ఆశిష్ మిశ్రా
న్యూఢిల్లీ/లక్నో/లఖీమ్‌పూర్: యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను శనివారం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అరెస్ట్ చేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మొదటి విడత సమన్లకు బదులివ్వని ఆశిష్‌మిశ్రా శుక్రవారం పోలీసులిచి్చన రెండో విడత సమన్లకు స్పందించారు.
ఆశిష్ శనివారం ఉదయం 10.30 గంటలకు సిట్ కార్యాలయానికి రాగా డిప్యూటీ ఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలో అధికారుల బృందం 11 గంటలపాటు ప్రశి్నంచి, రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆశిష్ సహకరించడం లేదని, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు చెప్పా రు. ఈనెల 3న యూపీ డిప్యూటీసీఎం మౌర్య పర్యటన సమయంలో వాహనం ఢీకొని నలుగురు రైతులు చనిపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఒక వాహనంలో ఉన్నారని పేర్కొంటూ పోలీసులు ఆయనపై హత్య కేసు నమోదు చేశా రు. రైతులపై హింసను ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఉగ్రదాడిగా రైతు సంఘాలు అభివరి్ణంచాయి.
వాళ్లని అరెస్ట్ చేయాలి..
లఖీమ్‌పూర్ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయనతోపాటు ఆయన కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం)నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు నివాళులర్పించేందుకు 12వ తేదీన టికోనియాలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే నలుగురు రైతుల అస్తికలతో 11వ తేదీన షహీద్ కిసాన్ యాత్ర చేపడతామన్నారు. 15న దసరా రోజున ప్రధాని, హోం మంత్రి దిష్టి»ొమ్మల దహనం, 18న రైల్ రోకో, 26న మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
లఖీమ్‌పూర్‌ఖేరి హింస సందర్భంగా బీజేపీ కార్యకర్తలను చంపిన వారిని దోషులుగా భావించడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నా రు. నలుగురు రైతులను చంపినందుకు ప్రతిచర్యగానే ఈ ఘటన చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. లఖీమ్‌పూర్ హింస దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సింది పోయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రైతులను అణచివేసినట్లే, చట్టాలనూ పక్కనబెట్టాలని చూస్తోం దన్నారు. అదేవిధంగా, లఖీమ్‌పూర్ ఘటనలకు నిరసనగా ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా నివాసం ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ బృందం ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచడంతో దీక్షను విరమిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సిద్ధూ ప్రకటించారు.
సీజేఐని ప్రశంసించిన దుష్యంత్ దవే
లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చూపిన చొరవను సుప్రీం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ప్రశంసించారు. ఘటనలపై విచారణ సమయంలో ఆయన చాలా బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించారన్నారు. కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తాయన్న భరోసాను సీజేఐ కలి్పంచారన్నారు.
సమావేశంలో తికాయత్, యోగేంద్రయాదవ్
Comments
Please login to add a commentAdd a comment