సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్! | Mrunal Thakur Reveals Her Effort For Pooja Meri Jaan Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: చాలాసార్లు ఆడిషన్స్ ఇచ్చా.. చెప్పాలంటే బ్రతిమాలా!

Published Thu, Aug 1 2024 12:45 PM | Last Updated on Thu, Aug 1 2024 1:30 PM

 Mrunal Thakur Reveals Her Effort For Pooja Meri Jaan Movie

హీరోయిన్లకు ఒక్కసారి స్టార్ హోదా వస్తే భూమ్మీద నిలబడతారా అంటే డౌట్. సకల సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారని ఇండస్ట్రీలో టాక్. కానీ 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ మాత్రం ఓ మూవీలో పాత్ర కోసం తెగ కష్టపడిందట. కరెక్ట్‌గా చెప్పాలంటే తనకు రోల్ ఇవ్వమని ప్రాధేయపడిందట. ఓ సమయంలో నిర్మాతలతో గొడవ కూడా పడిందట.

టీవీ సీరియల్‌ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ 30, సీతారామం, హాయ్ నాన్న, జెర్సీ (హిందీ) సినిమాలతో సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు కంటే హిందీపైనే ఎక్కువ కాన్సట్రేట్ చేసింది. ఈమె చేతిలో సన్ ఆఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్ అనే హిందీ చిత్రాలు ఉన్నాయి. అయితే 'పూజా మేరీ జాన్' కోసం తను ఎంతలా తెగించాననే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఫుడ్ విషయంలో ప్రభాస్‌ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్)

'ఈ సినిమా తీస్తున్నారని తెలిసి చాలాసార్లు ఆడిషన్స్, స్క్రీన్ టెస్టులు ఇచ్చాను. చెప్పాలంటే హీరోయిన్ పాత్ర ఇవ్వమని అడుకున్నాను. ఇంతలా చేయడానికి కారణం.. ఆ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంది. ఓసారి ఈ రోల్ కోసం మరో నటిని పరిశీలిస్తున్నారని తెలిసి నిర్మాతలతోనూ గొడవపడినంత పనిచేశాను. ఎందుకో ఆ పాత్రకు అంతలా కనెక్ట్ అయిపోయాను' అని మృణాల్ చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయ్ దేవరకొండతో 'ద ఫ్యామిలీ మ్యాన్'లో కనిపించిన మృణాల్.. ఫెయిల్యూర్ అందుకుంది. రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ 'కల్కి'లో అతిథి పాత్ర చేసింది. ప్రస్తుతానికి అయితే తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోవట్లేదు. హిందీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement