asish
-
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
గత రెండు వారాలుగా థియేటర్లని చాలా చోట్ల మూసేశారు. ఈ వీకెండ్ పలు చిత్రాలు రిలీజ్ కావడంతో అవి మళ్లీ తెరుచుకున్నాయి. ఇక వచ్చిన వాటిలో దిల్ రాజు నిర్మించిన 'లవ్ మీ'.. ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపింది. మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. కానీ తొలిరోజు వచ్చిన వసూళ్లు మాత్రం నెటిజన్లకు షాకిచ్చాయి. ఇంతకీ ఎన్ని కోట్లంటే?(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)తెలుగులో హారర్ సినిమాలకు డిమాండ్ ఉంది. సరైన కథతో తీయాలే గానీ ఎప్పుడొచ్చినా సరే అలరించడం పక్కా. ఇప్పుడు దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లవ్ మీ'. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.అయితే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం అనే విషయంలో ఇంతకు ముందులా జనాలు ఆసక్తి చూపించట్లేదు. అయితే ఇప్పుడు 'లవ్ మీ' వసూళ్లు చూసిన తర్వాత నిజంగా అంతమంది జనాలు ఈ సినిమా చూడటానికి వచ్చేశారా? అనే సందేహం వస్తోంది. అలానే మూవీ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్ ఆగితే తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: '96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్) -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఏపీ వ్యాపారవేత్తతో వియ్యం
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లి కొద్దిరోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే.. విక్టరీ వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ కూడా ఈ మధ్యే ఘనంగా జరిగింది. మరోవైపు సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి శ్రీసింహకు ప్రముఖ నటుడు మురళీమోహన్ మనుమరాలు రాగతో పెళ్లి జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కుమారుడు, హీరో ఆశిష్ రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. రౌడీ బాయ్స్ సినిమాతో గతేడాది తెలుగుతెరకు పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాలేదని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆశిష్ త్వరలో సెల్ఫిష్ చిత్రంతో మళ్లీ తెరపైకి రానున్నాడు. కొద్దిరోజుల క్రితం దిల్ రాజు, శిరీష్ నాన్నగారు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంతో దిల్ రాజు ఫ్యామిలీ వియ్యం అందుకుంటున్నట్లు టాక్. దిల్ రాజు నాన్నగారు మరణించక ముందే ఈ పెళ్లి చర్చలు జరిగాయట. వీరి పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించి.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆశిష్ పెళ్లి సంబరాలు జరగనున్నాయిట. ఈ విషయంపై దిల్ రాజు కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు... కానీ ఆయన అభిమానుల కోసం త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. -
దేశంలో తగ్గని స్టార్టప్ కంపెనీల జోరు..!
దేశంలో స్టార్టప్ కంపెనీల జోరు అస్సలు తగ్గడం లేదు. తాజాగా ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే స్టార్టప్ కంపెనీ మార్చి 23న ఏ సిరీస్ ఫండ్ రైసింగ్'లో భాగంగా 200 మిలియన్ డాలర్లను సేకరించినట్లు తెలిపింది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ 1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ మొదటి రౌండ్'లో ఇంత మొత్తంలో ఫండ్ సేకరించడం ఇదే మొదటిసారి. కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో యునికార్న్ కంపెనీగా ఆక్సిజో ఫైనాన్షియల్ అవతరించింది. టైగర్ గ్లోబల్, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్, మ్యాట్రిక్స్ పార్టనర్స్, క్రియేషన్ ఇన్వెస్ట్ మెంట్స్ సంయుక్తంగా నాయకత్వం వహించాయి. సంవత్సరం కిందటే.. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్, ఇతరుల నుంచి మద్దతు పొందిన తర్వాత కల్రా భర్త ఆశిష్ మొహపాత్రా ఆఫ్‌బిజినెస్ కంపెనీ కూడా అదే విలువను చేరుకుంది. తయారీ & సబ్-కాంట్రాక్టింగ్ వంటి రంగాలలో ఎస్ఎమ్ఈల కోసం కొత్త మెటీరియల్ కొనుగోలు చేయడానికి సరిపోయే వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్'ను ఈ కంపెనీ అందిస్తుంది. ప్రారంభం నుంచి ఈ కంపెనీ మంచి లాభాల్లో కొనసాగుతుంది. "ఆఫ్ బిజినెస్, ఆక్సిజో రెండూ కూడా 50+ ఆర్థిక సంస్థలలో విశ్వాసాన్ని పెంపొందిస్తూ బలమైన రుణ ప్రొఫైల్ కలిగి ఉన్నాయి" అని ఆఫ్‌బిజినెస్ గ్రూప్ సీఈఓ ఆశిష్ మహాపాత్ర చెప్పారు. ఆదర్శంగా నిలుస్తున్న జంట కల్రా(38), మోహపాత్ర(41) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్వ విద్యార్థులు. మెకిన్సే & కోలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరూ కలుసుకున్నారు. వీరి రెండు స్టార్టప్‌లు కూడా లాభదాయకంగా ఉన్నట్లు వ్యాపారవర్గాల నుంచి వినిపిస్తోంది. కల్రా.. ఆక్సిజో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగా, మోహపాత్రా.. ఆఫ్బిజినెస్లో సీఈఓ. మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ & క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారత్ స్టార్టప్ పరిశ్రమలో అతిపెద్ద సిరీస్ ఏ రౌండ్లలో ఒకటైన ఆక్సిజోలో పెట్టుబడి పెట్టాయి. ఆక్సిజో అనేది ఆక్సిజన్ + ఓజోన్ పదాల మిశ్రమం. 2016 ప్రారంభంలో మరో ముగ్గురితో కలిసి ప్రారంభించిన ఈ జంట మొదటి స్టార్టప్ ఆఫ్‌బిజినెస్. ఆ తర్వాత కల్రా, మోహపాత్ర, మరో ముగ్గురు కలిసి 2017లో ఆక్సిజోను స్థాపించారు. (చదవండి: హోండా సరికొత్త రికార్డులు.. ఏకంగా 30 లక్షలకుపైగా..) -
ఆశిష్ మిశ్రా అరెస్ట్
న్యూఢిల్లీ/లక్నో/లఖీమ్‌పూర్: యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను శనివారం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అరెస్ట్ చేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మొదటి విడత సమన్లకు బదులివ్వని ఆశిష్‌మిశ్రా శుక్రవారం పోలీసులిచి్చన రెండో విడత సమన్లకు స్పందించారు. ఆశిష్ శనివారం ఉదయం 10.30 గంటలకు సిట్ కార్యాలయానికి రాగా డిప్యూటీ ఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలో అధికారుల బృందం 11 గంటలపాటు ప్రశి్నంచి, రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆశిష్ సహకరించడం లేదని, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు చెప్పా రు. ఈనెల 3న యూపీ డిప్యూటీసీఎం మౌర్య పర్యటన సమయంలో వాహనం ఢీకొని నలుగురు రైతులు చనిపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఒక వాహనంలో ఉన్నారని పేర్కొంటూ పోలీసులు ఆయనపై హత్య కేసు నమోదు చేశా రు. రైతులపై హింసను ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఉగ్రదాడిగా రైతు సంఘాలు అభివరి్ణంచాయి. వాళ్లని అరెస్ట్ చేయాలి.. లఖీమ్‌పూర్ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయనతోపాటు ఆయన కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు నివాళులర్పించేందుకు 12వ తేదీన టికోనియాలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే నలుగురు రైతుల అస్తికలతో 11వ తేదీన షహీద్ కిసాన్ యాత్ర చేపడతామన్నారు. 15న దసరా రోజున ప్రధాని, హోం మంత్రి దిష్టి»ొమ్మల దహనం, 18న రైల్ రోకో, 26న మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లఖీమ్‌పూర్‌ఖేరి హింస సందర్భంగా బీజేపీ కార్యకర్తలను చంపిన వారిని దోషులుగా భావించడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నా రు. నలుగురు రైతులను చంపినందుకు ప్రతిచర్యగానే ఈ ఘటన చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. లఖీమ్‌పూర్ హింస దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సింది పోయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రైతులను అణచివేసినట్లే, చట్టాలనూ పక్కనబెట్టాలని చూస్తోం దన్నారు. అదేవిధంగా, లఖీమ్‌పూర్ ఘటనలకు నిరసనగా ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా నివాసం ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ బృందం ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచడంతో దీక్షను విరమిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సిద్ధూ ప్రకటించారు. సీజేఐని ప్రశంసించిన దుష్యంత్ దవే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చూపిన చొరవను సుప్రీం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ప్రశంసించారు. ఘటనలపై విచారణ సమయంలో ఆయన చాలా బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించారన్నారు. కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తాయన్న భరోసాను సీజేఐ కలి్పంచారన్నారు. సమావేశంలో తికాయత్, యోగేంద్రయాదవ్ -
జేబీ కెమ్- ఏడీఎఫ్ ఫుడ్స్.. హైజంప్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడికావడంతో ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ ఏడీఎఫ్ ఫుడ్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. జేబీ కెమికల్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెల్త్‌కేర్ కంపెనీ జేబీ కెమికల్స్ రూ. 120 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 92 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 522 కోట్లను అధిగమించింది. ఇబిటా 62 శాతం ఎగసి రూ. 155 కోట్లను తాకగా.. మార్జిన్లు 8.25 శాతం మెరుగుపడి 29.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో జేబీ కెమ్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 16.5 శాతం దూసుకెళ్లింది. రూ. 965ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 918 వద్ద ట్రేడవుతోంది. ఏడీఎఫ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఏడీఎఫ్ ఫుడ్‌లో దాదాపు 1.49 లక్షల షేర్లను ఆశిష్ కచోలియా కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీలో 0.74 శాతం వాటాకు సమానమైన వీటిని కచోలియా షేరుకి రూ. 378 సగటు ధరలో సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఏడీఎఫ్ ఫుడ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అమ్మకందారులు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 400 సమీపంలో ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు ఇదే స్థాయిలో లాభపడటం గమనార్హం! -
పసిడి కోసం వికాస్, సిమ్రన్ పోరు
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇద్దరు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా... మరో ఆరుగురు సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో ముగించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృషన్... మహిళల 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో వికాస్ 3–2 తేడాతో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అబ్లైఖన్ జుసుపొవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. బౌట్లో ఎడమ కంటి దిగువభాగంలో గాయమైనా... పట్టుదల ప్రదర్శించిన వికాస్ తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో అతను ఈషా హుస్సేన్ (జోర్డాన్)తో తలపడతాడు. ఒకవేళ వికాస్ కంటి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతనికి ఫైనల్లో పోటీపడే అవకాశం ఇవ్వరు. సిమ్రన్‌జిత్‌కు సెమీస్‌లో విజయం సులువుగానే దక్కింది. సిమ్రన్‌జిత్ 4–1తో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత షి యి వు (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఫైనల్లో సిమ్రన్ రెండుసార్లు ఆసియా విజేతగా నిలిచిన ఓ యెన్ జీ (దక్షిణ కొరియా)ను ఎదుర్కొంటుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. అమిత్ 2–3తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జియాంగ్వాన్ హు (చైనా) చేతిలో, ఆశిష్ 1–4తో మార్సియల్ ఇముర్ (ఫిలిప్పీన్) చేతిలో... సతీశ్ 0–5తో బఖోదిర్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మేరీకోమ్ 2–3తో యువాన్ చాంగ్ (చైనా) చేతిలో, లవ్లీనా 0–5తో హోంగ్ గు (చైనా) చేతిలో, పూజ రాణి 0–5తో ఖియాన్ లి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీ ద్వారా ఇప్పటికే ఎమిమిది మంది భారత బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పురుషుల 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ సచిన్ కుమార్ ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్‌కు అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్లో షబ్బోస్ నెగ్మతులోయెవ్ (తజికిస్తాన్)పై సచిన్ గెలిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు. -
క్వార్టర్ ఫైనల్లో మనీశ్, ఆశిష్, సచిన్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో గురువారం బరిలోకి దిగిన ముగ్గురు భారత బాక్సర్లు అదరగొట్టారు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సచిన్ కుమార్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు విజయం దూరంలో నిలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనీశ్ 5–0తో చు ఎన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో ఒమర్బెక్ బెక్జిగిట్ యులు (కిర్గిస్తాన్)పై నెగ్గగా... డీ ఇవోపో (సమోవా)ను సచిన్ ఓడించాడు. -
నవతరం ప్రేమకథ
‘ఆకతాయి’ సినిమా ఫేమ్ ఆశిష్‌రాజ్, సిమ్రాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇగో’ (ఇందు–గోపి). సుబ్రమణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ నిర్మాతలు విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ. నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా యువతరంతోపాటు పెద్దలకూ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాతో ఆశిష్రాజ్కి మంచి బ్రేక్ వస్తుంది. సిమ్రాన్, దీక్షాపంత్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయి కార్తీక్ పాటలకు మంచి స్పందన వచ్చింది. తన నేపథ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. తప్పకుండా మా సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అజయ్, ‘షకలక’ శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ జి.కె. -
ఫైనల్లో ఆశిష్, రయీస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆశిష్, రయీస్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఎథిక్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో జరుగుతున్న ఈ పోటీలను బుధవారం ఎల్బీ స్టేడియంలో సీనియర్ బాక్సర్ వెంకట్రావు ప్రారంభించారు. 46 కేజీల విభాగం సెమీఫైనల్ పోటీల్లో మొహమ్మద్ నవీద్... అబ్దుల్ హకీం మొహమ్మద్‌పై, ఆశిష్.. దినేశ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. 48 కేజీల విభాగంలో రయీస్.. నిరాజ్పై, చైతన్య... మురళీకృష్ణపై నెగ్గి ఫైనల్ చేరారు. ఇతర సెమీఫైనల్స్ ఫలితాలు: 50 కేజీల విభాగంలో మొహమ్మద్ ఉస్మాన్.. సయ్యద్ హుస్సేన్‌పై, భరత్ కుమార్.. బి. వంశీపై; 52 కేజీల విభాగంలో పవన్ కల్యాణ్.. సాయి సుమీత్‌పై, శ్రీనివాస్... నవీన్‌పై; 54 కేజీల విభాగంలో త్రిజోత్ సింగ్.. శ్రీకాంత్ గౌడ్‌పై, అజయ్.. భరత్‌పై, 57 కేజీల విభాగంలో హరీశ్.. పవన్‌పై, ఏవీ పవన్.. సుహాస్‌పై; 60 కేజీల విభాగంలో హర్షిత్.. సాయి మనీశ్‌పై; 63 కేజీల విభాగంలో రాహుల్.. నిఖిల్ భద్రాద్రిపై; 75 కేజీల విభాగంలో ఆర్యవ్ మిశ్రా.. సయ్యద్ అహ్మద్‌పై, రంగా రోహిత్.. రాజేశ్‌పై; 80+ విభాగంలో జి. వంశీ.. శామ్సన్‌పై, సాయిరాం.. విశాల్‌పై గెలిచి ఫైనల్స్‌లో ప్రవేశించారు. 63 కేజీల విభాగంలో వేణు.. 70 కేజీల విభాగంలో రాకేశ్, హనుమాన్లకు సెమీఫైనల్లో ‘బై’ లభించింది.