‘వాట్ నెక్ట్స్’ అంటూ కొందరు స్టార్ హీరోయిన్ల అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. కారణం ఆ కథానాయికలు తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకపోవడమే. అభిమాన నాయికలు వేరే భాషల్లో సినిమాలు చేసినా తెలుగు తెరపై కనిపించక΄ోతే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి నిరుత్సాహంగానే ఉంటుంది. మరి... టాలీవుడ్‌లో కొత్త సినిమా అంగీకరించని ఆ తారల గురించి తెలుసుకుందాం.
మా ఇంటి బంగారం ఏమైంది?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు సమంత. టాలీవుడ్‌లో మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి హీరోలకి జోడీగా నటించి సందడి చేశారామె. అలాగే ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అలరించారీ బ్యూటీ. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రంపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఖుషి’ 2023 సెపె్టంబరు 1న విడుదలైంది.
ఈ మూవీ రిలీజై ఏడాది దాటిపోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత. అయితే ‘మా ఇంటి బంగారం’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. ఈ సినిమాని తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు కూడా. తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న విడుదల చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలిసింది.
అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. అలాగే సమంత బర్త్ డే తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌పై ఉందా? లేదా అనే సందేహం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రం ఏది? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అయితే హిందీలో సమంత నటించిన ‘సిటాడెల్: హనీ–బన్నీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సమంత.
అక్కడ ఫుల్... ఇక్కడ నిల్
టాలీవుడ్‌లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారామె. ఆ తర్వాత ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోల సరసన సినిమాలు చేశారు పూజా హెగ్డే. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు పూజ. ఈ మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో మెరిశారు. అయితే ‘ఆచార్య’ విడుదలై రెండున్నరేళ్లు అవుతున్నా హీరోయిన్‌గా మరో తెలుగు చిత్రం కమిట్ కాలేదు పూజా హెగ్డే.
ఈ గ్యాప్‌లో హిందీ సినిమాలు చేశారామె. షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ‘దేవ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ 69వ చిత్రం, సూర్య 44వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ కాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు.
మహానటి అక్కడ బిజీ
‘నేను శైలజ’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు కీర్తీ సురేశ్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా 2016 జనవరి 1న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘నేను లోకల్ (నాని), అజ్ఞాతవాసి(పవన్ కల్యాణ్), మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే (నితిన్), గుడ్ లక్ సఖి, సర్కారువారి పాట (మహేశ్ బాబు), దసరా (నాని), భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె.
మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేశ్. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ‘భోళా శంకర్’ సినిమాలో హీరో చిరంజీవికి చెల్లెలుగా నటించారు కీర్తి. ఆ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఆ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రానికి కీర్తీ సురేష్ పచ్చజెండా ఊపలేదు.
అయితే ఈ గ్యాప్‌లో తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. అంతేకాదు.. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తెలుగులో కీర్తీ సురేష్ నటించనున్న సినిమా ఏంటి? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
బేబమ్మకి గ్యాప్
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాని (శ్యామ్ సింగరాయ్), నాగచైతన్య(బంగార్రాజు, కస్టడీ), రామ్ (ది వారియర్), నితిన్ (మాచర్ల నియోజక వర్గం), సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి), శర్వానంద్(మనమే) వంటి యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా ఈ ఏడాది జూన్ 7న రిలీజైంది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా తెలుగులో ఇప్పటికీ మరో సినిమా కమిట్ కాలేదామె.
టొవినో థామస్ హీరోగా నటించిన ‘ఏఆర్‌ఎమ్’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతీ శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెడుతున్నారు. వరుసగా మూడు సినిమాలు (వా వాతియార్, లవ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ, జీనీ) వంటి చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్నారీ బ్యూటీ. కోలీవుడ్‌లో బిజీగా ఉండటంతో తెలుగులో ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదా? అనేది వేచి చూడాలి.
నాలుగో సినిమా ఏంటి?
తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు మృణాళ్ ఠాకూర్. ‘సీతా రామం’ (2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారామె. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రతో ఆకట్టుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజైంది. ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటినా ఆమె నటించనున్న మరో తెలుగు చిత్రంపై స్పష్టత లేదు. ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాకి కమిట్ కాకపోయినా బాలీవుడ్‌లో మాత్రం దూసుకెళుతున్నారు.
ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మృణాళ్. అయితే రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్‌ఎల్ 25’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. మృణాళ్ ఠాకూర్ తర్వాతి తెలుగు సినిమా ఏంటి? అంటే వేచి చూడాలి. ఈ కథానాయికలే కాదు... మెహరీన్, డింపుల్ హయతి వంటి మరికొందరు హీరోయిన్లు నటించనున్న కొత్త తెలుగు సినిమాలపైనా స్పష్టత లేదు.
-డేరంగుల జగన్
Comments
Please login to add a commentAdd a comment