ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు.. ? విజయ్‌ మేనమామ కామెంట్స్‌ | Vijay Devarakonda Uncle Comments On Family Star Movie Trolls | Sakshi
Sakshi News home page

మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్‌ మేనమామ కామెంట్లు వైరల్‌

Published Mon, Apr 8 2024 10:18 AM | Last Updated on Mon, Apr 8 2024 12:16 PM

Vijay Devarakonda Uncle Comments On Family Star Movie Trolls - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మించారు. 

సినిమా బాగున్నప్పటికీ సోషల్‌మీడియాలో మరోవైపు నెగెటివ్‌ ప్రచారం చేయడంపై నిర్మాత దిల్‌ రాజు ఇప్పటికే   స్పందించారు. మేము కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదని ఆయన కోరారు. ఇలాంటి పద్ధతి కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా నెగెటివ్‌ ప్రచారంపై ఇలా రియాక్ట్‌ అయ్యారు. 'ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు.మీ నెగటివ్ బ్యాచ్‌కు వాడంటే (విజయ్ దేవరకొండ) ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు.

ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా.. ?' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement