sharad pawar
-
‘మహా’ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు. ఈవీఎంలపై దేశమంతటా చర్చ ‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు. -
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. -
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
బీజేపీతో భేటీకి గౌతమ్ అదానీ హాజరు..?: ఫడ్నవీస్ క్లారిటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి ముదురుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడానికి అదానీయే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంతేగాక 2019లో అదానీ తన ఢిల్లీ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరారని శరర్ పవార్ ఆరోపించారు. ఈ సమావేశానికి తనతోపాటు, అమిత్ షా, తన మేనల్లుడు అజిత్ పవార్, అదానీ హాజరైనట్లు తెలిపారు.అయితే ఆ ఆరోపణలను తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. గౌతమ్ అదానీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో అదానీ తమ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఫడ్నవీస్, అమిత్ షాలతో సహా బీజేపీ అగ్రనేతలు, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్సీపీకి చెందిన నేతలంతా అదానీ ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన చర్చల్లో భాగమయ్యారని అజిత్ పవార్ కూడా ఆరోపించారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో.. కుటుంబ కథాచిత్రం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు! పవార్ వర్సెస్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్‌గా ఉంది. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్‌ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.భార్యాభర్తల సవాల్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్‌పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు. ఎందరో వారసులు... శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్‌లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మోహన్‌రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్‌కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.తండ్రీ కూతుళ్ల పోటీ గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్‌లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్పై బరిలోకి దిగారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై సుప్రీంకోర్టు మండిపడింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు అజిత్ పవార్ ఫోటోలను, వీడియోలను.. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఉపయోగించకూడదని హెచ్చరించింది.‘మీ సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోండి’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం బుధవారం చీవాట్లు పెట్టింది. శరద్ పవార్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉపయోగించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సర్క్యులర్ జారీ చేయాలని అజిత్ పవార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. కాగా అజిత్ పవార్ వర్గానికి పార్టీ చిహ్నమైన గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ సందర్భంగా శరద్ పవార్‌కు చెందిన వీడియోలను అజిత్ పవార్ వర్గం ప్రచారం చేస్తోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. అయితే అజిత్ పవార్ వర్గం తరపు నసీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. అదిపాత వీడియో అని తెలిపారు. కానీ కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది.‘ఈ వీడియో పాతది అయినా కాకపోయినా, శరద్ పవార్‌తో మీకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీరు మీ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రత్యేకమైన, భిన్నమైన రాజకీయ పార్టీగా మీ సొంత గుర్తింపును కనుగొనండి అని తెలిపారు. -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను
పుణే: ఎన్సీపీ దిగ్గజ నేత శరద్ పవార్ త్వరలో రాజ కీయాల నుంచి వైదొల గనున్నారా? అంటే అవు ననే చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళవారం మహా రాష్ట్రలోని బారామ తిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన వెల్లడించిన విషయం దీనిని రూఢీ చేస్తోంది. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, యువ తరానికి మార్గదర్శకంగా ఉంటానని శరద్ పవార్ అన్నారు. ‘ప్రస్తుతం అధికారంలో లేను. రాజ్యసభ సభ్యుడిగా మరో ఏడాదిన్నర కొనసాగుతాను. కానీ, ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు పోటీ చేయాలా వద్దా అనే విషయం ఆలోచించాలి. లోక్‌సభకే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను’అని అన్నారు.‘బారామతి నుంచి 14 సార్లు పోటీ చేశా. ప్రతిసారీ మీరు నన్ను గెలిపించారు. ఒక్కసారి కూడా ఓడించలేదు. కానీ, నేనే దీనికి ముగింపు పలకాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. ఆ తపనతోనే పనిచేస్తున్నా. అధికారం కాదు, ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం. ప్రజల కోసం ఇకపైనా పనిచేస్తూనే ఉంటా’అని ఆయన ప్రకటించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న శరద్‌పవార్ వయస్సు 83 ఏళ్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. 1967లో మొదటిసారిగా బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత 57 ఏళ్లలో ఒక్క ఓటమిని కూడా ఎరగని నేత శరద్‌పవార్. -
రాజకీయాల నుంచి తప్పుకోబోతున్న శరద్ పవార్?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్చంద్ర) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజ్యసభలో తమ పదవీకాలం ఇంకా ఏడాది కాలం మిగిలి ఉందని, అది పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బారామతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలో లేనని చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వెల్లడించారు. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న శరద్ పవార్.. ఇప్పటి వరకు 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 20న జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ(అజిత్) అధ్యక్షుడు అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై శరద్‌పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర తరఫున ప్రచారం చేస్తు్న్నారు. కాగా అజిత్ పవార్ బారామతి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విజయాల్లో అతనికి తన మామ పార్టీ మద్దతు ఉంది. కానీ పార్టీ నుంచి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని చెప్పారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30 ఏళ్లకు పైగా పనిచేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రాబోయే 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని మనం తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాగా శరద్‌పవార్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా అవతరించారు. 1999లో ఆయన ఎన్సీపీని స్థాపించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు. -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
‘అలా చేయటం.. నన్ను ఎంతో బాధపెట్టింది’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను అనుకరించటం చాలా బాధపెట్టిందని ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవర్ అన్నారు. శరద్ పవార్ అనుకరణపై బుధవారం అజిత్ పవార్ స్పందించారు. శరద్ పవార్ అలా చేయడం సరికాదని అన్నారు. తన తల్లి పేరు ప్రస్తావనతో భావోద్వేగానికి గురయ్యానని, అది సహజంగానే జరిగిందని చెప్పారు.‘‘నేనెప్పుడూ శరద్ పవార్‌ని దేవుడిగా భావించే వ్యక్తిని. కానీ ఆయన రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని అనుకరించారు. శరద్ పవార్ అనుభవజ్ఞులైన నేత. ఆయన నన్ను అనుకరించిన విధానం చాలా మందికి నచ్చలేదు. అదే పని.. బారామతి అభ్యర్థి యోగేంద్ర పవార్ లేదా ఇతరులు ఎవరైనా చేసి ఉంటే ఫర్వాలేదు. మా అమ్మ పేరు ప్రస్తావనతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. నేను కన్నీళ్లు పెట్టుకున్నా. అది చాలా సహజమైంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కూడా. నేను నా రుమాలు తీయలేదు. కానీ ఆయన అలా చేశారు. ఇంత కాలం ఆయన రాజ్ ఠాక్రేను మాత్రమే అనుకరిస్తారని అనుకున్నా. కానీ నిన్న(మంగళవారం) శరద్ పవార్ నన్ను కూడా అనుకరించారు. ఆయన అలా చేయటం నిజంగా చాలా బాధ పెట్టింది’ అని అన్నారు.చదవండి: ‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’ -
‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’
ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్‌ను అనుకరించారు. శరద్ పవార్ ప్రసంగిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు....నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్‌కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్‌కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్ పవార్ పైవ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వటం గమనార్హం.చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్ -
మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్
ముంబై: గుజరాత్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయవల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. ‘‘రతన్ టాటా మహారాష్ట్రలో టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ రావాలని భావించారు. సంప్రదింపులు జరిపిన అనంతరం.. నాగ్‌పూర్ ఎంఐడీసీ ప్రాంతంలో 500 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించటం జరిగింది. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగింది. ఇందులో నేను కూడా భాగమయ్యాను. తర్వాత మా ప్రభుత్వం మారిపోయింది. ..అనంతరం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. రతన్ టాటాకు ఫోన్ చేసి ఒప్పించి గుజరాత్లో ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో వేల మందికి ఉద్యోగాలు లభించేవి. మహారాష్ట్ర కోసం ఉద్దేశించిన (సెమీకండక్టర్) ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ను మోదీ కోరడంతో మహారాష్ట్రలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానమంత్రి ఏ ఒక్క రాష్ట్రానికి చెందినవారు కాదు.. దేశం మొత్తం గురించి ఆలోచించాలి’’ అని అన్నారు. అయితే ప్రస్తుతానికి శరద్ పవార్ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.చదవండి: ఢిల్లీ.. 72 గంటలు డేంజర్ -
అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీనే గడియారం గుర్తును కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పార్టీ గుర్తు గడియారం చిహ్నాన్ని ఉపయోగించకుండా నిషేధం విధాంచాలంటూ శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని సుప్రీం ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దని సున్నిహితంగా హెచ్చరించింది. అంతేగాక అజిత్ వర్గం గత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, శరద్ పవార్ వర్గానికి నష్టం వాటిల్లకుండా చిహ్నాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే సుమోటోగా స్వీకరించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.కాగా 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అధికార మహాయుతి కూటమిలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చీలికత ర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాకుండా, ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించింది. శరద్ చంద్ర పవార్ వర్గానికి.. ‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’ గుర్తును ఈసీ ఖరారు చేసింది. -
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
90 ఏళ్లు వచ్చినా.. శ్రమిస్తా: శరద్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రను సరైన మార్గంలో నడిపించే వరకు తాను విశ్రమించబోనని తేల్చిచెప్పారు. తాను ప్రసంగిస్తున్న సభలో కొందరు యువకులు ‘84 ఏళ్లు’ అని ప్లకార్డులు చూపించడం పట్ల శరద్ పవార్ స్పందించారు.‘కొంతమంది యువకులు చేతుల్లో 84 ఏళ్ల బోర్డులతో నిలబడి ఉన్నారు. దానిపై నా ఫొటో ఉంది. నాకు 84 ఏళ్ల వయస్సు అని రాసి ఉంది. అయితే మీరు చింతించకండి. ఇప్పుడు మాకు ఉంది నాకు 84 ఏళ్లు వచ్చినా, 90 ఏళ్లు వచ్చినా.. ఈ వృద్ధుడు విశ్రమించడు’’ అని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల షేరింగ్ ఫార్ములాకు సంబంధించిన చర్చల సందర్భంగా మహా వికాస్ అఘాడి (MVA)నియోజకవర్గాల మధ్య విభేదాల ఊహాగానాలను తిరస్కరించారాయన.I'm 84 right now, I may even turn 90, but until Maharashtra comes back on the right track, I am not going anywhere - Sharad Pawar NCP Chief pic.twitter.com/xQpJBWiK5t— Ravi Kapur (@Kap57608111) October 15, 2024మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ( మంగళవారం) ప్రకటింనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
గడియారం గుర్తు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ పార్టీ చిహ్నం (గడియారం) గుర్తు కేటాయింపు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా’(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్ పవార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.ఇక.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్ పవార్ దాఖలుచేసిన పిటిషన్ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడెందుకు? ముందు ఎన్నికల్లో గెలుద్దాం
మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. డైలమాలో కాంగ్రెస్రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
పవార్‌కు ‘జడ్ ప్లస్’ భద్రత
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎప్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. వీఐపీ భద్రతలో జడ్ ప్లస్ అత్యధిక రక్షణ కవచం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన 83 ఏళ్ల శరద్ పవార్‌కు జడ్ ప్లస్ రక్షణను కలి్పంచాలని కేంద్ర హోంశాఖ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కోరింది. జడ్ ప్లస్ కేటగిరీ కింద 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కలి్పస్తారు. కేంద్ర ఏజెన్సీలు ముప్పును అంచనా వేసి.. శరద్ పవార్‌కు అత్యంత పటిష్టమైన భద్రతను కలి్పంచాలని సిఫారసు చేశాయి. -
మహారాష్ట్ర మరో మణిపూర్ కావొచ్చు: శరద్ పవార్ వ్యాఖ్యలు
ముంబై: మణిపూర్ తరహాలో హింసాత్మక ఘటనలు మహారాష్ట్రలో కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం అరికట్టలేకపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు.కాగా, శరద్ పవార్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మణిపూర్‌లో కుకులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు సముహాల జాతి హింసను పరిష్కరించడంతో కేంద్రం విఫలమైంది. అలాగే, మహారాష్ట్రలో కూడా మరాఠీలు, ఓబీసీ రిజర్వేషన్ల గురించి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మణిపూర్ తరహాలోనే మహారాష్ట్రలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంది. అయితే, ఎంతో మంది మహనీయులు మహారాష్ట్రలో సామరస్యాన్ని పెంపొందించారు. కాబట్టి అలాంటి ఘటనలు జరగకపోవచ్చు అనే అనుకుంటున్నాను. రిజర్వేషన్ల నిరసనలపై ప్రభుత్వం మరిన్ని చర్చలు జరపాలి. నిరసనకారులతో చర్చలు ఎందుకు జరపలేదు. ముఖ్యమంత్రి ఒక వర్గం వ్యక్తులతో మాట్లాడుతుండగా, ప్రభుత్వంలోని మరికొందరు వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో ఏడాది కాలంగా హింసా జరుగుతున్నా ఒక్కసారి కూడా మోదీ అక్కడికి వెళ్లలేదన్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించలేదని మండిపడ్డారు. తరతరాలుగా జీవనం కొనసాగిస్తూ, సామరస్యాన్ని కొనసాగిస్తున్న మణిపురీలు నేడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితికి కేంద్రం కూడా ఒక్క కారణమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బహిష్కరణకు గురైన వ్యక్తి హోంమంత్రా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘అవినీతికి కింగ్ పిన్’అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో సుప్రీంకోర్టు అమిత్ షాను గుజరాత్ నుంచి బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ..అటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి ముఖ్యమైన హోం శాఖకు మంత్రి అయ్యారంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎటు వెళ్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. అమిత్ షా దేశాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారని ఆరోపించారు. 2010లో సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా రెండేళ్లపాటు గుజరాత్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే, 2014లో ఈ కేసు నుంచి ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఇటీవల పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా.. ప్రతిపక్షాలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయితే దేశ రాజకీయాల్లో అతిపెద్ద అవినీతి రారాజు శరద్ పవార్ అంటూ వ్యాఖ్యానించడం తెల్సిందే. -
అమిత్‌షాకు శరద్ పవార్ ఘాటు కౌంటర్
ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు. ఇటీవల అమిత్‌షా ‘అవినితికి రారాజు’ అంటూ తనపై చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు షా దూరంగా ఉండాల్సి వచ్చిందని ఎదురుదాడికి దిగారు.“కొన్ని రోజుల క్రితం, హోం మంత్రి అమిత్ షా నాపై విమర్శలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేను కమాండర్ అని అన్నారు. కానీ విచిత్రమేమిటంటే, హోంమంత్రి అమిత్‌షా గుజరాత్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి. దీని వల్ల సుప్రీంకోర్టు అతన్ని గుజరాత్ నుంచి బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వ్యక్తి మనకు నేడు హోంమంత్రి. మనం ఎటువైపు వెళ్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ దేశం ఎవరి చేతుల్లో ఉందో వారు మనల్ని, మన దేశాన్ని తప్పు దారిలో తీసుకెళ్తారని నాకు వంద శాతం నమ్మకం ఉంది. మేము దీనిపై దృష్టి పెట్టాలి’అని అన్నారు.కాగా 2010లో అమిత్‌షా 2010లో రెండు సంవత్సరాలపాటు గుజరాత్‌నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ సమయంఓ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. అప్పటికే బీజేపీ నేత సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఆ ఎన్కౌంటర్ నకిలీదేనని అంగీకరించింది. అనంతరం అమిత్ షా సీబీఐకి దొరక్కుండా నాలుగు రోజులు కనిపించకుండాపోయారు. చార్జిషీట్ దాఖలవడంతో 2010 జులై 24న అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కోర్టు ఆయనకు గుజరాత్లో అడుగుపెట్టరాదన్న షరతుపై బెయిలు మంజూరు చేసింది. అప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా.. గత ఆదివారం పుణెలో అమిత్‌షా మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు. పవార్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో మళ్లీ బలం పుంజుకుని తాము ప్రభంజనం సృష్టించబోతున్నట్లు చెప్పారు. -
మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు
ముఖ్యమంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం అంశాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో విభేదాలు కనిపిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వీటి మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, మొత్తం 288 స్థానాలకు గానూ తలా 95 స్థానాల్లో పోటీ చేయాలనేది! కానీ ఉద్ధవ్ పార్టీ 150 సీట్లలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఎంవీఏ ముఖ్యమంత్రి ముఖం ఉద్ధవ్ అని ఆయన గ్రూపు ప్రతినిధి వ్యాఖ్యానించడమూ, అలాంటి ముఖం ఏదీ లేదని శరద్ పవార్ అనడమూ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేను ముఖ్యమంత్రి ముఖంగా చెబుతూ పోస్టర్లు వెలియడమూ కూటమి మధ్య జరగనున్న ఘర్షణను సంకేతిస్తున్నాయి.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు సాధించిన అధిక ఓట్ల శాతం, మహారాష్ట్రలో ప్రతిపక్షాల చేతిలో తుపాకి గుండులా పనిచేసింది. అది వారికి ఎంత విశ్వాసాన్ని కలిగించిందంటే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం గురించి, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ గురించి అనేక అంశాలపై పరస్పరం వివాదాలకు దిగుతూ కనిపిస్తున్నారు. ఎంఏవీ భాగస్వాములు ఇటీవల ముంబైలో మీడియా ముందు ఐక్యతా ముఖాన్ని ప్రదర్శించి ఉండవచ్చు; కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు ముంబై వంటి ముఖ్య నగరాల్లోని కీలక నియోజకవర్గాలపై కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు.‘ముఖ్యమంత్రి ముఖం’ ఎవరు?విధాన్ భవన్లో ఈ మంగళవారం కూటమిలో పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన పార్టీ, ఆకస్మికంగా పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్‌ను జూలై 12 నాటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయమని కోరింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం చూస్తే మహా వికాస్ అఘాడీకి కేవలం రెండు సీట్ల కోటా మాత్రమే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ కోటాలో ఒక సీటును ‘పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ)కి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఉద్ధవ్ 12వ తేదీన పోటీని అనివార్యం చేస్తూ తన సొంత అభ్యర్థి ఎంపికతో ముందుకు సాగారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజక వర్గంలో ఉద్ధవ్ తన పార్టీ పోటీ చేస్తుందని పట్టుబట్టారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మల్లయోధుడు చంద్రహర్ పాటిల్‌కు ఉద్ధవ్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ మంచి ఆధిక్యతతో గెలుపొందారు.రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఉద్ధవ్ కోరినట్లు శివసేన–ఉద్ధవ్ గ్రూపు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన కూటమి సమావేశంలో మహావికాస్ అఘాడిలోని ముూడు భాగస్వాములు ఒక్కొక్కటీ 95 స్థానాల్లో పోటీ చేస్తాయని విస్తృత అవగాహన ఉన్నప్పటికీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు 150 నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గత వారం శివసేన ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి పదవికి కూటమి తరపు అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వెంటనే, తమ కూటమిలో సీఎం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించబోమని స్పష్టతనిచ్చారు. ‘‘మేము కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బలంతో ఎన్నికల్లో పోరాడతాం. మా అందరికీ ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రస్తుతానికి సీఎం ముఖం అంటూ ఏమీ లేదు’’ అని శరద్ పవార్ పుణెలో మీడియాతో అన్నారు. ఈ ‘సీఎం ఫేస్’ విషయంపై భిన్నాభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే శరద్ పవార్ కూటమిలో విభేదాలు లేవని చెప్పడమే కాకుండా, ప్రతి విషయంపైనా కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం ఉందని అన్నారు.ఎవరు ఎక్కడ?అలాగే కాంగ్రెస్ పార్టీ, శివసేన– ఉద్ధవ్ ఠాకరే గ్రూపు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లేదా ఎంఎంఆర్ లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలో తమ ఉనికిని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, ఉద్ధవ్ ఇప్పుడు తనకు గరిష్ఠంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సీట్లు కావాలని పట్టుబట్టారు. ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌లలో తమ స్థావరాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, శివసేన–ఉద్ధవ్ గ్రూప్ కొంకణ్, థానే, మరాఠ్వాడా ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; కాంగ్రెస్ పార్టీ విదర్భ ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; ఇకపోతే, శరద్ పవార్ ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేకు చెందిన విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణను మొదలుపెట్టింది.లోక్‌సభ ఎన్నికల సమయంలో సాంగ్లీలో ఏమి జరిగిందో పునరావృతం కాకుండా పశ్చిమ మహారాష్ట్రలో కచ్చితమైన సీట్ల పంపకం గురించి తమ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూపుతో తెర వెనుక కమ్యూనికేషన్ ను ప్రారంభించిందని శరద్ పవార్–ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలూ కెమెరా ముందు పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ, సీట్ల పంపకాల చర్చల కోసం కూర్చున్నప్పుడు కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉందని లోపలి వ్యక్తులు అంటున్నారు. కూటమి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రం ఏమిటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజారిటీని పొందినట్లయితే, అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. విదర్భలో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. కాబట్టి, ‘కాబోయే ముఖ్యమంత్రి ముఖం’ అనే సమస్య కూటమి భాగస్వాములలో కొన్ని చీలికలను, ఒత్తిడిని కలిగిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ చందావర్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)