mrunal thakur
-
హద్దులు మీరినా నో ఛాన్స్.. కారణాలు చెప్పిన మృణాల్ ఠాకూర్
ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలన్నది సామెత. ఇందుకు విరుద్ధంగా జరిగితే అంతా తారుమారే. నటి మృణాల్ ఠాకూర్‌ది ఇంచుమించు ఇదే పరిస్థితి. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ ఈమె. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించిన తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ చిత్రాలు నటిస్తుండగానే తెలుగులో సీతారామం మూవీలో నటించే అవకాశం వరించింది. అందులో నటుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించారు. అది చాలా ట్రెడిషనల్ పాత్ర. ఆ పాత్రలో ఈ భామ ఒదిగి పోవడం, చిత్రం ఘనవిజయాన్ని సాధించడంతో నటి మృణాల్ ఠాకూర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.ఈ క్రమంలో నటుడు నానితో జత కట్టిన 'హాయ్ నాన్న' చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాంటి సమయంలో కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. శివ కార్తికేయన్ కు జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించే పెద్ద అవకాశం తలుపు తట్టింది. అయితే కారణాలేమైన ఆ అవకాశాన్ని ఈ అమ్మడు చేజార్చుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ కోలీవుడ్‌లో అవకాశం రాలేదు. అంతేకాకుండా ఆ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ మెన్ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. గ్లామర్ విషయంలో ఎంతగా హద్దులు మీరినా, దక్షిణాదిలో నటి మృణాల్ ఠాకూర్ దాదాపు కనుమరుగైన పరిస్థితి. మళ్లీ దక్షిణాదిలో కనిపించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ అభిమానులు తన కథాపాత్రలను ఆదరిస్తున్నారని అందువల్ల వారికి నచ్చే విధంగా కథాపాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో ఆచి చూసి అడిగేస్తున్నానని చెప్పారు. ఒక చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టకుండా పలు చిత్రాలను అంగీకరించే మనస్తత్వం తనదు కాదని పేర్కొన్నారు. అందుకే మంచి కథ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు నటి మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామర్.. బుట్టబొమ్మ స్టన్నింగ్ పిక్స్
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామరస్ పిక్స్..మరింత బోల్డ్నెస్తో బుట్టబొమ్మ పూజా హెగ్డే..గుర్రంపై మృణాల్ ఠాకూర్ సవారీ..అదిరిపోయే లుక్‌తో లక్ష్మీ రాయ్ పోజులు..సముద్రంలో చిల్ అవుతోన్న శిల్పా శెట్టి.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
బాలీవుడ్ గోల్డెన్ ఛాన్స్ అందుకున్న మృణాల్..
-
స్పిరిట్ లో మృణాల్ ప్లేస్.. కన్ఫామ్ అయినట్లు ప్రచారం
-
బ్లూ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్.. ప్రణీత అలాంటి పోజులు
బ్లూ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్..బ్లాక్ డ్రెస్‌లో అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత..అనన్య నాగళ్ల గ్లామరస్ లుక్స్..2024 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న తమన్నా..కాశీ యాత్రలో నటి రేణు దేశాయ్.. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
చీరలో మెరిసిపోతున్న సీతారామం బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్‌కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
అడివి శేష్ కి గుడ్ బాయ్ చెప్పిన శృతి హాసన్.. ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
-
స్పిరిట్‌లో..?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మృణాల్ ఠాకూర్ చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ సరసన మృణాళ్ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కన్ఫార్మ్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
డకాయిట్ మిస్టరీ.. శృతి పోయి మృణాల్ ఎలా వచ్చింది?
-
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్‌ని తీసేసి మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్‌తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్‌తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
స్పిరిట్ మూవీలో ప్రభాస్ తో సీత రొమాన్స్
-
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సలార్ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్- 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.కథ విషయానికి వస్తే..ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! Congratulations to the entire team of #HiNanna 🫶 This film truly deserves all the love it's receiving, nd it's heartwarming to see it being celebrated🥺❤️ pic.twitter.com/oAIJDNSMRX— Vyshuuᴴᴵᵀ ³ (@vyshuuVyshnavi) November 26, 2024 -
హల్లో హీరోయిన్ గారు.. నెక్ట్స్ ఏంటి?
‘వాట్ నెక్ట్స్’ అంటూ కొందరు స్టార్ హీరోయిన్ల అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. కారణం ఆ కథానాయికలు తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకపోవడమే. అభిమాన నాయికలు వేరే భాషల్లో సినిమాలు చేసినా తెలుగు తెరపై కనిపించక΄ోతే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి నిరుత్సాహంగానే ఉంటుంది. మరి... టాలీవుడ్లో కొత్త సినిమా అంగీకరించని ఆ తారల గురించి తెలుసుకుందాం. మా ఇంటి బంగారం ఏమైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. టాలీవుడ్లో మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి హీరోలకి జోడీగా నటించి సందడి చేశారామె. అలాగే ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అలరించారీ బ్యూటీ. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రంపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఖుషి’ 2023 సెపె్టంబరు 1న విడుదలైంది. ఈ మూవీ రిలీజై ఏడాది దాటిపోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత. అయితే ‘మా ఇంటి బంగారం’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. ఈ సినిమాని తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు కూడా. తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న విడుదల చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. అలాగే సమంత బర్త్ డే తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌పై ఉందా? లేదా అనే సందేహం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రం ఏది? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే హిందీలో సమంత నటించిన ‘సిటాడెల్: హనీ–బన్నీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సమంత. అక్కడ ఫుల్... ఇక్కడ నిల్టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారామె. ఆ తర్వాత ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోల సరసన సినిమాలు చేశారు పూజా హెగ్డే. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు పూజ. ఈ మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో మెరిశారు. అయితే ‘ఆచార్య’ విడుదలై రెండున్నరేళ్లు అవుతున్నా హీరోయిన్గా మరో తెలుగు చిత్రం కమిట్ కాలేదు పూజా హెగ్డే. ఈ గ్యాప్‌లో హిందీ సినిమాలు చేశారామె. షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ‘దేవ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ 69వ చిత్రం, సూర్య 44వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ కాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు. మహానటి అక్కడ బిజీ ‘నేను శైలజ’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు కీర్తీ సురేశ్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా 2016 జనవరి 1న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘నేను లోకల్ (నాని), అజ్ఞాతవాసి(పవన్ కల్యాణ్), మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే (నితిన్), గుడ్ లక్ సఖి, సర్కారువారి పాట (మహేశ్ బాబు), దసరా (నాని), భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేశ్. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ‘భోళా శంకర్’ సినిమాలో హీరో చిరంజీవికి చెల్లెలుగా నటించారు కీర్తి. ఆ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఆ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రానికి కీర్తీ సురేష్ పచ్చజెండా ఊపలేదు. అయితే ఈ గ్యాప్‌లో తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. అంతేకాదు.. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తెలుగులో కీర్తీ సురేష్ నటించనున్న సినిమా ఏంటి? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబమ్మకి గ్యాప్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాని (శ్యామ్ సింగరాయ్), నాగచైతన్య(బంగార్రాజు, కస్టడీ), రామ్ (ది వారియర్), నితిన్ (మాచర్ల నియోజక వర్గం), సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి), శర్వానంద్(మనమే) వంటి యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా ఈ ఏడాది జూన్ 7న రిలీజైంది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా తెలుగులో ఇప్పటికీ మరో సినిమా కమిట్ కాలేదామె. టొవినో థామస్ హీరోగా నటించిన ‘ఏఆర్ఎమ్’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతీ శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెడుతున్నారు. వరుసగా మూడు సినిమాలు (వా వాతియార్, లవ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ, జీనీ) వంటి చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్నారీ బ్యూటీ. కోలీవుడ్‌లో బిజీగా ఉండటంతో తెలుగులో ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదా? అనేది వేచి చూడాలి. నాలుగో సినిమా ఏంటి? తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు మృణాళ్ ఠాకూర్. ‘సీతా రామం’ (2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారామె. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రతో ఆకట్టుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజైంది. ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటినా ఆమె నటించనున్న మరో తెలుగు చిత్రంపై స్పష్టత లేదు. ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాకి కమిట్ కాకపోయినా బాలీవుడ్లో మాత్రం దూసుకెళుతున్నారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మృణాళ్. అయితే రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఎల్ 25’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. మృణాళ్ ఠాకూర్ తర్వాతి తెలుగు సినిమా ఏంటి? అంటే వేచి చూడాలి. ఈ కథానాయికలే కాదు... మెహరీన్, డింపుల్ హయతి వంటి మరికొందరు హీరోయిన్లు నటించనున్న కొత్త తెలుగు సినిమాలపైనా స్పష్టత లేదు. -డేరంగుల జగన్ -
మృణాల్ ఠాకూర్ ఇంట్లో పండుగ.. ఆ పాత ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ
-
అతనితో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతున్న ఫొటోస్
-
అతనితో మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న ఫొటోస్
-
తమాషాగా ఉందా? అభిమానిపై మృణాల్ ఫైర్.. అంతలోనే!
సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు, వారితో కబుర్లాడుతున్నట్లు.. ఇలా రకరకాల ఎడిటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ఈక్రమంలోనే ఓ వ్యక్తి మృణాల్ ఠాకూర్‌తో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఓ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలోని స్టిల్‌ను ఇక్కడ ఎడిట్ చేశారు. అందులో మృణాల్ అతడి చేతులు పట్టుకుని పటాసులు కాల్చినట్లుగా ఉంది. ఏంటిదంతా?ఇది చూసిన హీరోయిన్‌కు మొదట కోపం వచ్చిందట. కానీ తర్వాత అతడి నైపుణ్యానికి ఆశ్చర్యపోయానంటోంది. సదరు వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో కింద.. బ్రదర్, ఎందుకిలా చేస్తున్నావు? ఇదంతా సరదా అనుకుంటున్నావేమో, కానీ కాదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ కాసేపటికే మనసు మార్చుకుని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. మొదట ఖుషీ అయ్యా!'ఓ వ్యక్తి చేసిన ఎడిట్ వీడియో చూసి మొదట ఖుషీగా ఫీలయ్యాను. అతడి పేజీ ఓపెన్ చేస్తే అందరు హీరోయిన్లతో కలిసున్నట్లుగా వీడియో ఎడిటింగ్స్ దర్శనమిచ్చాయి. అది చూసి బాధేసింది. కానీ అతడి ఎడిటింగ్ స్కిల్స్‌కు మెచ్చుకోవాల్సిందే! తన టాలెంట్‌ను సరైన వాటి కోసం ఉపయోగిస్తే బాగుండేది. ఎవరూ అతడిని తిట్టకండి. అతడు ఏదో దురుద్దేశంతో కాకుండా సరదా కోసం చేశాడేమో!' అని చెప్పుకొచ్చింది. సినిమాఏదో ఒక రోజు అతడు పెద్ద సినిమాలకు సైతం ఎడిటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మనసారా ఆకాంక్షించింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా చేస్తోంది. అలాగే పూజా మేరీ జాన్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by SAUKHIN MALIK (@its_saukhin) -
ఎల్లో డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ ఫోజులు చూశారా..? (ఫోటోలు)
-
బాలీవుడ్ ను ఆగమాగం చేస్తున్న ముగ్గురు బుట్టబొమ్మలు
-
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
నువ్వు లేకుండా నేను ఏదీ చేయలేను.. లవ్యూ: మృణాల్ ఠాకూర్ (ఫొటోలు)
-
నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది.. నీ ప్రేమకు ఫిదా: మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. అటు సినిమాల్లో ఇటు బయట ఎంతో అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె సోదరి లోచన్ ఠాకూర్. ఈమె మేకప్ ఆర్టిస్ట్. మృణాల్ మొదటి సినిమా నుంచే కాదు తన చిన్నప్పటినుంచి ఆమెను అందంగా ముస్తాబు చేస్తూనే ఉంది.నా సోదరివి మాత్రమే కాదు!లోచన్ బర్త్‌డే సందర్భంగా మృణాల్ తన సోదరితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. నన్ను మీరాబాయిగా, చిన్ని కృష్ణుడిగా, రాజస్తానీ డ్యాన్సర్‌గా ఎప్పుడూ ఏదో ఒక గెటప్‌లో రెడీ చేస్తూ వచ్చావు. అంతేనా.. సూపర్ 30, హాయ్ నాన్న చిత్రాల్లోనూ మ్యాజిక్ సృష్టించావు. నీ క్రియేటివిటీకి, ఓపికకు, ప్రేమకు సర్వదా కృతజ్ఞురాలిని. నువ్వు లేకుండా నేను ఏం చేయగలనని? నువ్వు నా సోదరివి మాత్రమే కాదు సోల్‌మేట్ కూడా!నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా..నాకు అండగా నిలబడ్డందుకు థాంక్యూ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మేకప్‌ను నీ వృత్తిగా ఎంచుకున్నావు.. ఈ వృత్తి ద్వారా ఎంతోమంది కళ్లలో ఆనందాన్ని నింపుతున్నావు. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది. ఇంత మంచి సిస్టర్ను ఇచ్చినందుకు థాంక్యూ అమ్మా అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) చదవండి: నిశ్చితార్థం అప్పటినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా -
మృణాల్ అందానికి ఫిదా అయిపోయిన శ్రీలీల (ఫొటోలు)
-
ఒక్క చేతికే రెండు డజన్ల గాజులు.. మృణాల్ కొత్త ఫ్యాషన్ (ఫొటోలు)
-
ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్
వయసొచ్చిన తర్వాత చాలామంది ప్రేమలో పడుతుంటారు. ఇది సాధారణమైన విషయమే. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే ప్రేమ ఎల్లకాలం ఉండదన్నట్లు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా బయటపెట్టరు. కానీ 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ మాత్రం తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పింది.'సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు వచ్చివెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది. అంతెందుకు నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా. కానీ నటితో డేటింగ్ అతడికి ఎందుకో ఇష్టం లేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయింది. అయితే నన్ను చేసుకునేవాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి అయ్యిండాలి' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఇప్పటివరకు తన జీవితంలో బ్రేకప్స్ జరిగాయి కానీ మరీ బాధపడిపోయేంతలా ఏం కాలేదని మృణాల్ చెప్పింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని పేర్కొంది. మరి మృణాల్ ఠాకుర్ మనసు గెలుచుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో చూడాలి?సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకుర్.. హిందీలో పలు సినిమాలు చేసింది. 'సీతారామం' మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా హిందీపైనే ఉంది. తెలుగులో ఇప్పుడప్పుడే మూవీ చేస్తుందో లేదో డౌటే?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం) -
చాలా అవకాశాలు కోల్పోయాను..!
సీతారామం చిత్రం పేమ్ నటి మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు పరిచయం అవసరం ఉండదనుకుంటా. ఈ బెంగాలీ బ్యూటీ మాతృభాషలోనే కాకుండా కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించారు. అయితే ఆయా చిత్రాల్లో రాని పేరు తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన సీతారామమ్ చిత్రంతో వచ్చింది. ఆ చిత్రంతో ఒక్క సారిగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయ్యిపోయ్యారు. ఆ తరువాత నానితో జత కట్టిన హాయ్ నాన్నా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో తెలుగులో అవకాశాలు దూరం అయ్యాయనే చెప్పాలి. కాగా తమిళంలో నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారనే ప్రచారం జరిగింది. ఇకపోతే సీతారామమ్ వంటి చిత్రాల్లో హోమ్లీగా నటించిన మృణాల్ ఠాకూర్ ఆ తరువాత గ్లామర్ వైపు మొగ్గు చూపారు. ముద్దు సన్నివేశాల్లోనూ నటించి ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇచ్చారు. అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని మృణాల్ ఠాకూర్ తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను సినిమాల్లో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు. దీంతో పలు అవకాశాలను కోల్పోయానన్నారు. ఆ తరువాత తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, తన తల్లిదండ్రులని పిలిచి లిప్‌లాక్ వంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడం తనకూ భయమేనని,అయితే ఈ రంగంలో అలాంటివి చాలా అవసరం అనీ, ఇది తన ఛాయిస్ కాదనీ వివరించి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తరువాతనే ఈ అమ్మడు ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అంటున్నారట. -
Mrunal Thakur: పూల తోటలో మృణాల్ ఠాకుర్.. అందమే కుళ్లుకునేలా! (ఫొటోలు)
-
ప్రకృతి ఒడిలో సీతారామం బ్యూటీ.. రాజస్థాన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ చిల్!
ప్రకృతి ఆస్వాదిస్తోన్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. దసరా మూడ్‌లోనే కీర్తి సురేశ్.. కళ్లతోనే మాయ చేస్తోన్న పూనమ్ బజ్వా.. రెడ్ డ్రెస్‌లో శ్రద్ధాకపూర్ అందాలు.. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
విరాట్ కోహ్లి అంటే పిచ్చి ప్రేమ.. ఇప్పుడవసరమా?
హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు క్రికెటర్ విరాట్ కోహ్లి అంటే ఇష్టం. తనంటే పిచ్చి అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే కొందరు ఆ పాత కామెంట్లను తిరిగి వైరల్ చేస్తున్నారు. దీనిపై మృణాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని మళ్లీ ప్రచారం చేయొద్దని కోరింది.మృణాల్ అసహనంఓ మీడియా పోర్టల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మృణాల్‌కు.. విరాట్ కోహ్లి అంటే ఎంతిష్టమో రాసుకొచ్చింది. ఎప్పుడో చెప్పినదాన్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకురావడం బ్యూటీకి నచ్చలేదు. వెంటనే ఆ పోస్టు కింద చాలు, ఇకనైనా ఆపేయండి అని కామెంట్ చేసింది.లైవ్ మ్యాచ్‌కాగా గతంలో జెర్సీ సినిమా ప్రమోషన్స్‌లో మృణాల్ ఠాకూర్ క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. నా సోదరుడికి క్రికెట్ అంటే పిచ్చి.. అలా నేను కూడా ఈ క్రీడను చూసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఐదేళ్ల క్రితం తనతో కలిసి స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూశాను. బ్లూ జెర్సీ వేసుకుని టీమిండియాకు సపోర్ట్ చేశాను.క్రీడా నేపథ్యంలో..అలా విరాట్ కోహ్లిని పిచ్చిగా ప్రేమించిన రోజులున్నాయి. ఈరోజు నేను క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది అని పేర్కొంది. తెలుగు జెర్సీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ హిందీ మూవీలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఇకపోతే మృణాల్ చివరగా ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోయిన్గా నటించింది. కల్కి 2898ఏడీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. -
'సీతారామం'కి రెండేళ్లు.. స్కాట్లాండ్లో మృణాల్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!
హీరోయిన్లకు ఒక్కసారి స్టార్ హోదా వస్తే భూమ్మీద నిలబడతారా అంటే డౌట్. సకల సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారని ఇండస్ట్రీలో టాక్. కానీ 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ మాత్రం ఓ మూవీలో పాత్ర కోసం తెగ కష్టపడిందట. కరెక్ట్‌గా చెప్పాలంటే తనకు రోల్ ఇవ్వమని ప్రాధేయపడిందట. ఓ సమయంలో నిర్మాతలతో గొడవ కూడా పడిందట.టీవీ సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ 30, సీతారామం, హాయ్ నాన్న, జెర్సీ (హిందీ) సినిమాలతో సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు కంటే హిందీపైనే ఎక్కువ కాన్సట్రేట్ చేసింది. ఈమె చేతిలో సన్ ఆఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్ అనే హిందీ చిత్రాలు ఉన్నాయి. అయితే 'పూజా మేరీ జాన్' కోసం తను ఎంతలా తెగించాననే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఫుడ్ విషయంలో ప్రభాస్‌ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్)'ఈ సినిమా తీస్తున్నారని తెలిసి చాలాసార్లు ఆడిషన్స్, స్క్రీన్ టెస్టులు ఇచ్చాను. చెప్పాలంటే హీరోయిన్ పాత్ర ఇవ్వమని అడుకున్నాను. ఇంతలా చేయడానికి కారణం.. ఆ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంది. ఓసారి ఈ రోల్ కోసం మరో నటిని పరిశీలిస్తున్నారని తెలిసి నిర్మాతలతోనూ గొడవపడినంత పనిచేశాను. ఎందుకో ఆ పాత్రకు అంతలా కనెక్ట్ అయిపోయాను' అని మృణాల్ చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయ్ దేవరకొండతో 'ద ఫ్యామిలీ మ్యాన్'లో కనిపించిన మృణాల్.. ఫెయిల్యూర్ అందుకుంది. రీసెంట్గా వచ్చిన ప్రభాస్ 'కల్కి'లో అతిథి పాత్ర చేసింది. ప్రస్తుతానికి అయితే తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోవట్లేదు. హిందీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్) -
సినిమాల్లో ఒకలా.. బయట మరోలా.. మృణాల్ గురించి ఇది తెలుసా? (ఫొటోలు)
-
అవార్డుతో సీతారామం బ్యూటీ.. సెల్ఫ్ కేర్ అంటోన్న కల్కి భామ!
ఫిలింఫేర్ అవార్డుతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సెల్ఫ్ కేర్ మంత్ అంటోన్న కల్కి భామ దీపికా పదుకొణె.. పాత రోజులను గుర్తు చేస్తున్న రానా భార్య మిహికా బజాజ్.. రెడ్ శారీలో ఉప్పెన భామ కృతి శెట్టి పోజులు.. తొమ్మిదేళ్ల కల అంటోన్న భూమి పెడ్నేకర్... View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
జిమ్‌లో మృణాళ్.. గ్లామర్‌తో కృతి శెట్టి.. మురారి పోస్టర్‌తో మహేశ్
మనుసులో సంతోషం ఉంటే అంతకు మించిన గ్లామర్ మరొకటి లేదంటున్న కృతి శెట్టిమహేశ్ బాబు హిట్ సినిమా 'మురారి' రీ-రిలీజ్ పోస్టర్ వైరల్బర్త్డే వేడుకుల జరుపుకున్న సితార ఘట్టమనేని కల్కి షూట్ సమయంలో భైరవ ఎంట్రీ సీన్ మేకింగ్ స్టిల్ పంచుకున్న మేకర్స్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న మృణాళ్ ఠాకూర్ View this post on Instagram A post shared by Genelia Deshmukh (@itsgeneliad) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by AMB Cinemas (@amb_cinemas) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anilkrishna Kanneganti (@aneelkanneganti) -
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' రికార్డ్.. మొత్తంగా ఎన్ని వచ్చాయంటే?
2023 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులని తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాదిలో నాలుగు భాషల్లో గతేడాదితో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఓవరాల్‌గా అవార్డులని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. అలానే సీతారామం సినిమాకు 5, విరాటపర్వం 2, 'భీమ్లా నాయక్'కి ఓ అవార్డు సాధించాయి. గతంలో 'ఆర్ఆర్ఆర్'కి రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ ఏదో ఓ అవార్డ్ వస్తూనే ఉండటం విశేషం. ఇకపోతే ఎవరెవరికీ ఏ విభాగంలో అవార్డు దక్కిందో దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.(ఇదీ చదవండి: సంప్రదాయబద్ధంగా నటి వరలక్ష్మి వివాహం)ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు)ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామంఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ నటి - నందితా దాస్ (విరాటపర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) - కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) - చిన్మయి (సీతారామం- ఓ ప్రేమ)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది) -
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్‌లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్
'సీతారామం' పేరు చెప్పగానే గుర్తొచ్చేది మృణాల్ ఠాకురే. ఎందుకంటే అప్పటివరకు హిందీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఈ ఒక్క మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఆ తర్వాత 'హాయ్ నాన్న'తో మరో హిట్ అందుకుంది. 'ఫ్యామిలీ స్టార్' మాత్రం ఈమెకు దెబ్బేసింది. దీంతో కొత్త మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రీసెంట్గా 'కల్కి'లో అతిథి పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాన్స్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)'నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయతీగా ఉండటం, మనపట్ల శ్రద్ధ చూపించడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండటం గొప్ప రొమాంటిక్ చర్య అనేది నా ఉద్దేశం. చిన్న టచ్ చాలు' అని ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈమె హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో. మరోవైపు పలువురు తెలుగు దర్శకనిర్మాతలు కూడా ఈమెని అప్రోచ్ అవుతున్నప్పటికీ.. హిందీపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే తెలుగులో ఇప్పటప్పట్లో మరో మూవీ చేయడం కష్టమే.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ) -
క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్
అందరూ ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ మూవీ ఎట్టకేలకు గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విజువల్ వండర్‌ను చూసిన సినీప్రియులు హాలీవుడ్ సినిమాను మించిపోయిందని ఖుషీ అవుతున్నారు. యాక్టర్స్ పోటీపడి మరీ నటించారని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. భైరవగా ప్రభాస్ ఎంత మెప్పించాడో అశ్వత్థామగా అమితాబ్ అంతే స్థాయిలో అదరగొట్టాడు. వారిపై నమ్మకంతోనే..విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో కనిపించి మురిపించారు. అయితే తాను కల్కి మూవీలో గెస్ట్ రోల్లో నటించడానికి ఈ ముగ్గురే కారణమంటోంది మృణాల్. ఆమె మాట్లాడుతూ.. కల్కి సినిమా గురించి నన్ను సంప్రదించినప్పుడు క్షణం ఆలోచించలేదు. ఎందుకంటే నిర్మాతలు అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంకలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందువల్లే ఈజీగావారితో కలిసే సీతారామం సినిమా చేశాను. దానివల్లే ఈసారి ఈజీగా నిర్ణయం తీసుకున్నాను. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమవడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి మూవీ రెండు రోజుల్లోనే రూ.298 కోట్లు రాబట్టింది. వీకెండ్ కలిసొస్తుండటంతో ఈ శని, ఆదివారాల్లో ఇంకెత రాబడుతుందో చూడాలి!చదవండి: హృతిక్ రోషన్ అలా చేస్తాడనుకోలేదు: బాలీవుడ్ నటుడు'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్ -
'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్‌లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి.కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, కల్కిలో మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. -
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే..?
యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో దూసుకెళుతున్నారు. ఇక ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించనున్న ఓ హిందీ చిత్రం ద్వారా శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం జరగనుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా హిందీలో ఆమె తొలి చిత్రం ఇది కాదన్నట్లుగా మరో వార్త వైరల్‌గా మారింది. వరుణ్ ధావన్ హీరోగా రూపొందనున్న చిత్రం ద్వారా హీరోయిన్గా శ్రీలీల బాలీవుడ్ తెరపై కనిపించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని టాక్. శ్రీలీల ఓ హీరోయిన్గా, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్గా నటిస్తారట. కామెడీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారని సమాచారం. జూలై నెల చివర్లో చిత్రీకరణ ఆరంభించి, అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. మరి... శ్రీలీలకు హిందీలో ఇదే తొలి చిత్రం అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియా లంటే మరో నెల ఆగాల్సిందే. -
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
ప్రస్తుతం సీతారామం బ్యూటీ మృణాల్ టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీస్టార్‌లో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. మృణాల్ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న కామెడీ హారర్ కాంచన-4లో మృణాల్ ఠాకుర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ స్పందించారు. ఈ విషయంపై రాఘవ లారెన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కాంచన-4 సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేశారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని.. ఏదైనా ఉంటే రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగానే ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు మృణాల్ ఠాకూర్ తీసుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో వచ్చిన ముని, ముని-2 (కాంచన), కాంచన-2, కాంచన-3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే సిరీస్‌లో ప్రస్తుతం కాంచన-4 తెరకెక్కునుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమాలు తెరకెక్కించారు. కాగా.. మృణాల్ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్‌లో కనిపించనుంది. మరోవైపు రాఘవ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. Hi friends and fans, All the information regarding Kanchana 4 and casting that are circulating around social media are just rumors. Official announcement will be made through Ragavendra Production. Coming soon! pic.twitter.com/T46gcYyjAN— Raghava Lawrence (@offl_Lawrence) June 9, 2024 -
హీట్ పెంచేలా మృణాల్.. చీరలో మరింత అందంగా ఆషిక!
చిట్టి పొట్టి డ్రస్సుల్లో మృణాల్ ఠాకుర్.. చూస్తే అంతేచీరలో అందాలన్నీ చూపించేస్తున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్'పుష్ప 2' పాటకు క్యూట్ స్టెప్పులేసిన బిగ్ బాస్ దివిసింగర్ నేహా కక్కర్తో కలిసి డ్యాన్సులేస్తున్న ధనశ్రీచందమామ లాంటి ముఖంతో వావ్ అనిపిస్తున్న కాయద్ లోహర్ఫ్రెండ్ పెళ్లి హాట్ బ్యూటీ సీరత్ కపూర్ హంగామా View this post on Instagram A post shared by Rahul Jhangiani (@rahuljhangiani) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Bhavya (@bhavyatrikha) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Shruti Sodhi (@aslishrutisodhi) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Niti Taylor (@nititaylor) -
కాంచనలో మృణాల్?
‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో తొలుత మృణాల్ ఠాకూర్‌నే హీరోయిన్గా అనుకున్నారు.అయితే ఈ చాన్స్ కన్నడ భామ రుక్మిణీ వసంత్ దక్కించుకున్నారు. ఇప్పుడు మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. హారర్ హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’లో రానున్న ‘కాంచన 4’లో మృణాల్‌ని తీసుకున్నారట. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మృణాల్ నటించనున్నారని టాక్. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘కాంచన 5’లో మృణాల్ నటిస్తే తమిళంలో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది. -
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'సీతారామం' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకుర్. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్‌తో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో వరసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)ఇప్పుడు 'కాంచన' సినిమాల సిరీస్‌లో హీరోయిన్గా మృణాల్‌కి ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. 'ముని', 'కాంచన' చిత్రాలతో తనకంటూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్.. వాటితో వరస హిట్స్ కొడుతున్నాడు. ఈ మూవీస్‌లో డ్యాన్సులు వేయడం, హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండదు.అయితే 'కాంచన 4' మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మృణాల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆమె ఒప్పుకొంటుందా? లేదా అనేది చూడాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాల్‌కి తమిళ డెబ్యూ అవుతుంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్‌కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024 -
అలాంటి సన్నివేశాలకు నో: మృణాళ్ ఠాకూర్
‘కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్‌లో నటించేందుకు సిద్ధం’ అనే మాటని ఎక్కువశాతం హీరోయిన్లు అంటుంటారు. అయితే అలాంటి సన్నివేశాలకు నో అనే కథానాయికలూ లేకపోలేదు. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా గ్లామర్ సన్నివేశాలు, ముద్దు సీన్స్‌లో నటించేందుకు నో చెబుతాను అంటున్నారు. ‘సీతా రామం’(2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఈ మరాఠీ బ్యూటీ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ–‘‘ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. పైగా నేను అలాంటి సీన్స్‌లో యాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే మొహ మాటం లేకుండా నో చెబుతాను’’ అన్నారు. -
రిలేషన్షిప్ కష్టం.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నా: మృణాల్
తెలుగు సినిమాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన ముంబయి బ్యూటీ మృణాల్ ఠాకుర్. 'సీతారామం'తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొనే విషయంలో ఆచితూచి వ్యహరిస్తున్న మృణాల్.. రిలేషన్, పిల్లలు కనడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయల్ని బయటపెట్టింది.'కెరీర్, జీవితం.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషన్షిప్ అంటే కష్టమనే విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం చాలా అవసరం. అలానే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.మృణాల్ చెప్పిన దానిబట్టి చూస్తే.. ఇప్పట్లో బాయ్ ఫ్రెండ్, పెళ్లి లాంటివి ఉండవనమాట. ఇక ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మనకు కొత్తేమో కానీ హీరోయిన్లకు ఈ మధ్య కాస్త కామన్ అయిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత నిల్వ చేసిన తమ అండాలతో పిల్లల్ని కనడాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చనే భయంతో ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దారిలోనే మృణాల్ కూడా వెళ్లబోతుందనమాట. -
సడన్‌గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. వచ్చిన తర్వాత చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరసగా మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క దానితో హిట్ కొట్టలేకపోతున్నాడు. 'ఖుషి' ఓ మాదిరి కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించింది. ఇది తప్పితే మిగతావన్నీ డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. దీంతో 'ఫ్యామిలీ స్టార్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ విషయంలోనూ నిరాశే ఎదురైంది.ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉగాది, రంజాన్ లాంటి హాలీడే వీకెండ్ దొరికినప్పటికీ.. 'ఫ్యామిలీ స్టార్' చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఊహించని విధంగా 20 రోజుల్లోనే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన 'ఫ్యామిలీ స్టార్'.. ఓటీటీలో ఇంకేం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
కోట్లు సంపాదించే మృణాల్.. మరీ అంత చీప్ డ్రెస్సులు ధరిస్తుందా?
-
జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్‌లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్‌తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి) -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
సీతామహాలక్ష్మిని మరచిపోని మృణాల్ ఠాకూర్
తమిళసినిమా: బెంగాలీ భామ మృణాళ్ ఠాకూర్ ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం సీతారామం. తెలుగులో రూపొందిన ఈ చిత్రంలో ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్‌తో జత కట్టారు. చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. నాని సరసన నటించిన హాయ్ నాన్నా చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో మృణాళ్ ఠాకూర్‌కు పట్ట పగ్గాలు లేకుండా పోయాయనే చెప్పాలి. అలాంటి సమయంలో తమిళంలో ఏఆర్.రెహ్మాన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసిన ఫ్యామిలీస్టార్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇది ఈ అమ్మడి క్రేజ్‌కు కాస్త బ్రేక్ వేసినట్లే అవుతుంది. దక్షిణాదిలో నటించిన తొలి చిత్ర జ్ఞాపకాలను ఈ అమ్మడు ఇంకా మరువలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక బేటీ లో తనకు మిత్రుడు, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మాన్ అని పేర్కొన్నారు. సీతారామం చిత్రం షూటింగ్ సమయంలో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు. ఇక చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఒక చిత్రాన్ని పూర్తి చేసి వెళుతున్నప్పుడు హృదయం పగిలినట్లు అనిపిస్తుందన్నారు. తాను ఒక చిత్రంలోని పాత్రను ఇష్టపడి నటిస్తే ఆ పాత్రగా మారిపోతానని అన్నారు. అలా నటించిన పాత్రే సీతారామం చిత్రంలోని సీతామహాలక్ష్మి పాత్ర అని పేర్కొన్నారు. ఈ పాత్ర నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టిందని నటి మృణాళ్ ఠాకూర్ అన్నారు. కాగా అందాలారబోతకు ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడు త్వరలోనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
తెరపై చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో నిలిచిపోతుంది: మృణాల్ ఠాకూర్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ మృణాల్ ఠాకూర్ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. మృణాల్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు. ఆమెలా ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ... నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో కనిపించింది. ఓ కంపెనీకి సీఈవోగా అందరినీ మెప్పించింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
Mrunal Thakur: ఫ్యామిలీతో సీతారామం బ్యూటీ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌తో శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో 11 అవార్డులు గెలుచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని హాయ్ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అవార్డ్స్ దక్కడం పట్ల డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. -
అలియా భట్, మృణాల్ ఠాకూర్ ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కేది ఎవరికి..?
ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి, పార్టీని కూడా స్థాపించారు. 2026లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరొక చిత్రం మాత్రమే చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అది ఆయన నటించే 169వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించినా, చివరికి హెచ్.వినోద్ పేరు ఖరారైనట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈయన ఇంతకు ముందు ఖాకీ, తెగింపు, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ తరువాత కమలహాసన్ కథానాయకుడిగా చిత్రం చేయాల్సింది. దానికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయి. అయితే కారణాలేమైనా ఆ చిత్రం డ్రాప్ అయ్యింది. తాజాగా విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన చెప్పిన కథకు విజయ్ చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూ.10 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ హీరోయిన్ను ఎంపిక చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లిస్ట్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార లేదట. ఇకపోతే బాలీవుడ్ భామ అలియా భట్, మృణాళ్ ఠాకూర్, త్రిష, సమంతలలో ఒకరిని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. త్రిష, సమంత ఇప్పటికే విజయ్ సరసన నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ విజయ్‌తో జతకట్టని నటిని ఇందులో నటింపజేసే ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. నటి అలియాభట్, మృణాళ్ఠాకూర్ ఇప్పటి వరకూ నేరుగా తమిళ చిత్రాల్లో నటించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియాభట్, సీతారామం మృణాళ్ ఠాకూర్‌లో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ రెండు అనువాద చిత్రాలేనన్నది గమనార్హం. దీంతో బాలీవుడ్ భామ అలియాభట్ గానీ, మృణాళ్ ఠాకూర్ గానీ విజయ్ 69వ చిత్రంలో నటించే చాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిలో ఆ అదృష్టం ఎవరికి లభిస్తుందన్నదే తాజాగా జరుగుతున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మేలో వెలువడే అవకాశం ఉంది. -
ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు.. ? విజయ్ మేనమామ కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ సోషల్‌మీడియాలో మరోవైపు నెగెటివ్ ప్రచారం చేయడంపై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మేము కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదని ఆయన కోరారు. ఇలాంటి పద్ధతి కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా నెగెటివ్ ప్రచారంపై ఇలా రియాక్ట్ అయ్యారు. 'ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు.మీ నెగటివ్ బ్యాచ్‌కు వాడంటే (విజయ్ దేవరకొండ) ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా.. ?' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni) -
'అలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై దిల్ రాజు స్పందించారు. మే కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి వస్తుందని దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దిల్ రాజు మాట్లాడూతూ..'ఈ సినిమాను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కొంతమంది కావాలని నెగెటివ్ వైబ్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ స్ప్రెడ్ చేయడం బాధాకరం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా రీచ్ అయింది. మేము మంచి సినిమానే తీశాం. మంచిగా తీయలేదంటే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. నేను కలిసిన వాళ్లు చాలామంది బయట ఎందుకు ఇంత నెగెటివ్ ఉంది? అని అడుగుతున్నారు. కొందరు కాల్ చేసిన సినిమా చాలా బాగుంది అంటున్నారు. మంచి సినిమానా? కాదా? అనేది మీరు థియేటర్‌కు వస్తే మీకే తెలుస్తుంది.' అని అన్నారు. నెగెటివ్ ప్రచారంపై మాట్లాడుతూ.. 'కేరళలో కోర్ట్ మొదటి మూడు రోజుల వరకు రివ్యూ ఇవ్వకుండా తీర్పు ఇచ్చారట. అలాంటిది మన దగ్గర వస్తే బాగుంటుంది. లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకడం కష్టం. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది నిర్మాతలే. ఎంతో కష్టపడి చేసే సినిమాను ఆడియన్స్ థియేటర్‌కు రాకుండా చేయడమనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరిగితే పోను పోను ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక సినిమాలు ఏం తీస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ పద్ధతి ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు' అని అన్నారు. -
హాయ్ నాన్నకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. బెస్ట్ ఫీచర్ ఫిలింగా..
నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ "హాయ్ నాన్న". అంతర్జాతీయంగా "హాయ్ డాడ్"గా విడుదలైన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన "హాయ్ నాన్న" కథనం, నటీనటుల పర్ఫామెన్స్ న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. శౌర్యువ్ మాట్లాడుతూ.. 'ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్లో లభించిన ఈ గుర్తింపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యిందీ మూవీ. 'హాయ్ నాన్న'కి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, 'హాయ్ నాన్నా'కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను"అన్నారు. Hi Nanna celebrations continue across all corners! 💥💥#HiNanna released as #HiDad and received the prestigious award for Best Feature Film at the esteemed Athens International Art Film Festival in their March 2024 edition ❤️🔥 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN… pic.twitter.com/Yu2AtVdPTW — Vyra Entertainments (@VyraEnts) April 6, 2024 చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు.. డబ్బులు కూడా ఇవ్వలేదు.. కళ్లు తెరిపించారు! -
‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇది. (చదవండి: ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ) ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారు. కింద ఇచ్చిన ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోంది Families are celebrating #TheFamilyStar in theatres ❤️🔥 The team will now celebrate the FAMILY STARS in real life ❤️ Fill the form below and tell us who your FAMILY STAR is. And get ready for a surprise visit by the team ✨ 📜 https://t.co/tvTkPpZev7 Book your tickets for the… pic.twitter.com/mCgiwHAKJw — Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2024 -
Family Star Review: ‘ ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ
టైటిల్: ఫ్యామిలీ స్టార్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్ నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్ ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: ఏప్రిల్ 5, 2024 కథేంటంటే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫ్యామిలీ అంటే అతనికి చాలా ఇష్టం. ఇద్దరు అన్నయ్యలు..వదినలు..వారి పిల్లలు..బామ్మ ఇదే తన ప్రపంచం. సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెద్దన్నయ్య మద్యానికి బానిసవడం.. చిన్నన్నయ్య బిజినెస్ అంటూ ఇంకా స్థిరపడకపోవడంతో ఫ్యామిలీ ఆర్థిక భారానంత గోవర్ధనే మోస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా.. వచ్చిన జీతంతోనే సింపుల్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్న గోవర్ధన్ లైఫ్‌లోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వచ్చేస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో కూడా పడిపోతారు. ఈ విషయం ఇరుకుటుంబాలలో చెప్పి, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తున్న సమయంలో ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి వస్తుంది. ఆ పుస్తకం చదివి..ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు గోవర్ధన్. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది? ఇందు ఎవరు? గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇందు రాసిన పుస్తకం వీరిద్దరి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? ఉన్నంతలో సర్దుకొని జీవించే గోవర్దన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఇందు, గోవర్దన్‌లు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్‌గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది. అలాంటి కాంబినేషన్లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్ చేసే పరశురామ్.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్ సరిపోలేదనిపిస్తుంది. కథ పరంగా ఈ సినిమా చాలా చిన్నది. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడు.. తన సొంతప్రయోజనాల కోసం అతనికి దగ్గరైన ఓ యువతి.. ఇద్దరి మధ్య ప్రేమ.. గొడవలు.. చివరికి కలుసుకోవడం.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథ ఇదే. అంచనాలు లేకుండా వస్తే..ఈ కథకి అందరు కనెక్ట్ అవుతారు. కానీ ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి.. ప్రేక్షకులు అంతకు మించి ఏదో ఆశిస్తారు. దాన్ని దర్శకుడు అందించలేకపోయాడు. భారీ అంచనాలు ఉన్న సినిమాకు కావాల్సిన సరకు, సంఘర్షణ రెండూ ఇందులో మిస్ అయ్యాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ లుంగి కట్టుకొని తిరగడం.. ఉల్లి పాయల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడడం.. హీరోయిన్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించమని అడగడం.. చెంపదెబ్బలు తినడం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. ‘అతనికి కాస్త తిక్కుంటుంది.. పిచ్చి ఉంటుంది.. వెర్రి ఉంటుంది’ అంటూ హీరో గురించి హీరోయిన్ చేత చెప్పిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మిడిక్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో హీరో ఎంట్రీ సీన్‌తోనే చూపించాడు. ప్యామిలీ కోసం హీరో పడే పాట్లు.. అన్నయ్యలతో వచ్చే కష్టాలు చూపిస్తూనే ఇందు పాత్రను పరిచయం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత కూడా కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తినికి పెంచుతుంది. ద్వితియార్థం ఎక్కువగా అమెరికాలోనే సాగుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. మిడిల్ క్లాస్ యువకుడి మీద హీరోయిన్ థీసిస్ ఎందుకు రాసిందనేదానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ప్రీక్లైమాక్స్ బాగుంటుంది. పతాక సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. కథ, కథనాన్ని మరింత బలంగా రాసుకొని, హాస్యంపై ఫోకస్ పెడితే ‘ఫ్యామిలీ స్టార్’ మరో లెవెల్ విజయం సాధించేది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలీవరీ, మ్యానరిజం సినిమాకు ప్లస్ అయింది. కథంతా తన భుజాన వేసుకొసి సినిమాను ముందుకు నడిపించాడు. తెరపై చాలా అందంగా కనిపించాడు. ఇక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి ఇందుగా మృణాల్ చక్కగా నటించింది. తెరపై విజయ్, మృణాల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో బామ్మగా రోహిణి హట్టంగడి తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్, వాసుకి, అభినయతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. అద్భుతమైన పాటలతో మంచి బీజీఎం అందించాడు. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'ఫ్యామిలీ స్టార్' మూవీ ట్విటర్ రివ్యూ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్‌తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తారు అని ఆయన పట్ల మంచి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా పేరులోనే ఆ ఫ్లేవర్‌ను పెట్టారు. అందుకే ఈ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగింది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ -పరశురామ్ ఆ హిట్ మ్యాజిక్‌ను మ్యాజిక్ రిపీట్ చేశారా, లేదా అనేది నేడు తేలిపోయింది. ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో బయటకు వచ్చేసింది. ఇప్పటికే అమెరికాలో తొలి ఆట పూర్తి అయింది.ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ఆలోచింపచేసే సినిమా అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కానీ మాస్ కమర్షియల్ మైండ్‌సెట్‌తో థియేటర్‌కు వెళ్లకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. టైటిల్‌కు తగ్గట్లు కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ అని చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడని, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నాడు. ఈ సినిమాలో విజయ్, మృణాల్ జోడీ చాలా కలర్ఫుల్గా ఉందని తెలిపాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ పాత్రను చూస్తుంటే.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్రనే గుర్తుకొస్తుందని మరోక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని.. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చాడు. అక్కడక్కడ టీవీ సీరియల్ ఫీలింగ్ వస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు. సినిమా ఫస్టాఫ్ కమర్షియల్ అంశాలతో ప్లాన్ చేసిన దర్శకుడు..సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్ ట్రాక్‌ను ఎంచుకుని మంచిపని చేశాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయిని తెలిపాడు. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని చక్కగా చూపించారని ఆయన తెలిపాడు. గీత గోవిందం సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్, కామెడీ.. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఆ కట్టుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో కథ, డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త బాగున్నా.. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం కష్టమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం చెప్పుకొతగిన విధంగా లేదని పేర్కొన్నాడు. అనవసరమైన రిపీటెడ్ సీన్స్‌తో సినిమా ఓపికకు పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగిలిన నటీనటుల పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా లేదని చెబుతున్నారు. జయ్ అభిమానులతో పాటు మిడిల్ క్లాస్ అభిమానులకు బాగా నచ్చే సినిమా అని ఎక్కువ మంది చెబుతున్నారు. #FamilyStar Review : The first part of the film is enjoyable and has a strong commercial vibe. The second half picks up more of a playful tone . Emotion connects well with the audience Second Half > First Half Impressive performance by Rowdy @TheDeverakonda & @mrunal0801… pic.twitter.com/OM4PmclYHa — Let's X OTT GLOBAL (@LetsXOtt) April 4, 2024 #FamilyStar so flat and underwhelming. Avg 1st half, rubbish 2nd half. Nothing impresses and no standout plot points or performances. Boredom Max, went with low expectations still annoyed. VD with another poor choice. I'd rather watch Liger, super disappointed. Parasu b2b bombs👎 https://t.co/kPxDTCGLUW pic.twitter.com/5vbZM5C5zY — PushpaBhav (@ThaggedheeLe) April 4, 2024 #FamilyStar Decent 1st half My rating:⭐⭐⭐/5#FamilyStarReview#FamilyStarBookings #FamilyStarOnApril5th #FamilyStarArrivingTomorrow pic.twitter.com/h7Lmjt9fAV — Ronak yadav (@Prakash0617640) April 5, 2024 #FamilyStar feels like a rerun of Gemini TV's Radhika serials. Lead chemistry shines, but can't rescue the sinking ship. Patchy editing adds to the irritation. Seems like the director's main goal is a funded holiday in the US, courtesy of the producer..Skip the pain 😢 pic.twitter.com/B6ncLYzmnN — Swathiiii 🌸 (@Swathi_Prasad96) April 4, 2024 #FamilyStarReview : a film that is as clueless as tv serials background music. We have no words to talk about it. Especially the second half of the film is complete trash. We recommend you to watch #Projectz & #ManjummelBoys you know #FamilyStar is notworth pic.twitter.com/CY20tMG2pl — Theinfiniteview (@theinfiniteview) April 5, 2024 Show completed :- #FamilyStar #VijayDeverakonda My rating 2.5/5 Positives :- 1st half Fight scenes Mrunal thalur 😍😍😍 Negatives :- 2nd half too laggy No high moments Final verdict- One time watch with family pic.twitter.com/KrYjhaLLBP — venkatesh kilaru (@kilaru_venki) April 4, 2024 #FamilyStar is an inferior template rom-com family movie that has a few time-pass moments but no real emotional connection nor feel good moments. First half is underwhelming and feels like a serial until the pre-interval. Second half starts on a more fun note but quickly turns… — Venky Reviews (@venkyreviews) April 4, 2024 -
ఇదే నా చివరి సినిమా.. ఏడ్చేసిన మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి యువరాణి నూర్జహానే గుర్తుకువస్తుంది. సీతారామం సినిమాతో అంతటి గుర్తింపు, గౌరవం సంపాదించింది. తెలుగులో తొలి సినిమాతోనే తనను అంతగా ప్రేమిస్తున్న సినీప్రియులకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కాలేదు. అందుకే ఫ్యామిలీ స్టార్ ప్రీరిలీజ్ ఈవెంట్లో సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను బయటపెట్టింది. నా కన్నీళ్లు వృథా కాలేదు అయితే తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సీతారామం సినిమా షూటింగ్ సమయంలో మృణాల్ తెగ ఏడ్చేసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'భాష తెలియనప్పుడు ఈ సినిమా ఎలా చేయగలుగుతానా? అనిపించింది. కొన్నిసార్లయితే నా వల్ల కాక వదిలేద్దామనుకున్నాను, ఏడ్చేశాను. కానీ ఆ కన్నీళ్లు వృథాగా పోలేదు. సీతారామం వల్ల నేను ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. అయినా మొదటగా సినిమా కథ ముఖ్యం, భాషను ఎలాగోలా మేనేజ్ చేయొచ్చనుకున్నాను. కానీ భాష అర్థం కానప్పుడు ప్రతీది కష్టంగా అనిపిస్తుంది. తెలుగులో నా చివరి చిత్రం! అయితే చిన్నప్పటి నుంచి నన్ను నేను ఒక యువరాణిలా చూడాలనుకున్నాను. అందుకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదనిపించింది. ఈ మూవీ కశ్మీర్ షూటింగ్లో ఉన్నప్పుడు సీతారామం.. తెలుగులో నా ఫస్ట్ సినిమా మాత్రమే కాదు, చివరి సినిమా కూడా! అని దుల్కర్ సల్మాన్‌కు చెప్పాను. దీని తర్వాత ఇక్కడ సినిమాలు చేయనన్నాను. అతడు అలాగే చూస్తూ సరే, చూద్దాం అన్నాడు. ఇప్పుడు అన్ని భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నానంటే అందుకు అతడు కూడా ఓ కారణమే' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఓపక్క విలన్ వెయిటింగ్.. ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. -
స్టయిల్ అండ్ సారీ...ఆహా ఎంత అందం, ఎవరే వీరు? (ఫోటోలు)
-
అహంకారం అనుకున్నా సరే...
‘‘నా సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలనే నా కల నా నాలుగో సినిమా ‘గీత గోవిందం’తో నిజమైంది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. అనంతరం నేను నటించిన మరో సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను... కానీ, సాధించలేదు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తాను. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. ఇక ఈ సమ్మర్‌కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ‘ఫ్యామిలీ స్టార్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మన కుటుంబంలోని భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’’ అన్నారు. ‘‘మా సినిమా కథలోని భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు పరశురామ్ పెట్ల. -
అప్పటి వరకు ఎంత తిట్టినా పడతా: విజయ్‌దేవరకొండ
\విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్, విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండ, దిల్ రాజు అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గీతగోవిందం’ నా కెరీర్లో సూపర్ హిట్ మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను బీట్ చేసే మూవీ చేయలేదు. కెరీర్ ఆరంభంలో నేను నటించిన చిత్రం రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను. నా నాలుగో సినిమా గీతగోవిందంతోనే అది నిజమైంది. ఇటీవల నేను నటించిన ఓ సినిమా రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పా. కానీ అది జరగలేదు. ఆ సమయంలో చాలా మంది నన్ను కామెంట్ చేశారు. అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తావని విమర్శించారు. నేను అలా స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు. స్టేట్మెంట్స్ ఇచ్చి విజయం సాధించకపోవడం తప్పు. ఏదో ఒకరోజు ఆ స్థాయి కలెక్షన్స్ సాధిస్తా. అప్పటి వరకు మేరు ఎంత తిట్టినా పడతా. ఇప్పుడు కూడా నా మాటల్ని బలుపు అనుకుంటారు. కానీ.. నాపై నాకు ఉన్న నమ్మకం. అదే నమ్మకంతో చెప్తున్నా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటీ.. నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటీ.. వాళ్లు రూ.200 కోట్లు కొడితే మనం కొట్టలేమా? ఏంటీ.. నేను కొడితే మీలో ఒకరు కొట్టలేరా ఏంటీ.. ఇదో జర్నీ.. మన లైఫ్‌లో ఎన్నో చూడాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలు.. కిందకి లాగేవాళ్లని చూస్తుంటారు. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్లడమే జీవితం’ అని విజయ్ అన్నారు. -
తెలుగు వారికి 'సాష్టాంగ నమస్కారం' చేసిన మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్.. తొలి చిత్రం 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకుల మది దోచి ఇక్కడ వరుస సినిమాలు చేస్తుంది. మొదటి సినిమాతోనే తెలుగింటి అమ్మాయిగా తనను అంగీకరించిన టాలీవుడ్ ప్రేక్షకుల పట్ల తనూ ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకుల పట్ల తన ప్రేమ,గౌరవాన్ని చూపుతుంది. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ స్టేజీపైనే సాష్టాంగ నమస్కారం చేసింది. 'నన్ను అందరూ మీ తెలుగమ్మాయిగా అంగీకరించారు కాబట్టే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ప్రేమను మీరు నాపై చూపిస్తున్నారు. మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో కలిగి ఉంటాను. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది. ఫ్యామిలీస్టార్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో 'ఇందు'గా మీ ముందుకు వస్తున్నాను. మొదటి 15 రోజులు ఈ పాత్ర చాలా ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరని అనిపించింది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఫ్యామిలీస్టార్‌తో నాకు ఆ అవకాశం దక్కింది. అలాగే దిల్ రాజు గారితో ఇది నాకు రెండో సినిమా.. అవకాశం వస్తే మూడో సినిమా కూడా చేయాలని ఉంది. ఈ సినిమాను మా ఫ్యామిలీస్టార్ అయిన మా నాన్నగారికి డెడికేట్ చేస్తున్నాను.' అని మృణాల్ పేర్కొంది. Taking Bow Head!! Thank you audiences, you all made me Telugu Ammai 😍 - #MrunalThakur #FamilyStar #VijayDeverakonda pic.twitter.com/faUXdZdUtz — Telugu Bit (@telugubit) April 2, 2024 -
ఆర్థిక ఇబ్బందులు ఉంటే 'దిల్ రాజు' సాయం చేశారు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. గీతా గోవిందం తర్వాత విజయ్‌తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. దిల్ రాజు గురించి ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు.కొవిడ్ సమయంలో విజయ్‌కు దిల్ రాజు చేసిన సాయాన్ని బహిరంగంగానే ఇలా చెప్పాడు. 'నాతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాకు కూడా ఆయన బ్యానర్లో సినిమా చేయాలనే కోరిక ఉంది. అందుకోసం కొన్ని కథలు కూడా పంపించారు. కానీ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం తీసుకుంది. ఇంతలో కొవిడ్ రావడంతో ఆ సమయంలో నాకు కొంత డబ్బు అవరసరం వచ్చింది. అప్పుడు దిల్ రాజు గారే అడ్వాన్స్ రూపంలో సాయం చేశారు. అప్పటికి సినిమా కూడా ఒప్పుకోలేదు.' అని ఆయన అన్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'కేరింత' కోసం ఆడిషన్స్‌కు వెళ్లితే తనను సెలెక్ట్ చేయలేదని విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నాడు. అందుకు తాను బాగా హర్ట్ అయినట్లు ఆయన చెప్పారు. అదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం దిల్‌రాజుతోనూ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ సమయం నుంచి కరెక్ట్ కథ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు ఫ్యామిలీస్టార్‌తో సెట్ అయినట్లు విజయ్ అన్నారు. ఫ్యామిలీస్టార్ తర్వాత విజయ్‌తో మరో సినిమా తీస్తానని దిల్ రాజు ప్రకటించారు. చాలారోజుల నుంచి విజయ్‌తో భారీ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేసినట్లు దిల్ రాజు అన్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ పెట్టుకున్నానని ఆయన అన్నారు. -
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ స్టిల్స్
-
మృణాల్ ఠాకూర్ మెరుపులు.. హార్ట్ బీట్ పెంచుతున్న ఫ్యామిలీ స్టార్ భామ (ఫొటోలు)
-
కథ వినగానే మా నాన్న గుర్తొచ్చారు
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్‌కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్‌కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్‌కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్‌కి ఇస్తాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్. -
Family Star Press Meet: ‘ఫామిలీ స్టార్’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
'ఫ్యామిలీ స్టార్' కోసం విజయ్‌కి భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..?
‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఒకపక్క దిల్ రాజు, మరోపక్క విజయ్..ఇద్దరు సినిమా ప్రచారంలో బీజీ అయ్యారు. విజయ్‌కి ఈ సినిమా విజయం చాలా అవసరం. అందుకే ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలా సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం. అలాగే మీడియా ఫ్యామిలీస్‌తో కలిసి ఓ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. ఇలా విభిన్నమైన పద్దతుల్లో ప్రచారం నిర్వహించి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రూ. 50 కోట్ల బడ్జెట్ విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో గీతగోవిందం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ తర్వాతనే అటు పరశురాం, ఇటు విజయ్ కెరీర్ ఊపందుకుంది. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ. 50 కోట్ల బడ్జెట్ అయిందని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. వర్కింగ్ డేస్ ఎక్కువ అవ్వడం వల్ల బడ్జెట్ పెరిగిందట. ‘ఖుషీ’ కంటే ఎక్కువే ఈ సినిమాకుగాను విజయ్ దేవరకొండ భారీగానే పారితోషికాన్ని పుచ్చుకున్నాడట. మొత్తంగా రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది గత చిత్రం ఖుషీ కంటే ఎక్కువ. ఖుషీ చిత్రానికి విజయ్ రూ.12 కోట్లు తీసుకున్నాడు. అయితే ఆ చిత్రం ఓ మోస్తరు విజయం మాత్రమే అందుకుంది. అంతకు ముందు వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ అయింది. అయినా కూడా విజయ్ మార్కెట్ పడిపోలేదు. అందుకే రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడలేదట దిల్ రాజు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో సోలోగా రిలీజ్ అవుతున్న ఏకైక పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు. తొలుత తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే అయింది. అన్ని ఏరియాల్లో కలిసి రూ. 45 కోట్ల మేర బిజినెస్ చేసిందట. గీతగోవిందం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కారణంగానే విజయ్ ఫ్లాప్స్‌లో ఉన్నా.. భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ అయింది. -
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనిపిస్తుంది: మృణాల్ ఠాకూర్
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుందంటారు. అలా మృణాల్ ఠాకూర్ పుష్కరకాలంగా కష్టపడితే సీతారామం సినిమాతో రెండేళ్ల క్రితం బిగ్ బ్రేక్ అందుకుంది. ఈ మూవీ తర్వాతే తన ఫ్యాన్‌బేస్ పెరిగింది.. అవకాశాలూ పెరిగాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది మృణాల్. రిలేషన్లో? ఆమె మాట్లాడుతూ.. సినిమాలో నా పాత్రను ప్రేమిస్తూ, నా వర్క్‌ను గుర్తిస్తే నేను పడ్డ కష్టమంతా మర్చిపోతాను. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే నావైపు ఏదైనా తప్పుందేమో చెక్ చేసుకుని సరిచేసుకుంటాను. ప్రేమ విషయానికి వస్తే.. ఒకసారి ప్రేమలో పడ్డాక ఆ లవ్‌ను మరింత పెంచేందుకు ప్రయత్నించాలి. ఇంకా దేనిగురించీ ఆలోచించకూడదు. అనుబంధం, నమ్మకమనేది రెండువైపులా ఉండాలి. అయితే ఆ బంధం వర్కవుట్ కానప్పుడు వదిలేయడమే మంచిది. నా విషయానికి వస్తే నేను ఏ రిలేషన్‌షిప్‌లోనూ లేను. నాకు ప్రేమలో పడాలనుంది. సెలబ్రిటీ అయితే అదే ప్రాబ్లమ్.. సెలబ్రిటీ అవడం వల్ల కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. కుటుంబానికి అవసరమైనప్పుడు మనం వారితో ఉండలేము. ఎక్కడో షూటింగ్ బిజీలో ఉంటూ ఫ్యామిలీని మిస్ అవుతాం. కొన్నిసార్లు నాక్కూడా సాధారణ జీవితాన్ని గడపాలని అనిపిస్తుంటుంది. ఇరవైలో పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కని వారితో కలిసి డిన్నర్‌కు వెళ్తే బాగుండనిపిస్తుంది. సెలబ్రిటీగా ఓ గుడికి కూడా ఈజీగా వెళ్లలేము. నాకున్న పెద్ద భయం మరణం. దాని గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది. నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుందో? అని ఆందోళనగా ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో! -
గుర్తుండే ఫ్యామిలీ స్టార్
‘‘ఇరవైఒకటేళ్ల కింద ఏప్రిల్ 5న ‘దిల్’ సినిమా నిర్మాతగా ‘దిల్ రాజు’గా మారాను. 21 ఏళ్ల తర్వాత ఇదే తేదీన మా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ అవుతోంది. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే కథతో ఈ చిత్రం రూపొందింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ‘దిల్’ రాజు ఇంకా మాట్లాడుతూ – ‘‘తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ (ప్రేక్షకులు) ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్, విజయ్ కాంబి నేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ సమ్మర్లో అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని, విజయ్ దేవరకొండను, మృణాల్ ఠాకూర్‌ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు’’ అని పరశురామ్ అన్నారు. -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
Family Star Trailer: దేవుడా.. ఉన్నదాన్ని చెడగొట్టకు..
గీత గోవిందం.. ఆరేళ్ల కింద వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అంతేనా.. మ్యూజికల్ హిట్ కూడా! ఇన్నాళ్ల తర్వాత గీతా గోవిందం కాంబో రిపీట్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకుడిగా, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫ్యామిలీ స్టార్ తెరకెక్కింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కల్యాణి.. వచ్చా.. వచ్చా పాట జనాలకు ఇట్టే కనెక్ట్ అయింది. గురువారం ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్వామీ చెడగొట్టకు 'స్వామీ, నువ్వు కొత్తగా నా లైఫ్‌లో బ్రేకులేమీ ఇవ్వాల్సిన పని లేదు. ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు' అని దేవుడిని హీరో వేడుకోవడంతో ట్రైలర్ మొదలవుతుంది. హీరోయిన్.. హీరో కుటుంబంతో కలిసిపోవడం.. తర్వాత సమస్యలు ఎదురవడం.. ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని చెప్పిన హీరోయే చివరికి హీరోయిన్ వెనకాల తిరగడం సరదాగా అనిపిస్తాయి. భయపడాలి.. ఇంకోసారి.. ఎవరైనా.. చులకనగా మాట్లాడాలంటే.., నేను నీ లైఫ్‌లోకి రావడమే ప్రాబ్లమ్.. వంటి డైలాగ్స్ బాగున్నాయి. చెంప చెళ్లుమనిపించింది ట్రైలర్ ముగింపులో హీరో చెంప చెళ్లుమనిపించే సీన్ మాత్రం హైలైట్! ట్రైలర్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉందంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. మరి థియేటర్లలో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. చదవండి: సినిమా మొత్తం ఒకే పాత్ర... ఓటీటీలో తెలుగు హారర్ మూవీ