
లఖీంపూర్‌ఖేరీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఓటేస్తామని లఖీంపూర్ ఖేరీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్‌పీలు తమను మోసం చేశాయని, ఇతర పార్టీలు నిష్ఫలమైనవని రైతులు వాపోయారు. రైతు చట్టాలు తదుపరి హింసకు బీజేపీ కారణమని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగని తమకు గతంలో రుణమాఫీ చేసిన సమాజ్‌వాదీని కూడా ఆదరించాలనుకోవడం లేదు. తమ ఫిర్యాదుల పరిష్కారానికి ఏ పార్టీ నిజాయితీగా యత్నించలేదని, అందువల్ల నోటాకు ఓటేస్తామని పలువురు రైతులు మీడియాకు తెలిపారు.
ఎస్‌పీ హయాంలో బీజేపీ పాలనలో కన్నా దారుణంగా రైతుల పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎస్‌పీ కూటమి, బీజేపీ ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ తమకు రావాల్సిన పంచదార మిల్లుల బకాయిలు అం దలేదని బాధను వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీలు సానుభూతి మాటలు చెప్పడం మినహా ఏమీ చేయలేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment