Kharge
-
కుంభమేళాకు వ్యతిరేకంగా కుట్రలు
ప్రయాగ్‌రాజ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు మహా కుంభమేళాలో భారీ విషాదం జరగాలని కోరుకున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న సనాతన ధర్మ వేడుకను చూసి దేశ ప్రజలు గర్వస్తున్నారని చెప్పారు. కొందరు దుష్టులు మాత్రం ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కుంభమేళా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.ఖర్గే, అఖిలేష్ యాదవ్‌లు పార్లమెంట్లో మాట్లాడిన మాటలు చూస్తే వారి అసలు అజెండా ఏమిటో తెలిసిపోయిందని అన్నారు. కుంభమేళాపై వారు మొదటి నుంచే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై అధికారులు ఇచ్చిన గణాంకాలనే తాను విడుదల చేశానని తెలిపారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందిన వెంటనే తమ ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు. విశ్వాసానికి, సనాతన ధర్మానికి కుంభమేళా ఒక ప్రతీక అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రజలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం పట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని గ్రూప్‌లు మహా కుంభమేళాను వ్యతిరేకిస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లోని జగద్గురు రమణానందాచార్య స్వామి రామ్ భద్రాచార్య క్యాంప్‌ను సందర్శించారు. 151 కుండ్లీ అఖండ్ భారత్ సంకల్ప్ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.మన విశ్వాసానికి, సనాతన ధర్మానికి మహా కుంభమేళా ఒక ప్రతీక అని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. మన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటుతున్న గొప్ప వేడుక అని అన్నారు. లక్షలాది మంది సాధువులు, యోగులు సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుతున్నారని చెప్పారు. మారీచులు, సుబాహులు మన సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. కుంభమేళాలో ఇప్పటిదాకా 38 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం
-
World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
2024కు త్వరలో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2025ను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ 2024లో మనకు కొన్ని మంచి అనుభవాలతోపాటు చేదు రుచులు కూడా ఎదురయ్యాయి. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రముఖలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటో, ఆ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.మల్లికార్జున్ ఖర్గేఈఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయన తన విమర్శల్లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్‌గా చేసుకున్నారు. ‘భారత్‌లో రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాంగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే వ్యాఖ్యానించారు. ‘అవి విషం లాంటివి. ఆ పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. అలాంటి విష సర్పాలను చంపేయాలి’ అని కూడా అన్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన ఖర్గే ఆయనను తైమూర్ లాంగ్‌తో పోల్చారు. 400 సీట్లు ఖాయమనే నినాదం అందుకున్న మోదీ ప్రభుత్వం అటు జేడీయూ, ఇటు టీడీపీల అండదండలపైనే ఆధారపడిందని ఖర్గే విమర్శించారు. అలాగే ప్రధాని మోదీని అబద్ధాల నేత అని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.లాలూ ప్రసాద్రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన విమర్శలతో ఈ ఏడాది హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన మహిళా సంవాద్ యాత్రపై విరుచుకుపడ్డారు. దీనిపై జేడీయూ, బీజేపీలు లాలూపై ప్రతివిమర్శలకు దిగాయి. ‘ఇంతకుముందు లాలూజీ శారీరకంగా మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు మానసికంగా కూడా అస్వస్థతకు గురయ్యారని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా లాలూ చేసిన వ్యాఖ్యానాలు చాలా అసహ్యకరమైనవి, అవమానకరమైనవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.రాహుల్ గాంధీరాహుల్ తన విదేశీ పర్యటనల సందర్భంగా భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రకటనలు చేశారు. వాషింగ్టన్లో రాహుల్ మాట్లాడుతూ భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదని రాహుల్ మరో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇవి పెను రాజకీయ దుమారాన్ని రేపాయి.గిరిరాజ్ సింగ్కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఛత్ పండుగ రోజున స్వచ్ఛత గురించి మాట్లాడుతూ సిమ్లాలోని ఒక మసీదు వివాదంపై వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. మనం ఐక్యంగా ఉంటే మహ్మద్ ఘోరీ, మొఘల్ లాంటివారెవరూ మనల్ని ఓడించలేరని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు.ఇల్తిజా ముఫ్తీఇల్తిజా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె. ఆమె ‘హిందుత్వం’ను ఒక వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇల్తిజా ముఫ్తీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ వివాదానికి తెరలేపారు.సామ్ పిట్రోడాలోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర భారత్‌లోని ప్రజలు తెల్లగా కనిపిస్తారని, తూర్పు భారత్‌లోని వారు చైనీయులుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణ భారత్ ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, పశ్చిమ భారతదేశ ప్రజలు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారన్నారు. సామ్ ప్రకటనపై దుమారం రేగడాన్ని చూసిన కాంగ్రెస్ వీటికి దూరంగా ఉంది. ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.భాయ్ జగ్తాప్కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ గతంలో ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎన్నికల కమిషన్ ఒక కుక్క.. ప్రధాని మోదీ బంగ్లా బయట కూర్చుని కాపలా కాస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఏజెన్సీలన్నీ ఇప్పుడు కీలుబొమ్మలుగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయి. వ్యవస్థను ఎలా తారుమారు చేస్తున్నారో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం -
మోదీ చర్యలతో ఈసీ సమగ్రతకు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మార్పులు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లోని రూల్ 93(2)(ఏ)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించడం తెలిసిందే. ఈ చర్య ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా ఖర్గే అభివర్ణిస్తూ ఆదివారం ‘ఎక్స్’లో పలు వ్యాఖ్యలు చేశారు.‘మోదీ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో చేసిన మార్పులు ఈసీ సమగ్రతకు భంగం కలిగించే ప్రణాళిక బద్ధమైన కుట్రలో భాగమే. ఈసీని నిరీ్వర్యం చేసేందుకు మోదీ గతంలో ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికల సమాచారాన్ని దాచిపెడుతున్నారు.ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు, ఈవీఎంల్లో పారదర్శకత లోపించండం వంటి అవకతవకలపై కాంగ్రెస్ ఈసీకి లేఖలు రాసిన ప్రతీసారీ కించపరిచే ధోరణితో స్పందించింది. తీవ్రమైన ఫిర్యాదులను కనీసం స్వీకరించనూలేదు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఈసీ సమగ్రతను దెబ్బ తీయడమంటే, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం ప్రత్యక్షంగా దాడి చేయడమే. దీన్ని అడ్డుకుని తీరతాం’’ అన్నారు. -
‘అంబేద్కర్‌కు అవమానం..’ షా వర్సెస్ ఖర్గే
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్ షా వ్యాఖ్యలపై బుధవారం(డిసెంబర్ 18) తొలుత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేయగా రాహుల్‌గాంధీ ఒత్తిడితోడే ఖర్గే మాట్లాడుతున్నారని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే అమిత్ షాను వెంటనే తొలగించాలి: ఖర్గే షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల దేశానికి క్షమాపణ చెప్పాలిప్రధాని మోదీకి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే షాను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలిబీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు మనుస్మృతినే వారు నమ్ముతారు అంబేద్కర్ కులం గురించి ఎప్పుడు మాట్లాడలేదుపేదల తరపున అంబేద్కర్ గొంతెత్తారుఅంబేద్కర్ను కొందరికి పరిమితం చేయడం సరికాదు #WATCH | Delhi: On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress president Mallikarjun Kharge says, "Our demand is that Amit Shah should apologize and if PM Modi has faith in Dr Babasaheb Ambedkar then he should be sacked by midnight... He has… pic.twitter.com/uKoMZqj8F4— ANI (@ANI) December 18, 2024నా మాటలు ఎడిట్ చేసి వక్రీకరించారు: అమిత్ షా అంబేద్కర్ పై నా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది.దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.నేను మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి వక్రీకరించారు.అంబేద్కర్ ను, ఆయన సిద్ధాంతాలను కలలో కూడా మేము వ్యతిరేకించలేదు.అంబేద్కర్ అంటే మాకు అపారమైన గౌరవం.నేను రాజ్యసభలో మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి.గతంలో నా మాటలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది.మా ప్రభుత్వం రిజర్వేషన్లను బలపరిచింది. రాజీవ్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేశారు.రాహుల్ గాంధీ ఒత్తిడితో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అంబేద్కర్‌ను అవమానించింది#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "...When the discussion was going on in the Parliament, it was proved how the Congress opposed Baba Saheb Ambedkar. How the Congress tried to make fun of Baba Saheb even after his death... As far as giving Bharat Ratna is… pic.twitter.com/rzMAU3mzNg— ANI (@ANI) December 18, 2024 -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
-
అతిపెద్ద అధికార ప్రతినిధి ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్ ధన్‌ఖడ్ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి అతిపెద్ద అధికారి ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ధన్‌ఖడ్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు అందజేయడం తెల్సిందే. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తోటి విపక్షాల ‘ఇండియా’ కూటమి ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ధన్‌ఖడ్ ఒక ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు. సీనియర్ పార్లమెంటేరియన్లకూ పాఠశాల ప్రధానోధ్యాయునిలా ధన్‌ఖడ్ క్లాసులు పీకుతున్నారు. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనివ్వట్లేదు. సభ సజావుగా సాగకుండా అడ్డు తగిలే అతిపెద్ద అవరోధం ధన్‌ఖడ్. ఆయన చూపే వివక్ష చూసి విసుగెత్తిపోయాం. ఆయన వైఖరి, ధోరణి సైతం విపక్షాలకు అనుకూలంగా లేదు. అందుకే ఆయనను తొలగించాలని నోటీస్ ఇచ్చాం. రాజ్యసభ నియమ నిబంధనావళిని తుంగలో తొక్కి రాజకీయాలు ముందంజలోకి వచ్చాయి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ధన్‌ఖడ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత మరేదో పదోన్నతి వస్తుందన్న ఆశతో పనిచేస్తున్న అతిపెద్ద అధికార ప్రతినిధిలా ఆయన వాలకం ఉంది. ఆయన తన వైఖరితో రాజ్యసభకు ఉన్న ప్రతిష్టను, పరువును దెబ్బతీస్తున్నారు. మాకు ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపాలు లేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నాం’’ అని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి: డీఎంకే‘‘ ఛైర్మన్ ద్వారా బీజేపీ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి స్పష్టంగా ప్రజాస్వామ్యంపై దాడే’’ అని డీఎంకే నేత తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యసభలో విపక్ష సభ్యుల గొంతుక వినిపించే అవకాశం చిక్కట్లేదు’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్ అన్నారు. ‘‘ చైర్మన్ రాజ్యసభను నడుపుతున్నట్లు లేదు ఒక సర్కస్‌ను నడుపుతున్నట్లు ఉంది. ఉన్న సమయమంతా ఆయన తన సొంత విషయాలు మాట్లాడటానికే సరిపోతోంది. ఉన్న కాస్తంత సమయాన్ని ఆయనే వృథాచేస్తారు’’ అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదీ చదవండి: ధన్‌ఖఢ్‌పై అవిశ్వాసం -
5న రాష్ట్రానికి రాహుల్, ఖర్గే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరో తేదీ నుంచి నిర్వహించనున్న కులగణనపై మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే సమావేశానికి రాహుల్ హాజరవుతారని, ఇదే సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించామని చెప్పారు.వీలును బట్టి ఆయన కూడా హాజరవుతారని వెల్లడించారు. కులగణన కోసం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కనెక్ట్ సెంటర్‌ను పార్టీ నేతలతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలని అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాగం కావాలని పిలుపునిచ్చారు. కులగణనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేప డుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కనెక్ట్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. కులగణన ఎక్కడా బ్రేక్ లేకుండా నిష్పక్షపాతంగా, సజావుగా జరగాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతుందని చెప్పారు.మహేశ్వర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, బీజేపీలో ఆయనకు కుర్చీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని తెలిపారు. ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు అమలు చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఎక్కడ అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బుల్డోజర్’ ప్రభుత్వంగా మారొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.అదే తరహా బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్‌రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. ఆ చెడ్డపేరు మనకొద్దు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దసరాకు ముందే.. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. -
సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత
జమ్మూ:కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వేదికపైనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(సెప్టెంబర్29) జమ్మూకాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఆయన కళ్లుతిరిగి కిందపడబోయారు.దీంతో అక్కడున్న నేతలు వెంటనే ఖర్గేను పడకుండా పట్టుకున్నారు.తర్వాత ఆయనకు నీళ్లందించారు. అనంతరం ఖర్గే తన ప్రరసంగాన్ని కొనసాగించారు.ప్రసంగిస్తుండగా పార్టీ నేతలు ఆయనను పట్టుకొని నిల్చున్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు. తాను అప్పుడే చనిపోనని,మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని సవాల్ చేశారు.అయితే ఖర్గే వేదికపైనుంచి కిందపడబోయిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా,జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 5 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.ఇదీచదవండి: పదేళ్ల మన్‌కీ బాత్‌లో ప్రధాని భావోద్వేగం -
రాష్ట్రాన్ని మరో బుల్డోజర్ రాజ్ కానివ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించా లని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయా న్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అని ప్ర శ్నించారు.ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ‘ఒక రి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్ర యులుగా మార్చటం అమానవీయం, అన్యాయం అని గతంలో మీరే అన్నారు. ఇప్పుడు తెలంగాణలో పేదల ఇళ్లను అదే రీతిలో కూల్చే స్తూ వారిని నిరాశ్రయులు చేస్తు న్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ‘ అని ప్రశ్నించారు.పేదల జీవితాలను ఆగం చేస్తోన్న కాంగ్రెస్మహబూబ్నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేసిన 75 ఇళ్లలో 25 నివాసాలు వికలాంగులకు చెందినవేనని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటమనేది చట్టపరంగా సరైన విధానం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నుంచే ఇళ్లు కట్టుకొని నివాసం ఉన్న పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం ఎంతటి అమానవీయమో ఖర్గే చెప్పాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను కాంగ్రెస్ ప్రభు త్వం ఆగం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. -
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్‌లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్‌లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
‘టీపీసీసీ కొత్త అధ్యక్షుడిపై’ నిర్ణయం తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జునఖర్గేను కోరారు. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ఖర్గేతో రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీకి కొత్త «అధ్యక్షుడిగా ఎవరిని నియ మించినా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ చెప్పినట్టు సమాచారం.త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర ఆంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. పదవుల భర్తీల్లో భాగంగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశా లపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం. రైతు రుణమా ఫీ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ, సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించి, ఆహ్వానించినట్టు తెలిసింది. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రేవంత్‌తో సింఘ్వీ భేటీసాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించాక మొదటిసారి ఉభయులూ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 21న నామినేషన్ దాఖలు సహా వివిధ అంశాలపై లోతుగా చర్చించినట్టు అభిషేక్ మను సింఘ్వీ ట్వీట్ చేశారు. -
22న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ మాధవి పురీ బుచ్, ఆమె భర్త ధవళ్‌కు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన సంచలన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వివాదంలో కేంద్ర బిందువుగా మారిన మాధవి వెంటనే రాజీనామా చేయాలని, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచి్చంది.ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు, పీపీసీ చీఫ్‌లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత పార్టీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సమావేశంలో రాబోయే ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత, సంస్థాగత అంశాలు, ఎన్నికలపరంగా జాతీయ ప్రాముఖ్యత గల వివిధ అంశాలు, సమస్యలపై ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించారు. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశీ్మర్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ‘‘అదానీ– మాధవి బుచ్ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది. ఒక సంస్థ ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ఎంతగా ప్రలోభాలకు గురైందో ఈ ఉదంతం చాటుతోంది’’ అని నేతలు భేటీలో తీర్మానం చేశారు. భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హిండెన్‌బర్గ్ ఉదంతం సహా దేశంలోని పలు సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అందుకుతగ్గ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కేరళ వయనాడ్ కొండల్లో ప్రకృతి విలయతాండవం ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై సమావేశం తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేసింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్ డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న బాధిత మైనారిటీలు గౌరవంగా బతికేలా తగు సహాయక, పునరావాస చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పేదలు, మధ్యతరగతిని వంచించారు: ఖర్గే ‘‘స్టాక్మార్కెట్లో చిన్న మదుపరుల పెట్టుబడుల భవితవ్యం అగమ్యగోచరం కాకూడదు. హిండెన్‌బర్గ్ బట్టబయలుచేసిన సెబీ, అదానీల ఉదంతం యావత్భారతావనికి షాక్‌కు గురిచేసింది. సెబీ, అదానీ సంబంధాలను బయటపెట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేతృత్వంలో దర్యాప్తు జరపాల్సిందే. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది.కుల గణన అనేది ప్రజల డిమాండ్. ఈ అంశాలపై త్వరలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను చేపడదాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాల్సిందే. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, పగ్గాల్లేని ద్రవ్యోల్బణంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతిని ప్రభుత్వం వంచించింది. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి’’ అని ఖర్గే అన్నారు. -
‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.వెంటనే చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కేవలం బిహార్, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్ ఖర్గేతో అన్నారు. మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్‌ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. -
ఖర్గేకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు నేడు(జూలై 21). ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఖర్గే 1942 జూలై 21న జన్మించారు. కర్నాటకకు చెందిన దళిత నేత అయిన ఖర్గే సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలు కీలక పదవులు చేపట్టారు. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబయేతర తొలి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఖర్గే నిలిచారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున్ ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అణగారిన, పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఖర్గే కృషి చేశారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. Birthday wishes to Congress President and the Leader of Opposition in the Rajya Sabha, Shri Mallikarjun Kharge Ji. Praying for his long and healthy life. @kharge— Narendra Modi (@narendramodi) July 21, 2024 -
సీట్లు తగ్గడానికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై వారం రోజుల్లోగా ఏఐసీసీ నాయకత్వం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై ఒకింత అసహనంగా ఉన్న హైకమాండ్ దీనికి బాధ్యులెవరని గుర్తించడంతో పాటు ఓటమికి కారణాలను సూక్ష్మ స్థాయిలో పరీశీలన చేయనుంది.దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలతో రావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ కబురు పంపినట్లు తెలిసింది. నిజానికి రాష్ట్రంలో కనీసంగా 14 సీట్లు గెలవాలని ఏఐసీసీ లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీకి సైతం 8 స్థానాలు దక్కాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ స్థాయి వైఫల్యాలపై ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.గెలవాల్సిన రాష్ట్రాల్లోనూ పార్టీ మెరుగైన సీట్లు సాధించలేకపోయిందని తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తావించారు. ఈ రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక ఫలితాలను ఖర్గే, రాహుల్‌గాంధీ సమీక్షించారు. కేబినెట్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే మాదిరి సమీక్ష తెలంగాణలోని ఓటమి చెందిన నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలో సరైన ఫలితాలు రాలేదు: ఖర్గే అసంతృప్తి
సాక్షి,ఢిల్లీ: పార్టీ పవర్లో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం(జూన్8) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.‘అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మంచి ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. అర్జెంటుగా వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలి. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టుకోవాలి. నిరంకుషత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి’అని ఖర్గే అన్నారు. -
ఎన్నికల్లో పోటీ వారి మధ్యే: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్నా: ముస్లింల ఓటు బ్యాంకు ముందు ఇండియా కూటమి అవసరమైతే ముజ్రా డ్యాన్స్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రధాని బిహార్‌ను అవమానించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున బిహార్‌లోని ససరంలో ఆదివారం(మే26) ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఖర్గే మాట్లాడారు.ప్రధాని తనను తాను తీస్మార్ఖాన్ అనుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలే తీస్మార్ఖాన్లని గుర్తుంచుకోవాలన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఏమీ మాట్లాడటానికి కూడా ఉండదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రజలు వర్సెస్ మోదీయే తప్ప రాహుల్ వర్సెస్ మోదీ కానే కాదన్నారు. -
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు. -
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
ముంబై: రామమందిరంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ముంబైలో శనివారం(మే 18) ఖర్గే మీడియాతో మాట్లాడారు.‘ప్రధాని మోదీ రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను రెచ్చగొడుతున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ఎక్కిస్తారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు మేం బుల్డోజర్ పదాన్ని ఎక్కడా వాడలేదు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారిపై ఎన్నికల కమిషన్(ఈసీ) చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటిని కాపాడతాం. మేం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం’ అని ఖర్గే తెలిపారు. -
బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ’’బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది.. ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడుతుంది.. రిజర్వేషన్లు పోతా యి, ప్రజల ప్రాథమిక హక్కులనూ తొలగిస్తా రు’’ అని ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి, మోదీకి ఒక్కసీటు కూడా రావద్దని, వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం రక్షించే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగం రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతు న్నాయన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుతంత్రాలు పన్నుతాయని ధ్వజమెత్తారు.అదానీ, అంబానీలపై ఐటీ దాడులు చేయించగలరా?మోదీ దేశాన్ని ధనవంతులైన తన మిత్రులకు ప్రభుత్వరంగ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నా రని ఖర్గే ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టి తిరిగి కాంగ్రెస్‌పైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీ ట్రక్కులు, టెంపోలలో డబ్బులు పంపుతున్నా రని అమిత్‌షా, మోదీ మాట్లాడుతున్నారని, వా రు డబ్బులు పంపిస్తుంటే మరి మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలని ఖర్గే సవాల్ విసిరారు. ఆటో డ్రైవర్లుకు ఏటా రూ.12 వేలిస్తాంతెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని ఖర్గే వెల్లడించారు. ఉచిత బస్ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామ ని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా మన్నారు. ఆటో వారికి ఏటా రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. కులగణన తరువాత కుటుంబ యజమాని అయిన మహిళల ఖాతాలో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.ఇవన్నీ నెరవేరాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు పాల్గొన్నారు.ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదుఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బంద్ కావడం ఖాయమని ఖర్గే జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారు స్తామని చెప్పినా దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. -
అబద్ధాల మోదీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, 500 సిలిండర్, 200 ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పటికే ప్రారంభించాం. మిగిలిన ఒకటి కూడా త్వరలోనే ప్రారంభి స్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే ప్రకటించారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీల అమలు తాత్కాలికంగా ఆగిందని, కోడ్ ముగియగానే అమలు చేస్తామని చెప్పారు.తాము తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన వాగ్దానా లను అమలు చేస్తూ పోతున్నామని, బీజేపీ ఎన్ని కల మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా, కాంగ్రెస్‌ను తిట్టడంపైనే ఫోకస్ చేసిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మల్లి కార్జున ఖర్గే తాజ్‌కృష్ణలో విలేకరులతో మాట్లా డారు. పూర్తి వివరాలు ఆయన మాట్లల్లోనే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. ఐదేళ్లపాటు అద్భుతపాలన అందిస్తాం. మీ సీబీఐ ఏం చేస్తోంది..?జనగణనను మోదీ బయటపెట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, పిల్లలు ఎందరున్నారు? వారి స్థితిగతులేంటి? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఏ సంక్షేమ పథకాలు చేపట్టాలి? విద్య, వైద్యం పరిస్థితి ఏంటీ? అయితే మోదీ సర్కారు ఈ గణాంకాలను దాచిపెడుతోంది. మోదీ అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారు. అదానీ, అంబానీలు రాహుల్‌గాంధీకి టెంపోలో డబ్బులు పంపిస్తున్నారని మోదీ ఆరోపిస్తున్నారు.మీ సీబీఐ ఏమైంది..ఈడీ, ఆదాయపు పన్నుశాఖ ఏం చేస్తోంది? కావాలంటే విచారణ జరిపించు. ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కేంద్రం.. అసలు అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదో మోదీకే తెలియాలి. వారితో అమిత్‌షా ఎప్పుడూ కలిసే తిరుగుతారు. 50 కోట్ల మంది వద్ద ఎంత సంపద ఉందో ఆ ఇద్దరి వద్ద అంత ఉంది.దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు‘మోదీ, అమిత్‌షా ఆందోళనలో ఉన్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయమని మోదీ అడగం లేదు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనారిటీలు లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానిని ఇంత వరకు ఎవరూ చూసి ఉండరు. కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే మమల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పథకాలు..‘ఆలిండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలెందరో చెప్పడం లేదు. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులిస్తాం. మహిళలకు 50%... జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం. మహాలక్ష్మీ యోజన కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తాం. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతుకు కనీస మద్దతు ధర ఇస్తాం. పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదు. దేశరాజధాని స్థాయిలో హైదరా బాద్‌లో అభివృద్ధి జరగాల్సి ఉండగా, ఆ మేరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.హైదరాబాద్, బెంగళూరు, ముంబైలను పక్కకు పెట్టి అన్నీ ఒక్క గుజరాత్‌కే తరలిస్తే ఎంతవరకు సమంజసం. చేయిని తీసివేయడం ఎవరికీ సాధ్యం కాదు. మరోసారి నొక్కి చెబుతున్న హామీలన్నీ అమలు చేసి తీరుతాం’ అని మల్లికార్జున ఖర్గే వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్‌మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మధు యాష్కీగౌడ్, జబీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
జాతీయ కాంగ్రెస్‌లో అమేథీ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. యూపీలోని అమేథీ నుంచి ఎవరిని ఎన్నికల బరిలో నిలపాలనేదానిపై ఢిల్లీ కాంగ్రెస్ దర్బార్‌లో సమావేశం జరిగి 72 గంటలు గడిచినా, ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. త్వరలోనే అమేథీ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.అమేథీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే 2019లో ఈ మ్యాజిక్‌ను స్మృతి ఇరానీ బద్దలు కొట్టారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెసేతర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నామినేషన్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియక స్థానిక పార్టీ నేతలు అయోమయంలో కూరుకుపోయారు. అమేథీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్, ఎస్పీల సమన్వయ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందన్నారు. మే 3న రాష్ట్ర ఇన్చార్జి వస్తారని తెలిపారు. అప్పుడు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.వయనాడ్ ఎన్నికల తర్వాత రాహుల్ అమేథీకి వచ్చే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నిశ్శబ్ధం కొనసాగుతోంది. ఇదేసమయంలో ఖర్గే చేసిన ప్రకటన ఇంకేదో సూచిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న వరుణ్.. అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
విజయపతాక ఎగరేయాలి
బెంగళూరు: వచ్చే ఐదేళ్ల భారతావని దశ, దిశను నిర్ధేశించే ఎన్నికల రణరంగంలో విజయబావుటాను ఎగరేశాకే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది వెల్లడిస్తామని కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ గెలిచాక వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన పథకాలు, పనుల పట్టికలను ముందుగానే సిద్ధంచేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను పిలిపించి పనులు పురమాయిస్తున్నారు. గెలవకముందే ఆయన చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈయన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం మంచిదికాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ధరవరలను కిందకు దించేలా మేం తెచ్చిన పలు పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను జనం మెచ్చారు. మా గ్యారెంటీ స్కీమ్‌లు ఇదే విషయాన్ని నిరూపించాయి కూడా. అందుకే మా గ్యారెంటీ పథకాలపై ఓటర్లు దృష్టిపెట్టారు’’ అని అన్నారు. ఈసారి ఎన్ డీఏ కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని మోదీ ముందే ప్రకటించిన విషయాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించగా.. ‘‘ ఇంకా నయం. ఆయన ఈసారి 600 సీట్లు మావే అనలేదు. ఇంతటి అతి అత్యాశతో చేసే వ్యాఖ్యానాలు వింటుంటే దేశంలో విపక్షమే లేదు.. అంతా నేనే అన్నట్లుగా ఉంది మోదీ వైఖరి’’ అని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు. ఆనాడూ వెలిగిపోతుందన్నారు ‘‘ 2004లోనూ ఇదే సీన్ కనిపించింది. భారత్ వెలిగిపోతోంది(ఇండియా ఈజ్ షైనింగ్) అంటూ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలు, నినాదాలతో నాటి బీజేపీ సర్కార్ మోతెక్కించింది. వాజ్‌పేయీ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడు అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఏమైంది?. మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. మన్మోహన్ మెరుగైన ప్రధానిగా నిరూపించుకున్నారు’’ అని చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీకి టైం ఉంది ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ ఆ స్థానాల్లో పోలింగ్ తర్వాతి ఫేజ్‌లలో ఉందిగా. ఇంకా సమయం ఉంది. ఇప్పుడే చెప్పేస్తే రాజకీయ సర్ప్రైజ్ ఏముంటుంది?. ఫీడ్‌బ్యాక్ తీసుకుని అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది తర్వాత వెల్లడిస్తాం. అందరి సమ్మతితోనే కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఉంటాయి. మోదీలాగా అందరి తరఫున ఇక్కడ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు’’ అని అన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో పారదర్శకత లోపించింది. ఒక్క బీజేపీనే భారీగా లాభపడింది. పారిశ్రామికవేత్తలు, సంస్థలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారు. ‘ చందా ఇచ్చుకో. దందా పుచ్చుకో’ అన్న సూత్రం పాటించారు. చేతులు వెనక్కి మెలిపెట్టి మరీ డబ్బులు తీసుకుని ఇప్పుడు పారదర్శకత ఉంది అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే ‘‘కుల, మత, ప్రాంత, వర్ణ ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ విభజిస్తున్నారు. నిజానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ఒక్క బీజేపీ నేతనైనా చూపించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఒక్కరైనా దేశం కోసం పోరాడారా?’ అని ఖర్గే ఎద్దేవాచేశారు. సమాలోచనలతోనే సారథి ఎంపిక ‘‘ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చాక విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. ఈసారి నేను పోటీ చేయట్లేదు. గుల్బర్గా(కలబురిగి) సీటు వేరే వాళ్లకు ఇచ్చేశారు’ అని తాను ప్రధాని రేసులో లేనని పరోక్షంగా చెప్పారు. గుల్బర్గా(కలబురిగి) నుంచి ఈసారి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు ఖర్గే ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. -
తుక్కుగూడ నుంచే శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలసివచ్చిన తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని సమాచారం. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని, మేనిఫెస్టో తెలుగు ప్రతులను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ సభ నిర్వహణ కంటే ముందే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభ అనంతరం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఆయన బస్సులో ప్రచార యాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, బస్సు యాత్ర చేయాలా? అలా వెళ్తే ఎంత మంది నేతలు వెళ్లాలి? లేదా ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు పెట్టి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలా అన్న దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్‌లో లొల్లి..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ టికెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో లొల్లి రేపుతోంది. ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్‌కు (ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే), చేవెళ్ల టికెట్ గడ్డం రంజిత్‌రెడ్డి (బీఆర్ఎస్ ఎంపీ)కి, మల్కాజ్గిరి టికెట్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి (వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్)లకు ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పునఃసమీక్షించాలని పలువురు నేతలు అంతర్గతంగా కోరుతుండగా, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ మాల సామాజిక వర్గానికి చెందినవారికే టికెట్ ఇవ్వడం పట్ల మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మితోపాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ కేడర్‌ను అవమానపరిచినట్టే! ఇటీవలే పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపర్చినట్టేనని, వారిని నైతికంగా దెబ్బతీస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ‘‘తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు. ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధం. ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు, కేడర్‌కు ఎలాంటి సంకేతాలు పంపుతాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీకి విధేయులుగా ఉండేవారికి టికెట్లు ఇవ్వండి’’ అని లేఖలో కోరారు. రిజర్వుడ్ సీట్ల వ్యవహారంలోనూ.. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం కూడా కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ సీట్లను మాల సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడంపై మాదిగ సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి వంటి మాదిగ సామాజిక వర్గం నేతలు ఈసారి లోక్‌సభ టికెట్లను ఆశించారు. కానీ వారికి ఇవ్వకుండా ఇద్దరు మాల సామాజికవర్గ నేతలకు ఇవ్వడంపై వారు నిరాశలో ఉన్నారని సమాచారం. ఇక నాగర్‌కర్నూల్ టికెట్ పొందిన సీనియర్ నేత మల్లు రవి శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నివాసానికి వెళ్లారు. తనకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. టికెట్ దక్కిన మల్లు రవిని అభినందించిన సంపత్.. మంచి మెజార్టీతో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఇద్దరినీ తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లారు. వీరితో చాలా సేపు సమావేశమైన రేవంత్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. 28 తర్వాతేనా? కాంగ్రెస్ ఇంకా ఖమ్మం, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఖరారుపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈనెల 28 తర్వాత ఢిల్లీలో భేటీకానుంది. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ భేటీలో పాల్గొంటారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు ఆ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిసింది. -
ఖర్గేపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం !
న్యూఢిల్లీ: భారతరత్న మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతుండగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరణ్‌సింగ్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. తన తాతకు అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై మనవడు జయంత్ చౌదరి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జయంత్ మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుకున్నారు. ‘భారతరత్న పొందిన నాయకులపై సభలో ప్రస్తుతం చర్చ జరగడం లేదు. ఇప్పుడు జయంత్ ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అనుమతిని మాకూ ఇవ్వండి. మేమూ వినియోగించుకుంటాం. రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలి’అని ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఖర్గే వ్యాఖ్యలపై జగదీప్ ఆగ్రహానికి గురయ్యారు. చరణ్‌సింగ్‌ను అవమానించి ప్రతి రైతును బాధపెట్టారన్నారు. ఈ చర్యతో అందరూ సిగ్గుతో తల దించుకోవాలన్నారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ భారతరత్న పొందిన పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్ ముగ్గురికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఇదీ చదవండి.. ప్రజల్లో విశ్వాసం పెరిగింది -
కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కాంగ్రెస్ విడుదల చేసిన 'బ్లాక్ పేపర్'ను ప్రధాని మోదీ దిష్టిచుక్కగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై చెడుచూపు పడకుండా చూస్తుందని అన్నారు. ప్రతిపక్షాల ఇటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించిందని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే 'బ్లాక్ పేపర్' విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నేడు 'శ్వేతపత్రం'ను విడుదల చేయనుంది. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. కేంద్రం ఆర్థిక వ్యవస్థపై విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలు వంటి కేంద్రం వైఫల్యాలను 'బ్లాక్ పేపర్' లో పేర్కొన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బ్లాక్ పేపర్ విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ పేపర్ విడుదల చేస్తున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడినప్పుడల్లా కేంద్రం విజయాల గురించే మాట్లాడుతారు. కానీ సొంత వైఫల్యాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ వైఫల్యాల్ని మాట్లాడటానికి కూడా మమ్మల్ని అనుమతించరు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య.. కానీ కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదు.” అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇదీ చదవండి: మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు -
ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్
ముంబయి: ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిని ముందు ప్రకటించాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. కూటమి పేరుతోనే ఓట్లు అడగాలని శరద్ పవార్ పేర్కొన్నారు. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా మారగలదని చెప్పారు. ఇండియా కూటమి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవార్.. "కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇండియా పేరుతో ఓట్లు అడగాలని నేను నమ్ముతున్నా. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయాన్ని అందించగలదు." అని శరద్ పవార్ అన్నారు. మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి అయినప్పుడు జరిగిన రాజకీయ మార్పులను కూడా పవార్ ప్రస్తావించారు. ఆనాటి ఎన్నికలకు ముందు జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థి, లోక్‌సభ సీట్ల పంపిణీపై వచ్చిన కొన్ని నివేదికలను తోసిపుచ్చుతూ "కూటమి సమూహంలో ఎలాంటి అసంతృప్తి లేదు" అని స్పష్టం చేశారు. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేయడంపై పవార్ మాట్లాడుతూ.. "ఇండియా కూటమి అధ్యక్షుడిగా ఖర్గే ఉండాలని కొందరు నేతలు సూచించారు. చాలా మంది అందుకు అంగీకరించారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రతిపాదించారు. అయితే.. అందుకు నితీష్ కుమార్ తిరస్కరించారు. ప్రస్తుతానికి అది అవసరం లేదు". అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
ప్రధానిగా ఖర్గే పేరు.... ఇండియా కూటమిలో చీలిక?
ఢిల్లీ: ఇండియా కూటమి తరుపున పీఎం అభ్యర్థిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1977 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి పేరును ఖరారు చేయకుండానే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై శరద్ పవార్ స్పందించారు. '1977 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా అయ్యారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందే ప్రకటించకున్నా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త వ్యక్తులు ప్రధానిగా అయ్యారు.' అని పవార్ అన్నారు. అయితే.. ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కొన్ని పార్టీలు ఇప్పటికే సూచించాయి. శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దీదీ పేర్కొన్న ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ కూడా సంతోషంగా లేదని అన్నారు. ఇండియా కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు -
ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే.. నితీష్‌కు రాహుల్ ఫోన్
ఢిల్లీ: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఫోన్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దేశానికి తొలి దళిత వ్యక్తిని పీఎంగా ప్రకటించిన ఘనత కూడా దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనను ఎమ్‌డీఎమ్‌కే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు మద్దతు పలికారు. ఫోన్ కాల్ సందర్భంగా ఇండియా కూటమి బలాబలాలపై రాహుల్, నితీష్ కుమార్ చర్చించుకున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన తనకు తెలియదని నితీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే క్రమంలో బిహార్ కేబినెట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ హామీ ఇచ్చారు. కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతి త్వరలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ గురువారం తెలిపింది. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0(తూర్పు-పశ్చిమం) చేయాలని ఈ సమావేశంలోనే నేతలు కోరారు. ఈ భేటీలో పాల్గొన్న 76 మంది నేతలు దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై చర్చించారు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. -
ప్రముఖుల దూరం.. ఇండియా కూటమి భేటీ వాయిదా
ఢిల్లీ: దేశ రాజధానిలో రేపు జరగనున్న ఇండియా కూటమి భేటీని వాయిదా వేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖులు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు తమ బదులుగా పార్టీ నుంచి ఇతర సభ్యులను పంపుతామని ఇప్పటికే ప్రకటించారు. "ఇండియా కూటమి సమావేశానికి అఖలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన లేదు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ లేదా అఖిలేష్ సూచించిన ఇతర నేత ఎవరైనా సమావేశానికి వెళతారు" అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అటు.. జేడీయూ నుంచి పార్టీ చీఫ్ లాలన్ సింగ్, బిహార్ నీటి వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఘా సమావేశానికి హాజరుకానున్నారు. ఇండియా కూటమి భేటీకి తాను కూడా హాజరు కాలేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే తెలిపారు. ఉత్తర బెంగాల్లో పర్యటించాల్సిన ఇతర షెడ్యూల్‌ను సూచిస్తూ భేటీకి దూరంగా ఉన్నారు. మిచౌంగ్ తుపానుతో చెన్నై ఎయిర్‌పోర్టు బంద్ అయిన కారణంగా తాను రాలేనని సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి కనీసం దరిదాపుల్లో కూడా లేని స్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండటం కీలక సంకేతాలను అందిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరును కూడా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
TS:ఖర్గేతో డీకే శివకుమార్ కీలక భేటీ... సీఎం ఫైనల్ అయ్యే ఛాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసలంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఉత్తమ్, భట్టిలతో జరిగిన సమావేశ వివరాలపై డీకే ఏఐసీసీ చీఫ్‌కు నివేదిక అందించారు. సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకేఎస్ మీడయాతో మాట్లాడారు. ‘తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్‌గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ చెప్పారు. అంతకముందు హైదరాబాద్ నుంచి ఇవాళే ఢిల్లీకి వచ్చిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో డీకే శివకుమార్, ఠాక్రేలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై వారిరువురి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా, ఉదయం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలోగా సీఎం ఎంపిక ఉంటుందనేదానిపై క్లారిటీ ఇచ్చారు. సాయంత్రంలోగా సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర! -
TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? కొత్త మంత్రులు ఎవరనేదానిపై ఉత్కంఠకు ఇవాళ తెరపడే ఛాన్సుంది. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు. కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర! -
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
కాంగ్రెస్‌కు సంబంధం లేదు
నర్సాపూర్: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, పేపర్‌లీక్ తదితర స్కామ్‌ల ద్వారా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. -
ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు!
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నిరాశ ఎదురయ్యింది. ఈ నెల 17న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఈరోజే (నవంబరు15) చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తించాయి. ఈరోజు బేతుల్ జిల్లా ఆమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారధ్యంలో బహిరంగ సభ, ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిముషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సివచ్చింది. మల్లికార్జున ఖర్గే బుధవారం ఉదయం 11.20 గంటలకు ఆమ్లాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉందని, అయితే హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా బహిరంగ సభ రద్దు అయ్యిందని స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. బెరాసియా, భోపాల్‌లలో జరిగే ర్యాలీలలో కూడా ఖర్గే పాల్గొనాల్సి ఉందని ఆయన తెలిపారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్ రద్దు! -
‘70 గంటల పని’పై ప్రియాంక్ ఖర్గే ఏమన్నారంటే?
అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందన్న ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. సంస్థలు ఎట్టిపరిస్థితుల్లో అదనపు గంటలు పనిచేసేలా ఉద్యోగుల్ని ఒత్తిడికి గురి చేయొద్దన్నారు. ఈ సందర్భంగా ఐటీ రంగంలో నారాయణమూర్తి కృషిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక వ్యక్తి ఎన్ని గంటలు పనిచేశారో నిర్దేశించే బదులు, కంపెనీలు తమ వృత్తిపరమైన నియామకాలలో ఎంత ఉత్పాదకంగా ఉన్నాయో చూడాలని అన్నారు. అయితే, నారాయణమూర్తి అభిప్రాయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. తాజాగా, ఖర్గే సైతం స్పందించారు. ‘ఈ అంశంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఐటీ మంత్రిగా నేను ప్రొడక్టివిటీపై దృష్టి పెడతాను. మీరు ఏడు గంటలు ప్రొడక్టీవ్గా పని చేస్తే నేను పట్టించుకోను.ఉత్పాదకత పెరిగేలా సంస్థకు పనికొస్తుందనుకుంటే ఎక్కువ గంటలు పని చేయొచ్చు. అందులో తప్పేం లేదు. కానీ ఇలా (70 గంటలు) చేయమని మనం ఎవరినీ బలవంతం చేయలేం. స్వీటు షాపుల్ని నిర్వహిచడం లేదు కదా’ అని పేర్కొన్నారు. -
ఖర్గేతో రాజగోపాల్‌రెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/యాదాద్రి/పటాన్చెరు టౌన్: గురువారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరికొందరు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు టి.సంతోష్ కుమార్, కపిలవాయి దిలీప్, ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్, నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, ఆమె భర్త గంగాధర్‌రావుకు ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుగోడు స్థానాన్ని రాజగోపాల్‌రెడ్డికి ఖర్గే ఖరారు చేశారు. పార్టీ అభ్యున్నతికి, గెలుపు లక్ష్యంగా చేయాలంటూ ఖర్గే సూచించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా... కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై బీజేపీ ఆయన్ని జైలుకు పంపుతుందనే ఆలోచనతోనే తాను బీజేపీలో చేరినా ఆ పరిస్థితులు కనిపించలేదన్నారు. అందుకే మళ్లీ సొంతగూటికి వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. అవినీతితో సంపాదించిన కోట్ల రూపాయలను ఇండియా కూటమికి ఫండ్ ఇస్తానని.. తనను ప్రధానిని చేయాలంటూ కేసీఆర్ కూటమిని కోరిన విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజల మద్దతుతో తాను మునుగోడులో గెలుస్తానని, ఇంకా కొంచెం ముందుగా తాను కాంగ్రెస్‌లో చేరి ఉంటే కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేదన్నారు. -
ఇలాంటి పాలకులు అవసరమా?
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్‌బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిండా ముంచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్‌కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్‌కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థులు 70 మంది ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో 119 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు తొలి జాబితాను 15న విడుదల చేసే అవకాశం ఉంది. సర్వేల ఆధారంగానే.. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరిగింది. సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌లను సైతం సమావేశానికి ఆహ్వనించారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికల ఆధారంగా ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో మురళీధరన్ కమిటీకి వివరించారు. ఈ స్థానాలపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ 70 నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోమారు సీఈసీ భేటీ కానుంది. దసరాకు ముందే 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేటి భేటీలో 70 సీట్లపై చర్చించాం. మరోమారు సీఈసీ భేటీ ఉంటుంది’ అని తెలిపారు. తొలి జాబితాలో ముఖ్య నేతలు తొలి జాబితాలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ, రామ్మోహన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిరుద్‌రెడ్డి, వీర్లపలి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌రావు, గడ్డం వినోద్, ఎర్ర శేఖర్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్, వంశీకృష్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు, స్థానాలపై చర్చ సీఈసీ భేటీకి ముందు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ మురళీధరన్‌తో పాటు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సింగిల్ పేర్లతో, రెండు, మూడేసి పేర్లతో ఉన్న అభ్యర్థుల జాబితాలు రూపొందించారు. వాటిని సీఈసీ ముందుంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సి సీట్ల కేటాయింపుపైనా చర్చించారు. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీ తర్వాత జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్‌కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఇక టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. -
బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు. -
కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్, సురేశ్ షెట్కార్ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు. వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్‌షెట్కార్, గాలి అనిల్‌కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలవనున్నారు. -
ఉదయనిధి, ప్రియాంక ఖర్గేలపై కేసు
లక్నో:మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మతపరంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు సెక్షన్ 295ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక ఖర్గేలపై న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధిలు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియా కథనాలను ఆధారాలుగా చూపుతూ మతపరమైన భావాలను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. The FIR came at the complaint of lawyers who highlighted media reports on Stalin's statement alleging that the politician's comments had hurt their feelings.https://t.co/7jPY2h9UvS — IndiaToday (@IndiaToday) September 6, 2023 సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: అక్కడ సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3 -
హైదరాబాద్ వేదికగా తొలిసారి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు. 17న నియోజకవర్గాల్లో బస ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా.. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు. రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్నాయి. -
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు. ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్‌కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్‌పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్‌కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. -
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
ఆ ముగ్గురూ తోడు దొంగలే
వికారాబాద్/కొడంగల్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, ఎంపీ ఒవైసీ ముగ్గురూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ట్రిపుల్ తలాక్, 370డీ రద్దు వంటి మోదీ తీసుకున్న నిర్ణయాలకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలని ఒవైసీ.. ముస్లింలకు ఎలా చెబుతాడని ప్రశ్నించారు. వికారాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించి వైఎస్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాణహితకు పాతరేశాడన్నారు. రంగారెడ్డి జిల్లాకు, దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ తన సొంత ఊరు బాగుంటే చాలనుకుంటున్నారని, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక చింతమడకకు సర్పంచో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ముదిరాజ్‌లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కేసీఆర్ పూర్తిగా గాలికి వదిలేశారని రేవంత్ విమర్శించారు. జనాభాలో మెజార్టీ శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ రాష్ట్రం మొత్తంలో ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేదని, మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రజాగర్జన సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ రుణం ఎన్నటికీ తీర్చలేనిది కొడంగల్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణానికి వచి్చన ఆయన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులను కలిసి.. తనకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్‌ను మరువను.. విడువను అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌లో చేరిన మైత్రి గ్రూప్ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జైపాల్ పార్టీలో చేరిక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అనుచరులు గాందీభవన్‌కు తరలివచ్చారు. -
సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖర్గే..
ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన సొంత నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ అధ్యక్షునిగా మొదటిసారి కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయని విధంగా, పార్టీ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు ఖర్గే. సోనియా గాంధీ హయాంలో ఇలా జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకూ ఎం చేశారు..? గౌర్హాజరుకు కారణం..: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవలేదు. తనకు కంటి సమస్య కారణంగా రావడం కుదరదని చెప్పారు. సెక్యూరిటీ సమస్యల వల్ల ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. ప్రధాని, రక్షణ మంత్రి, స్పీకర్లు వెళ్లేవరకు ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు.. తాను ఇంటివద్ద, కాంగ్రెస్ అధికారిక భవనంలో జెండా ఎగురవేయాల్సిన ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పారు. సాంప్రదాయానికి విరుద్ధంగా..: స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే క్షణాన రాజకీయాలకు వెళ్లకూడదనే నియమం పార్టీలో ఉండేది. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులు పాటించారు. కానీ నేడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోనే భారత్ అభివృద్ధి చెందినట్లు చెప్పడంపై విమర్శలు కురిపించారు. కేవలం గతంలో ఏర్పాటు చేసిన పథకాలనే రూపుమార్చి కొత్త పేరుతో ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. చివరికి ప్రధాని వాజ్‌పేయి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని ఖర్గే అన్నారు. అలాగే.. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగమూర్తులను ఖర్గే కొనియాడారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, అంబేద్కర్లను తలుచుకున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్మించడంలో గత ప్రధానులు చేసిన పనిని గుర్తు చేశారు. आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई। लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है। हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे। जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM — Mallikarjun Kharge (@kharge) August 15, 2023 అటు.. స్వాతంత్య్ర ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు భూతాలను దేశం నుంచి పారదోలాలని అన్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో కొన్ని సమస్యలు వెంటాడాయని చెప్పారు. రాజరిక పాలన, ఇంకా ఓ పార్టీ కుటుంబానికి, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే మూలసూత్రాల మీద పనిచేసిందని కాంగ్రెస్ పేరు ఎత్తకుండానే నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
ఆ లేఖ నాదే, నేనే రాశా
కర్ణాటక: ఎమ్మెల్యేలకు మంత్రులు అస్సలు విలువ ఇవ్వడం లేదు, తక్షణం సీఎల్పీ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ పెద్దలకు లేఖ రాస్తారు. దానిపై వివాదం ఏర్పడితే.. అబ్బే ఆ లేఖ నేను రాయలేదు, ఎవరో నకిలీ లేఖను సృష్టించారు, బీజేపీ వారికి ఇదే పని అని ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. మరుసటి రోజుకు మాట మార్చి.. ఆ లేఖ నాదే..అగౌరవాన్ని సహించేది లేదు అని హుంకరిస్తారు. కలబుర్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ఏమన్నారంటే లేఖ రాయడంపై క్షమాపణ కోరేది లేదని బీ.ఆర్.పాటిల్ తాజాగా ప్రకటించారు. ఆదివారం కల్బుర్గిలో మాట్లాడిన పాటిల్, ఎవరు క్షమాపణ కోరారో నాకు తెలియదు. సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కోరడం మా హక్కు. కొందరు మంత్రుల ప్రవర్తన అనేకమందికి అసంతృప్తికి కారణమైంది. ఆత్మగౌరవానికి భంగం కలిగితే రాజీనామా చేస్తాను అని పాటిల్ చెప్పారు. సీఎల్పీ సమావేశంలో తాను ఎలాంటి క్షమాపణ కోరలేదని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అందరి ముందు చెప్పలేనన్నారు. లేఖ రాయడం నా హక్కు, నేనే రాశాను.అయితే క్షమాపణ కోరలేదు. ప్రియాంక్ ఖర్గేతో అన్ని విషయాలనూ చర్చించాను అని చెప్పారు. -
విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నిర్వహించిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. కూటమి పేరుతో సహా.. పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల భేటీ అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. కూటమికి సంబంధించి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశాలను చర్చించడానికి ముంబయి వేదికగా మరోసారి విపక్ష పార్టీలు సమావేశమవుతాయని ఖర్గే చెప్పారు. కూటమికి నాయకుడు ఎవరనే అంశాన్ని తేల్చే వ్యవహారంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్.. ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తేల్చుతారని చెప్పారు. ఇవి చాలా చిన్న విషయాలని ఆయన అన్నారు. నేడు బెంగళూరులో జరిగిన భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఇదీ చదవండి: Opposition Meeting Live Updates: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే.. -
విపక్షాల సభకు పవార్ వస్తారా? రారా? ఇదీ క్లారిటీ..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్‌కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్ పవార్‌తో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్‌కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. 'మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్ పవార్‌ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్ -
సీఎం స్టాలిన్ కు ఖర్గే ఫోన్..!
-
టీపీసీసీ కొత్త కమిటీలపై ఖర్గే తో రేవంత్ రెడ్డి చర్చలు
-
ఖర్గే రావణ్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
-
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆర్.దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్
-
మీకేమైనా రావణుడిలా 100 తలలున్నాయా?.. మోదీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రిని రావణుడితో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని బెహ్రామ్పుర్లో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘మేము మీ(మోదీ) ముఖాన్ని కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సహా ప్రతిచోటా చూస్తున్నాం. మీకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎమ్మెల్యే సహా ఏ ఎన్నికల్లోనైనా మోదీజీ పేరుతో ఓట్లు అడుగుతుండటం గమనించాను. మోదీ మున్సిపాలిటీల్లోకి వెళ్లి పని చేస్తారా? మీకు అవసరమైనప్పుడు మోదీ వచ్చి సాయం చేస్తారా?’ అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. मोदी जी प्रधानमंत्री हैं। वह काम छोड़कर नगर निगम का चुनाव, MLA का चुनाव, MP के चुनाव में प्रचार करते रहते हैं। हर वक्त अपनी ही बात करते हैं - 'आप किसी को मत देखो, मोदी को देखकर वोट दो।' आपकी सूरत कितनी बार देखें? आपके कितने रूप हैं? क्या रावण की तरह 100 मुख हैं? - @kharge जी pic.twitter.com/Iy6hYQfuhc — Congress (@INCIndia) November 29, 2022 ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా. ఆయన వ్యాఖ్యలు ప్రధాని మోదీని అవమానించటమేనన్నారు. ‘గుజరాత్ ఎన్నికల వేడిను తట్టుకోలేక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాటలు అదుపుతప్పుతున్నాయి. దాంతోనే ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. గుజరాత్‌ను, ఆ రాష్ట్ర బిడ్డను కాంగ్రెస్ అవమానుస్తూనే ఉంది.’ అని విమర్శించారు. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం ఖర్గేపై మండిపడ్డారు. పీఎం మోదీని రావణుడితో పోల్చడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ తీరును సూచిస్తున్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల -
అన్నీ రూమర్లే..సోనియా నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు: ఖర్గే
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. అయితే, అధిష్ఠానం తరపు అభ్యర్థి, అంతర్గతంగా సోనియా గాంధీ సపోర్టు మల్లికార్జున్ ఖర్గేకు ఉందంటూ కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఖర్గే పేరును స్వయంగా సోనియా గాంధీనే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అవి అన్నీ వదంతులేనని తీవ్రంగా ఖండించారు మల్లికార్జున్ ఖర్గే. సోనియాజీ తన పేరును సూచించలేదని, అంతర్గతంగా తనకు సోనియా నుంచి ఎలాంటి మద్దతు లేదని పేర్కొన్నారు. ‘అధ్యక్ష పదవికి నా పేరును సోనియా గాంధీ సూచించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు. గాంధీ కుటుంబ నుంచి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనటం, అభ్యర్థులకు మద్దతు తెలపటం వంటివి చేయరని ఆమె స్పష్టంగా చెప్పారు. కొందరు కాంగ్రెస్ పార్టీ, సోనియా, నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనబోనని, ఎవరికీ మద్దతు తెలపనని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9300 మంది సభ్యులు అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకుంటారు. మెజారిటీ వచ్చిన వారు అధ్యక్ష పదవి చేపడతారు.’ అని తెలిపారు ఖర్గే. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సరిగా లేవని, మోదీ, అమిత్ షా రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడుతోందని విమర్శించారు ఖర్గే. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై పోరాడేందుకు తగిన శక్తి కావాలని, కాంగ్రెస్ ప్రతినిధుల సిఫారసు మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పోటీ చేయాలని ఒక్కరోజు ముందు చెప్పారు: ఖర్గే -
మల్లికార్జున్ ఖర్గేపై ఈడీ ప్రశ్నల వర్షం!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- యంగ్ ఇండియాకు చెందిన ఆస్తుల మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికీ హస్తం జాతీయ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పలు దఫాలు విచారించింది ఈడీ. తాజాగా.. మరోమారు విచారణకు హాజరుకావాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు పంపించింది. ఈ సమన్లపై రాజ్యసభలో కొద్దిసేపు కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త వాతారవణ నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ సందర్భంగా.. తాము చట్టాన్ని గౌరవిస్తామని తెలిపారు ఖర్గే. అనంతరం హెరాల్డ్ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన సమక్షంలోనే యంగ్ ఇండియా ఆఫీసులో మరోమారు సోదాలు నిర్వహించింది ఈడీ. అనంతరం ఖర్గే వాగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్‌కు! -
రఫేల్ ఒప్పందంపై చర్చకు సిద్ధం : కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై చర్చకు తమ పార్టీ సిద్ధమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ 85వేల కోట్ల అదనపు వ్యవయానికి సభ ఆమోదం తెలిపిన అనంతరం ఖర్గే మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంపై చర్చకు తాము సిద్ధమని చెబుతూ ఈ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఒప్పందంపై బుధవారమే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఖర్గే పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందపై ఖర్గే చర్చను ప్రారంభించాలని దీనికి ప్రభుత్వం బదులిచ్చేందుకు సిద్ధమని జైట్లీ చెప్పారు. చర్చ నుంచి తప్పించుకునేందుకు ఖర్గే పారిపోతున్నారని, రాఫేల్‌పై చర్చ జరగాలని ఈ ఒప్పందంపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని తాను నిరూపిస్తానని జైట్లీ పేర్కొన్నారు. ఇక సభ వాయిదాపడే సమయంలో చర్చను ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించాలని స్పీకర్ సుమిత్రా మహజన్‌ను ఖర్గే కోరారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చర్చకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం పార్లమెంట్లో రాఫేల్ ఒప్పందపై చర్చ జరగవచ్చని భావిస్తున్నారు. -
బెంగళూరు..స్టార్టప్ రాజధాని
సాక్షి, బెంగళూరు: దేశంలో స్టార్టప్‌లకు అనువైన ప్రాంతంగా బెంగళూరు పేరుగాంచింది. అందరం కలిసి దేశానికి స్టార్టప్ రాజధానిగా బెంగళూరును మార్చాలి’ అని రాష్ట్ర ఐటీ బీటీ,పర్యాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పిలుపునిచ్చారు. ప్యాలెస్ మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన సేంద్రియ, చిరుధాన్యాల అంతర్జాతీయ వాణిజ్య మేళా–2018 ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రియాంక్ ఖర్గే, వ్యవసాయ మంత్రి క్రిష్ణబైరే తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ అగ్రి బిజినెస్ స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. క్రిష్ణబైరే మాట్లాడుతూ వ్యవసాయ స్టార్టప్‌ల కోసం ఇకపై రూ. 10 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. దీనిద్వారా రై తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఐటీ స్టార్టప్ల్‌తో పాటు అగ్రి స్టార్టప్‌లకు బెంగళూరును కేంద్రంగా మలచాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొన్ని అగ్రిబిజినెస్ స్టార్టప్‌లకు నిధులను అందజేశారు. సుమారు 44 స్టార్టప్ కంపెనీలు నిధులను అందుకున్నాయి. 2.10 లక్షల మంది సందర్శకులు సుమారు 2.10 లక్షల మంది మేళాను సందర్శించారు. ఈ వాణిజ్య మేళా ద్వారా రైతులు, దేశీయ, విదేశీ వ్యాపారులు, వినియోగదారులు ఒకే వేదికపైకి రాగలిగారు. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిరుధాన్యాల ప్రదర్శన జరిగింది. 357 స్టాళ్లు ఇందులో తమ ప్రదర్శనలను సందర్శకులు, వినియోగదారుల నిమిత్తం ప్రదర్శనకు ఉంచాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 14 రైతు సంఘాల సమాఖ్యలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. మేళా ద్వారా సుమారు రూ. 107 కోట్ల వ్యాపారం జరిగింది. -
ఖర్గేకు ప్రతిపక్ష నేత సీటు కేటాయింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేకు లోక్‌సభ ప్రతిపక్ష నేత సీటును కేటాయించారు. సాధారణం గా డిప్యూటీ స్పీకర్‌కు పక్కన ఉండే ప్రతిపక్ష నేత సీటును ఖర్గేకు కేటాయించినట్లు లోక్‌సభ వర్గాలు తెలిపాయి. ఖర్గే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విష యం తెలిసిందే. ఇకపై ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎస్పీ నేత ములాయం, జేడీ(ఎస్)అధినేత దేవేగౌడలతో కలసి తొలి వరసలో కూర్చొంటారు. -
ఆందోళనల మధ్యే ఖర్గే రైల్వే బడ్జెట్