Day 1 Collection
-
'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
'సీతారామం'తో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న దుల్కర్ సల్మాన్.. హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. ప్రీమియర్స్ వేసినప్పుడే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఇక తొలిరోజు వసూళ్లలోనూ మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దుల్కర్- వెంకీ అట్లూరి కాంబోలో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.స్వతహాగా తెలుగు హీరో కానప్పటికీ దుల్కర్ 'లక్కీ భాస్కర్' సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి. దీపావళి లాంగ్ వీకెండ్ ఉంది. వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. కాబట్టి ఈ మూవీతో పాటు క, అమరన్ చిత్రాలకు కలెక్షన్ పరంగా బాగా కలిసి రావొచ్చనిపిస్తోంది. దిగువన 'లక్కీ భాస్కర్' రివ్యూ ఉంది. దానిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)Baskhar's 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 start at the Box-Office 🔥#LuckyBaskhar Grosses over 𝟏𝟐.𝟕𝟎 𝐂𝐑 on 𝐃𝐀𝐘 𝟏 Worldwide! 💰𝑼𝑵𝑨𝑵𝑰𝑴𝑶𝑼𝑺 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🤩🏦In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/B0VTxFbI07— Dulquer Salmaan (@dulQuer) November 1, 2024 -
'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశాడు. చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నట్లుగానే 'క' సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మరో మూడు చిత్రాలు కూడా ఇదే రోజున బిగ్ స్క్రీన్‌పై విడుదలయ్యాయి. కానీ తొలిరోజే 'క' మంచి నంబర్స్ నమోదు చేసింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'క' సినిమాకు తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వచ్చింది. కిరణ్ అబ్బవరం గత మూవీస్‌తో పోలిస్తే దీనికి వస్తున్న స్పందనే కాదు వసూళ్లు కూడా చాలా ఎక్కువని చెప్పొచ్చు. తొలిరోజే రూ6 కోట్లకు పైన వచ్చాయంటే వీకెండ్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల బాట పట్టడం గ్యారంటీ.మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన 'క' సినిమాలో కిరణ్ అబ్బవరం, నయన్ సారి, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టోరీ కాస్త పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటం, క్లైమాక్స్ 20 నిమిషాలు ఎవరూ ఊహించని రీతిలో సాగడం ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంతకీ మీరు 'క' చూశారా? ఒకవేళ చూడకపోతే ఈ రివ్యూ చదవేయండి.(ఇదీ చదవండి: KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ) -
రజినీ 'వేట్టయన్'.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ క్రేజ్ ఉంటుంది. ఈసారి తమిళనాడు వరకు ఓకే గానీ తెలుగులో పెద్దగా హడావుడి లేకుండానే 'వేట్టయన్' రిలీజైపోయింది. దసరా కానుకగా ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ వినిపించింది. వీకెండ్ గడిస్తేగాని అసలు టాక్ ఏంటనేది బయటపడదు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మరోవైపు 'వేట్టయన్' చిత్రానికి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. తెలుగు వరకు అయితే దాదాపు రూ.3 కోట్లు వరకు వచ్చిన సమాచారం.తెలుగులో అయితే 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలానే 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తాజాగా థియేటర్లలో రిలీజయ్యాయి. వీటని దాటుకుని 'వేట్టయన్' తెలుగులో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తొలిరోజు అయితే పర్లేదనిపించింది గానీ వీకెండ్ ముగిసేసరికి ఎన్ని డబ్బులు వస్తాయనే దానిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!) -
అఫీషియల్.. 'దేవర' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది గానీ దాదాపు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్స్ అయిపోయాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతిచోట దేవరోడి బీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తొలిరోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. సోలోగా వచ్చిన తారక్.. రూ.150 కోట్ల మార్క్ తొలిరోజే దాటేశాడు.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)ఓవర్సీస్లో రిలీజ్‌కి ముందే దాదాపు రెండున్నర మిలియన్ల వసూళ్లని అందుకున్న దేవర.. తొలిరోజు ముగిసేసరికి 3.8 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక నైజాంలో 'దేవర'కు తొలిరోజు రూ.20 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా అంటే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ఘనంగా ప్రకటించకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.400 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?)No force can hold back the TSUNAMI OF #DEVARA 🔥#BlockbusterDEVARA pic.twitter.com/oGhYIZ0TuG— Devara (@DevaraMovie) September 28, 2024 -
'కల్కి' రేంజ్ ఇది.. నైజాంలో వసూళ్ల రికార్డ్ బ్రేక్
ప్రభాస్ 'కల్కి' రిలీజై అప్పుడే ఓ రోజు అయిపోయింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిగతా చోట్ల ఏమో గానీ నైజాంలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని దాటేయడం విశేషం.(ఇదీ చదవండి: 'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు)'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా రచ్చ లేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' కేవలం నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది.కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 'కల్కి' ఈ రేంజు వసూళ్లు సొంతం చేసుకుందంటే ఓవరాల్ Day-1 కలెక్షన్స్‌లో ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొట్టేసి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అయితే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా తొలిరోజు వసూళ్లు గురించి పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ) -
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం దుమ్మరేపాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. చాన్నాళ్లుగా సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలా గ్రాండ్ ఓపెనింగ్ లభించింది. ఇంతకీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తొలిరోజు వసూళ్లు ఎంతంటే?(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీశారు. ఇప్పటివరకు గోదావరి అంటే పచ్చని పొలాలు, చెరువులు లాంటివి చూపించేవారు. కానీ ఇందులో మాత్రం నరుక్కోవడం, చంపుకోవడం లాంటివి చూపించి షాకిచ్చారు. అయితే సినిమాలో సరిగా డ్రామా పండలేదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏదేమైనా సరే ఓ మాదిరి టాక్ సొంతం చేసుకున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ వీకెండ్ అయ్యేసరికి ఎన్ని కోట్ల గ్రాస్ వస్తుంది అనే దానిబట్టి లాభాల్లోకి వెళ్తుందా? లేదా అనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ) -
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
గత రెండు వారాలుగా థియేటర్లని చాలా చోట్ల మూసేశారు. ఈ వీకెండ్ పలు చిత్రాలు రిలీజ్ కావడంతో అవి మళ్లీ తెరుచుకున్నాయి. ఇక వచ్చిన వాటిలో దిల్ రాజు నిర్మించిన 'లవ్ మీ'.. ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపింది. మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. కానీ తొలిరోజు వచ్చిన వసూళ్లు మాత్రం నెటిజన్లకు షాకిచ్చాయి. ఇంతకీ ఎన్ని కోట్లంటే?(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)తెలుగులో హారర్ సినిమాలకు డిమాండ్ ఉంది. సరైన కథతో తీయాలే గానీ ఎప్పుడొచ్చినా సరే అలరించడం పక్కా. ఇప్పుడు దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లవ్ మీ'. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.అయితే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం అనే విషయంలో ఇంతకు ముందులా జనాలు ఆసక్తి చూపించట్లేదు. అయితే ఇప్పుడు 'లవ్ మీ' వసూళ్లు చూసిన తర్వాత నిజంగా అంతమంది జనాలు ఈ సినిమా చూడటానికి వచ్చేశారా? అనే సందేహం వస్తోంది. అలానే మూవీ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్ ఆగితే తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: '96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్) -
తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
ప్రతివారంలానే ఈసారి కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కాకపోతే చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ లేకపోవడంతో డబ్బింగ్ చిత్రాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. అలా తాజాగా కార్తీ 'జపాన్'తో పాటు 'జిగర్ తాండ డబుల్ ఎక్స్' అనే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అందుకు తగ్గట్లే తొలిరోజు కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) 'ఆవారా', 'యుగానికొక్కడు'. 'ఖైదీ' లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తీ తాజాగా 'జపాన్' సినిమాతో వచ్చాడు. అయితే దొంగ-పోలీస్ కథతో తీసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైంది. రివ్యూలు అన్ని అలానే వచ్చాయి. దీంతో తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.కోటి మాత్రమే వచ్చిందట. తమిళంలో మాత్రం రూ.3.5 కోట్ల పైనే వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలా ఓవరాల్‌గా రూ.5 కోట్ల లోపే కలెక్షన్ వచ్చాయి. వీకెండ్ లో కాస్తోకూస్తో డబ్బులు వస్తాయి తప్పితే లాంగ్ రన్ లో నష్టాలు రావడం గ్యారంటీ! ఇకపోతే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తీసిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఇది కూడా 'జపాన్'లానే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. లారెన్స్, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ ల్యాగ్ ఉండటం సినిమాకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలిరోజు మొత్తంగా రూ.1.75 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన డబ్బింగ్ చిత్రాలు తుస్సుమనిపించాయి. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) -
హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్'
బాద్షా షారుక్ ఖాన్ మరో హిట్ కొట్టేశాడు. 'జవాన్'తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వస్తున్న టాక్, కలెక్షన్స్ చూస్తుంటే.. మరో రూ.1000 కోట్ల పక్కా అనిపిస్తుంది. ఈ ఏడాది 'పఠాన్'తో దుమ్ములేపాడు. ఇప్పుడు మరోసారి రచ్చ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో 'జవాన్', ప్రభాస్ 'ఆదిపురుష్'ని మాత్రం దాటలేకపోయింది. కింగ్ ఖాన్ షారుక్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత.. ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇప్పుడు 'జవాన్'తో సూపర్‌హిట్ కొట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ఈ చిత్రంలో కథ కొత్తగా లేనప్పటికీ.. స్రీన్ ప్లే రేసీగా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే రేంజులో ఉండేసరికి జనాలకు సినిమా నచ్చేసింది. దీంతో తొలిరోజు ఏకంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?) అయితే హిట్‌తో షారుక్ ఖాన్.. తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించి ఉండొచ్చు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ ని మాత్రం దాటలేకపోయాడు. ఎందుకంటే ఈ ఏడాది జూన్ లో రిలీజైన 'ఆదిపురుష్' చిత్రానికి తొలిరోజు రూ.136.84 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నట్లే. మరి డార్లింగ్ హీరోని బీట్ చేయాలంటే మళ్లీ 'సలార్' రావాలేమో? 'జవాన్' కథేంటి? భారత్-చైనా సరిహద్దుల్లోని నదిలో గాయాలతో ఉన్న ఓ వ్యక్తి కొట్టుకొస్తాడు. కట్ చేస్తే ముంబయిలో విక్రమ్ రాథోడ్ (షారుక్ ఖాన్).. ఆరుగురు అమ్మాయిలతో కలిసి మెట్రో ట్రైన్‌ని హైజాక్ చేస్తాడు. ప్రయాణికుల్ని విడిచిపెట్టాలంటే రూ.40 వేల కోట్లు కావాలని అంటాడు. అనుకున్నది సాధిస్తాడు కూడా. ఇంతకీ విక్రమ్ రాథోడ్ ఎవరు? జైలర్‌గా పనిచేస్తున్న ఆజాద్‌తో ఇతడికి సంబంధం ఏంటనేదే 'జవాన్' స్టోరీ. (ఇదీ చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ) God is so kind Thank you everyone Thank you for the Massy-ive love ❤ Book your tickets now!https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/q1TdI37nJZ — atlee (@Atlee_dir) September 8, 2023 Top 5 Openers WW Box Office[2023]#Adipurush - ₹ 136.84 cr#Jawan - ₹ 125.05 cr#Pathaan - ₹ 106 cr#Jailer - ₹ 95.78 cr#PonniyinSelvan2 - ₹ 61.53 cr — Manobala Vijayabalan (@ManobalaV) September 8, 2023 -
మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్
గత నాలుగేళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 2023 సంవత్సరంలో తన సత్తా చాటుతున్నాడు. ఇదే ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. పఠాన్ తొలిరోజున భారత్‌లో రూ. 55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్'తో మరోసారి బాలీవుడ్ సింహాసనం తనదేనని 57 ఏళ్ల బాద్ షా నిరూపించాడు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే సూపర్ హిట్ టాక్ రావడంతో షారుక్ తన విజయపతాకాన్ని ఎగురవేశాడు. ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబడుతోంది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. షారుక్ ఖాన్ గత 5 సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ ► 2016లో విడుదలైన 'ఫ్యాన్' సినిమాతో షారుఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటికి వరుస ఫ్లాప్‌లతో ఉన్న ఆయనకు ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. ఈ చిత్రం తొలిరోజు రూ.19.10 కోట్లు వసూలు చేసింది. ► ఆ తర్వాతి సంవత్సరం 2017లో షారుఖ్ ఖాన్, పాకిస్థానీ నటి మహిరా ఖాన్ జంటగా నటించిన చిత్రం రయీస్.. షారుఖ్ ఖాన్‌కు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. ఈ సినిమా తొలిరోజే 20.40 కోట్లు రాబట్టింది. ► 2017లో 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాతో షారుక్ ఖాన్, ఇంతియాజ్ అలీతో పని చేయడం ఇదే మొదటిసారి. 2017లో విడుదలైన ఈ సినిమా షారుఖ్, అనుష్కల 'రబ్ నే బనాదీ'ల హిట్ పెయిరింగ్ ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా తొలిరోజు మొత్తం 15.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ► 2018 సంవత్సరంలో విడుదలైన 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత, బాలీవుడ్లో షారుక్ ఖాన్ కెరీర్ ముగిసిందని భావించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో షారుక్ ఖాన్ ఇంటికే పరిమితం అయ్యాడు. జీరో సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం 19.35 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ► షారుఖ్ ఖాన్ తన 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే చివరి సినిమాగా అని అందరూ భావించారు. 2018 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్'ని అభిమానులకు అందించాడు. ఈ సినిమా భారత్‌లో మొదటిరోజు ఏకంగా రూ. 55 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది. బాలీవుడ్లో అతనికి ఇంకా స్థానం ఉందని షారుక్ అప్పుడే అనుకున్నాడు. షారుక్ ఖాన్ కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం పఠాన్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం జవాన్ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'స్పై' తొలిరోజు కలెక్షన్స్.. నిఖిల్ సరికొత్త రికార్డ్
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు 'స్పై' అనే పాన్ ఇండియా చిత్రాన్ని మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మిశ్రమ స్పందన అందుకుంటోంది. అయినాసరే తొలిరోజు వసూళ్లలో రచ్చ చేసింది. హీరో నిఖిల్ అయితే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'స్పై' కథేంటి? రీసెర్ట్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో జై(నిఖిల్) ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ లో ఉండగా.. రా చీఫ్ శాస్త్రి ఆదేశాల మేరకు స్వదేశానికి తిరిగొస్తాడు. ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో ఖాదిర్ ఖాన్(నితిన్ మెహతా)ని చంపే క్రమంలో ఏజెంట్ సుభాష్ వర్దన్ ప్రాణాలు కోల్పోతాడు. అతడి చావు వెనక రహస్యం తెలుసుకోమని జైకి ఫైల్ అప్పగిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ జై ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏం జరిగిందనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) తొలిరోజు వసూళ్లు 'కార్తికేయ 2' సక్సెస్ వల్ల నిఖిల్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా అనేసరికి ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ 'స్పై' ఆ విషయంలో ఫెయిలైంది. రొటీన్ రెగ్యులర్ కథతో థియేటర్లలోకి వెళ్లిన ఆడియెన్స్ ని నిరాశపరిచింది. అయినాసరే అడ్వాన్ బుకింగ్స్ చాలా బాగా జరగడంతో తొలిరోజు ఏకంగా రూ.11.7 కోట్లు వసూళ్లని సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ హీరో నిఖిల్ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరికొత్త రికార్డ్ 'కార్తికేయ 2'తో తొలిరోజు రూ.8.50 కోట్లు సొంతం చేసుకున్న నిఖిల్.. 'స్పై' చిత్రంతో మరో మూడు కోట్లకు పైగా ఎక్కువగా సాధించాడు. తద్వారా తన కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లని అందుకున్నాడు. తొలిరోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి గానీ ఈ వీకెండ్ గడిస్తే గానీ అసలు సంగతి తెలియదు. అంతవరకు మనం వేచి చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే) Thank you 🙏🏽 ❤️ For this much love from you all🙏🏽 #Spy #SpyMovie pic.twitter.com/pBXqct6bw9 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2023 -
‘2.ఓ’ తొలి రోజు వసూళ్లు ఎంత..?
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ 2.ఓ. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా నిన్న(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవరాల్‌గా సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా 2.ఓ సత్తా చాటుతోంది. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తొలి రోజు వసూళ్లు 100, 150 కోట్లు అంటూ సందడి చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. సినిమా మీద భారీ హైప్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున అయ్యాయి. దీంతో సినిమా తొలి రోజు కలెక్షన్లు వంద కోట్లకు చేరువలో ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమా రిలీజ్ కావటంతో తొలిరోజు కలెక్షన్లు ఎంతన్నది లెక్క తేలాలంటే కొంత సమయం పట్టే అవకావం ఉంది. (‘2.ఓ’ మూవీ రివ్యూ) కేవలం తమిళనాట 30 కోట్లకు పైగా వసూళ్ల వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల వరకు కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇక అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించటంతో బాలీవుడ్‌లోనూ సినిమా భారీ వసూళ్లే సాధిస్తోంది. తొలి రోజు ఉత్తరాదిలో 20 నుంచి 25 కోట్ల వరకు వసూళ్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్కూడా కలుపుకుంటే 100 కోట్ల మార్క్ ఈజీగానే రీచ్ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. లెక్కలు సరిగ్గా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
పద్మావత్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..
సాక్షి, ముంబయి : వివాదాల నడుమ విశ్వవ్యాప్తంగా విడుదలైన సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక చిత్రం పద్మావత్ తొలిరోజు భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. పలు రాష్ట్రాల్లో హిందూ సంస్థలు, రాజపుత్రుల ఆందోళనలు కొనసాగినా వసూళ్లపై వాటి ప్రభావం కనిపించలేదు. నిరసనల భయంతో కొన్ని చోట్ల పలు థియేటర్లు ఈ మూవీని ప్రదర్శించేందుకు వెనుకాడినా బాక్సాఫీస్ వద్ద మూవీ తొలిరోజు సంతృప్తికర వసూళ్లు సాధించింది. తొలిరోజు పద్మావత్ మూవీకి దాదాపు రూ. 20 కోట్ల వసూళ్లు దక్కాయి. టాక్ బాగుండటంతో ముందుముందు కలెక్షన్లు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. పద్మావత్‌లో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇక రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్లూ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'. ఎలాంటి పబ్లిసిటీ, ప్రమోషన్స్ అవసరం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హిందీ, మరాఠి, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆడియన్స్ రియాక్షన్స్ ను పక్కనబెడితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా తన సత్తా చాటింది. తొలిరోజు కలెక్షన్ గా ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద రూ.8.40 కోట్ల వసూలు అయ్యాయి. సినిమా ఫార్మాట్ లో కాకుండా.. ఓ డాక్యుమెంటరీ తరహాలో సచిన్ జీవితాన్ని జేమ్స్ ఎర్స్ కిన్ తెరకెక్కించారు. కాగ అంతకమునుపే ఎంఎస్ ధోని, అజారుద్దీన్ బయోగ్రఫీలపై సినిమాలు వచ్చినప్పటికీ, వాటిల్లో బాలీవుడ్ నటులు ఆయా పాత్రల్లో నటించారు. కానీ సచిన్ సినిమాల్లో సచినే నటించడం ఇటు క్రికెట్ ఫ్యాన్స్ ను, అటు సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. నేడు యూకేలో కూడా ఈ సినిమా విడుదలైంది. సినీ విమర్శకుల మన్ననలను సైతం ఈ సినిమా చూరగొంటోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రివ్యూలు సైతం అద్భుతంగా ఉన్నాయి. ప్రఖ్యాత చలన చిత్ర విమర్శకుడు తరణ్ ఆదర్స్ సైతం ఈ మూవీ రివ్యూను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలతో పంచుకున్నాడు. ''మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ను డెలివరీ చేశారు.. కాంగ్రాక్ట్స్ సచిన్ అండ్ టీమ్'' అంటూ అనుష్క శర్మ ట్వీట్ చేసింది. రియల్ లైఫ్ హీరో, సచిన్ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సహకరంగా ఉందంటూ ప్రముఖుల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.