
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేర్ పర్యటనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, మరో ముగ్గురిని అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా లఖీమ్‌పూర్‌లో నిరసన చేస్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మృత్యువాత పడ్డారు.
చదవండి: లఖీమ్‌పూర్ ఘటన: రైతులపై కారు దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్
ఈ హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ నుంచి బయలు దేరింది. అయితే నేడు రాహుల్ గాంధీ లఖీమ్‌పూర్ వెళ్లేందుకు పోలీసుల అనుమతి కొరగా తొలుత యోగీ సర్కార్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో యోగీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు.
చదవండి: Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’
లఖీంపూర్ హింసలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో సీతాపూర్‌లో అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అనుమతి లభించేదాకా తాను సత్యాగ్రహం కొనసాగిస్తానని ప్రియాంక చెప్పారు. అయితే తాజాగా ఆమెకు కూడా లఖీమ్‌పూర్ వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడంతో ఆమెను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment