Dulquar Salman
-
ఓటీటీకి వచ్చేసిన వందకోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. విడుదలైన మూడు సినిమాలు హిట్‌గా నిలిచాయి. శివకార్తికేయన్ అమరన్, కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ దివాళీకి విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే వీటిలో అమరన్ ఇంకా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే వీటిలో సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ ఇవాళే ఓటీటీకి వచ్చేసింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది.అసలు కథేంటంటే..?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
లక్కీ భాస్కర్‌తో 'మీనాక్షి చౌదరి' రొమాన్స్.. షూటింగ్ ఫోటోలు చూశారా..?
-
టాలీవుడ్ ను కబ్జా చేస్తున్న దుల్కర్ సల్మాన్
-
'లక్కీ భాస్కర్' కలెక్షన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సినిమాల్లో 'లక్కీ భాస్కర్' జోరు చూపిస్తోంది. మిగిలిన మూవీస్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దుల్కర్ చిత్రానికి ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే అదే నిజమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. బ్యాంకింగ్ రంగంలోని మోసాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ తీసిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు రూ.12.7 కోట్లు గ్రాస్ రాగా, రెండో రోజు కూడా అంతే స్టడీగా వచ్చాయి. కాస్త రూ.13.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజుల్లో రూ.26.2 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.దుల్కర్‌తో పాటు మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి రచన-దర్శకత్వం ఒకెత్తయితే, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర 'లక్కీ భాస్కర్' నెమ్మదిగా పికప్ అవుతోంది. ఈ వీకెండ్ ముగిసేసరికి రూ.50 కోట్ల వసూళ్లు మార్క్ చేరుకుంటుదేమో చూద్దాం!(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)Our Baskhar is 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 at the box office, 𝟐𝟔.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 worldwide in 2 Days! 🔥💰#BlockbusterLuckyBaskhar 💥💥𝑼𝑵𝑰𝑽𝑬𝑹𝑺𝑨𝑳 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🏦 #LuckyBaskhar In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3… pic.twitter.com/KHw1GjC2kL— Dulquer Salmaan (@dulQuer) November 2, 2024 -
'ఇంతకంటే పెద్ద హిట్ ఎవరైనా తీయగలరా?'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
సీతారామం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు మీడియా మిత్రులకు ఆయన పార్టీ ఇస్తానని మాటిచ్చారు. లక్కీ భాస్కర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా నాగవంశీ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఒక్క నెగెటివ్ రివ్యూ గానీ.. నెగెటివ్ కామెంట్ కానీ చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తానన్నారు.తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. లక్కీ భాస్కర్లో ఎవరూ ఒక్క నెగెటివ్ పాయింట్‌ను పట్టుకోలేకపోయారని అన్నారు. ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎవరూ కూడా చేయలేకపోయారు. ఇంతకంటే పెద్ద ఎవరైనా కొడతారా? అని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇప్పుడు మీకు తప్పును పట్టుకోలేకపోయిందుకు పార్టీ ఇవ్వాలని ఫన్నీగా కామెంట్స్ చేశారు. కాగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. -
'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
'సీతారామం'తో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న దుల్కర్ సల్మాన్.. హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్స్ వేసినప్పుడే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఇక తొలిరోజు వసూళ్లలోనూ మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దుల్కర్- వెంకీ అట్లూరి కాంబోలో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.స్వతహాగా తెలుగు హీరో కానప్పటికీ దుల్కర్ 'లక్కీ భాస్కర్' సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి. దీపావళి లాంగ్ వీకెండ్ ఉంది. వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. కాబట్టి ఈ మూవీతో పాటు క, అమరన్ చిత్రాలకు కలెక్షన్ పరంగా బాగా కలిసి రావొచ్చనిపిస్తోంది. దిగువన 'లక్కీ భాస్కర్' రివ్యూ ఉంది. దానిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)Baskhar's 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 start at the Box-Office 🔥#LuckyBaskhar Grosses over 𝟏𝟐.𝟕𝟎 𝐂𝐑 on 𝐃𝐀𝐘 𝟏 Worldwide! 💰𝑼𝑵𝑨𝑵𝑰𝑴𝑶𝑼𝑺 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🤩🏦In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/B0VTxFbI07— Dulquer Salmaan (@dulQuer) November 1, 2024 -
'లక్కీ భాస్కర్' అలాంటి సంతృప్తిని కలిగించింది: నాగవంశీ
ప్రతి ఏడాది చాలా సినిమాలు రిలీజ్ చేస్తుంటాం. అయితే వాటిలో కొన్ని మాత్రమే మంచి సినిమాలు చేశామని సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సంతృప్తిని ‘లక్కీ భాస్కర్’కలిగించింది’ అని అన్నారు నిర్మాత నాగవంశీ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘లక్కీ భాస్కర్’ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాం. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది.→ జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో సినీ ప్రయాణం కొనసాగుతుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరిని మేము నమ్మాం. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాం.→ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం.→ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు.→ ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.→ ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా చూసి అంత తేలికగా సంతృప్తి చెందడు. అలాంటి నవీన్ సినిమా బాగుంది చూడమని చెప్పాడు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. -
'శ్రీమతి గారు' మెలోడీ సాంగ్ వీడియో రిలీజ్
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. 90స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇదివరకే 'శ్రీమతి గారు' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు దాని పూర్తి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత)'సర్' మూవీ తీసిన వెంకీ అట్లూరి.. 'లక్కీ భాస్కర్' తీశాడు. అందులో మాస్టారూ మాస్టారూ పాట లాంటి మెలోడీ గీతాన్నే ఇందులో అనుకున్నాడో ఏమో గానీ.. 'శ్రీమతి గారు' పాట అలాంటి ఫీల్ ఇచ్చింది. వింటుంటే భలే అనిపించింది. (ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి) -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో మెప్పించిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీతో తన గ్లామర్‌తో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. సితార్ సాంగ్‌లో తన అందచందాలతో ముగ్ధుల్ని చేసింది. మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కాంత మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇటీవలే దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగిన ఈ మూవీకి టాలీవుడ్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 1950లో మద్రాసు నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A collaboration of two creative powerhouses for an epic tale💥 @DQsWayfarerFilm and @SpiritMediaIN join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥Starring @dulQuer #BhagyashriBorse Directed by #SelvamaniSelvaraj Produced by @DQsWayfarerFilm@RanaDaggubati pic.twitter.com/d0r91YIkM3— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2024 -
సీతారామం హీరో బర్త్ డే.. తెలుగులో మరో మూవీ!
సీతారామం మూవీతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మరో కొత్త మూవీని ప్రకటించారు. తెలుగులో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా దుల్కర్ పుట్టిన రోజు కావడంతో మూవీ టైటిల్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణసంస్థ స్వప్న సినిమాస్ దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్ సాంప్రదాయ కుర్తా, ఎరుపు కండువా ధరించి కనిపించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా..దుల్కర్ నటించిన లక్కీ భాస్యర్ సెప్టెంబర్ 7వ తేదీ 2024న విడుదల కానుంది. ఆకాశంలో ఒక తార 💙Wishing a blockbuster birthday to our STAR @Dulquer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥#AakasamLoOkaTara@pavansadineni @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/MIJpZjDsrI— Swapna Cinema (@SwapnaCinema) July 28, 2024 -
ఆ విషయాన్ని లీక్ చేసిన నాగ్ అశ్విన్.. ఆ హీరోలు కూడా ఉన్నారు!
రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మరికొద్ది గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ కూడా పూర్తి కావడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.అయితే రిలీజ్ ముందు రోజు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా వేదికగా ప్రభాస్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే అతిథి పాత్రల్లో నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటించారనే టాక్ వినిపించింది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరి, వీళ్లు నటించారా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. "Dulquer Salmaan & Vijay Deverakonda are in the Film" - @nagashwin7 🔥#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DulquerSalmaan #VijayDeverakonda pic.twitter.com/HbGDVGO3kv— Ayyo (@AyyoEdits) June 26, 2024 -
లక్కీ భాస్కర్ డేట్ ఫిక్స్
థియేటర్స్‌లోకి ‘లక్కీ భాస్కర్’ వచ్చే సమయం ఖరారైంది. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఈ సినిమా కొత్త ΄ోస్టర్‌ను కూడా బుధవారం విడుదల చేశారు మేకర్స్. ‘‘1980– 1990 కాలంలో నాటి బొంబాయి (ముంబై) నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఓ సాధారణ బ్యాంకు క్యాషియర్ అయిన లక్కీ భాస్కర్ అసాధారణ ప్రయణాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: నిమిష్ రవి. -
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
పెళ్లి చేస్కో బాగుంటుందని దుల్కర్ చెప్తూ ఉంటాడు..!
-
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. అదిరిపోయిన గ్లింప్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కంగువా షూటింగ్లో బిజీగా ఉన్న హీరో.. సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) ఫేమ్ సుధా కొంగరతో మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సూర్య 43 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!) గ్లింప్స్ చూస్తే తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, మలయాళ నటి నజ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. సుధా కొంగర, సూర్య కాంబినేషన్లో వచ్చిన సూరారై పోట్రు చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. సూర్య అతిథిగా కనిపించనున్నారు. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) My next! With an awesome bundle of talents@Suriya_offl @dulQuer #Nazriya @MrVijayVarma @gvprakash #Jyotika @rajsekarpandian @meenakshicini #Suriya43 has begun! pic.twitter.com/6EBQNUL301 — Sudha Kongara (@Sudha_Kongara) October 26, 2023 -
అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్!
సీతారామంతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రానా.. తన స్నేహితుడు దుల్కర్‌పై ప్రశంసలు కురిపించాడు. (ఇది చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా) అయితే అదే సమయంలో ఓ స్టార్ హీరోయిన్ను ఉద్దేశించి రానా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే 2018లో దుల్కర్, సోనమ్ కపూర్ జంటగా 'ద జోయా ఫ్యాక్టర్' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన రానాకు ఆమె వ్యవహరించిన తీరు కోపం తెప్పించిందట. దుల్కర్ సెట్లో వెయిట్ చేస్తుంటే.. తాను మాత్రం భర్తతో ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేసిందని అన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే రానా వివరణ ఇచ్చారు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తన కామెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న సోనమ్, దుల్కర్‌లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్‌కు మంచి స్నేహితురాలు కూడా అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. రానా క్షమాపణల తర్వాత సోనమ్ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. అది యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్వెల్ట్ రాసిన కోటేషన్. మె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. 'నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రత్యేకించి అలాంటి వ్యక్తుల గురించి. సంకుచితమైన మైండ్‌సెట్ గలవారే వ్యక్తుల గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ వాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. అలాగే గొప్ప మేధావులు ఆలోచనల గురించి చర్చిస్తారు.' అంటూ ఆ కోటేషన్లో ఉంది. అయితే ఈ కోట్ టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించి చేసిందనే చర్చ మొదలైంది. రానా క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఖుషి ఈవెంట్లో మీడియా, మహిళలపై దౌర్జన్యం.. లోనికి రాన్వివకుండా..) -
ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, నటుడు దుల్కర్ సల్మాన్‌లకు హీరో రానా క్షమాపణలు చెప్పాడు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుదోవపట్టిస్తున్నందుకు చింతిస్తున్నానని, ఏది ఏమైనా తన కామెంట్స్ కారణంగా ఇబ్బందిపడుతున్న సోనమ్, దుల్కర్‌లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేశాడు. (చదవండి: 'వ్యూహం'టీజర్: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్లేదు!) వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం‘కింగ్ ఆఫ్ కోత’. రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రిరీలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా రానా.. దుల్కర్ మంచితనం గురించి మాట్లాడుతూ...‘ఓ రోజు దుల్కర్ నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన పెద్ద నటి హీరోయిన్. షూటింగ్ సమయంలో ఆమె నటనపై ఫోకస్ చేయకుండా.. లండన్‌లో ఉన్న భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దుల్కర్ ఎండలో అలాగే నిలబడి పోయాడు. ఆమె ఎక్కువ టేకులు తీసుకున్నా.. దుల్కర్ మాత్రం ఓపికగా అలానే ఎదురు చూశాడు. నాకే కోపం వచ్చి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌ని నేలకేసి కొట్టాను. కానీ దుల్కర్ మాత్రం చాలా సహనంగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. రానా ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ సోనమ్ కపూర్‌నే అని నెట్టింట ప్రచారం జరిగింది. ఆమెను టార్గెట్ చేస్తూ నెగెటివ్ ప్రచారం చేయడంతో తాజాగా రానా ఆ హీరోయిన్‌కు సారి చెప్పాడు. I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted. I take… — Rana Daggubati (@RanaDaggubati) August 15, 2023 -
సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్...
-
న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్‌కు లవ్ లెటర్స్
న్యూజెర్సీ: ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ఆండ్ గ్రీట్‌లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని,ఈ ఆవకాశం కల్పించిన ఉమానియా టీంకి దుల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను ఉత్సాహంగా నిర్వహించారు. 600లకుపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నారైల మధ్య చిత్రయూనిట్ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో UBlood app గురించి వివరించారు. యాప్ ఫౌండర్ జై యలమంచిలి. రక్తదానం, అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారంతో అద్భుతమైన యాప్ ని సృష్టించిన జై యలమంచిలి పై ప్రశంసలు కురిపించారు హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ ఈవెంట్లో అధిక సంఖ్యలో పాల్గొన్న యువతకు స్పెషల్ టాస్క్ ఇవ్వడం ప్రత్యకేంగా నిలిచింది. హీరో దుల్కర్ సల్మాన్ కు - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కు లవ్ లెటర్ రాసి ఇంప్రెస్ చేయమని యూత్‌ను మరింత ఉత్సాహపరిచారు. యాంకర్ ఉదయభాను. దీంతోపాటు చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అలరించింది. ఈ సినిమాలోని ఒక పాటను పాడిన చిన్నారి ఈషాన్వి ని డైరెక్టర్ హను రాఘవపూడి అభినందించారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమానికి U-BLOOD, JAI SWARAJYA, JSW TV, బాలజీ ప్లవర్స్, కోరల్ బీడ్స్.. గ్రాండ్ స్పాన్సర్ చేశారు. ఈ మీట్ ఆండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్‌కు సహకరించిన ,గ్రాండ్ స్పాన్సర్స్ , మిగతా స్పాన్సర్లుకి ,ప్రేక్షకులందరికి ఉమానియా టీమ్ తరపున లక్ష్మీ దేవినేని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
'సీతారామం'కు విదేశీ ప్రేమలేఖ.. ఎవరు రాశారంటే?
మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకుడిగా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై తమ ప్రేమను చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అందరూ తమకు నచ్చిన రీతిలో అభిమానాన్ని తెలియజేస్తున్నారు. (చదవండి: గుర్తు పట్టలేనంతగా సీతారామం హీరోయిన్.. ఆమెకు ఏమైంది..!) అయితే తాజాగా ఈ చిత్రానికి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. పోలెండ్‌కు చెందిన మోనికా అనే అభిమాని.. ఈ సినిమాపై తన ప్రేమను పంచుకున్నారు. నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. " సీతారామం చిత్ర యూనిట్‌కు పోలాండ్ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" ట్వీట్ చేసింది. My letter to the #SitaRamam Team❤️sent all the way from Poland🇵🇱 to India🇮🇳. I don't know if someone will read it because it's really long😬but I really wanted to express my love and gratitude.🙏🥹 Love you forever.❤️ @VyjayanthiFilms @hanurpudi @dulQuer @mrunal0801 @iamRashmika pic.twitter.com/xAlXlouc30 — Monika from Poland🇵🇱 (@PolishMonika) September 15, 2022 -
‘ఆ స్టార్ హీరోతో నన్ను పోల్చడమంటే.. ఆయనను అవమానించినట్లే’
మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కాంబినేషన్లో వచ్చిన 'సీతారామం' సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ అదరగొట్టింది. ఈ సందర్భంగా హిందీ వెర్షన్ ‘సీతారామం’ సక్సెస్ మీట్లో పాల్గోన్న దుల్కర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీతారామం చూసిన బి-టౌన్ ప్రేక్షకులు దుల్కర్‌ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో పోల్చుతున్నారు. ఈ క్రమంలో సక్సెస్ మీట్లో ఓ విలేకరి దీనిపై దుల్కర్‌ను ప్రశ్నించగా ఆసక్తికర రితీలో స్పందించారు ఆయన. షారుక్ ఖాన్ ఒక లెజెండ్ అని.. దయచేసిన తనని ఆయనతో పోల్చవద్దని అన్నారు. (చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!) ‘నేను షారుక్‌కు పెద్ద అభిమానిని. నేను చిన్నప్పుడు షారుక్ సినిమాలను చూసేవాడిని. అలా చూసిన వాటిల్లో ‘దిల్వాలే దల్హనియా లేజాయేంగే’ నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు నేను షారుక్‌ను మనసులో తలచుకుంటా. ఆయన కేవలం నటుడే కాదు ఎంతో గొప్ప వ్యక్తి. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయన్ని అవమానించినట్లే. ఎందుకంటే షారుక్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు’ అంటూ దుల్కర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. -
‘సీతారామం’ఫస్ట్ రివ్యూ: థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు సరైన మూవీ!
దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో నటిస్తున్న రెండో చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రావడంతో ‘సీతారామం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా బాగుందని, ఇలాంటి చిత్రాలను థియేటర్స్‌లోనే చూడాలని ప్రభాస్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు చెబుతున్నారు. (చదవండి: ‘సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?) తాజాగా ఈ చిత్రంపై ఓ సీనియర్ టెక్నీషియన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్నపూర్ణలో మెయిన్ అవుట్ హోడ్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న శ్రీ సీవీరావు సోషల్ మీడియా వేదికగా ‘సీతారామం’పై ప్రశంసలు కురిపించాడు. ‘ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో 'సీతారామం' వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని, రైటింగ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చాలా బాగుంది. ప్రతీ క్రాఫ్ట్ కు సంబంధించిన టెక్నీషియన్స్ తమ పూర్తి ఎఫర్ట్ తో ఈ మూవీకి వర్క్ చేశారు. మీ విలువైన సమయానికి థియేట్రికల్ అనుభూతిని పొందడానికి సరైన సినిమా ఇది' అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. -
రిలీజ్‌కు ఒక్క రోజు ముందు భారీ షాక్.. అక్కడ ‘సీతారామం’ బ్యాన్!
విడుదలకు ఒక్క రోజు ముందు ‘సీతారామం’చిత్రానికి భారీ షాక్ తగిలింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?) ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర యూనిట్‌కి సెన్సార్ భారీ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుందట. మరి సెన్సార్ బోర్డ్ నిజంగానే గల్ఫ్ దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేస్తారా? లేదా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్‌కు అనుమతి ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడంతో టాలీవుడ్లో ‘సీతారామం’పై భారీ అంచనాలు ఉన్నాయి. -
‘సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక కీలక పాత్ర సోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న(ఆగస్ట్ 3)జరిగిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో ‘సీతారామం’పై మరింత హైప్ క్రియేట్ అయింది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.18.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. నైజాంలో అత్యధికంగా రూ. 5 కోట్లు అమ్ముడు అవ్వగా.. సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.5 కోట్లు, ఇతర భాషాల్లో 1.50 కోట్లు బిజినెస్ చేసిందట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్) -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్‌కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్‌కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్‌తో వెబ్‌సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్‌తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్‌కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్‌లో దుల్కర్‌తోపాటు రాజ్‌కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్‌లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్‌గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్‌లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్‌కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్‌లో సోనాక్షి పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్‌తోనే కెరీర్‌ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్‌ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్‌ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్‌కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్‌లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్‌లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్‌లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్‌హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్‌ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.