'సీతారామం'కు విదేశీ ప్రేమలేఖ.. ఎవరు రాశారంటే?  | A Letter From Poland Fan To Sitaramam Movie | Sakshi
Sakshi News home page

Sitaramam: 'సీతారామం'కు విదేశీ క్రేజ్.. ఏకంగా నాలుగు పేజీల ప‍్రేమలేఖ

Published Sun, Sep 18 2022 7:23 PM | Last Updated on Sun, Sep 18 2022 8:16 PM

A Letter From Poland Fan To Sitaramam Movie - Sakshi

మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ జంటగా నటించిన చిత్రం  'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకుడిగా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన‍్ని అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ సినిమాపై తమ ప్రేమను చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అందరూ తమకు నచ్చిన రీతిలో అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

(చదవండి: గుర్తు పట్టలేనంతగా సీతారామం హీరోయిన్..  ఆమెకు ఏమైంది..!)

అయితే  తాజాగా ఈ చిత్రానికి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. పోలెండ్‌కు చెందిన మోనికా అనే  అభిమాని.. ఈ సినిమాపై తన ప్రేమను పంచుకున్నారు.  నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్‌లో  పోస్ట్​ చేశారు. " సీతారామం చిత్ర యూనిట్​కు పోలాండ్​ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" ట్వీట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement