Family Star Movie
-
ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీ స్టార్.. వారికి కూడా అందుబాటులోకి!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. గీత గోవిందం కాంబినేషన్ కావడంతో అభిమానులు భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే ఓటీటీలో విడుదలైన ఫ్యామిలీ స్టార్‌కు సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 26న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లో టాప్-5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మేకర్స్ మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.మొదట కేవలం తెలుగు, తమిళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్‌కు వస్తున్న ఆదరణను చూసి మరో రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. విజయ్ దేవరకొండకు సౌత్‌లో ఉన్న క్రేజ్‌తో కన్నడతో పాటు మలయాళంలోనూ ఫ్యామిలీ స్టార్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ప్రస్తుతం నాలుగు భాషల్లో ఫ్యామిలీ స్టార్ అలరిస్తోంది. -
టాలెంటెడ్ డైరెక్టర్‌తో దిల్ రాజు- విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈరోజు లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్ టాక్ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్మెంట్తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass EndeavourX A @storytellerkola's Vision 💥 Produced by Raju - Shirish ✨More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024 -
ట్రెండింగ్‌లో 'ఫ్యామిలీ స్టార్'.. అలాంటి రూమర్స్‌కు చెక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఇప్పటికే థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా రీసెంట్గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ జోడీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని తెలుపుతున్నారు. కథలో హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం అనే కాన్సెప్ట్ అందరూ ఆలోచించతగినట్లూ ఉందంటూ వారు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ఈ సినిమా పట్ల తప్పుగా ప్రచారం చేసినా కూడా విజయ్ క్రేజ్‌తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది. అమెజాన్ ప్రైమ్‌లో టాప్ వన్‌లో ఫ్యామిలీ స్టార్ చిత్రం దూసుకుపోతుంది. -
'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి అడ్డంగా బుక్కపోయాడు. పాపం ట్రోలర్స్ దెబ్బకు ఇంకో రౌండ్ బ్యాండ్ పడుతోంది. థియేటర్ రిలీజ్ టైంలో కేవలం మాటల వరకే పరిమితమవగా.. ఇప్పుడు స్క్రీన్ షాట్స్, వీడియోలు పోస్ట్ చేసి మరీ సినిమా పరువు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అయిపోతున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?ఉగాది కానుకగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ థియేటర్లలో రిలీజైంది. కుటుంబ నేపథ్య కథ కావడంతో ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది కదా అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజుకి సీన్ అర్థమైపోయింది. జనాలు పట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు మాత్రం తమ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయిందని అన్నారు. కానీ అందులో నిజమేంటనేది ఆయనకే తెలియాలి.ఎందుకంటే తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్' వచ్చేసింది. అయితే సినిమా చూసిన చాలామంది నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. అలానే విలన్ రవిబాబుకి వార్నింగ్ ఇచ్చే సీన్లో హీరో డైలాగ్స్ వరస్ట్‌గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఓటీటీ రిలీజ్ వల్ల దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి బలైపోతున్నాడు. What is this kalacondom 😶🏃#Familystar pic.twitter.com/qVN3vSJMDn— ..... (@DontDisturbu) April 26, 2024దోస వేసుకోటానికి లోభిస్తాం కాని సంవత్సరానికి 8 లక్షలు తాగుతాం 😎😎😎మొత్తం అంతాచూసాక టక్కున కథ చెప్పరా అంటే ఎవ్వడు చెప్పలేడు పరశురాంతో సహా అది #FamilyStar— Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) April 27, 2024Worst ra dei !!@TheDeverakonda parasuram#FamilyStar pic.twitter.com/hL6pg7jxPz— Frustrated Thamizhan (@FrustTamizhan) April 27, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన మూడు సినిమాలు.. ఎందులో చూడొచ్చంటే?
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలా సినిమాలు వచ్చేశాయి. కాకపోతే వాటిలో ఓ మూడు మాత్రమే జనాలకు కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండగా, హిందీ మూవీ కూడా ఒకటుంది. ఇప్పుడు అవన్నీ కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొందరు ఆల్రెడీ చూసేస్తుండగా, మరికొందరు ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు.. దీని సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి ఈ వీకెండ్ టిల్లు బెస్ట్ ఆప్షన్.విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. గత కొన్నేళ్ల సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరో.. కనీసం ఈ మూవీతో అయినా సక్సెస్ అందుకుంటాడనుకుంటే నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కోసమైతే ఈ వీకెండ్లో మూవీ చూడొచ్చు.ఆమిర్ ఖాన్ నిర్మాతగా, అతడి మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'లా పతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, తన భార్య మిస్ కావడంతో మరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇది కూడా మంచి కామెడీ చిత్రమే. ఈ వీకెండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్ కావాలంటే దీనిపైన కూడా ఓ లుక్కేసేయండి. -
రిలేషన్షిప్ కష్టం.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నా: మృణాల్
తెలుగు సినిమాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన ముంబయి బ్యూటీ మృణాల్ ఠాకుర్. 'సీతారామం'తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొనే విషయంలో ఆచితూచి వ్యహరిస్తున్న మృణాల్.. రిలేషన్, పిల్లలు కనడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయల్ని బయటపెట్టింది.'కెరీర్, జీవితం.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషన్షిప్ అంటే కష్టమనే విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం చాలా అవసరం. అలానే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.మృణాల్ చెప్పిన దానిబట్టి చూస్తే.. ఇప్పట్లో బాయ్ ఫ్రెండ్, పెళ్లి లాంటివి ఉండవనమాట. ఇక ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మనకు కొత్తేమో కానీ హీరోయిన్లకు ఈ మధ్య కాస్త కామన్ అయిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత నిల్వ చేసిన తమ అండాలతో పిల్లల్ని కనడాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చనే భయంతో ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దారిలోనే మృణాల్ కూడా వెళ్లబోతుందనమాట. -
సడన్‌గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. వచ్చిన తర్వాత చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరసగా మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క దానితో హిట్ కొట్టలేకపోతున్నాడు. 'ఖుషి' ఓ మాదిరి కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించింది. ఇది తప్పితే మిగతావన్నీ డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. దీంతో 'ఫ్యామిలీ స్టార్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ విషయంలోనూ నిరాశే ఎదురైంది.ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉగాది, రంజాన్ లాంటి హాలీడే వీకెండ్ దొరికినప్పటికీ.. 'ఫ్యామిలీ స్టార్' చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఊహించని విధంగా 20 రోజుల్లోనే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన 'ఫ్యామిలీ స్టార్'.. ఓటీటీలో ఇంకేం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ
ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఫ్యాన్స్‌లో రౌడీబాయ్‌గా ముద్రవేసుకున్న ఆయనకు ఎనలేని అభిమానులు ఉన్నారు. విజయ్ తన చుట్టూ ఉండే తన సిబ్బందిని కూడా కుటుంబసభ్యులుగా భావిస్తారని తెలిసిందే. విజయ్ పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు తనకు రక్షణగా బాడీ గార్డ్స్ ఉంటారు. ఎప్పుడూ విజయ్ కోసం వెన్నంటి ఉండే వారిలో ఒకరిది తాజాగా వివాహం జరిగింది. ఆ వేడుకలలో విజయ్ కూడా పాల్గొని సందడి చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా రవి అనే యువకుడి పెళ్లికి తన కుటుంబంతో సహా వెళ్లారు. గత కొన్నేళ్లుగా విజయ్ వద్ద ఆ యువకుడు వ్యక్తిగత బాడీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఆ వివాహానికి తన తల్లిదండ్రులతో సహా వెళ్లాడు. నూతన వధువరులను విజయ్ కుటుంబసభ్యులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో రవి కుటుంబ సాంప్రదాయం ప్రకారం హీరో విజయ్‌కి కత్తి బహుకరించి పెద్దలు సన్మానం చేశారు. దీంతో విజయ్ కూడా ఆ కత్తి పట్టుకొని ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.VD12 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. The #VijayDeverakonda and his family attended the wedding of his personal guard, #Ravi, and blessed the beautiful couple 💑✨️ pic.twitter.com/3YeyrGUkqs — S N R Talks (@SNR_Talks) April 23, 2024 -
కోట్లు సంపాదించే మృణాల్.. మరీ అంత చీప్ డ్రెస్సులు ధరిస్తుందా?
-
ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి) -
తెరపై చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో నిలిచిపోతుంది: మృణాల్ ఠాకూర్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ మృణాల్ ఠాకూర్ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. మృణాల్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు. ఆమెలా ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ... నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో కనిపించింది. ఓ కంపెనీకి సీఈవోగా అందరినీ మెప్పించింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
ఫ్యామిలీ స్టార్‌పై నెగెటివ్ ప్రచారం.. విజయ్ ఫిర్యాదుపై క్లారిటీ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్- విజయ్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంపై నెగెటివీటి కూడా పెద్దఎత్తున వైరలైంది. కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేయడంతో ఏకంగా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే స్వయంగా థియేటర్ల వద్దకు వెళ్లి ఆడియన్స్‌ను కలిసి రివ్యూలు తీసుకున్నారు. మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై సోషల్ మీడియా ఖాతాలపై విజయ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మాదాపూర్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఓ ఫోటో నెట్టింట వైరలవుతోంది. అయితే దీనిపై విజయ్ను ఆరా తీయగా.. అలాంటిదేం లేదని బదులిచ్చారు. ఆ ఫోటో కొవిడ్ టైంలో ఓ కార్యక్రమంలో తీసిందని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Checked with @TheDeverakonda. Fake report pic.twitter.com/AFTDe2pylv — Haricharan Pudipeddi (@pudiharicharan) April 10, 2024 -
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. థియేటర్లు ఫుల్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. ఉగాది, రంజాన్ పండుగలు వెంటవెంటనే రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇవాళ ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సుల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే దర్శమిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద రద్దీ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కాగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత స్వయంగా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ నుంచి రివ్యూ తీసుకున్నారు. నెగెటివ్ రివ్యూలపై ఆయన మండిపడ్డారు. ఇలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదని అన్నారు. -
రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ కొందరు కావాలనే విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి సినిమా బాగాలేదని విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ప్రతి కుటుంబంలో ఒకరు తన వారందరి కోసం కష్టపడుతూనే ఉంటారు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. ఇదే పాయింట్‌తో సినిమా ఉంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పారు. సినిమా విడుదలకు ముందు దిల్ రాజు ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రశాంత్ అనే యువకుడు వారి కుటుంబంలో 'ఫ్యామిలీ స్టార్'గా తన చెల్లెలు ఉన్నారని చెప్పాడు. వారి కుటుంబం కోసం దివ్యాంగురాలైన ఆమె పడిన కష్టాన్ని ఆ యువకుడు దిల్ రాజు ముందు చెప్పాడు. దీంతో దిల్ రాజు కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. సినిమా విడుదల తర్వాత తప్పకుండా మీ ఇంటికి వస్తాను.. ఆ రియల్ ఫ్యామిలీ స్టార్‌ను కలుస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌లోని సూరారంలో ఉన్న ఆ యువకుడి ఇంటికి దిల్ రాజు, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం వెళ్లారు. ఆ కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. కొంత సమయం పాటు ఆ కుటుంబ సభ్యులందరితో సరదాగ వారు గడిపారు. దివ్యాంగురాలైన ఆమె తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉన్నా చదువును పూర్తి చేసి ఉద్యోగం రాకపోతే కిరాణ షాపును నడపడం ఆపై ఎంతో కష్టపడి అమెజాన్‌లో ఉద్యోగం తెచ్చుకోవడం.. దాంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలను ఆ యువకుడు పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. Team of #TheFamilyStar meets and salutes a real life FAMILY STAR ✨ The movie is all about celebrating our dearest ones, our family stars ❤🔥 Book your tickets for the perfect 𝗦𝗨𝗠𝗠𝗘𝗥 𝗙𝗔𝗠𝗜𝗟𝗬 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗘𝗥 now! 🎟️ https://t.co/lBtal2uGnv@TheDeverakonda… pic.twitter.com/18wi88fPwf — Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2024 -
ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు.. ? విజయ్ మేనమామ కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ సోషల్‌మీడియాలో మరోవైపు నెగెటివ్ ప్రచారం చేయడంపై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మేము కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదని ఆయన కోరారు. ఇలాంటి పద్ధతి కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా నెగెటివ్ ప్రచారంపై ఇలా రియాక్ట్ అయ్యారు. 'ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు.మీ నెగటివ్ బ్యాచ్‌కు వాడంటే (విజయ్ దేవరకొండ) ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా.. ?' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni) -
'అలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై దిల్ రాజు స్పందించారు. మే కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి వస్తుందని దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దిల్ రాజు మాట్లాడూతూ..'ఈ సినిమాను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కొంతమంది కావాలని నెగెటివ్ వైబ్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ స్ప్రెడ్ చేయడం బాధాకరం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా రీచ్ అయింది. మేము మంచి సినిమానే తీశాం. మంచిగా తీయలేదంటే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. నేను కలిసిన వాళ్లు చాలామంది బయట ఎందుకు ఇంత నెగెటివ్ ఉంది? అని అడుగుతున్నారు. కొందరు కాల్ చేసిన సినిమా చాలా బాగుంది అంటున్నారు. మంచి సినిమానా? కాదా? అనేది మీరు థియేటర్‌కు వస్తే మీకే తెలుస్తుంది.' అని అన్నారు. నెగెటివ్ ప్రచారంపై మాట్లాడుతూ.. 'కేరళలో కోర్ట్ మొదటి మూడు రోజుల వరకు రివ్యూ ఇవ్వకుండా తీర్పు ఇచ్చారట. అలాంటిది మన దగ్గర వస్తే బాగుంటుంది. లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకడం కష్టం. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది నిర్మాతలే. ఎంతో కష్టపడి చేసే సినిమాను ఆడియన్స్ థియేటర్‌కు రాకుండా చేయడమనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరిగితే పోను పోను ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక సినిమాలు ఏం తీస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ పద్ధతి ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు' అని అన్నారు. -
విజయ్‌పై అక్కసుతోనే నెగెటివ్ ప్రచారం
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. సినిమా రిలీజ్ అవడానికి ముందే ఫ్యామిలీ స్టార్‌పై నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి ఆదివారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు పనిగట్టుకుని ఫ్యామిలీ స్టార్ సినిమా మీద దుష్ప్రచారం చేస్తూ ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారన్నారు. దీని వల్ల సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ద్వేషంతోనే.. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. చదవండి: తనకు భార్య, పిల్లలు ఉన్నారు.. అందరినీ ఎదిరించి నాతో పెళ్లి! -
నన్ను వాడుకుని వదిలేస్తే అట్టర్ ఫ్లాపే అవుతుంది: నటి
అన్నీ అనుకున్నట్లుగా జరగవు.. ఇది సినిమాకూ వర్తిస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్నో పాత్రలు రాసుకుంటారు, షూటింగ్ చేస్తారు. తీరా ఎడిటింగ్‌లో సగం కంటే ఎక్కువ పాత్రలు డిలీట్ చేస్తారు. మరికొన్నింటిని నిమిషాల నుంచి సెకన్లకు కుదిపేస్తారు. అలా ఇటీవలే డీజే టిల్లులో శ్రీసత్యకు అన్యాయం చేశారు. తనతో డైలాగులు చెప్పించి మరీ ఎడిటింగ్‌లో అదంతా తీసేయించారు. అందరి టైం వేస్ట్ ఇప్పుడు తనకూ అలాంటి అన్యాయమే జరిగిందంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆశా బోరా. నాలాంటిదాన్ని పిలిచి మరీ స్టఫ్‌లా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోతే ఇంకేం అవుతుంది.. సీన్లు, సాంగ్సు, ఫ్యామిలీ ఫంక్షన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ నేనే కనిపించానుగా.. అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేసింది. 'ఇంతోటిదానికి నా టైం వేస్ట్ చేసి, మీ టైం వేస్ట్ చేసుకున్నారు. ఈ పాత్ర నేనే చేయాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరి నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు అందరూ ఫోన్లు చేసి అనవసరంగా హంగామా చేశారు. ఆరోగ్యం బాలేకపోయినా.. ఉఫ్.. అయినా హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టులకు కరువొచ్చిందా? లేక సోషల్ మీడియా ఫేస్‌లను ఉపయోగించుకోవాలని చేశారో మరి! మా పనులు మానుకొని, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పిన మాట కోసం షూటింగ్‌కు వచ్చాను. యాంటి బయాటిక్స్ వేసుకుని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటే కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. డైలాగ్స్ ఉంచినా బాగుండేది ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా, ట్రావెలింగ్ ఖర్చులు చెల్లించకుండా, హోటల్లో బస చేసేందుకు డబ్బులివ్వకుండా, మాకేంటి సంబంధం అన్నట్లు సరిగా స్పందించనుకూడా లేదు. వాహ్.. గ్రేట్! కనీసం విజయ్ దేవరకొండతో నేను మాట్లాడిన సంభాషణలు ఉంచినా కాస్త సంతృప్తి ఉండేదేమో! మీ ఎడిటింగ్ అలా ఉంది. నా కళ్లు తెరిపించినందుకు థ్యాంక్స్. ఇలా ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అని ట్యాగ్ లైన్ ఇస్తారు.. ఇస్తారేంటి? ఇచ్చేశారు కూడా!' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ స్టార్ టీమ్‌పై విమర్శలు గుప్పించింది. View this post on Instagram A post shared by Asha Borra (@asha.borra) చదవండి: ‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ! -
‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇది. (చదవండి: ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ) ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారు. కింద ఇచ్చిన ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోంది Families are celebrating #TheFamilyStar in theatres ❤️🔥 The team will now celebrate the FAMILY STARS in real life ❤️ Fill the form below and tell us who your FAMILY STAR is. And get ready for a surprise visit by the team ✨ 📜 https://t.co/tvTkPpZev7 Book your tickets for the… pic.twitter.com/mCgiwHAKJw — Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2024 -
Family Star Review: ‘ ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ
టైటిల్: ఫ్యామిలీ స్టార్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్ నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్ ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: ఏప్రిల్ 5, 2024 కథేంటంటే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫ్యామిలీ అంటే అతనికి చాలా ఇష్టం. ఇద్దరు అన్నయ్యలు..వదినలు..వారి పిల్లలు..బామ్మ ఇదే తన ప్రపంచం. సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెద్దన్నయ్య మద్యానికి బానిసవడం.. చిన్నన్నయ్య బిజినెస్ అంటూ ఇంకా స్థిరపడకపోవడంతో ఫ్యామిలీ ఆర్థిక భారానంత గోవర్ధనే మోస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా.. వచ్చిన జీతంతోనే సింపుల్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్న గోవర్ధన్ లైఫ్‌లోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వచ్చేస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో కూడా పడిపోతారు. ఈ విషయం ఇరుకుటుంబాలలో చెప్పి, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తున్న సమయంలో ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి వస్తుంది. ఆ పుస్తకం చదివి..ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు గోవర్ధన్. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది? ఇందు ఎవరు? గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇందు రాసిన పుస్తకం వీరిద్దరి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? ఉన్నంతలో సర్దుకొని జీవించే గోవర్దన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఇందు, గోవర్దన్‌లు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్‌గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది. అలాంటి కాంబినేషన్లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్ చేసే పరశురామ్.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్ సరిపోలేదనిపిస్తుంది. కథ పరంగా ఈ సినిమా చాలా చిన్నది. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడు.. తన సొంతప్రయోజనాల కోసం అతనికి దగ్గరైన ఓ యువతి.. ఇద్దరి మధ్య ప్రేమ.. గొడవలు.. చివరికి కలుసుకోవడం.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథ ఇదే. అంచనాలు లేకుండా వస్తే..ఈ కథకి అందరు కనెక్ట్ అవుతారు. కానీ ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి.. ప్రేక్షకులు అంతకు మించి ఏదో ఆశిస్తారు. దాన్ని దర్శకుడు అందించలేకపోయాడు. భారీ అంచనాలు ఉన్న సినిమాకు కావాల్సిన సరకు, సంఘర్షణ రెండూ ఇందులో మిస్ అయ్యాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ లుంగి కట్టుకొని తిరగడం.. ఉల్లి పాయల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడడం.. హీరోయిన్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించమని అడగడం.. చెంపదెబ్బలు తినడం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. ‘అతనికి కాస్త తిక్కుంటుంది.. పిచ్చి ఉంటుంది.. వెర్రి ఉంటుంది’ అంటూ హీరో గురించి హీరోయిన్ చేత చెప్పిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మిడిక్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో హీరో ఎంట్రీ సీన్‌తోనే చూపించాడు. ప్యామిలీ కోసం హీరో పడే పాట్లు.. అన్నయ్యలతో వచ్చే కష్టాలు చూపిస్తూనే ఇందు పాత్రను పరిచయం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత కూడా కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తినికి పెంచుతుంది. ద్వితియార్థం ఎక్కువగా అమెరికాలోనే సాగుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. మిడిల్ క్లాస్ యువకుడి మీద హీరోయిన్ థీసిస్ ఎందుకు రాసిందనేదానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ప్రీక్లైమాక్స్ బాగుంటుంది. పతాక సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. కథ, కథనాన్ని మరింత బలంగా రాసుకొని, హాస్యంపై ఫోకస్ పెడితే ‘ఫ్యామిలీ స్టార్’ మరో లెవెల్ విజయం సాధించేది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలీవరీ, మ్యానరిజం సినిమాకు ప్లస్ అయింది. కథంతా తన భుజాన వేసుకొసి సినిమాను ముందుకు నడిపించాడు. తెరపై చాలా అందంగా కనిపించాడు. ఇక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి ఇందుగా మృణాల్ చక్కగా నటించింది. తెరపై విజయ్, మృణాల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో బామ్మగా రోహిణి హట్టంగడి తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్, వాసుకి, అభినయతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. అద్భుతమైన పాటలతో మంచి బీజీఎం అందించాడు. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'ఫ్యామిలీ స్టార్' మూవీ ట్విటర్ రివ్యూ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్‌తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తారు అని ఆయన పట్ల మంచి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా పేరులోనే ఆ ఫ్లేవర్‌ను పెట్టారు. అందుకే ఈ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగింది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ -పరశురామ్ ఆ హిట్ మ్యాజిక్‌ను మ్యాజిక్ రిపీట్ చేశారా, లేదా అనేది నేడు తేలిపోయింది. ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో బయటకు వచ్చేసింది. ఇప్పటికే అమెరికాలో తొలి ఆట పూర్తి అయింది.ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ఆలోచింపచేసే సినిమా అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కానీ మాస్ కమర్షియల్ మైండ్‌సెట్‌తో థియేటర్‌కు వెళ్లకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. టైటిల్‌కు తగ్గట్లు కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ అని చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడని, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నాడు. ఈ సినిమాలో విజయ్, మృణాల్ జోడీ చాలా కలర్ఫుల్గా ఉందని తెలిపాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ పాత్రను చూస్తుంటే.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్రనే గుర్తుకొస్తుందని మరోక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని.. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చాడు. అక్కడక్కడ టీవీ సీరియల్ ఫీలింగ్ వస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు. సినిమా ఫస్టాఫ్ కమర్షియల్ అంశాలతో ప్లాన్ చేసిన దర్శకుడు..సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్ ట్రాక్‌ను ఎంచుకుని మంచిపని చేశాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయిని తెలిపాడు. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని చక్కగా చూపించారని ఆయన తెలిపాడు. గీత గోవిందం సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్, కామెడీ.. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఆ కట్టుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో కథ, డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త బాగున్నా.. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం కష్టమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం చెప్పుకొతగిన విధంగా లేదని పేర్కొన్నాడు. అనవసరమైన రిపీటెడ్ సీన్స్‌తో సినిమా ఓపికకు పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగిలిన నటీనటుల పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా లేదని చెబుతున్నారు. జయ్ అభిమానులతో పాటు మిడిల్ క్లాస్ అభిమానులకు బాగా నచ్చే సినిమా అని ఎక్కువ మంది చెబుతున్నారు. #FamilyStar Review : The first part of the film is enjoyable and has a strong commercial vibe. The second half picks up more of a playful tone . Emotion connects well with the audience Second Half > First Half Impressive performance by Rowdy @TheDeverakonda & @mrunal0801… pic.twitter.com/OM4PmclYHa — Let's X OTT GLOBAL (@LetsXOtt) April 4, 2024 #FamilyStar so flat and underwhelming. Avg 1st half, rubbish 2nd half. Nothing impresses and no standout plot points or performances. Boredom Max, went with low expectations still annoyed. VD with another poor choice. I'd rather watch Liger, super disappointed. Parasu b2b bombs👎 https://t.co/kPxDTCGLUW pic.twitter.com/5vbZM5C5zY — PushpaBhav (@ThaggedheeLe) April 4, 2024 #FamilyStar Decent 1st half My rating:⭐⭐⭐/5#FamilyStarReview#FamilyStarBookings #FamilyStarOnApril5th #FamilyStarArrivingTomorrow pic.twitter.com/h7Lmjt9fAV — Ronak yadav (@Prakash0617640) April 5, 2024 #FamilyStar feels like a rerun of Gemini TV's Radhika serials. Lead chemistry shines, but can't rescue the sinking ship. Patchy editing adds to the irritation. Seems like the director's main goal is a funded holiday in the US, courtesy of the producer..Skip the pain 😢 pic.twitter.com/B6ncLYzmnN — Swathiiii 🌸 (@Swathi_Prasad96) April 4, 2024 #FamilyStarReview : a film that is as clueless as tv serials background music. We have no words to talk about it. Especially the second half of the film is complete trash. We recommend you to watch #Projectz & #ManjummelBoys you know #FamilyStar is notworth pic.twitter.com/CY20tMG2pl — Theinfiniteview (@theinfiniteview) April 5, 2024 Show completed :- #FamilyStar #VijayDeverakonda My rating 2.5/5 Positives :- 1st half Fight scenes Mrunal thalur 😍😍😍 Negatives :- 2nd half too laggy No high moments Final verdict- One time watch with family pic.twitter.com/KrYjhaLLBP — venkatesh kilaru (@kilaru_venki) April 4, 2024 #FamilyStar is an inferior template rom-com family movie that has a few time-pass moments but no real emotional connection nor feel good moments. First half is underwhelming and feels like a serial until the pre-interval. Second half starts on a more fun note but quickly turns… — Venky Reviews (@venkyreviews) April 4, 2024 -
'దిల్ రాజుపై నెగెటివ్ ట్రోల్స్'.. ఫ్యామిలీ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్‌ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్‌లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్‌ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్‌ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్‌గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్‌కు భయపడితే ఎలా? ' అని అన్నారు. "Trolls are like passing clouds, but I'm like the sky" Ace Producer #DilRaju responds to trolls on his personal life, giving a befitting reply 🙌#TheFamilyStar #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Fuwifsq0NQ — Telugu FilmNagar (@telugufilmnagar) April 4, 2024 -
ఫ్యామిలీ స్టార్ క్రెడిట్ అంతా ఆయనకే: విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం తర్వాత పరశురామ్- విజయ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో అలరించనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్‌పై ప్రశంసలు కురిపించారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'ఫ్యామిలీ స్టార్ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకొచ్చాడు. ఈ సినిమాలో నా ఫర్మామెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ ఈ క్రెడిట్ మొత్తం పరశురామ్‌కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురాముడే. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' అని అన్నారు. కాగా.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. -
అహంకారం అనుకున్నా సరే...
‘‘నా సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలనే నా కల నా నాలుగో సినిమా ‘గీత గోవిందం’తో నిజమైంది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. అనంతరం నేను నటించిన మరో సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను... కానీ, సాధించలేదు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తాను. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. ఇక ఈ సమ్మర్‌కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ‘ఫ్యామిలీ స్టార్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మన కుటుంబంలోని భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’’ అన్నారు. ‘‘మా సినిమా కథలోని భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు పరశురామ్ పెట్ల. -
పబ్లిక్‌లో ఆ మాటలేంటి బ్రో?.. విజయ్ దేవరకొండపై నెటిజన్స్ ఫైర్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హైదరాబాద్‌లో మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈవెంట్‌కు భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే ఈవెంట్‌కు స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బైక్‌పై ఉన్న విజయ్ ఓ బూతు పదాన్ని ఉపయోగించారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై వస్తున్న విజయ్‌కు ఎదురుగా ఎవరో అడ్డుగా ఉండడంతో బూతుపదాన్ని వాడారు. ఇది చూసిన నెటిజన్స్ పబ్లిక్ అలాంటి మాటలేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఫ్యామిలీ స్టార్ ఈనెల 5న థియేటర్లో సందడి చేయనుంది. Public lo avem matalu bro @TheDeverakonda 🙏 pic.twitter.com/F0oHqv5TrK — Rohit_45 (@2Gokul_1909) April 3, 2024