Dress
-
నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!
పాప్ కార్న్‌ని ఇష్టపడనివారు ఉండరు. టైం పాస్‌గానూ, మూవీ థియోటర్లలోనూ తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. అలాంటి ఈ పాప్ కార్న్ మన తాత ముత్తాతల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ బెస్ట్ స్నాక్ ఐటెంగా రాజ్యమేలుతుంది. అలాంటి పాప్ కార్న్‌తో ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేసింది హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. అసలు పాప్‌కార్న్‌తో ఫ్యాషన్ ఏంటి అనే కదా..!. ఆమె పాప్ కార్న్‌తో డిజైన చేసిన ఎరుపు రంగు గౌనులో మెరిసింది. ఇంతకీ ఆ గౌను ఎలా ఉంటుందో తెలుసా..!.ఈ చిరుతిండితో ఫ్యాషన్‌గా ఉండొచ్చనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో గానీ ఆ గౌను డిజైనింగ్ మాత్రం అదుర్స్. ఎరుపు రంగుతో కూడిన క్లాసిక్ పాపకార్న్ బకెట్ మాదిరిగా ఉంది. అచ్చం మనం మూవీ థియేటర్లో కొనుగోలు చేసే పాప్ కార్న్ బకెట్ మాదిరిగా డిజైన్ చేశారు. అంతేగాదు ఆమె నడుమ వద్ద శంఖాకారం మాదిరి పాకెట్స్లలో పాప్‌కార్న్‌తో నిండి ఉన్నాయి. ఎమ్మా రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా నడుస్తూ వస్తూ..చేతిలో పాప్ కార్న్ ప్యాకెట్‌తో తింటూ వచ్చింది. చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మ వచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన నోరూరడమే గాక ఇలా చిరుతిండిని స్టైల్‌గా మార్చిన క్రియేటివిటిని మెచ్చుకోకుండా ఉండలేరు.ఇక నటి ఎమ్మాస్టోన్ సాటర్డే నైట్ లైవ్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా వెరైటీ లుక్‌లో తళుక్కుమంది. రెడ్ కార్పెట్‌పై ఏ లిస్ట్ సెలబ్రిటీల పాప్ సంస్కృతికి అద్దం పట్టేలా ఎమ్మా స్టోన్ ఇలా సరికొత్త ప్యాషన్ లుక్‌తో సందడి చేసింది. అయితే ఇలా ఆహార ప్రేరేపిత ఫ్యాషన్ స్టార్ట్ చేయడం తొలిసారి కాదు. గతంలో మైఖేల్ షానన్ పసుపు చిప్స్ బ్యాగ్‌తో రెడీ అయ్యి 2024 మెట్ గాలాకు హాజరయ్యారు. మైఖేల్ డిజైనర్ వేర్ని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ బాలెన్సియాగా రూపొందించారు. ఆ బ్రాండ్ పేరు "మ్యాక్సీ ప్యాక్". అంతేగాదు ఆ ఆహార ప్రేరేపిత డిజైనర్‌వేర్‌లో చీజ్, ఉల్లిపాయ వంటివి కూడా ఉండటం విశేషం. అయితే సోషల్ మీడియాలో ఈ డిజైనర్ వేర్ పలువురిని విశేషంగా ఆకర్షించింది. Emma Stone and Meryl Streep #SNL50 pic.twitter.com/VvsIhIjs7e— best of emma stone (@badpostestone) February 17, 2025 (చదవండి: డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..) -
వజ్రాల్లో ఒదిగిపోయిన దేవర భామ జాన్వీ కపూర్.. (ఫోటోలు)
-
Delhi Election 2025: కేజ్రీవాల్ ఇంటికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. #WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En— ANI (@ANI) February 8, 2025 ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. #WATCH | Delhi: Avyan Tomar's father, Rahul Tomar says, "... We always come here on result days... The party has also given him the name of 'Baby Muffler Man'..." pic.twitter.com/cMdDc3sGWf— ANI (@ANI) February 8, 2025 -
ప్రియుడితో కలిసి ట్విన్నింగ్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ
-
ముత్యాలే డ్రెస్సులుగా!
ముత్యాల ఆభరణాలు మనసును ఆహ్లాదంగా మార్చేస్తాయి. ముత్యాల వరసలతో చేసిన డ్రెస్సులు వేసుకుంటే.. వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్న ఈ స్టైలిష్ డ్రెస్సులను సెలబ్రిటీలే కాదు నవతరమూ కోరుకుంటోంది.వెస్ట్రన్, ఇండియన్ పార్టీ ఏదైనా ముత్యాల డిజైనరీ డ్రెస్సులను ధరిస్తున్నారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.సాధారణంగా ఆభరణాలలో చూసే ముత్యాలను డ్రెస్ డిజైనింగ్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే, ముత్యాలు ఇటీవల ఫ్యాషన్‌లో కీలకమైన అంశంగా మారాయి. తెలుపు, సిల్వర్, వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న మెటీరియల్పైన తెల్లని ముత్యాలను మరింత ఆకర్షణీయమైన ఎంపికగా డిజైనర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరహా దుస్తులు స్వచ్ఛతకు, క్లాసీ లుక్కు ఉదాహరణగా నిలుస్తున్నాయి. శారీస్, స్కర్ట్స్ మీదకు టాప్స్‌గా ఉపయోగించే వాటిలో కోర్ జాకెట్స్, ష్రగ్స్, బ్లౌజ్ బ్యాక్ డిజైన్‌కి ఎక్కువ శాతం ముత్యాల వరసలను ఎంచుకుంటున్నారు. లెహంగా, శారీ ఎంబ్రాయిడరీలోనూ జర్దోసీ, సీక్వెన్స్‌తోపాటు కాంబినేషన్‌గా ముత్యాల వరసలు విరివిగా కనిపిస్తున్నాయి. వింటర్–సమ్మర్ పార్టీవేర్‌కి, ఇండోవెస్ట్రన్ స్టైల్స్‌కి చిన్న, పెద్ద ముత్యాలను ఉపయోగిస్తూ చేసే డ్రెస్ డిజైన్స్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ముత్యాలతో చేసే డిజైన్స్ ఖరీదులో ఘనంగా ఉంటే వాటి స్థానంలో ఉపయోగించే వైట్ బీడ్స్‌తో రెప్లికా డిజైన్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో తక్కువ ఖరీదులోనూ ఈ తరహా డిజైన్స్ లభిస్తున్నాయి. ఈ డిజైనరీ డ్రెస్సులే ఓ పెద్ద అట్రాక్షన్ కావడంతో మరే ఇతర ఆభరణాలు, హంగుల అవసరం ఉండదు. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
మరింత బోల్డ్‌గా డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్.. క్రేజీ అవార్డ్ కొట్టేసింది!
-
దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..
అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్‌లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..రిచ్ లుక్ చీర..దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్‌గా ఉంటారు. అనార్కలి గౌనుగ్రాండ్గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .లెహంగాస్లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్‌తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్‌తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండిచీరకట్టు స్టైల్ డిజైర్వేర్..గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్‌లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్‌లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్‌లతో జత చేయండి. సల్వార్ సూట్పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల సల్వార్లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్‌తో కూడిన సల్వార్ సూట్లు వేడుకలను మరింత కలర్‌ఫుల్ మయం చేస్తాయి.(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!) -
గ్రీన్ డ్రెస్‌లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
భార్యల్ని పొట్టిబట్టల్లో చూసి మురిసిపోతారా? హవ్వా!!
బిగ్ బాస్-6 ఫేమ్, హీరోయిన్ సనా ఖాన్ గుర్తుందా. హాట్ గ్లామరస్ రోల్స్ మాత్రమేచేస్తూ చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోసిన సనాఖాన్ తాజాగా మహిళల వస్త్రధారణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యలు చిన్న దుస్తులు వేసుకోవడానికి భర్తలు ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నలు వేస్తోంది. అంతేకాదు ఆ సమయంలో తనకేదో దెయ్యం పట్టింది, అందుకే తన సినిమాల్లో ఆధునికత పేరులో పిచ్చి బట్టలు వేసుకున్నాను, ఇపుడు సిగ్గుపడుతున్నాను అంటూ వ్యాఖ్యానించడం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రుబీనా దిలైక్‌తో నిర్వహించిన పోడ్కాస్ట్లో సనాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సైతాన్ కారణంగానే సింప్లిసిటీకి బదులు మోడ్రన్ దుస్తులు, సల్వార్-కమీజ్పై స్లీవ్‌లెస్ ధరించేలా చేసిందని, తన జీవితంలో అదొక అధ్వాన్నమైన సమయమని చెప్పింది. ప్రస్తుతం తప్పు ఏంటో తెలుసుకున్నా, సిగ్గుపడుతున్నా అని పేర్కొంది. అంతేకాదు ప్రతీ పురుషుడు తన భార్య నిరాడంబరంగా దుస్తులు ధరించాలని కోరుకుంటాడు, కానీ కొంతమంది ఎక్స్పోజింగ్ దుస్తులు వేసుకునేలా భార్యల్ని,ఎందుకు ప్రోత్సహిస్తారో అర్థం కాదని వాపోయింది. ‘ఆమె నీ భార్య కొంచెమైనా ఆత్మగౌరవం ఉండాలంటూ’ హితవు పలకడం గమనార్హం. కాగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో ‘జై హో’, టాలీవుడ్లో కళ్యాణ్‌రామ్‌తో ‘కత్తి’, నాగార్జునతో ‘గగనం’, మంచు మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లో నటించింది సనాఖాన్. రియాల్టీ షో బిగ్ బాస్ 6లో కూడా హల్ చల్ చేసింది. 2019 తర్వాత సనా ఖాన్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఆ తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుని అందర్నీ దిగ్భ్రాంతికి గురించింది. 2023లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. -
Krithi Shetty: పింక్ కలర్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి (ఫోటోలు)
-
అంతర్జాతీయ బ్రాండ్‌తో చేతులు కలిపిన స్వదేశ్.. లిమిటెడ్ ఎడిషన్!
హైదరాబాద్: భారతీయ కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే స్వదేశ్ బ్రాండ్, అంతర్జాతీయ వస్త్ర తయారీదారులు ఫాల్గుణి షేన్ పీకాక్‌తో కలిసి హైదరాబాద్‌లో స్వదేశ్ ఫ్లాగ్ షిప్ స్టోర్‌లో ప్రత్యేక ప్రదర్శనను ప్రకటించారు. ఫాల్గుణి షేన్ పీకాక్ 20వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ పద్ధతులను అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్ తో మేళవించారు. కాంచీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి.స్వదేశ్లో ప్రత్యేకంగా లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోచర్.. భారతీయ హస్తకళా వారసత్వాన్ని పునఃసమీక్షిస్తుంది. వినూత్న డిజైన్‌తో పాటు అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఫాల్గుణి షేన్ పీకాక్ 20 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ కోచర్ డిజైనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంప్రదాయ కళానైపుణ్యాన్ని జోడిస్తూ, రంగులతో ప్రయోగాలు చేస్తూ సరిహద్దులను విస్తరించింది. వర్చువల్ స్టైలింగ్ వంటి మార్గదర్శక ఫీచర్ల ద్వారా టెక్నాలజీ పరంగా బ్రాండ్ అభివృద్ధి చెందింది. అందుకే ఇది సెలబ్రిటీలకు సైతం నచ్చేసింది.రెండు దశాబ్దాల ఫ్యాషన్ ఆవిష్కరణను ప్రతిబింబిస్తూ, ఫాల్గుణి షేన్ పీకాక్ సహ వ్యవస్థాపకుడు షేన్ పీకాక్ ఇలా పేర్కొన్నాడు, "స్వదేశ్‌తో కలిసి నడవడం స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే మా డిజైన్లకు భారతీయ హస్తకళ తోడవటంతో ఫ్యాషన్‌లో కొత్త కోణాలను అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా భారత్‌తో పనిచేసి ఇక్కడి వారసత్వం, సంస్కృతి నుంచి ప్రేరణ పొందే ఆకృతులను తయారు చేశాం. ఈ లిమిటెడ్ ఎడిషన్ సేకరణలో క్లిష్టమైన జరీ వర్క్ తో బెస్పోక్ చీరలు ఉన్నాయి. హైదరాబాద్ లోని స్వదేశ్ స్టోర్‌ను సందర్శించేందుకు వస్త్రప్రియులను ఆహ్వానిస్తున్నాము" అని చెప్పారు. -
Karisma Kapoor: బాలీవుడ్ బ్యూటీ సీరియల్ లుక్స్.. గ్లామర్ మాత్రం (ఫొటోలు)
-
తాజా మొలకలు త్వరగా ఎదిగేలా చేస్తుంది.. ఎలా అంటే?
మొలకెత్తిన గింజలు తినడం పాత అలవాటే అయినా, వాటికి లేలేత ఆకులు పుట్టుకొచ్చేంత వరకు పెంచి, వాటిని ‘మైక్రోగ్రీన్స్’ పేరిట తినే అలవాటు ఇటీవలి కాలంలో పెరుగుతోంది. మట్టి కుండీల్లో గింజలు చల్లి ‘మైక్రో గ్రీన్స్’ పెంచుతుంటారు. ఇలా పెంచడం వల్ల కొన్ని గింజలు కుళ్లిపోయి, వృథా కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ‘ఆటోస్ప్రౌట్’ పరికరం గింజలను ఏమాత్రం వృథా పోనివ్వకుండా, తక్కువ వ్యవధిలోనే ‘మైక్రోగ్రీన్’ మొలకలు ఎదిగేలా చేస్తుంది.దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. దీనిలో అరకిలో గింజలను వేస్తే, రెండు నుంచి ఆరు రోజుల్లోగా ఆకుపచ్చని మొలకలు పెరుగుతాయి. స్టెయిన్లెస్ స్టీల్, టెంపర్డ్ గ్లాస్, కొద్ది కలప తప్ప ప్లాస్టిక్ లేకుండా తయారు చేసిన ఈ పరికరం అధునాతన మిస్టింగ్ టెక్నాలజీతో త్వరగా ఆరోగ్యకరమైన మొలకలు ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇందులో మూడు అంతస్తుల ట్రేలలో గింజలను చల్లుకుని పెట్టుకోవచ్చు. దీనిని ఆన్ చేసుకుంటే, దీని లోపల ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి, మిస్టింగ్ టెక్నాలజీ సౌకర్యంతో వెలువడే తేమ వల్ల మొలకలు త్వరగా పెరుగుతాయి. ‘ఆటోస్ప్రౌట్’ స్వీడిష్ కంపెనీ ఈ ఆటోమేటిక్ స్ప్రౌటింగ్ మెషిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5,192 స్వీడిష్ క్రోనాలు (రూ.41,369)దుస్తులను త్వరగా ఆరబెడుతుంది..దుస్తులను ఉతుక్కోవడం ఒక ఎత్తు అయితే, వాటిని ఆరబెట్టుకోవడం మరో ఎత్తు. ఎండ కాసే సమయంలో ఆరుబయట దండేలకు ఆరవేస్తే దుస్తులు ఏదోలా ఆరిపోతాయి. మబ్బు పట్టినప్పుడు, ఎడతెగని ముసురు కురిసేటప్పుడు దుస్తులను ఆరబెట్టుకోవడం ఎవరికైనా సవాలే! ఇంటి లోపల దండేలు కట్టుకుని, దుస్తులను ఆరబెట్టుకుందామనుకుంటే, అవి ఒక పట్టాన ఆరవు. గంటలు గడిచే కొద్ది ముక్క వాసన కూడా వేస్తాయి.అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు డచ్ కంపెనీ ‘స్పీడ్డ్రైయర్’ తాజాగా ఈ రోటరీ క్లాత్స్ ర్యాక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఆరుబయటనే కాదు, ఇంటి లోపల కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది. దీనికి దుస్తులను తగిలించి, ఆరబెడితే, ఇది వేగంగా తిరుగుతూ దుస్తులు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. ఒకసారి దుస్తులను ఆరబెట్టడానికి ఇది వినియోగించుకునే విద్యుత్తు కేవలం 10 వాట్లు మాత్రమే! దీని ధర 219 యూరోలు (రూ.20,519) మాత్రమే! -
మినీ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!
బాలీవుడ్ జాన్వీ కపూర్ తన అభినయంతో వేలాదిమందు అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ డిజైనర్ వేర్ దుస్తులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉలాజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ టైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది ఆ ట్రైలర్. అందులో లీడ్రోల్లో కనిపించిన జాన్వీకపూర్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఆమెలో దాగున్న సరికొత్త నటన ఈ రోల్ ద్వారా బయటపడనుంది కూడా. ఇక ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌కి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వీ తెల్లటి రన్‌వే మినీ దుస్తులతో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. ఈ డ్రెస్‌ని డీప్ ఆఫ్-ది-షోల్డర్ నెక్లైన్, స్విర్ల్ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. అందుకు తగ్గట్టుగా చెవిపోగులు, ఉంగరాలు ధరించి స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేసింది. ఈ దుస్తులు సీ త్రూ సిల్హౌట్ అయినా ఆమె దీన్ని కవర్ చేసేలా లోపల చక్కటి స్కిన్ వేర్ని ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. అయితే నెటిజన్లు ఈ డ్రెస్ చూడటానికి మనం ఇష్టంగా తినే రవ్వదోసలా ఉంటంటూ ఒకరూ, మరికొందరూ టీవీలు, డైనింగ్ టేబుల్స్‌పై వేసే తెల్లటీ ఎంబ్రాయిడరీ క్లాత్‌లా ఉందని కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!) -
ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. అమలాపాల్‌పై విమర్శలు!
మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమాయకమైన అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే తల్లైన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం లెవెల్ క్రాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో అమలాపాల్ ధరించిన డ్రెస్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది.అలాంటి డ్రెస్‌లో కాలేజీ ఈవెంట్‌కు రావడం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలంటూ అమలాపాల్‌ను విమర్శిస్తున్నారు. అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ తాజాగా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపింది. అలాంటి డ్రెస్‌లో ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదని.. అయితే ఇక్కడ నా ఫోటోలు ఎలా తీశారనేదే అసలు సమస్య అని అన్నారు. ఆ దుస్తుల్లో నన్ను చూడటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడలేదని అమలాపాల్ స్పష్టం చేసింది. అంతే కాదు.. నేను అన్నిరకాల దుస్తులు ధరిస్తానని తెలిపింది. డ్రెస్ ఎంపిక విషయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చింది. కాగా.. గత నెలలోనే అమలాపాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించినట్లు ప్రకటించింది. ఆమె నటించిన లెవెల్ క్రాస్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
ఈ హీరోయిన్‌కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!
ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సాయంతో రోబోట్లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్‌ని రోబోటిక్ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్‌ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ డ్రెస్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్‌ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్‌లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్ అయినా ఫ్యాషన్ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!) -
స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్ డ్రస్‌లో ఓ రేంజ్ స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. గోల్డెన్ కలర్ చెవుపోగులు, లైట్ మేకప్‌తో గ్లామరస్‌గా ఉంది. అంతేగాదు ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే..ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడంకూల్డ్రింగ్స్, అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటంరోజంతా హైడ్రేషన్‌గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్.. ఫోటోలు
-
గులాబీలా మెరిసిపోతున్న హీరోయిన్ రాశీ సింగ్.. చూస్తే అంతే (ఫొటోలు)
-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
-
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్‌లో శ్రీలీల (ఫోటోలు)
-
Rakul Preet Singh: డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
Meena Durairaj: యెల్లో..యెల్లో..మీనా బ్యూటిఫుల్లో..! (ఫోటోలు)
-
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
-
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
-
Pragya Jaiswal: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
-
Sonakshi Sinha Photos: వెల్వెట్ డ్రెస్‌లో అందంగా.. సోనాక్షి (ఫొటోలు)
-
కోట్లు సంపాదించే మృణాల్.. మరీ అంత చీప్ డ్రెస్సులు ధరిస్తుందా?
-
కలర్‌ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
Stunning Looks of Sonakshi Sinha: రెడ్ లెహంగాలో జిగేలుమంటున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
-
బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్ ఎంతమంది అబ్బాయిల మైండ్స్‌లో నాటుకుపోయిందో! ‘బొమ్మరిల్లు’లో అలా అడిగిన హ..హ..హాసిని.. జెనీలియా కూడా ఎంతమంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిందో! ఇప్పటికీ ఆమె పట్ల అదే క్రేజ్ చిన్న నుంచి పెద్ద వరకు. ఆమె గ్లామర్‌కీ అదే గ్రేస్..ఆడవాళ్లకు మెరిసే ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు. నా దృష్టిలో ఆడవాళ్ల జ్యూలరీలో ముక్కుపుడకను మించింది లేదు. అలాగే చీరకట్టును బీట్ చేసే ట్రెడిషనల్ వేర్ లేదు! అని అంటోంది జెనీలియా. ఇక ఆమె ట్రెడిషనల్ వేర్లో అయినా.. మోడర్న్ డ్రెస్‌లో అయినా! దేన్నయినా ఫ్యాషన్‌గా మలచుకోగల స్టయిల్ జెనీలియాది!. ఆ స్టయిల్ కోసం జెనీలియా ఈ బ్రాండ్స్‌నీ కన్సిడర్ చేస్తుంది. ఒసా బై ఆదర్శ్ వెడ్డింగ్ కలెక్షన్స్‌కి కేరాఫ్ ఇది. దీని స్థాపకుడు ఆదర్శ్ మఖ్రియా. దేశంలోని సంప్రదాయ వస్త్రరీతులన్నిటికీ తన బ్రాండ్‌ని పడుగు.. పేకలుగా మార్చాడు. ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్‌లతో పెళ్లి వస్త్రాలకు కొత్త కళను అద్దుతాడు. అందుకే ఈ డిజైన్స్‌కి డిమాండ్ ఎక్కువ. కోల్‌కతా, ఢిల్లీల్లో స్టోర్స్ ఉన్నాయి. మల్టీడిజైనర్ స్టోర్స్‌లోనూ ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ధర మాత్రం సామాన్యులకు అందేలా ఉండదు. .జెనిలియా ధరించిన ఒసా బై ఆదర్శ్ డ్రెస్ ధర రూ. 1,77,555 నారాయణ్ జ్యూలర్స్ 80 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఇది. సంప్రదాయ నగలు.. ఆధునిక ఆభరణాలు.. రెండిటికీ పెట్టింది పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజీలేని నాణ్యత.. కల్తీకాని నమ్మకానికి పర్యాయపదం ఈ జ్యూలర్స్. ధర.. ఆభరణాల డిజైన్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ద పింక్ పోట్లీ ఇది ముంబై బ్రాండ్. హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాగ్స్, పోట్లీలు, బట్వాలకు ప్రసిద్ధి. దీపా, ప్రణతి అనే తల్లీకూతుళ్ల ఆవిష్కార ఈ పింక్ పోట్లీ. ప్రొడక్షన్ విషయాలు దీపా చూసుకుంటే బ్రాండింగ్, మార్కెటింగ్, బిజినెస్ వ్యవహారాలు ప్రణతి చూసుకుంటుంది. ఆలియా భట్, కరీనా కపూర్, సోనం కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలెందరో దీనికి హాట్ ఫేవరేట్స్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. జ్యూలరీ బ్రాండ్: నారాయణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే..!) -
Tamannaah Bhatia: బార్బీ బొమ్మలా మెరిసిపోతున్న తమన్నా!
-
రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...
ఇషా అంబానీ నిర్వహించిన రోమన్ హోలీ ఈవెంట్లో కాబోయే మరదలు రాదికా మర్చంట్ శాటిన్ డ్రెస్‌లో ఆకర్షించింది. అందానికి తగ్గ స్టెయిలష్ బ్రాండ్లతో మరింత అందంగా కనిపించే రాధికా ఈ డ్రస్‌లో సినీ సెలబ్రెటీలను తలదన్నేలా కనిపించింది. కాక్టెయిల్ పార్టీలకు కరెక్ట్‌గా సరిపోయే డ్రస్‌లో అదిరిపోయింది. అందరి అటెన్షన్ ఆమె ధరించే డ్రస్పైనే పడింది. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రెటీలు, బాలీవుడ్ సినీ తారలు తమదైన స్టైయిలిష్ డిజైన్ వేర్లు, ఆభరణాలతో సందడి చేశారు. ఇందులో ఇషా అంబానీ గౌను డిజైనింగ్‌కే 100 గంటలు పట్టగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన శాటిన్ డ్రెస్ ధర ఏకంగా రూ. 6.4 లక్షలు పలుకుతుందట. రాధిక ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా అత్యంత లగ్జరియస్ ఆభరణాలను కూడా ధరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీలకు కాబోయే కోడలకు తగ్గ రేంజ్లో ఆమె డ్రస్ ధర ఉంది. అలాగే ఆమె నెక్కు ధరించిన నయీమ్ ఖాన్ గోల్డ్ ఆర్మీరీ జోడియాక్ క్లచ్ ధర ఏకంగా రూ. 1.67 లక్షలు. అంతేగాదు ఆమె ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా బంగారంతో డిజైన్ చేసిన లెహంగాతో అందర్నీ మంత్రముగ్ధులన్ని చేసిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి తగ్గ సింపుల్ డిజైనింగ్ వేర్లతో అందర్నీ కట్టిపడేసే ఆకర్షణీయమైన అందం రాధిక సొంతం. (చదవండి: ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!) -
అద్భుతమైన క్రిస్టల్ గౌనుతో టాప్ 20కి చేరుకున్న సినీ శెట్టి!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్బాడీ డ్రెస్‌లో అదిరిపోయింది. వీ నెక్లైన్తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్‌వర్క్‌లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్‌ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్‌గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..) -
స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక!
నిహారిక కొణిదెల.. యాంకర్‌గా, నటిగా, నిర్మాతగానే కాదు ట్రెండీ లుక్స్‌తో ఫ్యాషన్ ఐకాన్ గానూ ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ఆమెకు స్ట్రీట్ షాపింగే ఇష్టమట. సెలబ్రిటీలు అందరూ బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం స్ట్రీట్ షాపింగే ఇష్టం. నచ్చిన వాటిని వెదికి వెదికి వెలికి తీస్తాను అంటోంది. ఇక ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను క్యారీ చేస్తున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. డ్రెస్ బ్రాండ్:తన్వా బై దీపిక హైదరాబాద్ ఎన్ఐఎఫ్టీలో డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన దీపిక ఆనంద్.. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. ఈ మధ్యనే హైదరాబాద్‌లోనే ‘తన్వా బై దీపిక’ పేరుతో సొంత ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరెట్‌గా మారింది. ధరలు.. సామాన్యుడికీ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ నిహారిక ధరించిన తన్వా బై దీపిక డిజైనర్ డ్రస్ ధర రూ. 21,000/- జ్యూలరీ బ్రాండ్: రియా జ్యూయెల్స్ వెరైటీ డిజైన్స్‌కు క్రేజీ కేరాఫ్ ఈ బ్రాండ్. అన్ని రకాల బంగారు, వెండి పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్ వంటి ఇతర డిజైనర్ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. ఉంగరం ధర: రూ.750/-, కమ్మలు ధర: రూ.4,200/- (చదవండి: సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!) -
'అఖండ' హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
‘కంచె’ సినిమాతో తెలుగులో ఎంటరైన ప్రగ్యా జైస్వాల్‌కి ఇక్కడ అభిమానం గణం ఎక్కువే!. మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా ప్లాన్ బి ఉండాలి. అప్పుడే ఎక్కడైనా సంతోషంగా ఉండగలం అంటోని ప్రగ్యా. ఇక ఆమెకు అంతటి ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌కి కారణం తన గ్లామర్. ఆ గ్లామర్కొక స్టయిల్ని క్రియేట్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్‌దే. ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. సావన్ గాంధీ.. ఢిల్లీకి చెందిన సావన్ గాంధీ కొంత కాలం పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసి.. తర్వాత తన పేరు మీదే ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించాడు. అందమైన డిజైన్స్‌తో అనతికాలంలోనే సూపర్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.అల్లికలు, కుందన్ వర్క్స్‌లోనూ ఈ బ్రాండ్ ఫేమస్. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక ప్రగ్యా ధరించిన చీర ధర ఏకంగా రూ. 1,59,000/-. ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే ఇద్దరు స్నేహితులు.. సంప్రదాయ రాజాభరణాలు, గిరిజన ఆహార్యాన్ని ఆధునిక తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి నమూనాలనే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఈనా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఈనా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్ లభించే ఈ పోల్టిస్, క్లచెస్, బకెట్ బ్యాగ్స్‌కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందుకే, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తగని మోజు. ధర కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. ఇక్కడ ప్రగ్య ధరించి బ్యాగ్ ధర రూ. 9,800 (చదవండి: శృతి హాసన్ ధరించి బ్రౌన్‌కలర్ చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
యానిమల్ సక్సెస్ మీట్లో అలియా ధరించిన డ్రస్ ధర ఎంతంటే..?
సెలబ్రెటీలు ధరించిన డ్రస్‌లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్‌లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత ఖరీదు? అనిపిస్తుంది. అలాంటి డ్రస్ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్‌కి. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ ఈరేంజ్‌లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్ జమలు కుదు" పాట ఎంతలా వైరల్ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మూవీ సక్సస్‌ని పంచుకునేందుకు మంచి గ్రాండ్ లుక్‌తో వచ్చారు. ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్ కటౌట్ డ్రస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ రసారియో కలక్షన్స్ ఈ డ్రెస్‌ని డిజైన్ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ రణబీర్, అలియా జంట, రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్‌కపూర్, డైరెక్టర్లు,తదితర బాలివుడ్ తారాగణమంతా హాజరయ్యారు. (చదవండి: జమల్ జమలు కుదు... యానిమలు!) -
క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్‌ను స్పెషల్‌గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్‌కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్‌లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్‌గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్‌కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
నైట్ పార్టీలో కృతిసనన్ వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
బాలీవుడ్ భామ కృతిసనన్.. బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సక్సెస్‌లతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ ఏడాది తెలుగులో ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే, తొలుత మోడల్‌గా కెరీర్ ఆరంభించిన కృతిసనన్ ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాషన్ సెన్స్‌ను కనబరుస్తూ ట్రెండీ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఓ నైట్ పార్టీలో కృతి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్న ఈ మినీ డ్రెస్ ధర అక్షరాలా రూ. 1.7 లక్షలు. అలాయా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్‌కు క్యూట్ బెల్ట్ మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇక ఎప్పటిలాగా సింపుల్ అండ్ న్యూడ్ మేకప్ లుక్‌లో తళుక్కున మెరిసింది మన మిమీ. -
డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి..
ప్రిన్స్ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని ప్రూవ్ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్ డయానికి సంబంధించిన డ్రస్ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్‌ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్‌ని ప్రిన్స్ డయానా 1985లో ఫోరెన్స్లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్ పర్యటనలో ఈ డ్రస్‌తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్ వేలం సంస్థ పేర్కొంది. ఈ డ్రస్ టాప్ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్లో ఉండగా, స్కర్ట్ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. లండన్‌లో జూలియన్స్ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్ ఐకాన్‌కి కేరాఫ్ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం. నిజానికి జూలియన్స్ వేలం నిర్వాహకులు ఈ డ్రస్ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్ ప్రిన్స్ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు. (చదవండి: శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?) -
‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన!
మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఉత్సాహంతో కూడిన మద్దతు లభిస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. చేనేత కళను ప్రోత్సహిస్తూనే, ఈ పనిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతున్నదన్నారు. చేనేత పని అంత సులభం కాదని, ఇది గణితంతో ముడిపడివుందని, అలాగే ఎంతో సహనం అవసరమన్నారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్‌తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రామమందిరం ట్రస్ట్‌కు చెందిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌లు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆ చూకీ చెబితే రూ. 50 వేలు! -
దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా దూసుకుపోతుంది. బాలీవుడ్‌తో పాటు తాజాగా టాలీవుడ్‌లోనూ జాన్వీ గ్రాండ్‌గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్‌లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఖుషీ ధరించిన డ్రెస్ అండ్ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఖుషీ కపూర్‌కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ. గతంలో ఇదే డ్రెస్‌ను దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్‌ను రిపీట్ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్ చోకర్నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్‌లో ఖుషి కపూర్‌తో పాటు సుహానా ఖాన్, వేదాంగ్ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ కిడ్స్ ఉండటంతో ది ఆర్చీస్పై ఇప్పటికే హైప్ నెలకొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!
దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్ అని కితాబిస్తున్నారు. వర్షా. యాదవ్ పేరిట ఉన్న ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు! View this post on Instagram A post shared by Varsha Bai (@varsha.yadav777) -
దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!
పట్టుబట్టలతోనే కాదు మనవైన సంప్రదాయ దుస్తులతోనూ వెలిగిపోవచ్చు. మోడ్రన్ షేర్వాణీలను ధోతీ ప్యాంట్లతో మ్యాచ్ చేయచ్చు. పర్యావరణ అనుకూలమైన డ్రెస్సులను ఎంచుకోవచ్చు. పాత కాలం నాటి ప్రింట్లు, హ్యాండ్‌మేడ్ డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఎవర్గ్రీన్ లుక్‌తో రాబోయే రోజులను ప్రకాశవంతంగా మార్చడానికి ఈ దీపావళి నుంచే మొదలుపెట్టవచ్చు. పండగ రోజున దీపాలనే కాదు సరికొత్త ట్రెండ్‌తో వార్డ్ రోబ్‌లను కూడా వెలిగించవచ్చు. ప్రతి వేడుకలోనూ మెరిసిపోవచ్చు. నియో–సంప్రదాయం పాతకాలం నాటి కుర్తాలు, షేర్వాణీలు ఇప్పుడు కొత్తగా రూపాంతరం చెందాయి. ఈ దీపావళికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే, లేయర్డ్ షేర్వాణీలు, ధోతీ ప్యాంట్లను ధరించవచ్చు. వీటిని మోడర్న్ డిజైన్, ఓల్డ్ ట్రెడిన్ తో మిళితం చేయచ్చు. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ వల్ల సొగసైన రూపాన్ని పొందవచ్చు. ఇక నియాన్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిలో బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి సాధారణ రంగుల నుండి కాంతివంతంగా కనిపిస్తాయి. పర్యావరణ అనుకూలం సరైన అవగాహనతో ఫ్యాష పర్యావరణ అనుకూల బట్టల వైపు మొగ్గు చూపుతోంది. సేంద్రియ పత్తి, వెదురు, జనపనార బట్టలు స్థిరంగా ఉండటమే కాకుండా మట్టి సొబగులను కూడా వెదజల్లుతాయి. సురయ్యా, ఇతర ప్రముఖ బ్రాండ్లు ఈ ట్రెండ్‌లో ముందంజలో ఉన్నాయి. చేతితో తయారు చేసిన పాదరక్షలు పాదరక్షల్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యం తనదైన ముద్ర వేస్తోంది. జూతీలు, కొల్హాపురీ, ఎంబ్రాయిడరీ ఇతర అలంకారాలతో చేతితో తయారు చేసిన పాదరక్షలలో దేనిని ఎంపిక చేసుకున్నా పండగ కళ కనిపిస్తుంది. ఇవి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా, వేడుకలో ప్రత్యేకమైన టచ్‌ను అందిస్తాయి.పేస్టల్స్ పెరుగుదల దీపావళి ప్రకాశవంతమైన రంగులకు పర్యాయపదంగా ఉన్నప్పటికీ, లావెండర్, మింట్, బేబీ పింక్ పేస్టెల్ కలర్స్ పండుగ కళను పెంచుతాయి. ఈ రంగులు ప్రశాంతతతోపాటు రిచ్‌నెస్‌ను కళ్లకు కడతాయి. డిజిటల్ ప్రింట్లు సాంప్రదాయ మూలాంశాలు సాంకేతికత మన జీవితంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తున్నప్పుడు ఫ్యాషన్‌ను మాత్రం ఎందుకు వదిలివేయాలి... అందుకే, లోటస్ లేదా పీకాక్ ఫెదర్స్తో కూడిన భారతీయ సంప్రదాయ మూలాంశాలను ప్రదర్శించే డిజిటల్ ప్రింట్లు గొప్పగా కనిపిస్తున్నాయి. ఈ ప్రింట్లు, డిజైన్లు సంప్రదాయానికి ఆధునిక టచ్‌ను అందిస్తున్నాయి. పాతకాలపు డిజైన్ల పునరుద్ధరణ బనారసీ సిల్క్స్, చికంకారి ఎంబ్రాయిడరీ, బంధని వంటి పాతకాలపు వస్త్రాల ఆకర్షణ మళ్లీ మళ్లీ ఆకట్టుకుంటుంది. డిజైనర్లు ఈ సంప్రదాయ వస్త్రాలను ఆధునిక దుస్తులలో డిజైన్ చేస్తున్నారు. మనదైన గొప్ప వారసత్వాన్ని దేశీయ కళాకారులు కాపాడుతున్నారు. (చదవండి: అందాల చందమామ కాజల్ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
AI ఆవిష్కరణలకు వేదికగా మారిన అడోబీ
ప్రముఖ టెక్ దిగ్గజం అడోబీ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ‘అడోబీ యాన్యువల్ మ్యాక్స్ కాన్ఫిరెన్స్ నిర్వహించింది. అక్టోబర్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 10 ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్‌లో అడోబీ సంస్థ సుమారు 11 కొత్త ఏఐ ఆధారిత ప్రోటో టైప్ టూల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్నీక్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వీడియో అప్స్కేలర్, ప్రాజెక్ట్ స్టార్డస్ట్లు హైలెట్‌గా నిలిచాయి.ముఖ్యంగా ఆబ్జెక్ట్-అవేర్ ఎడిటింగ్ ఇంజన్ ఏఐ టూల్ సాయంతో ఫోటోల్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించడం కావాల్సిన వాటిని జత చేయొచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ ప్రింరోస్ చూపురులను వీపరితంగా ఆకట్టుకుంది. ‘ఫ్లెక్సిబుల్ టెక్స్టైల్ డిస్ప్లే’లో భాగంగా అడోబీ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల డిజైన్లు మారిపోడంతో పాటు నచ్చిన చిత్రాల్ని సైతం వీక్షించొచ్చు. ఇప్పటికే అడోబీ స్మార్ట్ డిస్ప్లే ఫాబ్రిక్ టెక్నాలజీని గతంలోనే పరిచయం చేసింది. కానీ ఇప్పుడు ఈ సాంకేతికలో ఏఐని జోడించింది. అందంగా తీర్చిదిద్దింది. -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్‌తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. -
సింగిల్ షోల్డర్..డబుల్ బ్యూటీ!
క్లాస్ గా ఉండాలి.. కలర్ ఫుల్ గా కనిపించాలి. కంఫర్ట్వేర్గా కరెక్ట్ అనిపించాలి .. వెస్టర్న్లుక్ ఉండాలి.. ఇండియన్ స్టైల్ లో మెరవాలి. వీటన్నిటికి ఒకే ఒక ఆన్సర్... సింగిల్ షోల్డర్ టాప్స్. సంప్రదాయపు వేడుకలకు వెస్టర్న్ పార్టీలకు నప్పే ఈ డ్రెస్సింగ్‌కి కేప్ స్టైల్‌గానూ పేరుంది. లెహంగా, పలాజో, టులిప్ ప్యాంట్స్‌కి నప్పే ఈ సింగిల్ షోల్డర్ కుర్తీలు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలకు ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా సింగిల్ షోల్డర్ కుర్తీలను ఎంచుకోవచ్చు. ప్లెయిన్ లేదా ఫ్లోరల్ గెట్ టు గెదర్, బర్త్ డే పార్టీలకు ప్లెయిన్, ఫ్లోరల్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ డ్రెస్సింగ్ లోనే ప్రత్యేకత ఉంటుంది కాబట్టి, ఇతర అభరణ హంగులేవీ అక్కర్లేదు. (చదవండి: యాంటీ యాక్నె డ్రింక్ తాగారా?) -
ఆ ఊరిలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులు దుస్తులు లేకుండా..
కొన్ని ఊర్లలో చాలా వింతైనా ఆచారాలు ఉంటాయి. వింటేనా చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఊరిలా ఓ వింత ఆచారం ఉంది. అది వింటే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. బాబోయ్ ఇదేమి ఆచారం రా బాబు అనేస్తారు. అంత వింతగా జుగుప్సకరంగా ఉంటుంది. వివరాల్లోకెళ్తే..హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక ఐదు రోజుల పాటు దుస్తులు ధరించడం మానేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. ఎందుకిలా అంటే?.. గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతరట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలంగినం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట. ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ ఐదు రోజులు వారికి గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక భక్తి మార్గం అని చెప్పాలి. అంతేగాదు దుస్తులు దైవంతో అనుబంధం ఏర్పరుచుకోవడానికి అవరోధంగా అక్కడ మహిళలు భావిస్తారట కూడా. నిజమే కదా! ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడు ముందు సిగ్గు, బిడియం ఉండకూదు. మనం చిన్నగా ఉన్నప్పుడూ మన తల్లిదండ్రలు వద్ద ఎలా ఉంటామో అలానే భగవంతుడితో ఉండాలని చెప్పకనే చెబుతున్నారు వీళ్లు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!
శ్రీలీల.. తెలుగు ప్రేక్షకుల మైండ్‌లో రిజిస్టర్ అయిన పేరు.. హార్ట్‌లో ప్రింట్ అయిన రూపు!. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు చిత్ర పరిశ్రమ అనేది గౌరవనీయమైన ఇండస్ట్రీనే. హీరోయిన్ అవ్వాలనుకునే తెలుగమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది ముద్దగుమ్మ శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఆమె అటు సినిమాలతో ఇటు తన ఫ్యాషన్ స్టయిల్‌తో అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల వార్డ్ రోబ్‌లోని ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ.. నితికా గుజ్రాల్.. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ డిజైన్స్‌కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. శ్రీలీల ధరించిన నితికా గుజ్రాల్ ధర రూ. 72,500/- మంగత్రాయ్ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో మంగత్రాయ్ జ్యూయెల్స్ ఒకటి. 1905లో చంగల్ లాల్ గుప్తా, అతని కుమారుడు దర్పణ్ గుప్తా కలసి ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఆభరణాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు తయారు చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. --దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ ధర తెలిస్తే..షాకవ్వుతారు!
స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత ఎప్పుడూ ఆ ప్రీఫిక్స్ అవసరం రానివ్వకుండానే కెరీర్‌ని మలచుకుంది సోనాక్షి సిన్హా.. కేవలం తన టాలెంట్‌తోనే! సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ పాత్రల ఎంపికలో తన స్టయిల్ ప్రత్యేకమని చాటుకుంది. ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌నే క్రియేట్ చేసుకున్న ఆమె ఫాలో అయ్యే బ్రాండ్స్ కొన్ని..‘ఎలాంటి సమస్యకైనా పనిని మించిన మందు లేదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో నా కాలక్షేపం.. జిమ్‌లో గడపడం, పెయింటింగ్, స్కెచెస్ వేయడం, సినిమాలు చూడడమే! ఏకే – ఓకే... ఫ్యాన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న అనామికా ఖన్నా తపనకు.. కోల్‌కతాలోని ఆమె డిజైనర్ స్టోర్ అద్దం పడుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రాల పద్ధతులకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడం అనామికా ప్రత్యేకత. అదే అమెను.. వారానికో డ్రెస్ కూడా అమ్ముడవని రోజుల నుంచి సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పడుకోణ్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలబ్రిటీలు అనామికా డిజైనర్ వేర్లో ఒక్కసారైనా మెరిసిపోవాలని ఆశపడే స్థాయికి ఎదిగేలా చేసింది. ఆపై తన బ్రాండ్ నేమ్‌ని పలు దేశాలకూ విస్తరింపజేసి తిరుగులేని ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. సామాన్యులు వీటి ధరలను అందుకోవడం కష్టమే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సోనాక్షి సిన్హా ధరించి ఏకే ఓకే డ్రస్ ధర రూ. 38,000/- క్యూరియో కాటేజ్.. ఇదొక మహిళల బ్రాండ్! ఇక్కడ పనిచేసేవారందరు కూడా మహిళలే! ఒకరకంగా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్ ఇది. అందుకే ఇక్కడ లభించే ఏ డిజైన్‌ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బఠీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్‌తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. సోనాక్షి సిన్హా ధరించిన జ్యూలరీ ధర రూ. 23,990/-, ఉండగం ధర రూ. 6,990/- ---దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..!
సోషల్ మీడియాలో జనం తమకు ఎదురైన మంచి లేదా చెడు అనుభవాలను వెల్లడిస్తుంటారు. దీనిపై అదే సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఒక మహిళ ఇటువంటి విచిత్ర ఉదంతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఎదురైన అనుభవం తనకు నిద్రపట్టనీయలేదని ఆమె ఆ పోస్టులో వాపోయింది. ఆ మహిళ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దీంతో నేను మా ఇంటి బాల్కనీలోకి వచ్చాను. అయితే అక్కడి దృశ్యాన్ని చూసి భయపడిపోయాను’ అని పేర్కొంది. ఆమెకు చెట్టుకు వేలాడుతూ తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక మహిళ ఆకృతి కనిపించింది. ఇది ఆమెను ఎంతో భయానికి గురిచేసింది. ఈ వీడియో చూశాక తాను విపరీతమైన భయంతో వణికిపోయానని, ఉపశమనం కోసం 10 నుంచి 15 సార్లు హనుమాన్ చాలీసా పఠించానని తెలిపారు. మర్నాటి ఉదయం ఏం జరిగిందో కూడా ఆ మహిళ తెలియజేసింది. ఉదయాన్నే తాను బాల్కనీలోకి వెళ్లి చూడగా, అప్పటి వరకూ మనసులో ఉన్న భయం తొలగిపోయిందని తెలిపింది. ఆ చెట్టుకు వేలాడుతున్నది దెయ్యం కాదని, ఎవరో మహిళ హ్యాంగర్‌కు ఆరబెట్టిన నైటీ చెట్టుపైన పడినట్లు గుర్తించానని తెలిపారు. అనిరుద్ధ్ జోషి అనే మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేయగా, దీనికి లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఒక యూజర్ ‘తాను ఇకపై రాత్రవేళ నిద్రపట్టకపోతే బాల్కనీలోకి వెళ్లను’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు రాత్రంతా బాల్కనీలోనే ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేదో’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! 🤣🤣🤣😂😂🤣🤣🤣 pic.twitter.com/N60zQjFKPx — Aniruddha Joshi (@aniruddha3365) August 20, 2023 -
బికినీతో ఎయిర్‌పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్‌ను ఇన్‌స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్ ఎయిర్‌పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్‌కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు! -
సైనిక దళాల డ్రస్ రిహార్సల్.. రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు..
ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలో నేడు సైనిక దళాల డ్రస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు అధికారులు. స్వాతంత్య్ర వేడుకలకు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగష్టు 15న జరగనున్న వేడుకలకు వివిధ సైనిక దళాలు నేడు ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నాయి. 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇక్కడ నుంచే ఉపన్యాసం ఇవ్వనున్నారు. డ్రెస్ రిహార్సల్‌కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. #WATCH | Ahead of Independence Day, full dress rehearsal of different armed forces under way at Red Fort in #Delhi (ANI) pic.twitter.com/84euGIuIe7 — TOI Delhi (@TOIDelhi) August 13, 2023 ఆగష్టు 15న ఎలాంటి ఇబ్బందులు తెలత్తకుండా మొత్తం కార్యక్రమాన్ని ముందే రిహార్సల్స్ చేస్తున్నారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రిహార్సల్స్ జరిగే మార్గాల్లో వాహనాలు రాకుండా దారి మళ్లించారు. నోయిడా నుంచి వచ్చే ప్రయాణికులకు వేరే మార్గాలను సూచించారు. ఎర్రకోట మార్గంలో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. Traffic Advisory In view of #IndependenceDay Full Dress Rehearsal on August 13, 2023, #DelhiTrafficPolice advises commuters to avoid these roads and take alternate routes at the mentioned timings. pic.twitter.com/5oAxPbkjkR — Delhi Traffic Police (@dtptraffic) August 12, 2023 యూపీలోనూ వర్కింగ్ డే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం వర్కిండే డే అని ప్రకటించారు. హర్ గర్ తిరంగ, మేరీ మాత మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 15 వేడుకల కోసం స్కూళ్లకు ఆదివారం సెలవును రద్దు చేశారు. డుస్తుంది. ఆదివారం సెలవు అయినప్పటికీ నేరుగా అధికార వర్గాలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థులు పాఠశాలలకు యధావిథిగా వచ్చి.. వేడుకల్లో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నేడు మధ్యాహ్నం భోజనం స్కీం కూడా నడుస్తుంది. ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు -
స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ తన డ్రెస్సింగ్ స్టయిల్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ బద్ధంగా చీర కట్టినా, పాశ్చాత్య దుస్తులైనా ఆమెది ప్రత్యేక శైలి. లక్షల ఖరీదు చేసే అత్యంత ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరించినా ఆమెకు ఆమే సాటి. హై-ఎండ్ బ్రాండ్లను ఇష్టపడే ఫ్యాషన్ ఔత్సాహికులందరికీ నీతా అంబానీ వార్డ్రోబ్ ఒక రోల్‌మోడల్ తాజాగా నీతా అంబానీ న్యూయార్క్ వెకేషన్లో గూచీ కో-ఆర్డ్ సెట్ ఆకర్షణీయంగా నిలిచింది. నీతా లగ్జరీ లేబుల్ గూచీ నుండి బ్రౌన్-హ్యూడ్ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అంబానీ ఫ్యాన్ పేజీ షేర్ చేసిన వివరాల ప్రకారం న్యూయార్క్ నగర వీధుల్లో ఫ్యాన్స్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో ఓపెన్ ట్రెసెస్, డైమండ్ చెవిపోగులు, ఖరీదైన ఓరాన్ చెప్పులను ధరించడం అభిమానులను ఎట్రాక్ట్ చేసింది. నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ విలువ రూ. 2.8 లక్షలు నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ భారీ ధర 2.8 లక్షలు అట. సిల్క్-శాటిన్ జాక్వర్డ్ షర్ట్ ధర 2,128 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,76,135. మరోవైపు, ఆమె మ్యాచింగ్ ట్రౌజర్ విలువ 1200 యూరోలు అంటే మన రూపాయిల్లో రూ. సుమారు 1,08,805. మొత్తం మీద నీతా అంబానీ కో-ఆర్డ్ సెట్ ఖరీదు రూ. 2,84,940 అని తెలుస్తోంది. ఓరాన్ చెప్పుల విలువ రూ. 6.5 లక్షలు నీతా అంబానీ ధరించి విలాసవంతమైన పాదరక్షల జత విలువ భారతీయ కరెన్సీలో దాదాపు 7 లక్షల రూపాయలు (రూ. 6,49,428). ఇక ఆమె చీరల విషయానికి వస్తే సాంప్రదాయ, నేత చీరలకు ముఖ్యంగా గుజరాతీ పటోలా చీరల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల రూ. 1.7 లక్షలు విలువైన డిజైనర్ నవదీప్ తుండియా రూపొందించిన నీలం , ఎరుపు రంగు కలగలిసిన గుజరాతీ పటోలా మెరిసిన సంగతి తెలిసిందే. గార్జియస్ బిజినెస్ విమెన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నీతా అంబానీ లగ్జరీ లేబుల్ వైఎస్ఎల్ హీల్స్ ఎక్కువగా ధరిస్తారు. ఆమె వార్డ్‌రోబ్‌లో ఉన్న 6 ఖరీదైన వైఎస్ఎల్ హీల్స్ ఉన్నాయట. -
తాలిబాన్ సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం, అలా జరిగితే ఇదే మొదటి సారి
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అందులో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి, యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. చివరికి మహిళలు బ్యూటీ పార్లర్లను నిషేధించారు. తాజాగా పురుషుల దుస్తులపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్దమయ్యారు తాలిబన్లు. వివరాల్లోకి వెళితే.. పురుషులు ధరించే నెక్టైలపై నిషేధం విధించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్’ డైరెక్టర్ మొహమ్మద్ హషిమ్ షాహీద్ వ్రార్ వెల్లడించారు. అఫ్గాన్‌లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్. ఆయన దీనిపై మాట్లాడుతూ.. "కొన్నిసార్లు, నేను ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆఫ్ఘన్ ముస్లిం ఇంజనీర్ లేదా డాక్టర్ నెక్‌టైని ఉపయోగించడం చూశాను. నెక్టైకి మూలం ఏంటి.. క్రిస్టియన్ శిలువను పోలి ఉందని, వీటిని నిషేధించాల్సి ఉందని" అని పేర్కొన్నాడు. నెక్టీలపై నిషేధం విధించినట్లయితే, తాలిబాన్ అధికారులు పురుషుల దుస్తులపై ఆంక్షలు విధించడం ఇదే మొడటి సారి అవుతుంది. Video: Mohammad Hashim Shaheed Wror, General Director of the Invitation and Guidance Directorate (an independent body that determines religious policies within the interim govt), said that the necktie originated from the Christian cross and that it is “ordered in Shariah that you… pic.twitter.com/UMHesWX6TM — TOLOnews (@TOLOnews) July 26, 2023 చదవండి US Woman Got 100 Amazon Orders: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
సమంత వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీలను చాలామంది ఫాలో అవుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్లు వేసుకున్న డ్రెస్సులు, వాచీలు, గాడ్జెట్స్‌పై జనాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. వాళ్లు ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఆ వార్తలు క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ స్టోరీ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనూ సామ్ అవుట్‌ఫిట్స్ సూపర్ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మయోసైటిస్ నుంచి బయటపడిన సమంత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించదని టాక్. పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన సమంత తాజాగా బాలికి వెకేషన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంది. రీసెంట్గా సమంత వేసుకున్న ఓ డ్రెస్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఓ డ్రెస్‌లో సమంత క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఇక ఆ డ్రెస్ కాస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కల్ట్ గయా కామెరూన్ నిట్ బ్రాండ్‌కు చెందిన గ్రీన్ కలర్ డ్రెస్‌లో సమంత స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 37, 790 రుపాయలు అని తేలింది. దీంతో ఇంత సింపుల్ డ్రెస్ అంత ఖరీదా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన అద్భుతమైన ఫిజిక్, స్టైల్‌తో ఫ్యాన్స్‌ను ఎపుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూత లూగించడం, లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చెయ్యడం అలవాటు.పబ్లిక్ అప్పీరెన్స్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవడం ఆమెకు అలవాటు.తన వార్డ్‌రోబ్‌లో లగ్జరీ యాక్ససరీస్‌కు పాపులర్ అయిన ఈ చయ్యా చయ్యా అమ్మడు ఇటీవల వెకేషన్‌ను ఎంజాయ్ చేసి వచ్చిందట అజర్‌బైజాన్‌లోని బాకులో ఆనందంగా గడిపిన క్షణాలుంటూ కొన్నిఫోటోలు, వీడియోతో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అజర్బైజాన్ వెకేషన్లో ధరించిన వైట్-హ్యూడ్ ట్యాంక్ డ్రెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తెల్లని పొడవాటి వైట్ గౌను, మెడలో రెండు గొలుసులు, సన్ గ్లాసెస్‌తో స్పెషల్ లుక్‌లో ఉంది. సోర్చ్ అన్నోన్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్ ధర భారతీయ కరెన్సీలో టాక్స్‌లు మినహాయించి రూ. 5,909లట. కాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం ,అర్హాన్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బీటౌన్ హీరో అర్జున్ కపూర్ల ప్రేమయాణం గురించి తెలిసిందే. -
నటి బోల్ట్ అవుట్‌ఫిట్... ఉర్ఫీ జావెద్‌ను ఫాలో అవుతున్నారుగా!
బాలీవుడ్ బుల్లితెర భామ నియా శర్మ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై, జమై రాజా, ఇష్క్ మే మార్జవాన్, నాగిన్ -4 సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికెళ్లినా ప్రతిసారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) తాజాగా ఆమె తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో నియా శర్మ బ్యాక్‌సైడ్ ఎలాంటి దుస్తులు లేకుండా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆ వీడియోలో నియా శర్మ పూర్తిగా బ్యాక్ లెస్‌గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఉర్ఫీ జావెద్‌ను ఆదర్శంగా తీసుకున్నారా? అంటూ రాసుకొచ్చాడు. ఆమెకు కనీసం దుస్తులు వేసుకోనేందుకు కూడా టైం లేదా అంటూ రాశారు. అంతేకాకుండా మరో నెటిజన్ రాస్తూ ఏకంగా దుపట్టానే డ్రెస్‌గా మార్చిసేంది అంటూ కామెంట్ చేశాడు. మరికొందరేమో చీప్ డ్రెస్సింగ్ అంటూ ట్రోల్స్ చేశారు. కాగా.. 'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె రవి దూబేతో కలిసి 'జమై రాజా' అనే ప్రముఖ షోలో కనిపించింది. నియా శర్మ బాక్స్ క్రికెట్ లీగ్, ఖత్రోన్ కే ఖిలాడీ -8, బిగ్ బాస్ ఓటీటీ లాంటి రియాలిటీ షోలలో పాల్గొంది. (ఇది చదవండి: 14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల (జూన్ 26) పుట్టినరోజు వేడుకును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.అతని ప్రేయసి మలైకా అరోరా స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్‌లో దిల్ సే చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ఛైయ్యా ఛైయ్యాకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే చర్చ జోరందుకుంది. దీని ధర అక్షరాల 99వేల రూపాయలట. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు. స్లీవ్‌లెస్ వైట్ గౌన్‌పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్ చేశారు. మలైకా వైట్ అండ్ రెడ్ గౌనులో మెరిసిపోవడమేకాదు, కిల్లింగ్ స్టెప్స్‌తో ఇరగదీసింది. ఈ వేడుకలో అతని సోదరి ఖుషీ కపూర్, అన్షులా కపూర్‌తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్, కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు సందడి చేశారు. -
డ్రెస్ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్ అయిన వీడియో
సీనియర్ బ్యూటీ శ్రియ శరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. అయితే తాజాగా శ్రియా దరించిన ఈ డ్రెస్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె నడుస్తన్నప్పుడు ఆమె డ్రెస్ ఎక్కడ జారిపోతుందో అనేంతగా ఉంది. ఆ సమయంలో డ్రెస్‌ను కవర్ చేసుకోలేక ఎంతో కష్టపడింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ తో విరుచుకపడుతున్నారు. (ఇదీ చదవండి: ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. ప్రెగ్నెన్సీ అంటోన్న నెటిజన్స్!) కొందరు అంతగా ఇబ్బంది పడే డ్రెస్ ఎందుకు వేసుకోవడం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ దారుణమైన కామెంట్ ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు శ్రియాను బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌తో పోల్చుతున్నారు. ఇలాంటి చెత్త డ్రెస్‌లు ఆమెనే ఇచ్చిందా అంటూ.. ఉర్ఫీ జావేద్ 2.0 వెర్షన్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. దీంతో శ్రీయా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 2001లో టాలీవుడ్ నుంచి ఇష్టం సినిమాతో శ్రియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె 2002లో వచ్చిన సంతోషం చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత, ఆమెకు టాలీవుడ్ టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కింది. తాజాగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఆమె చేసిన 'దృశ్యం 2' సినిమా భారీ విజయం సాధించింది. అనంతరం తను మళ్లీ బిజీ యాక్టర్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) (ఇదీ చదవండి: అడివి శేష్‌కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ) -
అలియా హాలీవుడ్ ఎంట్రీ: ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే..!
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఫ్యాన్ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ అలియా తన గ్లామర్ లుక్‌లో అందర్ని మరోసారి మెస్మరైజ్ చేసింది. బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన నెట్‌ఫ్లిక్స్ టుడమ్ 2023 ఈవెంట్‌కు హాజరైన అలియా రెండో రోజు అందంగా మెరిసిపోయింది. ఫుల్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ డ్రెస్ ఖరీదు ఎంత అనేది చర్చకు తెర లేచింది. అలియా భట్ హై వెయిస్ట్ పెప్లమ్ గౌను ధర రూ. 1.38 లక్షలు ఎక్కడ ఏమి ధరించాలో అలియా భట్‌కి తెలుసు, అందులోనూ గ్లోబల్ ఈవెంట్, హాలీవుడ్ ఎంట్రీ.. తొలిరోజు విమర్శల నేపథ్యంలో రెండో రోజు జాగ్రత్త పడింది. హై వెయిస్ట్ పెప్లమ్ , సెంటర్-బ్యాక్ స్లిట్, బాడీ ఫిట్టింగ్ గ్రీన్ డ్రెస్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. ఈ డ్రెస్ ధర 1690 డాలర్లు అంటే రూ.1,38,525 అన్నమాట. హార్ట్ ఆఫ్ స్టోన్‌తో హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు ఈ సినిమా ట్రైలర్లాంచ్తో మరో మెట్టు ఎదిగిపోయింది. క్లాస్ మినిమల్ అవతార్‌లో హార్ట్ ఆఫ్ స్టోన్ సహ-నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి పోజులిచ్చింది. ఈ ఫోటోలను షేర్ చేసిన అలియా "ఒబ్రిగాడో బ్రెజిల్...అందరి ప్రేమకు ధన్యవాదాలు! అంటూ గ్రీన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం. కాగా ఇదే ఈవెంట్లో తొలి రోజు డ్రెస్సింగ్‌కు సంబంధించి అలియా అద్భుతంగా కనిపించి నప్పటికీ, ఈవెంట్లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా విపరీతంగా ట్రోలింగ్ గురైంది. గన్ని బ్రాండ్ మ్యాచింగ్ స్కర్ట్‌తో పింక్-హ్యూడ్ గ్లోసీ జాకెట్-షేప్ టాప్‌ను ధరించింది. ఈ బ్లేజర్ ధర రూ. 39,952, మ్యాచింగ్ క్రాప్ టాప్ ధర రూ. 20,200. టోటల్‌గా పింక్-హ్యూడ్ శాటిన్ అవుట్‌ఫిట్ ధర రూ. 93,628. -
వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!
రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి భారీ విజయాలను అందుకుంది. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో పింక్ సిండ్రెల్లా డ్రెస్‌లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. డ్రెస్సే అందంగా ఉంది అనుకుంటే అంతకంటే అందమైన రకుల్ ప్రీత్‌ను చూసి ఈవెంట్‌కి వచ్చిన వారు తమ చూపు తిప్పుకోలేకపోయారు. సిండ్రెల్లా దుస్తుల్లో హోయలుపోతున్న రకుల్ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. (ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను) ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుస్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్‌ని చూసిన వాళ్లు.. 'బాలీవుడ్ సిండ్రెల్లా' అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ రకుల్ డ్రెస్సును ఒకరు ఎత్తిపట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హిందీలో మాత్రం రెండు చిత్రాలకు ఓకే చెప్పింది. తాజాగా బాలీవుడ్లో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాలో నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (ఇదీ చదవండి: బాధపడుతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్!) -
వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
లవ్‌బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఆస్కార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన కామినేనితో కలిసి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. త్వరలోనే తల్లి దండ్రులు కాబోతున్న మెగా హీరో దంపతులు ఈవేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన ఆకుపచ్చ డ్రెస్‌లో బేబీ బంప్‌తో నిండుగర్భిణీగా చాలా అందంగా కనిపించారు. బ్లాక్ అండ్ కాంబినేషన్ డ్రెస్‌లో రామ్‌చరణ్ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, మరింత అందంగా కనిపించారు. బనారసీ ఎంబ్రాయిడరీ అంచుతో, సైడ్ స్లిట్లతో సిల్క్ మెటర్నటీ ఫ్యాషన్ కఫ్తాన్ డ్రెస్‌లో ఉపాసన డ్రెస్‌కు తగ్గినట్టుగా మాచింగ్ చోకర్, చెవి పోగులతో స్పెషల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ప్రముఖ డిజైనర్, జయంతి రెడ్డి కలెక్షన్స్ కు చెందిన ఈ డ్రెస్ ధర రూ. 19,900 అట. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి శుక్రవారం (జూన్9, 2023) ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సిగ్గులమొగ్గయ్యి ఆకట్టుకున్న సొట్ట బుగ్గల సుందరి లావణ్య కట్టుకున్న చీర ఎంత అనేది కూడా ఇంటర్నెట్లో చర్చకు తెరతీసింది. డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన చీర ధర రూ. 75వేలని తెలుస్తోంది. Welcome to the Konidela family dearest Lavanya 🤗❤️ Looking forward to celebrating my dearest thodi kodalu. Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf — Upasana Konidela (@upasanakonidela) June 10, 2023 p> నా ప్రియమైన తోడి కోడలా స్వాగతం కొణిదెల కుటుంబంలోకి ఆహ్వానం అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మై డియర్ లావణ్య తోడికోడలుగా మారే వేడుక కోసం ఎదురు చూస్తున్నాను. వరుణ్ చాలా హ్యాపీగా ఉంది అంటూ ఉపాసన తన సంతోషాన్ని ప్రకటించారు. -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్‌పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్‌నిస్తుంది. కొందరు జీన్స్‌ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్‌ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్‌ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్‌ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్‌ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్‌ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్‌ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్‌లో నుంచి జీన్స్‌ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్‌బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్‌బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్‌లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్‌బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్‌ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు జుకర్‌బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్‌లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?
టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. తన జీవితంలో ఒక ముఖ్యమైన విశేషం గురించి ఉపాసన గత ఏడాది డిసెంబరులో ప్రకటించి నప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. దీనికి తగ్గట్టుగానే లగ్జరీ మెటర్నిటీ ఫ్యాషన్ స్టయిల్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సన్నిహితులు, ఫ్రెండ్స్‌తో సమక్షంలో ఘనంగా నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు వైరల్‌గా మారాయి. రామ్‌చరణ్, ఉపాసన స్నేహితులు, స్మితారెడ్డి, సరిన్ కట్టా త్వరలో కాబోయే మమ్మీకి ఇంటిమేట్ బేబీ షవర్‌ను నిర్వహించారు. ఈ బేబీ షవర్‌కి అల్లు అర్జున్, సానియా మీర్జా, కనికా కపూర్ , వారి ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం, ఉపాసన గులాబీ రంగు గౌన్‌లో, తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పింక్ గౌన్ ధరే ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపాసన కామినేని పింక్ డ్రెస్ రూ. 90 వేలు ఉపాసన కామినేని యొక్క పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్‌లో అందంగా ముస్తాబయ్యారు. డీప్ వీనెక్తో ,షార్ట్ స్లీవ్స్‌తో ఉన్న గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్‌కు చెందింది. దీని ధర 1102 డాలర్లు. అంటే మన కరెన్సీలో (టాక్స్‌లు అన్ని కలిపి) అక్షరాలా రూ. 90,471. ఏప్రిల్ 19, 2023న త్వరలో కాబోతున్న మమ్మీ ఉపాసన కామినేనికి రామ్ చరణ్ కుటుంబం బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుక కోసం, ఉపాసన జపనీస్ బ్రాండ్ ఇస్సీ మియాకే నుండి బ్లూ కలర్ ప్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్‌లో అలరించింది. ప్లీటెడ్ హాఫ్-స్లీవ్ ట్యూనిక్ బాడీ ఫిట్, ఫ్లేర్ ప్లీట్స్, సైడ్ గస్సెట్, ఫ్లేర్డ్ షేప్ హై నెక్ ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో, ట్యూనిక్ ధర 430 డాలర్లు అంటే రూ. 35,352 అన్నమాట. వైట్ ఫ్లవర్ డ్రెస్ 1.12 లక్షలు ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి కాబోయే మమ్మీ ఉపాసన గ్లామరస్ ప్రెగ్నెన్సీ స్టైల్లో తన ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నారు. మొదటి మూడు నెలల్లో ఒకసారి తెల్లటి-రంగు పూల డ్రెస్‌లో బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మెర్మాన్కు చెందినది. దీని ధర సుమారు రూ. 1,11,651. -
డైవర్స్ తీసుకోవడాన్నిగ్రాండ్గా సెలబ్రేట్ చేసింది..రీజన్ వింటే..
డైవర్స్ అన్న పదం వింటేనే గుండె ఝల్లుమంటుంది. అదికూడా అప్పటి వరకు ఉన్న బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. ఏదో కారణంతో విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురేతే.. ఆ బాధ మాట్లలో చెప్పలేం. ఐతే ముఖ్యంగా ఆడవాళ్లు, అదికూడా పిల్లలున్న తల్లి సమాజంలో ఒంటరిగా బతకడం మరింత కష్టం అవుతుంది. దీంతో వాళ్లు దిగాలు పడిపోవడం (లేదా) ఇక జీవితమైపోయింది అనుకుని అంతం చేసుకోవడం వంటి పిచ్చి పనులు చేస్తారు. అలా కాదు మనం జీవితం అక్కడితో అయిపోలేదంటోంది అమెరికాకు చెందిన మహిళ. మనం దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుని నువ్వేంటో చూపేలా బతకాలంటోంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని లారెన్ బ్రూక్ అనే మహిళ 2012లో పెళ్లి చేసుకుంది. పదేళ్ల వివాహ బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటే తట్టకోలేకపోయింది. సరిగ్గా 2012లో విడాకులు కావాలంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో తానేం చేయగలను, ఏమవుతుంది జీవితం అని డీలా పడిపోయింది. ఎన్నో కన్నీటి రాత్రులను గడిపింది. డైవర్స్ ఆగిపోతుందేమో!.. తన భర్త మళ్లీ వచ్చేస్తాడేమో అన్న ఆశ భంగపడుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. జనవరి 2023న కోర్టు అధికారికంగా బ్రూక్ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఇక ఎన్నాళ్లు ఈ బాధను మోయాలి. ఔను! ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది బ్రూక్. అందులో భాగంగానే తాను విడాకులు తీసుకోవాడాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. ఇన్నిరోజులు ఏదో జరగుతుందన్న ఆశతో కన్నీళ్లతో గడిపాను. మంచో చెడో ఏదో ఒకటి అయ్యింది. ఇక్కడితో నా కన్నీళ్లకు స్వస్తి పలికి.. సెలబ్రేషన్‌తో ఆ విషాదానికి ముగింపు చెప్పాలనుకుంది. తన తల్లి ఫెలిసియా బౌమన్ (58), తన బెస్ట్‌ఫ్రెండ్ సమక్షంలో ఈ విషాదాన్ని వేడుకగా చేసుకుంది. ఆ వేడుకను ఆమె తల్లి, స్నేహితురాలు ఫోటోషూట్ చేశారు. మహిళలు తాను విడిపోయాను అని చెప్పుకునేందుకు చాలా సిగ్గుపడతారని బ్రూక్ చెబుతోంది. అలా కాదని ఇక నుంచి చాలా శక్తిమంతమైన మహిళగా తయారయ్యేందుకు నాంది ఇదేనని చెప్పడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశ్యం అంటోంది బ్రూక్. నీతో నువ్వు పోరాడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొనే గొప్ప మహిళ తానేనని ప్రతి ఒక్క స్త్రీ తెలసుకోవాలని చెప్పేందుకే ఇలా చేశా. కామెడీగా మాత్రం కాదని చెప్పింది. "మనల్ని వద్దు అనుకున్న వాళ్లు సిగ్గుపడి తలదించుకునేలా తలెత్తి బతకాలి. బంధం కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ముందుకు సాగాలి" అంటూ భావోద్వేగంగా చెప్పింది. ఈ మేరకు తన పెళ్లి నాటి దుస్తులు, ఫోటోలు వాటి తాలుకా జ్ఞాపకాలను కాల్చేసి.. వేడుకలా సెలబ్రేట్ చేసుకుంది. రిలేషన్‌ని కోల్పోయానన్న బాధతో ఉండకూడదు స్ట్రాంగ్‌గా ఉండి నవ్వేంటో నిరూపించుకునే తరుణం ఇది. ఇది నీకు దొరికిన అద్భుతమైన అవకాశంగా ఛాలేంజింగ్‌గా తీసుకో అని చెబుతోంది బ్రూక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!) -
సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు అలియా భట్ సప్రైజ్ గిఫ్ట్
-
డ్రెస్‌తో జాన్వీ కపూర్ తిప్పలు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్లో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. 2018లో దఢక్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది జాన్వీ కపూర్. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మెరిసింది భామ. జాన్వీ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టింది. ఈ ఫంక్షన్లో వెరైటీ డ్రెస్‌లో కనిపిస్తూ సందడి చేసింది. అయితే ఆ డ్రెస్సులో వేదికపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. జాన్వీ పసుపు రంగు కటౌట్ గౌను ధరించిన వేదికపై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఆ దుస్తుల్లో చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో నెటిజన్స్ జాన్వీ కపూర్ డ్రెస్‌పై దారుణంగా ట్రోల్స్ చేశారు. మీరు ఎందుకు వెస్టర్న్ కల్చర్‌ను కాపీ కొడుతున్నారు అని ప్రశ్నించారు. మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరంతా ఉర్ఫీ జావెద్‌ను అంటారు.. మళ్లీ బాలీవుడ్ మొత్తం ఆమెనే ఫాలో అవుతారు అంటూ కామెంట్ చేశారు. జాన్వీ డ్రెస్ టెంట్ వేసుకునే పరదాలా ఉందని ఫన్నీ కామెంట్ చేశాడు. (ఇది చదవండి: పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి) కాగా.. జాన్వీ తదుపరి చిత్రం వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్‌లో తమ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ కోసం శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. జాన్వీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రయాణికులు అలాంటి దుస్తుల్లో రావద్దు.. ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది. 'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్‌గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది. చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో.. -
బర్త్‌డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నాడు. మార్చి 27తో చరణ్ 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన చరణ్ బర్త్‌డే పార్టీలో టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ పాల్గొని సందడి చేశారు. ఇక చరణ్ బర్త్‌డే సందర్భంగా RC15 నుంచి వరుస అప్డేట్స్ వదిలారు మేకర్స్. చదవండి: బిగ్‌బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిని ముద్దాడుతూ ఓ ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం స్వయంగా ఇంటికి వెళ్లి చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చరణ్ ధరించిన లైట్ బ్లూ షర్ట్‌పై అందరి దృష్టి పడింది. బర్త్‌డే సందర్భంగా చరణ్ వేసుకున్న ఆ షర్ట్ స్పెషాలిటీ, బ్రాండ్ ఏంటి? అని ఫ్యాన్స్ ఆరా తీయగా దాని ధర తెలిసి అంతా అవాక్కవుతున్నారు. చదవండి: తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్ దీంతో చరణ్ షర్ట్ కాస్ట్ వైరల్‌గా మారింది. కాగా ఈ షర్ట్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయగా ఇది ఫార్ ఫేచ్ అనే ఫారిన్ షాపింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కనిపించింది. జాన్యా వటనాబి ప్యాచ్ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ షర్ట్‌ను డీటైల్ అని పిలుస్తారు. ఇక ఈ వెబ్ సైట్ ప్రకారం.. ఈ షర్ట్ ధర 983 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 80,961 రూపాయలు. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. -
వసంతాలు విరిసేవేళ
వసంతం విచ్చేసిందని ప్రకృతి మనకు పంపించే తొలి కబురు రంగుల వేడుకైన హోలి. రాబోయే వేసవిని తట్టుకోవడానికి మన మేనిని హాయిగొలిపేలాఉంచడానికి స్వచ్ఛమైన తెలుపును పరిచయం చేసేది హోలి.ఎందుకంటే రంగుల హంగులను అందంగా ఇముడ్చుకునేది తెలుపే!ఇంద్రధనుస్సు ఎలాగూవేసుకున్న దుస్తులను అందంగా పలకరిస్తుందిపువ్వుల నవ్వుల్ని, పచ్చదనాన్నీ అద్దుతుంది. ఆ హంగులను అద్దుకున్న తెలుపు మన జీవితాలను ఆనందమయం చేస్తుంది. అందుకే, వసంతాలు విరిసేవేళా నిన్ను నేను చూశాను...అంటూతెలుపు రంగు డ్రెస్‌ల ఎంపికకు మొదటి ఓటు వేయవచ్చు. తెలుపుతోపాటు క్రీమ్ కలర్ థీమ్ ఉన్న డ్రెస్సులు ఎంతో అందాన్నీ, హాయినీ ఇస్తాయి. వీటిలో కాటన్, లినెన్, చికన్ కారీ వర్క్, ఇతర ఎంబ్రాయిడరీ లేదా చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్న డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. పూర్తి వైట్ ఇష్టపడని వారు క్రీమ్ కలర్, ఇతర కాంబినేషన్ కలర్స్‌తో ఉన్న డ్రెస్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులు అన్ని పార్టీలలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. -
జరీ అంచు ఆభరణం
సంప్రదాయ వేడుకలలో జరీ అంచు చీరల రెపరెపలు మనకు పరిచయమే. పువ్వులు, హంసలు, గోపురపు డిౖజైన్లతో అవి అందంగా ఆకట్టుకుంటాయి. వాటిని అంచు వరకే ఎందుకు పరిమితం చేయాలనే ఆలోచనతో ఆభరణంగా రూపుకడుతున్నారు డిజైనర్లు. పాత చీరెల అంచులైనా కొత్తగా మార్కెట్లో లభించే జరీ బార్డర్స్ అయినా ఇలా మనసుదోచేలా మురిపిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు వేడుకకు తగినట్టు డ్రెస్ ఎంపిక ఉంటుంది. దానికి మ్యాచింగ్‌గా ఈ జరీ మాలలు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. ఫ్యాబ్రిక్ రోలర్ నూలు దారాలను ఉండగా చేసి, వాటికి కట్ చేసుకున్న బార్డర్ని అతికించి, కావల్సిన పరిమాణంలో ఫ్యాబ్రిక్ బీడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. లాకెట్స్‌తో ప్రత్యేకం ముగ్గు, గోపురం, దేవతా మూర్తుల లాకెట్స్ని ఈ జరీ అంచు చెయిన్స్‌కు జత చేయచ్చు. లేదంటే, బార్డర్ ఫ్యాబ్రిక్‌నే లాకెట్‌లా తయారు చేసి, వేసుకోవచ్చు. బీడ్స్‌తో జత కట్టి రంగు రంగుల పూసలను ఎంపిక చేసుకొని, వాటితో జరీ బాల్స్‌ను జత చేసి దండగా సిద్ధంగా చేసుకోవచ్చు. గాజుల అందం రంగు వెలసిన వెడల్పాటి గాజులను వాడకుండా పక్కన పడేయటం ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. వాటితో జరీ అంచును ఇలా అందంగా తయారుచేసుకోవచ్చు. 1.పాత సిల్క్ , జరీ అంచు ఉన్న చీరను ఎంపిక చేసుకోవాలి. జరీ అంచు బాగుంటే, దానిని చీర నుంచి కట్ చేసుకోవాలి. 2. ఎంపిక చేసుకున్న గాజుకు కట్ చేసిన జరీ అంచును చుట్టి, అన్నివైపులా గ్లూతో అతికించాలి. 3. ఎక్కడా జరీ పోగులు బయటకు రాకుండా సరి చూసుకోవాలి. 4. పూర్తిగా గాజు తయారీ పూర్తయ్యాక ఫ్యాబ్రిక్ చివర్లు కూడా బయటకు కనిపించకుండా అతికించాలి. 5. రెండు రకాల గాజు మోడల్స్ తయారు చేసుకొని, కాంబినేషన్‌గా ధరించవచ్చు. -
పూల సంతకం
ఏ కాలాన్నైనా బ్రైట్‌గా మార్చేసే గుణం పువ్వుల సొంతం. ఆ సౌందర్యాన్ని ధరించే దుస్తుల మీదకు తీసుకురావడం తరుణుల అభిమతం అందుకే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా పువ్వుల ప్రింట్లు, డిజైన్లు అమితంగా ఆకట్టుకుంటుంటాయి. పెళ్లి, పుట్టిన రోజు వంటి వేడుకల్లోనే కాదు క్యాజువల్వేర్గానూ కట్టిపడేసే పూల డ్రెస్సులు ధరించడమంటే మేనిపైన పూల సంతకం చేసినట్టే. ఎంబ్రాయిడరీ పూలు చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌లోనూ పువ్వులు, లతల అందం మన మదిని దోచేస్తూనే ఉంటుంది. ఎన్ని హంగులు దిద్దినా వాటినుంచి కొత్త స్ఫూర్తిని ΄పొందుతూనే ఉంటాం. అందుకే కొత్త డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు. అప్లిక్ పూలు కావల్సిన పరిమాణంలో పువ్వులను ముందుగానే డిజైన్ చేసుకొని, ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్ మీద ఫ్యా చ్ వర్క్ చేస్తారు. ఈ పూల గుత్తులు డ్రెస్ అందాన్ని వెయ్యింతలుగా పెంచుతుంది. పువ్వుల ప్రింట్లు ఏ హంగులూ చేయలేం అనుకున్నవారు పువ్వుల ప్రింట్లు ఉన్న సిల్క్ లేదా బ్రొకేడ్, కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. కాలానుగుణంగా ఫ్యాబ్రిక్ ఎంపికలో మార్పులు ఉండవచ్చు గానీ, పువ్వుల సొగసులో మార్పులు ఉండవని నిరూపిస్తుంటారు అతివలు. అందుకే కాబోలు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎన్నో రకాల స్టైల్స్‌లో డ్రెస్ డిజైనర్ల చేతిలో మారిపో తుంటుంది. -
ఆదిపురుష్ భామ కృతి సనన్ డ్రెస్ ధరెంతో తెలుసా..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన 'నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఆదిపురుష్ చిత్రంలోనూ కనిపంచనుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది భామ. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి షెహజాదా చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి హాజరైన కృతి సనన్ ప్రత్యేక దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కృతి ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట్లో చర్చ నడుస్తోంది. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆమె ధరించిన స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ధరించిన ఆ డ్రెస్ విలువు దాదాపు రూ.37,520 లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధర విని ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అంతకుముందు వరుణ్‌ధావన్‌తో కలిసి భేడియా చిత్రంలో నటించింది కృతి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
లాభాల్లో వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్
న్యూఢిల్లీ: వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం ఎగసి రూ.125 కోట్లు సాధించింది. టర్నోవర్ 2.93 శాతం అధికమై రూ.2,170 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 3.5 శాతం హెచ్చి రూ.2,072 కోట్లుగా ఉంది. వస్త్రాల ద్వారా ఆదాయం 1.88 శాతం పెరిగి రూ.1,759 కోట్లకు, అడ్వాన్స్ మెటీరియల్స్ 5 శాతం అధికమై రూ.313 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే అరవింద్ లిమిటెడ్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 1.88 శాతం తగ్గి రూ.94 వద్ద స్థిరపడింది. -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
టెక్కు టమారం: ఇలాంటి పోర్టబుల్ డ్రైక్లీనర్ ఉంటేనా
ఇలాంటి పోర్టబుల్ డ్రైక్లీనర్ ఉంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కష్టమేమీ కాదు. దుస్తులను, గోడలను, గచ్చును, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి పరికరాలను ఇది చిటికెలో శుభ్రం చేసేస్తుంది. ఎలాంటి రసాయనాలతో పనిలేకుండానే, ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో కాసిన్ని నీళ్లు నింపుకుని, ఆన్ చేసుకుంటే చాలు. దీని నుంచి వేగంగా వెలువడే వేడి ఆవిరి దుమ్ము, ధూళి మరకలను క్షణాల్లో తుడిచి పెట్టేస్తుంది. వాటిపై పేరుకున్న సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేస్తుంది. దుస్తులు, వస్తువులు చెమ్మదేరిపోవడం వల్ల వెలువడే దుర్వాసనను తొలగిస్తుంది. దీని నుంచి వెలువడే ఆవిరి ఉష్ణోగ్రత 160 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో, ఇది ఉతికిన దుస్తులను నిమిషాల్లో ఆరబెట్టగలదు కూడా. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉన్న దీని ధర 109 డాలర్లు (రూ.8,671). -
Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు..
Urfi Javed Wear Broken Glass Dress Weighing 20 Kgs Video Viral: హిందీ బిగ్‌బాస్ ద్వారా చాలా ఫేమస్ అయింది ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ తర్వాత బయటకొచ్చిన ఉర్ఫీ విభిన్నమైన, విచిత్రమైన డ్రెస్టింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయింది. డ్రెస్సింగ్ స్టైల్స్‌లో కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తూ కొన్నిసార్లు ప్రశంసలు పొందితే, మరికొన్ని సార్లు తీవ్ర విమర్శల పాలైంది ఈ బ్యూటీ. ఇంతకుముందు మెర్మేయిడ్ స్పాట్డ్ వేర్లో కనిపించిన ఉర్ఫీ జావేద్ మరోసారి సరికొత్త డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ఉర్ఫీ పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్‌ను వేసుకుంది. ఈ పోస్ట్‌కు 'అవును, నేను పగిలిన గాజు ముక్కల డ్రెస్ వేసుకున్నాను. ఇది అద్భుతంగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఇలాంటివి చూసి నాకు వెర్రి, పిచ్చి అనుకుంటారు. నిజానికి మనమందరం క్రేజీగా, పిచ్చిగా ఉన్నామని తెలుసుకోండి. కానీ నన్ను నేను చూసుకోడానికి నాకు తగినంత తెలివి, శక్తి ఉన్నాయి.' అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోకు నటి రాఖీ సావంత్ ఫైర్ ఎమోజీని కామెంట్ పెట్టగా, పలువురు ప్రశంసిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో చిన్న పార్టీ ఏర్పాటు చేసింది ఉర్ఫీ జావేద్. ఆ పగిలి గాజు ముక్కల డ్రెస్ వల్ల గాయాలు అవుతుండటంతో దాన్ని తీసేసింది. అంతేకాకుండా ఈ డ్రెస్ 20 కేజీల బరువు ఉంటుందని ఉర్ఫీ జావేద్ తెలిపింది. చదవండి: 👇 ప్యాంట్ వేసుకోలేదురా బాబూ.. ఉర్ఫీ పరుగోపరుగు సమంత చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పా? స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఉర్ఫీ View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
వరంగల్: గోదాంలో అగ్నిప్రమాదం
సాక్షి,వరంగల్: గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం టెస్కో గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా టెస్కోకు సంబంధించిన బట్టలు ఈ గోదాంలో నిల్వ ఉంచుతారు. దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు ఉన్నట్లు టేస్కో అధికారులు వెల్లడించారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో గోదాము గోడలు కూలాయి. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలయాల్సి ఉంది. ఎవరైనా నిప్పు వేశారా.. లేక కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
టాప్ టు బాటమ్; సేమ్.. సేమ్.. చమక్కులు
పువ్వుల నవ్వులు.. ప్లెయిన్ హంగులు కుచ్చుల చమక్కులు.. ఎంబ్రాయిడరీ మెరుపులు ఒకే రంగుతో ఆకట్టుకుంటే అది నేటి పార్టీవేర్ లెహంగా డ్రెస్ అవుతుంది. అంచుల రంగుతో ఓణీ.. అదే రంగుతో ఛోలీ అనే నిన్నటి కళ కు చుక్కను చుట్టి టాప్ టు బాటమ్ ఒకే కలర్.. ఒకే ప్రింట్.. ఒకే వర్క్... అంటూ లెహంగా డ్రెస్సులను కొత్త కళతో మెరిపిస్తున్నారు డిజైనర్లు. వేడుకులకు నిండైన కళను తీసుకువస్తున్నారు. చిన్ని చిన్ని మార్పులు ఒకే రంగుతో ప్లెయిన్ లెహంగా డ్రెస్ వెస్ట్రన్, గెట్ టు గెదర్ పార్టీలకు వన్నె తీసుకువస్తున్నాయి. ఇక ఒకే కలర్ లెహంగా, ఛోలీ, దుపట్టాపై కొన్ని ప్రింట్లు, మరికొన్ని ఎంబ్రాయిడరీ వర్క్‌తో చేసిన డిజైన్స్ వివాహ వేడుకలకు నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. వీటిలో ఫ్లోరల్ డిజైన్స్ నేటి మగువలను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: మెడలో పర్సుల హారాలు.. భలే ఉన్నాయ్!) -
78 ఏళ్ల వయసులో డిజైనర్‌గా రాణిస్తున్న షీలా బజాజ్
‘అభిరుచిని ఆచరణలో పెట్టాలే గానీ ఏ వయసయినా అనుకున్నది సాధించవచ్చు’ అని నిరూపిస్తున్నారు ఢిల్లీలో ఉంటున్న 78 ఏళ్ల షీలా బజాజ్. ‘ఇప్పుండెందుకీ పనులు... హాయిగా కూర్చోక’ అని చెప్పేవారికి సవాల్‌గా ‘నా క్రొచెట్ డిజైన్స్ మీకు కావాలా’అని అడుగుతారు. కొత్తగా ఆన్లైన్ భాషను వంటపట్టించుకొని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అల్లికల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చిన ఆర్డర్లను తీసుకుంటూ క్రొచెట్ అల్లికల తయారీలో బిజీబిజీగా ఉంటూ, సంపాదన మార్గంలో ఉన్నారు. ‘నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల కోసం క్రోచెట్ అల్లికలు చేసేదాన్ని. ఆ తర్వాత బాధ్యతల నడుమ అభిరుచిని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పిల్లలు పెద్దగై, వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు నా మనవరాలితో పాటు ఉంటున్నాను. కిందటేడాది కరోనా మహమ్మారి మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక అవసరాలు తీరడానికి ఎటూ దారి దొరకలేదు. మనవరాలిపై ఆధారపడుతున్నానని బెంగ. ఈ మాటలు నా మనవరాలితో అంటూ ఉండటం వల్ల ఓ రోజు ‘మీరు క్రోచెట్ అల్లికలు బాగా చేస్తారు కదా! మళ్లీ ఎందుకు మొదలుపెట్టకూడదు మీ కోసం’ అంది. దాంతో తిరిగి దారాలు నా చేతిలోకి వచ్చాయి. ఈ కాలానికి తగినట్టు అందమైన అల్లికలు రూపొందించడం మొదలుపెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రూపొందించిన డిజైన్స్ ఫొటోలు పెట్టాం. మొదటి ఆర్డర్‌కు రూ.350 వచ్చాయి. 78 ఏళ్ల వయసులో నా మొదటి సంపాదన అది. ఎన్నడూ పొందలేనంత అనుభూతిని పొందాను. చాలా గర్వంగా, స్వతంత్రం గా అనిపించింది. డ్యాన్స్ చేయాలనిపించింది. అంతగా ఆనందించాను. నా వయస్సులో ఉన్న చాలా మంది వ్యక్తులు ‘ఇప్పుడిక చేసేదేముంది’ అంటే, ‘ఇప్పుడు నాకు పని ఉంది ’ అని గర్వంగా చెబుతున్నాను. అలా అన్నవారు కూడా ఇప్పుడు నా ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకుంటున్నారు. దీంతో క్రియేషన్స్‌తో పాటు ఉత్పత్తులూ పెరిగాయి. ఆర్డర్లూ పెరిగాయి. ఈ పనిలో అలసట అన్నదే లేదు ఇప్పుడు. 20 ఏళ్ల యువతి నా క్రోచెట్ డ్రెస్‌ను ఇష్టపడుతుంది. ఒక తల్లి తన బిడ్డకు చేసిచ్చిన క్రొచెట్ ఫ్రాక్ ఎంతో అందంగా ఉందని నాకు చెప్పింది. వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా కావల్సినది నచ్చిన పని. మన చేతులతో మనం స్వయంగా సంపాదించుకున్న పని. అది ఏదైనా కావచ్చు. ఎవరికి వారు ఎవరిమీదా ఆధారపడకుండా బతికేంత సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా చాలా అవసరం’’ అంటూ ఈ బామ్మ ఆనందంగా చెబుతున్న మాటలు అన్ని వయసులవారినీ ఆలోచింపజేస్తాయి. అనుకున్న పనులను ఆచరణలో పెట్టేలా చేస్తాయి. చదవండి: Rohit Sharma: రోహిత్‌పై గంగూలీ ఆసక్తికర వాఖ్యలు.. -
ముందు జిప్ వేసుకో.. బాలీవుడ్ నటి డ్రెస్సింగ్‌పై విపరీత ట్రోలింగ్
ఇటీవల సెలబ్రిటీలు వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తారలు తమ అభిమానులతో చాట్ చేయడంతో పాటు వారి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. కొందరు షేర్ చేసే వీడియోలు.. ఒక్కోసారి పాజిటివ్ కామెంట్స్ రాగా కొన్ని సార్లు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ నటి తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇంకేముంది ఆ వీడియో చూసిన నెటిజన్లు ఈ హాట్ బ్యూటీని విపరీతంగా ఆడేసుకుంటున్నారు. అసలీ అమ్మడేం చేసింది. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే...? బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే పెద్దగా తెలియదేమో కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే మైండ్‌లో టక్కున గుర్తు వస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లిన ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ట్రెండీ హీరోయిన్గా మారింది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగారు. తాజాగా ఈ బ్యూటీ ఓ డ్రెస్ వేసుకొని కనిపించింది.దాదాపు 10 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఒక డ్రెస్సులో కనిపించిన ఉర్ఫీ ఆ తరువాత జిప్ ఓపెన్ చేసి ఉన్న డ్రెస్సులో ప్రత్యక్షమవుతుంది. అయితే ఆ డ్రెస్ కాస్త అభ్యంతకరంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు. ఉర్ఫీ మరీ ఇలా కనిపిస్తుందని ఊహించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి ‘డ్రెస్ ఓకే గానీ.. జిప్ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రెస్ అంటారా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Urfi (@urf7i) చదవండి: ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి -
Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా?
Givenchy Suicide Hoodie Necklace Controversy: ఫ్యాషన్ ప్రపంచం ఓ పద్ధతి ప్రకారం నడవదు. ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుని కొత్తగా, వింతగా అనిపించడమే కాదు.. ఒక్కోసారి ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రాన్స్ దుస్తుల కంపెనీ రూపొందించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ‘బట్టలతో మనుషుల్ని చంపేయగలవ్ తెలుసా?’.. ఇది సినిమా డైలాగ్. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ అది నిజమని నిరూపిస్తోంది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అంటగట్టింది. ఆ దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ విలియమ్స్.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో బ్రిటిష్ దుస్తుల కంపెనీ బర్బెర్రీ 2019లో ఇదే తరహాలో ‘నూస్ హూడీ’(సూసైడ్ హూడీగా ట్రోల్ చేశారు)ని డిజైన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బర్బెర్రీ మోడల్ లిజ్ కెనెడీ ‘సూసైడ్ ఏం ఫ్యాషన్ కాదు’ అంటూ సెటైర్లు వేయడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఆ టైంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మార్కో గోబెట్టి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Diet Prada ™ (@diet_prada) ఇక గివెంచీ చర్యల నేపథ్యంలో ప్యాషన్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ‘డైట్ ప్రదా’ ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన దుస్తుల ఫొటోల్ని కంపేర్ చేస్తూ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేయగా.. దుమారం మొదలైంది. View this post on Instagram A post shared by @liz.kennedy_ చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ను ఆకాశానికెత్తిన అమెజాన్ బాస్ -
నా బట్టల గురించి మిగతావాళ్ళకెందుకు...బరి తెగించానా?
-
అరె జుట్టుతో ఒళ్లంతా చుట్టేసింది.. ‘బికినీ కంటే బాగానే ఉందిలే’!
‘ఓ వాలు జడా.. మల్లెపూల జడా.. ఓ పాము జడా.. సత్యభామ జడా’... అంటూ రాధాగోపాలం సినిమాలో స్నేహ జడను శ్రీకాంత్ అందంగా వర్ణించిన సాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. అవునండి అమ్మాయిలకు సగం అందం ఆమె జుట్టు వల్లే కలగుతుందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి పొడుగు జుట్టు అంటే ఇష్టం.. కాదు కాదు పిచ్చి. కేశాల పెరుగుదలకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు, ఆయుర్వేద మూలికలు.. ఇలా అన్నింటిని వాడేస్తుంటారు. అయినా అది అందరికి సాధ్యపడదు. ఇక పొడుగు జుట్టు ఉన్న వారిని చూసి అందరు కుళ్లుకోవడం తెలిసిన విషయమే. చకన్నమ్మ ఏం చేసినా అందమే అన్నట్లు పొడవాటి జుట్టు కలిగిన వారు దానిని ఎలా చేసిన అందంగానే ఉంటుంది. తాజాగా ఓ అమ్మాయి తన జుట్టుతో వినూత్నంగా ఆలోచించింది. తనకున్న తెలివిని ఉపయోగింది ఇంత వరకు ఎవరూ చేయని ఓ వింత పని చేసింది. తన లాంగ్ హెయిర్‌ను అందమైన డ్రెస్‌లా అలంకరించింది. దీనికి సంబంధించిన వీడియోను హెప్గుల్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతి క్యాప్, సన్ గ్లాసెస్ ధరించి డ్రెస్ లాగా తన పొడవాటి జుట్టును చుట్టేసింది.. అది సరిగా ఉండేందుకు నడుం వద్ద ఓ బెల్ట్‌ను ఉపయోగించింది. యువతి జుట్టు పొడుగ్గా, మందంగా ఉండటంతో డ్రెస్ లాగా కరెక్ట్ సెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి తెలివిని ప్రశంసిస్తున్నారు. బికినీలు, పొట్టి దుస్తులు ధరించే వారికంటే ఇది ఒకింత మంచిగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది యువతి జుట్టు నిజమైనది కాకపోవచ్చని ఆమె హెయిర్ ఎక్స్టెన్షన్స్ని ఉపయోగించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జుట్టు బాగా రాలుతోందా.. ఇలా చేస్తే రాలడం తగ్గి, పెరుగుతుంది! View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
వైరల్: విద్యార్థుల ప్రేమకు ముగ్ధులైన నెటిజన్లు
సోషల్ మీడియా.. ప్రస్తుతం మనిషి జీవితంలో భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. కాగా ఓ స్కూల్ టీచర్‌కి విద్యార్థులు బహూకరించిన డ్రెస్ ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ చిత్రంలో క్లైర్ అనే టీచర్ చిరునవ్వు చిందిస్తుండగా.. ఆమె ధరించిన తెల్లని డ్రెస్‌పై పువ్వులు, రెయిన్బో, నక్షత్రాలను చూడవచ్చు. ఈ డ్రెస్ కింద ‘‘ఎమ్ఆర్ఎస్ కన్సోల్ట్ క్లాస్ 2020-2021’’ అని రాసి ఉంది. కాగా ఈ చిత్రాన్ని రెడిట్‌లో పోస్ట్ చేయగా.. 13 గంటల్లో లక్షల లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. ‘‘ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది. మీరు విద్యార్థుల మనసు గెలుచుకున్న అద్భుతమైన గురువు అంటూ’’ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘మీ విద్యార్థులు తమ కళను అద్భుతంగా ప్రదర్శించారు. మీరు వారిని ప్రేమతో ప్రోత్సహించడం చాలా సంతోషం.’’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!) -
ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్
ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్న తమన్నా .. చిన్న వయస్సులోనే సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమా ‘శ్రీ’తో టాలీవుడ్‌కి పరిచయడం అయింది ఈ మిల్కీబ్యూటీ. మంచు మనోజ్ హీరోగా నటించిన ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. కానీ తమన్నాకు మాత్రం వరుస ఆఫర్లను తెచ్చిపెట్టింది. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’తో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, రచ్చ, బాహుబలి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుంది. తాజాగా తమన్నా నటించిన 11th అవర్ అనే వెబ్ సీరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ మిల్కీబ్యూటీ.. లేత గులాబీ రంగులోని పర్పుల పువ్వుల ఫ్రాక్‌లో అందంగా ముస్తాబైంది. ఆ డ్రెస్‌లో ఉన్న ఫోటోలని, వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇక నెటిజన్ల చూపులన్నీ ఆ డ్రెస్ మీదే పడ్డాయి. ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. వారెవ్వా తమన్నా.. ఆ డ్రెస్ మా సొంతమైతే ఎంత బాగుంటుందని తెగ ఫీలైపోతున్నారు. ఎందుకంటే అది సాదాసీదా ఫ్రాక్ కాదండోయ్. అత్యంత ఖరీదైన ప్రాక్. దీని ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్. ఆ ఫ్రాక్ ధర అక్షరాల 51,244 రూపాయలట. దీనిని ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ రూపొందించింది. ప్రస్తుతం తమన్నా ధరించిన డ్రెస్ ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
బాలిక స్కూల్ డ్రెస్‌పై అభ్యంతరం: తండ్రి ‘సోషల్’ నిరసన
ఒట్టావా: ఓ మైనర్ విద్యార్థిని దుస్తులు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ఆరోపించి బాలికను ఇంటికి పంపించిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. దీనిపై ఆమె తండ్రి ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాడు. అంతేగాక తనకు, తన కూతురికి మద్దతుగా నిలవాలంటూ సోషల్ మీడయాలో పోస్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. కెనడాలోని నోర్కమ్ సీనియర్ సెకండరీ స్కూల్లో క్యారిస్ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల వైట్ ఫుల్ లెన్త్ స్లీవ్, పొడవాటి నెక్ షర్ట్‌పై బ్లాక్ సింగిల్ స్ట్రీప్, మెకాలి పోడవు ఉన్న లేస్ టాప్ ధరించి స్కూల్‌కు వెళ్లింది. దీంతో క్లాస్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన మిగతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేల ఉందని, పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులంతా ఏకాగ్రత కోల్పోయే విధంగా తన ఆమె దుస్తులు ఉన్నాయని విద్యార్థినితో పేర్కొంది. అంతేగాక క్యారిస్నున స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో, ప్రిన్సిపల్ కూడా ఉపాధ్యాయురాలికి మద్దుతు పలికారు. క్యారిస్ దుస్తులు లోదుస్తులను తలపించేలా ఉన్నాయని, ఇలాంటి దుస్తులను బహిష్కరించాలన్నారు. అంతేగాక క్యారిస్ను ఇంటికి పంపిచామని చెప్పారు. ప్రిన్సిపల్ చెప్పడంతో బాలికను పాఠశాల యాజమాన్యం తిరిగి ఇంటికి పంపించేసింది. ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రి క్రిస్టోపర్ విల్సన్‌కు వివరించింది. దీంతో అతడు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను తన కూతురిని అవమానించారని స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. అంతేగాక ఆ మరుసటి రోజు క్యారిస్ తోటి విద్యార్థులంతా మద్దతు పలుకుతూ క్లాస్ రూం నుంచి వాకౌట్ చేశారు. ఇక క్యారిస్ తండ్రి విల్సన్ ‘ఇవాళ నా కూతురిని స్కూలు నుంచి ఇంటికి పంపించారు. తన డ్రెస్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసిన నాకు, నా కూతురికి మద్దుతుగా నిలిచి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావుతం కాకుండా చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అంతేగాక ఈ విషయం తనను బాధించిందని, 2021లో కూడా ఇలా జరగడంపై తాను నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఈ దీనికి కారణమైన స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు పాఠశాల సూపరెండెంట్ విల్సన్‌తో పేర్కొన్నట్లు తెలిపాడు. -
100 రోజులు ఒకే డ్రెస్ వేసుకుంది.. కారణం
వాషింగ్టన్ : ఈ రోజు వేసుకున్న డ్రెస్.. రేపు మళ్లీ వేసుకోవటం అంటే నూటికి తొంభైశాతం మందికి ఇష్టముండదు. రోజుకో డ్రెస్‌లాగా..వేసిన డ్రెస్ మళ్లీ వేయకుండా నెల రోజులు కలర్ఫుల్గా బ్రతికేవారూ ఉన్నారు. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా వంద రోజులు ఒకే డ్రెస్ వేసుకుంది. ఫ్యాషన్లకు దూరంగా.. సింపుల్‌గా జీవించింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 52 ఏళ్ల సారా రాబిన్స్ కోల్ ‘100 రోజులు.. ఒకే డ్రెస్’ చాలెంజ్‌ను స్వీకరించింది. గత సెప్టెంబర్ నుంచి నిన్న మొన్నటి వరకు బ్లాక్ మెరినో ఊల్ డ్రెస్ వేసుకుంది . ఫ్యాషన్లకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడిపింది. ఉద్యోగానికి.. చర్చికి.. ఆఖరికి కిస్మస్ పండుగ రోజు కూడా అదే బ్లాక్ డ్రెస్ వేసుకుంది. అయితే అప్పుడప్పుడు దాని మీదకు సరిపోయేలా రంగుల జాకెట్లు, ష్కర్టులు ధరించేది. (సార్! రోడ్డు పక్క ఓ కాలు తెగిపడి ఉంది..) ఈ 100 రోజుల చాలెంజ్‌ను ఓ డాక్యూమెంటరీగా రూపొందించింది. సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. 100 రోజులు ఒకే డ్రెస్ చాలెంజ్ తీసుకున్న వారిలో సారా మొదటి వారేమీ కాదు. ‘ఉల్ అండ్’ అనే వస్త్ర కంపెనీ ఈ చాలెంజ్‌ను తీసుకొచ్చింది. ‘‘ మేము రొవెనా స్వింగ్ డ్రెస్‌ను తయారు చేశాము. సాదాసీదాగా జీవించటం, జాగ్రత్తగా వాడుకోవటం, మంచిగా ఉంచుకోవటం.. వంటి సూత్రాలతో 100 రోజుల చాలెంజ్‌ను ఇస్తాము. మా చాలెంజ్‌ను స్వీకరించే 50 మందికి ఈ డ్రెస్‌ను పంపిస్తాము’’ అని తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ( వైరల్: ఛీ, ఎందుకురా ఆడుకుంటారు? ) -
ఇంట్లో సరైన దుస్తులు లేవా?
బెంగళూరు : బైక్ పై వెళ్తున్న యువతిని సరైన డ్రెస్ ధరించలేదంటూ ఓ వ్యక్తి దూషించాడు. ‘నువ్వు భారతదేశ పద్దతులు పాటించాలి. సరైన దుస్తులు ధరించాలి’ అంటూ యువతి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 28 ఏళ్ల టెకీ హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఆమె అదే లే అవుట్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. వారిద్దరు తిరిగి బైక్‌పై వస్తుండగా.. పక్కన వేరే బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. నీకు ఇంటి దగ్గర దుస్తులు లేవా అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ బైక్‌ను పక్కకు నిలిపివేసి.. అవతలి వ్యక్తిని కూడా అడ్డగించాడు. ఆ తర్వాత అతని మాటాలను వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఈ విషయం గమనించిన ఆ వ్యక్తి సైలెంట్ అయ్యాడు. తను చేసిన పనిని సమర్ధించుకునేందుకు యత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆ యువతి మాట్లాడుతూ.. ‘ షాపింగ్‌కు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఎవరో పక్కన అరుస్తున్నట్టు వినిపించింది. దీంతో నేను వెనక్కి తిరిగి చూడగా వేరే బైక్‌పై వెళ్తున్న అదే పనిగా నన్ను దూషిస్తున్నాడు. ఇంట్లో సరైన దుస్తులు లేవా అంటూ నన్ను ప్రశ్నించాడు. దీంతో నీ సమస్య ఏమిటని నేను అతన్ని అడిగాను. భారత మహిళలు ఇలాంటి దుస్తులు ధరించరు అంటూ సమధానం ఇచ్చాడు. నేను ఆ సమయంలో టీ-షర్ట్, షార్ట్ ధరించి ఉన్నాను.. అందులో తప్పేముందో అర్థం కావడం లేదు. ఆ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్ కూడా అతన్ని ప్రశ్నించాడు. అయితే మేము దీనిని వీడియో తీస్తున్నామని గమనించిన అతడు కొద్దిగా వెనక్కి తగ్గాడు. కానీ ఇలాంటి దుస్తులు ధరించవద్దని చెప్పడం మాత్రం ఆపలేదు. దీంతో నా బాయ్‌ఫ్రెండ్ అన్నాడు. మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పే హక్కు అతనికి లేదని అన్నాడు. ఆ వ్యక్తి కేవలం మమ్మల్ని భయపెట్టడానికే ఇలా చేసి ఉంటాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాను.. కానీ వారు నాకు మద్దతుగా ఉండరని ఆగిపోయాను. ఎందుకంటే పోలీసులు అతనిలాంటి ఆలోచనలతోనే ఉంటారు. మేము దీనిపై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కూడా వేరే దుస్తులు ధరించమని చెప్తారు. అందుకే నేను ఫిర్యాదు చేయలేద’ని తెలిపారు. -
ఇంట్లో సరైన దుస్తులు లేవా..?
-
సింపుల్ బ్రైడ్ హెయిర్ స్టైల్
వేసుకున్న డ్రెస్‌కు అల్లుకున్న జడ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే చాలా మంది తమ మేకప్‌లో ఎక్కువ సమయం కేశాలంకరణకే కేటాయిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ హెయిర్ స్టైల్. పైగా ఇది సంప్రదాయ దుస్తులకైనా.. మోడ్రన్ డ్రెస్సులకైనా ఇట్టే నప్పుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. 1. ముందుగా జుట్టునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్ స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుట్టు మరింత మృదువుగా మారుతుంది. తర్వాత హెయిర్ స్ట్రయిటెనింగ్ చేసుకుని కుడివైపు చెవి తిన్నగా ఉన్న జుట్టును కొద్దిగా తీసుకుని, రెండు పాయలుగా చేసుకుని (చిత్రంలో కనిపిస్తున్న విధంగా) తల మధ్య భాగం వరకూ మెలిపెట్టుకుని టైట్‌గా పట్టుకోవాలి. 2. ఇప్పుడు మెలిపెట్టుకున్న రెండు పాయలను చిత్రంలో కనిపిస్తున్న విధంగా లూజ్ చేసుకోవాలి. అనంతరం ఎడమవైపు కూడా చెవి తిన్నగా ఉన్న జుట్టును కొద్దిగా తీసుకుని, రెండు పాయలుగా చేసుకుని కుడివైపు మెలిపెట్టుకున్నట్టుగానే తల మధ్య భాగం వరకూ మెలిపెట్టుకుని, ఆ మెలిపెట్టుకున్న జుట్టును లూజ్ చేసుకోవాలి. 3. తర్వాత కుడి, ఎడమ వైపుల నుంచి మెలిపెట్టుకున్న జుట్టును మొత్తంగా కలిపి (చిత్రాన్ని ఫాలో అవుతూ) హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు జుట్టు చిక్కులు పడకుండా దువ్వెనతో దువ్వుకోవాలి. 4.ఇప్పుడు కుడివైపు చెవి పక్కనున్న జుట్టు మొత్తాన్ని తీసుకుని.. మూడు పాయలుగా చేసుకుని.. జడ అల్లుకుంటూ... ఇంతకు ముందు మెలిపెట్టుకుని బ్యాండ్ పెట్టుకున్న జుట్టులోంచి కుడి భాగాన్ని కూడా(చిత్రాన్ని గమనిస్తూ) అందులో కలుపుకుని జడ అల్లుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడమవైపు కూడా అదే మాదిరిగా ఎడమ చెవి పక్కనున్న జుట్టు మొత్తాన్ని తీసుకుని మూడు పాయలుగా చేసుకుని.. జడ అల్లుకుంటూ.. ఇంతకు ముందు మెలిపెట్టుకుని బ్యాండ్ పెట్టుకున్న జుట్టులోంచి ఎడమ భాగాన్ని కూడా(చిత్రాన్ని అనుసరిస్తూ) అందులో కలుపుకుని జడ అల్లుకోవాలి. (కుడి, ఎడమ జడలు అల్లుకుని.. కొంత జుట్టు ఉండగానే హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి) 5.తర్వాత ఆ జడలను కూడా లూజ్ చేసుకోవల్సి ఉంటుంది. లూజ్ చేసుకునే సమయంలో జుట్టు తెగిపోకుండా, పాయలు రేగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 6.ఇప్పుడు కుడివైపు జడను ఎడమవైపునకు చిత్రంలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని.. ఊడిపోకుండా ఉండేందుకు హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి. ఆ సమయంలో జడ చివర భాగాన్ని మడిచి పైకి రాకుండా చూసుకోవాలి. అనంతరం ఎడమవైపు జడను కూడా అదేవిధంగా వ్యతిరేక దిశలో కుడివైపునకు తిప్పుకుని హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి. -
ఇలా రెడీ అవ్వండి
వేడుకలకు హాజరయ్యే వాళ్లు ముఖకాంతి పట్లనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కానీ, చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే టాప్ టు బాటమ్ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ∙డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. ∙దుస్తుల తర్వాత ఎదుటివారు చూపు ముందు కేశాలంకరణ మీద పడుతుంది. శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణ అదీ సౌకర్యంగా ఉండేది ఎంపిక చేసుకోవాలి. ∙ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు, ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి. ∙ముఖంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపించడం కాదు సౌందర్యపోషణలో గోళ్లది కూడా పధాన పాత్ర. చేతులు, కాలి గోళ్లను చక్కగా కత్తిరించి, చుట్టూ మురికి లేకుండా శుభ్రపరిచి, నెయిల్‌పాలిష్ వేయాలి. ఆభరణాలు, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్... ఇతరత్రా అలంకరణలకు ఆ తర్వాత ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మీ సౌందర్యాన్ని మరింతగా ఇనుమడిస్తుంది. -
రాణించండి
వేడుకలలో స్పెషల్‌గా కనిపించాలంటేఏ డ్రెస్సయినా వేసుకోవచ్చు.కానీ, రాణిలా.. యువరాణిలా దర్జా చూపించాలంటే ఈ లాంగ్ జాకెట్స్తొడుక్కోక తప్పదు. వీటినే కేప్స్ అని కూడా అంటారు. నెట్టెడ్, బనారస్, పట్టు వస్త్రాలతోచేసే ఈ లాంగ్ జాకెట్స్ ఏ డ్రెస్ మీదైనాహొయలు చిందిస్తాయి. మిమ్మల్ని రాణించేలా చేస్తాయి. వివాహ వేడుకలకుసంప్రదాయ వేడుకలకు రొటీన్ అలంకరణ బోర్ కొట్టచ్చు. అదే పలాజో డ్రస్మీదకు డిజైనర్ కేప్ ధరిస్తే వచ్చే ప్రశంసలే వేరు. డిజైనర్ స్కర్ట్ పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని క్రియేట్ చేశారు ఇది. పట్టు లెహెంగా మీదకు క్రాప్‌టాప్‌ని జత చేస్తేనే ఓ ఆకర్షణ. అలాంటిది దానికి నప్పే కోటును జత చేస్తే..వేడుకంతా ఒకే చోట కొలువుదీరనట్టే. ఈవెంట్ కాలేజ్ ఈవెంట్స్, స్టేజ్ షోస్ వంటి ప్రత్యేక సందర్భాలకు నప్పే స్టైలిష్ లుక్‌ని ఒక లాంగ్ కోటుతో తీసుకురావచ్చు. లాంగ్ వెస్ట్రన్ గౌన్ మీదకు ఫ్లోర్ లెంగ్త్ ఫ్లోరల్ జాకెట్ ధరిస్తే చాలు మహారాణి కళతో వెలిగిపోతారు. క్యాజువల్ లుక్ కాటన్ కుర్తా లేదంటే టాప్, బాటమ్ వేసుకొని పైన ఓ కాటన్ కేప్ వేసుకుంటే చాలు దుపట్టా అవసరం లేకుండా సౌకర్యంగా అదే సమయంలో స్టైలిష్‌గా లుక్‌ని మార్చుకోవచ్చు. పట్టు కుర్తా – స్కర్ట్పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని ఎప్పుడూ కొత్తగా క్రియేట్ చేస్తుంటారు డిజైనర్లు. పట్టు లెహెంగా, క్రాప్‌టాప్ వేసుకొని, దానికి నప్పే కోటును జత చేస్తే.. వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. జీన్స్‌తో జోడీ ఈ కాంబినేషన్‌కి మరో కట్ అవసరం లేదనుకుంటారు ఎవరైనా! కానీ, ఇప్పుడా మాటా కోటుతో మూలనపడింది. ఎందుకంటే ప్యాంట్ షర్ట్ లేదా ట్యూనిక్‌కి కోటు కూడా జత చేరి కొత్త హంగుతో చూపురుల మతులను పోగొడుతుంది. సాయంకాలం పార్టీలకు చెదురుముదురుగా పడే జల్లులు, సాయంకాలం కొద్దిపాటి చల్లదనం, రాబోయే చలికాలానికి ఇంకాస్త వెచ్చదనం.. ఇలా కాలానికి వెచ్చని స్నేహాన్ని పంచే లాంగ్ జాకెట్ పార్టీకి ఎనలేని హుషారునిస్తోంది. ఇండో వెస్ట్రన్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ అయి గెట్ టుగెదర్ పార్టీలకు ఉల్లాసాన్ని ఇస్తోంది. ∙ఇది ఇండో వెస్ట్రన్లుక్ కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణలు అక్కర్లేదు. ∙కోటు లేదా ఇన్నర్కుర్తా ప్లెయిన్‌గా ఉంటే సిల్వర్ జువెల్రీ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. ∙కేశాలంకరణకు ప్రత్యేక శ్రద్ద అవసరం లేదు. నిగనిగల కురులను పొడవుగా లేదా పొట్టిగా ఒదిలేసినా అలలుగా ఎగిసిపడుతున్న జుట్టు ఈ తరహా డ్రెస్‌కు బాగా నప్పుతుంది. ∙ప్యాంట్– షర్ట్, పలాజో లాంటివి అయితే మీడియమ్ లేదా పెన్సిల్ హీల్ని వాడచ్చు. మిగతా కాంబినేష్కి ప్లాట్ చెప్పల్ లేదా శాండిల్స్‌ను ఉపయోగించవచ్చు. ∙ఈ తరహా డ్రెస్‌కి మేకప్ హంగామా కూడా పెద్దగా అవసరం పడదు. నేచురల్‌గా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ∙కోటు డిజైన్లలో పాదాలను తాకేలా ఉన్నా, మోకాలు వరకే సరిపుచ్చినా భిన్నమైన స్టైల్‌తో మెరిసిపోవాల్సిందే! ధరించిన డ్రెస్‌కి జాకెట్ తెచ్చే సౌకర్యవంతమైన లుక్ ఇప్పుడు అమ్మాయిలకు ఆప్తురాలైంది. ∙ పాశ్చాత్య దేశాలలో వెచ్చదనానికి వేసుకునే ఈ లాంగ్ కోట్ ఇప్పుడు కొన్ని మార్పులతో స్టైలిష్ వేర్‌గా ఇండియాలో గ్రాండ్‌గా అడుగుపెట్టింది. అన్ని వయసుల వారు ఈ కేప్‌కి హార్ట్‌ఫుల్‌గా వెల్కమ్ చెప్పడమే కాకుండా, అన్ని హంగులు అద్ది హుందాగా ధరిస్తున్నారు. నిర్వహణ: ఎన్.ఆర్. -
అప్పుడు అదే డ్రెస్సు.. ఇప్పుడు అదే డ్రెస్సు
చిట్యాల (నకిరేకల్) : నందమూరి హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రచార రథానికి డ్రైవర్‌గా వ్యవహరించే వారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో పాటుగా హరికృష్ణ కూడా ఖాకీ రంగు డ్రెస్‌ను ధరించేవారు. బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణ వివాహానికి వెళ్తున్నప్పటికీ తన తండ్రి స్థాపించిన పార్టీ రంగైన పసుపు రంగు చొక్కాను, ఖాకీ రంగు ప్యాంట్‌నే ధరించి ఉన్నారు. -
మీ డ్రెస్‌కు.. మీరే అడ్రెస్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అందం అంటే మనకు నచ్చడం కాదు ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటం’’ అనే డైలాగ్‌ను సీరియస్‌గా తీసుకుంది అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్. ఎదుటివాళ్లకు నచ్చేలా మాత్రమే కాకుండా... మనం వేసుకున్న డ్రెస్ డిజైన్ ఎదుటి వాళ్లకు లేకుండా చేసేసింది. ‘ఒక మహిళ.. ఒక్క డిజైన్.. ఒక్కటే డ్రెస్’ కాన్సెప్ట్‌తో అహ్మదాబాద్‌లో ఏకంగా ‘ఈనాక్షి.కామ్’ను ప్రారంభించింది నమ్యా పటేల్. మహర్ష్ షాతో కలిసి ఈ ఏడాది మార్చిలో ఆరంభించిన తమ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు నమ్యా మాటల్లోనే... ‘‘గుజరాత్లో 80 ఏళ్ల నుంచి దీప్కాలా అనే బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలో ఉన్నారు మహర్ష్ షా ఫ్యామిలీ. ఈ అనుభవంతో ఇదే రంగంలో కొత్త కాన్సెప్ట్‌తో రావాలనుకున్నాం. అందుకే ఆయనతో కలిసి ఆన్లైన్ అపెరల్ బ్రాండ్ ఈనాక్షిని ప్రారంభించాం. 21 రోజులకో కొత్త కలెక్షన్..: ప్రస్తుతం ఈనాక్షిలో మహిళ దుస్తులు మాత్రమే లభ్యమవుతాయి. త్వరలోనే పిల్లల గార్మెంట్స్లోకి విస్తరిస్తాం. ఈనాక్షిలో టాప్‌లు, లాంగ్ గౌన్లు, డ్రెస్‌లు, కుర్తాలు, సూట్స్ వంటి అన్ని రకాల మహిళల దుస్తులూ ఉంటాయి. ప్రస్తుతం ముగ్గురు డిజైనర్లున్నారు. వీరే దుస్తులను డిజైన్ చేస్తారు. ప్రతి 21 రోజులకు ఒక కొత్త కలెక్షన్‌తో గార్మెంట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. ధరలు రూ.1,500 నుంచి రూ.6,000 వరకున్నాయి. ఆర్డర్ వచ్చిన 24 గంటల్లోగా డెలివరీ చేస్తాం. హైదరాబాద్ వాటా 10 శాతం.. అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఈనాక్షి ప్రారంభించిన రెండు నెలల్లోనే 3 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటివరకు రూ.4 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. మా ఆదాయంలో హైదరాబాద్ వాటా 10 శాతం ఉంది. వచ్చే 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అహ్మదాబాద్‌లో తొలి ఆఫ్‌లైన్‌లో స్టోర్‌ను ప్రారంభిస్తాం’’. -
తన లైఫ్‌ని తనే కుట్టుకుంది
షబ్నమ్. వయసు 17. ఈ వయసు పిల్లలు అడిగినట్లు ‘నాన్నా! పండక్కి నాకు కొత్త బట్టలు కొనివ్వు, నాన్నా పది రూపాయలివ్వు జడ పిన్నులు కొనుక్కుంటాను’ అని అడగడంలేదీ అమ్మాయి. రివర్స్‌లో ఆ తండ్రే ‘నువ్వు నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు బిడ్డా’ అని మురిసిపోతున్నాడు. ఆ తండ్రి.. కూతుర్ని పెద్ద ముందుచూపుతో నడిపించిన దార్శనికుడేమీ కాదు. ‘ఆడపిల్లవు ఊరు దాటి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకుంటావా, వద్దే వద్దు. ఊళ్లో బడిలో ఉన్నంత వరకు ఏడు తరగతులు చదివావు ఇక చాలు’ అనేశాడు ఐదేళ్ల కిందట. ఆడపిల్లకు వంట వండటం నేర్పించి పెళ్లి చేయడమే అమ్మానాన్నల బాధ్యత అన్నట్లు రెండేళ్ల కిందట ఓ పెళ్లి సంబంధం కూడా తెచ్చాడు. కూతురు తల వంచలేదు! బడి మాన్పిస్తే చేసేదేమీ లేక ఊరుకుంది. కానీ పెళ్లి చేసి పంపించేస్తానంటే ఊరుకోనంటే ఊరుకోనని మొండికేసింది షబ్నమ్. ‘ఆడపిల్లలు 18 ఏళ్లకంటే ముందు పెళ్లి చేసుకోకూడదట’ అని కూడా వాదించింది. పిల్ల సంతోషంగా తల వంచితే తాళి కట్టించాలి తప్ప మెడలు వంచి కట్టించకూడదని షబ్నమ్ నానమ్మ నచ్చచెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడా తండ్రి.కూతురికి లోకజ్ఞానాన్నంతా నూరిపోశాడని టైలరింగ్ టీచర్‌ను మాత్రం బాగానే తిట్టుకున్నాడు. తండ్రి తల ఎత్తుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైచ్ జిల్లా, రాయ్‌పూర్ షబ్నమ్ ఊరు. అక్కడ ఓ ఎన్జీవో నిర్వహించిన టైలరింగ్ సెంటర్లో మూడు నెలలపాటు దుస్తులు కుట్టడం నేర్చుకుంది. అదే ఆమె జీవితానికి పెద్ద మలుపు అవుతుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడామె నెలకు రెండు మూడు వేలు సంపాదిస్తోంది. రంజాన్, దసరా వంటి పండుగ సీజన్లలో నాలుగైదు వేలు సంపాదిస్తోంది. ఇంట్లో కొంత ఇచ్చి మిగిలిన డబ్బును బ్యాంకులో దాస్తోంది. ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బుని చూసి ఆ తండ్రి పుత్రికోత్సాహంతో ఇప్పుడు మురిసిపోతున్నాడు. రాయ్‌పూర్ ‘రోల్ మోడల్’! షబ్నమ్ తాను టైలరింగ్ క్లాస్‌లో నేర్చుకున్న మోడల్స్ దగ్గర ఆగిపోలేదు. అదే బ్లవుజ్‌లు, లెహెంగాలు కుడుతూ ఉంటే ఈ రోజు ఇంతలా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండకపోయేది. ఆమె వాల్‌పోస్టర్ మీద హీరోయిన్ డ్రస్ చూస్తే అది ఏ ప్యాటర్న్ అయి ఉంటుందో ఊహించగలుగుతుంది. సినిమాకు వెళ్తే హీరోయిన్ వేసుకున్న డ్రస్‌లు మైండ్‌లో ప్రింట్ అయిపోతాయి. సినిమా నుంచి వచ్చాక వాటిని పేపర్ మీద గీసుకుంటుంది. అలా పెద్ద నోట్స్ తయారు చేసుకుంది. ఆ మోడల్స్‌ని రాయ్‌పూర్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. తండ్రి స్నేహితుని కూతురికి పెళ్లి డ్రస్ కుట్టిచ్చింది. ఆ పెళ్లిడ్రస్ షబ్నమ్ పనితీరుకు ఓ ప్రచారాస్త్రంగా మారింది. చదువుకుంటూ, నేర్పిస్తోంది షబ్నమ్ సాధించిన మరో విజయం ఏమిటంటే.. ఏడవ తరగతి తర్వాత ‘చదువు కోసం మరొక ఊరికి పోవడమా... వీల్లేదంటే వీల్లేదు’ అన్న తండ్రిని ఒప్పించి కాలేజ్‌లో చేరడం. నాన్ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి నిషార్ షరీఫ్ అహ్మద్ ఇంటర్ కాలేజ్‌లో చేరింది. తానింకా పెద్ద చదువులు చదువుతానంటున్న షబ్నమ్ టైలరింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది. కొత్త మోడల్స్ నేర్పించమని వచ్చిన తోటి అమ్మాయిలకు మెళకువలు నేర్పిస్తోంది. – మంజీర -
ఆ హీరోయిన్ డ్రెస్‌కి 25 ఏళ్లంట!
ముంబై: ప్రముఖ డైరెక్టర్ శశాంక్ ఘోష్ దర్శకత్వంలో బాలీవుడ్ నటులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. ఈ మూవీ గత శుక్రవారం విడుదలయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరు హిరోయిన్ల డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్ వేసుకున్న డ్రస్‌కి మహిళలు అంతా ఫిదా అయ్యారు. తాజాగా కరినా వేసుకున్న డ్రస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో కరీనా కపూర్ వేసుకున్న డ్రస్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. ఆ డ్రస్ చూడడానికి చాలా కొత్తగా, అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డ్రెస్ 25 ఏళ్ల క్రితం డిజైన్ చేసినదట. ఈ విషయాన్ని అబుజానీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ ఆ డ్రెస్‌ను 25 ఏళ్ల క్రితం డిజైన్ చేశాం. మా ఫాక్టరీలోని ఓ పెట్టెలో దాన్ని ఉంచాం. ఓ రోజు ఫ్యాక్టరీలోని దాచిన దుస్తులన్ని బయటకు తీస్తుండగా నిర్మాత రియా మా ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ సమయంలో రియాకు ఆ డ్రెస్ కన్పించింది. దాన్ని బయటికి తీయమని చెప్పారు. అది నచ్చడంతో దానిని లెహెంగాగా డిజైన్ చేయమన్నారు. స్కర్ట్, టాప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం చున్నీని వెరైటీగా డిజైన్ చేశాం. దాన్ని కరినాకు సరిపడేలా డిజైన్ చేశాం. పెళ్లి సీన్లో కరీనా ఆ డ్రెస్‌లో కన్పిస్తుంది’ అని అబుజానీ వెల్లడించారు. మరోవైపు ‘ వీరే ది వెడ్డింగ్’ సినిమా రెండు రోజులకే రూ.22.95 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ లోపు 35 కోట్లు దాటేలా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
పెప్ కాలమ్
పెప్లమ్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది.. ధోతీ ప్యాంట్ అందుకు తోడైంది. రెండూ కలిస్తే దేశీయానికి విదేశీయం జతపడినట్టు. తూర్పు–పశ్చిమాలు కలిసి కూర్చిన ఈ అందమైన డ్రెస్‌కు మీరే డిజైనర్! డిజైనర్ గార్మెంట్స్ కొనుగోలులో ఒక సులువు ఉంటుంది. వెంటనే నచ్చిన డ్రెస్‌ను తీసేసుకోవచ్చు. కానీ, కొలతల్లో తేడాలు తప్పవు. మళ్లీ వాటిని సరిదిద్దుకునే సమస్యలూ తప్పవూ. పైగా చాలా వరకు ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. డిజైనర్ డ్రెస్‌ని మనమే సొంతంగా డిజైన్ చేసుకోవచ్చు. అదీ తక్కువ ఖర్చుతో.. ఎలా అంటే.. ∙ఒక పార్టీ డ్రెస్‌ను ఎంచుకునేటప్పుడు అదీ కాస్త మన సంప్రదాయ టచ్ ఉన్నది డిజైన్ చేసుకోవాలంటే ఇండోవెస్ట్రన్ స్టైల్ తీసుకోవాలి. అది కూడా వేడుక, సందర్భమూ బట్టి ఎంపిక అయితే మరీ మంచిది. ∙డ్రెస్‌ల ఎంపికలో ప్రధాన పాత్ర రంగులది. ఇవే వేడుకలో ప్రత్యేకతను నింపుతాయి. ధోతీ ప్యాంట్ లేదా పటియాలా సల్వార్ ధోతీ లేదా పటియాలా సల్వార్ మన దేశీయ సంప్రదాయ డ్రెస్. ఇది ఓల్డ్ ట్రెండ్. అయితే దీనికి కొంచెం వెస్ట్రన్ టచ్ ఇస్తే.. ఎప్పటికీ ఎవర్గ్రీన్ డ్రెస్. కొన్ని డ్రెస్ డిజైనింగ్స్కి ఎప్పుడూ ‘పాత’ లుక్ రాదు. ఇది సౌకర్యంగా ఉండటమే కాదు రాయల్ డ్రెస్‌గా కితాబులు అందుకుంది. ఈ కాలానికి అనువైన డ్రెస్ కూడా! నడుము దగ్గర కుచ్చులు పెడితే ధోతీ కట్టు మాదిరి లుక్ అద్భుతంగా కనిపిస్తుంది. దీనికి పెప్లమ్ టాప్‌ని జత చేస్తే ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేస్తుంది.కావాలనుకుంటే దీనికి దుపట్టా కూడా జత చేసుకోవచ్చు. ∙పెప్లమ్ టాప్ అంచు (బార్డర్) తీసేస్తే క్యాజువల్ వేర్‌గానూ ధరించవచ్చు. రంగులు పార్టీవేర్‌కి పెప్లమ్ టాప్‌కి అంచుగా జరీ బార్డన్ని జత చేయచ్చు. లేదా ఒకే రంగుతో బ్లౌజ్‌ని, ధోతీ ప్యాంట్‌ను డిజైన్ చేసుకోవాలంటే డ్రెస్‌లో ఏదో ఒక తేడాను చూపించాలి. ఉదా: జరీ ఎంబ్రాయిడరీ బార్డర్ లేదా కోల్డ్ షోల్డర్తో ఆ తేడా తీసుకురావచ్చు. షేడెడ్ కలర్ కాంబినేషన్ క్లాత్‌తో ధోతీ లేదా పటియాలను డిజైన్ చేసుకుంటే మరింత బాగుంటుంది. దుపట్టా తప్పనిసరి అనుకుంటే పటియాల రంగులో లేదా టాప్ అండ్ బాటమ్‌కి పూర్తి కాంట్రాస్ట్ది ఎంచుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎంపిక ∙చాలా ఖరీదైన ఫ్యాబ్రిక్స్ నుంచి ధర తక్కువ గల ఫ్యాబ్రిక్స్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్లో ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుందో అది ఎంచుకోవాలి. పెప్లమ్ టాప్‌కి రా సిల్క్, కాజు సిల్క్, కాటన్ సిల్క్, పేపర్ సిల్క్, టఫేరా సిల్క్.. వంటి ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. సిల్క్ కాకుండా వేరే ఫ్యాబ్రిక్ తీసుకోవాలనుకుంటే మొదటి ఎంపిక ‘వెల్వెట్’కి వెళ్లడం మంచిది. వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో పెప్లమ్ డిజైన్ చేస్తే రాయల్ లుక్‌తో టాప్ గ్రాండ్‌గా కనిపిస్తుంది.టాప్‌కి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఏది రిచ్‌గా ఉంటే అది పటియాల లేదా ధోతీకి ఎంచుకోవచ్చు. అయితే చాలా వరకు షేడెడ్ కలర్స్, కొంత లేత రంగులు ఎంచుకోవడం మంచిది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకుంటే కుచ్చులు చక్కగా కనిపిస్తాయి. ఉదాహరణకు: క్రేప్, కొన్ని రకాల సిల్క్స్, శాటిన్, చిఫాన్, జార్జెట్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. బార్డర్స్‌లో సీక్వెన్స్, జరీ, బీడ్స్, మిర్రర్స్వి ఎంచుకోవచ్చు. మీదైన ముద్ర వేయాలంటే మాత్రం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కొలత పెప్లమ్ టాప్‌కి ఫ్యాబ్రిక్ 3 మీటర్లు. బాటమ్‌కి : 4 మీటర్లు అంచు జత చేయాలంటే : 2 –3 మీటర్లు పడుతుంది. ఇతర అలంకరణలు ప్లెయిన్ పెప్లమ్ టాప్‌కి అదనపు హంగులు చేర్చాలంటే ఎంబ్రాయిడరీనే చేయనక్కర్లేదు. ఖర్చు తగ్గించుకోవాలంటే డిజైనర్ బటన్స్‌ని అమర్చినా క్లాసిక్ లుక్ వస్తుంది.ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు హై హీల్స్ వేసుకుంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఒక సన్నని బెల్ట్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకున్నా, డిజైనర్ క్లచ్ చేత పట్టుకున్నా బాగుంటుంది. – రూపేశ్ గుప్తా, ఇన్స్టిట్యూట్ డిజైన్ ఇన్నోవేషన్, హైదరాబాద్ పెప్లమ్ టాప్ మేకింగ్ బ్లౌజ్ భాగాన్ని కుట్టాక దానికి కుచ్చులను జత చేయాలి. ఇందుకు తగినంత ఫ్యాబ్రిక్ తీసుకొని మడత వేసి వృత్తాకారం వచ్చేలా కట్ చేసుకోవాలి. ‘పెప్’ భాగం పొడవుగా ఉండాలో, తక్కువగా ఉండాలో మీ ఆసక్తి బట్టి డిజైన్ చేసుకోవచ్చు. అంచు భాగాన్ని సన్నని అంచుగా మడిచి కుట్టేయాలి. పై భాగాన్ని బ్లౌజ్ పార్ట్‌కి జత చేసి, కుట్టాలి. బ్యాగ్ పాత పడిపోయిందా! లేదంటే రొటీన్‌గా ఉండే బ్యాగ్‌ను కొత్తగా మార్చేయాలా! మీ మొదటి సంపాదనతో కొనుక్కున్న బ్యాగ్‌ను జ్ఞాపకంగా దాచేసుకున్నా, ఎవరైనా కానుకగా ఇచ్చినా, ఖరీదు ఎక్కువైనా, చిన్న చిన్న లోపాలున్నా.. ఇలా కొన్ని బ్యాగ్‌లను బయట పడేయలేం. అలాంటి బ్యాగులను కొత్తగా మార్చుకొని ఎంచక్కా వాడుకోవాలంటే.. ఈ టెక్నిక్ రెడీగా ఉంది. ఉదా: 1 డిజైన్ చేయాలనుకున్న బ్యాగ్, లేసులు, తెల్లని పూసలు లేదా ముత్యాలు, కుందన్స్, చమ్కీ, గ్లూ వంటివి సేకరించండి. లెదర్, జూట్ బ్యాగ్‌లకు ఇలాంటివి కుట్టాలంటే సూది దారం కూడా రెడీగా పెట్టుకోండి 2 గ్లూ సాయంతో లేసును బ్యాగ్ లేదా క్లచ్‌కి అతికించండి. అదనపు భాగాన్ని కత్తిరించేయండి 3 పూర్తి లేసు చక్కగా అమరేలా జాగ్రత్త తీసుకోండి 4 ఆ లేసు మీదుగా ముత్యాలు లేదా పూసలు, 5చమ్కీలు అతికించండి. బ్యాగ్/క్లచ్ రెడీ. నోట్: 6,7 బ్యాగుల్లా క్లాత్, జ్యూట్, లెదర్ బ్యాగ్‌లైతే సూదితో జాగ్రత్తగా కుట్టేయాలి. లేదంటే గ్లూతో అతికించాలి. మీ బ్యాగ్ లేదా క్లచ్ అత్యంత సుందరంగా పార్టీవేర్‌కి నప్పేలా మారిపోతుంది. 39 అంగుళాల ధోతీ ప్యాంట్‌కు 1 మూడు మీటర్ల ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. నాలుగువైపుల సమభాగాలుగా ఉండాలి. అఆఇఈ మార్క్ చేయాలి. 2 ఆ నుంచి ఇ వరకు మడవాలి. అప్పుడు అఇఈ అవుతుంది. 3 ఈ నుంచి అ కోణానికి ఫ్యాబ్రిక్ మడత తీసుకోవాలి. మరో కోణానికి ఉ మార్క్ చేయాలి. అఉఇ వస్తుంది. 4 అఉఇ లో ఉ వద్ద 10 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు తీసుకొని కట్ చేయాలి. అ నుంచి ఇ వరకు 36 అంగుళాల కొలత తీసుకొని అ భాగంలో కట్ చేయాలి. 5 ముందు భాగాన్ని మడవాలి. 6 వెనుక భాగం ముందు భాగం మీదకు వచ్చేలా కలిపి జత చేయాలి. 7 5 అంగుళాల వెడల్పు 20 అంగుళాల పొడవు ఉన్న బెల్ట్ భాగాన్ని జత చేయాలి. నోట్: శరీర ఆకృతిని బట్టి కొలతలు తీసుకోవాలి. -
యువతుల దుస్తుల్ని బహిరంగంగా కత్తిరించారు
పట్నా: ఓ పోటీ పరీక్షకు నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించి హాజరైన యువతుల దుస్తుల్ని కత్తెరలు, బ్లేడులతో కత్తిరించిన ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినుల దుస్తుల్ని చింపివేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో సంబంధిత పరీక్షా కేంద్రంతో పాటు పరీక్ష సూపరింటెండెంట్‌పై జీవితకాలం వేటుపడింది. బిహార్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ బోర్డు(బీసీఈసీఈబీ) శనివారం నర్సింగ్ కోర్సు ప్రవేశపరీక్షను నిర్వహించింది. స్లీవ్‌లెస్ దుస్తుల్ని ధరించాలని అభ్యర్థులకు సూచించింది. ముజఫర్‌పూర్ జిల్లాలో పలువురు యువతులు ఫుల్‌స్లీవ్ దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు యువతుల స్లీవ్స్‌ను కత్తిరించారు. ఈ ఘటనపై బిహార్ విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. -
యువరాణి గౌను కోటి!
మరికొద్ది రోజుల్లో (మే 19) అంగరంగ వైభవం గా బ్రిటన్ యువరాజు హ్యారీ, మేగన్‌ల వివాహ మహోత్సవం జరగనుంది. ఇంకేముంది సాధారణంగానే ప్రపంచ దేశాలు దీని గురించి మాట్లాడుకుంటాయి. ఏం వంటలు చేస్తారు.. ఎంతమంది అతిథులను పిలుస్తారని కుతూహలంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మరి పెళ్లి రోజు పెళ్లి కూతురు మేగన్ ఏ పెళ్లి గౌను వేసుకుంటారు..? ఎంత ఖర్చుతో తయారు చేయిస్తున్నారు..? ఏ సంస్థ రూపొందిస్తోంది.. ఎలాం టి డిజైన్‌తో తయారు చేస్తున్నారనేది చాలా మంది డిజైనర్లు.. సాధారణ జనాల మెదడును తొలుస్తున్న ప్రశ్న.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎట్టకేలకు లభించింది. మేఘన్ పెళ్లి గౌను డిజైన్ బయటకొచ్చింది. మేగన్ వేసుకునే గౌను ఖరీదు ఎంతో తెలుసా.. దాదాపు రూ.94 లక్షలు.. ఈ గౌనును యువరాజు హ్యారీనే కొనిస్తున్నారట. అయితే ఇంతకు ముందు జరిగిన రాజవివాహాల్లోకెల్లా ఈ గౌనే ఖరీదైనదా అంటే కాదు.. కేట్ మిడిల్టన్ వివాహానికి దాదాపు రూ.రెండున్నర కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన గౌను ధరించారు. ప్రిన్సెస్ డయానా 1981లో ఇప్పటిలెక్క ప్ర కారం దాదాపు రూ.33 లక్షల విలువైన గౌను ధరించారు. 1947లో ఎలిజబెత్–2 రాణి వివాహ మహోత్సవంలో కూడా ఆమె ధరించిన గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఫ్రాక్ కి..ర్రాక్!
చిన్నప్పుడు చిన్న చిన్న గౌనులు వేసుకున్న ముచ్చట మదిలో అలాగే నిలిచిపోయి ఉందా! ఇప్పుడు అలాంటి చిన్న గౌన్ వేసుకోలేం అని బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడిదే ట్రెండ్‌లో ఉంది. ఫ్రాక్ కి..ర్రాక్ పుట్టిస్తోంది. ఈ ఫ్రాక్ స్టైల్ పాశ్చాత్య, సంప్రదాయ డ్రెస్సులతో అతివలను అమితంగా ఆకట్టుకుంటుంది. ∙వేసవి కాలం చెమట, ఉక్కపోతలు సహజం. ధరించే డ్రెస్ ఎలాంటిదైనా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, అదే సమయంలో స్టైలిష్‌గా తోడయితే ఎంత బాగుండు అనుకునేవారికి కాటన్ ఫ్రాక్ సరైన ఎంపిక. కాటన్ బాటమ్, ఇక్కత్ లేదా ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఎంచుకుంటే చాలు. సమ్మర్లో క్యాజువల్ లుక్‌లోనూ స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. ∙కాలర్ నెక్ ప్యాటర్న్‌తో ఉన్న ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్‌కి ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రధాన ఆకర్షణ. లాంగ్ జార్జెట్ స్లీవ్స్ బాటమ్‌గా పూర్తి కాంట్రాస్ట్ ధోతీ ప్యాంట్ ధరిస్తే పార్టీకి సిద్ధమే! ∙నైట్ వెడ్డింగ్ పార్టీ. లైట్ల ధగ ధగలతో డ్రెస్ కూడా పోటీపడాలంటే జరీ జిలుగులతో తీర్చిదిద్ది షార్ట్ ఫ్రాక్ ధరించాల్సిందే! ∙ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్ ఎంచుకునేటప్పుడు మరొక చిన్న మెలకువ తెలుసుకోవాలి. ఫ్రాక్ అంచుగా జరీ బార్డర్, ఫ్రంట్ బటన్స్ అయితే లుక్ మరింత ఆకర్షణీయంగా మారిపోతుంది. ∙మెహెందీ కలర్ షార్ట్ ఫ్రాక్ సూట్ మీదకు హెవీ వర్క్‌తో డిజైన్ చేసి దుపట్టా ధరిస్తే సెలబ్రిటీలకు తీసిపోని విధంగా ఎలాంటి వేదికైనా వైబ్రెంట్‌గా వెలిగిపోవాల్సిందే! ∙లెహెంగా మీదకు డిజైనర్ బ్లౌజ్ ధరించడం మామూలే! అదే ప్లెయిన్ లెహెంగా మీదకు బెనారస్ షార్ట్ ఫ్రాక్ ధరిస్తే వేడుకలో ప్రత్యేకంగా నిలవచ్చు. ∙ధోతీ ప్యాంట్ మీదకు చిన్న గౌన్ ధరించి, డిజైనర్ దుపట్టా వేసుకొని, సన్నని డిజైనర్ బెల్ట్ నడుమున చుడితే పెళ్లికి ప్రత్యేక కళ వచ్చేస్తుంది. – నిర్వహణ: ఎన్.ఆర్ -
ప్యాచ్ మంత్ర
అందం అతికినట్టుండాలి. అతికించడం కూడా ఇప్పుడో అందం.మ్యాచ్ అయ్యేలా ప్యాచ్ వేస్తే కన్ను చటుక్కున క్యాచ్ చేస్తుంది. అవును... కన్ను అతుక్కుపోతుంది. అది కూడా మంత్రం వేసినట్టుగా!మీరూ ప్యాచ్ ఫ్యాషన్నుటచ్ చేయండి. ప్యాచ్‌తో మంత్రముగ్ధులను చేయండి. సమ్మర్ ప్యాచ్ వేసవిలో కాటన్ దుస్తులకే అధిక ప్రాధాన్యత. అవి చీరలైనా, డ్రెస్సులైనా. ప్లెయిన్‌గా ఉంటే కళ్లకు, ఒంటికి మరింత హాయి. అయితే, మరీ సాదాసీదాగా ఉండటం అలంకరణకు అన్నివేళలా నప్పని విషయం. అందుకని ‘ప్యాచ్’తో దుస్తులకు ముచ్చటైన కళను జతచేయడానికి సిద్ధమవుతున్నారు డిజైనర్లు. మనవైన చేనేతలు నేత చీరలు వేసవిలో చమటను పీల్చుకుంటాయి కాబట్టి మేనికి హాయినిస్తాయి. వీటికి కొత్త హంగులు అద్దాలంటే కలంకారీ ఫ్యాబ్రిక్ ప్యాచ్‌లతో పాటు ఇతర రంగు రంగుల కాటన్ ఫ్యాబ్రిక్‌తోనూ డిజైన్‌గా రూపొందించుకోవచ్చు. కేరళ కసవు బంగారు రంగు అంచుతో అచ్చమైన హ్యాండ్లూమ్గా వన్నెలుపోయే కేరళ కసవు చీర ఎండ వేడిని నిరోధిస్తుంది. పాలమీగడలా ఉండే ఈ రంగు చీరల మీద పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ డిజైన్ని ప్యాచ్‌గా వేస్తే చాలు ఇలా అందమైన హొయలు పోవడానికి సిద్ధమైపోతాయి. సింపుల్‌గానూ ఉంటాయి. వేడుకలకు ప్రత్యేక కళను తీసుకువస్తాయి. డిజైనర్ దుస్తులు టస్సర్, మల్మల్, కోరా, ఖాదీ.. వంటి చేనేతలను లాంగ్, అనార్కలీ గౌన్లు, లెహంగాలుగా రూపొందించుకోవచ్చు. వాటికి మరో కలర్ లేదా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసిన అంచును జత చేస్తే సంప్రదాయ వేడుకలకే కాదు ఇండో వెస్ట్రన్ పార్టీలకూ అచ్చమైన డిజైనరీ డ్రెస్సులుగా వెలిగిపోతాయి. తక్కువ ధరకే ఎక్కువ హంగులు పూర్తి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌పై పెయింట్ లేదా ఎంబ్రాయిడరీ చేసి ఎవరికి వారు ప్యాచ్‌లను సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే రెడీమేడ్‌గానూ ప్యాచ్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఒక్కో డిజైన్ ప్యాచ్ రూ.20 నుంచి వందల రూపాయల్లో లభ్యమవుతున్నాయి. రూ.400–500 ఖర్చుపెడితే ఆకర్షణీయమైన శారీని ఎవరికి వారు డిజైన్ చేసుకోవచ్చు. -
లంగా ఓణీ ధరించమన్నందుకు బాలిక ఆత్మహత్య
చెల్లితో గొడవ పడవద్దని తల్లి మందలించిందన్న కారణంతో మనస్తానికి గురై ఎస్.రాయవరం మండలం చిన ఉప్పలం గ్రామానికి చెందిన సాయి అశ్రిత్ అనే 13 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని రోజు గడవక ముందే మరో బాలిక బలవన్మరణానికి పాల్పడింది. తల్లిమందలించిందన్న కారణంతో అనకాపల్లి మండలంలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి: చిన్నపాటి కారణానికే మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దుస్తులు వేసుకునే విషయంలో తల్లి మందలించడంతో బలన్మరణం చెందింది. రూరల్ ఎస్ఐ ఆదినారాయణరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వెంకటపతి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రేబాక శివారు కాపుశెట్టివానిపాలెంకు చెందిన బాలరాజు, శాంతిల కుమార్తె శిరీష(15) సబ్బవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో చుడీదార్ వేసుకొని గుడికి వెళతానని శిరీష తన తల్లికి చెప్పింది. దీనికి తల్లి శాంతి అభ్యంతరం చెప్పి, గుడికి వెళ్లేటప్పుడు లంగా ఓణీ ధరించాలని సూచించింది. దీనికి మనస్తాపం చెందిన శాంతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. శిరీష గదిలోంచి బయటకు రాని విషయాన్ని 11.30 సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు తలుపును బలంగా తోయగా ఉరివేసుకొని ఉంది. దీంతో వారు భోరున విలపించారు. క్షణికావేశంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
పాత చీర కొత్త డ్రెస్
అమ్మ, అమ్మమ్మల చీరలను లంగ, జాకెట్టులుగా అమ్మాయిలకు రూపొందించడం తెలిసిందే! ఈ కాలం అమ్మాయిల ఆలోచనలకు తగ్గట్టు పాత చీరలను ఇలా లాంగ్ అనార్కలీ, వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్లుగా రూపొందిస్తే కొత్తగా వెలిగిపోతాయి. ఇలాంటి డ్రెస్సులు సంప్రదాయ వేడుకల్లో స్టైల్‌గా మెరిసిపోతాయి. ఇందుకు పట్టు, చేనేత చీరలను ఎంచుకోవాలి. ఎంచుకున్న శారీని ఏ తరహా డ్రెస్‌గా రూçపకల్పన చేసుకుంటే బాగుంటుందో ముందుగా నిర్ణయించుకోవాలి. లాంగ్ అనార్కలీలు, గౌన్లు ఇప్పుడు ఫ్యాషన్‌లో ఉన్నాయి. అంచులు, కొంగును చేతులు, ఛాతీ భాగాలకు తీసుకోవాలి. అంచు భాగం ఎక్కువగా ఉండి మిగిలిపోయే అవకాశం ఎక్కువ. ఇలాంటప్పుడు ఫ్రంట్ ఓపెన్ డ్రెస్‌గా మలుచుకొని, అంచు భాగాన్ని జత చేయాలి. ఈ ఫ్రాక్‌కి కాంట్రాస్ట్ లెగ్గింగ్, చుడీని జత చేస్తే చాలు. ఈ కాలానికి తగ్గట్టు పార్టీ వేర్ డ్రెస్ రెడీ! కేవలం చీర కొంగును మాత్రమే తీసుకొని, దీంతో స్టైలిష్ వేర్ని డిజైన్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ పార్టీలలో ఇలాంటి డ్రెస్ మరింత ట్రెండీగా వెలిగిపోతుంది. రెడ్ కార్పెట్ డ్రెస్‌గా లాంగ్ వెస్ట్రన్ గౌన్ సెలబ్రిటీల స్పెషల్‌గా నిలుస్తుంది. ఇలాంటి డ్రెస్ మీ అమ్మాయికి కావాలనుకుంటే అంచు ఉన్న పాత చేనేత చీరను తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సన్నటి అంచు భాగాలను క్రాస్ నెక్, సైడ్స్, కింది భాగాలలో జత చేస్తే మోడ్రన్‌గా వెలిగిపోతుంది. -
కంగుమనదా హృదయం
ఇన్ని రంగులు కంగనా మీద చూస్తే మరి కంగుమనదా హృదయం. కంగేంటి ఖర్మ యంగ్మనదా హృదయం. ఈ డ్రెస్సులలో మీరు కూడా యంగ్రంగుల చెంగుచెంగులు కొట్టండి. ఆహా.. కంగుమనదా హృదయం. ►వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా, ఫుల్ స్లీవ్స్ బోట్‌నెక్ బ్లౌజ్ వీటి మీద గ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఎంబ్రాయిడరీ... వేడుకను వైబ్రెంట్‌గా మారుస్తుంది. ►లేత గులాబీ రంగు ఫ్రాక్ క్యాజువల్ వేర్‌గా అమరే వెస్ట్రన్ స్టైల్. ఇది గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలకు కంఫర్ట్‌గా ఉండటంతో పాటు లుక్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. ►లేత గులాబీ రంగు జార్జెట్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్ మీదకు సిల్వర్ జ్యువెల్రీ ధరిస్తే సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తారు. ► బ్లాక్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ ఇది. బ్లాక్ డ్రెస్ ధరిస్తే ఆభరణాలు, ఇతర అలంకరణలు అవసరం లేకుండానే ఎక్కడ ఉన్నా హైలైట్‌గా నిలిచిపోతారు. ముఖ్యంగా ఈవెనింగ్ పార్టీస్‌కి ఈ డ్రెస్ బెస్ట్ ఆప్షన్ ►సైడ్ స్లిట్ గల ప్రింటెడ్ లాంగ్ కుర్తీ, బాటమ్‌గా పలాజో క్యాజువల్ వేర్‌గా ఇలాంటి డ్రెస్సులు బాగా నప్పుతాయి. ► లాంగ్ ఫ్రాక్ దానికి బాటమ్‌గా పలాజో డిఫరెంట్ స్టైల్‌ని కళ్లకు కడుతుంది. ►లేత గులాబీ రంగు ప్రింటెడ్ సింగిల్ షోల్డర్ కేప్, బాటమ్‌గా ప్యాంట్.. వెస్ట్రన్ పార్టీలో వినూత్నంగా కనిపిస్తారు. ►లేయర్డ్ లాంగ్ ఫ్రాక్. ఒకే రంగుతో అట్రాక్ట్ చేసే విధంగా ఉన్న ఇలాంటి డ్రెస్సింగ్ పెద్ద పెద్ద ఈవెనింగ్ ఇవెంట్స్‌కు బాగా నప్పుతుంది. - భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్ -
సోనారే సోనా
హిందీలో సోనా అంటే బంగారం. సోనమ్ కపూర్‌లా సంప్రదాయాన్ని, ఆధునికతను మిక్స్ చేసి డ్రెస్ చేసుకుంటే.. బంగారానికి అందాల పూత పోసినట్లుంటుంది. మన ఇంటి బంగారు తల్లులు కూడా ఇలా... ఒద్దికైన బట్టల్లో మోడర్న్‌గా కనిపించవచ్చు. ►సన్నగా ఉన్నవారు జార్జెట్, నెటెడ్ వంటి చీరలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు ఇంకా సన్నగా కనపడతారని. కానీ, ఇలా డిజైనర్ బ్లౌజ్ దానికి తగ్గట్టు చీర కట్టు, కేశాలంకరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఈవెనింగ్ పార్టీలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. ►ఇది లాంగ్ అనార్కలీ, పలాజో డ్రెస్. గౌన్ ధరించినప్పుడు కరెక్ట్ ఫిట్‌తో పాటు కలర్ కాంబినేషన్ తప్పనిసరి సరిచూసుకోవాలి. ఈ డ్రెస్ మీదకు ఆభరణాల అలంకరణ ఎంత తక్కువగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. ►డిజైనర్ ధోతీప్యాంట్ వేసుకొని, టాప్ కోసం అదే రంగు స్లీవ్‌లెస్ ట్యూనిక్, ఆ పైన ఎంబ్రాయిడరీ చేసిన ఓవర్ కోట్ ధరిస్తే పార్టీలో ఓ కొత్త లుక్‌తో మెరిసిసోవచ్చు. చెవులకు ఆభరణాలు, ఫిష్‌టెయిల్ హెయిర్‌స్టైల్ మిమ్మల్ని నలుగురిలో వినూత్నంగా కనిపించేలా చేస్తుంది. ►సింగిల్ పీస్ ఫ్లోరల్ ప్రింట్స్ లాంగ్ స్లీవ్స్ గౌన్ ధరించి, ఒక బెల్ట్‌తో పూర్తి లుక్ మార్చేయవచ్చు. ఇదే స్టైల్‌ని చీరకట్టు, గాగ్రాచోళీతోనూ తెప్పించవచ్చు. పీటర్ప్యాన్ కాలర్‌నెక్ బ్లౌజ్‌ని ఎంచుకుంటే చాలు. ఇండో వెస్ట్రన్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తారు. ►ఈ కంచిపట్టు చీర అంచు, పల్లూలోనూ రాజస్థానీ థీమ్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. పండుగలు, పెళ్ళిళ్లు వంటి శుభకార్యాలకు పట్టుచీరలు సంప్రదాయ కళను తీసువస్తాయి. ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, వీటి మీదకు పాతకాలం నాటి టెంపుల్ జువెల్రీ ధరిస్తే అందమంతా ఒక్క చోట కుప్పపోసినట్టుగా ఇల్లంతా కళకళలాడిపోతుంది. ► పాశ్చాత్య లేదా సంప్రదాయ వేడుకలకు ఏ తరహా డ్రెస్సింగ్ బాగుంటుందని ఎక్కువ హైరానా పడనవసరం లేదు. లాంగ్ అనార్కలీ ్రడ్రెస్ ఉంటే దాని మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఓవర్‌కోట్, ష్రగ్ వంటివి ధరిస్తే గ్రాండ్‌గా కనిపిస్తారు. ►ఇది త్రీ పీస్ శారీ డ్రెస్. సంప్రదాయ వేడుకల్లో యువరాణిలా వెలిగిపోవాలంటే ఈ తరహా డ్రెస్సింగ్ మంచి ఎంపిక. ప్లెయిన్ క్రీమ్ కలర్ చీర కట్టు దాని మీదకు, ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఆ పైన బంగారు రంగు లాంగో ఓవర్ కోట్« దరిస్తే వైవిధ్యంగా కనిపిస్తారు. ఒక చిన్న మార్పుతో ఎక్కడ ఉన్నా యువరాణిని తలపిస్తారు. ► ఏ ఫంక్షన్ జరిగినా అమ్మాయిలు డిజైనర్ లంగా ఓణీలు, గాగ్రాచోళీలు «ధరించడం సాధారణమైపోయింది. వీటిలోనూ మీదైన స్టైల్ కనిపించాలంటే బ్లౌజ్లో ఓ చిన్న మార్పు తీసుకువచ్చి లుక్‌లో సెలబ్రిటీ స్టైల్ తీసుకురావచ్చు. సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా, సింగిల్ స్లీవ్ బ్లౌజ్‌కే ఒన్ సైడ్ దుపట్టా జత చేయడం ఈ స్టైల్ ప్రత్యేకత. నిర్వహణ: ఎన్.ఆర్. -
షాపింగ్‌లో అభిరుచి... అవసరం..?
సెల్ఫ్ చెక్ షాపింగ్ చేయడం ఒక కళ. ఏం కొంటున్నాం, ఎలాంటివి కొంటున్నామన్న విషయంలో స్పష్టంగా ఉండాలి. అయితే ఒక్కోసారి ముఖ్యంగా డ్రస్ విషయంలో మనకు తెలియకుండానే మార్కెట్ మాయాజాలంలోకి జారిపోతుంటాం. మన అవసరానికి అభిరుచిని జోడించి షాపింగ్ చేస్తున్నామా? ఒకసారి చెక్ చేసుకుందాం. 1. షాపింగ్ చేసేటప్పుడు డ్రస్ నచ్చితే ఇక ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోరు. ఎ. కాదు బి. అవును 2. షాపింగ్‌లో భావోద్వేగాలకు లోనవుతుంటారని మీకు తెలుసు, కాని ఆ బలహీనత నుంచి బయటపడలేకున్నారు. ఎ. కాదు బి. అవును 3. రకరకాల మోడల్స్‌లో ఖరీదైన దుస్తులు ఎన్ని ఉన్నా మీ బడ్జెట్‌ను, మీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎ. అవును బి. కాదు 4. మీకు ఎటువంటి మోడల్స్æ, ఏ ఏ కలర్ నప్పుతాయో బాగా తెలుసు, కాబట్టి ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. డ్రస్ మీకు నప్పడం కంటే నచ్చడమే ముఖ్యం అనుకుంటారు. కాబట్టి వాటిని వేసుకున్నాక ఎవరైనా నప్పలేదంటే బాధపడరు. నాకు నచ్చినది నేను వేసుకుంటున్నానని తృప్తిగా ఫీలవుతారు. ఎ. అవును బి. కాదు 6. కొనాలన్న ఆలోచన లేకున్నప్పటికీ షోరూముల కెళ్లి రకరకాల డ్రస్‌లను ట్రయల్ వేసుకోవడం మీకు సరదా. ఎ. కాదు బి. అవును 7. దుస్తులు కొనేటప్పుడు ఫ్యాషన్‌తోపాటు మన్నికను కూడా ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 8. మూడ్ బాగున్నప్పుడు మాత్రమే షాపింగ్ చేయాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. ఒక గంట లేక అరగంట అని నిర్ణీత సమయంలోనే హడావుడిగా కొంటే చక్కటి సెలెక్షన్‌కు అవకాశం ఉండదని తెలుసు. ప్రశాంతంగా సమయం కేటాయించగలిగినప్పుడే వెళతారు. ఎ. అవును బి. కాదు 10. షాపింగ్కెళ్లేటప్పుడు మనం వేసుకున్న డ్రస్ కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి నీట్‌గా వెళతారు. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఏడు అంతకంటే ఎక్కువగా వస్తే మీ అవసరానికి అభిరుచిని మేళవించి కొనుగోలు చేయడంలో పరిణతి చెందారనవచ్చు. ‘బి’లు ఎక్కువగా వస్తే షాపింగ్‌లో మీరు అనుసరిస్తున్న మెళకువలకు మరికొన్ని జోడిస్తే ఇంకా బాగుంటుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్లు అనిపిస్తే, ఒకటి, రెండు ప్రశ్నల ప్రభావం మీమీద ఎక్కువగా ఉంటే అనవసరమైన వాటిని కొనకుండా మిమ్మల్ని ఆపగలిగే వాళ్లను తోడు తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. -
పిజ్జ పిజ్జాగా నచ్చుతాయి
ఫ్యాషన్ ఫ్యూజన్ ప్రపంచ ఫ్యాషన్ పరిచయం పిజ్జా పుట్టిన చోట పుట్టిన స్టయిల్ ఇది. పిజ్జాని ఇష్టంగా ఓ పట్టు పట్టినట్టే అర్మానీని ఒక చుట్టు చుట్టాలి. ప్రపంచానికి ఇటాలియన్ డ్రెస్ కావరాన్ని క్రియేటివ్‌గా కట్టి చూపిన జార్జియో అర్మానీ స్టైల్ మనమూ ఓ చుట్టు చుడితే .. ఓ కట్టు కడితే..! పిజ్జ పిజ్జాగా నచ్చుద్ది. ఒకప్పుడు మగవారి డ్రెస్సుల్లో ఉండే స్ట్రెయిట్ కట్ మగువల డ్రెస్ డిజైన్స్కీ మార్చి ‘ఔరా!’ అనిపించాడు. ఫ్యాషన్ ప్రపంచం అబ్బురపడేలా అతివల దుస్తులను అందంగా రూపుకట్టాడు. ‘ఎవరే అతగాడు..’ అంటూ ఫ్యాషన్ ప్రియులు పాటలు పాడుకునే అతని పేరు జార్జియో అర్మానీ! ‘క్లాత్ ఒంటికి చుట్టుకున్నట్టు కాదు ప్రేమగా హత్తుకున్నట్టు’ ఉండాలి అంటాడు ఈ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్. డ్రెస్ డిజైన్స్‌లో భారతీయత మగవారి దుస్తులలో టాప్ అనిపించుకున్న అర్మానీ పదిహేనేళ్ల క్రితం మహిళల దుస్తులనూ తన లేబుల్ ద్వారా పరిచయం చేశాడు. మగవారి దుస్తుల్లోని స్ట్రెయిట్ కట్ స్టైల్ ఆడవారి దుస్తుల్లోనూ చూపించాడు. అప్పటి వరకు ఒక సాదా సీదా డిజైన్స్ ఉండే మహిళల ఫ్యాషన్ ప్రపంచంలోకి అర్మానీ తనదైన మార్క్ తో అలా ‘స్ట్రెయిట్’గా దూసుకొచ్చాడు. ప్యారిస్ ఫ్యాషన్ వేదికలపై మహిళల డ్రెస్ డిజైన్స్‌తో పాటు ఇతర అలంకరణ వస్తువులనూ ప్రదర్శించాడు. ఇతని డిజైన్స్‌లో లాంగ్ అండ్ షార్ట్ గౌన్స్, బిజినెస్ సూట్స్ ప్రముఖమైనవి. వాటిలో కలర్ కాంబినేషన్స్, కట్స్ అతివలకు అమితంగా నచ్చేశాయి. అర్మానీ కలెక్షన్స్‌లో ఉండే నిండుదనం, కళ భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండటంతో మనవారినీ ఆకట్టుకున్నాయి. దీంతో మన దేశ డిజైనర్లు సైతం అర్మానీ మార్క్‌ని తమ డిజైన్స్‌లో చూపిస్తున్నారు. జీన్స్‌కి కేరాఫ్ అడ్రస్ యువతరం ధరించే డెనిమ్స్‌తో ఎన్నో ప్రయోగాలు చేశాడు అర్మానీ. నాణ్యత, సరైన ఫిట్‌తో శరీరానికి పొందికగా అమరే కట్స్ వీటిలో ఉండటంతో జీన్స్ అంటే అర్మానీయే అనేలా ఈ లేబుల్‌కి పేరొచ్చింది. అంతేకాదు స్పోర్ట్స్‌వేర్ రూపకల్పనలో అర్మానీ ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాడు. సూట్ ది బెస్ట్! వరల్డ్‌లో ఇటాలియన్ మెన్స్ సూట్ ఫేమస్. అందులో అర్మానీ సూట్ ఓ ఐకాన్. ఈ సూట్స్‌లో సీరియస్ లుక్ అనిపించే హెవీ ప్యాడింగ్, మృదువైన ఫ్యాబ్రిక్, ఫ్లోయింగ్ సిలౌట్స్ ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకునే మహిళల బిజినెస్సూట్స్ తయారుచేశాడు అర్మానీ. మహిళల హుందాతనానికి ఈ సూట్స్ కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. లాంగ్ గౌన్స్ అండ్ బ్లేజర్స్ క్లాసిక్ బిజినెస్ వేర్, పెన్సిల్ కట్స్కర్ట్స్, ప్యాంట్స్, లాంగ్ బ్లేజర్స్, షార్ట్ జాకెట్స్, వెస్ట్స్, అసెమెట్రికల్ స్టైల్స్ నేటి మహిళలను మహారాణులుగా చూపుతున్నాయి. ►లాంగ్ లెహంగా మీదకు పెప్లమ్ బ్లౌజ్‌తో ఓ రిచ్ లుక్‌ని చూపించవచ్చు. దీనికి ఎంచుకునే రంగు క్లాత్ ప్రధానమైనది. పెప్లమ్ బ్లౌజ్‌కి పెద్ద బకల్తో రూపొందించిన బెల్ట్, నెక్లైన్ వద్ద చేసిన ఎంబ్రాయిడరీ, త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ సింపుల్ టెక్నిక్స్‌తోనే సూపర్ అనిపించే మార్కులు కొట్టేయడం అర్మానీ ప్రత్యేకత. ► అర్మానీ లాంగ్ కోటు డ్రెస్లాగే ధరించవచ్చు. కోటు అంటే వదులుగా టాప్ టు బాటమ్ కప్పేసే విధంగా కాకుండా శరీరానికి సరైన ఫిట్‌తో ఉండి అకట్టుకునేవి. ► నేటి తరం అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో తప్పనిసరి డ్రెస్‌గా ఉండిపోయిన లాంగ్ ఫ్రాక్ అర్మానీ సృష్టి. ► సిగరెట్ ప్యాంట్, లాంగ్ స్లీవ్స్ టాప్.. క్యాజువల్ డ్రెస్సింగ్కీ ఓ స్టైల్ ఉందని చూపడం అర్మానీ ప్రత్యేకత. వీటిలో కలర్ కాంబినేష న్స్ది ముఖ్య పాత్ర. ►మగవారి దుస్తుల్లో మేటి అయిన అర్మానీ అదే స్టైల్ కట్‌తో అతివల డిజైనరీ దుస్తులు ఇలాంటివెన్నో సృష్టించాడు. ► ఒకే తరహా ప్రింట్లు ఉండే రెండు రంగుల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి షార్ట్ స్లీవ్‌లెస్ ఫ్రాక్. క్యాజువల్ వేర్‌లోనూ భిన్నమైన స్టైల్! ► ఫ్యాషన్ వరల్డ్‌లో రంగుల ఎంపిక అవగాహన తప్పనిసరి. సాదా సీదా రంగుల కాంబినేషన్ తోనే కట్టిపడేసే డిజైన్స్ సృష్టించవచ్చు. కాలాలకు అతీతం ఎనిమిది పదుల వయసు దాటిన జార్జియో అర్మానీ కలెక్షన్ టైమ్‌లెస్ ఫ్యాషన్‌గా పేరొందాయి. ఛాయాచిత్ర కళ, నాణ్యమైన ఫ్యాబ్రిక్, మోనోక్రోమ్ కలర్స్ అర్మానీ డిజైన్స్‌లో కనిపించే స్టైలిస్టిక్ ఫీచర్స్. ప్రపంచంలోని టాప్ టెన్ డిజైనర్స్ జాబితాలో ఉన్న అర్మానీ ఫ్యాషన్ లేబుల్స్ అత్యంత విలాసంగా ఉంటాయి. ఎన్నో హాలీవుడ్ సినిమాలలో అర్మానీ డిజైన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పటికీ ఫిల్మ్ ప్రీమియర్ షోలు, పెద్ద పెద్ద ఈవెంట్లలో తారలు ధరించే అర్మానీ గ్లామరస్ డ్రెస్సులే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మోనోక్రోమ్ కలర్స్! ఒక రంగుతో ఎన్నో రంగులు సృష్టించి వాటిని క్లాత్మీదకు తీసుకువస్తే అర్మానీ మార్క్ డ్రెస్సులుగా రూపొందుతాయి. అవి బ్లేజర్స్ అయినా క్యాజువల్ టాప్స్ అయినా! – ఎన్.ఆర్ -
హ్యాండ్ బ్లూమ్
నేతలో ఒక్క పువ్వు కనపడదు కానీ, వస్త్రం అంతా వికసిస్తుంది. చేనేత అందమే అది. సృష్టినే ప్రతిబింబిస్తుంది. మన పిల్లలు చేనేతలు వేసుకుంటే మన సంస్కృతి అద్దమైపోతుంది. పువ్వులా వికసించే హ్యాండ్లూమ్ని హ్యాండ్బ్లూమ్ అనక తప్పదు. చేనేతకారుడి చేతిలో వికసించిన చమత్కారమే హ్యాండ్లూమ్! వేసవి వేడుకలలో అకర్షణీయంగా కనిపించాలంటే చేనేత దుస్తులు సరైన ఎంపిక. కాటన్ లేదా టస్సర్ క్లాత్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేసి లెహంగాని రూపొందించాలి. దుపట్టాగా కూడా హ్యాండ్లూమ్ మెటీరి యల్ నే ఉపయోగించాలి. దీనిపైన పువ్వులు, లతలతో అందమైన ఎంబ్రాయిడరీని తీర్చిదిద్దాలి. ⇒ చేనేత ఒంటికి హాయినిస్తుంది. ఇంపైన రంగులతో ఆకట్టుకుంటుంది. లేత గులాబీ రంగు లెహంగాకు బంతిపువ్వు రంగు అంచు ఆకర్షణీయంగా ఇమిడిపోయింది. లెహంగా డిజైన్ ప్లెయిన్‌గా రావడంతో పువ్వుల ఎంబ్రాయిడరీ చేసిన చైనీస్ కాలర్ నెక్ బ్లౌజ్ అందంగా రూపుకట్టింది. ⇒ లేత పసుపు రంగు హ్యాండ్లూమ్ మెటీరియల్ పైన స్వరోస్కి, జర్దోసి ఎంబ్రాయిడరీ మెరిపించడంతో ఈ లెహంగా చూపుతిప్పుకోనివ్వని అందాన్ని అద్దుకుంది. ⇒ పోచంపల్లి ఇక్కత్ చేనేతను ఈ లెహంగాకు ఉపయోగించడంతో ఆకర్షణీయత పెరిగింది. దీనికి అంచుగా స్వరోస్కి వర్క్ చేసిన పసుపు రంగు క్లాత్‌ను జత చేయడంతో లుక్ పూర్తిగా మారిపోయింది. అంచురంగు డిజైనర్ బ్లౌజ్ దీని మీదకు ధరిస్తే చాలు వేడుకలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ⇒ లేత సాదా రంగు లెహంగా పై ఎంబ్రాయిడరీ సొగసుగా కనిపిస్తోంది. దీనికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ కుచ్చుల అంచు జత చేసి, అదే రంగు దుపట్టా, డిజైనర్ బ్లౌజ్‌ను ధరించాలి. ⇒ ప్లెయిన్ లాంగ్ గౌన్‌కి ఐదు వరసలుగా కుచ్చులు, డిజైనర్ ఓవర్ కోట్ జత చేయడంతో డ్రెస్‌కి ఇండో వెస్ట్రన్ లుక్ వచ్చింది. ⇒ డిజైనర్ అంచును జత చేయడంతో ప్లెయిన్ లెహంగా రూపు ఆకర్షణీయంగా మారింది. దుపట్టా, డిజైనర్ బ్లౌజ్‌తో వేడుకలో హైలైట్‌గా నిలవచ్చు. రసాయనాలు లేని రంగులు... ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినప్పటికీ మొదట్లో బంధుమిత్రులకే డ్రెస్ డిజైనింగ్ చేసేదాన్ని. నాలుగేళ్ల క్రితం చేనేతకారులను కలిసినప్పుడు నా వర్క్ నుంచి వీరికి ఉపాధి కల్పించాలని ఆలోచించాను. అప్పుడే డిజైనింగ్‌ని వృత్తిగా ఎంచుకున్నాను. ఆదిలాబాద్‌లోని గిరిజనులు సేకరించే కొండపత్తిని కొనుగోలు చేసి, అక్కడి గ్రామాలలోనే చరఖాల మీద దారం తీయించి, చేనేత కారులచే క్లాత్‌ను నేయిస్తుంటాను. క్లాత్ తయారీలో రసాయనాలు లేని నేచురల్ కలర్స్‌ను మాత్రమే ఉపయోగిస్తుంటాను. ఈ హ్యాండ్లూమ్స్ని ఉపయోగించడం వల్ల ఎన్నో ఫ్యాషన్ వేదికల మీద నా డిజైన్స్ వెలిగిపోయాయి. కాలానుగుణమైన థీమ్, మన సంస్కృతి డ్రెస్ డిజైన్స్‌లో ఉపయోగించడం ప్రత్యేకతను చాటుతోంది. ఈ ఏడాది ముంబయ్‌లో జరిగిన స్ప్రింగ్ సమ్మర్ లాక్మే ఫ్యాషన్వీక్లో హ్యాండ్లూమ్తో చేసిన డిజైన్లు నన్ను ముందువరసలో నిలబెట్టాయి. – దివ్యారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.facebook.com/Divyareddydesigns -
బెస్ట్ ఈస్ట్‌వెస్ట్
ఇండో వెస్టర్న్ చమక్కులివి. ఈస్ట్ వెస్ట్ల బెస్ట్ కలబోత ఇది! ఫారిన్ కట్ ఇండియన్ కట్టు ఇది! ది బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్!! ► అనార్కలీ, లెహంగా కలసి లాంగ్ స్లీవ్స్ గౌన్‌గా రూపుకట్టిందీ డ్రెస్. దీనికి ఎంబ్రాయిడరీ డిజైన్ జత చేరడంతో రూపు మన సంప్రదాయానికి చిరునామా అయ్యింది. ► లాంగ్ గౌన్ మీద సంప్రదాయపు ఎంబ్రాయిడరీ కుట్టు పార్టీలలో హైలైట్‌గా నిలుపుతుంది. ► ఫ్లోరల్ ప్రింట్స్ లెహంగా షోల్డర్ లెస్ క్రాప్ టాప్ ధరిస్తే ఈ తూరుపును ఆ పశ్చిమాన్ని కలిపినట్టుగా ఉందీ పోజ్. ► ఎరుపు రంగు మీద చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా పూర్తి సంప్రదాయాన్ని కళ్లకు కడుతూనే స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్‌తో వెస్ట్రన్ లుక్ స్టైలిష్‌గా అదరగొడుతోంది. ► లెహంగాకు టాప్ బ్లౌజ్ విత్ చున్నీగా గౌన్ స్టైల్ ఇవ్వడంతో ఇండోవెస్ట్రన్కి కొత్త భాష్యం చెబుతోంది. ► స్లీవ్‌లెస్ డిజైనర్ మ్యాక్సీ గౌన్ ఇది. లెగ్గింగ్ విత్ లాంగ్ టాప్ అనిపించేలా మతులు పోగొడుతుంది. -
పార్టీ 2017
17లో 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడాలంటే! ఎన్నేళ్ళొచ్చినా 16 ఏళ్ళ అమ్మాయిలా పార్టీ చేసుకోవాలంటే... గెట్ రెడీ! గెట్ ఎ ప్రామ్! సింగిల్ పీస్ బ్యూటీలివి. పార్టీలను పరమళింప చేసే సూట్లు ఇవి. కమాన్.. లెటజ్ గో పార్టీ! ►ఎక్కడ ఉన్నా పార్టీకే ప్రత్యేకం అనిపించే బ్లాక్ కలర్ ప్రామ్ గౌన్. ► మత్స్య సుందరిని తలపిస్తున్న గ్రే కలర్ ప్రామ్ డ్రెస్. పార్టీకి ప్రత్యేక హంగులను అద్దుతుంది. ► కొత్త సంవత్సరాన పచ్చని పరవశాన్ని మోసుకొస్తుంది గ్రీన్ కలర్ ప్రామ్డ్రెస్. పొడవాటి గౌనులా ఉండే ప్రామ్ విదేశాలలో సాయంకాల బాల్రూమ్ డ్యాన్స్‌లకు తప్పనిసరి డ్రెస్‌గా ఉంటుంది. శరీరానికి అతుక్కుని ఉండే ఈ గౌన్‌ను ధరించడం వల్ల శరీరాకృతి అందంగా కనిపిస్తుంది. కట్టుకున్నవాళ్లు డ్రెస్ కట్ వల్ల మత్స్యసుందరిలా, యువరాణుల్లా, మహారాణుల్లా కనిపిస్తారు. ఎ–లైన్, కోణాకృతి శరీర ఆకృతి గలవారికీ బాగా నప్పే ఈ డ్రెస్ దాదాపు 16, 17 శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. 18వ శతాబ్దంలో ఫార్మల్ డ్రెస్‌గా, ఈవెనింగ్ బాల్ డ్యాన్స్ డ్రెస్‌గా పేరొందింది. 19వ శతాబ్దంలో పార్టీ డ్రెస్ అంటే ప్రామ్ డ్రెస్ తప్పక ఉండాల్సిందే అనే ముద్ర పడిపోయింది. పాశ్చాత్య వివాహవేడుకలలో తప్పక కనిపించే ఈ డ్రెస్ మన దగ్గర ఈవెనింగ్ పార్టీలో తళుక్కుమంటోంది. ► పువ్వులు, లతలు ప్రామ్ డ్రెస్ మీద కొత్త సింగారాలు అద్దుతుంటే వేడుకలో సిండ్రెల్లా అనిపించాల్సిందే! ► వంగపండు రంగు ప్రామ్డ్రెస్ ధరిస్తే యువరాణిలా మెరిసిపోకుండా ఉండలేరు. ► చీకటి వెలుగులకు కొత్త బాష్యాన్ని చెప్పే నలుపు–తెలుపు కాంబినేషన్ ప్రామ్ పార్టీలో హైలైట్. ► రాయల్ బ్లూ కలర్, ఒన్ షోల్డర్ ప్రామ్ డ్రెస్. పార్టీకి రాచరికపు సొబగులను మోసుకొస్తుంది. పార్టీలో డ్రెస్కే ప్రత్యేకత ►ఆభరణాలు, ఇతర అలంకారాలు అవసరమే లేదు. ► సింపుల్ మేకప్ పార్టీ వినోదానికి స్పెషల్ అట్రాక్షన్. ► హెయిర్ స్టైయిల్స్కు హైరానా వద్దు. లూజ్ హెయిర్ ప్రామ్ డ్రెస్‌కి సిసలైన స్టైల్. -
మీరు మరీ పొడుగా?
బ్యూటిప్స్ సాధారణంగా పొడవుగా ఉండాలని, పొడవు లేకున్నా వేసుకునే డ్రస్ ద్వారానైనా పొడవుగాకనిపించాలని కోరుకోవడం సహజం. కానీ ఎక్కువ పొడవుగా ఉండడమే కొందరికి సమస్య అవుతుంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటూ, నార్మల్‌గా కనిపించాలని ప్రయత్నిస్తుంటే ఇలా చేయండి... భుజాల నుంచి మోకాళ్ల వరకు ఉండే టాప్స్ వేస్తే మరీ పొడవుగా కనిపిస్తారు. చుడీదార్, సల్వార్ కమీజ్, జీన్స్ మీద టాప్... సింగిల్ కట్‌తో ఉన్నవి కాకుండా నడుము వరకు- నడుము నుంచి రెండు భాగాలుగా విడగొట్టినట్లుంటే బాగుంటాయి. సన్నగా, టైట్‌గా ఉండే బెల్టులను ధరించకూడదు. వెడల్పుగా ఉండి నడుమును వదులుగా చుట్టినట్లుండే మోడల్స్ బాగుంటాయి. వీలు అయినంత వరకు మిక్స్ అండ్ మ్యాచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అలా మ్యాచ్ చేసేటప్పుడు ఒకటి డార్క్ కలర్ ఉండే రెండవది తప్పని సరిగా లైట్ కలర్ ఉండేటట్లు చూడాలి. -
ఆ లేడీస్ డ్రెస్ చూసి అంతా షాక్!
లండన్: మహిళలు ధరించే ఒక రకం డ్రెస్.. లండన్ వాసులను కలవరపాటుకు గురిచేసింది. నగరంలోని పొప్లార్ అనే ప్రాంతంలో గల స్ట్రీట్ మార్కెట్ లో కొలువైన ఓ బట్టల షాపులో 9/11 ఉగ్రదాడులను సూచించే టాప్ ఒకటి పదర్శనకు ఉంచారు. మార్కెట్ సమీపంలో నివసించే 17ఏళ్ల బాలుడు ఆ టాప్ ను ఫొటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయిది. ఎక్కడెక్కడివాళ్లంతా ఆ వస్త్రదుకాణానికి వచ్చి టాప్ ను చూడటం మొదలుపెట్టారు. సమాచారం తెలుసుకున్న మీడియా అసలు విషయాన్ని వాకబుచేయగా..'అసలా టాప్ పైన ట్విన్ టవర్స్ కాలిపోతున్న బోమ్మ ఉన్నట్లు గుర్తించనేలేద'ని షాప్ యజమాని వాపోయాడు. హోల్ సేలర్ నుంచి తీసుకొచ్చిన దుస్తుల్నే అమ్ముతున్నానని చెప్పాడు. సదరు హోల్ సేలర్ తోపాటు దుస్తులు తయారుచేసిన కంపెనీని సంప్రదించగా.. అలాంటి(9/11) మోడల్ దుస్తులను తాము తయారుచేయలేదని, స్టాక్ లో ఎలా కలిసిపోయిందో తెలియదని సమాధానమిచ్చారు. చివరికి ఆ షాప్ ఓనరే ఈ టాప్ ను తగలబెట్టడంతో కథనం ముగిసింది. -
క్రీడలతో మానసికోల్లాసం
నాంపల్లి : క్రీడల వల్ల మానసీకోల్లాసం కలుగుతుందని నాంపల్లి జెడ్పీటీసీ శ్వేతారవీంధర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాజ్ చికెన్ సెంటర్ యజమాని క్రీడాకారులకు రూ.6వేలు విలువ కలిగిన దుస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడాలపై అసక్తి పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతాకాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో తాజ్ చికెన్ సెంటర్ యజమాని ఎండీ చోటుబాయి, నరేంధర్‌రావు, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, సంగెపు గణేశ్, యాదయ్య, భిక్షం, నాంపల్లి రమేష్, నరేష్, శంకర్, తదితరులున్నారు. -
ఖాదీ నాదీ
దేశం నాది జెండా నాది స్వేచ్ఛా నాది బాపూ ఇజం నాది నేసిన దేశభక్తి నాది నేతన్న క్షేమం నాది ఖాదీ నీదీ.. నాదీ... ► షార్ట్ ఖాదీ ఫ్రాక్‌లో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో నటి కాజల్ అగర్వాల్ ►పార్టీవేర్‌గా మది దోచుకుంటున్న ఖాదీ ఫ్లెయిర్ కాలర్‌నెక్ గౌన్ ధరించిన నటి రాశీ ఖన్నా ► సింగిల్ కలర్ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. స్టైలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్న నటి రకుల్ ప్రీత్‌సింగ్ ►ఆరెంజ్ కలర్ మ్యాక్సీ డ్రెస్‌కి డిజైనర్ ఖాదీ లాంగ్ ఓవర్‌కోట్ ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది. టు కలర్స్ స్పెషల్ డ్రెస్‌లో నటి రెజీనా! ► ఖాదీ ఫ్లోర్‌లెంగ్త్ అనార్కలీ ధరించి ట్రెడిషనల్ లుక్‌తో వెలిగిపో తున్న నటి లావణ్యా త్రిపాఠీ -
బై బై బాయ్స్!
అవకాశాల్లో... ఆసక్తిలో... ఎనర్జీలో... ఎచీవ్‌మెంట్‌లో.. అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేనప్పుడు వాళ్లు వేసుకునే డ్రెస్సుల్లో మాత్రం తేడా ఎందుకు?! డైనమిక్‌గా.. స్మార్ట్‌గా.. ముచ్చటగా అనిపిస్తున్నారు. ఒకప్పుడు బాయ్స్ జోన్ అయిన ఈ డ్రెస్సులు ఇప్పుడు అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు. బై బై.. బాయ్స్...!! క్యూట్ గర్ల్స్‌కి డిజైనర్ సూచనలు.. మగవారి వేషధారణలో తప్పనిసరి అయిన దుస్తులు ఇప్పుడు మగువల వార్డ్‌రోబ్‌లో ముందస్తుగా చేరుతున్నాయి. మరీ ముఖ్యంగా కూల్ క్రిస్ప్ షర్ట్స్, టైలర్డ్ బ్లేజర్స్, డెనిమ్స్, సిగరెట్ ప్యాంట్స్.. వంటి మెన్స్‌వేర్ ముందువరసలో ఉంటున్నాయి. మగవారి వస్త్రధారణలో ఎంత బాగున్నా స్త్రీ సహజత్వ మెరుగులు కనిపించేలా తయారైతేనే మరింత స్టైలిష్‌గానూ అందంగానూ కనిపిస్తారు. మగవారి డ్రెస్సింగ్ కదా! అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే స్ట్రీట్ స్టైల్ ట్రెండ్ జాబితాలో చేరిపోయింది. మీ హృదయానికి నచ్చిన డ్రెస్సింగే కాలానికి తగ్గట్టుగా ఉంటే అదే అతి పెద్ద ట్రెండ్‌గా మెరుస్తుంది. ఈ తరహా వస్త్రధారణలో ఉన్నప్పుడు సింపుల్‌గా అనిపించాలి. ఆభరణాలు, మేకప్ నప్పవు. క్యాజువల్ వేర్ కదా అని మరీ ఒంటికి అతుక్కుపోయేలాంటి దుస్తులు ధరించకూడదు. ఎబ్బెట్టుగా కనిపిస్తారు. -
నిన్నలా నువ్వులా!
అందరిలో ఫ్రాక్ ఉంటుంది చిన్నప్పుడు వేసుకున్న నాన్న కొనిపెట్టిన అమ్మ తొడిగించిన అన్నయ్య సవరించిన అందరూ మెచ్చిన ఫ్రాక్ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన మేనకోడలిని చూసిన మేనమామ ‘ఏంట్రా! నిన్ననే నిన్ను ఫ్రాక్‌లో చూసినట్టు అనిపిస్తుంది’ అన్నమాట అందరిళ్లలో వినపడేదే! బాల్యానికి సీతాకోక చిలుక రెక్కలలాంటివి ఫ్రాక్‌లు. ఫ్రాక్ వేసుకుంటే నిన్నలా ఉంటావు. నువ్వులా ఉంటావు. నవ్వుతూ ఉంటావు. చిన్నపిల్లలే కాదు టీనేజ్, యంగేజ్ అతివల డ్రెస్ జాబితాలోనూ ఎప్పుడూ వింటూ ఉండే పేరు ఫ్రాక్. ముచ్చటగా పురివిప్పిన నెమలిలా నయనానందం చేసే పొట్టి డ్రెస్‌నే ఫ్రాక్గా చెబుతుంటాం. లాంగ్గా ఉండే ఫ్రాక్‌ని గౌన్‌గా పలుకుతుంటారు. అలాగే చైల్డ్ డ్రెస్ లేదా లైట్ ఓవర్ డ్రెస్ అని కూడా అంటుంటారు. 16వ శతాబ్దిలో ఈ డ్రెస్ పుట్టినప్పటికీ దశల వారీగా అడుగులు వేస్తూ ఇంత దూరం ప్రయాణించడానికి చాలానే కష్టపడింది ఫ్రాక్. 20వ శతాబ్దం వరకు ఉమెన్స్ గౌన్ లేదా ఫ్రాక్ అనే పేరు స్థిరపడటానికి రకరకాల రూపాలు మార్చుకుంది. 16-17వ శతాబ్దిలో ఫుల్ లెంగ్త్‌తో.. లూజ్ ఔటర్ గార్మెంట్‌గా ఫార్మ్ వర్కర్స్కోసం బ్రిటన్ లో పుట్టింది ఫ్రాక్. మందపాటి క్లాత్, పెద్ద కాలర్ నెక్‌తో భారంగా ఉండేది. దీనిని మగవారే వాడేవారు. 18వ శతాబ్దిలో బ్రిటన్, అమెరికాలో మెన్స్ కోసం అన్ఫిటెడ్ ఫ్రాక్స్ వచ్చాయి. 19వ శతాబ్ది నాటికి బ్రాడ్ కాలర్, వెయిస్ట్ పాకెట్స్.. వంటి అదనపు హంగులు చేరాయి. దీనిని ‘ఫ్రాక్ కోట్’గా పురుషులు ధరించేవారు. వీటి పొడవు మోకాళ్ల వరకు, ఇంకా కింది వరకు కూడా ఉండేవి. నావికులు, చేపలు పట్టేవాళ్లూ ఈ తరహా ఫ్రాక్ కోటును ఉపయోగించేవారు. 19 శతాబ్ది చివరలో 20 శతాబ్ది మొదట్లో సరైన ఫిటింగ్ అవసరం లేని, సౌకర్యంలో తిరుగులేని గార్మెంట్‌గా అతివల దుస్తులలో చేరింది. నాటి నుంచి ఎన్నో హంగులు దిద్దుకొని ఇలా అందంగా మగువల చేత మన్ననలు అందుకుంటూనే ఉంది. -
ఆమె డ్రెస్ చూసి మహిళలు దాడి చేశారు!
పొట్టి దుస్తులు ధరించి స్నేహితురాలి వివాహానికి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పెళ్లికి వచ్చిన కొందరు మహిళలు.. ఆమెపట్ల అమర్యాదగా ప్రవర్తించి దాడికి దిగారు. అయితే.. ఇందులో తన తప్పేం లేదని.. తాను ధరించిన దుస్తులు ప్రస్తుత సమాజంలో అందరు మహిళలు ధరించేవే అని ఆమె సోషల్ మీడియాలో తన గోడు వెల్లబోసుకుంది. ఫిట్నెస్ ట్రైనర్, న్యూట్రీషియన్ అయిన లిజ్ క్రూగర్.. తను హాజరైన పెళ్లి వేడుకలో మహిళల ప్రవర్తన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అక్కడ కొందరు తనపై బీర్ పోసి మరీ అమమానించారని పేర్కొంది. అయితే.. ఎవరైనా కొత్త మహిళలు తారసపడినప్పుడు అకారణంగా వారిని ద్వేషించకుండా మహిళలు ఒకరికొకరు సహకరించుకోవాలని చెబుతూ.. 'క్రూగర్ కైండ్‌నెస్' పేరుతో ప్రచారం నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో పలువురు మహిళలు క్రూగర్‌కు మద్దతుగా నిలిచారు. ఆమెపై జరిగిన దాడి అమానుషం అంటూ క్రూగర్ కైండ్‌నెస్ ప్రచారంలో గొంతుకలిపారు. -
అడ్రెస్ ఎక్కడ?
♦ ఇప్పటికీ అందని క్లాత్ ♦ స్కూళ్లు తెరిచి మూడువారాలవుతున్నా ఊసేలేని యూనిఫాం క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయే తప్పా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు రాలేదు. పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాం అందిస్తామన్న వారి మాటలు ఆచరణలో అమలయ్యింది లేదు. ఇంకేముంది ఇంతవరకు విద్యార్థుల యూనిఫాం అ‘డ్రస్’ లేకుండా పోయింది. నేతల మాటలు నీటి మూటలేనని మరోసారి రుజువైంది. యూనిఫాం కోసం జిల్లా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది. కడప ఎడ్యుకేషన్: పాఠశాలలు తెరిచి మూడు వారాలవుతున్నా జిల్లాలో ఇప్పటివరకు యూనిఫాం అ‘డ్రస్’ లేదు. అసలు యూనిఫామ్ క్లాతే జిల్లాకు రాలేదు. క్లాత్‌కు సంబంధించి ఒక్క రూపాయి నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో జిల్లాకు క్లాత్ ఎప్పుడోస్తుంది ..వచ్చిన క్లాత్‌ను కుట్టి ఎప్పుడు పాఠశాలలకు సరఫరా చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరోవైపు సకాలంలో యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందక కొంతమంది విద్యార్థులు పాఠశాలలకు దూర మవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. గతేడాదీ ఇదే పరిస్థితి.. 2015-16 సంవత్సర విద్యా సంవత్సరానికి సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది మార్చి నెల వరకు కూడా పాఠశాలలకు యూనిఫాంలు అందిస్తూనే ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో సంబంధిత యూనిఫాంలు విద్యార్థులకు అందించకుండానే పాఠశాలల్లో ఉంచుకున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన బట్టలు సరిపడక అలాగే వదిలేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి డబ్బులను విడుదల చేయలేదు. కానీ గుడ్డను కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మొండిచెయ్యి జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించడానికి ప్రభుత్వం విముఖత చూపుతోంది. గతేడాది జిల్లాలో 131 ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒకొక్కరికి 2 జతల చొప్పున 12,699 మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది యూనిఫాంలు కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉర్దూ పాఠశాలలకు అందని పాఠ్యపుస్తకాలు జిల్లా వ్యాప్తంగా 2016-17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పాఠశాలలకు 15.52.000 లక్షలు పుస్తకాలను కేటాయించింది. అయితే సంబంధిత పుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. కొన్ని చోట్ల సంబంధిత పుస్తకాలను విద్యార్థులకు ఇవ్వకుండా ఎమ్మార్సీల్లోనే ఉంచుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని పాఠ్యపుస్తకాలు అంద నట్లు తెలిసింది. ముఖ్యంగా ఉర్దూ పాఠశాలలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 20 వేల పుస్తకాలను ఇవ్వాల్సి ఉంది. -
స్కార్ఫ్ స్పార్క్!
డ్రెస్సుల మీదకు మెడలో ఆభరణంలా స్కార్ఫ్ వాడకం సాధారణమే. అయితే, ఆ స్కార్ఫ్ మరింత స్పార్క్‌గా ఆకట్టుకోవాలంటే.. మార్కెట్లో జల్లెడపట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న క్లాత్, టీ షర్ట్స్, పాత స్కార్ఫ్‌లను.. ఇలా కొత్తగా ముస్తాబు చేయవచ్చు. వాటిని మన ముస్తాబులో అందంగా చేర్చవచ్చు. న్యూలుక్ ఉడెన్, స్టీల్... బీడ్స్, పెద్ద పెద్ద లాకెట్స్‌ను స్కార్ఫ్‌కు గుచ్చి అందమైన కంఠాభరణంగా మార్చుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్కి లేస్ డిజైన్‌ను తీసుకొని, ఇలా జత చేస్తే డ్రెస్సుల మీదకు చూడచక్కని స్కార్ఫ్ సిద్ధం. పాత ఉలెన్ స్కార్ఫ్‌లు చాలా సాదా సీదాగా కనిపిస్తుంటాయి. వాటిని అందమైన డిజైన్‌గా ఇలా రూపొందిస్తే పువ్వుల స్కార్ఫ్ పిల్లల కోసం రెడీ. -
అపురూపాయల్
రంగులకు ప్రాణం పోస్తే... విహంగాలవుతాయి. హంగులకు ఫ్యాషన్ లుక్ ఇస్తే... లెహంగాలవుతాయి.ప్రింట్లను కట్ చేస్తే... ‘ఫుల్ లెంగ్త్’లు అవుతాయి. తారల్ని తీరుగా దిద్దితే... ట్రెడిషన్‌కి బొట్టూ కాటుక అవుతాయి. పాయల్ సింఘాల్ డిజైన్ చేస్తే అంతే మరి! డ్రెస్.. రాయల్‌గా ఉంటుంది. లాయల్‌గా ఉంటుంది.అపురూపంగానూ ఉంటుంది. ‘యువరాణీవారొస్తున్నారహో... తప్పుకోండి’ అంటుంది. పదిహేనేళ్లకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అవార్డులు సొంతం చేసుకుంది. పదిహేనేళ్లకే ర్యాంప్ షోలో ఐశ్వర్యారాయ్‌తో పాటు ప్రముఖ తారలను తన డిజైనరీ దుస్తుల ద్వారా మెరిపించింది. పదిహేనేళ్ల్ల తన సృజనాత్మక ప్రపంచంలో ఎన్నో కొత్త వాణిజ్యసముదాయాలను నెలకొల్పి మహిళా వ్యాపారవేత్తగానూ నిరూపించుకున్న ఆమే పాయల్ సింఘాల్. ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన పాయల్ ఆన్లైన్ స్టోర్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మూడు పదులు దాటిన పాయల్ ఈ రంగంలో ఎదగాలనుకునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘మిగతా డిజైనర్ల డిజైన్స్ నుంచి కొత్తదనం నేర్చుకోవడం వరకు మంచిదే. కానీ, ఈ రంగంలో ఎదగాలంటే తమను తామూ మెరుగు పెట్టుకొని, ఎప్పటికప్పుడు దుస్తులలో కొత్తదనం చూపించాల్సిందే’ అంటున్నారు. -
వెల్డన్ రాడ్రిక్స్
కట్లో ఒక షార్ప్‌నెస్ ఉంటుంది.. ఫ్లో లో ఒక స్మూత్‌నెస్ ఉంటుంది కలర్స్ లో గోవా చురుక్కు ఉంటుంది... అందుకే చాలా మంది డిజైనర్లు ఈ టాప్ డిజైనర్ వెండెల్ రాడ్రిక్స్ను వెల్డన్ రాడ్రిక్స్ అంటుంటారు.ఉల్లిపొరలా చూపులను కట్టిపడేసే షిపాన్ ఫ్యాబ్రిక్‌తో రమ్యమైన సొబగులు అద్దడంలో వెండెల్ ఎన్నో వండర్స్ సృష్టిస్తారు. రాణీ పింక్ కలర్ ట్యూనిక్ అల్ట్రామోడ్రన్కి ప్రతిరూపంలా ఉంది. రంగులతో మ్యాజిక్ చేయడం, ఫ్యాబ్రిక్స్‌తో ఫ్యాబులస్ డిజైన్స్ రూపొందించడం వెండెల్ ప్రత్యేకత. నీలం, కాఫీ, బంగారు రంగులు ఎంత స్టైలిష్‌గా కళ్లకు కడుతున్నాయో! నీలాకాశం జిలుగులు, ప్రకృతి పరవశాలకు ఫ్యాబ్రిక్ కాన్వాస్‌గా మారిపోయిందా అనిపించకమానదు ఇలాంటి డ్రెస్సులను చూస్తే! లాంగ్లోనే మనసును కొల్లగొట్టే ఇలాంటి లవింగ్ మ్యాక్సీ డ్రెస్సులు రాడ్రిక్స్ ఖాతాలో లెక్కకు మించి. తెలుపు, ఎరుపు, పింక్ డై కలర్స్ వాడిన ట్యునిక్స్ అతివల అందాన్ని స్టైలిష్‌గా రూపుకడతాయి. ఒకే కలర్.. చిన్న చిన్న తేడా.. గొప్ప అందం.. వెండెల్ డ్రెస్సుల సొంతం. లాంగ్ పలాజో స్కర్ట్, లాంగ్ స్లీవ్స్ ట్యూనిక్ ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి చిరునామాగా నిలుస్తాయి. సుతిమెత్తని ఫ్యాబ్రిక్.. పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు వెండెల్ ఆధునిక కలలకు సరికొత్త భాష్యం. లాంగ్ మ్యాక్సీ గౌన్‌లో బాలీవుడ్ నటి దీపికా పదుకునే! ప్లెయిన్ క్లాత్‌తో అబ్బురపరిచే డిజైన్లను ఎలా రూపొందించవచ్చో వెండెల్ ట్యునిక్స్ని చూసి తెలుసుకోవచ్చు. పసుపు రంగు వి-నెక్ ట్యునిక్ యూత్ స్టైల్‌కి సిసలైన అద్దం పడుతుంది.సృజనతో పాటు సహనం అవసరం - వెండెల్ రాడ్రిక్స్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ ఇండియన్ టాప్ టెన్ ఫ్యాషన్ డిజైనర్లలో మేటిగా పేరున్న వ్యక్తి వెండెల్ రాడ్రిక్స్. అంతర్జాతీయ వస్త్రనిపుణుడిగా ప్రముఖుల చేత ప్రశంసలు పొందిన వెండెల్ గోవాకు చెందిన వ్యక్తి. గోవా వాతావరణానికి తగ్గట్టు ఈ డిజైనర్ వస్త్ర నైపుణ్యంలోనూ అక్కడి స్పార్క్ కనపడుతుంది. వెండెల్ కృషిని అభినందిస్తూ 2014లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పర్యావరణ కార్యకర్తగానూ పనిచేస్తున్న వెండెల్ ఒక సామాజిక వాది కూడా! ‘ఫ్యాషన్ పరిశ్రమ చాలా సృజనాత్మకమైనది. ఇందులో ఎంతో మంది యువత తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే, ఇందులో డిజైనర్ వర్క్‌కి ఒక గుర్తింపు రావడం అనేది చాలా కష్టం. ఈ రంగంలో నిలదొక్కుకోవాలనుకునేవారికి సృజనతో పాటు సహనం ఉండాలి. పాజిటివ్ దృక్పథం ఉండాలి’ అంటారు డిజైనర్ వెండెల్ రాడ్రిక్స్. -
డిజైనర్ ష్రగ్!
ఎప్పుడూ ఒకే తరహా డ్రెస్సులు అంటే బోర్ కొడతాయి. ఉన్నవాటినే కొత్తగా తయారుచేసు కోవచ్చు. రెండు టీ షర్ట్లతో ఒక డిజైనర్ టాప్/ షగ్‌న్రు తయారీ తెలుసుకుందాం. ఒక ప్రింటెడ్ టీ షర్ట్, మరోటి ప్లెయిన్ టీ షర్ట్ లేదా ట్యునిక్ తీసుకోవాలి .స్లీవ్స్ లేని టీ షర్ట్ మీదకు షార్ట్ స్లీవ్స్ ఉన్న టాప్‌ని ఇలా సింపుల్‌గా షగ్న్రి తయారుచేసుకోవచ్చు. ముందు ఫ్యాబ్రిక్ మార్కర్ లేదా స్కెచ్ పెన్నుతో నెక్‌తో పాటు ముందుభాగాన్ని ఎంతమేరకు కట్ చేయాలో డ్రా చేసుకోవాలి. టీ షర్ట్ ముందు భాగంలో మెడ నుంచి కిందవరకు కట్ చేయాలి. మెడ నుంచి కిందవరకు దేనికది విడిభాగాలుగా మడిచి కుట్టాలి. మడిచి కుట్టిన దాంట్లో నుంచి కలర్ శాటిన్ రిబ్బన్‌ను తీయాలి. స్లీవ్‌లెస్ టాప్ వేసుకున్నాక దానికి ఓవర్ టాప్‌గా అమరిపోతుంది. ఓ సరికొత్త స్టైల్ షగ్ ్రమీ వార్డ్‌రోబ్‌లో చేరినట్టే. ఈ షగ్న్రి మిగతా టాప్స్మీదకు కూడా ధరించవచ్చు. -
ఇలాగైతే నప్పుతాయి...
బ్యూటిప్స్ రోజు వారీ వాడుకకు బూట్ కట్ జీన్స్ కాని స్లైట్ ఫ్లేర్ జీన్స్ కాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఏ తరహా శరీరతత్త్వానికైనా నప్పుతాయి. వీటిని ధరించడం వల్ల స్లిమ్‌గా కనిపించ వచ్చు. ఇవి వయసును దాచేస్తాయి. డ్రస్ నంబరు చూసుకుని కొనాలి ఒక కంపెనీ ఇచ్చే నంబర్ మరొక కంపెనీ నంబర్‌తో సరిపోలదు. ఒక్కొక్కరు ఒక్కోరకమైన నిబంధనల మేరకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్రయల్ వేర్ తప్పనిసరి. వెయిస్ట్తోపాటు ప్యాంటు పొడవు కూడా చూసుకోవాలి. కొన్ని మోడల్స్ పొడవు తక్కువగా ఉంటాయి. షూస్, శాండల్స్ మోడల్, వాటి అందం కనిపించడం కోసం పొడవు తక్కువగా ఉన్న వాటిని ఎంచుకుంటారు. ప్రతిసారీ డ్రస్‌కు మ్యాచింగ్ పాదరక్షలను వాడగలిగినప్పుడే ఇలాంటి వాటిని తీసుకోవాలి. సాధ్యం కానప్పుడు పాదరక్షలను కప్పేసే మోడల్‌ను ఎంచుకోవాలి. కాళ్లు పొట్టిగా ఉన్న వాళ్లు ఎంత అందమైన పాదరక్షలను వాడే అవకాశం ఉన్నా సరే పొడవు కాళ్లున్న పాంటులనే వాడాలి. పొడవుతో ప్యాంటులో కాళ్ల పొట్టిదనాన్ని దాచేయవచ్చు. అసలే పొట్టిగా ఉన్న కాళ్లకు పొట్టి కాళ్ల ప్యాంటు వేస్తే మరీ కురచగా కనిపిస్తారు. వైడ్ లెగ్ ప్యాంట్లు చక్కటి స్ట్రెయిట్ లైన్‌తో స్టైల్‌గా ఉంటాయి. ఒక మోస్తరు పొడవు నుంచి బాగా పొడవుగా ఉంటే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక వయసు రీత్యా చూస్తే ఇవి ధరించినప్పుడు ఉన్న దానికంటే కాస్త పెద్దగా కనిపిస్తారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు హుందాగా కనిపించడం కోసం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫీషియల్ మీటింగ్స్‌కు బాగుంటాయి. -
మహిళపై దౌర్జన్యం..ముగ్గురు అరెస్ట్!
పూనెః యువతిపై దాడికి దిగిన ఐదుగురు యువకుల్లో ఎట్టకేలకు పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తనపై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వారం రోజులుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించేందుకు, ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది రోజులక్రితం జరిగిన ఘటనలో పూనేకు చెందిన 22 ఏళ్ళ మహిళా అడ్వర్ టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారు. కారులో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమ కుటుంబాల్లోని మహిళలు, బాలికలు ఎవ్వరూ కురచ దుస్తులు వేసుకోకూడదని, పర పురుషులతో కలసి ప్రయాణించకూడదని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేసేందుకు వారం రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. అయితే ఏ ఒక్కరూ ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించని ముగ్గురు పోలీసులపై కూడ తాము చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ రష్మి సుక్లా తెలిపారు. మే 1వ తేదీన ఇద్దరు మగ కొలీగ్స్ తో కలసి కారులో వెడుతున్నబాధితురాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో మరో కారులో వెడుతున్న ఐదుగురు యువకులు ఆమెపై వేధింపులకు దిగారు. కారును చుట్టుముట్టి, తెరచి ఉన్న విండోనుంచి ఉమ్ము వేయడమే కాక, డోర్ తెరచి ఆమెను బలవంతంగా కారు నుంచి బయటకు లాగి, ఆమె అపార్ట్ మెంట్ కు ముందే తీవ్రంగా కొట్టి అక్కడినుంచి జారుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, సహాయంకోసం తన బంధువులకు, మిత్రులకు ఫోన్ చేస్తున్న ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. నీ ఇల్లు అడ్రస్ తెలిసిందని, తర్వాత నీ సంగతి చూస్కుంటామని, నువ్వు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని, తమకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అయితే ఇంత జరిగినా ఘటనలో ఎటువంటి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ దొరకక పోవడం విశేషం. -
పొడవాటి గౌన్లు.. హొయలొలికించిన భామలు
అమెరికాః ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. డిజైనర్లు విభిన్న రీతులను ప్రదర్శించడంలో తమ ప్రతిభను అత్యద్భుతంగా చాటుతున్నారు. ఇటీవల ప్రారంభమైన మెట్ గాలా ఫ్యాషన్ పెరేడ్ అందుకు తార్కాణంగా నిలిచింది. అందమైన పొడవాటి గౌన్లు ధరించి, ఎర్రతివాచీపై ఒయ్యారాలొలికించిన మోడల్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ కు మరోపేరైన మెట్ గాలా 2016 సంబరాలు అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు అనేకమంది హాజరయ్యారు. విలక్షణమైన డిజైన్లతో కూడిన విభిన్న దుస్తులు ధరించిన సెలబ్రిటీలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రతియేటా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ సంస్థకు నిధులు సేకరించేందుకు ఈ మెట్ గాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఫ్యాషన్ ప్రముఖ మోడల్స్ తో పాటు, నటీనటులు కూడ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారు. ఈసారి కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాలీవుడ్ తారలు ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఫ్యాషన్ పెరేడ్ లో పాల్గొన్న మోడల్స్... తమ దుస్తుల డిజైన్లలో ఒక్కోరు ఒక్కో ప్రత్యేకతను ప్రదర్శించారు. మినీలూయిస్ విట్టన్, మెటాలిక్ రబ్బరు గివెన్సీ గౌన్లు, అద్దకాలతో కూడిన లేజర్ కట్ యాక్రిలిక్స్, షిఫాన్ బుర్బెర్రీ దుస్తులతోపాటు... గొలుసులతో అల్లినట్లుగా కనిపించే చెయిన్ మెయిల్ బాల్మెయిన్ వంటి అనేక రకాల అదరగొట్టే డిజైన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్ పై హొయలొలికించారు. ఫ్యాషన్ షోలో తన ఫేరీ టేల్ దుస్తులతో విభిన్నతను చాటిన క్లారీ డేన్స్ ప్రత్యేకతగా నిలువగా, కెన్డాల్ జెన్నర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన దుస్తులతో విభిన్నంగా చూపారు. జిగి, జాయిన్ లు రోబో కాప్ లుక్ తో మెట్ గాలా బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. -
బటన్స్‌తో బెస్ట్ డిజైన్స్..
ఇంటికి - ఒంటికి ఒక్కోసారి డ్రెస్ పాడైపోతుంది. కానీ దాని బటన్స మాత్రం బాగానే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పడేయడానికి మనసొప్పదు. పడేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో... ఇలా రకరకాల వస్తువులు తయారు చేయవచ్చు. 1. ఒక బెలూన్‌కి సగం వరకూ గ్లూ రాసి, రంగురంగుల బటన్సని అతికించండి. తర్వాత చిన్న సూదితో బెలూన్‌కి రంధ్రం చేసి, గాలిని తీసేయండి. ఆపైన బెలూన్ని తీసేస్తే బటన్స ఇలా బుట్టలా అవుతాయి. 2. పాతబడిన చెప్పులు, బూట్లను తీసుకుని, గ్లూ రాసి చక్కని బటన్సని అతికిస్తే... పాతవే కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. 3. ఓ దళసరి అట్టను తీసుకుని, అంచుల పక్కనంతా జిగురు రాసి, బటన్సని అతి కించండి. దాని చుట్టూ ఫ్రేమ్ బిగిస్తే మంచి ఫొటో ఫ్రేమ్ రెడీ. 4. రంగురంగుల బటన్సను దారాలకు ఎక్కించి, కళ కోల్పోయిన చెక్కగూళ్ల చుట్టూ వేళ్లాడదీస్తే సూపర్‌బగా ఉంటుంది. 5. సన్నని వైరు తీసుకుని, దానికి బటన్స ఎక్కించి ముడివేయండి. ఓ రిబ్బన్ కట్టి ఎక్కడైనా వేళ్లాడదీస్తే ఎంతో బాగుంటుంది. 6. పాడైపోయిన పర్సుకి కూడా రంగురంగుల బటన్సను అతికించి కొత్త రూపం తేవొచ్చు. 7. ఓ పేపర్ మీద ఇలా చెట్టు ఆకారంలోనో, మరో ఆకారంలోనే బటన్సని అతికించి, ఫ్రేమ్ కట్టించి వేళ్లాడదీస్తే మీ గోడలకు కొత్త అందం వస్తుంది. -
బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!
లండన్: ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు తమ సృజనకు పదును పెట్టి కొత్త కోణాల్లో ట్రెండ్ సెట్ చేసేందుకు చూస్తుంటారు. అయితే లండన్ కు చెందిన ఆ కేక్ డిజైనర్ మాత్రం తన సృజనతో ఓ బ్యూటిఫుల్ వెడ్డింగ్ కేక్ డ్రెస్ ను రూపొందించి ఔరా అనిపించుకొంది. ఆ డిజైనర్ డ్రెస్ ను చూసి తరించడమే కాదు... కొరికి... రుచి కూడా చూడొచ్చన్నమాట..! లండన్ కు చెందిన కేక్ డిజైనర్ సిల్వియా ఎల్బా... కొత్త కోణంలో వెడ్డింగ్ డ్రెస్ ను రూపొందించింది. విభిన్న డిజైన్లను సృష్టించడంలో మేటిగా పేరొందిన డిజైనర్ ఈసారి కాస్త భిన్నంగా ఆలోచించింది. ఫన్ అండ్ ఫంకీ కేక్ స్థాపకుడు ఎట్టె మ్యానర్ తో పాటు కళాకారుడు లింకా రింక్ లతో కలిసి తన కలను సాకారం చేసుకుంది. సుమారు రెండు మీటర్ల పొడవు, 70 కేజీల బరువైన కేక్ తో 'ద వెడ్డిబుల్ డ్రెస్' పేరిట కొత్తరకం గౌనుకు రూపకల్పన చేసింది. ఎల్బా బృందం.. సృష్టించిన ఈ వినూత్న వెడ్డింగ్ డ్రెస్ రూపొందించేందుకు 300 గంటలు పట్టిందట. అంటే సుమారు పన్నెండు రోజులపాటు కష్టించి ఈ పెళ్ళి గౌనును తయారు చేసిన డిజైనర్లు... దీనికి 35 కేజీల ఫాండెంట్ ప్లస్ ను, వేఫర్ పేపర్ షీట్లతో తయారైన 15,000 రఫుల్స్ ను వినియోగించారట. అంతేకాక వెండిరంగు పూసలను అద్ది.. మిరుమిట్లు గొలిపే డిజైనర్ కేక్ డ్రెస్ ను రూపొందించారు. ఇంత కష్టపడి ఈ కేక్ ను ఏ పెళ్ళికూతురుకోసం రూపొందించారో అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే... ఈ వారాంతంలో లండన్ లో జరగబోయే కేక్ ఇంటర్నేషనల్ షోలో ప్రదర్శనకోసం డిజైనర్లు ఇలా ప్రత్యేక శైలిని ప్రయోగించారన్నమాట. -
దుపట్టాను మార్చేయవచ్చు...
న్యూలుక్ డ్రెస్ పాతబడినా వాటి తాలూకూ దుపట్టా మాత్రం కొత్తగానే ఉంటుంది. చూడముచ్చటైన డిజైన్స్, రంగులు, ఎంబ్రాయిడరీ హంగులుగా ఉంటాయి. ఇలాంటప్పుడు దుపట్టానే ఉపయుక్తంగా మార్చుకుంటే... రంగు రంగుల దుపట్టాలను ఎంపిక చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక కాటన్ దుపట్టా తీసుకొని దాని మీద కాంట్రాస్ట్ కలర్స్‌లో ఉన్న క్లాత్‌లు ఎంచుకొని నూలు దారంతో కుట్టేయాలి. కాంతావర్క్ డిజైన్లా కనిపించే ఈ తరహా దుపట్టాలలో భారతీయ కళ కనిపిస్తుంది. వీటిని మోడ్రన్ డ్రెస్సుల మీదకు ధరించవచ్చు. రెండు రంగుల దుపట్టాను ఎంచుకొని మ్యాక్సీ డ్రెస్‌గా తయారుచేసుకోవచ్చు.దుపట్టాను పలాజో స్కర్ట్‌గా రూపొందించుకోవచ్చు. దుపట్టా అంచు భాగంలో ప్రింట్లు ఉంటాయి. వాటిని ఎంచుకొని, బ్యాగ్‌లా రూపొందించుకోవచ్చు. -
ప్రపంచంలోనే అతి ప్రాచీన డ్రెస్ ఇదే..
ప్రపంచంలోనే అతి ప్రాచీన డ్రెస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈజిప్ట్‌లో లభించిన వస్త్రాన్ని రేడియో కార్భన్ డేటింగ్ పద్దతి ద్వారా 5500 ఏళ్ల కిందటికి చెందిందిగా తేల్చారు. తర్కాన్ డ్రెస్‌గా పిలిచే ఈ వస్త్రాన్ని ఈజిప్ట్ టాంబ్లో తొలుత కనుగొన్నారు. అనంతరం 1990లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ఉన్న ఈజిఫ్షియన్ ఆర్కియాలజీ పీటర్ మ్యూజియానికి తరలించారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ నిపుణులు కార్భన్ డేటింగ్ పద్దతులతో ఈ డ్రెస్ 5100 నుంచి 5500 సంవత్సరాల కిందటికి చెందిందిగా తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటి వరకు లభ్యమైన అతి ప్రాచీన నేసిన వస్త్రంగా తర్కాన్ డ్రెస్ నిలిచింది. వివిధ రకాల నారలతో తయారు చేసిన ఈ డ్రెస్ వీ(V) ఆకారంలో ఉన్న నెక్ ఉంది. స్లీవ్ దగ్గర మడతలు మడతలుగా ఉంది. పురాతన కాలంలోనే ఈజిప్ట్‌లో నివసించే సంపన్న వర్గాల వారు తమ వస్త్రాల కోసం ప్రత్యేకంగా పనివారు ఉండేవారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చరిత్రకారులు చెబుతున్నారు. -
రీనా నుంచి స్టైలిష్ దాకా!
ఆధునిక వనితల మనసెరిగిన డిజైనర్ ఎవరున్నారని వెతికితే ముందువరసలోఉంటారు రీనా దాకా! సౌకర్యంతో పాటు స్టైల్‌గా కనిపించే ఆమె డిజైనరీ డ్రెస్సులను చూస్తే ఆ మెరుపులను రీనా నుంచి మన ఇంటి దాకా తెచ్చుకోకుండా ఉండగలమా! శాఖలుగా విస్తరించిన చెట్టు కొమ్మల ప్రింట్లు గల బూడిదరంగు ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ఆధునిక యువతులను ఆకర్షించేలా వీటికి కొంత ఫన్ని కూడా జత కలపడం రీనా ప్రత్యేకత. క్రీమ్ కలర్ నెటెడ్ శారీ గౌన్‌కు చాకొలెట్ కలర్ పువ్వులు అమరితే పార్టీకి ఓ కొత్త కళ వచ్చేసినట్టే. చీరకట్టుకోవడంలో ఇబ్బందిపడే నేటి అమ్మాయిలకు శారీ గౌన్లలో ఎన్నో ఆధునిక మోడళ్లను ఫ్యాషన్‌కు ప్రపంచానికి పరిచయం చేశారు రీనా! ఫ్యాబ్రిక్ రంగులు, ప్రింట్లు ఎంచుకోవడంలో రీనా ఓ ప్రత్యేకత చూపిస్తారు. ఈ మ్యాక్సీ డ్రెస్సులు సౌకర్యవంతంగానే కాదు, మీదైన స్టైల్‌ని నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తాయి. పార్టీ లుక్ అనిపిస్తూనే క్యాజువల్‌గా ఉండే డ్రెస్సులను రూపొందించడంలో రీనా దాకాకు ప్రత్యేకమైన ఆసక్తి. ప్రింటెడ్ మిడ్ స్కర్ట్, లాంగ్ ఎంబ్రాయిడరీ జాకెట్ ఆకర్షణీయమైన కాంబినేషన్‌తో ఆకట్టుకుంటుంది.సిల్వర్ కలర్ నీ లెంగ్త్ వన్ షోల్డర్ డ్రెస్ ఇది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో కాంతిమంతమైన సిల్వర్ స్వీక్వెన్స్తో దీనిని రూపొందించారు. -
జీన్స్ మళ్లీ మళ్లీ కొత్తగా!
► అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం డెనిమ్. జీన్స్ పేరుతో ప్యాంట్లు, ఓవర్ కోట్స్ ఎన్నో మోడల్స్‌లో మన నట్టింటికి వచ్చాయి. కాలేజీలకు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిల తప్పనిసరి వస్త్ర జాబితాలో జీన్స్ ముందుంటుంది. అంతేకాదు మన్నికలోనూ జీన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్లలో ఫస్ట్‌న ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా వేసుకున్న జీన్స్ బోర్ కొట్టినా, లేక కొద్దిగా పాడైనా, ఔట్‌డేటెడ్ అయినా వాటిని తిరిగి ఉపయోగించుకునే సదుపాయమూ ఉంది. అదెలాగో ఈ వారం చూద్దాం.. ► ప్యాంట్‌ను రెండు భాగాలు చేసి యాప్రాన్గా తయారుచేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఛాతి భాగానికి వేడి తగలకుండా కిచెన్‌లో చాలా వరకు కాటన్ యాప్రాన్లను ధరిస్తుంటారు. వాటి బదులుగా జీన్స్‌ను ఇలా యాప్రాన్గా మార్చేసి వాడుకుంటే ఉపయోగాలు తెలుస్తాయి. ► నాలుగైదు రంగు జీన్స్ ప్యాంట్లు విప్పదీసి, డిజైన్‌గా మలచి కుడితే పొడవాటి కుచ్చుల గౌన్ సిద్ధం. ► పిల్లల ప్యాంట్లు కొన్నాళ్లయ్యాక పొట్టిగా అయిపోతాయి. అలాంటి వాటిని రెండింటిని తీసుకొని పిల్లలకు గౌన్ని తయారుచేయవచ్చు. ► జీన్స్‌తో హ్యాండ్ బ్యాగులు, దుస్తుల అలంకరణకు పువ్వులను తయారుచేసుకోవచ్చు. ప్రయత్నించడం మొదలుపెడితే ఇలాంటి ఎన్నో సృజనాత్మక ఆలోచనలు మీకూ రావచ్చు. వాడిన దుస్తులతో కొత్త తరహా డ్రెస్సులను రూపొందిస్తే వాటిని సాక్షి ఫ్యామిలీ చిరునామాకు ఫొటోలు తీసి పంపించండి. -
ఖద్దరుకే ఓటు
కొత్త డ్రెస్ కోడ్‌లో అభ్యర్థులు ఎన్నికలు వచ్చాయంటే నేతల డ్రెస్ కోడ్ మారిపోతుంది. ఖద్దరు ఒంటిమీద పడిందంటే ‘పెద్దరికం’ వచ్చినట్టు భావిస్తారు. తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ హుందాగా తయారై.. ఓటర్లను ఆక ట్టుకునేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తారు. అదే సందడి ఇప్పుడు నగరంలోని ఖద్దరు దుకాణాల వద్ద కనిపిస్తోంది. అదును చూసుకుని షాపుల యజమానులు ‘స్పెషల్’ అంటూ అమ్మకాల జోరు పెంచారు. రాజకీయాలకు.. ఖద్దరుకు విడదీయరాని అనుబంధం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఈ బంధం తరతరాలుగా కొనసాగుతోంది. అందుకే నాయకులు, నాయకులమని భావించేవారు.. నేతలు కావాలనుకునేవారు ఖద్దరుకే ఓటేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది. నిన్నటివరకు టీ షర్ట్స్, జీన్స్‌లో కన్పించినవారు డివిజన్ అభ్యర్థిగా ఖరారవడంతో నిమిషాల్లో డ్రెస్ మార్చేసి ఖాదీకి షిఫ్టవుతున్నారు. అడుగు బయటపెట్టగానే వారి వెంట తిరిగే చోటా నాయకులు, కార్యకర్తలు కూడా అభ్యర్థి రూట్లోనే ఖద్దరులో కనిపిస్తున్నారు. రోజంతా ఎండలో తిరిగినా ఈ దుస్తుల వల్ల ఇబ్బంది ఉండడం లేదని, ఎక్కువ మందిని కలిసేందుకు వీలవుతుందనేది నేతల అభిప్రాయం. ఖద్దరు టోపీలు, కండువాలకు సైతం డిమాండ్ బాగానే పెరిగింది. సీజన్లో లుక్ మారాల్సిందే.. ఎప్పుడూ టోర్న్ జీన్స్, టైట్ ఫిట్స్.. టీషర్ట్స్‌లో ఉండేవారు కూడా ఇప్పుడు ఖాదీకే ఓటేస్తున్నారు. ఇటీవల రాజకీయ నేతలు కొత్త ఫ్యాషన్‌కు షిఫ్ట్ అయ్యారు. సీనియర్ నేతలతో పాటు వారి వారసులు సైతం ఎన్నికలు రాగానే లుక్ మార్చేశారు. వీరు ఫ్యాషన్‌గా కనబడేందుకు ఖద్దరునే నచ్చిన డిజైన్‌లో కుట్టించుకుంటున్నారు. ఈ దుస్తుల్లో పొలిటికల్ స్టేటస్ వస్తుందనే భావనతో యంగ్ జనరేషన్ కూడా ఆ రూట్లోనే నడుస్తోంది. వారి అభిరుచుల మేరకు కొత్త డిజైన్లను షాపు యజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్నికలొస్తే పండగే.. హైదరాబాద్‌లో దాదాపు 150కి పైగా ఖద్దరు షాపులున్నాయి. వేసవిలో వ్యాపారం ఫుల్ జోష్‌గా సాగుతోంది. సీజన్లో రోజుకు సుమారు రూ. 50 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ముఖ్యమైన పండగలప్పుడు కొంత పర్వాలేదు. తర్వాత ఎన్నికలు వచ్చాయంటే నేతలు, వారి వెంట ఉండేవారు ఈ షాపుల వైపే చూస్తున్నారు. దీంతో సీజన్‌ను మించి వ్యాపారం సాగుతుంది. ఆ రకాలకే ఓటు.. పొందూరు (ఆంధ్రప్రదేశ్), సేలం, తిరువూర్ (తమిళనాడు), భాగల్పూర్ (బీహార్), మస్లిన్ (బెంగాల్) ఖద్దరుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని భాగ్యనగర్ ఖాదీ బండార్ యజమాని బొప్పన నర్సింహారావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తమ దుకాణం నుంచే పొందూరు పంచెలు కొనేవారని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, రాయపాటి సాంబశివరావు, నిర్మాత డి.సురేష్‌బాబు తమవద్దే ఖద్దరు కొంటారని చెప్పారు. ఈ దుస్తులు కట్టుకుని మండే ఎండలో తిరిగినా ఏ ఇబ్బందులు ఉండవని స్వరాజ్ ఖాదీ వీవర్స్ అధినేత కె. వెంకట్రావు తెలిపారు. యువతరంగం ‘ఓటె’త్తాలి ⇒ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. ⇒ఒక్క క్షణం ఆలోచిస్తే దేశ భవిష్యత్‌ను, ప్రజల మనుగడను నిర్ణయించేది. ⇒ఓటు ఉండటం కాదు.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ⇒ఐదేళ్లకోసారి మీకు దక్కే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సరైన నాయకుడ్ని ఎంచుకోండి. ⇒నగర భవితను మార్చేది మీ ఓటే. ఓటు వేయడం నిర్బంధ బాధ్యతని గుర్తుంచుకోండి. ⇒ప్రజాస్వామ్యంలో మీ గొంతు వినిపించేది ఈ ఓటే. ⇒అందరూ వినియోగించుకుంటేనే మంచి ప్రభుత్వానికి పట్టం కట్టగలరు. ⇒యువత కదలివస్తే నగర భవిత మారుతుంది. యువతరంగం ఓటు కోసం తరలిరావాలి. సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ -
లక్షణంగా.. లగ్జరీగా..
ఈ డ్రెస్‌ల ధరలు లక్షల్లో పలుకుతాయి. రోహిత్ బాల్ మ్యాజిక్ ఇది. కంటికి ఇంత ఇంపుగా ఒంటికి ఎంతో సొంపుగా ఉండటానికి అంత ధరపలకడానికి సృజనే కారణం. లక్షలు పోయలేకపోతేనేం... ఈ డిజైన్స్‌తో స్ఫూర్తిపొంది మన డిజైన్లు మనమే చేసుకొని లక్షణంగా వెలిగిపోవచ్చు. బంగారు, జరీ దారాలతో ఆప్లిక్ వర్క్ చేసిన హాఫ్‌వైట్ శారీపై పువ్వుల మోటిఫ్స్.. బంగారు వర్ణపు చారల అంచు... అదే రంగు బ్రొకేడ్ బ్లౌజ్‌కు గోల్డెన్ కాలర్ ఈ చీరను గ్రాండ్‌గా నిలిపాయి. ధర: రూ. 2,50,000/- పసుపు, గులాబీ కలగలిసిన నారింజ రంగు బ్రొకేడ్ లాంగ్ జాకెట్... దానికి మాండరిన్ కాలర్, ముందు భాగంలో బటన్ ప్లాకెట్. పొడవాటి చేతులు, వాటికి బటన్స్ కఫ్స్.. హాఫ్‌వైట్ ముడతల లెహంగా... బ్రొకేడ్ దుపట్టా ఈ డ్రెస్ ప్రత్యేకతలు. ధర రూ.94,990/- కట్‌దానా వర్క్ చేసిన పువ్వుల జాకెట్టు.. లెహంగా మీద గోల్డెన్ సీక్వెన్స్, కట్‌దానా ఎంబ్రాయిడరీ కాంబినేషన్.. మ్యాచింగ్ దుపట్టా ఈ లెహంగా సూట్ స్పెషల్. ధర. రూ. 2,49,990/- ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డిజైనర్ రోహిత్‌బాల్. యాభైనాలుగేళ్ల వయసులోనూ ఇరవై నాలుగు గంటలూ సృజనాత్మకతకు ప్రాముఖ్యం ఇచ్చే బాల్ కాశ్మీర్వాసి. మనదేశంలోని ప్రసిద్ధ డిజైనర్లలో ఒకరు. పాతికేళ్ల క్రితం న్యూఢిల్లీలో ఓ చిన్న స్టోర్‌తో ప్రారంభించి అనతి కాలంలోనే ప్యారిస్, న్యూయార్క్, లండన్, సింగపూర్ వంటి మహానగరాలలో తన సత్తా చాటుకున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ రోహిత్‌బాల్ స్టోర్స్ ఉన్నాయి. మహిళల, పురుషుల వస్త్రనైపుణ్యంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న బాల్ డిజైన్స్‌లో ఎక్కువగా నెమలి అలంకారాలు చూస్తాం. అలాగే వెల్వెట్, బ్రొకేడ్ ఫ్యాబ్రిక్స్, బంగారు జరీ అంచులను తన డిజైన్స్‌లో విరివిగా వాడతారు. హాఫ్‌వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌తో అబ్బురపరిచే డిజైన్లు సృష్టించడం బాల్ ప్రత్యేకత. భారతదేశ గొప్పదనాన్ని, రాచకళను తన డిజైన్స్‌లో చూపించడం మరో ప్రత్యేకత. న్యూఢిల్లీ ఫ్యాషన్ టెక్నాలజీలో పట్టా అందుకున్న బాల్ రూపొందించిన ఆభరణాలకు కూడా దేశ విదేశాలలోనూ మంచి పాప్యులారిటీ ఉంది. డిజైనర్‌గానే కాకుండా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు బాల్. రోహిత్ బాల్ మరిన్ని డ్రెస్ డిజైన్స్ కోసం http://www.rohitbal.com కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. -
సూపర్ డూపర్ దుపట్టా!
మ్యాచింగ్ అనుకొనో, ఖరీదనో, కలర్ఫుల్గా ఉందనో.. ఏదో ఒకటి అనుకుని హడావిడిగా వేసుకునేది కాదు దుపట్టా. దానికో స్టైల్ ఉంది. ఓ హంగామా ఉంది. ఓ గ్రేస్ ఉంది. అందుకే ఈ మధ్య తారలు సైతం వీటికో ప్రత్యేకతను కల్పిస్తున్నారు. కచ్‌వర్క్, ప్యాచ్ వర్క్, పుల్కారీ వర్క్, కలంకారీ, అద్దకం.. ఒకటీ రెండు కాదు దుపట్టాకు ఎన్ని హంగులో.. కాస్త దృష్టి పెడితే సొంతంగా ఎవరికి వారు తామే దుపట్టా డిజైనర్ అయిపోవచ్చు. ప్లెయిన్ ఓ ఆకర్షణ సిల్క్ వాటికన్నా హ్యాండ్లూమ్ దుపట్టాల ఎంపిక సరైనది. దీంట్లో మంగళగిరి, కలంకారీ, పోచంపల్లి... వంటి మన చేనేతల దుపట్టాలు ప్రత్యేక ఆకర్షణనే కాదు డ్రెస్‌కు హుందాతనాన్ని జత చేర్చుతాయి. అందుకని వార్డ్‌రోబ్‌లో కొన్ని మన దేశీయ చేనేతల దుపట్టాలను చేర్చితే సాధారణ డ్రెస్సులు ధరించినప్పుడు వాటి లుక్ అసాధారణంగా కనిపించడానికి వీటిని ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ హవా! కచ్, పుల్కారీ, గోటా, కాంతా, కశ్మీరీ, పార్శీ, జర్దోసి, మిర్రర్.. ఇలా మన దేశీయ హస్తకళలో పేరెన్నిక గన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎన్నో ఉన్నాయి. ఈ వర్క్‌లతో అందంగా రూపుకట్టిన దుపట్టాలలో కొన్నింటిని విడిగా ఎంపిక చేసి పెట్టుకోవాలి. ఒక ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు దాని మీదకు ప్రత్యేకమైన వర్క్‌తో ఆకట్టుకునే దుపట్టాను ధరిస్తే డ్రెస్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ట్రైబల్ కలర్స్ ముదురు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం... రంగు క్లాత్‌లను దుపట్టాలకు ఎంచుకుంటారు. వీటిని నలుచదరంగా కావల్సిన పరిమాణంలో కత్తిరించుకొని ఒక్కో రంగు క్లాత్‌ను వాడుతూ కుట్లు వేస్తారు. దీని మీద ఉదయ్‌పూర్, రాజస్థానీ, గుజరాతీ ప్రాంతాలో గిరిజనుల చేతి కట్లు, అల్లికలను పొందిగ్గా అమర్చుతారు. ఈ దుపట్టాలలో ఒక్కటైనా మీ దగ్గరుంటే లాంగ్ అనార్కలీ, షార్ట్ సల్వార్ కమీజ్‌ల మీదకు ధరిస్తే సంప్రదాయ, ఆధునిక కళ రెండూ ఉట్టిపడతాయి. ఈ కలర్స్, చేతిపనిలో ఉండే గ్రేస్‌ను పసిగట్టిన ప్రసిద్ధ డిజైనర్లు దుపట్టా డిజైనింగ్‌లో పోటీపడుతున్నారు. ప్యాచ్‌ల మెరుపు ఎంబ్రాయిడరీ పనితనం ఉన్నవీ, ప్లెయిన్‌వి, కలంకారీవి.. ఎన్నో ప్యాచ్‌లు విడిగానూ లభిస్తున్నాయి. ఒక డిజైనర్ దుపట్టాను కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువ అని భావించేవారు, తమకుతామే మరింత అద్భుతంగా డిజైన్ చేసుకోగలం అనుకున్నవారు ఈ ప్యాచ్‌లను ఎంపిక చేసుకుంటే చాలు. సాధారణ కుట్లతో ఎంచుకున్న దుపట్టా మీద ప్యాచ్‌లతో అందంగా డిజైన్ చేయవచ్చు. థీమ్ డిజైనింగ్‌పై దృష్టి నేను డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్లో లెహంగా దుపట్టాలది ప్రత్యేక ఆకర్షణ. వీటి ద్వారానే బాగా పేరొచ్చింది. మోడల్స్, స్టార్స్ సంప్రదాయంగానూ, ఆధునికంగానూ కనిపించడానికి దుపట్టాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాను. నాణ్యమైన జరీ, కుందన్స్‌ను వీటి డిజైనింగ్‌లో ఉపయోగిస్తాను. పూర్తి కళాత్మకంగా ఉండేలా థీమ్ డిజైనింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. మనీష మల్హోత్రా డిజైన్స్ అంటేనే ఒక క్లాసీ, స్టన్నింగ్ లుక్ టచ్ తప్పక ఉంటుంది. - మనీష్ మల్హోత్రా, ఫ్యాషన్ డిజైనర్ లేసులు, పూసలు ప్యాచ్‌ల తర్వాత దుపట్టా డిజైనింగ్‌లో చమ్కీ, లేసులు, పూసలు, అద్దాలది ప్రధానంగా ఉంటుంది. కొన్నింటిని దారంతో కుట్టవచ్చు. మరికొన్నింటిని ‘గ్లూ’తో అతికించవచ్చు. ఇది చాలా సులువైన ప్రక్రియ కూడా! లెహంగా దుపట్టా, సల్వార్ కమీజ్ దుపట్టా, అనార్కలీ దుపట్టా.. ఇవన్నీ సంప్రదాయ తరహాకు చెందినవైతే ఆధునిక వస్త్రధారణలోనూ ఈ డిజైనర్ దుపట్టాలను వాడచ్చు. మీదైన స్టైల్‌ని దుపట్టాతో మెరిపించవచ్చు. - ఎన్.ఆర్. -
నీ గౌను.. బంగారం గాను..
పాశ్చాత్య వెడ్డింగ్ గౌన్ల నుంచి వచ్చిన ఈ స్టైల్ నేటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్ గౌన్‌గా సెలబ్రిటీల మనసు దోచిన ఈ డ్రెస్ గ్లోబ్ మొత్తం దృష్టిని తనవైపునకు తిప్పుకుంటుంది. ఒకప్పుడైతే గౌను అంటే చిన్న పాపలకు స్పెషల్. అయితే ఇప్పుడు సిటీలో అమ్మాయిలకు అకేషన్ ఏదైనా కామన్ ఫ్యాషన్ గౌన్. అది బర్త్ డే కావచ్చు, మ్యారేజ్ డే లేదా రిసెప్షన్ కావచ్చు.. ఆఖరికి ఈవెనింగ్ పార్టీ అయినా కావచ్చు... ఏదైనా వెస్ట్రన్ రారాణిలా మెరిసిపోవడానికి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న డిజైనర్ డ్రెస్ గౌన్. కొన్ని విశేషాలు... కంఫర్టే ప్రధానంగా ఆలోచించేవారికి గౌన్ బెస్ట్. సింగిల్ పీస్ కాబట్టి గౌన్‌ను సులువుగా ధరించే సౌలభ్యం ఉంది.గౌన్ అంటే స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చేసినట్టే. తాము ఫ్యాషనబుల్ అని చెప్పేసినట్టే. దీంతో వస్త్రధారణలో భాగంగా మరే అలంకరణలూ అవసరం లేదు. క్యాజువల్‌గానూ, అకేషనల్లీ ఈ డ్రెస్‌ను ధరించవచ్చు.సాధారణంగా పల్చటి, మెత్తటి ప్లెయిన్ సిల్క్ లేదా షిఫాన్ మెటీరియల్‌తో పార్టీవేర్ గౌన్స్ను డిజైన్ చేస్తారు. నెట్టెడ్ కూడా వస్తున్నాయి. కానీ అవి పిల్లలకు తప్ప యువతులకు అంత సౌకర్యంగా అనిపించవు. ప్లెయిన్ మెటీరియల్‌తోనే కాదు అభిరుచిని బట్టి ఎంబ్రాయిడరీని, ప్రింట్లు డిజైన్లు గల ఫ్యాబ్రిక్‌ను కూడా ఈ డ్రెస్‌కు ఎంచుకోవచ్చు. బ్లౌజ్ పార్ట్ మంచి ఫిట్టింగ్తో ఉండాలి. నడుము భాగంలో ఏ మాత్రం వదులు లేకుండా సరైన కొలతలతో డిజైన్ చేయించుకోవాలి. -
ఆ 'డ్రస్' చూపులకు స్పందిస్తుంది
కాలిఫోర్నియా: అందమైన అమ్మాయిలు అలా వెళుతుంటే...కొంటె చూపులు చూసే కుర్రాళ్ల మనుసును దోచే మగువల అత్యాధునిక డ్రెస్ ఇది. అలా చూసే వారు మగవాళ్లా, ఆడవాళ్లా, వారి వయస్సెంతా ? అన్న అంశాలనే కాకుండా వారు ఈ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఎక్కడ చూస్తున్నారో, ఏ పార్ట్‌ను చూస్తున్నారో కూడా ఈ డ్రెస్ ఇట్టే కనిపెట్టేస్తుంది. ఆ చూపుకు అనుగుణంగా వెంటనే స్పందిస్తుంది. అలా స్పందించేందుకు ఈ డ్రెస్‌లో సంకోచ వ్యాకోచ గుణాలు ఉన్నాయి. చూపు పడిన చోట వ్యాకోచిస్తుంది. ఈ డ్రెస్‌ను ఓ ప్రత్యేక 3డీ ప్రింటర్ ద్వారా అమెరికాకు చెందిన బెహనాజ్ ఫరాహి అనే డిజైనర్ తయారు చేశారు. ఈ డ్రెస్‌ను చర్మం కన్న సున్నితమైన ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి తయారు చేసినట్టు దక్షిణ కాలిఫోర్నియాలో ఇంటరాక్షన్ డిజైనింగ్‌లో పీహెచ్డీ చేస్తున్న ఫరాహి తెలిపారు. దీనికి ‘కేరెస్ ఆఫ్ ది గేజ్’ అని నామకరణం కూడా చేశారు. చూపురుల చూపులను పసిగట్టేందుకు డ్రెస్‌లో ఓ రహస్య కెమేరాను అమర్చి దాన్ని మైక్రో కంట్రోలర్‌తో అనుసంధించారు. ధరించిన వారి చర్మం ప్రవర్తన బట్టి కూడా స్పందించి వారికి హాయినిచ్చే విధంగా కూడా డ్రెస్ ఉంటుందని, అందుకోసం అనుగుణమైన ఫ్యాబ్రిక్‌నే వాడామని ఫరాహి తన వెబ్సైట్లో వివరించారు. ఈ డ్రెస్‌లో ఉపయోగించిన టెక్నాలజీ మరీ కొత్తదేమీ కాదు. పరిసరాలను అనుగుణంగా స్పందించే డ్రెస్‌ను ఇంతకుముందు చైనీస్ ఫ్యాషన్ డిజైనర్ యిన్ గావో సృష్టించారు. చూపులకు స్పందించే గుణం, చూసేవారి వయస్సును కూడా కచ్చితంగా గుర్తించే గుణం తన డ్రెస్‌కు మాత్రమే ఉందని ఫరాహి చెబుతున్నారు. ఏ క్షణమైనా తాను ఇలాంటి డ్రెస్‌లను మార్కెట్లోకి విడుదల చేయవచ్చని చెప్పారు. ధర ఎంతుంటో మాత్రం వెల్లడించలేదు. -
క్లాస్ కట్.. మాస్ స్టిచ్
అనార్కలీ చాకొలెట్ బ్రౌన్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి పొడవాటి అనార్కలీ డ్రెస్ ఇది. హై నెక్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ చేయడంతో సంప్రదాయ కళ ఉట్టిపడుతోంది.ఫ్యాషన్‌షోలలో ఓ వెలుగు వెలిగి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రెడ్ బ్లూ కాంబినేషన్ స్టైల్... ట్రెడిషనల్ లవర్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకునే గ్రీన్, బ్రౌన్ కలర్‌ఫుల్ స్మైల్... సూపర్ కట్‌తో క్లాస్‌ని మెప్పించడమే కాదు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఇలాగే స్టిచ్ చేసి డూపర్‌గా మాస్‌లోనూ మెరిసిపోవచ్చు. ఫ్యాషన్ షోలో ఓ వెలుగు వెలిగిన కట్స్‌ని మీ కోసం తీసుకువచ్చాం... ట్రై చేయండి.. అదరహో అనిపించండి. ఇండో-వెస్ట్రన్.. టై అండ్ డై చేసిన చిలకపచ్చ జార్జెట్ ఇండో వెస్ట్రన్ లాంగ్ గౌన్. మిర్రర్ వర్క్ చేసిన రా సిల్క్ ఫ్లాప్‌ను ఛాతి భాగంలో జత చేశారు. రెడ్ బ్లూ కలెక్షన్... స్వచ్ఛమైన సిల్క్ క్లాత్ మీద కొల్కతా చేనేతకారులు బంగారు జరీతో మోటిఫ్స్‌ను రూపొందించారు. ఈ క్లాత్‌తో ఇండో వెస్ట్రన్ డ్రెస్ రూపొందించారు డిజైనర్. ఇటీవల కలంత ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ అవార్డ్ పొందిన ఈ కలెక్షన్, లాక్మే ఫ్యాషన్వీక్కూ ఎంపికైంది. పలాజో ప్యాంట్, స్లీవ్‌లెస్ బ్లౌజ్, అదనంగా జత చేసిన ఫ్లాప్.. నేటితరం అమ్మాయిల స్టైల్‌కు బాగా నప్పుతుంది. పూర్తిగా నీలం రంగు పట్టు క్లాత్‌తో డిజైన్ చేశారు. పలాజో ప్యాంట్‌కు నడుము భాగంలో పూర్తి కాంట్రాస్ట్ కలర్ ప్యాటర్న్‌ను జత చేస్తే న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. రెడ్ కలర్ స్టైల్ లాంగ్ జాకెట్టును చీరల మీదకూ ధరించవచ్చు. ఎంత ట్రెడిషనల్ చీర కట్టుకున్నా ఈ తరహా బ్లౌజ్ వల్ల లుక్ పూర్తి స్టైలిష్‌గా మారిపోతుంది. డ్రెస్ డిజైనింగ్‌లో మనసు పెట్టి చేస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. జార్జెట్, క్రేప్ మెటీరియల్స్ వెస్ట్రన్వేర్కి బాగా నప్పుతాయి. ఇండోవెస్ట్రన్ స్టైల్‌కి కూడా పట్టును చాలా బాగా చూపించవచ్చు. పట్టు, జార్జెట్ క్లాత్‌లతో ఈ డిజైన్స్‌ని రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ డిజైన్స్ కావాలంటే కాటన్, టస్సర్ వంటి మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవచ్చు. ఈ డిజైనర్ దుస్తులు ఇటు సంప్రదాయ, అటు పాశ్చాత్య వేడుకలకూ బాగా నప్పుతాయి. - ఆల్టియా కృష్ణ, ఫ్యాషన్ డిజైనర్, సుధర్మ బొటిక్, హైదరాబాద్ (డిజైన్స్‌కి సరైన సూచనలకోసం fashion A° MøsŒæ ^ólçÜ*¢ features.sakshi@gmail.comకు మెయిల్ చేయండి) -
లాంగ్ లవ్లీ
పాదాలు కనిపించీ కనిపించకుండా, నేలపై పారాడే డ్రెస్‌ను వేసుకున్నప్పుడు ఎక్కడలేని రాజసం వచ్చేస్తుంది. లాంగ్ కుర్తా ధరించినా అంతే! సంప్రదాయాన్ని, అత్యాధునికతను ఏక కాలంలో ఇష్టపడే మహిళలు వేరే ఆలోచన లేకుండా వీటిని ధరించవచ్చు. ఇటీవల సంప్రదాయ దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉంటోన్న డ్రెస్... లాంగ్ కుర్తా! నిన్నటి సల్వార్ కమీజ్‌కు కొత్త సొబగులు అద్ది, సంప్రదాయంగానూ, ఆధునికత ఉట్టిపడేలానూ లాంగ్ కుర్తాను తీర్చిదిద్దుతున్నారు నేటి ఫ్యాషన్ డిజైనర్లు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించే ప్యాటర్న్స్ సందర్భానికి తగ్గట్టుగా ఈ డ్రెస్‌లో ఒదిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు మనవాళ్లు నైటీలను ఇంటికీ లాంగ్ గౌనులను పాశ్చాత్య ప్రపంచానికి పరిమితం చేశారు. అయితే ఈ రెండింటి నుంచి వచ్చిన లాంగ్ కుర్తీలు... పాశ్చాత్య పార్టీలలోనే కాదు, మన సంప్రదాయపు వివాహ వేడుకల్లోనూ హైలైట్ కావచ్చు అని నిరూపిస్తున్నాయి. స్లిమ్‌గా చూపిస్తుంది లాంగ్ కుర్తా సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటు ఆధునికంగానూ కనిపించేలా చేస్తుంది. పొట్ట, నడుము కింది భాగం ఎక్కువగా ఉన్నా కూడా స్లిమ్‌గా చూపిస్తుంది. కుర్తా స్లీవ్స్ 3/4కు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఇందులో స్లీవ్‌లెస్, షార్ట్ స్లీవ్స్ కూడా నడుస్తున్నాయి. వీటిలోనే నెక్ ప్యాటర్న్స్ ఎన్నో భిన్న మోడళ్లలో లభిస్తున్నాయి. కుర్తీస్‌ను కాటన్, సిల్క్, షిఫాన్, జార్జెట్, నెట్.. ఇలా అన్ని రకాల మెటీరియల్స్‌తో తయారుచేసుకోవచ్చు. అయితే లావుగా ఉన్న వారు సిల్క్, మల్ మల్ వంటి ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవడం మేలు. యాంకిల్ లెంగ్త్, 3/4 లెంగ్త్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ట్రయల్ కట్, సి-కట్, అనార్కలీ స్టైల్, ఎ-లైన్ కుర్తీలు ఈ రోజుల్లో బాగా పాప్యులర్ జాబితాలో ఉన్నాయి. - షబ్నమ్ షిక్కా, ఫ్యాషన్ డిజైనర్, అడార్న్ ఫ్యాషన్ స్టూడియో అదనంగా ఎంబ్రాయిడరీ! ఎంబ్రాయిడరీతో హెవీ వర్క్ ఉన్న కుర్తీలు వేడుకలో ఇప్పుడు ప్రధాన ఆక ర్షణగా మారిపోతున్నాయి. అందుకని సాధారణంగా ఉండే పొడవాటి కుర్తాను ఎంచుకొని ఎంబ్రాయిడరీ, ప్రింట్లతో మెరిపించవచ్చు. సంప్రదాయ వేడుకలలో ఎంబ్రాయిడరీ చేసినవి, వృత్తిరీత్యా కార్యాలయాల్లో జరిగే వేడుకలకు ప్లెయిన్, ప్రింట్లు ఉన్నవి ధరించి మీదైన స్టైల్‌ని చూపించవచ్చు. మార్పులు చేర్పులు రోజూ ధరించే బోరింగ్ సల్వార్ కమీజ్లను కూడా కొద్దిపాటి మార్పులతో కాలిమడమల వరకు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో పెద్ద పెద్ద అంచులు, ఎంబ్రాయిడరీ పీసులు, లేసులు లభిస్తున్నాయి. వాటిని ఇప్పటికే ఉన్న కుర్తాకు జత చేసి, బాటమ్‌గా లెగ్గింగ్ వేసుకుంటే చాలు. ఆధునికం, సంప్రదాయ వేషధారణతో వేడుకలో ఇట్టే ఆకట్టుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి... లెగ్గింగ్, జెగ్గింగ్, పటియాలా, చుడీదార్.. వీటిలో తమ సౌకర్యాన్ని బట్టి లాంగ్ కుర్తీస్కు బాటమ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. దుపట్టా వేసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. అవసరాన్ని బట్టి స్టోల్, స్కార్ఫ్, దుపట్టాలనూ ఎంచుకోవచ్చు. -
పారేసుకోబోయి.. ఆరేసుకోవాలి
సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ఈ సూత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టీన్ ఎలిస్ బాగా ఒంటబట్టించుకుంది. చిరుగుల జీన్స్లనే ఎగబడి కొంటున్న నేపథ్యంలో పనికిరాని వస్తువులతో రూపొందించే దుస్తులకు ఇంకెంత గిరాకీ ఉంటుందో కదా అని ఆలోచించింది. అంతే.. పారేసే వస్తువులతో ఇలా రకరకాల దుస్తులను రూపొందించింది. కాగితాలు, మేగజైన్లు, చాక్లెట్ రేపర్లు, చివరకు పేకముక్కలతో కూడా పలు డిజైన్లు తయారుచేసింది. చెత్తతో తయారుచేసినా కొత్తగా ఉంటే వింతే కదా..! క్రిస్టీన్ డిజైన్లకు తెగ డిమాండ్ వచ్చేసింది. 500 డాలర్ల (దాదాపు రూ.30 వేలు) నుంచి 1500 డాలర్ల (దాదాపు రూ.90 వేలు) మధ్య వాటి ధరలు నిర్ధారించినా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ఆమె వ్యాపార సామ్రాజ్యం కూడా ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు విస్తరించింది. -
మెరిసిపోయిన మిషేల్ డ్రెస్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ డ్రెస్ జిగేల్మంది. నలుపు రంగు డ్రెస్‌పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్‌తో మిషెల్ మెరిసిపోయారు! మోకాళ్ల వరకున్న ఈ డ్రెస్‌పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్‌లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన బెనారస్‌లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు లక్షా 50 వేల రూపాయలు. బెనారస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకువచ్చారు.