
ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. అమ్మా, నాన్నకు నచ్చకుండా ఏం చేయను. వాళ్లకు నచ్చాలి. అలాగే వాళ్లకు నచ్చేటట్లు ఒప్పించాలి. ఆ బాధ్యత అంతా మనమే చూసుకోవాలి. మొత్తం అలా వదిలేయలేం కదా. పెళ్లి చేసుకున్న తర్వాత రాబోయే 30 ఏళ్లు మనం బతకాలి కదా. అన్ని కేర్‌ఫుల్‌గా చేసుకుని వాళ్లకు నచ్చేటట్టు చేసుకోవాల్సింది మనమే. సో దానికి ఇంకా చాలా టైముంది. అని అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. చాలాసార్లు నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment