బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్‌కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్ పవార్‌తో స్వయంగా తానే ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు.
ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్‌కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు.
'మహారాష్ట్ర అసెంబ‍్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్ పవార్‌ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష‍్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు.
ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్
Comments
Please login to add a commentAdd a comment