బైక్ పై వెళ్తున్న యువతిని సరైన డ్రెస్ ధరించలేదంటూ ఓ వ్యక్తి దూషించాడు. ‘నువ్వు భారతదేశ పద్దతులు పాటించాలి. సరైన దుస్తులు ధరించాలి’ అంటూ యువతి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.