Sita Ramam Movie
-
ఒక్క చేతికే రెండు డజన్ల గాజులు.. మృణాల్ కొత్త ఫ్యాషన్ (ఫొటోలు)
-
ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్
వయసొచ్చిన తర్వాత చాలామంది ప్రేమలో పడుతుంటారు. ఇది సాధారణమైన విషయమే. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే ప్రేమ ఎల్లకాలం ఉండదన్నట్లు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా బయటపెట్టరు. కానీ 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ మాత్రం తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పింది.'సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు వచ్చివెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది. అంతెందుకు నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా. కానీ నటితో డేటింగ్ అతడికి ఎందుకో ఇష్టం లేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయింది. అయితే నన్ను చేసుకునేవాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి అయ్యిండాలి' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఇప్పటివరకు తన జీవితంలో బ్రేకప్స్ జరిగాయి కానీ మరీ బాధపడిపోయేంతలా ఏం కాలేదని మృణాల్ చెప్పింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని పేర్కొంది. మరి మృణాల్ ఠాకుర్ మనసు గెలుచుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో చూడాలి?సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకుర్.. హిందీలో పలు సినిమాలు చేసింది. 'సీతారామం' మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా హిందీపైనే ఉంది. తెలుగులో ఇప్పుడప్పుడే మూవీ చేస్తుందో లేదో డౌటే?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం) -
సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!
హీరోయిన్లకు ఒక్కసారి స్టార్ హోదా వస్తే భూమ్మీద నిలబడతారా అంటే డౌట్. సకల సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారని ఇండస్ట్రీలో టాక్. కానీ 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ మాత్రం ఓ మూవీలో పాత్ర కోసం తెగ కష్టపడిందట. కరెక్ట్‌గా చెప్పాలంటే తనకు రోల్ ఇవ్వమని ప్రాధేయపడిందట. ఓ సమయంలో నిర్మాతలతో గొడవ కూడా పడిందట.టీవీ సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ 30, సీతారామం, హాయ్ నాన్న, జెర్సీ (హిందీ) సినిమాలతో సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు కంటే హిందీపైనే ఎక్కువ కాన్సట్రేట్ చేసింది. ఈమె చేతిలో సన్ ఆఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్ అనే హిందీ చిత్రాలు ఉన్నాయి. అయితే 'పూజా మేరీ జాన్' కోసం తను ఎంతలా తెగించాననే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఫుడ్ విషయంలో ప్రభాస్‌ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్)'ఈ సినిమా తీస్తున్నారని తెలిసి చాలాసార్లు ఆడిషన్స్, స్క్రీన్ టెస్టులు ఇచ్చాను. చెప్పాలంటే హీరోయిన్ పాత్ర ఇవ్వమని అడుకున్నాను. ఇంతలా చేయడానికి కారణం.. ఆ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంది. ఓసారి ఈ రోల్ కోసం మరో నటిని పరిశీలిస్తున్నారని తెలిసి నిర్మాతలతోనూ గొడవపడినంత పనిచేశాను. ఎందుకో ఆ పాత్రకు అంతలా కనెక్ట్ అయిపోయాను' అని మృణాల్ చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయ్ దేవరకొండతో 'ద ఫ్యామిలీ మ్యాన్'లో కనిపించిన మృణాల్.. ఫెయిల్యూర్ అందుకుంది. రీసెంట్గా వచ్చిన ప్రభాస్ 'కల్కి'లో అతిథి పాత్ర చేసింది. ప్రస్తుతానికి అయితే తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోవట్లేదు. హిందీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్) -
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' రికార్డ్.. మొత్తంగా ఎన్ని వచ్చాయంటే?
2023 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులని తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాదిలో నాలుగు భాషల్లో గతేడాదితో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఓవరాల్‌గా అవార్డులని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. అలానే సీతారామం సినిమాకు 5, విరాటపర్వం 2, 'భీమ్లా నాయక్'కి ఓ అవార్డు సాధించాయి. గతంలో 'ఆర్ఆర్ఆర్'కి రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ ఏదో ఓ అవార్డ్ వస్తూనే ఉండటం విశేషం. ఇకపోతే ఎవరెవరికీ ఏ విభాగంలో అవార్డు దక్కిందో దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.(ఇదీ చదవండి: సంప్రదాయబద్ధంగా నటి వరలక్ష్మి వివాహం)ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు)ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామంఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ నటి - నందితా దాస్ (విరాటపర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) - కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) - చిన్మయి (సీతారామం- ఓ ప్రేమ)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది) -
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్
'సీతారామం' పేరు చెప్పగానే గుర్తొచ్చేది మృణాల్ ఠాకురే. ఎందుకంటే అప్పటివరకు హిందీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఈ ఒక్క మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఆ తర్వాత 'హాయ్ నాన్న'తో మరో హిట్ అందుకుంది. 'ఫ్యామిలీ స్టార్' మాత్రం ఈమెకు దెబ్బేసింది. దీంతో కొత్త మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రీసెంట్గా 'కల్కి'లో అతిథి పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాన్స్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)'నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయతీగా ఉండటం, మనపట్ల శ్రద్ధ చూపించడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండటం గొప్ప రొమాంటిక్ చర్య అనేది నా ఉద్దేశం. చిన్న టచ్ చాలు' అని ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈమె హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో. మరోవైపు పలువురు తెలుగు దర్శకనిర్మాతలు కూడా ఈమెని అప్రోచ్ అవుతున్నప్పటికీ.. హిందీపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే తెలుగులో ఇప్పటప్పట్లో మరో మూవీ చేయడం కష్టమే.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ) -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్‌బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో ప్రారంభం అయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచు లక్ష్మీ ప్రధాన వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయింది. నేడు సెప్టెంబర్ 16న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమాలో దుమ్ములేపిన RRR, సీతా రామం ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో 11 నామినేషన్స్‌లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతా రామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం: సీతా రామం * ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR) * ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR) * ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్) * ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద) * ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR) * ఉత్తమ గేయ రచయిత 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (RRR) * ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం * ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట కోసం * ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ - 2) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR) * ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార) * సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2) * ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2) * ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్) * ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్ * ప్రామిసింగ్ న్యూకమ్: వినోద ప్రపంచంలో భవిష్యత్‌లో మంచి స్టార్‌గా గుర్తింపు పొందిన గణేష్ బెల్లంకొండ -
ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
సీతారామం సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. (ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి) దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్‌కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
ఉత్తమ చిత్రంగా 'సీతారామం'.. మృణాల్‌ను వరించిన అవార్డ్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెంప్పించారు. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్) ఉత్తమ వెబ్ సిరీస్‌గా విభాగంలో 'జూబ్లీ' ఉండగా ఉత్తమ డాక్యుమెంటరీగా 'టు కిల్ ఏ టైగర్' నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. మోహిత్ అగర్వాల్ (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ మేల్ కాగా పృథ్వీ కొననూర్కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు. View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లోనూ కనిపించింది. సీతారామం చిత్రంలో చాలా పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం తెలుగులో ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ఈ ప్రయాణంలో మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ సీతారామం మూవీ వీడియోను పంచుకుంది. సీతారామం విడుదలై ఈ రోజుకు ఏడాది పూర్తి కావడంతో మృణాల్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. తనను తెలుగు అమ్మాయిలా భావించి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మృణాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ప్రియమైన ప్రేక్షకులారా.. ఇది నా మొదటి తెలుగు సినిమా. మీరందరూ నాపై కురిపించిన ప్రేమ.. నా కలలకు మించిపోయింది. మీరు నన్ను మీ తెలుగు అమ్మాయిలా అంగీకరించారు. ఈ అందమైన ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మరిన్నీ విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని అలరిస్తానని మాట ఇస్తున్నా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. సీత ఉత్తమ వెర్షన్‌ని తీసుకురావడంలో నాకు సహాయం చేసినందుకు హను రాఘవపూడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొత్తం అనుభవాన్ని ఎంత చిరస్మరణీయం చేసినందుకు దుల్కర్ సల్మాన్‌కు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఎప్పటికీ మా సీత నువ్వే కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న 'రసవతి'..!) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌తో ఐ యామ్ నాటీ అని నిరూపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఓపెన్‌గానే ఉంటానని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) మృణాల్ మాట్లాడుతూ.. 'ముందుగా దేవునికి ధన్యవాదాలు. నేను రిలేషన్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే జనరేషన్లో పుట్టా. గతంలో నా బ్రేకప్‌ల గురించి మాట్లాడా. దీనివల్ల నా అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకుంటున్నారని భావిస్తున్నా. ప్రస్తుత రోజుల్లో నా చుట్టూ భాగస్వామి లేదా ప్రేమికుడి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నా.' అని అన్నారు. భాగస్వామిని గౌరవించాలి లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా సరే మన పార్ట్నర్ మనోభావాలను గౌరవించాలి. మనకు కాబోయే భాగస్వామి తన రిలేషన్ ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే అలాగే ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా.. కానీ నా భాగస్వామి ఈ పరిశ్రమకు చెందిన వారు కాకపోవచ్చు. అప్పుడు అతను తన రిలేషన్‌ను పబ్లిక్‌గా ఉంచకూడదనుకుంటే.. అతని గురించి నేను ఎక్కడా చర్చించను.' అని అన్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని అనుకోవడం లేదని అన్నారు మృణాల్.. ఎందుకంటే ప్రస్తుతం నేను చాలా మెరుగైనస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తమ రిలేషన్స్ గురించి ఒపెన్‌గా మాట్లాడిన నీనా గుప్తా , అంగద్ బేడీ, కరీనా కపూర్ ఖాన్, నేహా దుపియాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. కాగా.. మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ఒక చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..! ) -
హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. ఈ సినిమా సక్సెస్ అనంతరం తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మృణాల్ హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుందనే టాక్ వినిపించింది. అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కొన్నాళ్ల పాటు ఇక్కడే స్థిరపడాలని డిసైడ్ అయ్యిందని, అందుకే లగ్జరీ ఇల్లు కొన్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించింది మృణాల్ ఠాకూర్. అడ్రస్ చెప్తే నేను కూడా వచ్చి నా ఇంటిని చూసొస్తా అంటూ ఫన్నీగా బదులిచ్చింది. అయితే హైదరాబాద్ లాంటి ప్లేస్‌లో ఎవరికి మాత్రం సెటిల్ అవ్వాలని ఉండదు అంటూ తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఇల్లు తీసుకోకపోయినా భవిష్యత్తులో తప్పకుండా కొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది మృణాల్. -
‘సీతారామం 2’ కోసం వెయిటింగ్: మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు సీతారామంకు ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరి మనసును తాకిన ఈ అందమైన ప్రేమ కావ్యంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే అంతటి ఆదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓ ఇంటర్య్వూలో ఈ మూవీకి సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సందర్భంగా వచ్చినప్పుడల్లా సీతారామం టీంకు మూవీ స్వీకెల్‌పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన మృణాల్‌కు సీతారామం సీక్వెల్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ చిట్‌చాట్‌లో ఓ అభిమాని ‘సీతా రామంకు’ సీక్వెల్ ఉందా? అని మృణాల్‌ను అడిగారు. చదవండి: భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై మెగా డాటర్ క్లారిటీ? ఆ ప్రశ్నకు మృణాల్ స్పందిస్తూ.. ‘సీతారామం’ నిజంగా అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. కానీ, ఈ మూవీ సీక్వెల్ ఉంటే బాగుండు అనుకుంటున్నా. దానికి కోసం నేరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సమాధానం ఇచ్చింది. అలాగే మరో అభిమాని తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పాలని కోరగా.. ‘అదిగో మళ్లీ మొదలు..’ అని ‘సీతా రామం’ డైలాగ్ చెప్పింది. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ టీంను మిస్ అవుతున్నానంది. ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు గతంలో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మృణాల్ ట్వీట్‌తో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. -
ట్రెండింగ్‌లో సీతారామం బ్యూటీ.. న్యూ లుక్ ఫోటోలు వైరల్
-
మృణాల్ ఠాకూర్ బోల్డ్ ఫోటోషూట్.. నెటిజన్స్ ఫైర్!
సీతారామం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా.. సీతారామంతోనే క్రేజ్ తెచ్చుకుంది. మొదటి బుల్లితెరపై మెప్పించిన నటి ఆ తర్వాతే సినిమాల్లో అడుగుపెట్టింది. సీతారామం తర్వాత ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే తాజాగా మృణాల్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి. బ్లూ బికినీలో ఉన్న పిక్స్ కుర్రకారు మతిపొగేట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం వేకేషన్లో ఉన్న స్టన్నింగ్ భామ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఫోటోలు చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తగా.. సీతా రామం చిత్రంలోని ఆమె సీత పాత్రను ప్రస్తావిస్తూ.. ఓ నెటిజెన్ "RIP సీతా మహాలక్ష్మి" అంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ 'సీతా మహాలక్ష్మి మరింత హీట్ పుట్టిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. మీరు బికినీలో కంటే చీరలోనే చాలా అందంగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఏమైంది మేడమ్.. మీ నుంచి ఇలాంటివి మేం ఆశించడం లేదు. మా హృదయాలను విచ్ఛిన్నం చేశారంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్‌లు కాగా.. మృణాల్ ఇటీవల 'సెల్ఫీ'లో అక్షయ్ కుమార్ సరసన 'కుడియే నీ తేరి వైబ్' అనే ప్రత్యేక సాంగ్‌లో కనిపించారు. దుల్కర్ సల్మాన్ నటించిన పాన్-ఇండియా మూవీ 'సీతా రామం'లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మృణాల్ ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి 'గుమ్రా'లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న సినిమాల్లో విడుదల కానుంది. నటి ఇషాన్ ఖట్టర్‌తో 'పిప్పా' కూడా వరుసలో ఉంది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
మా పేరెంట్స్‌కి ఇష్టం లేదు.. అయినా ఇండస్ట్రీకి వచ్చా: మృణాల్
మృణాల్ ఠాకూర్ కెరీర్ సీతారామం సినిమాకి ముందు, ఆ తర్వాత అన్నట్లు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లుగా చేసిన దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్లకు ఈ సినిమా మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్‌కు అన్ని భాషల్లోనూ సూపర్క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ డ్యూటీ తాజాగా ఓ వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె ఏమందంటే.. 'నిజానికి నేను సినిమాల్లోకి రావడం మా పేరెంట్స్‌కి అసలు ఇష్టం లేదు.మాది మరాఠీ ఫ్యామిలీ. వాళ్లకు ఇండస్ట్రీ గురించి అస్సలు తెలియదు. దీంతో ఏం జరుగుతుందో అని చాలా భయపడ్డారు. సీరియల్స్‌లో నటిస్తూ అక్కడ గుర్తింపుతో నేను సినిమాల్లోకి వచ్చాను. నేను ఎంచుకున్న పాత్రలు, సినిమాలు నాకు మంచి పేరును తీసుకొస్తున్నాయి. ఇప్పుడు నా ఎదుగుదలను చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకంటే సంతోషం ఏముంది' అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. -
ఆల్జీబ్రాకు బదులు ‘హంతకుడు’ స్టోరీ రాశా.. ‘సీతారామం’ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సీతారామం’తో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి మన బిడ్డే. కొత్తగూడెం గణేష్ టెంపుల్ గల్లీలో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలో అందాల రాక్షసితో ప్రయాణం మొదలెట్టి ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్టులో చోటు సాధించారు. తాను చదివిన కాలేజీలో ఏర్పాటు చేసిన ఫంక్షన్లో పాల్గొనేందుకు చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్తగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. కొత్తగూడెంతో తనకున్న అనుబంధం నెమరు వేసుకున్నారు, ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. అసలు సినిమా ఆలోచనే లేదు.. నాన్న సన్యాసిరావు సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ సూర్యకుమారి కోర్టులో ఎంప్లాయిగా ఉండేవారు. మా ఫ్యామిలీ గణేష్ టెంపుల్ వెనుక గల్లీలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏరియాలో ఉండేది. టెన్త్ వరకు రామవరం సింగరేణి స్కూల్లో, ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజీలో, డిగ్రీ వివేకవర్థిని కళాశాలలో చదివాను. చిన్నప్పుడు అసలు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీదనే ధ్యాస ఉండేది. సినిమాలు చూడటం కూడా తక్కువే. స్వాతికిరణం చూశాక.. చిన్నతనంలో ఓసారి మా అమ్మ దుర్గా టాకీస్‌లో స్వాతికిరణం సినిమాకు తీసుకెళ్లింది. ఆ వయసులో ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి వరకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేని నాకు ఆ సినిమాతో ఒక్కసారిగా సినిమాకి దర్శకుడు అనే వ్యక్తి ఎవరు ? అతను ఎలా ఆలోచిస్తాడు అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. వెంటనే స్వాతికిరణం దర్శకుడు కే.విశ్వనాథ్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఎంజీ రోడ్లో సంతోష్ వీడియో లైబ్రరీ నుంచి విశ్వనాథ్ గారి సినిమా క్యాసెట్లు అద్దెకు తీసుకెళ్లి సినిమాలో ఇంకో కోణంలో చూడటం మొదలెట్టాను. శంకరాభరణం సినిమా లెక్కలేనన్ని సార్లు చూశాను. అలా సినిమాలపై ఇష్టం పెరుగుతూ పోయింది. అయినప్పటికీ బుద్ధిగా చదువుతూనే ఎంసీఏలో ఉండగా సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యాను. ఆల్జీబ్రాకు బదులు స్క్రిప్ట్ రైటింగ్.. శంకరాభరణం తర్వాత కథకుడు, దర్శకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది. ఓ వైపు క్లాసులో టీచర్లు పాఠాలు చెబుతుంటే మరోవైపు నా మనసులో కథలు అందులోని పాత్రలు మెదిలేవి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఓ పత్రికలో కథల కాంపిటీషన్ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో ఓ స్టోరీ రాసేసి ప్రైజ్ కొట్టేద్దామనుకున్నా. కాలేజీలో కోటేశ్వరరావు సార్ మ్యాథ్స్ క్లాస్ చెబుతున్నారు. నేను పైకి ఊ కొడుతూనే ‘హంతకుడు’ పేరుతో మంచి క్రైం స్టోరీ రాసేస్తున్నా. కాసేపటికి సార్‌కి డౌట్ వచ్చి నా నోట్స్ చెక్ చేశారు. అక్కడ ఆల్జీబ్రా బదులు ‘హంతకుడు’ కనిపించింది. అంతే అక్కడే సార్ వాయించేశారు. ఆ తర్వాత క్లాస్ బయట నిల్చోబెట్టారు. ఇప్పుడదొక స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. ఆ తర్వాత వీపు వాయించేశారు.. ఇంటర్లోకి వచ్చాక సినిమాలపై ఇష్టం బాగా పెరిగిపోయింది. పైగా కొత్తగూడెంలో సినిమా థియేటర్లు అన్నీ కృష్ణవేణి కాలేజీకి దగ్గర్లోనే ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్లినట్టే వెళ్లి మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి మా గ్యాంగ్ అంతా సినిమాలకు వెళ్లే వాళ్లం. క్లాసులో స్టూడెంట్స్ సంఖ్య తగ్గినట్టు కనిపిస్తే, కోటేశ్వరరావు సార్ సీడీ 100 బైక్ వేసుకుని థియేటర్లకు వచ్చేవారు. ప్రొజెక్టర్ రూమ్‌లో నిల్చుని స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు ? ఎక్కడ ఉన్నారో గమనించేవారు. అలా ఓసారి మేం గులాబీ సినిమా చూసేందుకు పరమేశ్వరి థియేటర్లో ఉండగా సార్ మమ్మల్ని పట్టేసుకున్నారు. ఆ తర్వాత అందరి వీపులు వాయించేశారు. దీంతో ఎప్పుడైనా కాలేజ్ టైంలో సినిమాలకు వెళితే ‘సీడీ హండ్రెడ్ బైక్ ’ వచ్చిందా అంటూ మధ్యమధ్యలో చెక్ చేసుకునే వాళ్లం. నెక్ట్స్ సినిమాలో కొత్తగూడెం.. నేను ప్రేమకథలు బాగా తీస్తానని, నాకో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఉందనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవం కంటే ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. టీనేజ్‌లో కానీ కాలేజ్ డేస్‌లో కానీ నాకు లవ్‌స్టోరీస్ ఏమీ లేవు. స్టడీస్, కథలు రాయడం మీదనే ఫోకస్ ఉండేది. కాకపోతే లవ్ చేస్తే ఎలా ఉండాలనే భావనలతోనే కథలు రాసుకున్న. వాటితోనే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం వంటి సినిమాలు తీశాను. ఇప్పటి వరకు చేసినవన్నీ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథలే. అందాల రాక్షసిలో పాత కారు, పగిలిన అద్దంలోని హీరోయిన్ కనిపించే దృశ్యం మాత్రం కొత్తగూడెం నుంచి తీసుకున్నా. నా చిన్నతనంలో గణేష్ టెంపుల్ గల్లీలో ఓ పాత కారు పార్క్ చేసి ఉండేది. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లేప్పుడు ప్రతీ రోజు దాన్ని దాటుకుంటూ వెళ్లేవాణ్ని. ఆ ఒక్క సీన్‌ని సినిమాలో చూపించాను. త్వరలో మైత్రీ మూవీస్‌కి చేయబోయే సినిమాలో రియల్ లైఫ్‌లో కొత్తగూడెంలో చూసిన సంఘటనలు, ఎదురైన అనుభవాల్లో కొన్నింటిని సెల్యూలాయిడ్ తెర మీద చూపించబోతున్నాను. బ్యాడ్ బాయ్‌ని కాదండోయ్... సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా చదువును ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులే వచ్చాయి. డిగ్రీ ఫైనలియర్లో కొత్తగూడెం నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. అక్కడ బ్యాంక్ కాలనీలో ఉంటూ కవిత డిగ్రీ కాలేజీలో చదివాను. ఆ సమయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి లెక్కల ట్యూషన్ చెప్పేవాన్ని. ఇంటర్లో పడిన పునాది గట్టిగా ఉండటంతో అది సాధ్యమైంది. స్టూడెంట్‌గా ఇంగ్లిష్తో నాకు ఎప్పుడు తిప్పలే ఉండేవి. చాతకొండ మూర్తి సార్ అయితే ‘ఇంగి్లష్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ , సమాధానం సరిగా చెప్పలేదంటూ’ ఎన్నిసార్లు కొట్టారో. అప్పుడు చెప్పిన పాఠాలు, తిన్న దెబ్బలు, సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ అన్ని కలిపి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. -
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం. చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’ యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్‌ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ చిత్రం హిందీ వర్షన్ ఓటీటీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. (చదవండి: న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్‌కు లవ్ లెటర్స్) సీతారామం హిందీ వర్షన్ ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసింది. ఈనెల 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ రావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ కూడా బాలీవుడ్ అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీ వర్షన్ కూడా ఓటీటీలోకి రానుండడంతో థియేటర్లలో చూడలేని వారికి ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. #Sitaramam (Hindi) Premieres on Disney+ Hotstar - November 18th. 🤩😍#SitaRamamHindi @dulQuer @mrunal0801 @iamRashmika https://t.co/uqC5GgRHtS — South Hindi Dubbed Movies (@SHDMOVIES) November 9, 2022 -
వేశ్య గృహంలో రెండు వారాలు గడిపిన సీతా రామం హీరోయిన్
-
'సీతారామం' డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ కూడా అద్భుతమే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై సౌత్ సహా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తాజాగా ఈ చిత్రంలోని డిలీటెడ్ సీన్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న దుల్కర్, సుమంత్‌ల మధ్య చిత్రీకరించిన సీన్ అది. ఫుట్‌బాల్ ఆట పూర్తైన తర్వాత విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు అని రామ్ చెప్పగా.. అతని కాలర్ పట్టుకొని అంతా నీవల్లే జరిగింది.. నువ్వు అనాథవురా. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ విష్ణుశర్మ ఫైర్ అవుతాడు. దీంతో దుల్కర్ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సీన్ కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా 1మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. -
‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఏమన్నదంటే..
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న సీతారామం సినిమా చూసిన ఆమె సోషల్ మీడియా వేదికగా చిత్ర దర్శకుడు హాను రాఘవపూడి, మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు మూవీ చాలా అద్భుతంగా ఉందని, ఈ ఎపిక్ లవ్‌స్టోరీ చూస్తున్నంత సేపు మధురానుభూతి కలిగిందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! స్క్రీన్‌ప్లే అయితే అత్యంత అద్భుతమంటూ కంగనా సీతారామం చిత్రాని కొనియాడింది. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్‌గా మరో పోస్ట్ పెట్టింది. ‘ఈ సినిమాలోని నటీనటులందరు చాలా అద్భుతంగా నటించారు. అందులో మృణాల్ నటన బాగా ఆకట్టుకుంది. భావోద్యేగ సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు అత్యద్భుతం. తనలా మరేవరూ నటించలేరు అనేంతగా నటన కనబరించింది. మృణాల్ నిజంగానే రాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ మృణాల్‌పై ప్రశంసలు కురిపించి కంగనా. కాగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమ కావ్యంగా రూపొందిన ‘సీతారామం’ మూవీ అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మారథం పట్టారు. మొత్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ను దాటింది. ఇక ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్ విడుదల కాగా అక్కడ సైతం ఈ మూవీ విశేష ప్రేక్షాదర పొందుతుంది. ఇప్పటికే ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన రివ్యూ ప్రకటిస్తూ మూవీ హీరోహీరోయిన్లపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా? -
‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈచిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యం అమెరికాలో సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్లో కూడా విడుదలైంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ ఇక ఈ సినిమా చూసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీతారామంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు హీరోహీరోయిన్లు దుల్కర్, మృణాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘నిన్న రాత్రే హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమా చూశాను. ఇక దుల్కర్ సల్మాన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా సహాజంగా ఉంది. రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇక యువ నటి మృణాలి ఠాకూర్ గురించి ఏం చెప్పిన తక్కువే. తొలిసారి తన నటన చూశాను. చాలా ఫ్రెష్‌గా సహాజంగా ఉంది. తను పెద్ద స్టార్ అవుతుంది. సీతారామం టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన కొనియాడాడు. I watched @hanurpudi’s #SitaRamam last night. So refreshing to see @dulQuer… so impressive, his power comes from his genuineness. And what to say about young @mrunal0801 this is the first time I saw her performance… so fresh and original… she will be a big star. Wow. Congrats! — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 19, 2022 చదవండి: బిగ్‌బాస్ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్‌రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్‌స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'సీతారామం'కు విదేశీ ప్రేమలేఖ.. ఎవరు రాశారంటే?
మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకుడిగా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై తమ ప్రేమను చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అందరూ తమకు నచ్చిన రీతిలో అభిమానాన్ని తెలియజేస్తున్నారు. (చదవండి: గుర్తు పట్టలేనంతగా సీతారామం హీరోయిన్.. ఆమెకు ఏమైంది..!) అయితే తాజాగా ఈ చిత్రానికి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. పోలెండ్‌కు చెందిన మోనికా అనే అభిమాని.. ఈ సినిమాపై తన ప్రేమను పంచుకున్నారు. నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. " సీతారామం చిత్ర యూనిట్‌కు పోలాండ్ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" ట్వీట్ చేసింది. My letter to the #SitaRamam Team❤️sent all the way from Poland🇵🇱 to India🇮🇳. I don't know if someone will read it because it's really long😬but I really wanted to express my love and gratitude.🙏🥹 Love you forever.❤️ @VyjayanthiFilms @hanurpudi @dulQuer @mrunal0801 @iamRashmika pic.twitter.com/xAlXlouc30 — Monika from Poland🇵🇱 (@PolishMonika) September 15, 2022 -
‘సీతారామం’ సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ ఏమన్నారంటే..
ఒక సినిమా హిట్ అయితే చాలు.. దాని సిక్వెల్ తీస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. బాహుబలి తర్వాత టాలీవుడ్‌లోనూ ఈ సీక్వెల్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా హిట్ సినిమాల కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘సీతారామం’ మూవీకి కూడా సీక్వెల్ ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ దుల్కర్ సల్మాన్ వద్ద ప్రస్తావించగా.. సీక్వెల్‌పై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (చదవండి: మహేశ్-రాజమౌళి సినిమా: జక్కన్న భారీ స్కెచ్...హీరోయిన్ ఆమేనా?) ‘ఏదైనా ఒక సినిమాకి విశేష ప్రేక్షకాదారణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందు నుంచే తెలుసుకున్నా. మేం కథను బాగా నమ్మాం. సీతారామం ఒక క్లాసిక్ మూవీగా నిలస్తుందని భావించాం. అనుకున్నట్లే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నా’అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. అలాగే రీమేక్ కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమ కావ్యంలో మృణాళిక ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక,తరుణ్ భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. -
నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్
హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ తనదైన నటన, స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోలలో ఒక్కడిగా మారాడు. ఒకే బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించిన దుల్కర్ ‘మహానటి’తో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇక రీసెంట్గా విడుదలైన ‘సీతారామం’ చిత్రంతో రామ్‌గా ప్రేక్షకు హృదయాలను కొల్లకొట్టాడు. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ అనే ఆర్మీ యువకుడిగా కనిపించాడు. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఈ సినిమాతో తెలుగులో మరో కమర్షియల్ హిట్ అందుకున్నద దుల్కర్ త్వరలో ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ నెగిటివ్ రివ్యూస్, చెడు విమర్శలు ఎదుర్కొనే నటుడిగా కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంగ్లీష్ చానల్‌తో ముచ్చటించిన అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మొదట్లో తనపై కూడా చాలా నెగిటివ్ రివ్యూస్, విమర్శలు వచ్చాయని, అవి చదివి చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘‘కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూ చదువుతూ ఉండేవాడిని. అందులో ఎక్కువగా నా నటనను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. ‘నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని కూడా కొరుకున్నారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని.. యాక్టర్‌గా పనికి రాననన్నారు. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకుంటున్నాం’ అంటూ అంటూ నాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అది నన్ను చాలా బాధించింది’’ అంటూ దుల్కర్ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. -
పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకుర్. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చెరిపోయింది. అందం, అభినయం, తనదైన నటనతో తొలి చిత్రంతోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి కాకపోయిన పిల్లల్ని కంటాను అంటూ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల ఏం చేస్తుంటారో తెలుసా? ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశంపై స్పందించింది. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని, నా మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. అతడు నా వృత్తిని కూడా గౌరవించాలి. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కల్పించే వ్యక్తి కావాలి. అలాంటి వాళ్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకపోతే పెళ్లి చేసుకోను’ అని చెప్పుకొచ్చింది. చదవండి: టాలీవుడ్‌పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్.. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. అయితే నాకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలుపించుకోవాలని ఆశ. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయిన నేను పిల్లల్ని కంటాను. అది టెస్ట్‌ట్యూబ్ బేబీ ద్వారా. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్‌ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానని మా అమ్మకి చెబితే తాను కూడా ఓకే చెప్పింది. నా నిర్ణయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’ అంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం సినిమా.. డేట్ ఫిక్స్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్,తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
హే సీతా-హే రామ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తోంది. ఈ ప్రేమ కావ్యానికి సాధారణ ప్రజలు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ ఎంతో సినీ, రాజకీయ ప్రముఖులు సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏకంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే సీతారామం ఏస్థాయిలో గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ మరి ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసిన సీతారామం పాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్న ఈ మెలోడియస్ సాంగ్స్ నుంచి సీతామాహాలక్ష్మి-రామ్ ప్రేమ గురించి నిర్వరించిన అద్భుతమైన ప్రేమ గీతం హే సీతా-హే రామ... తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను వదిలింది చిత్ర బృందం. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన ఈ పాట సినిమాకే హైలేట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే విడుదలైన క్షణాల్లోనే ఈ పాట లక్షల్లో వ్యూస్ రాబట్టి యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో చేరింది. మరి ఈ అందమైన ప్రేమ గీతంపై మీరు ఓ లుక్కేయండి. -
చక్కటి ప్రేమకావ్యం.. ‘సీతారామం’పై చిరు ప్రశంసలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యానికి అమరికాలో కూడా మంచి ఆదరణ లభించింది. అక్కడ ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సీతారామం చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా ఆ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. రీసెంట్ ఈ సినిమా వీక్షించిన చిరు.. ట్వీటర్ వేదికగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. (చదవండి: వాట్ ఏ ట్రాన్స్ఫర్మేమషన్.. ఈ హీరోయిన్స్ ఎంతలా మారిపోయారో) ‘సీతారామం’చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులో చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నాదత్, ప్రియాంక దత్‌లకు, ఒక ప్యాషన్‌తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్‌కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్‌లుగా ఆ ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు! ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలాషిస్తున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు. Kudos Team #SitaRamam 💐@VyjayanthiFilms @AshwiniDuttCh @SwapnaDuttCh #PriyankaDutt @dulQuer @mrunal0801 @iamRashmika @hanurpudi @iSumanth @Composer_Vishal #PSVinod pic.twitter.com/BEAlXhWPa3 — Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2022 -
సీతారామం మ్యాజిక్.. ఇప్పటికాదా ఎంత వచ్చిందంటే?
అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించినట్లైంది. రష్మిక మందన్నా, సుమంత్ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్‌పై రూ.75 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సీతారామంపై ఇంత ప్రేమాభిమానం చూపించిన ప్రేక్షకలోకానికి ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్. Thank you for all the love pouring in for #SitaRamam 🦋💖@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @TharunBhasckerD @vennelakishore @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @penmovies @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/jI2BoTO15k — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 27, 2022 చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
జోడీ రిపీట్?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే మృణాల్ మరో సినిమా సైన్ చేశారట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరో పాత్రకు దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ ఫిక్స్ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే. -
ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ భారీ విజయం అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు దీంతో మృణాల్ కోటీ రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్ తొలుత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరాఠిలో పలు టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్గా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మృణాల్ పాత్ర మాత్రం మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
సండే సినిమా: వెండితెరపై జై జవాన్
సైనికులు అంటే యుద్ధం. దేశభక్తి. ప్రేమ. వియోగం. గెలుపు. మరణం. అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు. ‘సీతా రామమ్’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’. తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్మెంట్ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్‌లను లేదా ఫ్లాష్‌బ్యాక్ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్.ఆర్ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్.టి.ఆర్. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్ అయ్యింది. కాని అదే ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్‌గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది. కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్)లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్‌ఫోర్స్ కస్టమ్స్ ఆఫీసర్‌గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజశేఖర్ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు. ఈ కాలం సినిమాలలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌హిట్ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్ లాభించింది. అడవి శేష్ ‘మేజర్’ తెలుగులో అమర సైనికుల బయోపిక్‌ను నమోదు చేసింది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్’ హిట్. నాగ చైతన్య ‘లాల్‌సింగ్ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సైనిక సెంటిమెంట్ గండాన్ని దాటి ‘సీతా రామమ్’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ అనే సైనికుడు నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది. బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు. అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం. -
నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు
‘‘సీతారామం’ చిత్రంలో ఇంటరాగేషన్ అధికారి పాత్ర లభించడం హ్యాపీ. ఇది చిన్న పాత్రే అయినా రష్మిక-సుమంత్‌ల కాంబినేషన్లో చేసిన కీలక సన్నివేశం కావడంతో నా పాత్రను అందరూ ప్రశంసిస్తుండటం ఓ కొత్త ఎనర్జీ ఇస్తోంది’’ అని నటుడు మధు నంబియార్ అన్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలైంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు ఈ చిత్రంలో ఇంటరాగేషన్ అధికారి పాత్ర చేసిన మధు నంబియార్ మాట్లాడుతూ..‘‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేసి వచ్చాక నటుడిగా మారాను. ‘సర్కారువారి పాట, ‘గంధర్వ, ‘దర్జా’.. ఇలా 20 చిత్రాల్లో చేశాను. ‘సీతారామం’లో చాన్స్ ఇచ్చిన నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, ప్రియాంక దత్గార్లకు, హను రాఘవపూడికి, రవితేజ చెరుకూరికి థ్యాంక్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషీ’, నందమూరి చైతన్య కృష్ణ చిత్రాలతో పాటు మరో నాలుగు సినిమాల్లో, ఓ వెబ్ సిరీస్‌లో చేస్తున్నాను. విలక్షణమైన నటుడు అని ప్రేక్షకులతో, క్రమశిక్షణ కలిగిన యాక్టర్ అని పరిశ్రమతో అనిపించు కోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
సీతారామం సినిమాను మిస్ చేసుకున్న హీరోలెవరో తెలుసా?
తెలుగు సినిమాలకు ఆగస్టు శుభారంభం పలికింది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇందులో సీతారామం సినిమా విషయానికి వస్తే ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక మందన్నా, సుమంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు దుల్కర్. కానీ సీతారామం సినిమా దుల్కర్ కంటే ముందు ఇద్దరు, ముగ్గురు హీరోల దగ్గరకు వెళ్లిందంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. మొదట ఈ స్క్రిప్ట్‌ను విజయ్ దేవరకొండకు వినిపిస్తే అతడికి పెద్దగా నచ్చలేదని హను రాఘవపూడి ఒకానొక సందర్భంలో వెల్లడించాడు. అయితే రౌడీ హీరో కాకుండా మరో ఇద్దరు హీరోలు కూడా సీతారామం చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. వాళ్లు మరెవరో కాదు.. నాని, రామ్ పోతినేని. ఇద్దరూ ప్రేమకథా చిత్రాలు తీయడంలో దిట్ట. కానీ ఎందుకో సీతారామం సినిమా దగ్గరికి వచ్చేసరికి చేజేతులా అదృష్టాన్ని కాదనుకున్నారంటూ సినీవిశ్లేషకులు గుసగుసలు పెడుతున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్స్ మంచి సినిమా మిస్ అయ్యారని అభిమానులు అంటున్నారు. చదవండి: భారీ సక్సెస్, డైరెక్టర్‌కు డైమండ్ రింగ్, సూర్య, కార్తీలకు డైమండ్ బ్రాస్లెట్స్ బిగ్‌బాస్ షోలో బుల్లెట్టు బండి సింగర్? -
అందుకే 'సీతారామం'లో నటించాను: దుల్కర్ సల్మాన్
ప్రస్తుత రోజుల్లో సినిమాల సక్సెస్ అరుదైపోయిందనే చెప్పాలి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే సుముఖత చూపడం లేదు. ఎందుకు కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. అయితే మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు ఉదాహరణ సీతారామం. తమిళంలో అనువాద చిత్రంగా రూపొందిన తెలుగు చిత్రం ఇది. దుల్కర్ సల్మాన్, ఉత్తరాది భామ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఇందులో నటి రష్మిక మందన్నా, టాలీవుడ్ నటుడు సుమంత్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. అశ్వినీదత్ సమర్పణలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈచిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 5వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. త్వరలో హిందీలోనూ వి డుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో లైకా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ముందుగా లైకా సంస్థ నిర్వాహకుడు త మిళ్ కుమరన్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ విజయవంతమైన చిత్రాల వరుసలో సీతారామం నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై కూడా మంచి కథా చిత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ సీతారామం కథ విన్నప్పుడే ఇది డ్రీమ్ చిత్రం అని భావించానని చేశారు. ఇది అద్భుతమైన క్లాసికల్ ప్రేమ కావ్యం అని పేర్కొన్నారు. ఇంతకుముందు వినని కథ కావడం, చాలా ఒరిజినల్‌గా అనిపించడంతో తాను నటించడానికి అంగీకరించానన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అన్నారు. చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ సీతారామం చిత్రం తమిళనాడులోనూ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం వావ్ అనిపించడం వెనుక పెద్ద వార్ ఉందన్నారు. ముఖ్యంగా చిత్ర యూనిట్ మూడున్నర ఏళ్ల శ్రమ ఉంటుందన్నారు. కాశ్మీర్‌లోని డిఫరెంట్ డిఫికల్ట్ లొకేషన్లో మైనస్ 24 డిగ్రీల చలిలో షూటింగ్ నిర్వహించామన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్, ఇతర నటీనటులు, యూనిట్ సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు. -
'సీతారామం' మూవీ సక్సెస్ మీట్.. ఫోటోలు వైరల్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణాన్ని తీసుకొచ్చిందీ సినిమా. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్‌కు వెళ్లింది!: నాగార్జున
‘‘గత వారం విడుదలైన ‘బింబిసార, సీతారామం’ చిత్రాలను గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. మంచి సినిమా అందించి అశ్వనీదత్‌గారు థియేటర్‌కి మళ్లీ ప్రేక్షకులను తీసుకొచ్చి మా అందరికీ మరోసారి నమ్మకం కలిగించారు’’ అన్నారు హీరో నాగార్జున. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’. చదవండి: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే! హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ మూవీ థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ‘‘సీతారామం’లాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్‌గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. ‘మహానటి, జాతిరత్నాలు, సీతారామం’ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి అసూయపడ్డాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్‌కి వెళ్లింది (నవ్వుతూ). చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘గీతాంజలి, సంతోషం, మన్మథుడు’ రోజులు గుర్తొచ్చాయి’’ అన్నారు. ‘‘నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు దుల్కర్. ‘‘నేను నాలుగు సినిమాలు తీశాను.. కానీ ‘సీతారామం’ వంటి ఆదరణ లేదు. ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ మరచిపోలేని అనుభూతి ఇచ్చింది’’ అన్నారు హను. ‘‘నాగార్జునగారు మా బేనర్లో ఐదు సినిమాలు చేశారు.. ‘మహానటి, సీతారామం’తో మా బ్యానర్‌కి రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయాడు’’ అన్నారు అశ్వనీదత్. -
సీతారామం సక్సెస్మీట్కు సుమంత్ డుమ్మా, ఎందుకంటే?
ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన సుమంత్ సీతారామం సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా సపోర్టింగ్ రోల్ చేశాడు. ఈ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా హిట్ కూడా అయింది. అయినా సినిమా సక్సెస్ పార్టీలో సుమంత్ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటనేది ఆయన చెప్పుకొచ్చాడు. తాను కోవిడ్ బారిన పడినందువల్లే ఈవెంట్‌కు రాలేకపోయానని తెలిపాడు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సక్సెస్ మీట్‌కు హాజరైన తన చిన్నమామయ్య నాగార్జున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఓటీటీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని, కథ నచ్చితే తప్పకుండా చేస్తానని చెబుతున్నాడు. Missed being there as I'm down with COVID! Thanks once again to our team, the audience, and to Chinmama @iamnagarjuna for gracing the success meet 🙏🏼 #SitaRamam https://t.co/pTjj1UNCyg — Sumanth (@iSumanth) August 11, 2022 చదవండి: ఆ హీరోయిన్‌తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో జైభీమ్ వివాదం: హైకోర్టులో సూర్య దంపతులకు ఊరట -
3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ
ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు మంచి విజయం సాధించాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఈ చిత్రాలు హిట్ కావడంతో తెలుగు పరిశ్రమ సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాల హిట్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బింబిసార, సీతా రామం హిట్ అయ్యాయని ఆనందపడిపోకూడదని, మూడు నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకూడదని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రెండు సినిమాలు చూసిన ఆయన తన రివ్యూ ఇచ్చారు. చదవండి: ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ సీతారామం మూవీ అద్భుతమైన ప్రేమ కావ్యమన్నారు. ఫస్ట్‌హాఫ్‌లో కశ్మీర్ పండితుల సమస్యను నిజాయితిగా చూపించారు. అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు డైరెక్టర్. ఓ అనాథను జావాన్‌గా తీసుకోవడం మంచి కాన్సెప్ట్ అన్నారు. ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలను తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్‌ను తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం బింబిసార మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ కథేనన్నారు. కథలో కొత్తదనం లేకపోయిన డైరెక్టర్ వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. అయితే టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆదిత్య 369తో పోల్చి చూడటం సరికాదన్నారు. చదవండి: చిక్కుల్లో స్టార్ హీరో దర్శన్, ఆడియో క్లిప్‌తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు పోలీకే లేదన్నారు. బింబిసారుడు అనే ఓ క్రూరమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్‌లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తిగా తీశారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని చెప్పారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకుండ, సినిమా రన్‌టైం పెంచాలన్నారు. థియేటర్లో రెగ్యులర్ ఆడియన్స్ పెరిగేలా సినిమాలను తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే ‘50 రోజుల పాటు సినిమాలు ఎందుకు ఆడటం లేదని? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందురు రావడం లేదు అనేది ఆలోచించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లను బతికిస్తాయి. సినిమాకు పూర్వ వైభవం వస్తోంది’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
సీతారామం కలెక్షన్స్: ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
సీతారామం.. సినిమా అంత ఈజీగా మెదళ్లను వదిలి వెళ్లడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి మూవీ చూశాక దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయంటున్నారు. అంతలా జనాలకు కనెక్ట్ అయిందీ చిత్రం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా.. ఇలా అందరూ అద్భుతంగా నటించిన సీతారామం సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ అద్భుత కావ్యంగా మలిచారు. వీరి కష్టం వృథా కాలేదు. సినిమా సూపర్ హిట్టయింది. మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు అక్కడ 750 వేల డాలర్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
ఇన్నాళ్లు ఓటీటీని విలన్ చేశారు.. ఇప్పుడేమంటారు?
‘మంచి సినిమాలు తీస్తున్నాం. కాని ఆడియెన్స్ మాత్రం థియేటర్ కు రావడం లేదు. ఓటీటీలకు అతుక్కుపోతున్నారు’అంటూ ఇన్ని రోజులు టాలీవుడ్ పెద్దలు చెప్పినవన్ని ఉత్తి మాటలే అని ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు నిరూపించాయి. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరి అందించాయి. ‘మేజర్’, ‘విక్రమ్’ తర్వాత టా వచ్చిన చిత్రాలేవి కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. మొన్నటి వరకు ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కావడం.. అవి డిజాస్టర్లుగా మిగిలిపోవడం టాలీవుడ్లో ఒక ట్రెండ్‌గా మారిపోయింది. అయితే ఈ డిజాస్టర్స్ ట్రెండ్ కు టాలీవుడ్ ఇంతకాలం ఆడియెన్స్ థియేటర్ కు రాకపోవడమే రీజన్ గా చెప్పుకొచ్చింది. ఓటీటీ ను మెయిన్ విలన్ గా చేసింది. (చదవండి: సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్) అయితే రెండు నెలల్లో రిలీజైన సినిమాల కంటెంట్ గురించి మాత్రం ఎప్పుడూ చర్చించలేదు. ఫెయిల్యూర్స్ ను విశ్లేసించలేదు. అంటే సుందరానికి, విరాటపర్వం, గాడ్సే, సమ్మతమే, పక్కా కమర్షియల్ , హ్యాపీ బర్త్ డే, ది వారియర్, థ్యాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ అన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఎందుకో తెలియదు కాని ఈ సినిమాల్లో కంటెంట్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయాయి. దాంతో డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి. (చదవండి: థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?) 8 వారాలుగా ఇండస్ట్రీలో డిజాస్టర్ల మోత మోగడంతో దర్శకనిర్మాతల్లోనూ, హీరోల్లోనూ ఒక లాంటి భయం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ మనగడే కష్టం అని గ్రహించారు. దాంతో వెంటనే గిల్డ్ షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఇంతోలో బింబిసార, సీతారామం డిజాస్టర్ల పరంపరకు బ్రేక్ ఇచ్చాయి. రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయిన ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించాయి. బింబిసార మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తుండగా సీతారామం క్లాస్ ప్రేక్షకులను, యూత్ ఆఢియెన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. -
సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్
ఓటీటీలు వచ్చాక ఇంకా జనాలు థియేటర్లకు ఎలా వస్తారు? అబ్బే, సినిమాలు ఆడటం ఇప్పుడంత సులువు కాదు, ఏదో భారీ బడ్జెట్ సినిమాలు అందులోనూ స్టార్ హీరో మూవీస్ అంటే మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వైపు ఓ లుక్కిస్తారు.. ఇలా చాలా మాటలే వినిపించాయి. జూలైలో సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ అందుకోవడంతో సినీపండితులు గాబరా పడ్డారు. కానీ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సీతారామం, బింబిసార సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. మీడియం రేంజ్ సినిమాలైనా కంటెంట్ ఉంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందేనని స్పష్టం చేశాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ అవడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంపై హీరో దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ అయ్యాడు. 'తెలుగులో డబ్ అయిన నా మొదటి సినిమా ఓకే బంగారం. ఇందుకు మణిరత్నంగారికి ధన్యవాదాలు. తర్వాత నాగి, వైజయంతి.. మహానటిలో జెమిని అనే నెగెటివ్ పాత్ర ఇచ్చారు. ఇక్కడా నన్ను ఆదరించారు. కనులు కనులను దోచాయంటే, కురుప్ కూడా డబ్ అయ్యాయి. ఇలా ప్రతి సినిమాను ఆదరిస్తూ నామీద చూపించిన ప్రేమాభిమానాలను నేనెన్నటికీ మర్చిపోలేను. స్వప్న, హను నన్ను సీతారామం కోసం అడిగారు. ఎప్పటినుంచో నేనొక యునిక్ సినిమాతో తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేయాలనుకున్నా. ఇదొక క్వాలిటీ ఫిలిం కాబట్టి దీనితోనే ప్రయాణాన్ని ఆరంభించా. ఎంతోమంది ఆర్టిస్టులు, సిబ్బంది శ్రమ వల్లే సీతారామం ఇంత అందంగా వచ్చింది. సినిమా రిలీజ్ రోజు వచ్చిన స్పందన చూసి సంతోషంతో ఏడ్చేశాను. మా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీవాడిలా నన్ను భావించినందుకు మరోసారి కృతజ్ఞతలు.. మీ రామ్' అని ఓ లేఖ రాసుకొచ్చాడు. Filled with gratitude and emotion !! 🥹🥹🥹❤️❤️🦋🦋🦋#SitaRamamSaysThankU 🙏💕#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/cF5u4tqeNw — Dulquer Salmaan (@dulQuer) August 9, 2022 మరోవైపు నిర్మాత అశ్వినీదత్ సైతం సినిమా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. సీతారామం సినిమాకు అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉన్నానన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, కేరళ ప్రేక్షకులు సైతం సీతారామం చూసి కన్నీటి పర్యంతమవుతూ, ప్రభంజనం సృష్టిస్తుంటే నిర్మాతగా మరోజన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిత్ర నిర్మాణాన్ని రెండేళ్లపాటు ఒంటిచేత్తో నడిపించి మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన స్వప్నకు అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ లేఖలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. A big thank you to everyone 🙏 - @AshwiniDuttCh#SitaRamamSaysThankU #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/PtJ2vyf3Vp — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 9, 2022 చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
ఇలాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకు చేయలేదు: రష్మిక
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అఫ్రిన్‌గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం విజయం గురించి రష్మిక విలేకరుల సమావేశంలో మాట్లాడింది. అఫ్రిన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా ఫీలవుతున్నారు ? 'సీతారామం' విజయం చాలా ఆనందాన్నిచ్చింది. 'సీతారామం' కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేశారు. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్ర గురించి చెబుతూ ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. మా నమ్మకం నిజమైయింది. అఫ్రిన్ పాత్ర మీకు ఎంతవరకు సవాల్ గా అనిపించింది ? అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకూ చేయలేదు(నవ్వుతూ). ఇది ఛాలెంజ్‌గా, చాలా కొత్తగా అనిపించింది. సీతారామం కథ మీ దగ్గరికి వచ్చినపుడు ఎలా అనిపించింది ? సీతారామం నాకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటివరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్‌గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నపుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో రిస్క్ ఉంటుందా? ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్లో ఉండటం బాగానే ఉంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా. డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? పీరియాడికల్ మూవీ చేయాలని ఉంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ ఉంటుంది. ఇప్పుడే మొదలుపెట్టాం కదా.. ఇంకా చాలా చేయాలి. హిందీలో ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా ? మీరు లక్కీ అని భావిస్తున్నారా ? హిందీలోనే కాదు .. తెలుగులోనూ ఇలా జరిగింది. ఛలో షూటింగ్లో ఉండగానే గీతాగోవిందం, దేవదాస్ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్‌ను నమ్ముతాను. చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! -
కలిసొచ్చిన సండే, ఇప్పటిదాకా సీతారామం ఎంత వసూలు చేసిందంటే?
చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసిన అందమైన ప్రేమకావ్యం సీతారామం.. సినిమా చూశాక ప్రేక్షకులు సంతోషంతో చెప్తున్న మాటిది.. హీరోహీరోయిన్ల నటన, సాంగ్స్, ప్రతి సీనూ అద్భుతంగా ఉండటంతో సీతారామం సినిమాకు పాజిటివ్ స్పందనే కాదు అంతకుమించిన కలెక్షన్లు కూడా వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించాడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.60 కోట్ల గ్రాస్, రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ వసూళ్లు కొంత పెరగడంతో రూ.7.25 కోట్ల గ్రాస్ రాగా రూ.3.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే సీతారామం ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తానికి సీతా, రామ్‌ల మ్యాజిక్ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది. Timeless Blockbuster #SitaRamam Grossed 25 Crores Worldwide in 3️⃣ days 💥 💥 #SitaRamamInCinemas @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @SonyMusicSouth @proyuvraaj pic.twitter.com/soLWFzobVg — Ramesh Bala (@rameshlaus) August 8, 2022 #SitaRamam gaining love ❤ from everywhere! Watch the classical love story 💌 of Ram & Sita 💕 in Theaters near you for the amazing visual experience! ✨@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @LycaProductions @proyuvraaj pic.twitter.com/b7bbY6nDWR — Ramesh Bala (@rameshlaus) August 8, 2022 చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! శ్రీదేవి సినిమాలను రీమేక్ చేస్తారా? జాన్వీ ఆన్సరిదే -
Sita Ramam: రెండో రోజు పుంజుకున్న‘సీతారామం’ కలెక్షన్స్.. ఎంతంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. (చదవండి: 'సీతారామం' ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..) పోటీలో ఉన్న ‘బింబిసార’ ఉండటం.. ఆ చిత్రానికి కూడా హిట్ టాక్ రావడంతో తొలిరోజు ‘సీతారామం’ రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రూ. 3.63 కోట్లు షేర్ వసూలు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది రూ. 7.25 కోట్లు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.68 కోట్ల షేర్, రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ కాబట్టి ఏ సెంటర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. బీ,సీ సెంటర్లో ‘బింబిసార’ జోరు వలన కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం కాస్త వెనకబడింది.అయితే ఇలాంటి క్లాసిక్ చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ‘సీతారామం’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ.1.39 కోట్లు ► సీడెడ్ - రూ.37 లక్షలు ► ఈస్ట్ - రూ.34 లక్షలు ► వెస్ట్ - రూ. 20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.55లక్షలు ► గుంటూరు- రూ. 30 లక్షలు ► కృష్ణా - రూ.30 లక్షలు ► నెల్లూరు - రూ.13 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.35 లక్షలు ► ఇతర భాషలు రూ. 90 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.85 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ.6.68 కోట్లు(రూ.13.30 కోట్ల గ్రాస్) -
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్‌తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్‌కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్‌పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్‌కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా. 'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు. ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్‌తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్‌ను హర్షవర్ధన్‌తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్‌గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్‌కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్‌గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్‌గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్‌కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్‌ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు. ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్‌ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇక మెగాస్టార్ ట్యాగ్‌ను కల్యాణ్ రామ్‌కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు. Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్‌లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
'సీతారామం' ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నటించిన మృణాల్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. సీత పాత్రలో నటించిన మృణాల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే నిజానికి సీత పాత్రకు మృణాల్ కాకుండా ముందు వేరే హీరోయిన్ను అనుకున్నారట. మన బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్గా మూవీటీం ఫైనల్ చేశారట. కానీ కోవిడ్ వల్ల షూటింగ్ లేట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. అసలే హిట్స్ లేక తంటాలు పడుతున్న పూజా ఈ సినిమా నుంచి తప్పుకొని ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అప్పుడే ఓటీటీలోకి 'సీతారామం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే -
అప్పుడే ఓటీటీలోకి 'సీతారామం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో రష్మిక, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ నుంచి సుమారు ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. చదవండి: డైరెక్టర్‌ను పట్టుకొని ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్ -
Sita Ramam Movie Box Office Collection: ‘సీతరామం’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. (చదవండి: ‘సీతారామం’ మూవీ రివ్యూ) అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్(రూ.1.50 కోట్ల షేర్) కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.60 కోట్ల గ్రాస్, రూ. రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ అవ్వడంతో ఏ సెంటర్ ఆడియన్స్ బాకా కనెక్ట్ అయినప్పటికీ.. బీ, సీ సెంటర్ ‘బింబిసార’ జోరు వలన ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. అయితే ఇలాంటి చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.05 కోట్లు వసూలు చేసింది. ఇంకా రూ.13.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.54 లక్షలు ► సీడెడ్ - రూ.16 లక్షలు ► ఈస్ట్ - రూ.15 లక్షలు ► వెస్ట్ - రూ.8లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.23 లక్షలు ► గుంటూరు- రూ.16లక్షలు ► కృష్ణా - రూ.13 లక్షలు ► నెల్లూరు - రూ. 5లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.15 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ఇతర భాషలు రూ.35 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. రూ.3.05 కోట్లు(రూ.5.60 గ్రాస్ వసూలు) -
బింబిసార, సీతారామం చిత్రాలు విజయం సాధించడంపై మెగాస్టార్ ట్వీట్
-
బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కలకళలాడుతోంది. ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకున్నాయి. దీంతో ఈ విజయాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ వచ్చేలా చేసిన సీతారామం, బింబిసార చిత్ర బృందానికి తెలుగు హీరోలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఈ రెండు చిత్రాల మేకర్స్‌కి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్ చేశాడు. Extremely happy to hear that 2 films on the same day have turned into hits :)) What a good day! Congratulations to @VyjayanthiFilms @dulQuer @mrunal0801 @iamRashmika, @iSumanth anna, @hanurpudi and team on #SitaRamam. Hearing the most amazing beautiful things about the film ❤️ — Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022 సీతారామం, బింబిసార చిత్రాల విజయంపై యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించాడు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నానని... తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్ ట్వీట్ చేశాడు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
అడివి శేష్‌కు కరోనా.. తనకోసం ఆ పని చేయాలంటూ పోస్ట్
కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. నేడు(శుక్రవారం)విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం పట్ల హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఈ రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుండటం సంతోషంగా ఉంది. ఇది కదా కావల్సింది. ప్రస్తుతం తనకు కరోనా రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నా. అందుకే థియేటర్స్‌కి వెళ్లలేకపోతున్నా. నా కోసం ఓ మార్నింగ్ షో, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి' అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయనకు కరోనా అని తెలియడంతో పలువురు అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
సీతారామం సినిమా పబ్లిక్ టాక్
-
‘సీతారామం’ మూవీ రివ్యూ
టైటిల్ : సీతారామం నటీనటులు : దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాగూర్, సుమంత్, రష్మిక, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాత: అశ్వినీదత్ దర్శకత్వం: హను రాఘవపూడి సంగీతం : విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది:ఆగస్ట్ 05,2022 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమై, తనదైన స్టైల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇంటెన్స్ లుక్స్ , క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ..లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మలయాళ హీరో అయినప్పటికీ తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 'మహానటి' తర్వాత ఈ రొమాంటిక్ హీరో నేరుగా తెలుగులో నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సీత,రామ్‌ల లవ్‌స్టోరీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. ఇక ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి టాక్ని సంపాదించుకోవడమే కాకుండా..సినిమాపై అంచనాలు పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడం, అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి హీరోలను భాగం చేయడంతో ‘సీతారామం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? సీత,రామ్‌ల లవ్ స్టోరీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ‘సీతారామం’ కథంతా 1965, 1985 నేపథ్యంలో సాగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి(సచిన్ ఖేడ్కర్) మనవరాలు అఫ్రిన్(రష్మిక). లండన్‌లో ఉంటున్న ఆమె తిరిగి వచ్చేసరికి తాతయ్య చనిపోతాడు. ఇంట్లో ఓ ఉత్తరం ఉంటుంది. అది 20 ఏళ్ల క్రితం భారత సైనికుడు లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) రాసిన లెటర్. దానిని హైదరాబాద్‌లో ఉంటున్న సీతామహాలక్ష్మికి అందజేయాల్సిన బాధ్యతను అఫ్రిన్కి అప్పజెప్పుతాడు. అది తాతయ్య చివరి కోరిక. తాతయ్యపై ప్రేమతో కాకుండా ఆ లెటర్ సీతామహాలక్ష్మికి అందిస్తే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదన్న కండీషన్ ఉండడంతో అఫ్రిన్ ఆ లెటర్ని పట్టుకొని హైదరాబాద్ వెళ్తోంది. సీత గురించి వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సీతా, రామ్‌ల గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. లెఫ్టినెంట్ రామ్ ఓ అనాథ. దేశం కోసం పనిచేయడం తప్ప..ఆయనకంటూ నా అనేవాళ్లు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తికి ఓ రోజు లెటర్ వస్తుంది. అది సీతామహాలక్ష్మి రాసిన లేఖ. అడ్రస్ లేకుండా వచ్చిన ఆ ఉత్తరాలను చదివి ఆమెతో ప్రేమలో పడిపోతాడు రామ్. ఓ రోజు సీతను కలుస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం..ఆపై ప్రేమ పుడుతోంది. ఓ రహస్యాన్ని దాచి రామ్ కోసం హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కి వస్తుంది సీత. ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో ఓ కారణంగా వాళ్లిద్దరు దూరమవుతారు. అసలు సీత దాచిన రహస్యం ఏంటి? సీత ఎవరు? సీత కోసం రామ్ రాసిన లేఖ పాకిస్తాన్లో ఎందుకు ఆగిపోయింది? ఆ లెటర్ని ఆఫ్రిన్ సీతకు అందించిందా లేదా? అందులో ఏముంది? అసలు అఫ్రిన్‌కు రామ్ ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ‘సీతారామం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ లవ్ స్టోరీలకు స్పెషలిస్ట్ హను రాఘవపూడి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా..లవ్ స్టోరీని మాత్రం బాగా హ్యాండిల్ చేస్తారనే పేరుంది. ఇప్పుడు ‘సీతారామం’తో కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేశాడు. యుద్దంతో ముడిపడి ఉన్న ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అంతే బ్యూటిఫుల్‌గా తెరకెక్కించాడు. ప్రేమ, యుద్ధం అనే రెండు వేర్వేరు నేపథ్యాల్ని ఉత్తరంతో కలిపి ఓ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని తెరపై చూపించాడు. పాకిస్తాన్ తీవ్రవాదులు కశ్మీర్లో ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారు అనే పాయింట్‌తో కథ మొదలవుతుంది. అయితే ఇది ప్రేమ కథా చిత్రమని మేకర్స్ మొదటి నుంచి ప్రచారం చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి అంతా రామ్, సీతల లవ్ స్టోరీపైనే ఉంటుంది. ఎప్పుడైతే రామ్‌కి సీత ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. సీత కోసం రామ్ హైదరాబాద్ వెళ్లడం.. అక్కడ వాళ్ల జర్నీ..తనకు ఉత్తరాలు రాసిన ప్రతి ఒక్కరిని రామ్ కలుస్తుండడం.. ఇలా తెలియకుండానే ఫస్టాఫ్ ముగుస్తుంది. మధ్య మధ్యలో వెన్నెల కిశోర్, సునీల్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్‌లో సీత, రామ్లా లవ్‌స్టోరీ ఎలా సాగుతుందనేదానిపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. అంతే ఆసక్తిగా సెకండాఫ్ సాగుతుంది. లవ్‌స్టోరీని క్యారీ చేస్తూనే మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని యాడ్ చేస్తూ సెకండాఫ్‌ని నడిపించాడు. రామ్ తనకు లేఖలు రాసిన ఓ చెల్లి దగ్గరకు వెళ్లడం..ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఆ బాధ్యతను తనపై వేసుకోవడం హృదయాలను హత్తుకుంటుంది. ఇక ఆర్మి అధికారి విష్ణుశర్మ(సుమంత్)లోని రెండో కోణం కూడా ఇంట్రెస్టింగ్ చూపించాడు. సినిమా ప్రారంభంలో కశ్మీర్ అల్లర్లకు, యుద్దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో అనేదానికి సెకండాఫ్‌లో మంచి వివరణ ఇచ్చాడు. అలాగే అఫ్రిన్ పాత్ర ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రతి పాత్రని ఫర్ఫెక్ట్గా వాడుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్‌గా నడిపించి సరికొత్త ప్రేమ కథను చూపించాడు. ఎలాంటి అశ్లీలత లేకుండా ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే. లెఫ్ట్‌నెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన మాటతీరు, యాకింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు దుల్కర్ ఫర్ఫెక్ట్ చాయిస్ అనేలా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఇక సీత పాత్రకు మృణాల్ న్యాయం చేసింది. తెరపై బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించింది. మత పిచ్చి, పొగరు ఉన్న అమ్మాయి అఫ్రిన్‌గా రష్మిక అదరగొట్టేసింది. క్లైమాక్స్‌లో ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో బాగా పండిన పాత్రల్లో సుమత్ది ఒకటి. ఆర్మీ అధికారి విష్ణుశర్మగా సుమంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర తొలి నుంచి అనుమానంగానే చూపిస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచారు. ఆయన భార్యగా భూమిక కనిపిస్తుంది. కానీ ఆమె పాత్రలో అంతగా స్కోప్ లేదు. ఇక గోపాల్‌గా తరుణ్ భాస్కర్‌తో పాటు ఆర్మీ చీఫ్లుగా ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్ తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం విశాల్ చంద్రశేఖర్ సంగీతం. అద్భుతమైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో విజువల్స్ స్థాయిని పెంచడమే కాదు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై అందంగా చూపించాడు. కశ్మీర్ అందాలను అద్భుతంగా చూపించాడు. అద్భుతమైన విజువల్స్‌ని అందించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ ధరెంతో తెలుసా?
బ్రాండ్ ముఖ్యం బిగిలూ అంటున్నారు స్టార్ హీరోలు. వేసుకునే షర్ట్, ధరించే వాచీలు, షూస్.. ఇలా అన్నీ బ్రాండెడ్వే ధరిస్తున్నారు. ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఫ్యాషన్ ఐకానిక్ అల్లు అర్జున్ కూడా స్టైలిష్‌గా కనిపించేందుకు ఖరీదైన వస్తువులను, దుస్తులనే కొనుగోలు చేస్తాడు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం చాలావరకు సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతాడు. హైదరాబాద్‌లో జరిగిన సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రభాస్ బ్లూ జీన్స్, టీ షర్ట్, తలకు క్యాప్‌తో కనిపించాడు. ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ ఏదో బాగుంది.. మనమూ ట్రై చేద్దాం అనుకునేరు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నా దాని ఖరీదు మాత్రం ఎక్కువే. ప్రముఖ బ్రాండ్.. డాల్స్ అండ్ గబ్బానా డిజైన్ చేసిన ఈ టీషర్ట్ ధర అక్షరాలా ఇరవై వేల రూపాయలట. దీన్ని ఐదేళ్ల క్రితం కూడా ప్రభాస్ ధరించాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా నేడు(ఆగస్టు 5) విడుదలైంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇక ఇదే రోజు నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార కూడా రిలీజైంది. మరి ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి! చదవండి: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ కమెడియన్ రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం -
Sita Ramam Movie HD Images : ‘సీతారామం’ మూవీ స్టిల్స్
-
Sita Ramam Movie: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ
'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక, సుమంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సీతారామం’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 05) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (చదవండి: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సీతారామం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #SitaRamam Overall a Decent Poetic Love Story that works for the most part! The visuals and the technical values are top notch. DQ did well and Mrunal completely steals the show. Flipside, the pacing and length feel tedious at parts and could be crisper. Rating: 2.75-3/5 — Venky Reviews (@venkyreviews) August 5, 2022 సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్స్. విజువల్స్ , టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయని చెబుతున్నారు. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతమని కామెంట్ చేస్తున్నారు. #SitaRamam Reviews! Good First Half! Very Good Introduction,Love Scenes,Classic BGM, Songs😍, Interval👍🏻 Excellent 2nd Half! Classic Screenplay Dealed Very Well👍🏻, Songs and Climax👏🔥 4/5- Winner!!! pic.twitter.com/jkGoiBh7ml — Ikbal Hossen (@IkbalHossen1997) August 5, 2022 ఫస్టాప్‌లో వచ్చే లవ్ సీన్స్, పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయిందట. ఇక సెకండాఫ్ లో స్క్రీన్‌ప్లేతో మాయ చేశారని చెబుతున్నారు. పాటలు, క్లైమాక్స్ కూడా బాగున్నాయంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #MovieCritiq 𝗥𝗮𝘁𝗶𝗻𝗴 : 𝗠𝗼𝘃𝗶𝗲 : #SitaRamam 𝗥𝗮𝘁𝗶𝗻𝗴 : 3/5 𝗣𝗼𝘀𝗶𝘁𝗶𝘃𝗲𝘀 : @dulQuer gave his 100% efforts as usual ~ bgm 👌 ~ @mrunal0801 and @bhumikachawlat impressed 👌 𝗡𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗲𝘀 : Slow First half but good second half 👍#SitaRamamreview #MovieCritiq pic.twitter.com/vp1VRoosoF — The Movie Critic ! (@MovieCritiq) August 5, 2022 రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడని, మృణాల్, దుల్కర్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందట. అయితే ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #SitaRamam After an average first half the second half really picks up momentum and with good songs the overall experience is heartwarming! Overall a very good experience! Definitely deserve a theatrical experience! — Sunny Cinema☀️ (@Sunny9z) August 5, 2022 #SitaRamam USA premiers started... So far so good 👏👏 Good reports for First Half 👌 2nd half progressing..#DulquerSalmaan @mrunal0801 — AB George (@AbGeorge_) August 5, 2022 Last 30min 👍 Poetic, Well rounded story. 1st half could've been lot better. Introduced the army stuff in 1st 30min & then that's it. He came back at it again in the climax. Hence, the story didn't seem like progressing much. Ideas didn't translate into situations. #SitaRamam — God of Thunder (@Kamal_Tweetz) August 5, 2022 #SitaRamam It's one of the most beautiful love stories I have watched. Hanu has done it. Not even a single boring moment. Chemistry between @dulQuer and @mrunal0801 ❤️❤️ Last lo emotional ayya. Beautiful cinematography, emotions, music 👏👏 Easily Top 3 of the year 4/5 pic.twitter.com/wSzX3MV684 — #TeamSitaRamam (@HemsssWorth) August 5, 2022 #SitaRamam Reviews! Avg First Half Good second half Classic BGM, Songs 🍃 2.3/5 — Devil (@Devil_170) August 5, 2022 #SitaRamam Good first half followed by excellent Second half 💝 4/5✨️@dulQuer and #Mrunal will steal your heart 💯 — South Movies (@2_jibin) August 5, 2022 -
‘సీతారామం’ఫస్ట్ రివ్యూ: థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు సరైన మూవీ!
దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో నటిస్తున్న రెండో చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రావడంతో ‘సీతారామం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా బాగుందని, ఇలాంటి చిత్రాలను థియేటర్స్‌లోనే చూడాలని ప్రభాస్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు చెబుతున్నారు. (చదవండి: ‘సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?) తాజాగా ఈ చిత్రంపై ఓ సీనియర్ టెక్నీషియన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్నపూర్ణలో మెయిన్ అవుట్ హోడ్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న శ్రీ సీవీరావు సోషల్ మీడియా వేదికగా ‘సీతారామం’పై ప్రశంసలు కురిపించాడు. ‘ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో 'సీతారామం' వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని, రైటింగ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చాలా బాగుంది. ప్రతీ క్రాఫ్ట్ కు సంబంధించిన టెక్నీషియన్స్ తమ పూర్తి ఎఫర్ట్ తో ఈ మూవీకి వర్క్ చేశారు. మీ విలువైన సమయానికి థియేట్రికల్ అనుభూతిని పొందడానికి సరైన సినిమా ఇది' అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. -
రిలీజ్‌కు ఒక్క రోజు ముందు భారీ షాక్.. అక్కడ ‘సీతారామం’ బ్యాన్!
విడుదలకు ఒక్క రోజు ముందు ‘సీతారామం’చిత్రానికి భారీ షాక్ తగిలింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?) ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర యూనిట్‌కి సెన్సార్ భారీ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుందట. మరి సెన్సార్ బోర్డ్ నిజంగానే గల్ఫ్ దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేస్తారా? లేదా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్‌కు అనుమతి ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడంతో టాలీవుడ్లో ‘సీతారామం’పై భారీ అంచనాలు ఉన్నాయి. -
బరువు తగ్గిన ప్రభాస్.. ట్రిమ్డ్ గడ్డంతో స్టైలీష్‌గా ‘డార్లింగ్’.. పిక్స్ వైరల్
‘బాహుబలి’చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్’ ప్రభాస్. ఆ చిత్రం తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేసూకుంటూ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో వదిలిన సాహో, రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయినా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఆదిపురష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. వ్యాయామం మీద ఎక్కువగా దృష్టిపెట్టలేక పోయాడు. దీంతో ప్రభాస్ కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపించాడు. తమ అభిమాన హీరో శరీరాకృతిలో వచ్చిన మార్పును చూసి అభిమానులు కాస్త కలవరపడ్డారు. కానీ తాజాగా ప్రభాస్ లుక్ చూసి అదే ఫ్యాన్స్ ఆనందంతో చిందులేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. బుధవారం జరిగిన ‘సీతారామం’ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ‘డార్లింగ్’ ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ట్రిమ్డ్ గడ్డం,మీసాలతో ప్రభాస్ దర్శనమిచ్చాడు. బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో స్టైలీష్‌గా కనిపించాడు ప్రభాస్. అంతేకాదు బరువు తగ్గి చాలా స్లిమ్‌గా అయ్యాడు. మొన్నటి వరకు బోద్దుగా ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా స్టైలిష్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రభాస్ లుక్‌ని ఫ్యాన్స్ పంగడ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘లుక్ అదిరింది బాస్’, ‘డార్లింగ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ న్యూలుక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక కీలక పాత్ర సోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న(ఆగస్ట్ 3)జరిగిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో ‘సీతారామం’పై మరింత హైప్ క్రియేట్ అయింది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.18.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. నైజాంలో అత్యధికంగా రూ. 5 కోట్లు అమ్ముడు అవ్వగా.. సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.5 కోట్లు, ఇతర భాషాల్లో 1.50 కోట్లు బిజినెస్ చేసిందట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్) -
‘సీతారామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్
Prabhas Interesting Comments In Sita Ramam Pre Release Event: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో భాగంగాలో స్టేజ్‌పైకి వచ్చిన ప్రభాస్ మొదట ఏం మాట్లాడను అని షాక్ ఇచ్చాడు. తర్వాత ఈ సినిమా నిర్మాత స్వప్నదత్ వచ్చి మాట్లాడితే గానీ తాను మాట్లాడనని చెప్పాడు డార్లింగ్. 'ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు. రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు' అని స్వప్న దత్ తెలిపారు. అనంతరం స్వప్న దత్ మాట్లాడకా ఆమె కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని నవ్వులు పంచాడు. ''ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి 'సీతారామం' సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి'' అని ప్రభాస్ పేర్కొన్నాడు. కార్యక్రమం చివర్లో రూ. 100 పెట్టి అశ్వనిదత్ వద్ద టికెట్ కొనుక్కోవాలని యాంకర్ సుమ చెప్పగా.. 'నా జేబులో డబ్బులుండవు. ఇందాక నాగ్ అశ్విన్ వద్ద అడిగి తీసుకున్న' అని ప్రభాస్ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. తర్వాత అశ్వనిదత్‌కు రూ. 100 ఇచ్చి టికెట్ తీసుకున్నాడు ప్రభాస్. 'సీతారామం' చిత్ర యూనిట్ అంతా టికెట్‌తో పాటు ఫొటోలకు ఫోజులివ్వడంతో ఈ ఈవెంట్ ముగిసింది. -
గ్రాండ్‌గా 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్
Prabhas Grand Entry In Sita Ramam Pre Release Event: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, క్యారెక్టర్ల లుక్స్, పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఘనంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో స్టేజ్‌పైకి ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ గ్రాండ్‌గా ఆకట్టుకునేలా ఉంది. డార్లింగ్ ఎంట్రీతో విజిల్స్, అరుపులతో స్టేడియం హోరెత్తింది. అలాగే ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్లో డైరెక్టర్ అనుధీప్, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, సుమంత్, అశ్వినీదత్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. -
‘సీతారామం’ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
ఆ పదం విని విని విసుగొచ్చింది : దుల్కర్ సల్మాన్
పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా ఉండటం లేదు. నిజానికి పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ఒత్తి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. ఫిల్మ్ ని ఫిల్మ్ అంటే చాలు’అని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. ఆయన హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► 'సీతారామం'చాలా ఒరిజినల్ కథ. ఇందులో నేను ఆమ్ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాను. రామ్ ఒక అనాధ. అతనికి దేనిపైనా ద్వేషం ఉండదు. పాజిటివ్ పర్సన్. అతనికి దేశభక్తి చాలా ఎక్కువ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా ఉంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే. ► ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని తెలుసు. ‘కానున్న కళ్యాణం’ పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా ఉంటుందని అర్ధమైయింది. పాటలన్నీ విజువల్ వండర్ లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్. ► ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఊహించుకుంటాం. 'సీతారామం' కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా అలానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆఫ్ స్క్రీన్ కూడా తను హ్యాపీ, ఎనర్జిటిక్ పర్శన్. ► ఇందులో కొత్త రష్మిక ని చూస్తారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీ. ► అశ్వనీ దత్, స్వప్న గార్ల వైజయంతి మూవీస్ అంటే నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ దత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్శన్. చాలా పాజిటివ్ గా ఉంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా ఉంటుంది. నా కోసం ది బెస్ట్ ని ఎంపిక చేస్తారు. దర్శకుడు హను ఈ కథని అద్భుతంగా ప్రజంట్ చేశారు. ► ప్రేమ కథలకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నాను. రోజురోజుకి నా వయసు కూడా పెరుగుతుంది కదా.. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ ఉంది. ఫ్రెష్ , ఒరిజినల్ గా ఉండే పాయింట్ల ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ► తెలుగు ప్రేక్షకులు నాపై చూపిన అభిమానం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. చాలా రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి వచ్చినపుడు ‘మీ సినిమా ఉస్తాద్ హోటల్ చూశాం. చాలా బావుంది' అని ఓ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పారు. అది నా రెండో సినిమా. ఆ చిత్రానికి కనెక్ట్ అవ్వడం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. అలాగే నా చిత్రాలు వివిధ ఓటీటీ వేదికలపై చూసి సినిమాల పట్ల ఉన్న ఒక ప్యాషన్ తో చాల మంది కనెక్ట్ అవ్వడం ఆనందమనిపించింది. ► నాన్న గారు నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. సినిమాలు, కథలు గురించి ఇంట్లో మాట్లాడుతుంటాం. నేను నా కథలని సింగిల్ లైన్ లో చెబుతుంటాను. నాన్న గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనే నా హీరో. ► దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం అది ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ఉంటుంది. -
విజయవాడ, వైజాగ్‌లో సీతారామం టీమ్ సందడి (ఫొటోలు)
-
ఈ వారం ఓటీటీలదే జోరు, బోలెడన్ని సినిమాలు రెడీ!
వేసవి ప్రతాపం చల్లారిపోయింది. సమ్మర్ తర్వాత రిలీజైన పలు సినిమాలు సైతం చప్పగా ఉంటూ సినీప్రియులను ఉసూరుమనిపించాయి. దీంతో జనాలు ఆగస్టు వైపు ఆశగా చూస్తున్నారు. కనీసం ఈ కొత్త నెలలోనైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలున్నాయా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో చూద్దాం.. బింబిసార నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్స్‌గా నటించారు. చరిత్రకు, వర్తమానానికీ ముడిపెడుతూ సాగే జానపద చిత్రమిది. ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలవుతోంది. చాలాకాలం తర్వాత కల్యాణ్ బింబిసారతో పలకరించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సీతారామం దుల్కర్ సల్మాన్, మృణాలిని ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో రష్మిక మందన్నా ముఖ్య పాత్ర పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 5న రిలీజవుతోంది. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు... ఆహా పక్కా కమర్షియల్ - ఆగస్టు 5 మహా - ఆగస్టు 5 అమెజాన్ ప్రైమ్ వీడియో కడువా - ఆగస్టు 4 ఆల్ ఆర్ నథింగ్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 4 క్రాష్ కోర్స్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 5 థర్టీన్ లైవ్స్ - ఆగస్టు 5 నెట్‌ఫ్లిక్స్ డార్లింగ్స్ - ఆగస్టు 5 కార్టర్ (కొరియన్ చిత్రం) - ఆగస్టు 5 ద సాండ్‌మ్యాన్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 5 హాట్‌స్టార్ లైట్ ఇయర్ - ఆగస్టు 3 వూట్ ద గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ మున్నీస్ - ఆగస్టు 4 చదవండి: నేనెప్పుడూ అలా ఫీల్ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా.. ఆమె సైకిల్ పట్టుకుంటే నేను తొక్కేవాడిని: చిరంజీవి -
దుల్కర్‌తో ప్రతి ఏడాది ఒక మూవీ తీద్దామని చెప్పా: అశ్వినీదత్
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ సల్మాన్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను’అని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది. ►ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ► ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, చిరంజీవితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను రాఘవపూడి ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది. ► సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను చాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ► హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టు ఉంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి. ► మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు. సుమంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ► ఈ సినిమా సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంటుంది. సినిమా ఫాస్ట్‌గా ఉంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలవుతుంది. ► ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలవుతుంది. -
అలా అయితే మంచి పాట వస్తుంది : విశాల్ చంద్రశేఖర్
‘‘నేను ఏ సినిమా చేసినా ఆ కథ వినను.. స్క్రిప్ట్ పూర్తిగా చదువుతాను. అప్పుడే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఓ అవగాహన వస్తుంది. మంచి సంగీతం కుదరాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి. అప్పుడే మంచి పాట వస్తుంది. అలా మ్యూజిక్‌ని డిమాండ్ చేసిన కథ ‘సీతారామం’. ఈ చిత్రకథ ఇచ్చిన స్ఫూర్తితో అద్భుతమైన సంగీతం ఇచ్చాను’’ అని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘రంజిత్ బారోట్ అనే సంగీత దర్శకుడు నాకు స్ఫూర్తి. తమిళ్లో ప్రభుదేవా హీరోగా ‘వీఐపీ’ అనే సినిమాతో పాటు మరో చిత్రానికి సంగీతం అందించారాయన. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్‌గారి ట్రూప్‌లో మెయిన్ డ్రమ్మర్. హను రాఘవపూడిగారితో ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం బాగుంటుంది. ‘సీతారామం’ వంటి చాలా గొప్ప కథ రాశారు. ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయి. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్... ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు 140మంది మ్యుజీయన్స్ కలిసి నేపథ్య సంగీతం కోసం పని చేశారు. ఈ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ పాటని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు రాశారు. ఈ పాట కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ్.. ఇలా అన్ని భాషల్లోని అలంకారాల గురించి నాకు వివరించారు. పాటల రచయితలు కేకేగారు, అనంత్ శ్రీరామ్‌లతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలోని పాటలని డబ్బింగ్‌లా కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆ నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్‌గా చేశాం. మెలోడీ పాటలు నా బలం. నా తర్వాతి సినిమా మాధవన్‌గారితో ఉంటుంది.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
‘సీతారామం’ సినిమా ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేస్తారా ?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యతను అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రామ్ రాసిన ప్రేమ లేఖను సీతామహాలక్ష్మికి చేర్చేందుకు రష్మిక మందన్నా ప్రయత్నిస్తుంటుంది. ఆ లెటర్‌ను రామ్‌కు చేర్చే క్రమంలో అతనికి ఏమైందో తెలుసుకోవడమే సినిమా కథగా తెలుస్తోంది. పాత్రల నటన, డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా?', 'నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా' అంటూ చెప్పే సంభాషణలు బాగున్నాయి. 1965 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుుకునేలా ఉంది. చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు ఆ విషయంలో తెలుగు దర్శకులకు చిరు చురకలు.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో -
ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా : హను రాఘవపూడి
‘నాకు పాత పుస్తకాలు కొనుక్కోనే అలవాటు ఉంది. అలా ఒక్కసారి కోఠిలో కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఒక అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. అతను దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా . ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా’ అని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేయడానికి కారణం? మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానాతో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు. లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. అయితే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. సీతారామంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ? ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. సీతారామం కథకు ప్రేరణ? నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపింగదచింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్. తెలుగులో ఇంత మంది ఉండగ దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో ఉన్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ? విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి ఉంది.ఇందులో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు. పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ? పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే. 'సీతారామం' 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ? ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ ఉంటుంది. రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది ? రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. 'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ? బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది. వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ? వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద ఉన్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ? ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు. మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ? సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు. మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ? లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ) కొత్తగా చేయబోతున్న సినిమాలు ? బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది. -
మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ‘సీతారామం’ టీం సందడి (ఫొటోలు)
-
'మేజర్ సెల్వన్'గా ప్రముఖ డైరెక్టర్..
Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్ 'మేజర్ సెల్వన్'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం Attention Everyone! 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐞𝐥𝐯𝐚𝐧 is here! Here's the first look of @menongautham from #SitaRamam.https://t.co/HNfYz5h9Yy@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth#SitaRamamOnAug5 pic.twitter.com/oUkrUIf6EE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2022 -
సింగర్‌గా ఎందుకు అవకాశాలు రాలేదో తెలియదు: ఎస్పీ చరణ్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లపైనే అవుతోంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఒకేలా పాడాను. అయితే కొందరు నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) వాయిస్‌లా నా వాయిస్ ఉందన్నారు. నాకు వచ్చే పాటలను నా శక్తి మేరకు బాగా పాడాలని ప్రయత్నం చేస్తాను’’ అన్నారు గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఎస్పీ చరణ్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఓ సీత..’, ‘ఇంతందం..’ పాటలను ఎస్పీ చరణ్ పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ చెప్పిన విశేషాలు.... ► హీరో దుల్కర్ సల్మాన్‌కు నేను పాడటం ఇదే తొలిసారి. ‘సీతా రామం’ చిత్రంలో ‘ఓ సీత’, ‘ఇంతందం..’ పాటలను పాడటం చాలా సంతోషంగా ఉంది. చిరకాలం నిలిచిపోయే పాటలివి. ‘ఓ సీత..’ పాటకు అనంత శ్రీరామ్, ‘ఇంతందం..’ పాటకు కేకే (కృష్ణకాంత్) మంచి సాహిత్యం అందించారు. మెలోడిపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ►ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన నేను ఆ తర్వాత ఇదే స్పీడ్‌ను ఎందుకు కొనసాగించలేకపోయానన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా అందరి సినిమాల్లో నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి... జనాదరణ పొందాయి. అయితే ఆ తర్వాత ఓ సింగర్‌గా నాకు ఎందుకు అవకాశాలు కుదర్లేదో అయి తే తెలియదు. నిర్మాణ రంగంలో బిజీగా ఉండటం వల్ల నేను పాట పాడలేననే మాట ఎప్పుడూ చెప్పలేదు. రికార్డింగ్‌కు ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారీ నేను అందుబాటులోనే ఉన్నాను. ► సంగీతంలో వచ్చిన మార్పులను గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాను నేను. పాట పట్ల నా అప్రోచ్ అయితే మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మంచి పరిజ్ఞానంతో ఉన్నారు. దర్శక–నిర్మాతలు కూడా కొత్త సంగీత దర్శకులు, సింగర్స్‌ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నాన్నగారు చేసిన టీవీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. భవిష్యత్‌లో ప్రతిభ గల సింగర్స్ మరింతమంది వస్తారని ఆశిస్తున్నాను. ► తమిళంలో ఓ సినిమాకి ప్రొడక్షన్ చేస్తున్నాను. సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టే ఆలోచన నాకు ఇప్పట్లో లేదు. -
ముగింపు మన చేతుల్లో ఉండదు.. ఆసక్తిగా సుమంత్ ఫస్ట్ లుక్..
Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్‌లో సుమంత్ అట్రాక్ట్ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఎఫెక్టివ్‌గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam! 🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9 — Sumanth (@iSumanth) July 9, 2022 -
Sita Ramam: ఇంతందం దారి మళ్లిందా.. మెలోడీ అదిరింది
‘‘ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నాదా’ అంటూ పాడేస్తున్నారు దుల్కర్ సల్మాన్. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘సీతారామం’. రష్మికా మందన్న కీలక పాత్ర చేశారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఇంతందం దారి మళ్లిందా..’ అంటూ సాగే లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. కృష్ణకాంత్, మృణాల్, హను, విశాల్ హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘1965 యుద్ధం నేపథ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిన చిత్రమిది. ‘ఇంతందం దారి మళ్లిందా..’ పాటని కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. ఆ పాట వినగానే నాకు వేటూరిగారు గుర్తుకొచ్చారు. ఎస్పీ చరణ్ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రతి పాట మనసుని హత్తుకునేలా ఉంటుంది’’ అన్నారు విశాల్ చంద్రశేఖర్. ‘‘ఇంతందం దారి..’ పాట విన్న ప్రతిసారీ మనసు హాయిగా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది. ‘‘1965లో ఉండేలా స్వచ్ఛమైన తెలుగు పాట రాయమని హను ‘ఇంతందం దారి..’ పాట సందర్భం చెప్పి నప్పుడు ఆనందంగా అనిపించింది. ఈ పాట అత్యద్భుతంగా ఉంటుంది’’ అన్నారు కృష్ణకాంత్. -
‘‘సీతారామం’ కోసం వందల మంది రెండేళ్లు కష్టపడ్డాం’
‘‘సీతారామం’ కథ గొప్పగా ఉంటుంది. నటుడిగా నేను ఎంత స్కోర్ చేస్తానో తెలీదు కానీ సినిమా స్కోర్ చేస్తే నేను హ్యాపీ. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా’’ అన్నారు దుల్కర్ సల్మాన్. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వీనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. (చదవండి: ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్ సీన్ ఈజీ అయింది) ఈ సందర్భంగా హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘సీతారామం’ ఒక మ్యాజికల్ లవ్‌స్టోరీ. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడానికి వందల మంది రెండేళ్లుగా కష్టపడ్డాం. వైవిధ్యమైన ప్రదేశాల్లో మైనస్ 24 డిగ్రీల్లో కూడా షూట్ చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి’’ అన్నారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ‘‘మా బేనర్లో ‘మహానటి’లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న జెమినీ గణేశన్‌గారి పాత్రని దుల్కర్ బాగా చేశారు. తనకు మా మీద నమ్మకం ఎక్కువ. అందుకే దుల్కర్‌కి కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం. ఈ కథకి దుల్కర్ వెంటనే ఓకే చెప్పారు’’ అన్నారు స్వప్నాదత్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రష్మికా మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: -
టీజర్: ఎవరూ లేని హీరోకు ఇట్లు నీ భార్య అంటూ ఉత్తరాలు!
దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్ ముఖ్య పాత్రలు పోషించారు. శనివారం ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. 'లెఫ్టినెంట్ రామ్.. నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్క పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది' అంటూ హీరో గురించే ఆలోచిస్తున్న హీరోయిన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. ఎవరూ లేని అతడికి అన్నీ తానే అవడానికి రెడీ అవుతుంది హీరోయిన్. అతడికి ప్రేమలేఖలు రాయడం మొదలుపెడుతుంది. 'నీ భార్య సీతామహాలక్ష్మి' అంటూ అతడికి ఉత్తరాలు రాస్తుంది. ఆమె ఎవరా? అంటూ తన గురించి ఆలోచించడం మొదలుపెడతాడు హీరో. మరి వీరి ప్రేమ కావ్యాన్ని చూడాలంటే ఆగస్టు 5 వరకు వేచి చూడాల్సిందే! కాగా సీతారామంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఖరీదైన ఎస్యూవీ కారు కొన్న స్టార్ హీరో 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ -
సీతారామం రిలీజ్ డేట్ వచ్చేసింది!
దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 5న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా బుధవారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చరిత్రలోని పేజీల్లో దాగి ఉన్న ప్రేమలేఖ ‘సీతారామం’గా థియేటర్స్‌లోకి వస్తుంది’’ అని ట్వీట్ చేశారు దుల్కర్. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్. A love letter from the pages of history delivering soon to theatres near you…#SitaRamam Worldwide Release On 𝐀𝐮𝐠 𝟓𝐭𝐡, 𝟐𝟎𝟐𝟐 ♥️@mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @Composer_Vishal @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/CUfh6K9rlN — Dulquer Salmaan (@dulQuer) May 25, 2022 చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్లో స్టార్ హీరో కూతురు సందడి, ఫొటోలు వైరల్ -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్‌లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022