విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. ఉగాది, రంజాన్ పండుగలు వెంటవెంటనే రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇవాళ ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సుల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే దర్శమిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద రద్దీ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం
కాగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత స్వయంగా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ నుంచి రివ్యూ తీసుకున్నారు. నెగెటివ్ రివ్యూలపై ఆయన మండిపడ్డారు. ఇలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment