లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేర్ పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లఖింపూర్ ఘటనలో ఇప్పటి వరకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. కాగా, ఈరోజు రాహుల్ గాంధీ లఖింపూర్ వెళ్లేందుకు పోలీసుల అనుమతిని కోరారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో యూపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రైతుల హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు.
మంగళవారం యూపీ వెళ్లిన ప్రధాని లఖింపూర్‌ను ఎందుకు సందర్శించలేదు అంటూ ప్రశ్నించారు. మేము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. 144 సెక్షన్ అమల్లో ఉందని అడ్డుకుంటున్నారు. అలా అయితే కనీసం ముగ్గురు వెళ్లేందుకయినా అనుమతివ్వాలని రాహుల్ గాంధీ పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం నిరసన చేపడుతున్న రైతుల మీదుగా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment