Lakhimpur Kheri
-
గాల్లో బాలిక ప్రాణాలు
లఖింపూర్‌ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్ వీల్ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది. క్యాబిన్ కిందివైపున్న మెటల్బార్ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్ వీల్‌ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్బార్ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్ వీల్‌ను సీల్ చేశారు. -
లఖింపూర్ ఖేరి ఘటన: ఆశిష్ మిశ్రాకు ‘సుప్రీం’ బెయిల్ మంజూరు
ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2021 లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడైన ఆశిష్‌కు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్ ఇచ్చింది. అయితే ఆశిష్ మిశ్రా ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గతేడాది జనవరిలో ఆశిష్‌కు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.‘‘ లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి అన్ని అంశాలను పరిశీస్తున్నాం. 117 మంది వద్ద లక్ష్యాలు తీసుకోండి. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేయాలి’’ అని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ట్రయల్ షెడ్యూల్ చేసుకొని తర్వరగా విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనలు చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. -
హత్రాస్ ఘటన: వెలుగులోకి ‘భోలే బాబా’ భవనం, ఖరీదైన కార్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్( భోలే బాబా)పై శనివారం తొలి కేసు నమోదైంది. అయితే భోలే బాబాకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019కి ముందు భోలేబాబా కొన్ని రోజులు లఖింపూర్‌ఖేరిలో అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పడు నివసించిన విలాసవంతమైన భవనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భవనంలో ఒక లగ్జరీ కార్లు, గుహ వంటి నిర్మాణంలో ఉన్న గది ఉన్నాయి. అందులో భోలే బాబా ఫొటోలు, మంత్రాల చిత్రాలు కనిపించాయి. ఈ బిల్డింగ్‌లోనే భోలే బాబా మూడునాలుగు సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారి ఇక్కడ 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు ఈ భవనం యజమాని గోవింద్ పుర్వార్ తలిపారు. ఇక.. ఈ బిల్డిండ్ పూర్తిగా వ్యవసాయ భూములు, పెద్ద తోటల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ భవనంలో విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి. వంట చేసుకోవటం కోసం కిచన్, స్టవ్, సామాగ్రి కూడా ఉన్నాయి. వంటగది పక్కనే గుహవంటి రూం ఉంది. ఇందులో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ పోటోలు ఉన్నాయి. మరో గదిలో గోధుమ కంటేయినర్లు, భోలే బాబా ఫోటోలు, హనుహాన్ చాలిసా మాదిరిగా చేతితో రాసిన హారతి చాలిసా ఉన్నాయి. అయితే భోలే బాబా ఈ భవనంలో విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా ఉండే ఆయన భక్తులు మీడియాతో తెలిపారు.ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబా శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.మరోవైపు హత్రాస్ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. -
వీడియో వైరల్.. దెబ్బకు దేవుడు కనిపించడమంటే ఇదే..
లక్నో: మనుషులు చేసే కొన్ని చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకు వస్తాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. జంతువుల విషయంతో ఓవర్‌గా బిహేవ్ చేస్తే అవి ఇచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు మరి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముగ్గురు వ్యక్తులు ఏనుగులతో సెల్ఫీలు దిగుదామని డేర్ చేసి అతి చేశారు. దీంతో, గజరాజులకు మండిపోయి.. వాటి వెంటపడ్డాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ.. లేస్తూ.. పడుతూ.. ఏనుగుల దాడి నుంచి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుద్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుండగా అక్కడ ఏనుగుల గుంపు వారికి కనిపించింది. ఇంకేముంది.. వారి చేతిలో సెల్‌ఫోన్స్ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో, వారి చేష్టలకు ఏనుగులకు చిర్రెత్తుకొచ్చింది. అనంతరం.. ఏనుగులు ఒక్కసారిగా వారి పైకి దూసుకొచ్చాయి. వెంటనే వణికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు తీశారు. ఈ క్రమంలో పరుగులో అదుపుతప్పి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఎలాగోలా ఏనుగుల బారినుంచి వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. लखीमपुर खीरी के दुधवा नेशनल पार्क में कुछ लोग हाथी के साथ सेल्फी ले रहे थे, अचानक हाथियों ने सभी को दौड़ा लिया।#LakhimpurKheri #DudhwaNationalPark #UttarPradesh #elephant #elephantattack #ViralVideos #lakhimpur #kheri #kheriviralvideo pic.twitter.com/4IH2Rkpj5c — Daily Insider (@dailyinsiderup) July 5, 2023 ఇది కూడా చదవండి: వీడియో: ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ ఆ ఆటోడ్రైవర్ వేధింపులు.. వైరల్ -
పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా రైతుపై పిడుగు.. అక్కడికక్కడే..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాద ఘటన జరిగింది. శ్రీపాల్ అనే 50 ఏళ్ల రైతు పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. పోలీసులు రైతు ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. ఈ రైతు పొలం పనుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం పడే సూచనలు కన్పించాయి. ఈ సమయంలోనే ఆయనకు కుటుంబసభ్యులు ఫోన్ చేయడంతో.. వారితో మాట్లాతుండగా పిడుగు అతనిపైనే పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఫోన్ భారీ శబ్దంతో సడన్‌గా ఆగిపోవడంతో కుటంబసభ్యులు భయంతో పొలానికి పరుగులు తీశారు. వ్యవసాయ క్షేత్రంలో శ్రీపాల్‌ను విగతజీవిగా చూసి షాక్ అయ్యారు. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి, పలువురికి అస్వస్థత -
లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్
న్యూఢిల్లీ: రైతులతో పాటు మొత్తం 8 మందిని బలిగొన్న లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బుధవారం 8 వారాల మధ్యంతర బెయిలిచ్చింది. ‘‘పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు సమర్పించాలి. బెయిల్ సమయంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో ఉండొద్దు. ఎక్కడ ఉండేదీ ట్రయల్ కోర్టుకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. అక్కడ వారానికోసారి వ్యక్తిగతంగా హాజరై అటెండెన్స్ నమోదు చేయాలి’’ అని ఆదేశించింది. సాక్షులు తదితరులను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ షరతు విధిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జె.కె.మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ను, అతని కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. మరో నలుగురు నిందితులకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్‌ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్‌ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్‌కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్‌షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్‌కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్‌పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్‌ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
లఖీంపూర్ ఖేరి కేసు విచారణకు ఐదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న లఖింపూర్ ఖేరి హింసా కాండ కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుందని సుప్రీంకోర్టుకు సెషన్స్ కోర్టు విన్నవించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న ఈ కేసులో 208 మంది సాక్షులు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు ఉన్నాయని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి తెలిపారు. ఆశిశ్ మిగ్రా బెయిల్ విచారణ సందర్భంగా గత నెలలో ఈ కేసు విచారణ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందని సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఈ విధంగా బదులిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, వి రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఒక నివేదికను సుప్రీంకు సమర్పించింది. తదుపరి విచారణను జనవరి 19కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 3, 2021న నూతన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చెలరేగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిని విషయం తెలిసిందే. చదవండి: ఆప్‌కు భారీ షాక్.. పదిరోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే, లేకుంటే ఆఫీస్‌కు సీజ్! -
ఇంకెన్నాళ్లు కస్టడీలో ఉంచుదాం?.. సుప్రీంకోర్టు ఘాటు స్పందన
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి కేసులో నిందితుడు, కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిశ్ మిశ్రాకు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. కేసు విచారణ లఖీంపూర్ ఖేరి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో చాన్నాళ్లుగా కొనసాగుతుండటంపై అసహనం వ్యక్తంచేసింది. ‘212 మంది సాక్షులను విచారించాలంటున్నారు. అయితే, ఏడాదికిపైగా ఆశిశ్ జైలులోనే ఉన్నాడు. అతడిని ఎంతకాలం కస్టడీలో ఉంచుదాం. నిందితులకూ హక్కులుంటాయి. బెయిల్, హక్కులు వంటి అంశాల్లో సమతుల్యం పాటించాల్సిందే. ఎప్పటిలోగా కేసు విచారణ ముగిస్తారో తేల్చండి’ అని జిల్లా జడ్జిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రైతులపైనుంచి కారు దూసుకెళ్లాక కారులోని వ్యక్తులపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించిన మరో కేసులో త్వరగా అఫిడవిట్ సమర్పించాలని యూపీ సర్కార్ తరఫున హాజరైన అదనపు మహిళా అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్‌కు సూచించింది. జిల్లా కోర్టులో విచారణ డిసెంబర్ 16న మొదలవుతుందని గరిమా చెప్పారు. మరోవైపు యూపీ సర్కార్ మాత్రం నిందితుడికి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కోరుతూ వస్తోంది. -
లఖీంపూర్ కేసు: కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు
లఖీంపూర్ ఖేరి: నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖీంపూర్ ఖేరి సంఘటనలో నిందితులపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మంది నిందితులపై జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, నేరపూరిత కుట్ర, సంబంధిత సెక్షన్ల కింద అభియాగాలు మోపింది. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148(అల్లర్లు), 149(చట్టవిరుద్ధంగా గుమికూడడం), 302(హత్య), 307(హత్యాయత్నం), 326(ఆయుధాలతో గాయపర్చడం), 427, 120బీతోపాటు మోటార్ వాహన చట్టంలోని 177 కింద అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్ వర్మ అభియోగాలు నమోదు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయట ఉన్న 14వ నిందితుడు వీరేంద్ర శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 అభియోగాలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రాతోపాటు కొందరు నిందితులపై ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతుల దాడిలో ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
‘లఖీంపూర్ ఖేరి’ని మర్చిపోం.. కేంద్రాన్ని మర్చిపోనివ్వం
లఖీంపూర్ ఖేరి: ‘లఖీంపూర్ ఖేరి ఘటనను మేం మర్చిపోం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోనివ్వం. మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించడం మినహా దేనికీ మేం ఒప్పుకోం’అని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. యూపీలోని లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం లఖీంపూర్ ఖేరిలోని కౌడియాలా ఘాట్ వద్ద సమావేశమైన రైతులనుద్దేశించి తికాయత్ మాట్లాడారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతృత్వంలో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరప తలపెట్టిన ఆందోళనల్లో మంత్రిని తొలగింపు డిమాండ్ ఉంచుతామని చెప్పారు. అక్రమ కేసులు మోపి జైళ్లలో ఉంచిన నలుగురు రైతులను విడుదల చేయాలన్నారు. ఈ నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయంగా అందజేస్తామని చెప్పారు. పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలో జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. అప్పటి హింసాత్మక ఘటనల్లో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే నేరస్తుల కొమ్ము కాస్తోంది. న్యాయం జరిగేదాకా రైతుల పోరు ఆగదు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదు, అమరులైన రైతుల కుటుంబాలకు న్యాయం జరగలేదు’అని ట్వీట్లు చేశారు. 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన లఖీంపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్ కుమారుడు ఆశిష్ కారు నడపడం, తర్వాత జరిగిన హింసలో మొత్తంగా 8 మంది చనిపోయారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. 730 నంబర్ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దౌరాహా నుంచి లక్నోకు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఐరా వంతెన మీద ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ ఢీకొట్టింది. గాయపడిన వారిలో 12 మందిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు మిగతావారు ఖేరీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ క్షతగాత్రులను చూసేందుకు ఆసుపత్రిని సందర్శించారు. #WATCH |Lakhimpur Kheri bus-truck collision: Lucknow Divisional Commissioner Dr Roshan Jacob breaks down as she interacts with a mother at a hospital&sees condition of her injured child At least 7 people died&25 hospitalised in the accident; 14 of the injured referred to Lucknow pic.twitter.com/EGBDXrZy2C — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022 ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. అతని తల్లితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టుకుంటూనే బాలుడిని ఆప్యాయంగా పరామర్శించారు. అనంతరం అతనికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Distressed by the accident in Lakhimpur Kheri, UP. Condolences to the bereaved families. May the injured recover quickly. Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi — PMO India (@PMOIndia) September 28, 2022 రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి కింద రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలిపింది. लखीमपुर खीरी, उत्तर प्रदेश में हुए सड़क हादसे में कई लोगों की मृत्यु के समाचार से अत्यंत दुःख हुआ है। इस दुर्घटना में अपने प्रियजनों को खोने वाले परिवारों के प्रति मैं गहन शोक-संवेदनाएं व्यक्त करती हूँ तथा घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करती हूँ। — President of India (@rashtrapatibhvn) September 28, 2022 -
‘ఆ మృగాలకు వేసే శిక్షతో వెన్నులో వణుకు పుట్టాలి’
లక్నో: అక్కాచెల్లెలపై జరిగిన ఘోర కలితో యావత్ యూపీ రగిలిపోతోంది. లఖింపూర్ ఖేరీలో ఇద్దరమ్మాయిలపై హత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను ఇప్పటికప్పుడే ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ అక్కాచెల్లెల హత్యాచార ఘటనలో దర్యాప్తు శరవేగంగా ముందుకెళ్తోంది. పైగా బాధితులు దళితులు కావడంతో యూపీ పోలీసులపై ఒత్తిడి మరింతగా పెరిగింది. నిందితులు సుహేయిల్, జునైద్, హఫీజుల్ రెహమాన్, కరీముద్దీన్, ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు, బాధితుల పక్కింట్లో ఉండే చోటును సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందించారు. ఈ ఘటనపై యోగి సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. నిందితులకు విధించే శిక్షతో రాబోయే తరాల్లో ఇలాంటి నేరాలు చేయడానికి వెన్నులో వణుకుపుట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. #WATCH | Junaid, Sohail, Hafizul, Karimuddin & Arif involved. Girls were strangled to death & then hanged. Govt will take such an action that the souls of their coming generations will also shiver. Justice will be given; proceedings via fast-track court: UP Dy CM Brajesh Pathak https://t.co/QoNlxHFwYq pic.twitter.com/dDqAtdxQ2o — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022 మరోవైపు శవపరీక్షలో మైనర్లపై అఘాయిత్యం జరిగిందని, చెరుకు తోటలో ఇద్దరమ్మాయిలపై సుహేయిల్, జునైద్‌లు రేప్‌కి పాల్పడగా.. మిగతావాళ్లు ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఎస్పీ సంజీవ్ సుమన్ వెల్లడించారు. వాళ్ల దుపట్టాలతోనే ఉరేశారని, ఆపై చెరుకుతోటలోనే ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఎస్పీ అన్నారు. అయితే.. ఆ అక్కాచెల్లెళ్లు తమంతట తామే నిందితులతో వెళ్లారని పోలీసులు చెబుతుంటే.. బాధిత కుటుంబం మాత్రం వాళ్లు కిడ్నాప్‌కు గురయ్యారని వాపోతోంది. బలవంతంగా తమ బిడ్డలను బైకులపై తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షి, బాధితురాళ్ల తల్లి చెబుతోంది. ఇంకోవైపు పోస్ట్‌మార్టం కోసం వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు గ్రామస్తులు. రాత్రంతా హైడ్రామా నడిచింది ఆ ఊరిలో. మరోవైపు ఈ ఘటన.. 2014లో బదౌన్ గ్యాంగ్‌రేప్ కేసును ఇది గుర్తుచేస్తోందని పలువురు అంటున్నారు. ఇదీ చదవండి: పొలంలో చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ ఇద్దమ్మాయిలు! -
పొలంలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరమ్మాయిలు.. ఏం జరిగింది?
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. లఖింపూర్ ఖేరీలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. అనంతరం, తన బిడ్డల కోసం వెతుకుతుండగా.. ఓ చోట పొలం వద్ద విగతజీవులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతుళ్లు ఇద్దరిని.. దుంగడులు కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన తర్వాత ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. इस खबर पर इतनी चुप्पी क्यों है? pic.twitter.com/5nZRWhfJl5 — Meena Kotwal (मीना कोटवाल) (@KotwalMeena) September 14, 2022 ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణ జరగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని విషయాలు తెలుసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా.. ఇద్దరు దళిత అమ్మాయిలను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య. లఖింపూర్‌లో గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. యూపీలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే యూపీలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. लखीमपुर डबल मर्डर पर एक्शन में यूपी पुलिस, थोड़ी देर में प्रेस कॉन्फ्रेंस कर दी जाएगी मामले की जानकारी@manishtv9 दे रहे हैं पूरी जानकारी@iamdeepikayadav @spbhattacharya #LakhimpurKheri #UPPolice #UttarPradesh pic.twitter.com/cs3tpGJ173 — Times Now Navbharat (@TNNavbharat) September 15, 2022 -
తికాయత్.. ఓ చౌకబారు వ్యక్తి: కేంద్ర మంత్రి
లఖీమ్‌పూర్ ఖేరి(యూపీ): వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లిన కేసులో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌పై నోరు పారేసుకున్నారు. ఎనిమిది మంది మరణానికి కారకుడైన ఆశిష్‌కు తండ్రి అయిన అజయ్.. మంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్చేస్తున్న తికాయత్‌ను ‘చౌక బారు వ్యక్తి’ అంటూ తక్కువచేసి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ మద్దతుదారులనుద్దేశిస్తూ అజయ్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ‘ఒకవేళ నేను మంచి వేగంతో కారులో వెళ్తున్నాను అనుకుందాం. అప్పుడు ఊర కుక్కలు వెంటబడతాయి. మొరుగుతాయి. వాటి తీరే అంత. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. తికాయత్ గురించి నాకు బాగా తెలుసు. పొట్టకూటి కోసం రాజకీయాలు, ఉద్యమాలు చేస్తుంటాడు’ అంటూ ఆ వీడియోలో అజయ్ వ్యాఖ్యానించారు. అజయ్ వ్యాఖ్యానాల వీడియోపై తికాయత్ స్పందించారు. ‘ఏడాదికాలంగా కుమారుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అందుకే అజయ్ మిశ్రాకు నాపై కోపం’ అని అన్నారు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 ఇదీ చదవండి: రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే -
రైతుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
లక్నో: లఖింపూర్ ఘటనలో రైతుల పై దాడి విషయమై కేంద్ర మంత్రి కొడుకు ఆశిష మిశ్రా జైలు పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ రైతు నేత రాకేశ్ టికాయత్ రైతులతో కలిసి సుమారు 72 గంటల పాటు నిరసనలు చేపట్టారు. ఐతే అధికారుల హామీతో ఆ నిరసనలు విమించుకున్న సంగతి కూడా విధితమే. ఈ నేపధ్యంలో మంత్రి అజయ్ మిశ్రా లఖింపూర్ ఖేరీలో తన మద్దతుదారులను ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసంగంలో రైతులను ఉద్దేశిస్తూ....సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుక్కులు మొరగడం, కారుని వెంబడిచడం గురించి ప్రస్తావిస్తూ...వాటి స్వభావం అలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ మంత్రి రైతు నేత గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రైతులుగా పిలవబడుతున్నవారు పాకిస్తాన్ లేదా కెనడాలో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు లేదా ఉగగ్రవాదులు అంటూ విరుచుకుపడ్డారు. ఆఖరికి మీడియా కూడా వారితో కలిసి తనపై ఇలా దుష్ప్రచారం చేస్తుందని కలలో కూడా ఊహించుకోలేదని అన్నారు. బహుశా మీడియాకి కూడా ఇదే బలమనకుంటా, అయినా మీడియా కారణంగా ప్రజలు ఎప్పటికీ తనను ఎలా ఓడించాలో తెలుసుకోలేరంటూ ఎగతాళి చేశారు. ఏనుగు ఎప్పుడూ తన దారిన తను వెళ్తుంటుంది, కుక్కలే ఎప్పుడూ మొరుగుతాయని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.."తాను లక్నోకి కారులో ప్రయాణిస్తున్నాను, అప్పుడు కారు మంచి వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో కుక్కలు మొరుగుతాయి లేదా వెంబడిస్తాయి. అది వాటి సహజ స్వాభావం. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ నిరాశపరచలేరు. ఎంతమంది రాకేష్ తికాయత్‌లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతను రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి , పైగా అతని రాజకీయ జీవితం ఎక్కువ కాలం సాగదు. తానే ఏ తప్పు చేయలేదంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను తాను ప్రపంచంతో పోరాడుతున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 (చదవండి: 6న ఎస్కేఎం తదుపరి భేటీ) -
6న ఎస్కేఎం తదుపరి భేటీ
లఖీంపూర్‌ఖేరి: కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగింపు, పంటలకు కనీస మద్దతు ధర కల్పన తదితర డిమాండ్లతో యూపీలోని లఖీంపూర్‌ఖేరిలో రైతులు చేపట్టిన ఆందోళన అధికారుల హామీతో శనివారం ముగిసింది. తదుపరి కార్యాచరణపై సెప్టెంబర్ 6వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఢిల్లీలో భేటీ అవుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం లఖీంపూర్‌ఖేరిలో రాజాపూర్ మండి సమితి వద్ద రైతు ధర్నా ప్రాంతానికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్‌కు రైతులు డిమాండ్లను వివరించారు. ఈ డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబర్ 6వ తేదీన ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని మేజిస్ట్రేట్ వారికి హామీ ఇచ్చారు. దీంతో, 75 గంటలుగా కొనసాగుతున్నఅంతకుముందు రైతులు తలపెట్టిన ర్యాలీని కూడా అధికారుల హామీతో విరమించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లఖీంపూర్‌ఖేరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా 8 మంది మృతికి మంత్రి కుమారుడు ఆశిష్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
కేంద్రంపై పోరుకు కదిలిన 10వేల మంది రైతులు!
లక్నో: కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. మూడు రోజుల పాటు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది రైతులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనలకు న్యాయం చేయాలంటూ గురువారం నుంచి 72 గంటల పాటు(ఆగస్టు 18 నుంచి 20వ తేదీ) ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. సీనియర్ రైతు నేతలు రాకేశ్ టికాయిత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ వంటి వారు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఆందోళనల్లో సుమారు 10వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ తెలిపారు. కొందరు రైళ్లలో, మరికొందరు తమ సొంత వాహనాల్లో లఖింపుర్‌ఖేరీకి చేరుకుంటున్నారని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో లఖింపుర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా అరెస్టయ్యారు. రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు. ఇదీ చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. -
లఖింపూర్ ఘటన.. కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్ నిరాకరణ
లక్నో: కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్టు. బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆశిష్ మిశ్రా. నిరసనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఈ దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గేతేడాది అక్టోబర్ 9నే అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. మంత్రి కుమారుడు అయినందుకు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా అదే కారణంతో ఆశిష్‌కు బెయిల్ నిరాకరించింది. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్ -
బాధితుల గోడు వినాల్సిందే!
అన్యాయం జరుగుతున్నా అడ్డుకొనేవారు లేరని ఆవేదన పడుతున్నప్పుడు అనుకోని రీతిలో ఆపన్నహస్తం ఎదురైతే? బలవంతుడిదే రాజ్యమని నిరాశలో మునిగిపోతున్నవేళ, బడుగు వర్గాల బాధితుల హక్కులను పరిరక్షిస్తూ, వ్యవస్థ మీద కాసింతైనా నమ్మకం మిగిలే సంఘటన జరిగితే? లఖీమ్‌పుర్ ఖీరీ సంఘటనలోని బాధితులకు సోమవారం అలాంటి సాంత్వనే లభించింది. అధికారంలో ఉన్నామనే అహంతో అమాయకులపైకి వాహనం పోనిచ్చి, వారి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి గారి పుత్రరత్నం జామీనును రద్దు చేస్తూ, దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన ఆదేశాలు అనేక విధాలుగా గణనీయమైనవి. అది బాధితుల హక్కులను కాపాడిన తీర్పు. నిందితులకు జామీను విషయంలో ఒక పూర్వోదాహరణగా నిలిచే రేపటి చరిత్ర. ధర్మసంకటంలో తమకు దిశానిర్దేశంగా రానున్న రోజుల్లో కింది కోర్టులు గుర్తుంచుకోవాల్సిన పాఠం. గత ఏడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పుర్ ఖీరీలో జరిగిన హింసాకాండ కేసులో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడైన ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. ఆందోళన చేస్తున్న అమాయక రైతులపైకి వేగంగా వాహనం నడిపి, ఓ జర్నలిస్టుతో పాటు నలుగురు రైతుల మరణానికి కారకుడైనట్టు ఆయనపై ప్రధాన ఆరోపణ. తదనంతర హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ జీప్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా మొత్తం 8 మంది మరణంతో, దేశవ్యాప్త సంచలనమైన ఆ ఘటనలో హత్యానేరం కింద మంత్రివర్యుల గారాలబాబు బుక్కయ్యారు. అయితే, ఈ ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు జామీను ఇచ్చింది. దర్యాప్తు సాగుతుండగానే, బాధితుల వాదనలు వినకుండానే జామీను ఇచ్చారని ఆరోపణ. దీనిపై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం స్పష్టమైన తీర్పునిచ్చింది. బెయిల్ మంజూరులో అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ తన పరిధిని దాటి ప్రవర్తించిందని కుండబద్దలు కొట్టింది. బాధితుల హక్కులను గుర్తించి, ప్రస్తావించడంలో హైకోర్ట్ విఫలమైన తీరు పట్ల ‘‘అసంతృప్తి’’ని రికార్డులకెక్కించింది. నిజానికి ఈ కేసులో నిందితులను కాపాడేందుకు ఆది నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. అప్పుడూ సుప్రీమ్ కోర్టే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పదే పదే జోక్యం చేసుకున్నాకే, కేసు కొంతైనా పురోగమించింది. సాక్షులను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనీ కోర్టు చెప్పాల్సి వచ్చింది. ఆఖరికి గత నవంబర్ నుంచి ఓ మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు దర్యాప్తు సాగేలా చూడాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడికి అలహాబాద్ హైకోర్ట్ జామీనివ్వడం విమర్శల పాలైంది. జామీనివ్వడాన్ని వ్యతిరేకిస్తూ, అప్పీలు ఫైల్ చేయాలంటూ సాక్షాత్తూ సుప్రీమ్ ఆదేశంతో ఏర్పడ్డ ‘సిట్’ ఒకటికి రెండు సార్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. కానీ, కేంద్ర మంత్రివర్యుల పార్టీయే అధికారంలోఉన్న అక్కడి సర్కారు వారు అది వినీ విననట్టే ఉండిపోయారు. చివరకిప్పుడు అధికారం – పలుకుబడి గల నిందితుణ్ణి జామీనుపై వదిలిపెట్టడాన్ని కూడా సుప్రీమ్ కోర్టే అభ్యంతర పెట్టి, రద్దు చేయాల్సి వచ్చింది. బాధితుల హక్కులకు కాపు కాయాల్సి వచ్చింది. లఖిమ్‌పుర్ ఘటనలో జనంపైకి దూసుకుపోయిన 3 అధునాతన వాహనాల్లో, ఒకటి నింది తుడు మిశ్రా కుటుంబానిదే. ఆ కుటుంబ ప్రాబల్యమూ తెలిసినదే. అయినా సరే, హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాను జైలు నుంచి వదిలేయడం సమర్థనీయం కాదు. వర్చ్యువల్‌గా సాగిన బెయిల్ కేసు విచారణలో బాధితుల తరఫు వకీలు లింకు కట్ అయింది. ఆ తరువాత మళ్ళీ వాదన వినాల్సిందిగా అభ్యర్థన దాఖలు చేసినా, హైకోర్ట్ దాన్ని తోసిపుచ్చడం మరీ విచిత్రం. బెయిల్ మంజూరులో హైకోర్ట్ తీరును ధర్మాసనం గట్టిగానే తప్పుబట్టింది. నేర తీవ్రత, సాక్ష్యాధారా లను ప్రభావితం చేసేందుకు నిందితుడికి ఉన్న వీలు లాంటి తప్పనిసరి అంశాలను సైతం విస్మరించి, అసంగతమైనవాటిని అడ్డం పెట్టుకొని బెయిల్ ఇచ్చారన్న సుప్రీమ్ వ్యాఖ్య తీవ్రమైనది. విచారణ మొదలవకుండానే కేసు బలాబలాల్ని బెయిల్ ఉత్తర్వులో అనవసరంగా ప్రస్తావించారేమి టన్న దానికీ సంతృప్తికరమైన సమాధానం లేదు. ప్రధాన నిందితుడికి జామీనివ్వడానికి హైకోర్ట్ ఎక్కడలేని తొందర పడడాన్ని కూడా సుప్రీమ్ ఎత్తిచూపింది. మరి, ఈ మాత్రం అక్కర, తొందర అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్నవారి బెయిల్‌పై ఎందుకు చూపరో అర్థం కాదు. మొత్తం 24 పేజీల తీర్పులో సుప్రీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో వివిధ కేసుల్లో బాధితుల హక్కులకూ, బెయిల్ మంజూరు విధానాలకూ మార్గదర్శకం కానున్నాయి. ఏ కేసులోనైనా సరే బాధితుల వాదనను సముచిత రీతిలో, సక్రమంగా వినితీరాలన్న సుప్రీమ్ మాట శిరోధార్యం. ఆ వాదనకు బలాన్నిస్తూ గతంలో భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పులనూ, అంతర్జాతీయ న్యాయశాస్త్రాలనూ ధర్మాసనం ప్రస్తావించింది. నిందితులకు బెయిల్ ఇస్తున్నప్పుడు బాధితుల వాదన సైతం చెవికెక్కించుకోవాలన్నది సారాంశం. దీన్ని ఇక ఆచరణలో పెట్టాల్సింది కింది కోర్టులే. ఏమైనా, లఖీమ్‌పుర్ కేసులో ప్రధాన నిందితుడి బెయిల్ రద్దు మరోసారి న్యాయవ్యవస్థపై సామాన్యుల్లో ఆశలు రేపింది. కుంటుతూ అయినా సరే ధర్మం నిలబడుతుందనే కాస్తంత నమ్మకం కలిగింది. ఏ వ్యవస్థయినా నిలబడాల్సింది బాధితుల పక్షానే కదా! -
ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు
న్యూఢిల్లీ: లఖీంపూర్‌ఖేరీ ఘటనలో నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. వారంలో లొంగిపోవాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టులో బాధితులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడింది. ‘‘సాక్ష్యాలను కోర్టు హ్రస్వదృష్టితో వీక్షించింది. అసంబద్దమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్లోని అంశాలకు అనవసర ప్రాధాన్యమిచ్చింది’’ అంటూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. అసంబద్ధ అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విచారణలో పాల్గొనేందుకు బాధితులకున్న హక్కును నిరాకరించింది. బెయిలిచ్చేందుకు తొందర పడింది. వీటన్నింటినీ గమనించిన మీదట బెయిల్‌ను రద్దు చేస్తున్నాం’’ అని తెలిపింది. మిశ్రా మళ్లీ బెయిల్ కోరవచ్చని ధర్మాసనం చెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ దానిపై మూణ్నెల్ల లోపు హైకోర్టు సమగ్ర విచారణ జరపవచ్చని పేర్కొంది. యూపీలోని లఖీంపూర్‌ఖేరీలో గతేడాది అక్టోబర్‌లో రైతు నిరసనల సందర్భంగా నిరసనకారులపైకి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు మరణించారు. ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరిలో ఆయనకు బెయిల్ రాగా దాని రద్దు కోరుతూ బాధిత కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. బాధితులకు హక్కుంది బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ లాయర్ వీడియో కనెక్షన్ పోవడంతో వాదన విన్పించలేకపోయామన్న బాధితుల వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వం, నిందితుడి వాదనల ఆధారంగా తీర్పులిస్తారనే అభిప్రాయం ఇటీవలి దాకా ఉండేది. బాధితులకు ఈ విచారణలో భాగస్వామ్యం ఉండదన్నట్టుగా భావించేవారు. కానీ వారికీ విచారణలో పాల్గొనే హక్కుంటుంది’’ అని చేసింది. ఈ కేసులో బాధితులకు సక్రమ హియరింగ్‌లో పాల్గొనే హక్కు లభించలేదని అభిప్రాయపడింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ప్రాథమిక అంశాలను పరిశీలించవచ్చు. ప్రస్తుత కేసు తీవ్రతను, ఆరోపణలు రుజువైతే పడే శిక్ష తీవ్రతను, నిందితుడు పారిపోయే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలను, అతని విడుదల సమాజంపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడంలో హైకోర్టు హ్రస్వదృష్టితో వ్యవహరించింది. బెయిల్ మంజూరు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసింది’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్నే సర్వస్వంగా పరిగణించకూడదని హితవు పలికింది. మంత్రి తప్పుకోవాలి: కాంగ్రెస్ ఆశిష్ బెయిల్ రద్దు నేపథ్యంలో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాను ప్రధాని మోదీ ఎప్పుడు కోరతా రని కాంగ్రెస్ ప్రశ్నించింది. మోదీ ప్రభుత్వం రైతులను ఎన్నాళ్లు అణచివేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. రైతులపై అధికారుల సాక్షిగా అన్యాయం, దౌర్జన్యం జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. వారికి న్యాయం కోసం అందరూ మద్దతివ్వాలన్నారు. చదవండి: భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే -
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్ మెహ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. -
జైల్లోనే ఆశిష్ మిశ్రా
లక్నో: లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. 2021 అక్టోబర్‌లో ఆశిష్‌ను పోలీసులు సెక్షన్ 147, 148, 149, 302, 307, 326, 34, 427, 120బీ కింద అరెస్టు చేశారు. వీటితో పాటు ఆయుధాల చట్టం కింద కూడా ఆశిష్‌పై నేరారోపణ చేశారు. తాజాగా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్లో 302, 120 బీ సెక్షన్లకు సంబంధించి వివరాల్లేవు. సెక్షన్ 302 హత్యాయత్నంకు సంబంధించినది కాగా 120 బీ సెక్షన్ క్రిమినల్ కుట్రకు సంబంధించినది. బెయిల్ ఆర్డర్లో ఈ రెండు చట్టాల గురించి పేర్కొనకపోవడంతో ఆశిష్ విడుదల జరగలేదు. దీనిపై స్పందిస్తూ బెయిల్ ఆర్డర్లో ఈ రెండు సెక్షన్లను కూడా చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశిష్ న్యాయవాది చెప్పారు. రైతు ఆందోళనల సమయంలో నలుగురు రైతుల మరణానికి కారణమయ్యాడని ఆశిష్‌పై కేసు నమోదైంది. బెయిల్ కోసం ఆశిష్ యత్నిస్తుండగా గురువారం హైకోర్టులో ఊరట దొరికింది. -
యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ సింసాత్మక ఘటనలోని నిందితుడికి బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోెబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. కాగా ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో 2021 అక్టోబర్ 3న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఉద్ధేశ్య పూర్వకంగానే రైతులపైకి ఆశిశ్ మిశ్రా తన కారును పొనిచ్చాడని ఇటీవలే కమిటీ పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ ఇప్పటికీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే..
లఖింపూర్ ఖేరి ఘటనపై ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా.. నిన్న(బుధవారం) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ వైపే ఉన్నారంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులను కారుతో తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తున్నదని తెలిపారు. కేసు దర్యాప్తు ఆగబోదని అన్నారు. సుప్రీంకోర్టు ఎలా కొరితే ఆ విధంగా.. ఆ జడ్జీతోనే దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 2021 అక్టోబర్ 3న, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రైతులపైకి దూసుకెళ్లిన SUVని అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు బలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయగా.. గత అక్టోబరు నుండి జైలులో ఉన్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యతగా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతను హోం శాఖ సహాయ మంత్రిగా PM మోడీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు. యూపీ పోలీసులు, పరిపాలనా యంత్రాంగం విచారణలో నిదానంగా సాగుతోందని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇక వ్యవసాయం చట్టాల రద్దు గురించి ప్రధాని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఉపసంహరించుకున్నాం. దీన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ చర్యలు ఎందుకు అవసరమో భవిష్యత్తే స్పష్టం చేస్తుంది”అని ప్రధాని ఉద్ఘాటించారు. -
నోటాకే ఓటన్న లఖీంపూర్ రైతులు
లఖీంపూర్‌ఖేరీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఓటేస్తామని లఖీంపూర్ ఖేరీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలు తమను మోసం చేశాయని, ఇతర పార్టీలు నిష్ఫలమైనవని రైతులు వాపోయారు. రైతు చట్టాలు తదుపరి హింసకు బీజేపీ కారణమని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగని తమకు గతంలో రుణమాఫీ చేసిన సమాజ్‌వాదీని కూడా ఆదరించాలనుకోవడం లేదు. తమ ఫిర్యాదుల పరిష్కారానికి ఏ పార్టీ నిజాయితీగా యత్నించలేదని, అందువల్ల నోటాకు ఓటేస్తామని పలువురు రైతులు మీడియాకు తెలిపారు. ఎస్పీ హయాంలో బీజేపీ పాలనలో కన్నా దారుణంగా రైతుల పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎస్పీ కూటమి, బీజేపీ ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ తమకు రావాల్సిన పంచదార మిల్లుల బకాయిలు అం దలేదని బాధను వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీలు సానుభూతి మాటలు చెప్పడం మినహా ఏమీ చేయలేదని వాపోయారు. -
విజయతీరాలను చేరాలని.. ‘సామాజిక’ ఫార్ములా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలన్నీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలైన సామాజిక ఇంజనీర్లు(పొలిటికల్ సోషల్ ఇంజనీర్స్), వారు సిద్ధం చేసే సోషల్ ఇంజనీరింగ్ మీదే ఆధారపడి ఉంటోంది. పార్టీకి విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం చేయడం, సామాజిక సమూహాలు, వారి అవసరాలను గుర్తించడం, ఆపై పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం, సామాజిక మాధ్యమాల్లో సందేశాల ద్వారా పార్టీకి అనుకూలంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేసే వ్యూహాన్ని సిద్ధం చేయడంతో సోషల్ ఇంజనీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు. దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రతి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాయి. సామాజిక సమీకరణ కోసం వివిధ కులాలు, వర్గాలు, మత సమూహాలతో తమ పార్టీలకు సంబంధాలను బలపరిచే, సామాజిక పొత్తులను నిర్మించగల శక్తిసామర్థ్యాలున్న నేతలను దీనికి వినియోగిస్తున్నాయి. వీరికి ప్రజాకర్షక శక్తి లేకున్నా.. తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు ముఖ్యం. హోంమంత్రి అమిత్ షా బీజేపీకి గొప్ప సోషల్ ఇంజనీర్ అనేది గత సార్వత్రిక, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ... ప్రస్తుతం అమిత్ షా కేంద్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో యూపీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ బాధ్యతలను సమర్థ్ధుడైన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ కట్టబెట్టింది. ప్రధాన సామాజికవర్గాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని వెంటనే గుర్తించి, వాటితో చర్చలు జరిపి, వారి ద్వారా అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పరిష్కారాలు చూపించే పనిని ప్రధాన్ బృందం సూక్ష్మస్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా పూర్వాంచల్. తూర్పు యూపీలో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతోంది. రాజ్‌పుత్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న కినుకతో వారు ఎస్పీలో చేరుతున్నారు. దీంతో యూపీలో 14 శాతం ఉన్న బ్రాహ్మణులు దూరం కాకుండా కమలదళం చర్యలు చేపట్టింది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని ఎంత గట్టిగా డిమాండ్లు వచ్చినా, ఆ వర్గానికి ఆగ్రహం కల్గించరాదన్న ఉద్దేశంతోనే ఆయనకు బీజేపీ కాపు కాస్తోంది. మరోవైపు రాజ్‌పుత్ ఓట్లు జారిపోకుండా కీలక నేతలందరితో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీ వర్గాల వారే ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేలా ఇప్పటికే రూ.35 వేల కోట్ల రుణాలను అందించగా, 2.21 కోట్ల మంది రైతులను ఫసల్ బీమా యోజనలో చేర్చింది. వీటన్నింటినీ బీజేపీ బృందాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షిస్తున్న ఎస్పీ ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షాలు సైతం తమతమ సోషల్ ఇంజనీరింగ్‌కు పదునుపెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ కోసం అఖిలేశ్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని రచిస్తున్నారు. మహాన్ దళ్, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి యాదవేతర కుల ఆధారిత పార్టీలతో పొత్తులు ఏర్పరచుకోవడం ద్వారా వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే యత్నాలకు దిగారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండేని పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 ఓట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు. 19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా, కేవలం మూడో వంతు మాత్రమే ఎస్పీ నుంచి గెలిచారు. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. ఈ దృష్ట్యా ముస్లింల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ సలీమ్ షేర్వానీని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, కొత్తగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇమ్రాన్ మసూద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్ ఇటీవల నిర్వహించిన విజయ్ రథయాత్రకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా హాజరయ్యేలా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక పశ్చిమ యూపీలో జాట్ల మద్దతు కూడగట్టేందుకు ఆర్ఎల్డీతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. ఓబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆయన బీసీ కులగణన అంశానికి మద్దతిస్తున్నారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు ముస్లిం ఓట్లపై కన్నేసిన బీఎస్పీ ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కోసం సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా రూపొందిస్తున్నారు. బ్రాహ్మణులతో సహా దళితేతర కులాల నుండి వీలైనంత ఎక్కువ మంది మద్దతు పొందే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ’బహుజన్ టు సర్వజన్’ అనే నినాదం ఆధారంగా ఆయన వ్యూహాలున్నాయి. గతంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో 86 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఎస్పీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాల్లో పార్టీ నేత సతీశ్‌చంద్ర శర్ము రెండుసార్లు పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఎస్పీ వైపునకు వెళ్లకుండా 2012–17 మధ్య అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో 134 చోట్ల మతకల్లోల సంఘటనలు జరిగిన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘ఆడపిల్లను... పోరాడగలను’ యూపీలో కాంగ్రెస్ ప్రాబల్యం నానాటికీ తగ్గుతూ వస్తోందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికి ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, ఇతర మహిళా సంస్థలతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ వారి మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు.‘లడ్కీ హూ..లడ్ సక్తీ హూ’ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, మహిళలకు 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎస్పీ లేదా బీజేపీ హామీ ఇవ్వగలవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి జాట్లు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ముస్లిం–జాట్ కాంబినేషన్ సైతం మంచి ఫలితాలిస్తాయని ఆశిస్తున్న జయంత్ చౌదరి ఎస్పీతో పరస్పర అంగీకారం దిశగా చర్చలు చేస్తున్నారు. -
యోగి నా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాపింగ్ చేయిస్తున్నారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను ప్రతిరోజు సాయంత్రం యోగి వింటున్నారని అన్నారు. యోగిని నిరుపయోగిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తూ ఆంగ్లంలో యూపీ, యోగి కలిస్తే ‘ఉపయోగి’ అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆదివారం అఖిలేఖ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది కాబట్టి తనతో మాట్లాడేటపుడు జాగురుకతతో ఉండాలని విలేకరులకుసూ చించారు. యోగి సర్కారు రాష్ట్రంలో ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నడుపుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే 12 మంది బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల వారణాసి, ఆయోధ్యల్లో పర్యటించారన్నారు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెనకేసుకొస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యూపీలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
Lakhimpur Kheri violence: అజయ్‌మిశ్రాను తొలగించాలి!
న్యూఢిల్లీ: వివాదాస్పద కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను మంత్రిమండలి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ సభ్యులతో కలిసి సభలో ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అజయ్ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ లఖీంపూర్ ఖేరీ ఘటనతో మిశ్రాకు సంబంధం ఉందని ఆరోపించారు. అజయ్ మిశ్రాను తొలగించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు అనుమతినివ్వాలని కోరారు. అయితే ముందుగా అనుకున్నట్లు రాహుల్ ఎంఎస్ఎంఈపై ప్రశ్నకు మాత్రమే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు. చదవండి: కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు అయితే మిశ్రాను శిక్షించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. ఇదే సమయంలో పలు ప్రతిపక్షాల సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం బయోడైవర్సిటీ బిల్లు పత్రాలను ప్రభుత్వం సభముందుకు తెచ్చింది. అటవీ ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో బయోడైవర్సిటీ సవరణ చట్టం –21ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్షాల నిరసన కొనసాగడంతో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. అంతకుముందు సభ ఆరంభంలో ఇటీవల మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు నివాళులర్పించారు. ఇటీవల 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. అదేవిధంగా లఖీంపూర్ ఘటనను కూడా కాంగ్రెస్‌సభ్యులు లేవనెత్తారు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. నిరసనల మధ్య పీడీపీ బిల్లుపై జాయింట్ కమిటీ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. సభ్యుల ఆందోళన తగ్గకపోవడంతో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. సభ ఆరంభంలో విజయ్ దివస్ వీరులకు సభ్యులు నివాళి అర్పించారు. -
లఖీంపూర్ ఖేరి ఘటన.. మిశ్రాపై వేటు తప్పదా?
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే తక్షణం ఢిల్లీ రావాలని ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు సంధించగా.. ఆయన సహనం కోల్పోయి మీడియాపై ఫైర్ అయ్యారు. చదవండి: Lakhimpur Violence: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ తనయుడు ఆశిష్ మిశ్రా గురించి అడిగిన జర్నలిస్టులపై కేంద్రమంత్రి దుర్భాషలాడారు. ‘మూర్ఖుడిలా ప్రశ్నలు అడగవద్దు. మీరు మానసికస్థితిని కోల్పోయారా?. ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?. నిర్దోషిని నిందితుడిగా మార్చారు. మీకు సిగ్గు లేదా?. నీవు ఒక దొంగ’ అంటూ జర్నలిస్టుపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా సరే మంత్రి రాజీనామా ప్రసక్తే లేదని బీజేపీ కరాఖండిగా చెప్పేసింది. లఖీంపూర్ హింసాత్మక ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించకూడదని సీనియర్ నేత పియూశ్ గోయల్ అన్నారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ లఖీంపూర్ ఘటనలో మంత్రి అజయ్ కుమారుడు నిందితుడిగా ఉన్నారు. ‘ మోదీ సర్కార్‌ను విమర్శించడానికి సరైన కారణాలు లేకనే విపక్షాలు ఇలా సస్పెండ్ అయిన సభ్యుల అంశాన్ని పదేపదే పార్లమెంట్లో లేవనెత్తుతున్నాయి’ అని గోయల్ విమర్శించారు. -
లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశాయి. నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ బిర్లా వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు. -
ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు
లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్– ఎస్యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లో నిందితులపై ఇదివరకు నమోదు చేసిన సెక్షన్లను మార్చి మరింత తీవ్రమైన సెక్షన్లను చేర్చడానికి అనుమతించాలని ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం) చింతా రామ్‌కు దరఖాస్తు చేసింది. హత్యాయత్నం సెక్షన్లను జతచేస్తామని విన్నవించింది. ఈ ఏడాది అక్టోబరు 3న లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు... మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా రైతులు నిరసన తెలిపారు. టికూనియా వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఎస్యూవీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారని... ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదైంది. ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన రైతులు దాడికి దిగడంతో ఎస్యూవీ డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో సహా 13 మంది నిందుతులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తీవ్ర దుమారం రేగింది. బీజేపీపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్‌ను నియమించిన విషయం తెలసిందే. ముందస్తు ప్రణాళికతోనే... దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన ఆధారాలను బట్టి... ఈ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని (వీరు ఆయుధాలు కూడా కలిగి ఉన్నారని)... ప్రాణనష్టానికి దారితీసిందని సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల రైతు జగ్మీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశిష్ మిశ్రా, తదితరులపై నమోదు చేసిన 220/221 ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ 304ఏ (దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం కావడం), సెక్షన్ 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను తీవ్రంగా గాయపర్చడం), సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్)లను తొలగించడానికి అనుమతించాలని కోరారు. వాటి స్థానంలో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధంతో గాయపర్చడం, ఆయుధాల చట్టంలో సెక్షన్ 3/25ని ఎఫ్ఐఆర్లో చేర్చడానికి అనుమతించాలని కోర్టును కోరారు. ఎఫ్ఐఆర్లో ఇదివరకే నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 147 (అల్లర్లు సృష్టించడం), 148 (ప్రమాదకరమైన ఆయుధాలతో అల్లర్లకు దిగడం), 120బి (కుట్రపూరిత నేరం) తదితర సెక్షన్లను సిట్ కొనసాగించింది. 13 మంది నిందితులకు జారీచేసిన వారెంట్లను సవరించాలని అభ్యర్థించింది. సీజేఎం ఆదేశం మేరకు మంగళవారం నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారెంట్లలో సెక్షన్లను మార్చడానికి సీజేఎం అనుమతించారని ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ ఎస్పీ యాదవ్ వెల్లడించారు. ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ మోదీ జీ.. మీరు మరోసారి క్షమాపణ చెప్పాల్సిన సమయమిది. అయితే దానికి ముందు తొలుత నిందితుడు (అశిష్ మిశ్రా) తండ్రి (అజయ్ మిశ్రా)కి కేంద్రమంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకండి. మత రాజకీయాలు చేసుకోండి. కానీ ఈ రోజు రాజకీయ ధర్మాన్ని పాటించండి. మీరిప్పుడు యూపీలోనే ఉన్నారు కాబట్టి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించండి. మీ మంత్రిని తొలగించకపోవడం అన్యాయం. సరైనది కాదు!. ఒక మంత్రి రైతులను చంపేందుకు ప్రయత్నించారు. ప్రధానికి ఇది తెలుసు. పార్లమెంటులో ఆనాడు ఈ అంశాన్ని లేవనెత్తాం. కానీ చర్చిండానికి అనుమతించలేదు. గొంతునొక్కారు. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయండి: ఎస్కేఎం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను రక్షించే ప్రయత్నాలను ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మానుకోవాలి. ఆయనను మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలి. మేము ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఊచకోత అనేది సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ప్రధాన సూత్రధారి అజయ్ మిశ్రా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు. – సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) -
ప్రమాదం కాదు.. పథకం ప్రకారమే చంపేశారు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఆందోళన చేస్తున్న రైతులను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ మారణ హోమానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతో సహా నిందితులపై మోపిన అభియోగాలను సవరించాలని సిట్ అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. నిందితులపై పెట్టిన ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలను సవరించి... హత్యానేరం మోపాలని కోరారు. లఖింపూర్ ఖేరీ ఘటన ప్రమాదవశాత్తు జరలేదని, పథకం ప్రకారం జరిగిందని విచారణాధికారి విద్యారామ్ దివాకర్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన లఖింపూర్ జిల్లా కోర్టు నిందితులందరినీ మంగళవారం న్యాయస్థానానికి పిలిపించింది. కాగా, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈరోజు జైలులో తన కుమారుడు ఆశిష్ మిశ్రాను కలిశారు. (చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!) అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి తన కారుతో ఆశిష్ మిశ్రా దూసుకురావడంతో నలుగురు అన్నదాతలు, జర్నలిస్ట్ చనిపోయారు. తర్వాత ఆందోళన కారులు జరిపిన దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతోపాటు ఇతర నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. (చదవండి: సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!) -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
మాజీ జడ్జి రాకేశ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ డెప్యూటీ సీఎం కేశవ్ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాల పర్యటన సందర్భంగా లఖీమ్‌పూర్‌లో రైతుల ఆందోళన, తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల కేసుల దర్యాప్తు ఇకపై మాజీ జడ్జి రాకేశ్ కుమార్ జైన్ నేత్వత్వంలో కొనసాగనుంది. పంజాబ్, హరియాణా హైకోర్టులో జస్టిస్.రాకేశ్ కుమార్ గతంలో జడ్జిగా సేవలందించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాలోని ఐజీ ర్యాంక్ అధికారి పద్మజ చౌహాన్‌సహా యూపీ మాతృరాష్ట్రంకాని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇకపై రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో భాగస్వాములుగా ఉంటారని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం వెల్లడించింది. సిట్ దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిపై జస్టిస్ జైన్ ఒక నివేదికను కోర్టుకు సమర్పించాకే కేసుల విచారణ మొదలవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నలుగురు రైతులుసహా ఎనిమిది మంది మృతికి కారణమైన అక్టోబర్ 3నాటి రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనల కేసుల పారదర్శక దర్యాప్తు కోసం వేరే రాష్ట్రానికి చెందిన జడ్జిని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలపగా, అందుకు యూపీ సర్కార్ ఇటీవలే అంగీకరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు బృందానికి కొత్త పర్యవేక్షకుడిని కోర్టు బుధవారం నియమించింది. హరియాణాలోని హిస్సార్‌లో 1958 అక్టోబర్ ఒకటిన జస్టిస్ జైన్ జన్మించారు. బీకాం ఎల్ఎల్బీ పూర్తిచేసిన జైన్ పంజాబ్, హరియాణా హైకోర్టు బార్లో 1982లో పేరు నమోదు చేయించుకున్నారు. తర్వాత హిస్సార్ జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుంచి హైకోర్టులో కేసులు వాదించారు. -
మాజీ జడ్జి ఆధ్వర్యంలోనే దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నియమించిన సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డు న్యాయమూర్తిని నియమించాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘ధర్మాసనం సరైన వ్యక్తిగా భావించి ఎవరిని నియమించినా యూపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఈ విషయంలో సదరు అధికారి సమర్థతే తప్ప, రాష్ట్రంతో సంబంధం లేదు’అని హరీశ్ సాల్వే ధర్మాసనానికి నివేదించారు. దీంతో న్యాయమూర్తి పేరును బుధవారం ఖరారు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు ప్రగతిని ఈ న్యాయమూర్తి రోజువారీ సమీక్షిస్తారని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందంలో దిగువ స్థాయి..సబ్ ఇన్స్పెక్టర్, డీఎస్పీలు అదికూడా లఖీమ్‌పూర్ ఖేరికి చెందిన అధికారులే ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. యూపీ క్యాడర్లో సొంత రాష్ట్రానికి చెందని ఐపీఎస్ అధికారుల జాబితాను మంగళవారం సాయంత్రానికల్లా అందజేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా సిట్ చీఫ్‌ను బదిలీ చేశారన్న పిటిషనర్ అభ్యర్థనపైనా పరిశీలన జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. పరిహారం దక్కని వారు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకునేలా చేస్తానని యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. -
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్
-
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆశిష్ రైతులపై కావాలనే కాల్పులు జరిపినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఆశిష్‌తోపాటు అంకిత్‌దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికలో పేర్కొంది. రైతులపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. చదవండి: మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..! -
లఖిమ్‌పూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
సాక్షి, న్యూఢిల్లీ: లఖిమ్‌పూర్ ఖేరి ఘటనలో ఉత్తరప్రదేశ్ సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా రోజువారీ పర్యవేక్షించడానికి మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌పై సంతృప్తిగా లేమని పేర్కొంది. లఖిమ్‌పూర్‌ఖేరి ఘటనపై సోమవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఘటనపై న్యాయ పర్యవేక్షణకు పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్ రాకేష్‌కుమార్ జైన్ లేదా జస్టిస్ రంజిత్ సింగ్‌లలో ఒకరిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తును పర్యవేక్షించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్‌పై విశ్వాసం లేదని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్ యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ‘రైతులపై నుంచి వాహనం దూసుకెళ్లడం, రైతుల ఆగ్రహించి బీజేపీ కార్యకర్తలను హతమార్చిన వేర్వేరు ఘటనలపై వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదైనప్పటికీ సాక్షుల విచారణ కలిపి జరుగుతోందని భావిస్తున్నాం. ప్రత్యేకించి ఒక నిందితుడిని కాపాడడానికే ఇలా జరుగుతోంది అని అనిపిస్తోంది. అందుకే కేసులో ఆధారాలు మిళితం కాలేదని నిర్ధారించడానికి, దర్యాప్తును పర్యవేక్షించడానికి ఇతర రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ జడ్జిని నియమించాలని భావిస్తున్నాం. దీనిపై శుక్రవారంలోగా యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. విడివిడిగా దర్యాపు చేయాల్సిందే ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నిందితుడిగా ఉన్నారు. ఘటనలో రైతుల హత్య, జర్నలిస్టు హత్య, రాజకీయ కార్యకర్తల హత్య ఇలా మూడు ఉన్నాయని పేర్కొంది. ‘మూడో కేసుకు సంబంధించి పరిశోధన సిట్ కొనసాగించలేకపోతోందని అనుకుంటున్నాం. ఇలాంటి గందరగోళంలో స్వతంత్ర న్యాయమూర్తుల పర్యవేక్షణ సబబని భావిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. విడివిడిగా దర్యాప్తు చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. తాజా పరిస్థితి నివేదికను పరిశీలించామని, మరికొంత మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొనడం తప్ప మరేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పది రోజులు సమయం ఇచ్చినా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రాలేదని, కోర్టు అనుకున్నట్లుగా దర్యాప్తు సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ అవసరం లేదని పునరుద్ఘాటిస్తూ... ఈ కేసుకు రాజకీయ డిమాండ్లను జోడించదలచుకోలేదని, రిటైర్డ్ జడ్జీతో స్వతంత్ర పర్యవేక్షణ కోరుకుంటున్నామని తెలిపింది. రాష్ట్రప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని యూపీ తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే కోరారు. విచారణ నిమిత్తం ఎనిమిది సెల్ఫోన్లు తీసుకున్నామని, ఈ నెల 15 లోగా ఫోరెన్సిక్ నివేదికలు అందజేస్తామని సాల్వే తెలిపారు. ఆశిష్ ఫోన్ మాత్రమే సీజ్ చేశారని, మిగిలిన నిందితుల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరం లభ్యం కాలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకొని మిగిలినవి సాక్షులవి స్వాధీనం చేసుకుంటారా అని నిలదీసింది. రాజకీయ కార్యకర్త శ్యాంసుందర్ మృతి చెందడంపై సీబీఐ విచారణ చేపట్టాలని మరో న్యాయవాది కోర్టును కోరగా... అన్ని సమస్యలకూ సీబీఐ పరిష్కారం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వరకూ వేచిచూడాలని నిష్పాక్షిమైన దర్యాప్తు జరగడానికి ప్రయతిస్తున్నామని పేర్కొంది. ‘‘రెండు కేసుల్లో అవే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం ద్వారా ఒక నిర్దిష్ట నిందితుడికి ప్రయోజనం చేకూర్చాలని భావించినట్లు ప్రాథమికంగా భావించాల్సి వస్తోంది. వేర్వేరు ఎఫ్ఐఆర్ల సాక్ష్యాలు కలగలిసిపోతున్నాయని అనిపిస్తోంది. ఇలా వ్యాఖ్యానించినందుకు మరోలా భావించొద్దు. ఒక ఎఫ్ఐఆర్లో సాక్ష్యాలు మరో దాంట్లో ఉపయోగించొచ్చు అంటున్నారు. అప్పుడు కేసు ఏం కావాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కారు దూసుకెళ్లడంతోనే జర్నలిస్టు హత్య: లఖింపూర్ ఘటనలో కారు దూసుకెళ్లడంతోనే జర్నలిస్టు మృతి చెందినట్లు భావిస్తోందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం తరఫు లాయర్ హరీష్ సాల్వే ఏకీభవించారు. మూకదాడి వల్ల మృతిచెందారని తొలుత భావించామని కానీ అలా కాదని సాల్వే తెలిపారు. -
రైతు వ్యతిరేకతే లక్ష్యంగా...
జాతికి ఆహారధాన్యాలు పండించి ఇస్తున్న రైతుల ప్రాణాలను హీనంగా భావిస్తూ వారిపై తన వాహనం నడిపించి తొక్కించగలననే ఆత్మవిశ్వాసం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు ఎలా వచ్చింది? తన 96 ఏళ్ల చరిత్రలో ఆరెస్సెస్ ఒక రైతు బిడ్డను ఎన్నడూ నాయకత్వ స్థానంలో నిలిపి ఎరుగదు. రైతులు, చేతివృత్తుల వారిగురించి ఒక్క సానుకూల ప్రకటనను కూడా ఎన్నడూ చేసి ఎరుగదు. సర్దార్ పటేల్ నిర్వహించిన ఏ రైతాంగ ఉద్యమంలోనూ వీరు పాల్గొనలేదు. స్వాతంత్య్రం తర్వాత కూడా వీరు ఒక్క రైతాంగ ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. అందుకే రైతులు చేస్తున్న ఆందోళనలను వీరు జాతి వ్యతిరేక ఆందోళనగా ముద్ర వేస్తున్నారు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి మక్కువ, ప్రేమాభిమానాలు లేవు కానీ, అదే రైతుల ఓట్ల దన్నుతో వీరు దేశాన్ని పాలిస్తున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. భారతీయ జనతా పార్టీ... ఆరెస్సెస్ రాజ కీయ అనుబంధ సంస్థ. బీజేపీ సభ్యుల ప్రవర్తన, లక్ష్యాలకు సంబంధించిన శిక్షణ మొత్తంగా ఆర్ఎస్ఎస్ నుంచే వస్తోందనడంలో సందేహమే లేదు. అజయ్ మిశ్రా, అతడి కుమారుడు ఈ సంస్థాగత నిర్మాణంలో భాగమే. లఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ నోరు విప్పకపోవడంపై చర్చ జరుగుతున్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సైతం అక్కడ జరిగిన హింసాకాండపై మౌనం పాటించడం మరింత చర్చనీయాంశంగా ఉంది. ఆరెస్సెస్ అధినేతలు మోహన్ భాగవత్ కానీ, దత్తాత్రేయ హొసబలే కానీ ఇంతవరకు లఖీమ్‌పూర్ ఘటనపై నోరెత్తిన పాపాన పోలేదు. ప్రధానంగా శూద్రులు, దళితులతో కూడిన భారతీయ ఉత్పాదక శక్తులు–రైతులు, చేతివృత్తుల వారి– పట్ల ఒక సంస్థగా ఆరెస్సెస్ నడవడిక, దృక్పథం గురించిన మౌలిక ప్రశ్నలను ఇది లేవనెత్తుతోంది. ఇక్కడ నేను రెండు విషయాలను ప్రధానంగా పరిశీలనలోకి తీసుకుంటున్నాను. భారతీయ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి, ప్రజాస్వామ్యానికి ఊపిర్లూదిన భారత జాతీయ కాంగ్రెస్‌కూ, భారతీయ రైతులు, ఉత్పాదక శక్తుల పట్ల ఆరెస్సెస్ దృక్పథానికి మధ్య ప్రాథమికంగా ఉంటున్న వ్యత్యాసాలను పరిశీలిద్దాము. భారతీయ, స్కాటిష్ వలసవాద వ్యతిరేక స్వాతంత్య్రోద్యమ ప్రేమికులు కలిసి 1885లో స్థాపించిన సంస్థే భారత జాతీయ కాంగ్రెస్. దాదాబాయి నౌరోజీ, అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్, దిన్షా ఎడుల్జీ వచా వంటివారు భారత జాతీయ కాంగ్రెస్ తొలి సంస్థాపకుల్లో ఉన్నారు. వీరిలో దాదాబాయి నౌరోజీ, దిన్షా ఎడుల్జీ పార్సీలు కాగా, హ్యూమ్ స్కాటిష్ స్వాతంత్య్ర ఉద్యమకారుడు. జాతీయ కాంగ్రెస్ ప్రారంభంలో భారతీయ బ్రాహ్మణ నేత కానీ బనియా నేత కానీ ఏ ఒక్కరూ లేరని గమనించాలి. బ్రిటిష్ పాలకులతో ఘర్షిస్తున్న క్రమంలో అనేక రకాలుగా నష్టపోయిన ప్రముఖ పత్తి వ్యాపారి దిన్షా ఎడుల్జీ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. భారతీయ నేతల మద్దతు కొరవడినప్పటికీ, కాంగ్రెస్‌ని సంస్థగా నిర్వహించడంలో స్కాటిష్ జాతీ యుడైన ఏఓ హ్యూమ్ వహించిన కీలకపాత్రను దిన్షా గుర్తించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ కారులకు ఊపిరి పోసిన గొప్పమనిషి హ్యూమ్ అని ప్రశంసించారు. ఆనాడు, భారతదేశంలోని అనేకమంది బ్రాహ్మణులు, బని యాలు, కాయస్థులు, ఖాత్రీలు ఇంగ్లండులో చదువుకుని న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఇంగ్లిష్ చదువుకున్న బ్రాహ్మణుల్లో చాలామంది వలసవాద ప్రభుత్వం తరపున పనిచేసేవారు. కాంగ్రెస్ ఏర్పడ్డాక ద్విజులు తమ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీతో కూడా పొత్తు జట్టుకట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న వెంటనే బ్రాహ్మణులు దాని నాయకులైపోయారు. కానీ శూద్ర రైతులకు మాత్రం ఇంగ్లిష్ విద్య అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. ఇంగ్లిష్ విద్య నేర్చుకున్న తొలి శూద్ర రైతు మహాత్మా జ్యోతిబా పూలే 1827లో జన్మిం చారు. ఆయన కూడా 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ప్రభుత్వ సర్వీసులో, న్యాయస్థానాల్లో ఇంగ్లిష్ చదువుకున్న బ్రాహ్మణ యువత మాత్రమే పనిచేస్తూ డబ్బు సంపాదించేవారు. శూద్రులు వ్యవసాయంలో, ఇతర చేతివృత్తుల్లో నిమగ్నమవుతూ వచ్చారు. దేశంలో బ్రిటిష్ విద్య నేర్చుకున్న తొలి శూద్ర రైతు వల్లభాయి పటేల్ ఆ తర్వాత లాయర్ వృత్తి చేపట్టి 1917లో కాంగ్రెస్‌లో చేరారు. రైతులను ఎలా సంఘటితపర్చాలో కాంగ్రెస్ పార్టీకి, మహాత్మాగాంధీకి ఒక మార్గం చూపిన వ్యక్తి పటేల్. మంచి లాయర్‌గా చక్కగా ప్రాక్టీసు చేస్తున్న పటేల్... ఖేడా, బార్డోలితో సహా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రైతాంగ ఉద్యమాలకు నేతృత్వం వహించారు. సోషలిస్టు రైతాంగ విప్లవాల యుగంలో కాంగ్రెస్ పార్టీ మితవాద పంథా చేపట్టినప్పటికీ, గ్రామాల్లోకి పటేల్ చొచ్చుకుపోయారు. ఒక సహజ సజీవ మేధావిగా ఆయన రైతుల మనసుల్లో నిలిచిపోయారు. కానీ 1931లో కానీ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాలేకపోయారు. రైతు నేపథ్యంలోంచి భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడిగా లాహోర్ కాన్ఫరెన్సులో ఎన్నికైన పటేల్.. ‘ఏ భారతీయుడైనా ఆకాం క్షించే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి ఒక సాధారణ రైతును ఆహ్వానించార’ని పేర్కొన్నారు. ‘1931 నాటికి కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఉనికిలో ఉంటూవచ్చిందనీ, కానీ పార్టీ అధ్యక్ష పదవికి రైతాంగ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఆ నలభై ఏళ్ల కాలంలో ఎంపిక చేసుకోలేకపోయిందనీ, భారతదేశం తన గ్రామసీమల్లోనే నివసిస్తోం దని మహాత్మాగాంధీ అతిశయించి చెబుతున్నప్పటికీ రైతుకు అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టలేకపోయింద’నీ చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు. మహారాష్ట్ర బ్రాహ్మణులు 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించారు. ఈ సంస్థలో ఒక పార్సీకానీ, సిక్కు కానీ, బుద్ధిస్టు కానీ లేరు. ఒకే ఒక ముస్లిం మాత్రం ఉండేవారు. తన సైద్ధాంతిక పత్రాల్లో ఈ సంస్థ రైతులు, చేతివృత్తుల వారిగురించి ఒక్క సాను కూల ప్రకటనను కూడా ఎన్నడూ చేసి ఎరుగదు. సర్దార్ పటేల్ నిర్వహించిన ఏ రైతాంగ ఉద్యమంలోనూ వీరు పాల్గొనలేదు. స్వాతంత్య్రం తర్వాత కూడా వీరు ఒక్క రైతాంగ ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒక పురాతన వారసత్వం నినాదంతో వచ్చిన ఆరెస్సెస్.. తన 96 సంవత్సరాల ఉనికిలో ఒక రైతు కుమారుడిని ఎన్నడూ అధినాయకత్వ స్థానంలో నిలిపి ఎరుగదు. వీరిదృష్టిలో గ్రామీణులు జాతిలో కానీ, దాని పురాతన వారసత్వంలో కానీ భాగం కాదు. భారత జాతీయ కాంగ్రెస్‌కు, ఆరెస్సెస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో అనేక రైతాంగ ఉద్యమాలను సంలీనం చేసుకుంది. కానీ ఆరెస్సెస్ ఆ పని చేయలేదు. కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా పోరాడే బలమైన శక్తిగా మాత్రమే రైతులను ఆరెస్సెస్ వాడుకుంది. తమ మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలపై రైతులు చేస్తున్న ఆందోళనను మితవాద పక్షం జాతి వ్యతిరేక ఆందోళనగా ముద్ర వేస్తోంది. భారత్ అంటే వ్యవసాయంతో ఎలాంటి సంబంధం లేని హిందుత్వ శక్తులకు సంబంధించిన అతి చిన్న భాగమేననేలా మితవాద పక్షం భావిస్తోంది. వీరి సాంస్కృతిక జాతీయవాదం వ్యవసాయాన్ని జాతీయవాదంలో భాగంగా చూడటం లేదు. రైతుల పిల్లలు పూజారులుగా మారి పూజలు నిర్వహించే హక్కేలేని హిందూ ఆలయాలకే ఈ తరహా జాతీయవాదం పరిమితమైపోయింది. వ్యవసాయం గురించి, శూద్ర దళిత ప్రజారాశుల గురించి కనీసం ప్రస్తావించని ప్రాచీన సంస్కృత పుస్తకాల్లో మాత్రమే వీరి జాతీయవాదం ఉనికిలో ఉంది. జాతికి ఆహారధాన్యాలు పండించి ఇస్తున్న రైతులను వీధికుక్కలకంటే హీనంగా భావిస్తూ వారిపై తన వాహనం నడిపించి తొక్కించగలననే ఆత్మవిశ్వాసం ఆశిష్ మిశ్రాకు మెండుగా ఉందంటే అది ఆరెస్సెస్ వారసత్వం నుంచే వచ్చింది. ఆరెస్సెస్ సంస్థాగత మద్దతుపై ప్రాతిపదికనే ఇతడికి ఇంత అహంభావం పుట్టుకొచ్చింది. అదే సమయంలో దేశం మొత్తానికి ఆహార ధాన్యాలు పండిస్తున్న శూద్రుల వారసత్వమే రైతులది. ఆరెస్సెస్‌కు తమకు మధ్య ఇంత వ్యత్యాసం ఉందనే విషయం ఈ రైతులకు తెలీదు. అందుకే ఆశిష్ మిశ్రా వారసత్వం గురించి దేశం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. రైతులు, మొత్తం దేశం కూడా ఇప్పుడు బతికి బట్టకట్టాల్సిన అవసరం ఉంది. దీని సాంస్కృతిక జాతీయవాద ఎజెండాకు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి మక్కువ, ప్రేమాభిమానాలు లేవు. కానీ అదే రైతుల ఓట్ల దన్నుతో వీరు దేశాన్ని పాలిస్తున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. -ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Lakhimpur Kheri: అంతమందిలో 23 మందే ప్రత్యక్ష సాక్షులా?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు సంబంధించి సాక్షులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొంటే ఘటనలో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులు మాత్రమే ఉన్నారా అని ప్రశ్నించింది. ఈ ఉదంతంలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. ఈనెల 3న లఖింపూర్ ఖేరి హింసాకాండలో రైతులపైకి వాహనం దూసుకెళ్లిన కేసులో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో సహా ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశారు. మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి) వేల మంది ఎదుట జరిగింది కదా? యూపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక్కరు మినహా మిగతా అందరినీ ఇంకా పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారని ప్రశ్నించగా .. స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్ తెలిపారు. వేలాది మంది రైతులు ర్యాలీలో ఉంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులా అని ధర్మాసనం ప్రశ్నించగా... పత్రికల్లో ప్రకటన ఇచ్చామని, ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయగా దాన్ని ల్యాబ్‌కు పంపామని సాల్వే తెలిపారు. సాక్షులకు రక్షణ కల్పించాలని, సీసీటీవీల ఏర్పాటు, ఇంటి వద్ద భద్రత కల్పించడం చేయాలని సీజేఐ ఆదేశించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించాలని ధర్మాసనం పేర్కొంది. ఘటనలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన భర్త మృతి చెందారని, హంతకులు బహిరంగంగా తిరుగుతూ తనని బెదిరిస్తున్నారని రూబీ దేవి అనే మహిళ ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. దీనిపై ఏం చేశారని సీజేఐ ప్రశ్నించారు. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని సాల్వే తెలిపారు. జర్నలిస్టు, రూబీ దేవి భర్త హత్యలపై వేర్వేరు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 8కి వాయిదా వేసింది. -
‘4-5వేల మంది ఉంటే.. సాక్ష్యులుగా 23 మందేనా?’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉంటే మీకు కేవలం 23 మంది మాత్రమే సాక్ష్యులుగా కనిపించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది సాక్ష్యుల స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక సాక్ష్యులందరికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. (చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ) విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అశిష్ మిశ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి 68 మంది సాక్ష్యులు ఉన్నారని.. వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్ష్యులు కాగా.. మరో 30 మంది స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘4-5వేలమందితో ర్యాలీ తీస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కానీ మీకు మాత్రం 23 మంది సాక్ష్యులే కనిపించారా.. మీ ఏజెన్సీలకు చెప్పి.. మరింత మంది స్టేట్మెంట్స్ రికార్డు చేయమనండి. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా.. న్యాయాధికారులు అందుబాటులో లేకపోయినా.. సమీప జిల్లా కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేయండి’’ అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేశారు. (చదవండి: ‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’) అక్టోబర్ 3న లఖీమ్‌పూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లఖీమ్‌పూర్ హింసను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. చదవండి: ఉరికి వేలాడుతున్న మనిషి.. అంతా ప్రాణం పోయింది అనుకున్నారు, కానీ.. -
Uttarpradesh: లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరపున హరీష్ సాల్వే.. ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కాగా, ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు హరిష్ సాల్వేని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. నలుగురిని అరెస్ట్ చేశామని యూపీ అడ్వకేట్ జనరల్ హరీష్ సాల్వే తెలిపారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డుకవర్లో ధర్మాసనం ముందు ఉంచామని హరిష్ సాల్వే తెలిపారు. మరికొన్ని వీడియోలున్నాయని, అవి దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్.. నివేదికను సీల్డుకవర్లో ఇవ్వాలని తాము కోరలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఎలాంటి నివేదిక అందలేదని సుప్రీంకోర్టు జస్టిస్ రమణ తెలిపారు. కాగా, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. చదవండి: Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి -
రైతుల రైల్ రోకో.. ‘అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందే’
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రతరమైంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర రైల్వే జోన్లో ఎనిమిది రైళ్లు నియంత్రించబడుతున్నాయని ఉత్తర రైల్వే సీఆర్పీఓ సోమవారం తెలిపింది. (చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది. (చదవండి: నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని కిసాన్ మోర్ఛా తెలిపింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో న్యాయం జరిగేవరకు పోరాడతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. చదవండి: Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’ Punjab: Farm law protestors sit on the railway track at Devi Dasspura village in Amritsar following the farmer's union call for 'Rail Roko Andolan' today pic.twitter.com/lQrKImJKso — ANI (@ANI) October 18, 2021 -
Sonia Gandhi: నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని
సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై జీ–23 నేతలు ప్రశ్నలు లేవనెత్తడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కఠినవైఖరి ప్రదర్శించారు. తానే పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలినని, అందరూ అనుమతిస్తే ఉంటానని శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఐదున్నర గంటల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో కేంద్రప్రభుత్వ విధానాలు, మూడు వ్యవసాయ చట్టాలు– రైతు ఉద్యమం, లఖీమ్‌పూర్ ఖేరి ఘటన, జమ్మూకశ్మీర్‌లో మైనార్టీలపై దాడులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను, ఆందోళనలను తాము చూసీ చూడనట్లుగా ఎప్పుడూ వ్యవహరించలేదని, ప్రతీ అంశంపై చర్చించే నిర్ణయం తీసుకున్నామని, అయితే మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. కాగా సోనియా చేసిన ఈ ప్రకటన పార్టీ అసంతృప్త నేతల గ్రూప్ అయిన జీ–23కి తగిన సమాధానం ఇచ్చినట్లేనని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా సహా 23 మంది నాయకులు గత ఏడాది సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీలో కీలక మార్పులు జరగాలని, సమర్థవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు. అప్పటినుంచి ఏదో ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం కపిల్ సిబల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించే అంశంపై స్పష్టతనిచ్చారు. సోనియా నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు లేవని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేక స్వరంపై మాట్లాడిన సోనియాగాంధీ, ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, అయితే పార్టీలో ప్రతీ ఒక్కరు ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, ప్రతి సవాలును ఎదుర్కోగలమని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై ఈ ఏడాది జూన్ 30 లోపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రోడ్‌మ్యాప్ తయారు చేసినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియ గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పూర్తి సమాచారం ఇస్తారని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నాయకులకు సోనియా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలబడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐక్యత, పార్టీ ప్రయోజనాలను అగ్రస్థానంలో ఉంచడం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరింత అవసరమని సోనియా వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. ఈ ప్రస్తావనకు సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన అభిప్రాయానికి మద్దతు ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు సంస్థాగత ఎన్నికల వాయిదా విషయంలో కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మినహా ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకోని పరిస్థితుల్లో మరోసారి పార్టీలో అంతర్గత అలజడి చెలరేగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్గత పోరును బయటపడనీయకుండా ఉండేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వెంటనే అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని, అందుకే పార్టీలో ఒడిదుడుకుల కారణంగా సోనియా అలా చెప్పవలసి వచ్చిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగినప్పటికీ రాహుల్,ప్రియాంక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం జీ–23 నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో గెలిస్తే పార్టీపై గాంధీ కుటుంబం పట్టు మరింత బలపడుతుంది. లఖీమ్‌పూర్ హింస కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనస్తత్వాన్ని బహిర్గతం చేసిందని సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్లౖపైకెక్కినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ జరుగుతున్న ఉగ్ర దాడులకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సోనియా అన్నారు. దేశ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక సంస్కరణల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటోందని, ప్రతిదీ విక్రయించాలన్న ఒకే ఒక ఎజెండా ప్రస్తుతం కేంద్రానికి ఉందని సోనియా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఒక రాజకీయ తీర్మానాన్ని చేసింది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ ఆ తీర్మానంలో ప్రస్తావించింది. లద్దాఖ్ ఘటన జరిగి 18 నెలలు అయినప్పటికీ చైనా సైనికులు ఇప్పటికీ భారత భూభాగంలో ఆక్రమణలు కొనసాగిస్తున్నారని సీడబ్ల్యూసీ విమర్శించింది. పాకిస్తాన్ చొరబాట్లు జమ్మూకశ్మీర్ భద్రతను గణనీయంగా దిగజార్చాయని ఆరోపించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, మిజోరంలలో భద్రతకు ముప్పు పెరుగుతోందని, సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య అకస్మాత్తుగా అంతర్ రాష్ట్ర వివాదాలు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ పతనం చాలా ఆందోళన కలిగిస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మహమ్మారి కారణంగా కోల్పోయిన ఉద్యోగాల కల్పనపై కేంద్రం దృష్టి సారించలేదని, ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర అధిక ధరలతో కష్టాలను ఎదుర్కొంటున్నారని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది. సంస్థాగత షెడ్యూల్ ఇదీ.. సీడబ్ల్యూసీ నిర్ణయాలను సమావేశం అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా మీడియాకు వివరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి కార్యకర్తల వరకు పెద్దఎత్తున శిక్షణ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు చేస్తారు. ప్రాథమిక కమిటీలు, బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపికకు ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ఎన్నిక జరుగనుంది. వచ్చే ఏడాది జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు పీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి,íపీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీ్నరీ సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ధరల పెరుగుదలపై నవంబర్ 14 నుంచి 29 వరకు పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుందని పేర్కొన్నారు. పరివార్ బచావో వర్కింగ్ కమిటీ: బీజేపీ ఎద్దేవా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ‘పరివార్ బచావో(కుటుంబాన్ని కాపాడే) వర్కింగ్ కమిటీ’ అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అంతర్గత వైషమ్యాలకు ఈ సమావేశం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించింది. పార్టీ నాయకత్వ వైఫల్యంపై చర్చించడానికి బదులు అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికే సీడబ్ల్యూసీ భేటీ జరిగినట్లు బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. -
లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరిలో ఘటనలో బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకి దిగుతున్నారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి రైతులకు మద్దతుగా మాట్లాడిన పాత వీడియో క్లిప్పుని గురువారం ఆయన ట్వీట్ చేశారు. 1980లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వ రైతు అణిచివేత విధానాలను వాజ్‌పేయి ఖండిస్తూ అన్నదాతలకు అండగా ఉంటానంటూ చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని షేర్ చేశారు. ‘‘ప్రభుత్వం రైతుల్ని అణిచివేసినా, రైతు చట్టాలను దుర్వినియోగం చేసినా, వారు శాంతియుతంగా చేసే నిరసనల్ని అణగదొక్కినా మనం రైతు పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. వారి నుంచి దూరంగా పారిపోవాలి్సన పనిలేదు’’ అని వాజ్‌పేయి ఆ వీడియోలో పేర్కొన్నారు. లోతైన హృదయం ఉన్న నాయకుడి గొప్ప మాటలు ఇవి అంటూ వరుణ్ గాంధీ కొనియాడారు. -
సీన్ రీక్రియేషన్.. లఖీమ్‌పూర్‌కు ఆశిష్ మిశ్రా
అఖీమ్‌పూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన కార్యాచరణను వేగవంతంగా చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు, ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతోపాటు ఇదే కేసులో అరెస్టు చేసిన మరో ముగ్గురిని గురువారం ఘటనా స్థలానికి తీసుకొచి్చంది. హింసకు దారితీసిన పరిణామాలను తెలుసుకొనేందుకు లఖీమ్‌పూర్‌లో చోటుచేసుకున్న వరుస ఘటనలను రీక్రియేట్ చేసింది. రైతుల స్థానంలో కొన్ని బొమ్మలను పెట్టి, వాహనంతో ఢీకొట్టించినట్లు తెలుస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా–బన్బరీపూర్ రోడ్డులో ఘటనా స్థలానికి చేర్చారు. అక్టోబర్ 3న జరిగిన ఘటనపై వారిని ప్రశ్నించారు. అంతకముందు అధికారులు జిల్లా జైలుకు చేరుకొని, నిందితులు దాస్, లతీఫ్, భారతిని తమ కస్టడీలోకి తీసుకొని, లఖీమ్‌పూర్‌కు బయలుదేరారు. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను పోలీసు కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం లఖీమ్‌పూర్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 3న రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు బలయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. -
Lakhimpur Kheri Violence: నకిలీ బాబా పాలన అంతం కానుంది
లక్నో: లాఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్రసస్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారిపాలన త్వరలో అంతం కానుందని అన్నారు. లాఖీమ్‌పూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలు వాహనాలతో రైతుల మీది నుంచి దూసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బంది పెడుతున్న నకిలీ బాబా త్వరలో అధికారం కోల్పొతాడని పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, వారి పాలనలో అవినీతి పెరిగిందని మండిపడ్డారు. శాంతి భద్రతలను గాలికి వదిలేశారని, దీంతో నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. 2022లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ.. పలు చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. -
బీజేపీకి వరుణ్ గాంధీ షాక్: ఒకనాటి సంచలన వీడియో పోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా గళం విప్పిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తగ్గేదే..లే అంటూ కేంద్రానికి మరోసారి షాకిచ్చారు. మాజీ ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన ఒక సంచలన వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. రైతుల అణచివేతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను గురువారం ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతులకు మద్దతుగా నిలిచిన ఆయన ప్రసంగ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. చదవండి : మిశ్రాను పదవి నుంచి తప్పించండి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల సుదీర్ఘ ఉద్యమం, లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండ నేపథ్యంలో బీజేపీ నేత ట్విట్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. "పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్ చేయడమంటే మోదీ సర్కార్‌కు షాకేనని భావిస్తున్నారు. వరుణ్ గాంధీ షేర్ చేసిన వీడియోలో చట్టలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయడంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాలని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి కేంద్రాన్ని హెచ్చరించడం ఈ క్లిప్పింగ్‌లో చూడొచ్చు. చదవండి : Global Handwashing Day 2021: కరోనాకు చెక్ పెడదాం కాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసపై ఘాటుగా స్పందించిన ఏకైక బీజేపీ ఎంపీవరుణ్ గాంధీ. హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కారుతో ఢీకొట్టి మరీ రైతులను హత్య చేశారన్న ఆరోపణల్లో జూనియర్ హోం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడు. మరోవైపు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మాట్లాడిన నెల రోజులకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడుగా వరుణ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి : Love Your Eyes: ఆ కళ్లను ప్రేమిస్తున్నారా? అయితే ముందు మీ కళ్లను ప్రేమించండి! Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx — Varun Gandhi (@varungandhi80) October 14, 2021 -
మిశ్రాను పదవి నుంచి తప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రియాంకా గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులతో కూడిన కాంగ్రెస్ బృందం బుధవారం రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖీమ్‌పూర్ ఘటనపై పూర్తి వివరాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాన నిందితుడి తండ్రి కేంద్రంలో మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని భావిస్తున్నామని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీలతో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. అజయ్ రాజీనామాతో బాధితులకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. ‘సెప్టెంబరు 27న నిరసన తెలుపుతున్న రైతులను అజయ్ మిశ్రా బహిరంగంగా బెదిరించారు. మంత్రే ఇలా రెచ్చగొడితే న్యాయం ఎలా లభిస్తుంది? ఘటనలో అజయ్ కొడుకు ఆశిష్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి’ అని వినతి పత్రంలో నేతలు పేర్కొన్నారు. ఆశిష్‌కు బెయిల్ నిరాకరణ లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ కేసులో అంకిత్ దాస్, లతీఫ్ అలియాస్ కాలే అనే ఇద్దరు వ్యక్తులను సిట్ బుధవారం అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని 14 రోజులపాటు జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆశిష్ మిశ్రాతోపాటు అతడి సహచరుడు ఆశిష్ పాండేకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చింతా రామ్ తిరస్కరించారని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ ఎస్.పి.యాదవ్ చెప్పారు. -
లఖీమ్‌పూర్ ఘటనను ఖండించాలి
బోస్టన్: ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రైతుల ప్రాణాలను బలి తీసుకున్న లఖీంపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అదే సమయంలో ఆ తరహా ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా గళమెత్తాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ మంగళవారం హార్వర్డ్ కెన్నెడీ స్కూలులో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు సీతారామన్‌ను రైతులు బలిగొన్న ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ప్రధానమంత్రి, ఇతర సీనియర్ మంత్రులు ఎందుకు పెదవి విప్పడం లేదని, బీజేపీ దేనికి ఆత్మరక్షణలో పడిపోయిందని సూటిగా ప్రశ్నించారు. దీనికి సీతారామన్ బదులిస్తూ లఖీంపూర్ ఖేరి ఘటనని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారని ఆ తరహా ఘటనలు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని వాటి గురించి కూడా మాట్లాడాలని అన్నారు. ‘‘దేశంలో ఏ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరిగినా అందరూ గళమెత్తాలి. భారత్ గురించి బాగా తెలిసిన డాక్టర్ అమర్త్యసేన్ వంటి వారు ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా లేవనెత్తాలి. యూపీలో బీజేపీ అధికారంలో ఉండడం, కేంద్ర మంత్రి కుమారుడు ప్రమేయంపై ఆరోపణలున్నాయి కాబట్టే అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ పని ఎవరు చేసినా న్యాయస్థానంలో తేలిపోతుంది. ఇదంతా నేను మా ప్రధానిని కానీ, మా పార్టీని కానీ వెనకేసుకొని రావడం కాదు. నేను భారత్ గురించి మాట్లాడతాను. నిరుపేదలకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడతాను’’అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
‘ఒక్కరి కోసం పార్టీ పరువు బజారుకీడ్చారు’.. బీజేపీకి తిప్పలు తప్పవా?
(వెంకటేష్ నాగిళ్ల- సాక్షిటీవీ న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి): లఖింపూర్ ఖేరి ఘటన తమ కొంప ముంచేలా ఉందని బిజెపి నేతలు వాపోతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గుదిబండగా మారే అవకాశాలున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడి కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశమంతటిని కదిలించింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తనయుడు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించేంతవరకు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రైతుల విషయంలో దారుణంగా వ్యవహరించిన తండ్రి, కొడుకులిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. (చదవండి: బడితెపూజ∙తప్పదు!) ఈ వైఖరిపై బిజెపిలో అంతర్గతంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వ్యక్తిని కాపాడే క్రమంలో పార్టీ పరువు బజారుకీడ్చారని పలువురు నేతలు మండిపడుతున్నారు. అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూపిలో యోగి ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అరోపణలు ఎదుర్కొంటోంది. వివేక్ దూబే ఎన్ కౌంటర్ సహా గతంలో బ్రాహ్మణులకు దక్కిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి వుంది. (చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు) దీన్ని అధిగమించేందుకే రాష్ట్ర క్యాబినెట్‌ను విస్తరించి బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు మంత్రివర్గంలో చేర్చుకుంది. అలాగే కేంద్రంలో అజయ్ మిశ్రాకు సహయమంత్రి పదవి ఇచ్చి కీలకమైన హోంశాఖను అప్పజెప్పారు. అయితే అజయ్ మిశ్రా తన దుందుడుకు వ్యవహరంతో రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాంతో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులపై కాన్వాయ్‌ను నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆయన పార్టీకి లేని తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఆయనపై వెంటనే వేటు వేస్తే ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల కోపం చల్లార్చేందుకు తీసుకున్న చర్యలు నిష్ఫలమవుతాయి. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేంతవరకు యోగి ప్రభుత్వం వెయిట్ చేసింది. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాజీనామా చేయించడం లేక మరోటా అనేది తేల్చే అవకాశముంది. ఏది ఏమైనా ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు అధిష్టానం ప్రయత్నిస్తే, వారే మరో అతిపెద్ద సమస్యను బిజెపికి సృష్టించారు. దాని ఫలితంగా ఎన్నికల్లో బిజెపి నష్టపోయే పరిస్థితి తలెత్తింది. (చదవండి: అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు) -
Lakhimpur Kheri Violence: నేడు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్
న్యూఢిల్లీ/లఖీమ్‌పూర్ ఖేరి: రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి లఖీమ్‌పూర్‌ఖేరి ఘటనపై వినతిపత్రం అందజేయనున్నారు. ఈ బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభ పార్టీ నేత అధిర్ రంజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉంటారు. హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి పూర్తి వివరాలను అందజేస్తామని పార్టీ నేత వేణుగోపాల్ తెలిపారు. మంత్రి కుమారుడు రైతులపైకి వాహనం నడిపిన ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించి మంత్రి కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతిమ్ అర్దాస్‌లో పాల్గొన్న ప్రియాంక లఖీమ్‌పూర్‌ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు మంగళవారం టికోనియా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ నేతలు రాకేశ్ తికాయత్, దర్శన్‌సింగ్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, ధర్మేంద్ర మాలిక్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలో అసువులు బాసిన రైతుల కుటుంబసభ్యులు కార్యక్రమ ంలో పాల్గొన్నారు. ప్రకటించిన విధంగానే, వేదికపై రాజకీయ పార్టీల నేతలెవరికీ చోటు కల్పించలేదు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పోలీస్ కస్టడీకి ఆశిష్
లఖీమ్‌పూర్‌ఖేరి/బహ్రెయిచ్: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరగా.. 12 నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిందని అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయంతో రిమాండ్ గడువు ముగియనుంది. ఈ సమయంలో ఆశిష్ మిశ్రాను ఇబ్బందిపెట్టరాదనీ, విచారణ సమయంలో లాయర్ ఆయన పక్కనే ఉంటారని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చింతారాం షరతు విధించారు. అంతకుముందు, ఓ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. టింకోనియాలో నేడు అంతిమ్ అర్థాస్ లఖీమ్‌పూర్ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం అంతిమ్ అర్థాస్ (అంతిమ ప్రార్థన) జరుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు మంగళవారం షహీద్ కిసాన్ దివస్‌గా పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న టికోనియా గ్రామంలో జరిగే అంతిమ ప్రార్థన కార్యక్రమానికి రాకేశ్ తికాయత్ సహా రైతు నేతలు తరలిరానున్నారు. ఇలా ఉండగా, లఖీమ్‌పూర్‌ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సోమవారం లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. -
వరుణ్ గాంధీపై శివసేన ప్రశంసలు.. మీరూ మెచ్చుకోండి!
ముంబై: అన్నదాతలకు అండగా నిలిచి సొంత పార్టీ ఆగ్రహానికి గురైన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై శివసేన పార్టీ ప్రశంసలు కురిపించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో రైతులకు దన్నుగా నిలిచిన ఆయనను అభినందించాలని ఉత్తరప్రదేశ్ రైతు సంఘాల నేతలకు సూచించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులతో పాటు 8 మంది ప్రాణాలు కోల్పోయినా బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని శివసేన తప్పుబట్టింది. ‘శత్రుత్వాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రయత్నాలను మన దేశం ఎప్పటికీ సహించదు. వరుణ్ గాంధీ (మాజీ ప్రధాని) ఇందిరా గాంధీ మనవడు, సంజయ్ గాంధీ కుమారుడు. లఖీమ్‌పూర్ ఖేరిలో కిరాతక ఘటన చూసిన తర్వాత ఆయన రక్తం మరిగింది. ఈ దారుణోదంతంపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరిచారు’ అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. రాజకీయంగా తనకు ఎదురయ్యే ఆటుపోట్ల గురించి పట్టించుకోకుండా రైతుల హత్యలను ఖండించి ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించింది. ‘వరుణ్ గాంధీని ప్రశంసిస్తూ రైతు నాయకులు తీర్మానం చేయాల’ని శివసేన సలహాయిచ్చింది. లఖీమ్‌పూర్ ఖేరిలో అన్నదాతలను అత్యంత కిరాతకంగా కారుతో గుద్ది చంపడాన్ని వరుణ్ గాంధీ అంతకుముందు తీవ్రంగా ఖండించారు. అధికార మదంతో పేద రైతులను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘హిందూ వర్సెస్ సిక్కు యుద్ధం’గా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించారు. (చదవండి: వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?) కాగా, అక్టోబర్ 3న చోటుచేసుకున్న లఖీమ్‌పూర్ ఖేరి దారుణోదంతం కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా శనివారం పోలీసులు ఎదుట లొంగిపోగా.. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు అజయ్ మిశ్రా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చదవండి: ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ ఉన్నారు? -
ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ?
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనలో హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సిట్ విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు చాలా ప్రశ్నలకి ఆయన సమాధానమే ఇవ్వలేదని సమాచారం. నలుగురు రైతుల్ని బలిగొన్న వాహనం దూసుకుపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఎక్కడ ఉన్నాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల్లో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు లఖీమ్‌పూర్ ఖేరిలో హింస చెలరేగినప్పుడు తాను అక్కడికి 4–5 కి.మీ. దూరంలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల వద్ద ఉన్నట్టుగా ఆశిష్ విచారణలో వెల్లడించారు. అజయ్ మిశ్రా స్వగ్రామమైన భవానీపూర్‌లో నిర్వహించిన ఈ రెజ్లింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవడానికి కేంద్ర మంత్రి వెళుతుండగానే అక్టోబర్ 3న హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ఎదుట లొంగిపోయిన ఆశిష్‌ని 12 గంటల సేపు ప్రశ్నించిన తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... అతనిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్పీ యాదవ్ చెప్పారు. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేశారు. ఆ మూడు పాయింట్లు.. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన మూడు పాయింట్లు గమనిస్తే ఆశిష్ వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థమవుతోందని సిట్ పోలీసులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... ► లఖీమ్‌పూర్ ఖేరిలో వాహనం దూసుకుపోయిన ఘటన జరిగినప్పుడు తాను రెజ్లింగ్ కార్యక్రమంలో ఉన్నానని ఆశిష్ చెప్పారు. అయితే రెజ్లింగ్ కార్యక్రమం దగ్గర పహారాగా ఉన్న పోలీసు సిబ్బంది ఆశిష్ ఆ కార్యక్రమానికి వచ్చినప్పటికీ 2 నుంచి 4 గంటల మధ్య కనిపించకుండా పోయారని వెల్లడించారు. ► ఆశిష్ మిశ్రా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆయన ఉండే ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆ సమయంలో హింసాకాండ జరిగిన స్థలంలోనే ఉన్నారని తేలింది. ఇదే విషయాన్ని సిట్ అధికారులు నిగ్గదీసి అడిగితే ఆశిష్ మళ్లీ మాట మార్చి ఆ సమయంలో తాను తమ రైస్‌మిల్లుకి కూడా వెళ్లానని, హింస చెలరేగిన ప్రాంతానికి అది దగ్గరలో ఉందని, ఈ రెండు ప్రదేశాలు ఒకే మొబైల్ టవర్ కిందకి వస్తాయంటూ వాదించారు. ఈ రెండు అంశాలూ ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా ఉండబట్టే అరెస్టు జరిగిందని సమాచారం. ► రైతుల ఊసే లేకుండా దాఖలు చేసిన రెండో ఎఫ్ఐఆర్ (డ్రైవర్‌ను, బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టి చంపిన కేసు)లో పరిశీలించినా ఆశిష్ అన్నీ నిజాలు చెప్పడం లేదని అర్థమవుతుంది. రైతుల మీదకి దూసుకుపోయిన వాహనం తనదేనని అంగీకరించిన ఆశిష్ ఆ సమయలో తాను అందులో లేనని మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆశిష్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవింగ్ సీటులో ఉన్నది ఆశిష్ కాదని, అతని డ్రైవర్ హరిఓం అని చెబుతున్నారు. డ్రైవింగ్ సీటులో డ్రైవర్ హరిఓం ఉన్నాడని, అతను తెల్ల చొక్కా లేదంటే కుర్తా ధరించాడని ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. వీడియో పరిశీలనలో కూడా తెల్లచొక్కా ధరించిన వ్యక్తే నడుపుతున్న పోలీసులు గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన డ్రైవర్ మృతదేహంపై పసుపు చొక్కా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆశిష్ వాస్తవాలు దాచి పెడుతున్నారని తెలుస్తోందని సిట్ పోలీసుల వాదనగా ఉంది. -
అజయ్ మిశ్రా వైదొలగాల్సిందే
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«ధీ డిమాండ్ చేశారు. మిశ్రా రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఎవరూ తమని నిరోధించలేరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బాధిత రైతు కుటుంబాలకు మద్దతుగా కిసాన్ న్యాయ్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీనుద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు యూపీలో న్యాయం జరగదన్నారు. బాధిత కుటుంబాలు న్యాయం కోరుకుంటున్నాయే తప్ప డబ్బు కాదన్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలెవరికీ లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లే తీరిక దొరకలేదన్నారు. ‘‘సోన్‌భద్ర మారణకాండలో ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఉన్నావ్, హత్రాస్ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో న్యాయం జరగలేదు. ఈ కేసులోనూ అదే జరుగుతోంది. లఖీమ్‌పూర్ ప్రజలకి కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది’’ అని అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తమతో చర్చించడానికి యూపీ ప్రభుత్వం క్రిమినల్స్‌ని పం పిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రియాంక వెల్లడించారు. మతం రంగు పులమొద్దు: వరుణ్ గాంధీ లఖీమ్‌పూర్ ఉదంతాన్ని హిందువులు, సిక్కుల మధ్య గొడవగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రమాదకర పరిణామాలను దారి తీస్తాయని, మానిపోయిన పాత గాయాలను మళ్లీ రేపుతాయంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. స్థానిక ఆధిపత్య శక్తుల వల్లే పేద రైతులు బలయ్యారని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేసే రైతులను ఉద్దేశించి ‘ఖలిస్తానీ’ అని మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశ ఐక్యతను పణంగా పెట్టొద్దని వరుణ్ గాంధీ కోరారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలకు ఆయన మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్‌గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
ఆశిష్ మిశ్రా అరెస్ట్
న్యూఢిల్లీ/లక్నో/లఖీమ్‌పూర్: యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను శనివారం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అరెస్ట్ చేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మొదటి విడత సమన్లకు బదులివ్వని ఆశిష్‌మిశ్రా శుక్రవారం పోలీసులిచి్చన రెండో విడత సమన్లకు స్పందించారు. ఆశిష్ శనివారం ఉదయం 10.30 గంటలకు సిట్ కార్యాలయానికి రాగా డిప్యూటీ ఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలో అధికారుల బృందం 11 గంటలపాటు ప్రశి్నంచి, రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆశిష్ సహకరించడం లేదని, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు చెప్పా రు. ఈనెల 3న యూపీ డిప్యూటీసీఎం మౌర్య పర్యటన సమయంలో వాహనం ఢీకొని నలుగురు రైతులు చనిపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఒక వాహనంలో ఉన్నారని పేర్కొంటూ పోలీసులు ఆయనపై హత్య కేసు నమోదు చేశా రు. రైతులపై హింసను ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఉగ్రదాడిగా రైతు సంఘాలు అభివరి్ణంచాయి. వాళ్లని అరెస్ట్ చేయాలి.. లఖీమ్‌పూర్ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయనతోపాటు ఆయన కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు నివాళులర్పించేందుకు 12వ తేదీన టికోనియాలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే నలుగురు రైతుల అస్తికలతో 11వ తేదీన షహీద్ కిసాన్ యాత్ర చేపడతామన్నారు. 15న దసరా రోజున ప్రధాని, హోం మంత్రి దిష్టి»ొమ్మల దహనం, 18న రైల్ రోకో, 26న మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లఖీమ్‌పూర్‌ఖేరి హింస సందర్భంగా బీజేపీ కార్యకర్తలను చంపిన వారిని దోషులుగా భావించడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నా రు. నలుగురు రైతులను చంపినందుకు ప్రతిచర్యగానే ఈ ఘటన చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. లఖీమ్‌పూర్ హింస దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సింది పోయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రైతులను అణచివేసినట్లే, చట్టాలనూ పక్కనబెట్టాలని చూస్తోం దన్నారు. అదేవిధంగా, లఖీమ్‌పూర్ ఘటనలకు నిరసనగా ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా నివాసం ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ బృందం ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచడంతో దీక్షను విరమిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సిద్ధూ ప్రకటించారు. సీజేఐని ప్రశంసించిన దుష్యంత్ దవే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చూపిన చొరవను సుప్రీం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ప్రశంసించారు. ఘటనలపై విచారణ సమయంలో ఆయన చాలా బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించారన్నారు. కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తాయన్న భరోసాను సీజేఐ కలి్పంచారన్నారు. సమావేశంలో తికాయత్, యోగేంద్రయాదవ్ -
లఖింపూర్ ఘటన: క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌కు అశిష్ మిశ్రా
లక్నో: లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా విచారణకు హాజరయ్యాడు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం యూపీ పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఆయన శనివారం ఉదయం యూపీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 3న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటికే అశిష్ మిశ్రాపై హత్య కేసు కూడా నమోదైంది. చదవండి: (నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?) -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్‌మోర్చా లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
యూపీ సర్కార్ తీరును తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. మంత్రి కుమారుడి అరెస్టుకు ఎందుకు వారెంట్ జారీ చేయలేదని జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మృతుల శరీర భాగాల్లో బుల్లెట్ గాయాలు లేవని తేలిందని యూపీ సర్కార్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. అందుకనే ఆశిష్‌ను అరెస్టు చేయలేదని, విచారణకు హాజరు కావాలని నోటీసులు మాత్రమే ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. సాల్వే వ్యాఖ్యలపై స్పందించిన సీజేఐ ఎన్వీ రమణ నిందితులందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుందని అన్నారు. నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. (చదవండి: బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం) ఈక్రమంలో 8 మంది మృతికి కారణమైన లఖింపూర్ కేసును కావాలంటే సీబీఐకి బదిలీ చేయొచ్చని సాల్వే సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చారు. అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. అయితే, సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదన్నారు సీజేఐ ఎన్వీ రమణ. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేశారు. (చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా) -
ఎంతమందిని అరెస్టు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఘటనపై విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. గురువారం జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయవాది త్రిపాఠి వాదనలు వినిపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ ద్వారా ఏం ఉపశమనం కావాలని కోరుకుంటున్నారో చెప్పాలని లాయర్‌ను సీజేఐ ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. జస్టిస్ హిమాకోహ్లి జోక్యం చేసుకొని ఘటనను సరిగ్గా పరిశీలించలేదని, ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ వాదనలు వినిపించారు. ఉదంతంపై ప్రభుత్వం ‘సిట్’ వేసిందని, దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు. రైతు తల్లికి తగిన వైద్య సేవలందించండి ‘అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిస్థితిని నివేదికలో తెలియజేయండి. శుక్రవారం విచారణ జరుపుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘హత్యకు గురైన వారిలో రైతులతోపాటు ఇతరులు ఉన్నారు. ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది? ఎవరిని అరెస్టు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. అంతకుముందు.. సుమోటో కేసుపై విచారణ ప్రారంభిస్తూ జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. వారు కోరుతున్నట్లుగానే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా స్క్రీన్ మీద కనిపించేసరికి ఎవరి తరఫున వాదిస్తున్నారని ప్రశ్నించారు. పౌరుల స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని హన్సారియా బదులిచ్చారు. ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. ఈ హింసాకాండతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బన్బీర్పూర్కు చెందిన లవకుశ్, నిఘాసన్ తహసీల్‌కు చెందిన ఆశిష్ పాండేను అరెస్ట్ చేసి ప్రశి్నస్తున్నట్లు చెప్పారు. హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌పై ఎఫ్ఐఆర్ నమోదవడం తెల్సిందే. ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై న్యాయ విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సభ్యుడిగా జ్యుడీíÙయల్ కమిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు గురువారం ఈ విషయం వెల్లడించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి కేంద్రంగానే ఈ కమిషన్ పని చేస్తుందని, న్యాయ విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. -
వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వరుణ్ గాంధీకి మొండిచేయి చూపింది. 80 సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. వరుణ్ గాంధీ సహా ఆయన తల్లి మేనకా గాంధీకి కూడా కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. సొంత పార్టీకి కంట్లో నలుసులా మారారు. మేనకా గాంధీ.. మధ్యప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ఎంపీగా ఉన్నారు. అందుకే చోటు దక్కలేదా? ఇటీవల కాలంలో మోదీ సర్కారు విధానాలను విమర్శిస్తూ వరుణ్ గట్టిగానే గళం విన్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు చట్టాలు, ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన స్వరాన్ని మరింత పెంచారు. లఖీమ్‌పూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్ట్ చేయాలన్నారు. హింసాకాండకు బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని తాజాగా డిమాండ్ చేశారు. అన్నదాతల రక్తం కళ్లజూసిన వారిని బోనెక్కించాలని ట్విటర్ వేదికగా నినదించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్, మేనకా గాంధీలకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జంబో కార్యవర్గం బీజేపీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు. 80 మంది సాధారణ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు(ఎక్స్‌ఆఫిషియో) సహా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లెజిస్లేటివ్ పార్టీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం, జాతీయ అధికార ప్రతినిధి, నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్, స్టేట్ ఇన్చార్జి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. (చదవండి: లఖీమ్‌పూర్ హింస.. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా) అమిత్ షా, రాజనాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, మాజీ మంత్రులు హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఎంపీలు, సీనియర్ నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గం వివిధ అంశాలపై చర్చిస్తుంది. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలంగా జరగలేదు. -
లఖీమ్‌పూర్ హింస: సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా
న్యూడిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీమ్‌పూర్ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా కమిషన్ వేశామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో శుక్రవారంలోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Lakhimpur Kheri Violence: లఖీమ్‌పూర్ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖీమ్‌పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. చదవండి: ‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’ మరోవైపు లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 45 లక్షల విలువైన చెక్కును అందించింది. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో లేడని చెప్పారు. -
లఖీమ్‌పూర్ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
లక్నో: లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనతో చెలరేగిన రాజకీయ వివాదం ఉత్తర ప్రదేశ్‌ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీ మరణించిన రైతుల కుంటుంబాలను బుధవారం కలుసుకొని ‘పరిహారం ఇవ్వడం కాదు న్యాయం జరగాలి’ అని డిమాండ్ చేశారు. తాజాగా ప్రతిపక్షాల ఒత్తిడి మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లఖీమ్‌పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: హైడ్రామా నడుమ రాహుల్ పరామర్శ దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరొ కొన్ని నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లఖీమ్‌పూర్ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. A single-member Commission of Enquiry with headquarters at Lakhimpur Kheri constituted to investigate the death of 8 persons in Lakhimpur Kheri on October 3. pic.twitter.com/fGcS8JducS — ANI UP (@ANINewsUP) October 7, 2021 కాగా అక్టోబర్ 3న లఖీమ్‌పూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లఖీమ్‌పూర్ హింసను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అలాగే సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా అందులో లేడని చెప్పారు. -
హైడ్రామా నడుమ రాహుల్ పరామర్శ
లక్నో: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీ, తన సోదరి ప్రియాంక గాం«దీతో కలిసి లఖీమ్‌పూర్ ఖేరిలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, సూర్జేవాలేలతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి యూపీ ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ పోలీసులు రాహుల్ సొంత వాహనంలో వెళ్లడానికి అంగీకరించలేదు. పోలీసు వాహనంలో వెళ్లాలని చెప్పారు. దీంతో లక్నో విమానాశ్రయంలో రాహుల్ ధర్నా చేశారు. ‘నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు? నేను నా సొంత వాహనంలో వెళతాను’ అంటూ పోలీసులు, భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా వాహనంలో వెళ్లడానికి అనుమతించేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. రైతుల్ని అణిచివేస్తున్నారు. వారిని దోచేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ ధర్నాతో దిగొచి్చన యూపీ పోలీసులు సొంత వాహనంలో వెళ్లడానికి అనుమతించారు. లక్నో నుంచి సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ప్రియాంక గాంధీని ఆయన కలుసుకున్నారు. మూడు రోజులుగా నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాం«దీని విడుదల చేస్తున్నట్టు అదనపు మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంక కలిసి కాల్పుల్లో మరణించిన లవ్‌ప్రీత్ సింగ్, రమన్కాశ్యప్ కుటుంబాలను పరామర్శించారు. అనతంతరం మరో బాధితుడు నచార్ సింగ్ ఇంటికి బయలుదేరారు. రాహుల్, ప్రియాంక కన్నా ముందు ఆప్ పారీ్టకి చెందిన నేతల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత మిశ్రాలు బాధిత కుటుంబాల పరామర్శకు రానున్నారు. అమిత్‌షాతో అజయ్ మిశ్రా భేటీ రైతు మరణాలకు నైతిక బా«ధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుసుకున్నారు. రైతులపైకి వాహనాన్ని అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నడిపాడని ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాకి మిశ్రా వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేరని చెప్పుకొచ్చారు. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు సీజేఐ నేతృత్వంలో విచారణ ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కేసులిస్టును సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ సభ్యులుగా ఉన్నారు. 8 మంది మరణానికి కారణమైన లఖీమ్‌పూర్ ఖేరీ హింసపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక పథకం ప్రకారం రైతులపై దాడులు దేశంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, నియంతృత్వమే రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం లక్నోకు బయలుదేరే ముందు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లక్నోకి వచ్చినప్పటికీ లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లడానికి తీరిక దొరకలేదని అన్నారు. యూపీలో కొత్త తరహా రాజకీయాలు నెలకొన్నాయని, క్రిమినల్స్ తమ ఇష్టారాజ్యంగా దారుణాలకు తెగబడి యధేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితులకి న్యాయం చెయ్యమని అడిగితే నిర్బంధిస్తున్నారన్నారు. -
లఖీమ్‌పూర్ పర్యటనకు రాహుల్, ప్రియాంకకు అనుమతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేర్ పర్యటనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, మరో ముగ్గురిని అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా లఖీమ్‌పూర్‌లో నిరసన చేస్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మృత్యువాత పడ్డారు. చదవండి: లఖీమ్‌పూర్ ఘటన: రైతులపై కారు దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్ ఈ హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ నుంచి బయలు దేరింది. అయితే నేడు రాహుల్ గాంధీ లఖీమ్‌పూర్ వెళ్లేందుకు పోలీసుల అనుమతి కొరగా తొలుత యోగీ సర్కార్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో యోగీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు. చదవండి: Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’ లఖీంపూర్ హింసలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో సీతాపూర్‌లో అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అనుమతి లభించేదాకా తాను సత్యాగ్రహం కొనసాగిస్తానని ప్రియాంక చెప్పారు. అయితే తాజాగా ఆమెకు కూడా లఖీమ్‌పూర్ వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడంతో ఆమెను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆప్ నిరసన: వాటర్ కెనాన్స్ ప్రయోగించిన పోలీసులు
ఛండిగడ్: ఛండిగడ్ రాజ్ భవన్ ఎదుట ఆప్ నిరసన చేపట్టింది. లఖీమ్‌పూర్ ఖేరీ రైతుల మృతి ఘటనకు ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఆందోళకరంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులపై వాటర్ కెనాన్స్‌ను ప్రయోగించారు. -
లఖింపూర్ పర్యటన: రాహుల్‌గాంధీకి అనుమతి నిరాకరణ
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేర్ పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లఖింపూర్ ఘటనలో ఇప్పటి వరకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. కాగా, ఈరోజు రాహుల్ గాంధీ లఖింపూర్ వెళ్లేందుకు పోలీసుల అనుమతిని కోరారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో యూపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రైతుల హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు. మంగళవారం యూపీ వెళ్లిన ప్రధాని లఖింపూర్‌ను ఎందుకు సందర్శించలేదు అంటూ ప్రశ్నించారు. మేము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. 144 సెక్షన్ అమల్లో ఉందని అడ్డుకుంటున్నారు. అలా అయితే కనీసం ముగ్గురు వెళ్లేందుకయినా అనుమతివ్వాలని రాహుల్ గాంధీ పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం నిరసన చేపడుతున్న రైతుల మీదుగా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: (రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు) -
Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతు మరణాల ఘటనపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపిన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కారు అదుపు తప్పి రైతులపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని అన్నారు. ఘటన తర్వాత కారుపై దాడిచేయడంతో డ్రైవర్ గాయపడ్డాడని తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చదవండి: రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు ఆదివారం బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’
హైదరాబాద్: రైతులను నాశనం చేసినవాళ్లు.. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలో లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికార దాహంతో నలుగురు రైతులను కేంద్రమంత్రి కొడుకు పొట్టన బెట్టుకున్నాడని విమర్శించారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నారని తెలిపారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల పక్షాన దేశమంతా నిలబడాల్సిన తరుణంలో.. యోగి సర్కారు దీనికి భిన్నంగా.. రైతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీపై కర్కశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మోడీ, అమిత్‌షాలు మరణ శాసనం చేస్తే.. అజయ్ మిశ్రా ఆయన కొడుకు అమలు చేశారని మండిపడ్డారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల కుటుంబానికి లక్ష చోప్పున ఆర్థిక సహయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు: కేసీఆర్ -
లఖీమ్‌పూర్ ఘటన: రైతులపై కారు దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో నిరసనలో పాల్గొన్న రైతుల మీదకు ఎస్యూవీ కారు దూసుకెళ్లిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిని అధికార బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం తన ట్విటర్లో షేర్ చేయడం గమనార్హం. ఉద్ధేశ్యపూర్వకంగా రైతులను కారుతో తొక్కించిన వీడియో చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని, కారులో కూర్చున్న వారితోపాటు ఈ ఘటనకు కారకులైన వారందరిని వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. చదfవండి: చీపురుపట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా 25 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ వాహనం పూర్తిగా రైతుల మీ నుంచి దూసుకెళ్లింది. దీంతో కొందరు రైతులు కిందపడిపోగా.. మరికొంత మంది కారు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వెనక మరో వాహనం సైరెన్లతో వెళ్లింది. అయితే కారు అకస్మాత్తుగా వచ్చి తమను ఢీకొట్టినట్లు రైతులు చెబుతున్నారు. చదవండి: Lakhimpur Kheri Violence: కేంద్రమంత్రి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఈ వీడియోను పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే వీడియోలో మంత్రి కొడుకే కారు నడుతుపుతున్నట్లు స్పష్టంగా కనిపించడం లేదు. ఇక ఇదే వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీ ప్రభుత్వం నన్ను నిర్బంధించి 28 గంటలు అవుతోంది. కానీ అన్నదాతల మీద నుంచి కారును తీసుకెళ్లిన వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు’ అంటూ మండిపడ్డారు. చదవండి: లఖీమ్‌పూర్ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు .@narendramodi जी आपकी सरकार ने बग़ैर किसी ऑर्डर और FIR के मुझे पिछले 28 घंटे से हिरासत में रखा है। अन्नदाता को कुचल देने वाला ये व्यक्ति अब तक गिरफ़्तार नहीं हुआ। क्यों? pic.twitter.com/0IF3iv0Ypi — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021 కాగా లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ బన్బీర్‌పూర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా.. వీరి పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రి అజయ్ మిశ్రా వెంట ఆయన కొడుకు ఆశిష్ సైతం కాన్వాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలో భాగంగా టికోనియా ప్రాతంలో నిరసన చేస్తున్న సమయంలో వారి వెనుక నుంచి ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం అక్కడి రైతులు మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. మంత్రి కాన్వాయ్‌లోని కారు బీభత్సం సృష్టించడంతో రైతులు భారీ విధ్వంసానికి దిగారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న రైతులు ఆశిష్ వాహనంతోపాటు మూడు కార్లకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. మంత్రి కాన్వాయ్‌లోని కారు రైతుల మీదకు దూసుకెళ్లడంతో హింస చెలరేగిందని, మంత్రి కుమారుడే వాహనాన్ని నడుపుతున్నాడని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. అయితే తాము ఆ సమయంలో అక్కడలేమని కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు చెప్పారు. ఇక చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 10 లక్షల పరిహారం అందుతుందని తెలిపింది. ఈ హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదైంది. రిటైర్డ్ జడ్జితో ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు. -
లఖీమ్‌పూర్ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు
సీతాపూర్ (యూపీ): వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో జరిగిన రైతు ఆందోళన.. తదనంతరం చెలరేగిన హింస రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోమవారం విపక్ష రాజకీయ నాయకులు, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లఖీమ్‌పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా యూపీ సర్కార్ చర్యలకు దిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖీమ్‌పూర్ ఖేరికి బయల్దేరగా మార్గం మధ్యలో సీతాపూర్ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ పీఏసీ గెస్ట్ హౌస్‌లో ప్రియాంక నిరాహార దీక్షకు దిగారు. తొలుత లక్నోలోనే ఆమెని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ ఆమె ఎలాగోలా రైతుల దగ్గరకు చేరాలని బయల్దేరగా సోమవారం తెల్లవారుజామునే అదుపులోనికి తీసుకున్నారు. తమ కార్లను అడ్డగించి తాళాలు తీసుకొని నిర్భంధించారని ప్రియాంక మీడియాకు చెప్పారు. పోలీసులు తనని అదుపులోనికి తీసుకొని ఉంచిన అతిథి గృహంలో ప్రియాంక చీపురుతో గది ఊడుస్తున్న వీడియోను యూపీ కాంగ్రెస్ నేత వికాస్ శ్రీవాస్తవ విడుదల చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో రైతులే గెలుస్తారని వ్యాఖ్యానించారు. ‘‘ప్రియాంక నాకు తెలుసు నువ్వు వెనుకడుగు వెయ్యవు. ప్రభుత్వం నీ ధైర్యం చూసి భయపడుతోంది’’అని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు లఖీమ్‌పూర్ ఖేరికి పర్యటనకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ , ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్‌లకు యూపీ సర్కార్ అనుమతి నిరాకరించింది. యూపీ, హరియాణా సరిహద్దుల్లో రాంధ్వా, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల విమానాలేవీ లక్నోలో ల్యాండ్ కానివ్వొద్దంటూ యూపీ సర్కార్ లక్నో ఎయిర్‌పోర్టు అథారిటీకి విజ్ఞప్తి చేసింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు. యూపీలో హంతక రాజ్యం: మమత లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో నిరంకుశ పాలన, ఉత్తర ప్రదేశ్‌లో రామరాజ్యం బదులు హంతక రాజ్యం నడుస్తోందన్నారు. ‘‘దేశంలో ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వ పాలన. రైతులను దారుణంగా చంపేస్తున్నారు. నిజాలను బయటకు రాకుండా చేస్తున్నారు. అందుకే లఖిం పూర్‌ఖేరిలో 144వ సెక్షన్ అమలు చేస్తు న్నారు. దేశ ప్రజలే బీజేపీపై 144వ సెక్షన్ విధించే రోజు త్వరలో రానుంది’’అని సీఎం మమతాబెనర్జీ సోమవారం భవానీపూర్‌లో మీడియాతో అన్నారు. -
యూపీ సర్కార్ – రైతుల రాజీ ఫార్ములా
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఖేరిలో ఆదివారం నుంచి నిరసనలు చేస్తున్న రైతు సంఘాలకు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదుగా రెండు ఎస్‌యూవీలు దూసుకుపోవడం, ప్రతిగా రైతులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగిన ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.45 లక్షల చొప్పున భారీ నష్ట పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. గాయపడిన రైతులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీశ్ అవస్తి వెల్లడించారు. దీంతో రైతులు కూడా వెనక్కి తగ్గారు. నిరసన విరమించి మరణించిన రైతన్నలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ హింసాకాండపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయూ) నేత రాకేశ్ తికాయత్ సమక్షంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. లఖీమ్‌పూర్‌ఖేరి హింసతో సంబంధమున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాసింది. మంత్రి కుమారుడిపై హత్య కేసు లఖీమ్‌పూర్ హింసాకాండపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కాన్వాయ్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసాకాండలో బీజేపీ కార్యకర్తలు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ ఒక వాహనాన్ని నడుపుతున్నాడని రైతులు ఆరోపిస్తూండటంతో... అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిరసనలు చేపట్టాయి. రెండు నిమిషాలు చాలు కేంద్ర మంత్రి పాత వీడియో హల్చల్ మంత్రి అజయ్ కుమార్‌దిగా భావిస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన రైతులపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ‘మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి నాకు రెండు నిమిషాలు చాలు’ అని ఆయన అంటున్నట్టుగా వీడియోలో ఉంది. ‘‘నాతో తలపడండి. కేవలం 2 నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా. నేను మంత్రినో, ఎంపీనో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు. అంతకు ముందు నుంచి ప్రజలకు నేనెవరో తెలుసు. సవాళ్ల నుంచి నేను పారిపోను’’అని చెబుతున్నట్టుగా ఉంది. -
రక్తసిక్త రైతు రాజకీయం
ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయిన నిరసనను కాదంటే ఎలా? నిరసన చెబుతుంటే, వాళ్ళు శత్రువులే అన్న ఆలోచనా ధోరణితో ఉంటే ఎట్లా? ఎక్కి వచ్చిన మెట్లు మర్చిపోయి, అధికార పీఠంపై ఉన్నాం కాబట్టి ఎవరినైనా తొక్కేస్తాం, బండ్లతో తొక్కించేస్తామంటే కుదురుతుందా? ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని లఖింపూర్ ఖేడీ జిల్లా తికునియా గ్రామం వద్ద పర్యటనకు వచ్చిన అధికార పక్ష బీజేపీ ఉపముఖ్యమంత్రికి నిరసన వ్యక్తం చేస్తున్న రైతు ఆందోళనకారులపైకి ఆదివారం వేగంగా వాహ నాలు ఎక్కించిన ఘటన దుస్సహం. అధికారం తెచ్చిన అహంకారానికి నిలువుటద్దం. ఆ ఘటనలో నలుగురు రైతులు, అనంతరం కోపోద్రిక్త ఆందోళనకారుల హింసలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు సహా ఇప్పటికి 9 మంది ప్రాణాలు పోగొట్టుకున్న వైనం అత్యంత విషాదం. ఇరువర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సర్కారు శాంతి వచనాలు పలికి, లక్షల్లో నష్టపరిహారం, న్యాయవిచారణలకు ఆదేశించింది. కానీ, పోయిన అమా యక ప్రాణాలకు బాధ్యులెవరన్నది జవాబు లేని ప్రశ్న. నాణానికి రెండు వైపులున్నాయి. మరికొద్ది నెలల్లో యూపీ ఎన్నికలున్నాయనగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రతిపక్షాలకు అనుకోకుండా అందివచ్చిన ఆయుధమైంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సహజంగానే ప్రయత్నిస్తుంటే, రక్తసిక్త ఘటనలపై రాజకీయం చేస్తున్నారంటూ అధికార పక్షం అంటోంది. ఆందోళనకారులపై బండి పోనిచ్చినవారికి సారథ్యం వహించినట్టూ, మూడు కార్లలో ఒకటి స్వయంగా నడిపినట్టూ ఆరోపణల్ని ఎదుర్కొంటున్నది మామూలు వ్యక్తి కాదు. సాక్షాత్తూ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి గారి పుత్రరత్నం. ఆ మధ్య మోదీ మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కించుకున్న సదరు మంత్రివర్యులు అజయ్ మిశ్రా తేని మాత్రం ‘ఆ సమ యంలో మా వాడు (ఆశిష్ మిశ్రా) అసలు సంఘటనా స్థలంలోనే లేడు’ అంటున్నారు. అవసరమైతే ఫోటో, వీడియో సాక్ష్యాలు చూపిస్తానంటున్నారు. అంతటితో ఆగక, ఇందులో ఏకంగా ‘ఖలిస్తాన్ హస్తం’ ఉందని అంతర్జాతీయస్థాయి ఆరోపణలు చేస్తుండడం విచిత్రం. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షీయులు నిరసన గళం విప్పడం, ఏ ఘటన జరిగినా అక్కడ కెళ్ళి బాధితుల పక్షాన నిలబడి, నైతిక మద్దతు ఇవ్వడం సాధారణం. కానీ, లఖింపూర్‌లో ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వడానికి యోగి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాంగ్రెస్ యూపీ ఇన్ఛార్జ్ ప్రియాంకా గాంధీ వద్రా, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఆ ఊరికి వెళ్ళకుండా అడ్డుకున్నదీ, నిర్బంధించినదీ అందుకే! పొరుగున ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి రావాలనుకున్నవారి సంగతి వేరుగా చెప్పనక్కర లేదు. ఈ రాజకీయాల మాట అటుంచితే, ‘దెబ్బకు దెబ్బ కొట్టి, రైతు ఉద్యమకారులకు గుణపాఠం చెప్పా’లంటూ అధికారంలో ఉన్నవారు అంటున్న మాటలు, అనుసరిస్తున్న వైఖరి మరింత ఆందోళనకరం. లఖింపూర్ ఘటన జరిగిన ఆదివారమే హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ‘రైతులను లాఠీలతో కొట్టండి. జైలు పాలైతే, మేం చూసుకుంటాం’ అని తమ శ్రేణులతో అన్నారంటే ఇంకేం చెప్పాలి! కొద్దిరోజుల క్రితం అజయ్ మిశ్రా సైతం ఓ సభలో ఇలాంటి మాటలే అన్నారు. చివరకు లఖింపూర్‌లో అదే జరిగింది. వ్యవసాయాధారిత భారతదేశంలో 2020 సెప్టెంబర్‌లో చేసిన మూడు వివాదాస్పద కొత్త సాగు చట్టాలు తమకు ఉరితాళ్ళని రైతుల వాదన. దీని మీద ఇప్పటికి దాదాపు ఏడాదిగా వారు ఘోషిస్తూనే ఉన్నారు. ఢిల్లీ శివారుల్లో శిబిరాల్లో ఉంటూ, నిరసిస్తూనే ఉన్నారు. కానీ, వారి గోడు కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పట్టించుకుందన్నది సందేహమే. తాజా లఖింపూర్ ఘటనలో నిందితులపై చర్యలు లేవు. కొడుకు మీద ఇంత గోలవుతూ, రాజీనామా డిమాండ్లు వస్తుంటే మంత్రి గారు కుర్చీ వదలకుండా కూర్చున్నారు. బాధితులకు బాసటగా నిలిచే నేతలను మాత్రం సర్కార్ నిర్బంధిస్తోంది. ‘ఇదెక్కడి న్యాయం’ అన్నది ప్రియాంక ప్రశ్న. రానున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఆమె ముందుకొచ్చే అవకాశాలు ఈ ఘటనతో మరింత పెరగడం దీని రాజకీయ పర్యవసానం. మరోపక్క కొత్త సాగు చట్టాల అమలుపై జనవరిలోనే స్టే విధించాం కనుక, రైతులు ఇప్పటికీ నిరసన చేయడం ఏమిటన్నది సుప్రీమ్ కోర్టు ప్రశ్న. నిరసన తెలిపే హక్కు సర్వతంత్ర స్వతంత్రమేమీ కాదనీ, కోర్టుకెక్కాక వీధికెక్కి నిరసనలేమిటనీ అంటోంది. ఢిల్లీ శివార్లలో నిరసన చేస్తున్న రైతులు రోడ్లను దిగ్బంధిస్తున్నారనే అభియోగంపై కోర్టు ఇలా అభిప్రాయపడింది. 43 రైతు సంఘాల నేతలకు నోటీసులిచ్చింది. కానీ, అనేక అంశాలపై జోక్యం చేసుకొని, ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తున్న న్యాయవ్యవస్థ ఎందుకనో ఏడాదిగా సాగుతున్న రైతు ఉద్యమంపై ఆ పంథాలో వ్యవహ రిస్తున్నట్టు లేదు. కోరినట్టు నిపుణుల సంఘం మార్చిలోనే నివేదిక ఇచ్చినా, అతీగతీ లేదు. కేంద్రం సైతం రైతు సమస్యల పరిష్కారంలో మధ్యేమార్గంపై శ్రద్ధ పెట్టడం లేదు. అవాంఛనీయ ఘటనలప్పుడు మాత్రం ‘మేము చేస్తే వ్యాపారం, మీరు చేస్తే మరేదో’ అన్నట్టు అధికార, విపక్షాల పరస్పర మాటల యుద్ధాలున్నాయి. నిజానికి, తాజా ఘటనపై సర్కారు వారి న్యాయవిచారణలో సంచలనాలేవో బయటపడతాయన్న భ్రమ ఎవరికీ లేదు. ఎన్నికల వేళ రక్తసిక్త శవరాజకీయాలు ఆగే సూచనా కనిపించట్లేదు. కానీ, ఒకటే ప్రశ్న. అత్యున్నత న్యాయస్థానమే అన్నట్టు్ట, లఖింపూర్ లాంటి ఘటనలకు ఎవరిది బాధ్యత? ఆవిరైపోయిన అమాయక ప్రాణాలకు ఎవరు జవాబుదారీ? -
లఖీంపూర్ ఘటన పూర్తి బాధ్యత యోగి సర్కారుదే : అసదుద్దీన్ ఒవైసీ
లక్నో: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తెచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన విపక్షనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి బాధ్యత యోగి సర్కారుదే అన్నారు. లఖీంపూర్ వెళ్లకుండా విపక్షాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. యూపీ పోలీసుల దర్యాప్తుతో న్యాయం జరగదని అన్నారు. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని అసుదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది. చంఢీగఢ్లోని రాజ్‌భవన్ వద్ద యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఈ నిరసనలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. దీంతో చంఢీగఢ్ పోలీసులు సిద్ధూను కూడా అరెస్ట్ చేశారు. అదే విధంగా, ఉత్తరప్రదేశ్ భవన్‌వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం యూపీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లఖీంపూర్‌ఖేరీ పరిధిలో రాజకీయ నేతల ప్రవేశంపై నిషేదాజ్ఞలు విధించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన రైతుల సంఖ్య 9 కి చేరింది. ప్రస్తుతం యూపీలో పోలీసులు 144 సెక్షన్ విధించి, ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆందోళన చేపట్టిన విపక్షనేతలు ప్రియాంకగాంధీ, అఖిలేష్ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం’ -
Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం’
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఆదివారం లఖీమ్‌పూర్ ఖేరీలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.45లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో రైతు ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. కేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతి చెందారు. సోమవారం లఖీమ్‌పూర్ ఖేరీలో ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు మృతి చెందారు. -
చీపురుపట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా
లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఉద్యమం మరోసారి హింసాత్మకంగా మారింది. లఖింపూర్ ఖేరీ నిరసనల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీతాపూర్‌లో సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గెస్ట్‌హౌస్‌లోని గదిని స్వయంగా ప్రియాంక గాంధీ చీపురుతో శుభ్రం చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచారు. ప్రియాంకతోపాటు, పార్టీ శాసనసభ్యుడు దీపేంద్ర సింగ్ హుడా తదితరులనుకూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక గాంధీని సీతాపూర్-లఖింపూర్ సరిహద్దులోని హర్గావ్ సమీపంలో ఒక గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక గాంధీని కస్టడీలో ఉంచారని కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం నేత ట్వీట్ చేశారు. దీంతోపాటు గెస్ట్‌హౌస్‌లోని గది ఫ్లోర్‌ని తుడుచుకుంటున్న వీడియోను ట్వీట్ చేశారు. పోలీసుల నిర్బంధంలోనే తమ నేత ప్రియాంక నిరాహార దీక్ష ప్రారంభించారని, బాధితుల కుటుంబాలు, రైతులను కలవకుండా తిరిగి వెళ్లేది లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీ బాధితులను కలవడానికి తమను అనుమతించలేదని ఆరోపించిన కాంగ్రెస్ న్యాయం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామని ప్రకటించింది. మరోవైపు లఖింపూర్ ఖేరీ వెళ్తానని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించడంతో ఆయన నివాసం ముందు భారీఎత్తున పోలీసులను మోహరించారు. ఆ తరువాత అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమాజ్ వాది పార్టీ మద్దతుదారులు పోలీసు జీప్‌కు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలు దేరిన పలువురు ప్రతిపక్ష నేతలను సోమవారం యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. दीदी प्रियंका जी ने अस्थायी जेल सीतापुर में सत्याग्रह शुरू किया। किसानों से मिले बगैर पीछे नहीं हटेंगे। न्याय के लिए अंतिम सांस तक लड़ेंगे। #लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/O6KnN3kvuD — Ajay Kumar Lallu (@AjayLalluINC) October 4, 2021