కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Asks GoI To Release Special Funds To AP | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్‌ జగన్‌

Published Fri, May 4 2018 9:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

YS Jagan Asks GoI To Release Special Funds To AP - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్లు చేశారు. ప్రత్యేక నిధులను విడుదల చేసిన రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు.

ప్రకృతి ప్రకోపానికి ప్రజలు మృత్యువాత పడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలకు తీవ్ర కష్టాల్లో పడ్డ రైతన్నలకు సాయంగా నిలవాలని వైఎస్సార్‌ సీపీ పార్టీ కేడర్‌ను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement