MORNING
-
సూర్య భారీ బడ్జెట్ చిత్రం.. ఆ రాష్ట్రంలో ఆలస్యంగా మార్నింగ్ షోలు!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ మరికొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే మొదటి రోజు తమిళనాడు ప్రభుత్వం ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతులిచ్చింది. అయితే మొదటి షో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. చివరి ఐదో షోను అర్ధరాత్రి 2 గంటలకు ముగించాలని ఆదేశించింది. ప్రేక్షకులకు అవసరమైన భద్రతా చర్యలను పాటించాలని తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను కోరింది.అయితే తమిళనాడు వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు కంగువా షోలు మొదలు కానున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్,కేరళ రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా మార్నింగ్ షోలు ప్రదర్శించనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళలో మాత్రం తెల్లవారుజామున 4 నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అవుతాయని మేకర్స్ వెల్లడించారు.కాగా.. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాని దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, ఆనంద కీలక పాత్రల్లో నటించారు. -
మార్నింగ్ టైం అనేక అలారాలు సెట్ చేస్తున్నారా?
ఉదయమే మేల్కోవడం కోసం అలారం సెట్ చేసుకుంటాం. అలారం మోగిన వెంటనే మేల్కోంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొందరూ ఉదయం టైంలో అనేక అలారాలు సెట్ చేస్తారు. పోనీ మేల్కోంటారా అంటా అంత సీన్ లేదన్నట్లుగా ముసుగు తన్నీ పడుకుంటారు. ఆ తర్వాత హడావిడిగా ఉరుకులు పరుగులతో ఆఫీసులకు, కాలేజ్‌లకు యథావిధిగా పరుగులు పెడతారు. అయితే ఆరోగ్య నిపుణులు ఇలా అనేక అలారంలు సెట్ చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని కూడా చెబుతున్నారు. అలారానికి ఆరోగ్యానికి ఏంటి సంబంధం..? ఎలా హెల్త్‌పై ప్రభావం చూపిస్తుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం. చాలామంది ఉదయం 6.00లకు ఆఫీస్ వెళ్లాలని 4.00ల నుంచి అలారాలు సెట్ చేస్తారు. ఆ తర్వాత అలారం మోగిన వెంటనే స్నూజ్ బటన్ నొక్కి 4.30, 5,,5.30 ఇలా సెట్ చేసుకుంటూ పోతారు ఏదో ఒకటైంకి లేవకపోదుమా అనుకుని ఇలా అనేక అలారాలు సెట్ చేస్తారు. దీని కారణంగా నాణ్యమైన నిద్ర పట్టక ఆరోగ్యంపై తీప్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. క్లాక్ యాప్‌ని ఎక్కువ మార్నింగ్ అలారాలతో ఓవర్లోక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇది గందరగోళానికి గురిచేసి అలసిపోయేట్లు చేస్తుందని అన్నారు. " నిజానికి శారీరక, మానసిక ఆరోగ్యంలో మంచి నిద్ర అనేది కీలకం. మంచి నిద్ర ఉంటేనే ఉదయం చురుకుగా పనిచేయగలం లేదంటే ఆ రోజంతా డల్‌గా ఉంటాం. పైగా మనకు తెలియకుండానే ఓ రోజు వృధా అయిపోతుంది. అదీగాక మన నిద్రలో చివరి నాల్గవదశలో గాఢనిద్ర పడుతుంది. ఆ టైం మన స్మృతులు, జ్ఞాపకాలు కలల రూపంలో వచ్చే మంచి సమయం. ఈ దశ నిద్ర ప్రతిఒక్కరికి కీలకమైనది. ఆ సమయంలో నిద్ర పాడయ్యితే మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..ఉదయం గనుక అనేక అలారాలతో మేల్కొలపడం వల్ల వేగ వంతమైన కంటి కదలిక చక్రానికి తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల మగత, అలసట, మానసిక కల్లోలం ఏర్పడి కార్డిసాల్ స్టాయిలు పెరుగతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే అలార్ ఆఫ్ అయిన ప్రతిసారీ శరీరం "ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్"లోకి వెళుతుందని వివరించారు. ఇది ఒత్తిడితో కూడుకున్న స్థితి. కాలక్రమేణ ఈ ఒత్తిడి హృదయనాళ సమస్యలకు కారణమవుతుంది. స్థిరమైన నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరంలో ఏర్పడే ఉద్రిక్తతలు కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. "అధిక కార్టిసాల్ స్థాయిలు మిమ్మల్ని బరువుగా పెంచుతాయి. కాబట్టి అలారం మోగిన వెంటనే లేవండి మంచిగా కాస్త రిలాక్స్ అయ్యే చిన్నపాటి వ్యాయామాలు చేయండి. ఒక్క అలారం మాత్రమే సెట్ చేయండి. ఆ టైంకి మోగిన వెంటనే లేవండి. ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు నిపుణులు. అలాకాకుండా ఉదయం 7 గంటలకు లేవాలని ఆరు గంటల నుంచే అనేక అలారాలు సెట్ చేస్తే నాణ్యమైన నిద్ర పొందలేక అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఒకటైంకి సెట్ చేసుకున్న అలారాన్ని బెడ్‌కి కాస్త దూరంలో పెట్టుకుంటే ఆపడం కోసమైన ఆటోమేటిగ్గా లేవడం జరుగుతుంది. అనేక అలారాలు పెట్టాల్సిన పరిస్థితి కూడా రాదని అంటున్నారు. అలాగే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దాదాపు ఒకే సమయాల్లో మేల్కోవడం, పడుకోవడం చాలా కీలకమని అని చెబుతున్నారు. కాబట్టి ఉదయం అనేక అలరాల సెట్ చెయ్యకండి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకోకండి.(చదవండి: ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ఎప్పటికప్పుడూ తన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి తన వర్క్ఔట్లకు సంబంధించిన పోటోలను షేర్ చేశారు. అంతేగాదు దానికి 'ఎప్పటికీ ఉదయపు సూర్యుడినే కోరుకుంటారు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. పైగా వేకువజాముకి మించిన మంచి సమయం మరోకటి లేదు అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది సమంత. ఆ ఫోటోలకు ప్రతిస్పందనగా ప్రముఖ సెలబ్రెటీలు, అభిమానుల కామెంట్లోతో పోస్ట్‌లు వెల్లువలా వచ్చాయి. సమంత ఉదయపు సూర్యుడి కోసం వెతుకుతున్నట్లుగా ఉంది ఆ ఫోజ్ అంటూ ఉదయిస్తున్న సూర్యుడి ఎమోజీలతో పోస్ట్‌లు పెట్టారు. ఇక ఫిల్మ్ మేకర్ నందిని రెడ్డి చమత్కారంగా ఇప్పుడే రెండుసార్లు వర్క్ఔట్లు చేశా! అంటూ సన్‌గ్లాసెస్ ఎమోజీలతో పోస్టులు పెట్టారు. అలగే మృణాల్ ఠాకూర్ ఆమె వయసు జస్ట్ 23 అన్నట్లు ఉంది అంటూ హార్ట్ సింబర్ ఎమోజీని పెట్టింది. ఇక సమంత 2022లో మైయోసిటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ పరిస్థితితో బాధపడిన సంగతి తెలిసిందే. అందుకోసం నటనకు కొంతకాలం విరామం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే గాక తనలా ఎవ్వరూ అలాంటి స్థితిని ఎదుర్కొనకూడదని 'టేక్ 20' అనే హెల్త్ పాడ్ కాస్ట్కి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ఇటీవల ప్రారంభించింది. ఇందులో ప్రముఖ ఆరోగ్య నిపుణుడి సలహాలతో విలువైన సమాచారం అందిస్తామని ఆ ఛానెల్ టీజర్‌ని రీలీజ్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ వెల్లడించారు. ఈ సమస్య రావడానికి ముందు సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. చివరికి కోలుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. హాయిగా ఊపిరి పీల్చుకోగులుగుతున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటనపై దృష్టి పెడుతున్నానని, షూటింగ్లలో పాల్గొననున్నట్టు తెలిపింది. ఇక ఈ పోడోకాస్ట్ని తనలా ఎవ్వరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో మనల్ని మనం సేఫ్‌గా ఉంచుకునేలా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే వాటి గురించి ప్రముఖ నిపుణులతో మాట్లాడి అత్యంత విలువైన సమాచారం ఇవ్వనున్నట్లు వెల్లడించి సమంత. ఎర్లిమార్నింగ్ వర్క్ఔట్లు చేస్తే.. సెలబ్రెటీలు, కామన్పీపుల్స్.. ఎవ్వరైనా సరే ఉదయమే చేసే వర్క్ఔట్లు ఎప్పటికీ మనలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఉదయమే చేసే వర్క్ ఔట్లతో దేహం చురుకుగా ఉంటుంది. ఎలాంటి రుగ్మతలు ఉన్నా తగ్గడం లేదా అదుపులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మన ముఖంలో కూడా ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది. ఇలా అందరూ తాము చేయగలిగనన్ని వర్క్ఔట్లు చేసి ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదండోయ్ ఇలా చేస్తే మన జీవితం కూడా ఉదయపు సూర్యుడిలా ప్రకాశవంతంగా సాగిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మళ్లీ గ్యాస్ చాంబర్‌గా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు చుట్టుముట్టాయి. గాలి దిశలో మార్పు కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. గాలి వేగం తక్కువగా ఉండడంతో గురువారం ఉదయం నుంచి ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409 వద్ద నమోదైంది. ఇది మంగళవారం కంటే 41 సూచీలు అధికం. గురువారం ఉదయం నుంచి రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మధ్యాహ్నం వేళ కూడా సూర్యరశ్మి తక్కువగానే ఉంది. రాత్రి అయ్యేసరికి వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా జనానికి కంటి, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి. బుధవారం ఢిల్లీలోని 13 ప్రాంతాల్లో ఏక్యూఐ 400గా నమోదైంది. శనివారం వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గాలి పశ్చిమం నుండి ఉత్తరం వైపునకు సగటున గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది. రాబోయే రెండు రోజులలో వివిధ దిశల నుండి గాలి వీయనుంది. శుక్రవారం ఈశాన్యం నుండి వాయువ్య దిశలో గాలి వీయనుంది. దాని వేగం నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్లుగా ఉండవచ్చు. శనివారం వాయువ్యం నుండి పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు ఆరు నుంచి 12 కిలో మీటర్లుగా ఉండవచ్చు. అందుకే ఈ వారం అంతా గాలి నాణ్యత పేలవంగానే ఉండవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. -
PM Modi Lakshadweep Visit: ప్రకృతిలో పరవశించిన నమో (ఫొటోలు)
-
ఇంకా తెల్లారని ఢిల్లీ.. పొగమంచు వీడేనా?
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత ‘తీవ్రం’గానే ఉంది. దీపావళి తర్వాత, దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభం తిరిగి తలెత్తింది. నగరం విషపూరిత పొగమంచుతో నిండిపోయింది. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో అన్ని వయసుల వారూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (బుధవారం) ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిలో కాలుష్యాన్ని కొలిచే సగటు వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) ‘తీవ్రమైన’ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉదయం 6 గంటలకు నమోదు చేసిన డేటా ప్రకారం ఎక్యూఐ ఆర్కే పురంలో 417, ఆనంద్ విహార్‌లో 430, ఐజీఐ విమానాశ్రయంలో 403, నరేలాలో 430, పంజాబ్ బాగ్‌లో 423గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ప్రతి సంవత్సరం చలికాలం ప్రవేశించడంతోనే వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి కాలుష్య కారకాలుగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది? #WATCH | Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB). (Visuals from IIT Delhi, shot at 6:30 am) pic.twitter.com/AxgNPrXBOv — ANI (@ANI) November 15, 2023 -
నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు..
నేపాల్‌లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంలో 157 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. తాజాగా ఆదివారం(ఈరోజు) నేపాల్‌లో 3.6 తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఖాట్మండుకు వాయువ్యంగా 169 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఆదివారం తెల్లవారుజామున 4.38 గంటలకు భూప్రకంపనలు సంభవించనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని పేర్కొంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం కూడా 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. శుక్రవారం రాత్రి నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో 157 మంది మృతి చెందారు. గడచిన ఎనిమిదేళ్లలో నేపాల్‌లో సంభవించిన అత్యంత భారీ భూకంపం ఇది. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు తొమ్మిది వేల మంది మృతి చెందగా, 22 వేల మంది గాయాలపాలయ్యారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు -
దోస్తానా అంటే ఇదికదా! స్నేహితుడు మార్నింగ్ వాక్‌కి రావటం లేదని..
ఫ్రెండ్ అనే పదంలోనే.. ఏదైన సమస్య వస్తే మనల్ని బయటపడేలా అండగా నిలబడే వాడని అర్థం. సాయం చేయలేకపోయినా.. కనీసం మనకు పరిష్కరమైనా చెప్పి సమస్య నుంచి బయటపడే యత్నం చేస్తాడు. మంచి స్నేహితులను పొందడం అనేది ఓ గొప్ప వరం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక స్నేహితుడు వాకింగ్ చేయడానికి రావడం లేదని అతడి దోస్తులంతా చేసిన పని నిజంగా నవ్వు తెప్పిస్తుంది. ఏం చేశారంటే.. పాపం అతడు కూడా తమతో వాకింగ్‌కి వచ్చి సరదాగా గడపడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలని కోరుకున్నారు. ఎంతలా చెప్పి చూశారో ఏమో మనోడు అస్సలు వాకింగ్ వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కాబోలు. దీంతో విసిగిపోయిన అతడి స్నేహితులు లాభం లేదనుకుని ఏకంగా బ్యాండ్ బాజాలతో అతని ఇంటికి వెళ్లి మరీ స్వాగతం పలికారు. దీంతో ఆ స్నేహితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. వస్తాన్రా బాబు అని దండం పెట్టి మరీ వేడుకుంటున్నాడు. ఆపండ్రా ఆ బ్యాండ్ బాజాలు వాయించడం ఓ రెండు నిమిషాలు టైం ఇవ్వండి అని అడుగుతున్నా..ఆపద్దు వాయించండి వచ్చేంత వరకు అంటున్నారు అతడి దోస్తులు. స్నేహం అంటే ఇది కదా! స్నేహితుడి బద్ధకం వదిలించి మరీ వాకింగ్ తీసుకువెళ్లాలనుకుంటున్నా అతడి దోస్తులు నిజంగా గ్రేట్!. మేలు కోరే స్నేహితులు దొరకడం కూడా ఓ అదృష్టం కదూ!. Friend not coming for morning walk.. morning walk friends decided to go home with band baza... pic.twitter.com/yGimAsuS2z — Rakesh Reddy (@rakeshreddylive) October 31, 2023 (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..!
సోషల్ మీడియాలో జనం తమకు ఎదురైన మంచి లేదా చెడు అనుభవాలను వెల్లడిస్తుంటారు. దీనిపై అదే సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఒక మహిళ ఇటువంటి విచిత్ర ఉదంతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఎదురైన అనుభవం తనకు నిద్రపట్టనీయలేదని ఆమె ఆ పోస్టులో వాపోయింది. ఆ మహిళ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దీంతో నేను మా ఇంటి బాల్కనీలోకి వచ్చాను. అయితే అక్కడి దృశ్యాన్ని చూసి భయపడిపోయాను’ అని పేర్కొంది. ఆమెకు చెట్టుకు వేలాడుతూ తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక మహిళ ఆకృతి కనిపించింది. ఇది ఆమెను ఎంతో భయానికి గురిచేసింది. ఈ వీడియో చూశాక తాను విపరీతమైన భయంతో వణికిపోయానని, ఉపశమనం కోసం 10 నుంచి 15 సార్లు హనుమాన్ చాలీసా పఠించానని తెలిపారు. మర్నాటి ఉదయం ఏం జరిగిందో కూడా ఆ మహిళ తెలియజేసింది. ఉదయాన్నే తాను బాల్కనీలోకి వెళ్లి చూడగా, అప్పటి వరకూ మనసులో ఉన్న భయం తొలగిపోయిందని తెలిపింది. ఆ చెట్టుకు వేలాడుతున్నది దెయ్యం కాదని, ఎవరో మహిళ హ్యాంగర్‌కు ఆరబెట్టిన నైటీ చెట్టుపైన పడినట్లు గుర్తించానని తెలిపారు. అనిరుద్ధ్ జోషి అనే మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేయగా, దీనికి లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఒక యూజర్ ‘తాను ఇకపై రాత్రవేళ నిద్రపట్టకపోతే బాల్కనీలోకి వెళ్లను’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు రాత్రంతా బాల్కనీలోనే ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేదో’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! 🤣🤣🤣😂😂🤣🤣🤣 pic.twitter.com/N60zQjFKPx — Aniruddha Joshi (@aniruddha3365) August 20, 2023 -
విపక్షాల సభకు పవార్ వస్తారా? రారా? ఇదీ క్లారిటీ..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్‌కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్ పవార్‌తో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్‌కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. 'మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్ పవార్‌ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్ -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!!
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో చాలామంది అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం.. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల ప్రతి రోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా ఇతర కారణాల వల్ల ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసె వంటి వాటిని తీçసుకోవడం ఇష్టం లేకపోతే లేదా సమయం సరిపోకపోతే మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె లేకుండా చపాతీలు, పండ్ల రసాలేకాక... ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలగలిపిన సలాడ్లు వంటివి తీసుకోవడం మంచిది. కనీసం ఇలా చేసినా కూడా అనారోగ్యాన్ని కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్లు దాదాపు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు.. అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించడమే కాకుండా, జ్ఞాపకశక్తి పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డైటింగ్ చేసే వారు నిర్లక్ష్యం చేయకుండా.. అల్పాహారం తీసుకోవడం మరువకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!! -
ఉదయాన్నే తినేస్తే బెటర్!
ఒక రోజులో ఎనిమిది – పది గంటల వ్యవధిలో ఆహారం మొత్తం తీసుకోవడం వల్ల మన జీవక్రియలు మెరుగవుతాయని అంటున్నారు డాక్టర్ సచిన్ పాండా. ‘ద సిర్కాడియన్ కోడ్’ పేరుతో జీవక్రియలు, ఆహారం మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించారు పాండా. సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా మన శరీరం పనిచేస్తుందని.. హార్మోన్లు, ఎంజైమ్‌లు, జీర్ణ వ్యవస్థ కూడా ఉదయం వేళ, సాయంకాలానికి కొంచెం ముందు ఆహారాన్ని సమర్థంగా జీర్ణం చేయగలవని సచిన్ అంటున్నారు. క్లోమ గ్రంథి ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేదీ, కడుపు/పేగుల్లో బ్యాక్టీరియా చైతన్యవంతంగా ఉండేదీ ఈ సమయాల్లోనేనని ఆయన అంటున్నారు. రాత్రిపూట అవయవాలన్నీ నెమ్మదిస్తాయని, మెదడు నిద్రకు పనికొచ్చే మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుందని.. ఆ సమయంలో ఆహారం తీసుకుంటే.. మెదడు గందరగోళంలో పడిపోతుందని అన్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. 2012లో తాను ఈ విషయంపై ఒక పరిశోధన కూడా నిర్వహించానని, నచ్చినప్పుడు తిన్న ఎలుకలు అనారోగ్యం పాలు కాగా.. నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకున్నవి ఆరోగ్యంగా ఉన్నాయని వివరించారు. మధుమేహం ఛాయలున్న వారిపై జరిపిన ఇంకో ప్రయోగంలో రోజులో ఆహారాన్ని తీసుకునే సమయాన్ని తగ్గించినప్పుడు అనేక ఆరోగ్య లాభాలు చేకూరినట్లు సచిన్ గుర్తించారు. -
కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..
-
కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్ తమన్నా ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను మిల్కీబ్యూటీ అనిపిలుస్తారంటే ఆమె అందం ఎంత సుకుమారమో అర్ధమైపోతుంది. బాహుబలిలో సన్నటి మెరుపు తీగలా కనిపించిన ఈ ముద్దు గుమ్మ అదే సమయంలో పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తూ యుద్ధ విన్యాసాలు ఎంతో చక్కగా చేసి మెప్పించారు. ఇది చూసిన ఎవరికైనా తమన్నా తన ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తారని, భారీగా వర్క్వుట్లు కూడా చేస్తారని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆరోగ్యవంతమైన, జిమ్‌లో గడపడం వంటి విషయాలు పక్కనబెడితే ఆమె ఓ కప్పు కాఫీతోనే తన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారంట. అయితే, మాములు కాఫీ కాదు.. బటర్ కాఫీ.. సాధారణంగా మనం బటర్ మిల్క్ వింటాంగానీ, ఈ బటర్ కాఫీ ఏమిటి అని ప్రశ్నించగా ఇది తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. కాఫీలో బటర్ మిక్స్ చేసి తాగితే కొవ్వుమొత్తం కరిగి పోతుందని, హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెప్పారు. తన రోజును బటర్ కాఫీతోనే ప్రారంభిస్తానంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. -
ఉదయం 11 గంటలకు నితీష్ అంత్యక్రియలు
-
ఘనంగా మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం కలశస్థాపన పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవంను ప్రారంభించారు. పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, కొడమంచిలి కొప్పేశ్వరరావు, మద్దిరాల మల్లికార్జునరావు అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రవీంద్రనా«థ్‌రెడ్డి మావుళ్లమ్మ అమ్మవారిని శుక్రవారం కమలాపురం ఎమెల్యే ఎల్ రవీంద్రనాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేడు మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బల్లిపాడుకు చెందిన ఆధ్మాత్మిక వేత్త ఆకుల ఆప్పారావు ఉపన్యాసం, 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చెందిన యడమిల్లి బ్రదర్స్ బుర్రకథ, రాత్రి 8 గంటలకు తణుకుకు చెందిన గీతామందిరి వారి దేవీ కటాక్షం నాటకం ప్రదర్శితం కానున్నాయి. -
చోరీకి వచ్చి.. స్థానికుల చేతికి చిక్కి..
మరిపెడ : మండల కేంద్రంలో పట్టపగలే దొంగ ఓ ఇంట్లోకి దూరి హల్చల్ చేశాడు. నర్సిం హులపేట మండ లం దాట్ల గ్రామాని కి చెందిన తూర్పా టి సమ్మయ్య మండల కేంద్రం లోని గుడిసె వెంకన్న ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి బ్యాంక్ పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు ఇతర వస్తువులు అపహరించి పారిపోతుండగా రామవిలాస్ వీధిలో కొందరు యువకులు అతడిని పట్టుకొని చితకబాదారు. అపహరించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాగితాలు ఏం చేసుకుంటావని ప్రశ్నిస్తే అతడి నుంచి ఎంతకీ సమాధానం రాలేదు. -
159.8 మి.లీ. వర్షపాతం నమోదు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 159.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి టి.సురేష్‌కుమార్ తెలిపారు. పెదపాడు మండలంలో అత్యధికంగా 25.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పోడూరు మండలంలో 1 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. మిగిలిన మండలాల్లో కాళ్ల 16.8, పాలకోడేరు 16.6, ఆకివీడు 15.6, ఉండి 15, నరసాపురం 11.2 వీరవాసరం 6.4, తాడేపల్లిగూడెం 5.8, పెనుగొండ 5.2, పెంటపాడు 5, మొగల్తూరు 4.8, ఏలూరు 4.6, ఆచంట 4.4, ఇరగవరం 3.4, నిడమర్రు, తణుకు, ఉండ్రాజవరంలో 2.8, పెదవేగి, యలమంచిలిలో 2.6, భీమవరం 2, పెనుమంట్ర 1.8, పాలకొల్లు 1.4, మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. -
ఉదయం వేళలో ఎక్కువగా తలనొప్పి..!
న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. ఈమధ్య వాడికి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తోంది. దాంతోపాటు వాంతులు కూడా అవుతున్నాయి. రోజురోజూకూ నొప్పి పెరుగుతోంది. ఇంటి దగ్గర డాక్టర్‌కు సంప్రదిస్తే మందులు రాసిచ్చారు. వాడాము. కానీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్పెషలిస్ట్‌ను కలిశాం. పిల్లాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాకు విపరీతమైన బెంగ పట్టుకుంది. బ్రెయిన్ సీటీ చేయించమని సలహా ఇచ్చారు. రిపోర్ట్స్ బట్టి నిర్ధారణకు రాగలమని అంటున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? అది నయం చేయలేని వ్యాధా? ఒకవేళ మా బాబుకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలితే వాడి భవిష్యత్తు ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - జయలక్ష్మి, సోమాజీగూడ మీరు చెబుతున్న లక్షణాలు కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి. మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా బ్రెయిన్ సీటీ తీయించుకని డాక్టర్‌ను కలవండి. ఈమధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్ అనేది పిల్లల్లో కూడా చలా ఎక్కువగా మనకు కనపడుతోంది. ఈ ట్యూమర్ కణజాలం మెదడులో అసాధారణంగా పెరుగుతూ దాని పనితీరును అడ్డుకుంటుంది. దానివల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి అది తలనొప్పి రూపంలో బయటపడుతుంది. క్రమేణా మెదడుపై ఒత్తిడి తీవ్రమవుతున్న కొద్దీ తలనొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. అంతేకాకుండా దీనికి వాంతులు కూడా తోడవుతాయి. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డవాల్లకు మీరు చెప్పిన లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే వారు తగిన పరీక్షలు చేయించి, బాబుకు అందించాల్సిన చికిత్స విషయంలో తగిన నిర్ధారణకు రాగలుగుతారు. మీరు ఆందోళన చెందుతున్నట్లుగా బ్రెయిన్ ట్యూమర్ అనేది అంత భయపడాల్సిన వ్యాధి కాదు. కాకపోతే మెదడులో ట్యూమర్ ఉన్న స్థానం, దాని పరిమాణం అనే అంశాలను బట్టి చికిత్స, ఫలితాలు ఉంటాయి. అన్ని ట్యూమర్లూ ప్రాణాంతకమైనవి కావు. క్యాన్సర్ కారకాలు కావు. మీ అబ్బాయికి ట్యూమర్ మొదటి దశలోనే ఉంటే, దానిని సమూలంగా తొలగించవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ ప్రక్రియలతో, నిపుణులైన న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిగితే మీ బాబుకు వచ్చిన సమస్యనూ పూర్తిగా నయం చేయవచ్చు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ పి.రంగనాథమ్ సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? - రవిందర్, పాల్వంచ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - అప్పారావు, నరసన్నపేట మీరు చెప్పినట్లుగా మూత్రంలో చాలాసార్లు రక్తం పోతూ ఉంటే, ఏ కారణం వల్ల అలా జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఇలా జరగడానికి కిడ్నీలో రాళ్లు గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదా కిడ్నీ సమస్యగానీ ఉండటం కారణం కావచ్చు. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు మూత్రపరీక్ష చేయించుకోండి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్గానీ లేకుండా ఇలా రక్తం పోతూ ఉంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమో అని పరీక్ష చేయించుకోవాలి. రక్తంతో పాటు ప్రోటీన్లు కూడా మూత్రంతో పాటు పోతూ ఉంటే, కిడ్నీ బయాప్సీ చేయించుకొని, ఆ రిపోర్టులను బట్టి కిడ్నీలు దెబ్బతినకుండా మందులు వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. - డా. రమణ ప్రసాద్ ..కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
ఢిల్లీ మ్యూజియంలో మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలతో హడలెత్తింది. ఆదివారం టీవీ టవర్ సమీపంలో అగ్ని ప్రమాదం, మంగళవారం తెల్లవారుజామున ఫిక్కీ ఆడిటోరియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఇంకా మంటలైనా ఆరకముందే ఢిల్లీలోని చారిత్రక సహజ జంతుజాలానికి సంబంధించిన జీవశాస్త్ర మ్యూజియంలో ఈరోజు తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మ్యూజియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు సిబ్బందిని హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 35 అగ్ని నిరోధక వాహనాలు మంటలను ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మ్యూజియంను సందర్శించిన కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మ్యూజియం దేశపు ఆస్తి అని మంటలకు ఇంకా కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రధాన మ్యూజియంలలో ఉన్న భద్రతాపరమైన చర్యలపై నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 1978లో స్థాపించిన ఈ మ్యూజియంను నిత్యం అనేక మంది విద్యార్థులు సందర్శిస్తుటారు. ప్రమాదం తెల్లవారు జామున సంభవించడంతో పెను ప్రమాదమే తప్పింది. -
స్ఫూర్తిదాత.. విద్యాప్రదాత.. చాయ్ వాలా!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారు. అనుకున్నది సాధించాలన్న తపన, బలమైన కోరిక ఉండాలే గానీ అందుకు వయసు, డబ్బు, చదువుతో సంబంధం ఉండదని నిరూపించాడా వృద్ధుడు. ఒడిషాకు చెందిన డి. ప్రకాశ్ రావు చాయ్‌వాలాగా జీవితాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రదాతగా... స్ఫూర్తిదాతగా నిలుస్తున్నాడు. మురికివాడల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడదన్నదే ప్రకాష్ ఆకాంక్ష.. అందుకే చాయ్ వాలాగా ఉంటూ విద్యాప్రదాతగా మారాడు. కపటం లేని, సంతోషకరమైన జీవితం గడపడంతో పాటు.. తాను చదువుకు దూరమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనుకున్నాడు. చిన్నతనంలో చదువుపై అత్యంత మక్కువ చూపిస్తున్నా తండ్రి స్కూల్లో చేర్పించకపోవడంతో ఏమాత్రం చదువుకోలేకపోయాడు. తనకు ఎంతగానో ఇష్టమైన చదువు మురికివాడల్లోని పిల్లలకు దూరం కాకూడదన్నదే ధ్యేయంగా నడుం బిగించాడు. ప్రకాష్‌ను.. అతడి తండ్రి ఓ చాయ్ దుకాణంలో చేర్పించాడు. 1976 నుంచే ప్రకాష్ రావు టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. కానీ అతడిలో చదువు నేర్చుకోవాలన్న తపన చావలేదు. స్కూలు చదువునైనా పూర్తి చేయాలన్నఅతడి కోరిక.. పట్టుదల అతడ్ని ఓ పాఠశాల నడిపించే స్థాయికి చేర్చింది. ఉదయం చాయ్ దుకాణంలో పనిచేస్తూనే ఆ డబ్బుతో నర్సరీ నుంచి మూడో తరగతి వరకూ ఉండే 70 మంది పేద పిల్లలతో పాఠశాల నడుపుతున్నాడు. మూడో క్లాస్ తర్వాత తన స్కూలునుంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాళ్లు చదువుకు దూరం కాకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారిలో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి వారికి బిస్కెట్లు, పాలు అందిస్తున్నాడు. ప్రకాష్ రావుకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ కూడా తన స్కూల్లోనే మూడోతరగతి వరకూ చదివారని చెబుతుంటే అతడి కళ్లు మెరుస్తాయి. తాను చదువు చెప్పలేకపోయినా, అనుకున్నది సాధించాడు. చాయ్ వాలా స్ఫూర్తిదాయక జీవనంపై మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడొచ్చు. -
ఉదయం టిఫిన్ చేయండి... గుండెజబ్బులను తరిమేయండి!
ప్రతిరోజూ ఉదయమే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో గుండెజబ్బుల అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోని వారు, తరచూ దాన్ని మిస్ చేసే వారిలో గుండెజబ్బుల రిస్క్ గణనీయంగా పెరిగినట్లు గుర్తించిన ఆ అధ్యయనవేత్తలు ఆ అంశాన్ని ‘సర్క్యులేషన్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో 26,902 మంది పురుషులు పాల్గొన్నారు. వీరిలో 16 నుంచి 82 ఏళ్ల వయసున్నవారూ ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అధ్యయనంలో తరచూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారిని పరిశీలించగా... వారిలో 27 శాతం మందికి గుండెజబ్బుల రిస్క్ ఫ్యాక్టర్లు మొదలైనట్లు పరిశోధనవేత్తలు గుర్తించారు. ఇక రాత్రివేళ కూడా చాలా ఆలస్యంగా భోజనం చేసేవారిలో 55 శాతం మందికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలున్నట్లు వారు వివరించారు. -
మహా మాయలాడి
వనజ ఐపీ దాఖలుతో లబోదిబోమంటున్న బాధితులు చీటిల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు : బాధితుల ఆరోపణ చంద్రగిరి : చీటీల పేరిట రూ. 1.2 కోట్లు వసూలు చేసిన చంద్రగిరి కొత్తపేట భారతీనగర్‌కు చెందిన ఎం. సత్యనారాయణ శెట్టి భార్య వనజ పలువురికి టోపీ పెట్టిం ది. శుక్రవారం ఆమె ఐపీ దాఖలు చేసిన నేపథ్యంలో ఒక్కో మాయ వెలుగు చూ స్తోంది. 30 ఏళ్ల క్రితం పలమనేరు ప్రాం తం నుంచి సత్యనారాయణశెట్టి, వనజ చంద్రగిరికి వలస వచ్చారు. బతుకు తెరువుకోసం పరిసర గ్రామాల్లో బొగ్గు సేకరిం చి విక్రయించేవారు. వనజ భర్త ఓ ప్రైవేటు బస్సులో క్లీనర్‌గా చేరాడు. అనంతరం డ్రయివింగ్ నేర్చుకుని ఆర్టీసీలో కాం ట్రాక్టు పద్ధతిపై చేరిన ఆయన సర్వీసు రెగ్యులర్ అయింది. భర్త ప్రోత్సాహంతో వనజ చీటీల వ్యాపారం ప్రారంభించింది. డాక్టర్‌తో మంచిగా ఉండడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిన స్వీపర్‌గా చేరింది. పలుకుబడి తీవ్రంగా పెంచుకుంది. దీంతో స్థానికులు ఆమెపై నమ్మకంతో అధికంగా చీటీలు వేశారు. ఆమె తండలు, వడ్డీవ్యాపారం నిర్వహించేది. ఊహించని విధంగా వనజ శుక్రవారం తిరుపతి కోర్టులో కోటి 56 లక్షల 80వేల రూపాయలకు ఐపీ దాఖలు చేయడంతో బాధితులందరూ లబోదిబోమంటున్నారు. వనజ ఓ ప్రముఖ నాయకుడి కుమారుడు పేరుతో ఈ ఏడాది జనవరి13న 2.79 ఎకరాల భూమి విక్రయించినట్లు బాధితులు రికార్డులు చూపిస్తున్నారు. ఆమె కుమారుడు బినామీగా 2014 డిసెంబర్ ఒకటో తేదీ సదుం ప్రాం తంలో 2కోట్ల 23లక్షల రూపాయల విలువైన భూమి కొనుగోలుకు ఆమె అగ్రిమెంట్ చేయించుకుందని ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చంద్రగిరి సీఐ శివప్రసాద్ వనజ ఆమె భర్త సత్యనారాయణశెట్టి, కుమారుడు బాలాజీ, కోడలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.