
న్యూఢిల్లీ: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో తారిఖ్ అన్వర్ తన అనుచరులతో కలసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ..రఫేల్ విమానాల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని మోదీని వెనకేసుకుని రావటంతోనే తాను పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. బిహార్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన తారిఖ్ అన్వర్ ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. సుమారు 19 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంతగూటికి చేరారు.