
కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశాడు. చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నట్లుగానే 'క' సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మరో మూడు చిత్రాలు కూడా ఇదే రోజున బిగ్ స్క్రీన్‌పై విడుదలయ్యాయి. కానీ తొలిరోజే 'క' మంచి నంబర్స్ నమోదు చేసింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)
'క' సినిమాకు తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వచ్చింది. కిరణ్ అబ్బవరం గత మూవీస్‌తో పోలిస్తే దీనికి వస్తున్న స్పందనే కాదు వసూళ్లు కూడా చాలా ఎక్కువని చెప్పొచ్చు. తొలిరోజే రూ6 కోట్లకు పైన వచ్చాయంటే వీకెండ్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల బాట పట్టడం గ్యారంటీ.
మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన 'క' సినిమాలో కిరణ్ అబ్బవరం, నయన్ సారి, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టోరీ కాస్త పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటం, క్లైమాక్స్ 20 నిమిషాలు ఎవరూ ఊహించని రీతిలో సాగడం ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంతకీ మీరు 'క' చూశారా? ఒకవేళ చూడకపోతే ఈ రివ్యూ చదవేయండి.
(ఇదీ చదవండి: KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ)

Comments
Please login to add a commentAdd a comment