
ఇప్పుడు క్రేజీ నటీమణులుగా రాణిస్తున్న వారిలో చాలా మంది ఆదిలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నవాళ్లే. అలాంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె ఇప్పుడు పాన్ ఇండియా నటిగా రాణిస్తున్నారు.

ఈ బెంగాలీ బ్యూటీ ఇంతకు ముందు కొన్ని హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించినా పెద్దగా రాని గుర్తింపు ఒక్క సీతారామం అనే తెలుగు చిత్రంతో రావడం విశేషం. నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో రూపొందినా తమిళం, హిందీ భాషల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందింది.

ముఖ్యంగా నటి మృణాల్ ఠాకూర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో క్రేజీ నాయకిగా మారారు. కాగా ఇటీవల ఈ అమ్మడు మొదట్లో తన స్థితిగతుల గురించి ఇటీవల పేర్కొంటూ తాను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ రంగంలోని వచ్చిన నటినని చెప్పారు.

ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నానన్నారు. అందుకే డబ్బు విలువ తనకు బాగా తెలుసన్నారు.

తాను ఇప్పటికీ డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసిందే లేదన్నారు. ఖరీదైన దుస్తులను కొనడం వృథా ఖర్చు చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు.

ఖరీదైన దుస్తులు కొన్నా వాటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలుగుతామన్నారు. సినిమా కార్యక్రమాలకు, ఇతర పార్టీలకు, ఇంటర్వ్యూల కోసం తాను ఇప్పటికీ దుస్తులను అద్దెకే తీసుకుంటానని చెప్పారు.

ఇప్పుడు చాలామంది ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇకపోతే తాను సొంతంగా దుస్తులు కొనడానికి రూ. 2వేల కంటే ఎక్కువ ఖర్చు చేయనని నటి మృణాల్ ఠాకూర్ చెప్పారు.

మృణాల ధరించే దుస్తుల ధర తెలిసిన తర్వాత.. కోట్లు సంపాదిస్తున్న ఈమె ఇంత పిసినారినా అంటూ నెటిజన్లు సెటైర్లు కొడుతున్నారు




