గత రెండు వారాలుగా థియేటర్లని చాలా చోట్ల మూసేశారు. ఈ వీకెండ్ పలు చిత్రాలు రిలీజ్ కావడంతో అవి మళ్లీ తెరుచుకున్నాయి. ఇక వచ్చిన వాటిలో దిల్ రాజు నిర్మించిన 'లవ్ మీ'.. ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపింది. మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. కానీ తొలిరోజు వచ్చిన వసూళ్లు మాత్రం నెటిజన్లకు షాకిచ్చాయి. ఇంతకీ ఎన్ని కోట్లంటే?
(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)
తెలుగులో హారర్ సినిమాలకు డిమాండ్ ఉంది. సరైన కథతో తీయాలే గానీ ఎప్పుడొచ్చినా సరే అలరించడం పక్కా. ఇప్పుడు దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లవ్ మీ'. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.
అయితే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం అనే విషయంలో ఇంతకు ముందులా జనాలు ఆసక్తి చూపించట్లేదు. అయితే ఇప్పుడు 'లవ్ మీ' వసూళ్లు చూసిన తర్వాత నిజంగా అంతమంది జనాలు ఈ సినిమా చూడటానికి వచ్చేశారా? అనే సందేహం వస్తోంది. అలానే మూవీ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్ ఆగితే తెలిసిపోతుంది.
(ఇదీ చదవండి: '96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్)
Comments
Please login to add a commentAdd a comment