
లక్నో: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ కూటమి చివరి వరకు రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా, తాను, ఆర్ఎల్డీకి చెందిన నేత జయంత్ చౌదరి రైతుల మానస కుమారులుగా అఖిలేష్ అభివర్ణించుకున్నారు.
‘నేను ఎప్పుడూ నా జేబులో ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను.. లాల్ టోపి, లాల్ పొట్లీని’ ఉంచుకుంటానని తెలిపారు. బీజేపీని ఓడించడమే నా సంకల్పమని అఖిలేష్ తెలిపారు. 2017 నుంచి ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హమీని కాషాయపార్టీ నెరవేర్చలేదని అఖిలేష్ విమర్శించారు. అదే విధంగా జయంత్ చౌదరి కూడా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. జయంత్ షాను బీజేపీలో చేరాలని అమిత్ షా ఆహ్వనించారు.
దీనిపై జయంత్ స్పందించారు. తాను నాణెంలా ఎగిరేవ్యక్తి కాదని తెలిపారు. పశ్చిమ యూపీలో జాట్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు షా.. ఆర్ఎల్డీ చీఫ్‌ను పార్టీలోని ఆహ్వనించినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే విధంగా.. జాట్ నాయకులతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని జయంత్ తెలిపారు.
ఈ సమావేశంలో యూపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ సహా పార్టీ ప్రముఖ జాట్ నేతలు హజరయ్యారు. పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీ అధికారంలో ఉన్న అన్ని స్థానాల్లో జాట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాగా, మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి ప్రస్తుతం ఆర్ఎల్డీకి నేతృత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ ఎస్పీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుంది.
చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’
Comments
Please login to add a commentAdd a comment