న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 సంవత్సరంలో రైతులు దాదాపు 2,500మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ నేర పరిశోధక సంస్థ (ఎన్‌సీబీఆర్‌బీ) వెల్లడించింది. ఆత్మహత్యలు పాల్పడిన వారంతా బ్యాంకులు దివాళా తీయడం, నిరుద్యోగం, పేదరికం వంటివి ముఖ్య కారణమని పేర్కొంది. 2011 నుంచి 2012 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య దాదాపు 2, 206 నుంచి 2, 572 మంది ఉన్నట్టు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తరీక్ అన్వర్ రాజ్యసభలో చెప్పారు.
ఎన్‌సీబీఆర్‌బీ అంచనా ప్రకారం.. రైతులు వారి కుటుంబ సమస్యలు, అనారోగ్యం, మందుకు బానిసకావడం, నిరుద్యోగం, పేదరికం, బ్యాంకు దివాలా వంటి కారణాలవల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్వర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్ధిక పరిస్థితి ఆకస్మత్తుగా మారడం, పేదరికం, ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వము, వివాహం కాకపోవడం, వరకట్న వివాదం, సమాజంలో కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లడం వంటి తదితర కారణాల చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చెప్పారు. కష్టాల ఊబిలో కూరుకపోయిన రైతులు సహా అందరికీ రాష్ట్ర్ర ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలతోపాటు పునరావస ప్యాకేజీ 19, 998కోట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీతో నాలుగు రాష్ట్ర్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలోని 31జిల్లాలకు సహాయం అందించినట్టు అన్వర్ తెలిపారు.
రాష్ట్రంలో 2,500 మందికిపైగా రైతుల ఆత్మహత్య : ఎన్‌సీబీఆర్‌బీ
Published Mon, Dec 9 2013 8:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement