'సీతారామం'తో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న దుల్కర్ సల్మాన్.. హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్స్ వేసినప్పుడే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఇక తొలిరోజు వసూళ్లలోనూ మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)
సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దుల్కర్- వెంకీ అట్లూరి కాంబోలో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్‌టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
స్వతహాగా తెలుగు హీరో కానప్పటికీ దుల్కర్ 'లక్కీ భాస్కర్' సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి. దీపావళి లాంగ్ వీకెండ్ ఉంది. వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. కాబట్టి ఈ మూవీతో పాటు క, అమరన్ చిత్రాలకు కలెక్షన్ పరంగా బాగా కలిసి రావొచ్చనిపిస్తోంది. దిగువన 'లక్కీ భాస్కర్' రివ్యూ ఉంది. దానిపై ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)
Baskhar's 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 start at the Box-Office 🔥#LuckyBaskhar Grosses over 𝟏𝟐.𝟕𝟎 𝐂𝐑 on 𝐃𝐀𝐘 𝟏 Worldwide! 💰
𝑼𝑵𝑨𝑵𝑰𝑴𝑶𝑼𝑺 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🤩🏦
In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/B0VTxFbI07— Dulquer Salmaan (@dulQuer) November 1, 2024
Comments
Please login to add a commentAdd a comment