని అట్టారి చెక్ పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2,700 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా పాకిస్తాన్ నుంచి అట్టారి చేరుకున్న ట్రక్కులోని హెరాయిన్, మరో 52 కిలోల అనుమానాస్పద డ్రగ్స్‌ను వందలాది రాతి ఉప్పు బస్తాల కింద దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు దేశంలోనే కస్టమ్స్ విభాగానికి ఇది భారీ విజయమని వెల్లడించారు. కశ్మీర్‌కు చెందిన హెరాయిన్ స్మగ్లింగ్ సూత్రధారి తారిఖ్ అన్వర్ని అరెస్ట్ చేసిన అధికారులు రాతి ఉప్పును దిగుమతి చేసుకుంటున్న అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని దీపక్‌కుమార్ వెల్లడించారు. -
కాంగ్రెస్ గూటికి తారిఖ్ అన్వర్
న్యూఢిల్లీ: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో తారిఖ్ అన్వర్ తన అనుచరులతో కలసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ..రఫేల్ విమానాల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని మోదీని వెనకేసుకుని రావటంతోనే తాను పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. బిహార్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన తారిఖ్ అన్వర్ ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. సుమారు 19 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. -
19 ఏళ్ల తర్వాత సొంతగూటికి మాజీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం న్యూఢిల్లీలోని.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో అభిప్రాయ భేదాలు నెలకొన్న నేపథ్యంలో సుమారు పందొమిదేళ్ల తర్వాత అన్వర్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాగా విదేశీ మహిళ(సోనియా గాంధీ)ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీని వీడి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించిన సమయంలో అన్వర్ ఆయనకు అండగా నిలిచారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. తొమ్మిది పర్యాయాలు(లోక్‌సభ- ఐదుసార్లు, రాజ్యసభ- రెండుసార్లు) ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని సమర్థిస్తూ శరద్ పవార్ వ్యాఖ్యలు చేయడంతో నెలరోజుల క్రితం ఆయన పార్టీని వీడారు. -
రాఫెల్ రగడ.. మరో కీలక నేత రాజీనామా
సాక్షి, ముంబై : రాఫెల్ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు మరో ఎదురుదెబ్బ తలిగిలింది. పార్టీ జనరల్ సెక్రటరీ మునాఫ్ హకీమ్ ఎన్సీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. రాఫెల్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శరద్‌పవార్ పవార్ భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన పవార్ ఓ మరాఠి న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు. (రాఫెల్ డీల్‌పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు) కాగా, పవార్ వ్యాఖ్యలకు నిరసనగా ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుడు, ఎంపీ తారీఖ్ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా.. మునాఫ్ హకీమ్ కూడా అదే బాటలోనే నడిచారు. పార్టీ సభ్యత్వానికి, జనరల్ సెక్రటరీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన తారీఖ్‌కు మాటమాత్రమైనా చెప్పకుండా రాఫెల్ ఒప్పందంపై అనుకూలంగా మాట్లాడిన పవార్‌పై హకీమ్ నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మాటలు ఎన్సీపీ ప్రతిష్టను దిగజార్చేదిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. (చదవండి : రాఫెల్ డీల్ వ్యాఖ్యలు: సీనియర్ ఎంపీ రాజీనామా) -
ఎన్సీపీలో రాఫెల్ ఒప్పందం చిచ్చు
-
ఎన్సీపీకి తారిఖ్ అన్వర్ రాజీనామా
కటిహార్/న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్ సంచలన ప్రకటన చేశారు. రాఫెల్ ఒప్పందంపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని మోదీకి మద్దతు తెలిపినందుకు నిరసనగా ఆ పార్టీకి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కటిహార్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విషయంలో పవార్ వెలిబుచ్చిన అభిప్రాయం తనకు బాధ కలిగించిందన్నారు. అందుకే పార్లమెంట్ సభ్యత్వం, పార్టీ వ్యవస్థాపక సభ్యత్వంతోపాటు అన్ని పదవుల నుంచి వైదొలిగినట్లు స్పష్టం చేశారు. మద్దతు దారులతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తానన్నారు. -
రాఫెల్ డీల్ : ఎంపీ తారీఖ్ అన్వర్ రాజీనామా
-
రాఫెల్ డీల్ వ్యాఖ్యలు: సీనియర్ ఎంపీ రాజీనామా
పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ తారీఖ్ అన్వర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందం విషయంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ వైఖరి నచ్చకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందం గురించి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేవంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. స్పష్టంగా అర్థమవుతోంది కదా! ‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరగినట్లు స్పష్టంగా కన్పిస్తోంది కదా. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఈ ఒప్పందం విషయంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ శరద్ పవార్ మాత్రమే మోదీకి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను’ అని అన్వర్ వ్యాఖ్యానించారు. తదుపరి ఏ పార్టీలో చేరాలన్న విషయంపై తన అనునాయులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తరుణంలో.. మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భారీ మూల్యమే చెల్లించుకున్నట్లయింది. ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుడిగా విదేశీ మహిళ(సోనియా గాంధీ)ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీని వీడి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించిన సమయంలో అన్వర్ ఆయనకు అండగా నిలిచారు. వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. తొమ్మిది పర్యాయాలు(లోక్‌సభ- ఐదుసార్లు, రాజ్యసభ- రెండుసార్లు) ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కతియార్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అన్వర్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శరద్ పవార్‌తో విభేదించిన నేపథ్యంలో.. అన్వర్ తిరిగి సొంత గూటికి(కాంగ్రెస్) చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
స్మృతికి బ్యాడ్ టైమ్ మొదలైంది
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చెడు రోజులు మొదలయ్యాయని, కేంద్రంలో ఆమెకు ప్రాధాన్యం తగ్గిపోతుండటమే దీనికి నిదర్శనమని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. కేంద్రమంత్రిగా స్మృతి పనితీరు ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చలేదని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మానవ వననరుల అభివృద్ధి శాఖ నుంచి స్మృతిని తప్పించి అంతగా ప్రాధాన్యంలేని జౌళి శాఖను కేటాయించిన విషయాన్ని అన్వర్ గుర్తు చేశారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమెకు ఉద్వాసన పలికారు. స్మృతికి ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతున్న పరిణామాలను గమనిస్తే, ఆమెకు ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోందని, బ్యాడ్ టైమ్ మొదలైందని ఎన్సీపీ నేత వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో 2,500 మందికిపైగా రైతుల ఆత్మహత్య : ఎన్‌సీబీఆర్‌బీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 సంవత్సరంలో రైతులు దాదాపు 2,500మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ నేర పరిశోధక సంస్థ (ఎన్‌సీబీఆర్‌బీ) వెల్లడించింది. ఆత్మహత్యలు పాల్పడిన వారంతా బ్యాంకులు దివాళా తీయడం, నిరుద్యోగం, పేదరికం వంటివి ముఖ్య కారణమని పేర్కొంది. 2011 నుంచి 2012 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య దాదాపు 2, 206 నుంచి 2, 572 మంది ఉన్నట్టు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తరీక్ అన్వర్ రాజ్యసభలో చెప్పారు. ఎన్‌సీబీఆర్‌బీ అంచనా ప్రకారం.. రైతులు వారి కుటుంబ సమస్యలు, అనారోగ్యం, మందుకు బానిసకావడం, నిరుద్యోగం, పేదరికం, బ్యాంకు దివాలా వంటి కారణాలవల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్వర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్ధిక పరిస్థితి ఆకస్మత్తుగా మారడం, పేదరికం, ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వము, వివాహం కాకపోవడం, వరకట్న వివాదం, సమాజంలో కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లడం వంటి తదితర కారణాల చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చెప్పారు. కష్టాల ఊబిలో కూరుకపోయిన రైతులు సహా అందరికీ రాష్ట్ర్ర ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలతోపాటు పునరావస ప్యాకేజీ 19, 998కోట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీతో నాలుగు రాష్ట్ర్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలోని 31జిల్లాలకు సహాయం అందించినట్టు అన్వర్ తెలిపారు. -
రైతులను ఆదుకునేందుకు సాయం చేయండి:మంత్రి కాసు
న్యూఢిల్లీ: ఇటీవలి వరదలతో ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా నష్టపోయారని, వారు కొత్త పంటలు వేసుకునేందుకు తగిన సాయం అందించాలని రాష్ట్ర సహకార మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీకాంత్ జెనా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మలను కలిసి వరద నష్టాన్ని వివరించారు. కొత్త పంటల కోసం రైతులకు విత్తనాలు, ఎరువులు తగిన మొత్తంలో అందించడంలో రాష్ట్రానికి సహాయపడాలని మంత్రులను కోరినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో పత్తి పంట నష్టాన్ని జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లానని, రంగుమారిన/దెబ్బతిన్న 2,34,362 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐతో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని కోరానన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, జనార్దన్ ద్వివేదిలను కలిసి సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని వివరించానని కాసు పేర్కొన్నారు. -
పాలనా పరమైన విధానం వల్లే 'ఉల్లి' పెరుగుదల
న్యూఢిల్లీ : పాలనా పరమైన విధానం వల్లే ఉల్లి ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి మంత్రి తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఉల్లిధరల్లో పెరుగుదలకు పాలన పరమైన విధానాలే కారణమన్నారు. కిలో ఉల్లికి రైతుకు రూ.10 దక్కుతుంటే.. అది మార్కెట్లో వినియోగదారుడు కొనుగోలుచేసే సమయానికి రూ.80-100 వరకు ఎందుకు పెరిగిపోతోందో అర్థం కావడంలేదన్నారు. ఉల్లి మార్కెట్ నిర్వహణలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా వంటల్లో ఉల్లి, టమాట తప్పనిసరిగా వినియోగిస్తారని, అటువంటి నిత్యావసరాల రేట్లు మాత్రమే అనూహ్యంగా పెరిగిపోతుండటం గమనార్హమన్నారు. ఉల్లి రేటు మార్కెట్లో కిలోకు రూ.60-70 మధ్య ఉండగా, టమాట ధర కిలోకు రూ.70-80 మధ్య పలుకుతోందని ఆయన వివరించారు. పంట దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలు ధర పెరుగుదలలో ప్రభావం చూపుతున్నాయని అన్వర్ చెప్పారు. సాధారణంగా ఈ సీజన్లో పండ్ల ధరలు పెరుగుతాయి. అయితే దీనికి వ్యతిరేకంగా కూరగాయల ధరలు పెరగడంలో దళారుల పాత్రపై తాము దృష్టిపెట్టినట్లు మంత్రి తెలిపారు. -
'తెలంగాణకు పరిష్కారం లభించకపోతే.. ముందస్తు ఎన్నికలు'
‘తెలంగాణ’పై ఏర్పడిన ప్రతిష్టంభన త్వరగా తొలగని పక్షంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు తప్పకపోవచ్చని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, కేంద్రమంత్రి తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికలు దగ్గరికొస్తున్నాయనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలంతా రాజీనామా చేస్తే పరిస్థితి జటిలమవుతుంది’ అని మంగళవారం వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట ఏర్పాటు సమస్యకు ఆర్థిక ప్యాకేజ్ సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, సీమాంధ్ర.. ఈ రెండు ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం ఆలోచించాలని సూచించారు. ‘మంత్రుల బృందం ఈ అంశాలన్నిటినీ చర్చిస్తుంది. ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’నన్నారు. ఆచరణసాధ్యమైన చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించినప్పుడు కూడా ఇరుప్రాంతాల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యకూ అదే పద్ధతి అవలంబిస్తే బావుంటుందన్నారు.