అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..! | Watch: Woman's Midnight Balcony Stroll Turns Into A Ghostly, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..!

Published Wed, Aug 23 2023 10:56 AM | Last Updated on Wed, Aug 23 2023 1:36 PM

Midnight Balcony Stroll Turns into Ghostly - Sakshi

సోషల్‌ మీడియాలో జనం తమకు ఎదురైన మంచి లేదా చెడు అనుభవాలను వెల్లడిస్తుంటారు. దీనిపై అదే సోషల్‌ మీడియాలో చర్చలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఒక మహిళ ఇటువంటి విచిత్ర ఉదంతాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తనకు ఎదురైన అనుభవం తనకు నిద్రపట్టనీయలేదని ఆమె ఆ పోస్టులో వాపోయింది. 

ఆ మహిళ ట్విట్టర్‌ వేదికగా ఒక వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దీంతో నేను మా ఇంటి బాల్కనీలోకి వచ్చాను. అయితే అక్కడి దృశ్యాన్ని చూసి భయపడిపోయాను’ అని పేర్కొంది. ఆమెకు చెట్టుకు వేలాడుతూ తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక మహిళ ఆకృతి కనిపించింది. ఇది ఆమెను ఎంతో భయానికి గురిచేసింది. ఈ వీడియో చూశాక తాను విపరీతమైన భయంతో వణికిపోయానని, ఉపశమనం కోసం 10 నుంచి 15 సార్లు హనుమాన్‌ చాలీసా పఠించానని తెలిపారు. 

మర్నాటి ఉదయం ఏం జరిగిందో కూడా ఆ మహిళ తెలియజేసింది. ఉదయాన్నే తాను బాల్కనీలోకి వెళ్లి చూడగా, అప్పటి వరకూ మనసులో ఉన్న భయం తొలగిపోయిందని తెలిపింది. ఆ చెట్టుకు వేలాడుతున్నది దెయ్యం కాదని, ఎవరో మహిళ హ్యాంగర్‌కు ఆరబెట్టిన నైటీ చెట్టుపైన పడినట్లు గుర్తించానని తెలిపారు. అనిరుద్ధ్‌ జోషి అనే మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేయగా, దీనికి లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఒక యూజర్‌ ‘తాను ఇకపై రాత్రవేళ నిద్రపట్టకపోతే బాల్కనీలోకి వెళ్లను’ అని రాశారు. మరో యూజర్‌ ‘మీరు రాత్రంతా బాల్కనీలోనే ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేదో’ అని కామెంట్‌ చేశారు. 
ఇది కూడా చదవండి: ఇందిరను ‍ప్రధానిని చేసిన కే. కామరాజ్‌ లైఫ్‌ స్టోరీ!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement