ఢిల్లీ: ఇండియా కూటమి తరుపున పీఎం అభ్యర్థిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1977 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి పేరును ఖరారు చేయకుండానే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై శరద్ పవార్ స్పందించారు.
'1977 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా అయ్యారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందే ప్రకటించకున్నా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త వ్యక్తులు ప్రధానిగా అయ్యారు.' అని పవార్ అన్నారు. అయితే.. ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కొన్ని పార్టీలు ఇప్పటికే సూచించాయి.
శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దీదీ పేర్కొన్న ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ కూడా సంతోషంగా లేదని అన్నారు. ఇండియా కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment