Akhilesh Yadav
-
‘మహా కుంభమేళాను పొడిగించండి’
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్‌రాజ్ ఘాట్ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు కూడా. మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) రూట్లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్‌రాజ్ సంగమ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.ఇదీ చదవండి: స్టార్ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా? -
‘కుంభమేళా’ మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారు
న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది చనిపోయారని, వారి సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మృతుల సంఖ్యపై ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆయన మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. కుంభమేళాను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. అక్కడ జరిగిన వైఫల్యాల సంగతి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిజిటల్ కుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మృతుల సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదని మండిపడ్డారు.‘బడ్జెట్ సంఖ్యల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కుంభమేళా తొక్కిసలాట మృతుల లెక్కలు చెప్పండి’ అని అఖిలేశ్ యాదవ్ నిలదీశారు. ఒకవైపు మృతదేహాలు మార్చురీలో ఉంటే, మరోవైపు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారని, ఇదెక్కడి సనాతన సంప్రదాయమని ధ్వజమెత్తారు. జేసీబీలతో మృతదేహాలను నదిలోకి నెట్టేశారని ఆరోపించారు. కుంభమేళాలో ఎంతోమంది భక్తులు చనిపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కనీసం విచారం వ్యక్తం చేయలేదని విమర్శించారు. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లు చూసే బాధ్యతను సైన్యానికి అప్పగించాలని సూచించారు. -
సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సింగ్ రావు
హైదరాబాద్: సమాజ్ వాది పార్టీ ఎస్సీ ఎస్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మదిరె నర్సింగ్ రావు నియమితులయ్యారు. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్ వాది పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి వ్యాస్ జి గోండ్ చేతుల మీదుగా మదిరె నర్సింగ్ రావు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగరానికి చెందిన సామాజికవేత్త, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత దండు బోయిన నిత్య కళ్యాణ యాదవ్‌తో కలిసి నర్సింగ్ రావు సోమవారం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ పట్ల యువతను, మహిళలను రైతులను ఆకర్షించే విధంగా కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు సమాజ్‌వాది పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని తనకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు రాహుల్ నిగమ్ వసి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ రావాలి: అఖిలేశ్
లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి. భారత్‌లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్‌కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్‌లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్‌కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు. -
‘సంభాల్’లోకి ప్రవేశం నిరాకరణ.. అఖిలేష్ యాదవ్ విమర్శలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 10 వరకు బయట వ్యక్తులు సంభాల్ జిల్లాను సందర్శించకుండా నిషేధం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ‘డిసెంబర్ 10 వరకు ఎలాంటి బయట వ్యక్తులు, ఏ సామాజిక సంస్థ, ప్రజా ప్రతినిధి అయినా అధికార యంత్రాంగం అనుమతి లేకుండా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించకూడదు’ అని కలెక్టర్ రాజేద్ర పెన్సియా పేర్కొన్నారు.కాగా షాహి జామా మసీదులో ఇటీవల జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు అసెంబ్లీ ప్రతిపక్షనేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో .15 సభ్యుల బృందం ఏర్పాటైంది. ఈ క్రమంలో శనివారం హింసాత్మక జిల్లాకు వెళుతున్న 15 మంది సభ్యుల సమాజ్‌వాదీ పార్టీ నాయకుల ప్రతినిధి బృందాన్ని అదుపులోకి తీసుకుంది. దీనిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిపాలనా పూర్తిగా వైఫల్యం చెందిందని, బీజేపీ తన నిర్లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లాలో నిషేధం విధించడం బీజీపీ పాలన, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం. ఇదే ప్రభుత్వం ముందే నిషేధం విధిస్తే సంభాల్‌లో శాంతి వాతావరణం దెబ్బతినేది కాదని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంభాల్‌లోని మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.प्रतिबंध लगाना भाजपा सरकार के शासन, प्रशासन और सरकारी प्रबंधन की नाकामी है। ऐसा प्रतिबंध अगर सरकार उन पर पहले ही लगा देती, जिन्होंने दंगा-फ़साद करवाने का सपना देखा और उन्मादी नारे लगवाए तो संभल में सौहार्द-शांति का वातावरण नहीं बिगड़ता। भाजपा जैसे पूरी की पूरी कैबिनेट एक साथ… pic.twitter.com/7ouboVnQu4— Akhilesh Yadav (@yadavakhilesh) November 30, 2024ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదులో కోర్టు సర్వే చేయాలని ఆదేశించడంతో నవంబర 24న హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు భద్రతా బలగాలతో ఘర్షణ పడ్డారు. దీంతో రాళ్లదాడికి దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం.. సంభల్ జిల్లాలో శాంతి, సామరస్యాలు నెలకొనడం కీలకమని పేర్కొంది. జామా మసీదు వివాదంపై తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ట్రయల్ కోర్టు సర్వే ఉత్తర్వులను తొలుత సుప్రీంకోర్టులో సవాల చేయకుండా హైకోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీకి ధర్మాసనం సూచించింది. -
UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు (శనివారం) వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారుయూపీలోని మీరాపూర్, కుందర్కి, సీసామవు, కటేహరి, ఫుల్పూర్, మజ్వాన్, ఘజియాబాద్, కర్హల్, ఖైర్ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని రాజకీయ ప్రత్యర్థుల మధ్య నెలకొన్న ఈ పోటీని 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. उप्र के विधानसभा उपचुनाव में चुनाव आयोग व इंडिया गठबंधन-सपा के सभी 9 सीटों के उम्मीदवारों से ये अपील है कि कल सुबह ये सुनिश्चित करें कि नियमानुसार पोस्टल बैलेट पहले गिने जाएं और फिर ईवीएम मशीनों के वोटों की मतगणना हो। सभी पूरी तरह मुस्तैद रहें और किसी भी तरह की गड़बड़ी होने या…— Akhilesh Yadav (@yadavakhilesh) November 22, 2024ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఒక ట్వీట్లో.. ఎన్నికల కమిషన్‌కు, ఇండియా అలయన్స్-ఎస్పీకి చెందిన తొమ్మిదిమంది అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. శనివారం ఉదయం జరిగే పోస్టల్ బ్యాలెట్లను నిబంధనల ప్రకారం మొదట లెక్కించేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఎన్నికల కమిషన్‌కు, పార్టీకి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకునేవరకూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్పూర్, ఘజియాబాద్, మజ్వాన్, ఖైర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సీసామవు, కటేహరి, కర్హల్, కుందర్కిలో ఎస్పీ విజయం సాధించింది. అప్పుడు ఎస్పీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), మీరాపూర్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగమైంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఎస్పీకి మద్దతు పలికింది. -
UP By-election: క్రిమినల్ కేసులో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయి.. ఉపఎన్నిక జరిగిన చోట..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్‌లోని సీసామవు అసెంబ్లీ స్థానంపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.కాన్పూర్‌లోని సీసామవు స్థానం అఖిలేష్ యాదవ్‌కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి. ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ నేటి (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు.‘ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వెలువడతాయి. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. ఇది ఓటు హక్కు సద్వినియోగానికి ఉదాహరణ. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదు. తమ కార్యకర్తలు అన్ని బూత్‌లను గమనిస్తున్నారు. అన్ని చోట్లా వీడియోగ్రఫీ జరుగుతున్నదని అఖిలేష్ అన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక’ అని పేర్కొన్నారు. वोट की प्रक्रिया को लेकर जो प्रयास ‘रात-दिन’ किया जा रहा है, उससे ये स्पष्ट हो गया है कि अब तो मतदाता दुगुने उत्साह से वोट डालनें जाएंगे। परिणाम तभी निकलते हैं जब एक भी वोट न तो बँटता है, न घटता है। उप्र के जागरूक और साहसी मतदाता अपने वोट करने के उस अधिकार के लिए शत-प्रतिशत घर… pic.twitter.com/muqlzJ7Zsu— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024యూపీలోని మిరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ , కర్హల్, సిసామావు, ఫుల్పూర్, కతేహరి, మజ్వాన్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నదని ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 1917 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉప ఎన్నికల్లో 18.46 లక్షల మంది పురుషులు, 15.88 లక్షల మందికి పైగా మహిళలు ఓటు వేయనున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో యోగి(సమాజ్‌వాదీ), అఖిలేష్(బీజేపీ) మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. యూపీలో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు.ఉప ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ రెండూ తమ సత్తామేరకు ప్రచారపర్వాన్ని నిర్వహించాయి. ఈ స్థానాల్లో జరుగుతున్న ఉపఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు యూపీ అధికార సింహాసనానికి మార్గాన్ని నిర్ణయించేవిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు యోగి ఆదిత్యనాథ్ ఇటు అఖిలేష్ యాదవ్‌లలో తదుపరి సీఎం ఎవరు అనే దానిపై ఈ ఎన్నికలు అంచనాలను వెలువరించనున్నాయి. అందుకే ఈ ఎన్నికలు యూపీకి అగ్నిపరీక్షగా నిలిచాయని పలువురు అభివర్ణిస్తున్నారు.అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కంటే అధికంగా సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో 90 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో బీజేపీ-ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అయితే ప్రత్యక్ష పోటీ మాత్రం బీజేపీ, ఎస్పీ మధ్యే ఉండనుందనే అంచనాలున్నాయి.ఈ తొమ్మిది స్థానాల్లో 2022లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే సమాజ్ వాదీ పార్టీకి నాలుగు సీట్లు, ఎన్డీఏకు ఐదు సీట్లు, బీజేపీకి మూడు సీట్లు, మిత్రపక్షాలకు రెండు సీట్లు దక్కాయి. టిక్కెట్ల పంపిణీలో అఖిలేష్ ముస్లిం కార్డును ఉపయోగించుకోగా, బీజేపీ ఓబీసీలను రంగంలోకి దింపింది. బీజేపీ గరిష్టంగా ఐదుగురు ఓబీసీ అభ్యర్థులను నిలబెట్టగా, వీరిలో ఒకరు దళితుడు, ముగ్గురు అగ్రవర్ణాలకు చెందినవారు ఉన్నారు. ముస్లింలకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ అత్యధికంగా నలుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. అలాగే ముగ్గురు ఓబీసీ అభ్యర్థులు, ఇదరు దళిత అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. అగ్రవర్ణాలకు ఒక్క టిక్కెట్టు కూడా కేటాయించలేదు. ఈసారి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో, ఎవరిని ఓడిస్తారో వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు -
‘చరిత్రకెక్కిన మటన్ వార్’.. బీజేపీ ఎంపీ విందుపై అఖిలేష్ చురకలు
లక్నో: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఇచ్చిన విందులో జరిగిన ‘మటన్ వార్’ చరిత్రకెక్కిందని విమర్శలు గుప్పించారు. ‘మీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రాచుర్యం పొందాయి. కానీ మటన్ వార్ కూడా జరిగిందని నాకు తెలియనే లేదు. నేను ఎన్నో యుద్ధాలను చూశాను.. ఈ మటన్ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ వ్యంగ్యస్థ్రాలు సంధించారు.అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్లో బదోహి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఈ నెల 14వ ఆయన కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది హాజరయ్యారు. అయితే వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి.. ఎంపీ డ్రైవర్ సోదరుడు మటన్ కర్రీ వేశాడు. కానీ అందులో ముక్కలు లేక కేవలం గ్రేవీ మాత్రమే ఉండటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ ఎంపీ డ్రైవర్ సోదరుడిని దూషించాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మిగితా వారు కూడా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పలువురు బీజేపీ సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణించింది. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే ఉమాశంకర్ బింద్ ఈ ఘటనపై స్పందిస్తూ. విందులో చివర్లో మద్యం చేసించిన వారు రావడం వల్ల గొడవ జరిగినట్లు తెలిపారు.మరోవైపు మీర్జాపూర్ జిల్లాలోని మజ్వాన్ నియోజకవర్గంలో నిషాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినోద్ కుమార్ బింద్, బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సుచిస్మిత మౌర్యపై, భదోహి ఎంపీ రమేశ్ బింద్ కుమార్తె జ్యోతి బింద్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బరిలోకి దింపింది -
అఖిలేశ్ యాదవ్‌ను యూపీ సర్కారు ఎందుకు అడ్డుకుంది?
UP Politics: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ)కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను అడ్డుకోవడంతో యూపీ రాజధాని లక్నోలో తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా శుక్రవారం జేపీఎన్ఐసీకి వెళ్లాలని అఖిలేశ్ యాదవ్ భావించారు. జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించాలని ఆయన అనుకున్నారు. అయితే అఖిలేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.అఖిలేశ్‌ను అడ్డుకునేందుకు జేపీఎన్‌ఐసీని మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడ్డంగా బారికేడ్లు పెట్టి, భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. రేకులతో మెయిన్ గేటును క్లోజ్ చేశారు. విక్రమాదిత్య మార్గ్‌లోని అఖిలేశ్ యాదవ్ నివాసం సమీపంలోనూ పోలీసు బలగాలను భారీగా మొహరించారు. గతేడాది కూడా జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అఖిలేశ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన జేపీఎన్ఐసీ గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే?అఖిలేశ్‌కు అనుమతి నిరాకరించడానికి అధికారులు చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అనుమతి లేదంటూ లక్నో డెవలప్మెంట్ అథారిటీ(ఎల్డీఏ) గురువారం అఖిలేశ్‌కు రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జేపీఎన్ఐసీ ప్రమాదకర ప్రదేశంగా ఎల్డీఏ పేర్కొంది. నిర్మాణపనులు జరుగుతున్నందున ఆ ప్రాంతమంతా నిర్మాణ సామాగ్రితో గందరగోళంగా ఉందని వెల్లడించింది. వర్షాల కారణంగా పురుగూపుట్రా నుంచి ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ కలిగిన అఖిలేశ్ యాదవ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో జేపీఎన్ఐసీకి వెళ్లడం సురక్షితం కాదని సూచించింది.సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళనఎల్డీఏ లేఖపై సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అఖిలేశ్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేయింస్తోందని ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జేపీఎన్ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాగా, జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో యోగీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వలసవాద వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు.చదవండి: సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన.. లక్నోలో ఉద్రిక్తతఅఖిలేశ్పై బీజేపీ ఎదురుదాడిజేపీఎన్ఐసీ అంశాన్ని కావాలనే అఖిలేశ్ యాదవ్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేసింది. జయప్రకాశ్ నారాయణ్ ఆదర్శాలను సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడో వదలేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భండారీ ఆరోపించారు. జేపీఎన్ఐసీలో నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడికి ఎవరినీ అధికారులు అనుమతించడం లేదన్నారు. నిజంగా జయప్రకాశ్ నారాయణ్‌పై అంత గౌరవం ఉంటే తన కార్యాలయంలోనే అఖిలేశ్ నివాళి అర్పించాలని సూచించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు పొలిటికల్ స్టంట్‌కు దిగుతున్నాయని భండారీ ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేశ్
ఇటావా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకుగాను ఆరింటికి ఏకపక్షంగా టికెట్లు ఖరారు చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ పరిణామంపై గురువారం స్పందించారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా కూటమి ఉంటుంది. కాంగ్రెస్‌తో మా మైత్రి కూడా కొనసాగుతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నా’అని తెలిపారు. రాజకీయాలపై చర్చించేందుకు సమయం కాదంటూ సీట్ల ప్రకటన వ్యవహారాన్ని దాటవేశారు. హరియాణా, కశ్‌మ్రీŠ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల విషయం ప్రస్తావించగా మరోసారి మాట్లాడతానన్నారు. యూపీలో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకు గాను కాంగ్రెస్ ఐదింటిని డిమాండ్ చేస్తోంది. ఈ పది చోట్ల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో గెలవడంతో ఖాళీ అయ్యాయి. -
కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ షాక్.. ఆ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌కి ‘నో’
హర్యానా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హస్తం పార్టీ ఓటమిపై ప్రతిపక్ష బీజేపీతోపాటు మిత్రపక్షాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అతి విశ్వాసం, అహంకారమే ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణమని మండిపడితున్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీ చేయలేదని, కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, లేక ఆప్‌తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. ఈ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ.. ఆ ప్రపోజల్‌ను ఎస్పీ తిరస్కరించింది.తాజాగా ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కర్హల్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము నుంచి నసీమ్ సోలంకి, ఫుల్పూర్ (ప్రయాగ్‌రాజ్) నుంచి ముస్తఫా సిద్దిఖీ, మిల్కిపూర్ (అయోధ్య) నుంచి అజిత్ ప్రసాద్‌కు, కతేహరి నుంచి శోభావాయ్ వర్మ, మజ్వాన్ స్థానం నుంచి జ్యోతి బింద్‌లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే వీటి పోలింగ్‌కు ఇంకా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించలేదు -
‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై అఖిలేశ్‌కు సీఎం యోగి కౌంటర్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్ పేరుతో అఖిలేశ్ యాదవ్ బెదిరింపులను బుధవారం యోగి తోసిపుచ్చారు. బుల్డోజర్ను నడపడానికి ధైర్యం, తెలివి దృఢ సంకల్పం అవసరమని అన్నారు. ఎవరుపడితే వాళ్లు నడపలేరని, ముఖ్యంగా బుల్డోజర్ నడిపే శక్తి అఖిలేశ్ యాదవ్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సీఎం యోగి మాట్లాడారు. ‘‘బుల్డోజర్ను నడపడానికి అందరికీ చేతులు సరిపోవు. వాటిని నడపాలంటే.. హృదయం, మనస్సు రెండూ అవసరం. బుల్డోజర్ లాంటి సామర్థ్యం, దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలరు. అల్లరిమూకల ముందు మాట్లాడేవారు కనీసం బుల్డోజర్ ముందు నిలబడలేరు’’ అని అన్నారు. ఇప్పటిదాకా ‘టిపు’గా ఉన్న అఖిలేశ్ యాదవ్ కొత్తగా సుల్తాన్‌లా మారడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక.. ‘టిపు’ అనేది అఖిలేశ్ యాదవ్ నిక్ నేమ్‌గా తెలుస్తోంది.#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath speaks at the distribution of jobs appointment letters, he says, "...Not everyone's hands can fit on a bulldozer...Iske liye dil aur dimaag dodo chahiye. Bulldozer jaise shamta aur pratigya jismein ho wahi bulldozer chala sakta… pic.twitter.com/VpbzY8BQV9— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2024ఇదిలా ఉండగా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. తాము 2027లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బుల్డోజర్లను సీఎం యోగి సొంత నియోజకర్గమైన గోరఖ్‌పూర్‌కు పంపిస్తామని అన్నారు. -
అఖిలేష్ ర్యాలీలో గందరగోళం.. పత్తాలేని పోలీసులు
కన్నౌజ్ : యూపీలోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయనకు భద్రతను కల్పిచడంలో లోపం కనిపించింది.అఖిలేష్ ఛిబ్రామౌ చేరుకోగానే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ సమయంలో పోలీసులు పత్తాలేకుండా పోయారు. ఇంతలో అఖిలేష్ ఓ ఇంటికి వెళుతుండగా అక్కడున్నవారు కూడా బలవంతంగా ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఎస్పీ చీఫ్ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అతికష్టం మీద అదుపు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో ఎస్పీ కార్యకర్తలు పోట్లాడుకోవడం కనిపిస్తుంది. -
అమిత్ షా Vs అఖిలేష్.. స్పీకర్ చైర్‌పై కామెంట్స్
ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav speaks in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024 "Yeh bill jo introduce ho raha hai woh bahut sochi samjhi rajneeti ke tehat ho raha hai...Speaker sir, I heard in the lobby that some of your rights are also going to be taken away and… pic.twitter.com/sy7PRW6I04— ANI (@ANI) August 8, 2024ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాపై కూడా అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. ఇక, అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్ చైర్‌ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. -
కుల గణన: అఖిలేష్ విమర్శలకు అనురాగ్ ఠాకూర్ కౌంటర్
ఢిల్లీ: లోక్‌సభలో కులగణనపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇతరు కులాన్ని ఎలా అడుగుతారు? అని మండిపడ్డారు. కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని విమర్శలు చేశారు.తాజాగా అఖిలేష్ యాదవ్ విమర్శలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టతారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా గతంలో అఖిలేష్ మాట్లాడిన రెండు వీడియోలు పోస్ట్ చేసి విమర్శలు చేశారు. రెండు వీడియోల్లో ఒకటి.. ఓ జర్నలిస్ట్‌ను అఖిలేష్.. అతని కులం ఏంటి? అని అడుగుతారు. మరో వీడియోలో లోక్‌సభలో కులం అంశంపై ప్రసంగిస్తారు. ఈ వీడియోలకు మీరు(అఖిలేష్ యాదవ్) ఎలా కులం గురించి అడుగుతారు? అని అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు.जाति कैसे पूछ ली अखिलेश जी ? pic.twitter.com/uaFujlDWrD— Anurag Thakur (@ianuragthakur) July 31, 2024 లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బుధవారం సైతం లోక్‌సభలో గందరగోళం చోటు చేసుకుంది. అనురాగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నినాదాలు చేశారు. మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’వ్యాఖ్యలను మంగళవారం ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు.. రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. -
ఎస్పీ ఆఫీసు ఎదుట రాజ్యాంగ స్తూపం
లక్నో: లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రధాన కార్యాలయం ఎదుట రాజ్యాంగ స్తూపం(సంవిధాన్ మాన్స్తంభ్) ఏర్పాటైంది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్పీ నేతల సమక్షంలో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒక స్తూపంపై రాజ్యాంగ ప్రతిని ఉంచడం ద్వారా రాజ్యాంగ స్తూపాన్ని ఆవిష్కరించారు. ‘ఒకప్పటి కొల్హాపూర్ మహారాజు చత్రపతి సాహూ తన సంస్థానంలో మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న రిజర్వేషన్ల అమలును సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అందుకే జూలై 26వ తేదీన రాజ్యాంగ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతరం అఖిలేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
నరమేధంపై కన్నెర్ర.. చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం
సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్), ఆప్, ఏఐఏడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయూఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీల మండిపాటు విధ్వంసకాండకు సంబంధించిన వీడియో, ఫొటో ప్రదర్శనలు తిలకించిన నేతలు రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ ఏపీలో అరాచకాన్ని చూసి విస్తుపోయిన జాతీయ మీడియాఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరుపట్టపగలే దాడులు, హత్యలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రజా ప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ఇలాంటి బుల్డోజర్ సంస్కృతితో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు. – ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్యాదవ్ఇది ప్రభుత్వ ఉగ్రవాదంఏపీలో ప్రభుత్వమే స్వయంగా ఉగ్రవాదానికి పాల్పడుతోంది. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్‌కు అండగా నిలుస్తాం. – ఐయూఎంఎల్ ఎంపీ వాహబ్కేంద్రం జోక్యం చేసుకోవాలిప్రజలందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదు. దౌర్జన్యాలు, అరాచకాలను కేంద్రం అడ్డుకోవాలి– ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదొరై శాంతి భద్రతలను కాపాడాలి ఏపీలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫొటోలు, వీడియోలు చూశాం. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేంద్రం శాంతిభద్రతలను కాపాడాలి. – వీసీకే అధినేత తిరుమావలవన్ ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదుఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయా? ఏపీ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పాలించే హక్కు లేదు. – శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ఏపీలో పరిస్థితి దిగ్భ్రాంతికరం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే బాధ అనిపిస్తోంది. – తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్వారికీ, దేశద్రోహులకు తేడా ఏముంది? ఇది చాలా బాధాకరం. ఎన్నికల్లో గెలిచిన పార్టీ, ఓడిన వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం ఏంటి? వారికి,దేశద్రోహులకు తేడా ఏముంది? – ఆప్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్గౌతమ్సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న నరమేధం, ఆటవిక పాలన, హత్యా రాజకీయాలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్సీపీ కదంతొక్కింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో టీడీపీ కొనసాగిస్తున్న మారణహోమంపై కన్నెర్ర జేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సాగుతున్న హత్యలు, విధ్వంసకాండకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వేదికగా బలంగా గళమెత్తింది. హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాఫ్ పడేలా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్‌తో హోరెత్తించింది. టీడీపీ అరాచకంపై పిడికిలి బిగించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఆప్, ఏఐడీంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే సహా పలు పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దుతు ఇస్తామని ప్రకటించారు. పిడికిలి బిగించి, గళమెత్తి..రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులపై సాగుతున్న హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలను యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా బుధవారం వైఎస్ జగన్ చేపట్టిన ధర్నాకు మంచి స్పందన లభించింది. బుధవారం ఉదయం ధర్నాకు ముందు ఢిల్లీలో భారీ వర్షం కాస్త కలవరపాటుకు గురిచేసినా, ఉదయం 11 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ధర్నా స్థలికి చేరుకున్నారు. ధర్నా ప్రాంతానికి వైఎస్ జగన్ వచ్చే సమయానికే ఆ ప్రాంతమంతా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. వైఎస్ జగన్ ధర్నా వేదికపైకి వచ్చిన వెంటనే ఆయన్ను కలిసేందుకు నేతలు పోటీపడ్డారు. ఫొటో గ్యాలరీని వైఎస్ జగన్ తిలకిస్తున్న సమయంలో ‘సేవ్ ఏపీ.. ఫ్రమ్ టీడీపీ’, ‘నరరూప రాక్షసుడు.. నారా బాబు’ అంటూ నేతలు, కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేశారు. కార్యక్రమం ఆసాంతం నేతలు, కార్యకర్తలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ పాలనపై వైఎస్ జగన్ చేసే పోరాటాలకు వెన్నంటి ఉంటామని పిడికిలి బిగించి మద్దతు పలికారు. సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా ముగిసేంత వరకు ఆ ప్రాంగణం నేతలతో కిక్కిరిసిపోయింది. భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో వందల సంఖ్యలో ఢిల్లీ పోలీసులు.. పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దమనకాండను కళ్లకు కట్టిన పోస్టర్లు ధర్నా వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ రాష్ట్రంలో సాగుతున్న దమనకాండను కళ్లకు కట్టింది. నంద్యాల, పల్నాడు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా నెల్లూరు సహా వివిధ జిల్లాల్లో టీడీపీ కొనసాగించిన విధ్వంసకాండ, హత్యలు, దాడుల ఫొటోలు హత్యా రాజకీయాలను అద్దంలా చూపాయి. ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫొటోలను వీక్షించి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాల్లో జరిగిన దాడుల ఫొటోలను ఇతర జిల్లాల నేతలకు చూపిస్తూ, టీడీపీ నేతల అరాచకాన్ని తూర్పార పట్టారు. ధర్నాను కవర్ చేసిన జాతీయ మీడియా సైతం ఫొటో గ్యాలరీని తమ తమ ఛానళ్లలో చూపించేందుకు ప్రాధాన్యమిచ్చింది. సభా వేదికపై ప్రదర్శించిన వీడియోలు సైతం కార్యక్రమానికి వచ్చిన వారిని తీవ్ర ఉద్వేగానికి గురిచేశాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ వీడియోను చూసిన వారంతా ఒక్కసారి ఖిన్నులైపోవడం కనిపించింది. ఇంత దారుణాన్ని తమ జీవితంలో చూడలేదని అభిప్రాయపడ్డారు. నరమేధానికి సంబంధించిన ఫొటోలు, ఫ్లకార్డులను సైతం నేతలు, కార్యకర్తలు చేత పట్టుకొని జంతర్ మంతర్ చుట్టూతా ప్రదర్శన నిర్వహించారు. కదిలివచ్చి మద్దతు పలికిన పార్టీలువైఎస్ జగన్ ధర్నాకు మద్దతుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ ఎంపీ రాంగోపాల్ యాదవ్, శివసేన (ఉధ్దవ్ థాక్రే)పార్టీ ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, అరవింద్ సావంత్, ఏఐఎడీఎంకే సీనియర్ ఎంపీ తంబిదొరై, మరో ఎంపీ నటరాజన్ చంద్రశేఖరన్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమా వలవన్, ఆ పార్టీ ఎంపీ రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజేంద్రపాల్ గౌతమ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు అబ్ధుల్ వాహబ్, హ్యారిస్ బీరన్, జేఎంఎం ఎంపీ విజయ్ హన్సక్ తదితరులు వైఎస్ జగన్ ధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ సహా మిగతా నేతలంతా సభా వేదికపై ప్రదర్శించిన వీడియోలను, ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఏపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన దమనకాండను వైఎస్ జగన్ స్వయంగా నేతలకు వివరించారు. పార్టీ కార్యాలయాలపై బుల్డోజర్లతో దాడులు, వైఎస్ఆర్ విగ్రహాల విధ్వంసం, కార్యకర్తలను నడిరోడ్డుపై నరికి చంపుతున్న దృశ్యాలను చూసిన నేతలు ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి సైతం దాడులకు తెగబడ్డ వైనాలు, స్వయంగా ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దృశ్యాలను చూసి రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను చూసిన అనంతరం మాట్లాడిన నేతలు రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, కేంద్రం చొరవ చూపి ఈ దమనకాండను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నరమేధానికి చోటు లేదని, నేరమయ రాజకీయాలు మానుకుంటేనే పార్టీలు మనుగడ సాధిస్తాయని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తూ, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వానికి కనీసం ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే హక్కులేదని ఉధ్దవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి వెంటనే స్పందించి, ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ అరవింద్ సావంత్ సైతం టీడీపీ మంత్రి నారా లోకేశ్ తీరును తూర్పారబట్టారు. ‘ఏపీలో సీఎం కొడుకు ఏకంగా రెడ్‌బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా విధానం ఎంత వరకు సమంజసం?’ అని నిలదీశారు. మిగతా పార్టీల ఎంపీలు సైతం టీడీపీ అరాచకాలను ఖండించారు. నరమేధాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా ఉంటామని సభా వేదికగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్‌ను విడిగా కలిసి సంఘీభావం తెలిపారు.జగన్ ఇంటర్వ్యూకు పోటాపోటీటీడీపీ అరాచక పాలనపై గళమెత్తిన వైఎస్ జగన్ ఇంటర్వ్యూలను తీసుకునేందుకు జాతీయ మీడియా పోటీ పడింది. ఏఎన్ఐ, పీటీఐ, రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఎన్డీటీవీ సహా పలు ఛానళ్లు ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. సాయంత్రం 4 గంటలకు సైతం ఇంకా చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలకు పోటీ పడుతుండటంతో మిగతా వారికి మరో సమయంలో ఇస్తామని నేతలు సర్ది చెప్పాల్సి వచ్చింది. -
వైఎస్సార్సీపీ ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు (ఫొటోలు)
-
వైఎస్ జగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన అఖిలేష్ యాదవ్
-
ఎన్డీయే సర్కార్ త్వరలో పడిపోతుంది: అఖిలేష్ యాదవ్
కోల్కత్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎక్కువ కాలం పాలన కొనసాగించలేదు.. త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్. మతం పేరిట రాజకీయాలు ఎన్నో రోజులు నిలబడవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం బెంగాల్లో ఉన్నాఉ. ఈ సందర్బంగా అఖిలేష్ ఆదివారం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం జరిగిన ‘ధర్మతల ర్యాలీ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు. కానీ, అంతిమంగా ఓడిపోతాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారు. అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారు.ఇదే సమయంలో బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిది నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్’ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. -
వంద మందిని తీసుకురండి.. బీజేపీకి అఖిలేష్ యాదవ్ చురకలు
ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి భంగపాటు ఎదురవడంతో ఎన్నికల ఫలితాలపై కాషాయ పార్టీ మేథోమథనం నిర్వహించింది.సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నాయకత్వంలో లుకలుకలు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు భేదాభిప్రాయాలు బయటపడుతున్న వేళ ప్రతిపక్ష ఎస్పీఅధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై సెటైర్లతో విరుచుకుపడ్డారు.బీజేపీకి ‘మాన్సూన్ ఆఫర్’ ఇచ్చారు. ‘‘మాన్సూన్ ఆఫర్: వందమందిని తీసుకొచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేయండి’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ పార్టీ యూనిట్లో అంతర్గత పోరు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఈ ప్రభుత్వంలో ఎవరూ లేరని ఆరోపించారు.मानसून ऑफ़र: सौ लाओ, सरकार बनाओ!— Akhilesh Yadav (@yadavakhilesh) July 18, 2024 కాగా.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 33 మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనికితోడు కేశవ్ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో దిల్లీలో ఒంటరిగా భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ అధినాయకత్వం రాష్ట్ర శాఖలో సమూల మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కర్నీ ఢిల్లీకి పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం.ఇక లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన సీట్లు రాకపోవడానికి అగ్నిపథ్ స్కీమ్, పేపర్ లీక్స్, రాజ్‌పుత్‌లలో అసంతృప్తి వంటి పది కారణాలను పార్టీ గుర్తించింది. యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడానికి దారితీసిన పలు అంశాలను 15 పేజీల నివేదికలో రాష్ట్ర పార్టీ చీఫ్ భూపేంద్ర చౌధరి వివరించారు. -
మెరుగైన ఫలితాలు సాధిస్తాం: అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అధికారం కోసం వారి కుమ్ములాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఇతర పార్టీల్లో చీలిక రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీలోనూ చీలికలకు పాల్పడుతోందన్నారు. -
యూపీ బీజేపీలో రగడ.. అఖిలేష్ వ్యాఖ్యలకు కేశవ్ మౌర్య స్ట్రాంగ్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. అధికార బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ కాషాయ పార్టీ నేతలపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్‌కు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కౌంటరిచ్చారు.కాగా, అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ..‘కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గుండాయిజం తిరిగి రావడం అసాధ్యం. 2017 ఎన్నికల ఫలితాలే 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు యూపీ బీజేపీ రాజకీయాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతోంది. బీజేపీ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టాడుకుంటున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయి. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కింది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోంది. రాష్ట్ర రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారు. యూపీలో యోగి సర్కార్ బలహీనపడుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం యూపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం.మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకు గాను సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే 36 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 64 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. -
ముగ్గురు కీలక నేతలతో సీఎం మమత భేటీ.. ఏం చర్చించనున్నారు?
కోల్కత్తా: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రేపు(శుక్రవారం) ఉద్దవ్ థాక్రే, శరద్ పవార్‌ను ముంబై కలవనున్నట్టు ఆమె చెప్పారు. వీలైతే అఖిలేష్ యాదవ్‌ను కూడా కలిసే ఛాన్స్ ఉందన్నారు.కాగా, సీఎం మమతా బెనర్జీ గురువారం మాట్లాడుతూ.. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు వివాహం కోసం నేను ముంబై వెళ్తున్నాను. ఇదే సమయంలో రేపు(శుక్రవారం) శివసేన నేత ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం కాబోతున్నాను. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించబోతున్నాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా మేము భేటీ అవుతున్నాము. రేపటి భేటీకి అఖిలేష్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పుకొచ్చారు. Kolkata | West Bengal CM Mamata Banerjee says, "I am going to Mumbai for the wedding of Mukesh Ambani's son. Tomorrow I have an appointment with Uddhav Thackeray. I will also meet Sharad Pawar there. There will be political discussion as we will meet after (Lok Sabha) elections.… pic.twitter.com/vpCd4I0Wkd— ANI (@ANI) July 11, 2024ఇదిలా ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ నేతలతో భేటీ కావడం నేపథ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. వీరి సమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
బీజేపీ నేతలెక్కడ?.. ఇవేనా స్మార్ట్ సిటీలు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు
లక్నో: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సమాజ్‌వాద్ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని పలు పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, అవే ప్రాంతాలు నేడు వరద నీటిలో మునిగిపోయాయని ఎద్దేవా చేశారు.కాగా, అఖిలేష్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో చిన్నపాటి వర్షాలకే దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోంది. బీజేపీ నేతలు పలు పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని చెప్పారు. కానీ, అవే పట్టణాలు నేడు వర్షపు నీటితో మునిగిపోయాయి. ప్రతీచోటా వరద నీరు నిలిచిపోవడంతో వ్యర్థాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్ సిటీల సంగతి దేవుడెగురు.. ముందుగా వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. #WATCH | Etawah, UP: Samajwadi Party chief & MP Akhilesh Yadav says, " Those people (BJP) who told that we will make a smart city in UP, we can see their smart city, it is waterlogging everywhere and waste materials. Accidents are happening, people's vehicles are falling into… pic.twitter.com/WWAVC8XIuL— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 10, 2024రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది. వర్షపు నీరు రోడ్లపై ఉన్న కారణంగా గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనాలు కిందపడిపోతున్నారు. రాష్ట్రంలో వైద్యశాఖకు సంబంధించిన సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. హత్రాస్ ఘటన కూడా పాలనా వైఫల్యం కారణంగానే జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువత ఉద్యోగాలు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని’ కామెంట్స్ చేశారు. Current situation at LBS road #KurlaSo fed up with this flooding every year. There is never a day we have enjoyed rains. We have always lived with the tension of floods and the damages due to it. #MumbaiRains@richapintoi @rushikesh_agre_ @Mumbaikhabar9 @gallinews pic.twitter.com/EGf5k5DMXG— AliAsgar (@Aladeen110) July 8, 2024 #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath inspects the flood-affected areas in Lakhimpur Kheri. pic.twitter.com/jEql0jA97J— ANI (@ANI) July 10, 2024 Lucknow rains લખનૌમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ#rain #UttarPradesh #road #kashi #banarasi #heavyrain #maharashtra #MumbaiRains #underpass #up #yogi #news pic.twitter.com/bvXoR5rJFq— BB News Gujarat (@bbnewsgujarat) July 8, 2024 -
Hathras Stampede: అఖిలేష్ కూడా బాబా భక్తుడే.. ఫొటో వైరల్
యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121 దాటింది. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ ఘటన చోటుచేసుకుంది.యూపీలో ఈ బాబాకు లెక్కకు మించిన భక్తులు, అనుచరులు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గతంలో భోలే బాబా సత్సంగానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.నాడు భోలే బాబా సత్సంగానికి హాజరైన అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో బాబాను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలను అఖిలేష్ అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో అఖిలేష్ వీఐపీ సీట్లలో కూర్చుని కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అఖిలేష్ యాదవ్ బాబా భక్తులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని చూడవచ్చు. नारायण साकार हरि की सम्पूर्ण ब्रह्मांड में सदा - सदा के लिए जय जयकार हो pic.twitter.com/lp4wTmaHal— Akhilesh Yadav (@yadavakhilesh) January 3, 2023 -
లోక్‌సభలో అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో.. ఎన్డీయే కూటమిపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మంగళవారం లోక్‌సభలో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్.. యూపీ ఫలితాలతో పాటు పేపర్ లీక్, ఈవీఎంల అంశం గురించి మాట్లాడారు.‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక నీట్ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు. -
NDA ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది
-
‘భావి ప్రధాని అఖిలేష్’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్‌లను తీసుకువచ్చి అఖిలేష్ చేత కట్ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.ఆ పోస్టర్లో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అఖిలేష్‌కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో గల మంచముఖ హనుమాన్ మందిరంలో అఖిలేష్‌కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. -
ఎంపీల సస్పెన్షన్ జరగదని ఆశిస్తున్నా: స్పీకర్‌తో అఖిలేష్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కే సురేష్‌పై ఓం బిర్లా అత్యధిక ఓటింగ్ సాధింగా వరుసగా రెండోసారి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత సమావేశాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ స్పీకర్‌కు చురకలంటించారు.గతంలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎంపీల సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు కొత్త లోక్‌సభలో జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ప్రజాప్రతినిధి గొంతు అణచివేయడం, బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేము ఆశిస్తున్నాము. మీ నియంత్రణ కేవలం ప్రతిపక్షంపైనే ఉంది, కానీ అది కూడా అధికార వర్గం వైపు కూడా ఉండాలి' అని అన్నారు.కాగా గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. టీఎంసీ మహువా మొయిత్రా కూడా నైతిక దుష్ప్రవర్తన కారణంగా బహిష్కరణకు గురరయ్యారు.స్పీకర్ ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. నిష్పాక్షకతంగా ఉండటం అనేది ఈ పదవికి గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.సభ మీ సంకేతాలపై పనిచేయాలని కానీ ఇతర మార్గాల్లో కాదని అన్నారు. స్పీకర్ తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు తాము కట్టుబడి నిలబడతామని అన్నారు. ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా స్పీకర్ ఇక్కడ కూర్చున్నారని, పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
అఖిలేష్‌పై డింపుల్ కళ్లు.. ‘సభ’లో సూపర్ సీన్
18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి సెషన్లో మూడో రోజు బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ సమయంలో సభలో ఓ దృశ్యం తళుక్కున మెరిసింది. ఓం బిర్లాకు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఈ సమయంలో అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ అతని వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అఖిలేష్ మాట్లాడుతున్నంత సేపు ఆమె దృష్టి భర్తపైనే నిలిచింది. అఖిలేష్ నూతన స్పీకర్ ఓం బిర్లాను అభినందిస్తూ.. కొత్త పార్లమెంటు- పాత పార్లమెంట్ అనే తేడాలు చూపిస్తూ మాట్లాడారు. కొత్త సభలో స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉందని, పాత పార్లమెంటులో కుర్చీ ఎత్తు తక్కువని అన్నారు. ‘స్పీకర్ సార్ మీకు అభినందనలు. మీకు స్పీకర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. మీకు పాత, కొత్త సభలతో పరిచయం ఉంది.మీరు కూర్చున్న స్థానం ఎంతో విలువైనది. అద్భుత సంప్రదాయాలు కలిగినది. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని, వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు ప్రతీ ఎంపీకి, ప్రతీ పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని అనుకుంటున్నాం. నిష్పాక్షికత అనేది ఈ స్థానానికున్న ప్రధాన బాధ్యత. మీరు లోక్‌సభలో ప్రధాన న్యాయమూర్తి తరహాలో కూర్చున్నారు. ఎవరి గొంతునూ అణచివేయకూడదు. అలాగని ఎవరినీ బహిష్కరించకూడదు.మీ నియంత్రణ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై కూడా ఉండాలి. మీ సూచనల మేరకు సభ నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా ఉండకూడదు. నేను మొదటిసారి సభకు వచ్చాను. మీ స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను..స్పీకర్ సార్’అని అఖిలేష్ అన్నారు. అఖిలేష్ సభలో మాట్లాడుతున్నంత సేపు అతని భార్య డింపుల్ చిరునవ్వులు చిందిస్తూ భర్తను చూస్తూనే ఉన్నారు.భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా బుధవారం లోక్‌సభ స్పీకర్‌గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రొటెం స్పీకర్ (యాక్టింగ్ స్పీకర్) భర్తిహరి మహతాబ్ సభలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు తాత్కాలిక స్పీకర్ మహతాబ్ ప్రకటించారు. -
ఆతిశిని పరామర్శించిన అఖిలేష్
ఢిల్లీలో తలెత్తిన నీటి సమస్యకు పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిశి ఆరోగ్యం దిగజారడంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.మంత్రి ఆతిశి చికిత్స పొందుతున్న లోక్ నాయక్ ఆసుపత్రికి వచ్చిన అఖిలేష్ ముందుగా అక్కడి వైద్యులను అడిగి మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆతిశిని పరామర్శించారు. ఐదు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆతిశి మంగళవారం అస్వస్థతకు గురవడంతో ఆమె పార్టీ నేతలు ఎల్ఎన్ ఆస్పత్రికి తరలించారు.ఢిల్లీలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో మంత్రి ఆతిశి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 21న నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆతిశి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
ఎంపీగా కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా: అఖిలేష్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని, కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.కాగా 2022లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాదవ్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా బరిలో దిగిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన కన్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు.అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “నేను కర్హల్, మొయిన్‌పురి కార్యకర్తలను కలిశాను. రెండు ఎన్నికల్లోనూ రెండు స్థానాల నుంచి గెలిచాను. కాబట్టి ఒక సీటును వదులుకోవాలి. కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నాననే విషయం మీకు తెలియజేస్తున్నానను` అని పేర్కొన్నారు.’లోక్‌సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో పూర్తవుతాయి. యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేస్తారు` అని పార్టీ సీనియర్ నేత తెలిపారు.కాగా ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ.. మొత్తం 80 స్థానాల్లో కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీ 37 సీట్లలో సొంతంగా విజయం సాధించి లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
లోక్‌సభలో ఏకైక ఎంపీ దంపతుల జంట.. అందరి దృష్టి వీరిపైనే?
ఎన్నికల పోరులో వేర్వేరు స్థానాల నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకునే దంపతులు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ఈసారి 18వ లోక్‌సభలో యూపీ నేత అఖిలేష్ యాదవ్, ఆమె భార్య డింపుల్ యాదవ్ పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఒకేసారి లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అఖిలేష్ తన సంప్రదాయ స్థానమైన కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నిక కాగా, అతని భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎస్పీ నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో డింపుల్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నారు. తరువాతి స్థానంలో ఆమె భర్త అఖిలేష్ యాదవ్ ఉండటం విశేషం.లోక్‌సభ కార్యకలాపాల సమయంలో ఇద్దరూ సభలో కూర్చున్నప్పుడు పలువురి దృష్టి వీరిపై నిలవనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అజామ్‌గఢ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేసినా, విజయం సాధించలేకపోయారు. అయితే ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి సీటు ఖాళీ అయ్యింది. అప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి డింపుల్ యాదవ్ లోక్‌సభకు చేరుకున్నారు.అఖిలేష్ యాదవ్ తొలిసారిగా తన భార్యతో కలిసి లోక్‌సభకు హాజరుకావడమే కాకుండా, ఈసారి ఆయనతో పాటు ఆయన ముగ్గురు సోదరులు కూడా ఎంపీలుగా సభకు రానున్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్, అజంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్‌లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా లోక్‌సభలోకి అడుగుపెట్టడం మరో రికార్డు కానుంది. -
2027 అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేష్ దృష్టి
2024 లోకసభ ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎస్ఫీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు విని, పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే భవిష్యత్‌లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీకి పెద్దఎత్తున ప్రజల మద్దతు లభించిందన్నారు. దీంతో సోషలిస్టుల బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రజలు చెప్పే విషయాన్ని వినాలని, వారి సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు సీట్లు దక్కించుకుంది. -
లోక్‌సభలో ఎస్పీపక్ష నేతగా అఖిలేశ్ యాదవ్
లక్నో: లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ పక్షనేతగా అఖిలేశ్ యాదవ్ వ్యవహరిస్తారు. ఆ పార్టీ ఎంపీలు ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. అఖిలేశ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, లోక్‌సభ ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత తమ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడిగా అఖిలేశ్ యాదవ్‌ను లాంఛనంగా ఎన్నుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రాజేంద్ర చౌదరి శనివారం చెప్పారు. అఖిలేశ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
యూపీలో ‘ఇండియా’ మ్యాజిక్ అసలు కథ
2024 ఎన్నికల ఘట్టం ముగిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారం చేపట్టేందుకూ రంగం సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 300 కంటే తక్కువ సీట్లకే పరిమితమయ్యేందుకు ముఖ్యకారణం ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో ‘ఇండియా’ కూటమి అత్యద్భుత ప్రదర్శనే అనడంలో సందేహం అవసరం లేదు. హోరాహోరీగా ఎన్నికల్లో ఇండియా కూటమి ఏకంగా 43 స్థానాలను కైవసం చేసుకోగా (సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్ ఆరు) ఎన్డీయే 36 సీట్లతో (బీజేపీ 33) సర్దుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే హిందుత్వ భావజాలానికి బాగా మద్దతున్న రాష్ట్రమిది. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇది మరింత లోతుకు చేరింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీలో 2019 నాటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ చాలా ధీమాగానే ఉండింది. అయితే పోలింగ్ శాతం తక్కువ కావడం, మోదీ అనుకూల పవనాలేవీ లేకపోవడం, స్థానికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడం వంటి కారణాలతో బీజేపీకి గట్టి పోటీ తప్పలేదు. అయితే గత కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ వీటిని పెద్దగా పట్టించుకోలేదని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.రాజకీయంగా మళ్లీ పుంజుకుంటున్న దశలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు, పప్పూ అన్న ఇమేజ్ చట్రం నుంచి బయటపడ్డ రాహుల్ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో... మరీ ముఖ్యంగా దళితులు, కొన్ని ఓబీసీ వర్గాల్లో పెరిగిపోయిన అసంతృప్తి; అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... వెరసి ఈ ఫలితాలు! యూపీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ప్రదర్శనకు కర్త, కర్మ, క్రియ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవే. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 2014 తరువాత మొదటిసారి ఓ నేత బీజేపీకి సవాలు విసిరే స్థితిలో కనిపించాడు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి అఖిలేశ్ఒంటరిగానే యూపీలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను నిర్మించగలిగాడు. దళిత ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు బాబాసాహెబ్ వాహినిని సృష్టించాడు. వెనుకబడిన వర్గాల నేతగా తనను తాను ఆవిష్కరించుకున్న అఖిలేశ్ ఎన్నికల యుద్ధాన్ని కాస్తా హిందూత్వ– సామాజిక న్యాయాల మధ్య పోరుగా మార్చేశాడు. 2024 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ డిమాండ్లను తట్టుకుని సీట్ల సర్దుబాటు చర్చలను ఫలవంతం చేయడం ద్వారా వారికి 11 సీట్లు, తన పార్టీ, వర్గానికి 62 సీట్లు కేటాయించుకునేలా చేయగలిగాడు. అంతేకాకుండా ముస్లిం– యాదవ్‌ల పార్టీ అన్న ముద్రను పోగొట్టుకునేందుకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులతోపాటు యాదవులకు కేటాయించిన సీట్లు ఐదింటికి పరిమితం చేసుకున్నాడు. మిగిలిన సీట్లన్నింటినీ అన్ని వర్గాల వారికీ కేటాయించాడు.రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ప్రజాభిప్రాయం 2024 ఎన్నికల్లో గణనీయంగా మారినట్లు స్పష్టమవుతోంది. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్రలు ఇందుకు ఉపకరించి ఉండవచ్చు. అమేథీ, రాయ్ బరేలీల్లో కాంగ్రెస్ విజయాలు దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన న్యాయ్ గ్యారెంటీలు కూడా చాలావరకూ ప్రజాదరణకు నోచుకున్నాయి. మరీ ముఖ్యంగా జాబ్ గ్యారెంటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను యాభై శాతం కంటే ఎక్కువ చేసేందుకు రాజ్యాంగ మార్పులు. ఇండియా కూటమి భాగస్వాములు కలిసికట్టుగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ మే నెలలో మాత్రం దాదాపు ఆరు జరిగాయి. అన్ని సమావేశాల్లోనూ అఖిలేశ్ ప్రజాకర్షక నేతగా కనిపించారు. ‘ఇండియా’ కూటమి నేతలు క్షేత్రస్థాయిలో అధికార పక్షంపై ఉన్న అసంతృప్తిని ఒడిసిపట్టుకోవడంలో విజయం సాధించారని చెప్పాలి. కులాధారిత జనగణన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారన్న దళితుల ఆందోళన, అగ్నివీర్, ప్రశ్నపత్రాలు తరచూ లీక్ అవుతూండటం వంటి అంశాలను సమర్థంగా వాడుకుని అధికార పక్షానికి సవాలు విసిరారు ‘ఇండియా’ కూటమి నేతలు. మతం ప్రధానంగా సాగిన బీజేపీ ప్రచారం ప్రభావం నుంచి జనాలను తమవైపునకు మళ్లించడంలో విజయం సాధించారు. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓటమి పాలు కావడమే కాదు... విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ నేత అవదేశ్ సింగ్ దళిత వర్గానికి చెందిన వాడు కావడం గమనార్హం.2014 నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో తన పట్టు, ప్రాభవం రెండింటినీ కోల్పోతూ వస్తోంది. ఆ కారణంగానే జాట్ కులేతరులు బీజేపీవైపు ఎక్కువగా మొగ్గారు. తద్వారా యాదవుల ఆధిపత్యం నుంచి తప్పించుకోవచ్చునని ఆలోచించారు. అయితే ఎస్పీ కాంగ్రెస్‌తో జట్టు కట్టడంతో బీఎస్పీ, బీజేపీల కంటే ‘ఇండియా’ కూటమి తమకు మేలు చేయగలదన్న నమ్మకం వాళ్లకు కలిగింది. భీమ్ ఆర్మీ/ఆజాద్ సమాజ్ పార్టీ వైపు దళితులు మొగ్గడం వెనుక కారణమూ ఇదే. చంద్రశేఖర్ ఆజాద్ ఏర్పాటు చేసిన ఈ పార్టీ చతుర్ముఖ పోరులోనూ నగీనా రిజర్వ్డ్ స్థానం నుంచి విజయం సాధించింది.యూపీలో బీజేపీ కూటమి ఓటమికి మరో బలీయమైన కారణం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని చర్చనీయాంశంగా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి 2021 వరకూ యూపీ ఆర్థిక వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 1.95 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చెందింది. తలసరి ఆదాయ వృద్ధి ఏడాదికి 0.43 శాతం మాత్రమే. అంతకు మునుపు అంటే 2012–2017 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏడాదికి 6.92 శాతం చొప్పున పెరగ్గా 2007–2012 మధ్యకాలంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి కాలంలో 7.28 శాతం చొప్పున పెరిగింది. యోగీ ఆదిత్యనాథ్ హయాంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని చాలామంది చెబుతూంటారు. అదే సమయంలో చాలామందికి యోగి బుల్డోజర్ రాజకీయాలు అంతగా నచ్చలేదు కూడా! యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా యమునా, గంగ ఎక్స్‌ప్రెస్ వే, సనౌటా–పుర్కాజీ ఎక్స్‌ప్రెస్ వే, వారణాసి – నోయిడాల మధ్య ఎనిమిది లేన్ల రహదారి వంటి అనేక భారీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. అలాగే కుశినగర్, జేవార్‌ల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికీ ప్రణాళిక సిద్ధమైంది. కానీ, ఈ రెండింటికీ బీజం పడ్డది మాయావతి కాలంలో. అఖిలేశ్ ఈ ఆలోచనలను కొనసాగించారు. మొత్తమ్మీద 2024 ఎన్నికలు హిందూత్వ భావజాలానికీ, సామాజిక న్యాయాన్ని కోరే మండల్ వర్గాలకూ మధ్య హోరాహోరీగానే సాగింది. రాముడి చుట్టూ తిరిగిన రాజకీయాలను కాస్తా ప్రజల జీవనోపాధి సమస్యల వైపు మళ్లించిన ఘనత ‘ఇండియా’ కూటమికి దక్కుతుంది. ఇంకోలా చెప్పాలంటే 2014 తరువాత మొదటిసారి బీజేపీ మతతత్వ పాచిక పారలేదని చెప్పాలి. -వ్యాసకర్త ‘మాయా, మోదీ, ఆజాద్: దళిత్ పాలిటిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిందుత్వ’ రచయిత్రి (సజ్జన్ కుమార్‌తో కలిసి). - సుధా పాయీ -
Akhilesh Yadav: బీజేపీని అడ్డుకున్నాం
కన్నౌజ్/ఎటావా: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని అడ్డుకోవడంలో తాము విజయవంతం అయ్యామని సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేశామని అన్నారు. అనుకున్న లక్ష్యం సాధించామని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ చూపిన బాటలో నడుస్తూ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేశామన్నారు. యూపీలో లోక్‌సభల్లో ఎస్పీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్పీ సొంతంగా 37 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ 1.70 లక్షల ఓట్ల మెజారీ్టతో బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌పై విజయం సాధించారు. -
Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత?
లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్ పోల్స్ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. -
చివరి విడతలో అఖిలేష్‌కు షాక్
లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బల్లియాకు చెందిన ప్రముఖ నేత నారద్ రాయ్ ఎస్పీతో తెగతెంపులు చేసుకుని, బీజేపీలో చేరారు. నారద్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నారద్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు, అతని కుమారుడు అఖిలేష్‌కు అతి సన్నిహితునిగా పేరొందారు.నారద్ రాయ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుని అతని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాయ్ ఒక ట్వీట్లో తాను బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో నేను సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితం అలానే ఉంది. ఇప్పుడు బీజేపీ కోసం నా బలాన్నంతా ఉపయోగిస్తాను. బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. అఖిలేష్ యాదవ్ నన్ను అవమానించారు. గత ఏడేళ్లుగా ఇదే జరగుతోంది. 2017లో అఖిలేష్ యాదవ్ నా టికెట్ రద్దు చేశారు. అయితే 2022లో తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో నా ఓటమికి కుట్ర పన్నారు’ అని పేర్కొన్నారు.యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో నారద్ రాయ్ రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని వీడి, బీఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటున్నారు.ఇటీవల బల్లియా లోక్‌సభ ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో నారద్ రాయ్ పాల్గొన్నారు. అయితే నాడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈయన పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆగ్రహించిన నారద్ రాయ్ ఎస్పీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా ఒక దశ అంటే ఏడవ దశ ఓటింగ్ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. -
రాహుల్ సభలో తొక్కిసలాట
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభావేదిక వద్ద తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆదివారం ఫూల్పూర్ నియోజకవర్గం పరిధిలోని పడిలా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారసభ ఈ ఘటనకు వేదికైంది. ప్రచారసభకు రాహుల్, అఖిలేశ్ వస్తున్నారని తెల్సి ఇరుపార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కిక్కిరిసన జనంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది.ప్రసంగించేందుకు అఖిలేశ్ సభావేదిక మీదకు రాగానే జనం వేదికపైపు హఠాత్తుగా ముందుకొచ్చారు. బారికేడ్లు, అడ్డుగా ఏర్పాటుచేసిన కర్రలను తొలగించి మరీ దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారి తొ క్కిసలాట జరిగింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. వెనక్కి వెళ్లండి అని వేదికపై నుంచి అగ్రనేతలు హెచ్చరించినా కార్యకర్తలు ఎవ్వరూ వినిపించుకోలేదు. ఓటర్ల శాంతించాలని విన్నవించినా పట్టించుకోలేదు. చాలా మంది రాహుల్, అఖిలేశ్ దాకా వచ్చి వారితో షేక్‌హ్యాండ్ కోసం స్టేజీ వద్ద ఎగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో, భారీగా పోగైన కార్యకర్తలను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీ భద్రతకు ముప్పుందని అక్కడి భద్రతా, పోలీసు సిబ్బంది అగ్రనేతలు రాహుల్, అఖిలేశ్‌లను అప్రమత్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రసంగించాలా వద్దా అని రాహుల్, అఖిలేశ్ కొద్దిసేపు మాట్లాడు కున్నారు. తర్వాత ప్రసంగించకుండానే ఇద్ద రు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా ముగిపోయింది. తర్వాత అక్కడి సమీపంలోని ముంగారీ ర్యాలీలో ప్రసంగించారు. అక్కడ కూడా దాదాపు ఇదే మాదిరిగా కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని ముందుకు రాబోయారు. యూపీలో బీజేపీకి దక్కేది ఒక్కటే సీటు: రాహుల్ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మాత్రమే బీజేపీ గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యంచెప్పారు. ఆదివారం ఆయన ‘ఇండియా’ అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ తరఫున రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో కలిసి ప్రచారం చేశారు. జపాన్‌లోని సుందరనగరం క్యోటోలాగా వారణాసిని తీర్చిదిద్దుతానని మోదీ గతంలో ఇచ్చిన హామీని రాహుల్ ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ‘‘ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్యోటో సీటును మాత్రమే మోదీ గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీటు అదొక్కటే. కోవిడ్‌కాలంలో బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని ఇష్టారీతిన మార్చేందుకు తెగబడింది’’ అని అన్నారు. -
సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
లక్నో: తొక్కిసలాట పరిస్థితులు తలెత్తడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఘటన ఆదివారం(మే19) ప్రయాగ్‌రాజ్‌లోని పుల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగింది.సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలకు సర్దిచెప్పడానికి రాహుల్, అఖిలేష్ ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు. దీంతో రాహుల్,అఖిలేష్ ప్రసంగించకుండా మధ్యలోనే వెనుదిరిగారు. -
మూడో దశకే అఖిలేష్ ఓటమి మ్యానిఫెస్టో!
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉంది. అయితే ఇంతలోనే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇది వారి పార్టీకి సంబంధించినది కాదు.. బీజేపీ ఓటమికి సంబంధించినది.అఖిలేష్ ఈ మేనిఫెస్టోను కాలక్రమం ఆధారంగా వివరిస్తూ ట్వీట్ చేశారు. మీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అక్కడి మీ సహచరులపై ఎందుకు ఆరోపణలు వచ్చాయని అఖిలేష్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు జీఎస్టీ, ఆదాయపు పన్ను, ఇతర రకాల పన్నులను ఎగవేసి ఉంటారు. అందుకే నల్లధనం పుట్టుకొచ్చింది. ప్రభుత్వం దీనిని అనుమతించిందో లేక ఆపలేకపోయిందో గానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పక తప్పదు.గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్టీ తప్పని రుజువైంది. దేశంలో అవినీతి వల్ల తలెత్తుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బీజేపీ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుంచి మన దేశం వైదొలగడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం నల్లధనం ఆధారంగా భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటున్నదా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’ల విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో పేదల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. దేశ ఆదాయానికి ఏర్పడిన వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎన్నికల విరాళాలతో భర్తీ చేస్తుందా? కరోనా వ్యాక్సిన్ కోసం విరాళాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటించిన ఎన్నికల విరాళాలను నల్లధనంగా ప్రకటిస్తుందా? అని అఖిలేష్ ప్రశ్నించారు.పార్టీలో ఎవరిపైన అయినా ఆరోపణలు వస్తే, వారికి గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు, లీజులన్నింటినీ బీజేపీ రద్దు చేస్తుందా? ప్రజల సొమ్ముతో రూపొందించిన ‘పీఎం కేర్ ఫండ్’ ఖాతాలను ప్రజల ముందు బహిరంగపరుస్తుందా? బీజేపీ తదుపరి దశ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక మూడో దశనే చివరి దశగా భావించి ఓటమిని అంగీకరిస్తుందా? అని అఖిలేష్ తన ట్వీట్లో బీజేపీని ప్రశ్నించారు. -
డింపుల్ యాదవ్ సింపుల్ పొలిటీషియన్
డింపుల్ యాదవ్. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్ యాదవ్‌ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్ యాదవ్‌కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్ మార్కులు కొట్టేశారు.డింపుల్‌కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్‌వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి... రాజకీయాల్లోకి రావాలని డింపుల్ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్ యాదవ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్ లోక్‌సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.ప్రేమ, పెళ్లి, పిల్లలు.. డింపుల్ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్ రామ్‌చంద్ర సింగ్ రావత్. వారిది ఉత్తరాఖండ్. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదివారు డింపుల్. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. అఖిలేశ్‌ను తొలిసారి చూసినప్పుడు డింపుల్ ప్లస్ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్‌కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్ ఆ్రస్టేలియా వెళ్లారు. అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్‌పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడానికి ఇష్టపడతారు డింపుల్. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు. -
నా భార్య రూ.54 లక్షల అప్పుంది: మాజీ సీఎం
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్‌లు ఉన్నాయి.లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. -
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్‌సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్‌నగర్‌కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్‌సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్‌లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
అఖిలేష్ ర్యాలీ, ప్రియాంక రోడ్ షో..
ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సహరాన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం. -
లోక్‌సభ ఎన్నికలకు అఖిలేష్ దూరం?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కన్నౌజ్‌లోని బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్‌కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్‌లో ఎన్నికల ఇన్ఛార్జ్తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్‌పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు. కాగా రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్‌పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్‌కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్‌ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. -
ఆజంఖాన్ కంచుకోటను అఖిలేష్ కాపాడతారా?
ఉత్తరప్రదేశ్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ నేత ఆజం ఖాన్‌కు కంచుకోటగా ఉన్న రాంపూర్‌పై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈసారి ఆజం స్థానంలో ఎవరిని రంగంలోకి దింపాలనే ప్రశ్న ఎస్పీని కలవరపెడుతోంది. ఈ సీటు నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని సమాచారం. అఖిలేష్ రామ్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అజం ఖాన్ స్వయంగా కోరారట. అయితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఇందుకు సిద్ధంగా లేరట. మరోవైపు అఖిలేష్ కుటుంబం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను రాంపూర్ నుండి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.. అధికారికంగా అఖిలేష్ ఇంకా ప్రకటించనప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్‌కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. దీంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి. ఇటీవల యూపీలోని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి నుంచి అజయ్ సింగ్‌కు, రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు అవకాశం కల్పించారు. -
బాండ్లు కాదు.. బీజేపీ బలవంతపు వసూళ్లు: అఖిలేశ్
కనౌజ్(యూపీ): ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి విరచుకుపడ్డారు. బీజేపీ బాండ్ల రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. చందాల ముసుగులో వసూళ్ల దందాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బలవంతపు వసూళ్ల కోసం సీబీఐ, ఈడీ ఐటీ వంటి సంస్థలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుందని మండిపడ్డారు. కొందరు కాంట్రాక్టర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా బీజేపీ ఖాతాలోకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లతో ఇప్పు డు బీజేపీ ప్రతిష్ట మసకబారిందని పేర్కొన్నారు. భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని అఖిలేశ్ ఆక్షేపించారు. -
ఆరు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులు.. ప్రకటించిన అఖిలేష్
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సంభాల్ నుంచి ఎస్పీ టికెట్‌పై జియావుర్ రెహమాన్ బుర్క్ పోటీ చేయనుండగా, బాగ్పత్ నుంచి మనోజ్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రాహుల్ అవానా గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పోటీ చేస్తారని ఎస్పీ విడుదల చేసిన జాబితా పేర్కొంది. అలాగే భగవత్ శరణ్ గంగ్వార్ పిలిభిత్ నుంచి, రాజీవ్ రాయ్ ఘోసీ నుంచి పోటీ చేయనున్నారు. రాజేంద్ర ఎస్ బింద్ మీర్జాపూర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తారని తెలిపింది. మొత్తం ఏడు దశలలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటివరకూ ఐదు జాబితాలు ప్రకటించగా ఇది ఆరోది. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 47కి చేరింది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఇచ్చింది. ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 17 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు వదిలివేసింది. కాంగ్రెస్ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి ఉన్నాయి. -
ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ కుమార్తె
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్, డింపుల్‌ల కుమార్తె అదితి యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది. ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు డింపుల్ తీసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు ములాయం సింగ్‌ను ‘దాదా’ అని పిలిచేవారు. మెయిన్‌పురి సీటు 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ డింపుల్ యాదవ్‌కు మెయిన్‌పురి స్థానం నుంచి మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డింపుల్ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. యూపీలో నూతన రామాలయం ప్రారంభమైన నేపధ్యంలో ఇది సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందని పలువురు అంటున్నారు. ములాయంను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్‌పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్‌పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యూపీలో ముస్లిం, యాదవ్ వర్గాలను సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్ వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో తన హవా చాటుతోంది. -
కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లిన అఖిలేష్!
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో ఆరుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి) విడుదల చేసింది. దీనికి ముందు మూడు దశల్లో 31 మంది అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గానూ 37 స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే శుక్రవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో నగీనా సీటు చర్చనీయాంశంగా మారింది. నగీనా లోక్‌సభ స్థానం నుంచి మనోజ్ కుమార్ పోటీ చేస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. మనోజ్ కుమార్ ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. యూపీలో మరికొన్ని చిన్న పార్టీలను ఇండియా కూటమిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ ఆజాద్‌కు కంచుకోటగా ఉన్న నగీనా స్థానంలో ఏ అభ్యర్థినీ నిలబెట్టవద్దని కాంగ్రెస్ అఖిలేష్‌కు సూచించింది. అయితే తాజాగా అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మనోజ్ కుమార్‌ను నగీనా అభ్యర్థిగా చేయడం ద్వారా, చంద్రశేఖర్ ఆజాద్ ఇకపై ఇండియా కూటమిలో చేరలేని పరిస్థితి ఏర్పడింది. యూపీలోని ఖతౌలీ, రాంపూర్, మెయిన్పూర్ ఉపఎన్నికల సమయంలో చంద్రశేఖర్ బహిరంగంగానే ఎస్పీ కూటమితో బరిలోకి దిగారు. చంద్రశేఖర్ పలు సందర్భాలలో అఖిలేష్ యాదవ్ పక్కన కనిపించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఇండియా కూటమిలో ఉంటారని, నగీనా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రకటించారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ నేడు (శనివారం) నగీనాలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు. -
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది
లక్నో: 2014లో అధికారంలోకి వచ్చిన నాయకుడు 2024లో పదవి నుంచి దిగిపోతాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జర్మనీ నియంత హిట్లర్ కేవలం 10 సంత్సరాలే అధికారంలో ఉన్నాడని గుర్తుచేశారు. మన దేశంలోని నాయకుడు పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడని, ఇక ఆయన ఇంటికి వెళ్లే సమయం వచ్చేసిందని తేల్చిచెప్పారు. ఆ నాయకుడికి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఘన స్వాగతం పలికారని, రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు అంతే ఘనంగా వీడ్కోలు చెబుతారని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను, మన ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు. -
సీబీఐ విచారణకు అఖిలేశ్ గైర్హాజరు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల తవ్వకం కేసులో సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ ఇచి్చన సమన్లను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బేఖాతరు చేశారు. సీబీఐ సమన్ల ప్రకారం గురువారం ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌కు అఖిలేశ్ వెళ్లాలి. కానీ ఆయన లక్నోలోనే ఉండిపోయారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘ అంతకుముందే ఖరారైన షెడ్యూల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గురువారం మీ ఆఫీస్‌కు అఖిలేశ్ రావట్లేదు. కానీ అవకాశం ఉన్నంతమేరకు మీకు నా సహాయసహకారాలు ఉంటాయి’’ అని అఖిలేశ్ తరఫున న్యాయవాది సీబీఐకి వివరణ ఇచ్చారు. తర్వాత లక్నోలో పార్టీ ఆఫీస్‌లో జరిగిన వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సభలో అఖిలేశ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టడాన్ని అఖిలేశ్ ప్రస్తావించారు. -
నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ–టెండర్ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2012–16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్ స్పందించారు. ‘‘ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?’’ అంటూ బీజేపీపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు. ఏమిటీ కేసులు? హమీర్పూర్ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012–17లో అఖిలేశ్ సీఎంగా ఉంటూనే 2012–13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ–టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్పూర్ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది. -
యూపీలో రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ
ఉత్తరప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్ వాది(ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరిలో ఎస్పీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు రాకేశ్ పాండే, అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్ సింగ్, మనోజ్ పాండే, వినోద్ చతుర్వేది, మహారాజీ ప్రజాపతి, పూజా పాల్, పల్లవి పటేల్ ఉన్నారు. దీంతో ఎస్పీలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేకపోయారని, ఈ విషయాన్ని ముందుగానే పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా నేడు (మంగళవారం) జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు లోక్ భవన్ ఆడిటోరియంలో శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. బీజేపీ ఓటింగ్ శిక్షణ సమావేశానికి మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ, సుభాఎస్పీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సరైన ఓటింగ్ విధానాన్ని అధికారులు వారికి వివరించారు. -
భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేశ్
ఆగ్రా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆగ్రాలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు. భారీగా హాజరైన ఇరుపార్టీల కార్యకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల శక్తిని చూసి భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు తగు గౌరవం ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీలకు బీజేపీ తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొ న్నారు. అంతకుముందు నేతలు ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోడో యాత్రలో అఖిలేశ్ పాల్గొనడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. -
కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన
లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. యూపీలో కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని, రాహుల్ గాంధీతో తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను తోసిపుచ్చారు. అమేథీ, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు గైర్హాజరు కావడంపై ఎదురైన ప్రశ్నకు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తమ మధ్య అంతా బాగానే ఉందని, ఎలాంటి వివాదం లేదని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ మధ్య పొత్తు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. కాగా సీట్ల పంపకం ఖరారైన తర్వాతే రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటానని ఇటీవల అఖిలేష్ యాదవ్ పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్‌కు బదులుగా సీతాపూర్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించినట్లు సమాచారం. చదవండి: ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన -
భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేష్ దూరం?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్‌బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మీకేమైనా డౌటా..? ఇండియా కూటమికి ఇంకో షాక్
లక్నో: రాష్ట్రీయా లోక్ దళ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేరుతారని ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాలు ఆర్ఎల్డీ పార్టీ బీజేపీలో చేరిందనడానికి బలం చేకూర్చాయి కూడా. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీనరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్కు భారత రత్న ప్రకటించింది. అయితే చరణ్ సింగ్.. మనవడే ప్రస్తుత ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీ. తన తాతకు భారత రత్న ప్రకటించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో చేరికకు సంబంధించిన ప్రచారాన్ని ధ్రువీకరించారు. గత ప్రభుత్వాలు చాలా ఏళ్ల నుంచి చేయని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ఈ రోజు మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారత రత్న ప్రకటించారని ఆనందం వ్యక్తంచేశారు. వెలుగులోకి రాని వ్యక్తులకు ప్రధాన స్రవంతిలోకి తీసువచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరుతారన్న ప్రశ్నకు... ‘మీకేమైనా అనుమానం ఉందా? నేను ఈ రోజు ఎలా తిరస్కరించగలను’ అని అన్నారు. దీంతో జయంత్ చౌదరీ ఎన్డీయే కూటమి చేరిపోతారని సంకేతాలు అందించినట్లు అయింది. సామాజ్‌వాదీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఆర్ఎల్డీ.. బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని తెగప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. పార్టీలను ఎలా విడగొట్టాలో బీజేపీకి బాగా తెలుసని, ప్రత్యర్థులపై ఎలా దాడి చేయాలో కూడా బీజేపీ తెలుసని మండిపడ్డారు. పార్టీల్లో, నాయకల్లో చీలికలు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీను ఎలా వాడుకోవాలో బీజేపీ వాళ్లకు తెలుసని ఆరోపంచారు. ఎలా మోసం చేయాలో మొన్నటి చంఢీఘర్ మేయర్ ఎన్నికల పోలింగ్‌తో అర్థం అవుతుందని అన్నారు. ఎవరిని ఎలా కొనుగోలు చేయాలో కూడా బాగా తెలుసని.. విధానాల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ధ్వజమెత్తారు. గత 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ కూటమిలో భాగంగా ఆర్ఎల్డీ బరిలోకి దిగినప్పటికీ పోటీ చేసిన మూడు స్థానాల్లో (మథుర, బాగ్పట్, ముజఫర్ నగర్) ఓటమి పాలుకావటం గమనార్హం. జాట్ వర్గంలో ఆర్ఎల్డీకి మంచిపట్టు ఉండటం విశేషం. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
Parliament elections 2024: రాయ్‌బరేలీ, అమేథీల్లో సమరమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వారి కంచుకోటలుగా పేరొందిన లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు విఫలమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీని ఆహా్వనించాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలను నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), అప్నాదళ్ (కమేరావాదీ)తో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కొనసాగిస్తోంది. సర్వశక్తులూ ఒడ్డుతాం: అఖిలేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడుతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పారీ్టతో స్నేహాన్ని వదులుకొని, తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమను బాగా అవమానించిందన్న భావన ఆయనలో ఉందంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పారీ్టకి బలమైన క్యాడర్ ఉంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పారీ్టకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి నలుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సిట్టింగ్ ఎంపీ సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. రాయ్‌బరేలీ నుంచి ఉంచాహర్ ఎమ్మెల్యే మనోజ్ పాండేను, అమేథీ నుంచి గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్‌సింగ్‌ను బరిలో దింపే యోచనలో అఖిలేశ్ ఉన్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు లేనప్పుడు రాయ్‌బరేలీ, ఆమేథీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను పోటీ చేయించలేదు. ఈసారి మాత్రం పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు. -
కంటైనర్ ఢీ.. యువ ఇంజనీర్ తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా అతి వేగంగా రాంగ్రూట్లో వచ్చి బైక్‌పై వెళ్తున్న కొస్మెట్టి అఖిలేష్ (29)ను ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మావల పోలీసు స్టేషన్ పరిధిలో ని బైపాస్ జాతీయ రహదారి 44 బట్టిసావర్గాం శివారులో సోమవారం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న అఖిలేష్ విధి నిర్వహణలో భాగంగా బోథ్ మండల కేంద్రానికి బైక్‌పై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో బట్టిసావర్గాం శివారు ప్రాంతంలో కంటైనర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మావల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. తీరని శోకం.. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జైరామ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. జైరామ్ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. ఇవి చదవండి: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’
రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్‌నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాలూక్‌నగర్. అలా అయితే ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు. తమకు ఉత్తరప్రదేశ్‌లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్ నగర్ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. -
హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 'ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు. #WATCH | Delhi: Samajwadi Party leader Swami Prasad Maurya says, "Hindu ek dhokha hai...RSS Chief Mohan Bhagwat has said twice that there is no religion called Hindu but instead, it is a way of living. Prime Minister Modi has also said that there is no Hindu religion...Sentiments… pic.twitter.com/1qnULH1rqt — ANI (@ANI) December 26, 2023 స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు. "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్మానస్లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు. ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
ప్రముఖుల దూరం.. ఇండియా కూటమి భేటీ వాయిదా
ఢిల్లీ: దేశ రాజధానిలో రేపు జరగనున్న ఇండియా కూటమి భేటీని వాయిదా వేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖులు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు తమ బదులుగా పార్టీ నుంచి ఇతర సభ్యులను పంపుతామని ఇప్పటికే ప్రకటించారు. "ఇండియా కూటమి సమావేశానికి అఖలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన లేదు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ లేదా అఖిలేష్ సూచించిన ఇతర నేత ఎవరైనా సమావేశానికి వెళతారు" అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అటు.. జేడీయూ నుంచి పార్టీ చీఫ్ లాలన్ సింగ్, బిహార్ నీటి వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఘా సమావేశానికి హాజరుకానున్నారు. ఇండియా కూటమి భేటీకి తాను కూడా హాజరు కాలేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే తెలిపారు. ఉత్తర బెంగాల్లో పర్యటించాల్సిన ఇతర షెడ్యూల్‌ను సూచిస్తూ భేటీకి దూరంగా ఉన్నారు. మిచౌంగ్ తుపానుతో చెన్నై ఎయిర్‌పోర్టు బంద్ అయిన కారణంగా తాను రాలేనని సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి కనీసం దరిదాపుల్లో కూడా లేని స్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండటం కీలక సంకేతాలను అందిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరును కూడా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది!
లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేశారు. అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్‌కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే.. -
హ్యపీ బర్త్‌డే: ‘నోట్ల రద్దు’ను వినూత్నంగా గుర్తు చేసిన అఖిలేష్ యాదవ్
ఏడేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు గాయాల్ని వినూత్నంగా గుర్తు చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దు సమయంలో జన్మించిన 'ఖాజాంచి' (కోశాధికారి అని అర్థం) అనే చిన్నారి పుట్టినరోజును లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సతమతమవుతున్న సమయంలో 'ఖాజాంచి' ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి చిన్నారి తండ్రి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి ఉండగా తల్లి ఆ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం రూ.15 లక్షల కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్‌ను కప్పిపుచ్చడమేనని ఆరోపించారు. ధనికుల ఖజానాను నింపేందుకు పేదల నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించారు. బీజేపీ చెప్పినట్లుగా నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం ముగిసిపోలేదని ఆక్షేపించారు. మరో అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పుడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఖాజాంచి తల్లి, ఇతర పార్టీ సభ్యులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ మోసకారి: అఖిలేశ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ‘ఇండియా’ కూటమిలోని కీలకమైన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మహా మోసకారి అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గానీ ఓటేయరాదని ఓటర్లను ఆయన కోరారు. ఈ రెండు పార్టీలు ప్రకటించిన పథకాలు, హామీలు అమలయ్యేవి కావని చెప్పారు. ఆదివారం టికమ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘రేషన్ అందనప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయడం? కాంగ్రెస్‌కు కూడా వద్దు. ఆ పార్టీ చాలా మోసకారి. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన అంటోంది’అని అఖిలేశ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీయే కుల ఆధారిత సర్వేను నిలిపివేసింది. మండల్ కమిషన్ సిఫారసులకు కూడా అడ్డుపుల్ల వేసింది. బీజేపీ కూడా అదే దారిలో వెళుతోంది. కులగణన కోసం డిమాండ్లు తీవ్రం కావడంతో కాంగ్రెస్ ముందుకు వచ్చి తాము చేపడతామని చెబుతోంది. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీ కూడా కుల గణన గురించి మాట్లాడుతోంది’అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు ముఖ్యంగా ఆదివాసీ, దళిత మహిళలు ఎంతో అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీజేపీ నమ్మేది ప్రజాస్వామ్యాన్ని కాదు, లూటీ స్వామ్యాన్ని అని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ప్రతిపక్షాలతో ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్పీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కొన్ని సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పక్కన బెట్టడంతో పోటీగా కొన్ని సీట్లలో ఎస్పీ సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. -
దళిత మహిళపై దారుణం: అత్యాచారం, ఆపై ముక్క ముక్కలుగా చేసి..!
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. బందా లోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటౌరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందంటూ ప్రతిపక్షం మండి పడింది. పోలీసు అధికారి సమాచారం ప్రకారం రాజ్‌కుమార్ శుక్లాకు చెందిన పిండి మిల్లును శుభ్రం చేసేందుకు బాధిత మహిళ వెళ్లింది. అయితే ఆమె ఎంతకీ తిరిగి రావడంతో ఆమె కుమార్తె అక్కడికి చేరుకుంది. అయితే అక్కడున్న గది లోపనుంచి గడియ వేసి ఉండటం, తల్లి అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించింది. దీంతో స్థానికుల సాయంతో కాసేపటి తలుపులు తెరిచి చూడగా ముక్క ముక్కలుగా పడి ఉన్న తలి మృతదేహాన్నిచూసి తీవ్ర భయాందోళకు లోనైంది. దీంతో ఈఘటనపై పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితులుగా రాజ్‌కుమార్ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంతన హృదయాన్ని కలచి వేసిందని, బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తిగా విశ్వాసం కోల్పో యారంటూ ట్వీట్ చేశారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ఈ ఘటన చెంప పెట్టు లాంటిదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఐఐటి-బిహెచ్‌యు విద్యార్థినిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వీడియో తీసిన ఘటనను యాదవ్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. बांदा में एक दलित के साथ बलात्कार व जघन्य हत्या की जो ख़बर आई है, वो दिल दहला देने वाली है। उप्र की महिलाएं डरी हुई हैं और अंदर-ही-अंदर आक्रोशित भी। साथ ही आईआईटी बीएचयू की महिला छात्रा के साथ अभद्रता के बाद निर्वस्त्र कर वीडियो बनाने की घटना उप्र की क़ानून-व्यवस्था के मुँह पर… pic.twitter.com/g96iu9MFIK — Akhilesh Yadav (@yadavakhilesh) November 2, 2023 -
‘ఇండియా’ భారత్ అంత ఐక్యంగా ఉండాలేమో సార్!
‘ఇండియా’ భారత్ అంత ఐక్యంగా ఉండాలేమో సార్! -
వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్
లక్నో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’అధికార బీజేపీని ఓడిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీతోపాటు మిత్ర పక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2024లో బీజేపీని ఇండియా ఓడించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాలు ఎన్నికలు ముందొచ్చినా, తర్వాత వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని మీడియాతో అన్నారు. -
సొంతంగా ఎదుగుతాం.. కలిసొస్తే ఆదరిస్తాం!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఏ ఇతర పార్టీకి ఏ టీమో, బీ టీమో కాదని.. భారత్‌లో గుణాత్మక మార్పు కోసం సొంతంగా జాతీయ స్థాయిలో ఎదిగేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీ మినహా ఇతర భావసారూప్య పార్టీలను కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం రాష్ట్రానికి వచ్చిన యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాల గురించి సుమారు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం. పట్నా సమావేశం వివరాలపై.. అఖిలేశ్ యాదవ్ గత నెల 23న బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు వివరించారని తెలిసింది. బీఆర్ఎస్ సహా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని తాము బలంగా కోరుకుంటున్నామని చెప్పారని.. పట్నా భేటీలో పలువురు నేతలు ఈ విషయాన్ని నొక్కి చెప్పారని వివరించినట్టు సమాచారం. బీఆర్ఎస్ను ఆహ్వానిస్తే పట్నా సభకు తాము హాజరుకాబోమని తేల్చి చెప్పామంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దీనితో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానాల వల్లే బీజేపీ రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. రాహుల్ గాంధీ పరిణతి లేని వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ మరింత పలుచన అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. యూపీలో సమాజ్‌వాదీ చీలికకు కుట్ర! మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎన్సీపీని చీల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కేసీఆర్, అఖిలేశ్ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. మహారాష్ట్ర తరహాలో యూపీలో సమాజ్‌వాదీ పార్టీని చీల్చి, విపక్షాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అఖిలేశ్ పేర్కొన్నట్టు సమాచారం. దీనితో గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించగా, తాము అడ్డుకున్నామని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. జాతీయ స్థాయికి బీఆర్ఎస్.. ఇక ఈ నెల మూడో వారంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగే విపక్షాల భేటీ అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే మహారాష్ట్రలో అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు. నాగ్‌పూర్ నుంచి షోలాపూర్ దాకా బీఆర్ఎస్ నిర్వహించిన సభలకు మంచి స్పందన వచ్చింది. మధ్యప్రదేశ్‌లోనూ మా పార్టీ కార్యాచరణ ప్రారంభమైంది. త్వరలోఅక్కడ పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒడిశాలో మాజీ సీఎం కూడా బీఆర్ఎస్లో చేరారు. పార్లమెంటు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతుంది. ఆ దిశగా మేం సాగిస్తున్న ప్రస్థానంలో కలసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొనిపోతాం’’ అని అఖిలేశ్‌కు కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అఖిలేశ్‌కు ఘన స్వాగతం...వీడ్కోలు యూపీలోని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్ యాదవ్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. తర్వాత జరిగిన లంచ్ భేటీలో కేసీఆర్, అఖిలేశ్లతోపాటు మంత్రులు వేముల, తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. భేటీ తర్వాత సాయంత్రం 5.15కు అఖిలేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో బయలుదేరగా.. విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్సీ వీడ్కోలు పలికారు. -
ఎన్నికలకు ఫార్ములా రెడీ, ఇక రంగంలోకి దూకడమే..
లక్నో: త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజీపీని ఓడించాలంటే విపక్షాలు ఐక్యంగా పోరాడటమొక్కటే మార్గమన్నారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఈ సందర్బంగా ఐక్య ప్రతిపక్ష కూటమి విధానాలపై తమ పార్టీ ధృక్కోణాన్ని వివరిస్తూ 80 మందిని ఓడించి, బీజేపీని తరిమికొట్టండని నినదించారు. 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దారుణ ఓటమి తప్పదని.. బీసీలు, దళితులు, మైనారిటీలే బీజీపీని ఓడిస్తారన్నారు అఖిలేష్ యాదవ్. ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మా దగ్గరొక ఫార్ములా ఉంది. ఐక్య ప్రతిపక్ష కూటమి నుండి పెద్ద జాతీయ పార్టీలు మాకు మద్దతిస్తే 80 మంది బీజేపీ ఎంపిలను ఓడిస్తాం.. బీజేపీని తరిమికొడతాం. అందుకే యూపీలో "80 గెలుద్దాం, బీజేపీని తరిమేద్దాం.." అన్న నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నామని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలన్న సంకల్పంతో ఐక్య ప్రతిపక్ష కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సమాజ్ వాది పార్టీ గతంలో కూడా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రస్తావన తీసుకురాగా తామెప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిజాయతీగానే వ్యవహరించామని ఎప్పుడూ సీట్ల కోసం పట్టుబట్టలేదని గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు -
విపక్ష కూటమి తథ్యం: అఖిలేశ్
ఇండోర్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
2024లో అమేథీ నుంచి పోటీ చేస్తాం!
లక్నో: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. అక్కడ పేద మహిళల పరిస్థితి దారుణంగా మారిందని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కణ్నుంచి ఎంతోమంది ప్రముఖులు లోక్‌సభకు ఎన్నికవుతున్నప్పటికీ పేదల బతుకులు మాత్రం మారడం లేదని వాపోయారు. ఇక యూపీలోని ఇతర ప్రాంతాల్లో ప్రజల జీవితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ‘‘అందుకే, వచ్చే ఎన్నికల్లో అమేథీలో బడా నాయకులు కాకుండా మంచి మనసున్న వ్యక్తులు గెలుస్తారు’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. అమేథీలో పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఆ స్థానాన్ని సమాజ్‌వాదీ ప్రతిసారీ కాంగ్రెస్‌కు వదిలేస్తోంది. అక్కడ ప్రస్తుతం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎంపీగా ఉన్నారు. ఆమె 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించారు. -
యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ..అఖిలేష్ యాదవ్ ట్వీట్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. యోగి ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితిపై విమర్శల గుప్పిస్తూ.. ఓ వివాహ వేడుకలో జరిగిన వివాదం ఇందుకు నిదర్శనం అంటూ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వివాహంలో డీజే విషయమై వివాదం వచ్చింది. అందులో కొందరూ కర్రలతో, బెల్ట్‌లు, కుర్చిలతో దాడి చేసుకుంటున్నారు. అక్కడే ఉన్న కొందరూ మహిళలు వారిని ఆపేందుకు యత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఐతే పోలీసులు ఆ ఘటనకు సంబంధించి వ్యక్తులను గుర్తించి ఆరోపణలు మోపి కేసు నమోదు చేయడమే గాక 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఈ నెల ఫిబ్రవరి 26న ముస్సోరి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అఖిలాష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఒక వివాహ వేడుకలో జరిగిన రభసే అందుకు ఉదహరణ అని ట్వీట్ చేశారు. కాగా, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిని బహిరంగంగా హతమార్చడంపై యోగి ఆధిత్యానథ్ని ప్రశ్నించిన ఒక రోజు తర్వాతే ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd — Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023 (చదవండి: ప్లీనరీ ముగింపు సమావేశంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం: మరో యాత్రకు సై!) -
సీఎం యోగి Vs అఖిలేష్: యోగి మాస్ వార్నింగ్..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా చంపడంపై సభలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ సందర్భంగా సీఎం యోగి.. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే, రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్.. తన నివాసంలో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడిచేసి, కాల్పులు జరపడంతో ఆయన మృతిచెందారు. అయితే, యూపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ దారుణ ఘటనపై యోగి సర్కార్‌పై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సభలో ఫైర్ అయ్యారు. ఉమేశ్ హత్యలో గ్యాంగ్ వార్ వంటి పరిస్థితి కనిపించదన్నారు. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగి కౌంటర్ ఇచ్చారు. సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బాధితుల కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వ్యక్తి, మాజీ ఎంపీ అని అన్నారు. మీరు (సమాజ్‌వాదీ పార్టీ) నేరస్తులకు మద్దతిస్తున్నారు. వారికి పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాఫియాలో అతిక్ అహ్మాద్ కూడా భాగమే. ఇలాంటి చర్యలను మేము అసలు సహించమని అన్నారు. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ సమయంలోనే సీఎం యోగి సంచలన ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్ మాఫియాకు గాడ్‌పాధర్ అంటూ ఆయన వైపు వేలు చూపిస్తూ యోగి కామెంట్స్ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో అఖిలేష్ యాదవ్ సభలో మాట్లాడారు. ‘నేరస్థులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. 2015లో రాజు పాల్ హత్య జరిగింది. అయితే, రాజు పాల్.. అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. ఇక, ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను రాజు పాల్ ఓడించారు. మరోవైపు.. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులుగా ఉండటం గమనార్హం. Akhilesh yadav chup maarke baith gaya 🤣😹 pic.twitter.com/8Lx4SOuRwb — BALA (@erbmjha) February 25, 2023 -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి: అఖిలేష్ యాదవ్
-
కేంద్రానికి కౌంట్‌డౌన్ మొదలైంది: బీఆర్ఎస్ సభలో అఖిలేశ్
సాక్షి, ఖమ్మం: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయి. రోజులు లెక్కపెడుతోందంటే ఆ ప్రభుత్వం ఇక ఉండదని అర్థమవుతోంది. బీజేపీ బ్రహ్మజన్ పార్టీ. పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ అని యూపీ మాజీ సీఎం సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం పని ఎక్కువ చేసి.. తక్కువ ప్రచారం చేసుకుంటోందన్నారు. కేంద్రంలో కేసీఆర్‌తో కలిసి కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన ప్రసంగించారు. ‘బీజేపీ ప్రభుత్వం దేశంలోని విపక్ష ప్రభుత్వాలన్నింటినీ ఇబ్బందిపెడుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్‌ను కూడా ఇబ్బందుల పాలుచేస్తోంది. నాయకులను ఆందోళనకు గురిచేస్తూ కుట్రలకు పాల్పడుతూ ఒత్తిడికి గురిచేస్తోంది. న్యాయవ్యవస్థలు, దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఖమ్మం బహిరంగ సభ దేశానికి దిశానిర్దేశం చూపుతుంది. తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో చరిత్ర సృష్టించారు. దేశ యువత నిరుద్యోగంతో ఇబ్బందులుపడుతుండగా, రైతులు నష్టాల పాలవుతున్నారు. గుజరాత్ నుంచి యూపీకి వచ్చి ప్రధానమంత్రి అయిన మోదీ.. యూపీకి ఏమీ చేయలేదు. ఇక్కడి ప్రజలను మోసం చేశారు. గంగానది ప్రక్షాళన ఎక్కడి గొంగళి ఆక్కడే అన్నట్లు ఉంది. తెలంగాణలో బీజేపీని తరిమికొట్టండి. యూపీలో కూడా ఆ పార్టీని వెళ్లగొడతాం. సీఎం కేసీఆర్ అమలుచేసే ఇంటింటికీ తాగునీరు, పంటలకు సాగునీరు వంటి మంచి పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది. బీజేపీ చెప్పింది చేయకపోగా అభివృద్ధిని వెనకకు తీసుకెళ్తోంది. దేశాన్ని బీజేపీ నుంచి రక్షించే కొత్త ప్రభుత్వం కోసం మేమంతా కలిసి పనిచేస్తాం. సీఎం కేసీఆర్.. భగవాన్ విష్ణు నర్సింహస్వామి ఆలయా (యాదాద్రి)న్ని అద్భుతంగా నిర్మించారు. ఖమ్మం బహిరంగ సభలో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు’ అని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. -
బీఆర్ఎస్ సభ: 2024లో మోదీ ఇంటికి.. మేము ఢిల్లీకి: కేసీఆర్
Upadates: Time 5.45 PM చివరగా అథితులుగా వచ్చిన సీఎంలు, నేతలకు ఘన సత్కారంతో సభను ముగించారు. Time 5. 40 PM దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ భేరి ఒక సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఫర్వాలేదు.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తాము. అగ్నిపథ్‌కు కూడా రద్దు చేస్తాము. ఎల్ఐసీని ప్రభుత్వపరం చేస్తాము. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషనలైజేషన్. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ అందిస్తాము. Time 5.20 PM కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. Time 4.41 PM భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు?. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్ నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని డి. రాజా పేర్కొన్నారు. Time 4.02 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. Time 3.56 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని కేరళ సీఎం ప్రకటించారు. Time: 3.35 PM సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్, డి. రాజా ఉన్నారు. Time: 2.30 PM ►రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జాతీయ నేతలు, సీఎంల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. Time: 02.00PM ►యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత చాంబర్లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. అనంతరం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ నేతల చేతులమీదుగా కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు. Time: 12.30PM సీఎం కేసీఆర్‌తో కలిసి ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. తరువాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. Time: 11.30AM ► తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర జాతీయ నేతలు యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం తర్వాత ఖమ్మం సభకు నేతలు వెళ్లనున్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్, సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దైవ దర్శనానికి వెళ్లలేదు. గెస్ట్‌హౌజ్‌లోనే ఉండిపోయారు. సాక్షి, ఖమ్మం: చారిత్రక సభకు ఆతిథ్యమిచ్చేందుకు ఖమ్మం సిద్ధమైంది. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండడంతో సభావేదిక, చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నగరమంతా గులాబీ నగిషీలు తొడుక్కుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సారథ్యాన ఏర్పాట్లు పూర్తి కాగా, మరోపక్క నూతన కలెక్టరేట్ సముదాయం పుష్పగుచ్ఛంలా ముస్తాబైంది. ముఖ్యఅతిథులు తొలుత కలెక్టరేట్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటివెలుగును ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించాక ఆవిర్భావ సభకు హాజరవుతారు. జాతరలా తరలివచ్చేలా.. బీఆర్ఎస్ తొలి సభ ఖమ్మంలో ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి పార్టీ యంత్రాంగం జన సమీకరణకు సర్వశక్తులొడ్డుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆరుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 18 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తొలి సభ కావడం, నాలుగు రాష్టాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు వస్తుండడంతో విజయవంతాన్ని ఈ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదిక ప్రత్యేకతలు.. సభా ప్రాంగణం : 100 ఎకరాలు వేదిక : జర్మనీ టెక్నాలజీ వాటర్, ఫైర్ రూఫ్ (గులాబీరంగు) హాజరయ్యే జనం (అంచనా : 5 లక్షలు ప్రాంగణంలో కుర్చీలు : లక్ష వేదికపై కూర్చునేది : సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్‌సింగ్‌మాన్, మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం, పీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు సభావేదిక ముందు: ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య అతిథులు అధ్యక్షత : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేది: సీఎంలు పినరయ్ విజయన్, భగవంత్ సింగ్మాన్, కేజ్రీవాల్,అఖిలేష్ యాదవ్, డి.రాజా, చివరన సీఎం కేసీఆర్ సభా సమయం : మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు. సీఎంల పర్యటన షెడ్యూల్ ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బీఆర్ఎస్ తొలి సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఖమ్మం రానున్నారు. వీరి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ► సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ► సీఎం కేసీఆర్‌తో కలిసి బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరి 10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుంటారు. అక్కడ 10.40గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాక 11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ► ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తోపాటు కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ► మధ్యాహ్నం 2.25 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బీఆర్ఎస్ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. ► ఈ సభలో తొలుత ముందుగా సీఎం పినరయి విజయన్ మాట్లాడగానే హెలీకాప్టర్‌లో విజయవాడ బయలుదేరతారు. ఆ తర్వాత మిగతా అతిథులు ప్రసంగిస్తారు. సభ ముగిశాక కేజ్రీవాల్, భగవంత్ మాన్ సాయంత్రం 5 గంటలకు, ఆతర్వాత అఖిలేష్ యాదవ్ విజయవాడ వెళ్లి అక్కడి నుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు వెళ్తారు. ► సీఎం కేసీఆర్ కూడా ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరతారు. తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు ఖమ్మం నగరాన్ని పోలీసులు గుప్పిట్లోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తదితరులు వస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండడంతో పంజాబ్, ఢిల్లీకి సంబంధించిన సీఎంల సెక్యూరిటీ వింగ్ అధికారులు చేరుకుని సభావేదిక, ప్రాంగణం, నూతన కలెక్టరేట్‌ను పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో నలుగురు సీఎంలు తొలిసారి ఒకే వేదికపైకి రానుండడంతో నిఘా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలను తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లు పర్యవేక్షిస్తుండగా, 5,210 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కాగా, కలెక్టరేట్ నుంచి పది వాహనాలతో సభావేదిక వద్దకు కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అలాగే, పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌తో పాటు పోలీసు కమిషనరేట్‌లో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేశారు. నిఘా నీడలో ఖమ్మం! బీఆర్ఎస్ సభ సందర్భంగా నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలే కాకుండా ఐదు లక్షల మంది మేర కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి నుంచి పోలీసు సిబ్బందికి విధులు కేటాయించగా వారంతా జిల్లాకు చేరుకున్నారు. వీరిలో డీఎస్పీ ఆపైస్థాయి అధికారులకు గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస ఏర్పాటు చేయగా మిగతా వారికి కళ్యాణమండపాలు, హాస్టళ్లలో వసతి కల్పించారు. అలాగే, నగరంలోని వాసవీ గార్డెన్స్, మంచికంటి భవన్, తనికెళ్ల, బైపాస్‌రోడ్లలోని ఫంక్షన్ హాళ్లలో మెస్‌లు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు 5,200మంది ఖమ్మంతోపాటు ఇతర జిల్లాలనుంచి సుమారు 5,210మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఇందులో ఏఎస్పీలు పది మంది, ఏసీపీలు 39, సీఐలు, ఆర్ఐలు 139మంది, ఎస్సైలు 409మంది, ఏఎస్సైలు 530మంది, కానిస్టేబుళ్లు 1,772మంది, మహిళా కానిస్టేబుళ్లు 169మంది, హోంగార్డులు 1,005 మందితో పాటు స్పెషల్ పార్టీలు, రోప్ పార్టీ సిబ్బంది ఉన్నారు. ఇక భారీగా జనం హాజరుకానుండడంతో పిక్ పాకెటర్లు, పాత నేరస్తులపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి 150మంది ఇంటిలెజెన్స్ సిబ్బంది చేరుకోగా, వీరిలో ఐజీ స్థాయి మొదలు ఉద్యోగులు ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి బహిరంగ సభకు వివిధ జిలాల్ల నుంచి కార్యకర్తలు హాజరుకానుండడంతో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించగా, అక్కడ వాహనాలు నిలిపి సభకు వెళ్లేలా సూచనలు చేశారు. అలాగే, వాహనాలు వచ్చివెళ్లే మార్గాలను కూడా ప్రకటించారు. రహదారులు, బ్రిడ్జిలపై వాహనాలు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే పక్కకు తొలగించేలా బోయింగ్ వాహనాలు సిద్ధం చేశారు. ప్రారంభానికి ముస్తాబు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ – ఐడీఓసీ) ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మూడు రాష్ట్రాల సీఎంలు కలెక్టరేట్‌తో పాటు ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగును బుధవారం ప్రారంభించనుండడంతో మంగళవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐడీఓసీ మొత్తాన్ని అందంగా పూలతో అలంకరించి లైట్లు అమర్చడంతో రాత్రివేళ జిగేల్మంటూ కనిపించింది. సీఎంలు, ఇతర ముఖ్యులు కలెక్టరేట్లోనే మధ్యాహ్న భోజనం చేయనుండడంతో మొదటి అంతస్తు స్టేట్ చాంబర్ పక్కనే ఉన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) చాంబర్లో ఏర్పాట్లు చేశారు. -
'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో టీ తాగేందుకు నిరాకరించారు ఎస్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. పోలీసులపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. టీలో విషం కలిపి ఇస్తారేమో? అని వ్యాఖ్యానించారు. తాను బయటి నుంచి టీ తెప్పించుకుంటానని అన్నారు. అవసరమైతే కప్పు మాత్రం తీసుకుంటానన్నారు. ఆదివారం ఉదయం లక్నోలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లి అఖిలేశ్ ఇలా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया। उन्होंने कहा,"हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।" (वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82 — ANI_HindiNews (@AHindinews) January 8, 2023 సమాజ్‌వాదీ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసే మనీశ్ జగన్ అగర్వాల్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మనీశ్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలేశ్ యాదవ్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అతడ్ని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చదవండి: 'ఉత్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..' -
‘బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే’.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు
లఖ్‌నవూ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలన్న కాంగ్రెస్ పిలుపును తోసిపుచ్చారు. జోడో యాత్రకు దూరంగా ఉండిపోయారు. ఈ అంశంపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీజేపీల సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు. ‘మా పార్టీ సిద్ధాంతం భిన్నమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. మీ ఫోన్‌కు ఆహ్వానం వచ్చి ఉంటే నాకు పంపించండి. వారి యాత్రతో మా మనోభావాలు ఉన్నాయి. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ’అని పేర్కొన్నారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు.. యూపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న తరుణంగా ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి -
అఖిలేశ్, మాయవతిలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం!
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న యాత్ర త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. అందులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బహజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు.. లఖ్‌నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మను సైతం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 3న ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర. గాజియాబాద్ జిల్లాలోని ’లోని’ ప్రాంతంలో ప్రారంభమై బాఘ్‌పత్, శామిలి జిల్లాల మీదుగా హరియాణాలోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజల మనసులను తెలుసుకునేందుకు యాత్ర ఒక్కటే మార్గమని సూచించారు. ప్రస్తుతం విపక్షం మొత్తం ఈ ప్రభుత్వంపై ఒకే ఆలోచన ధోరణిలో ఉందని, అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
యూపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. సీఎం యోగి సీటుకు ఎసరు పెట్టిన అఖిలేష్?
ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీటుకే ఎసరు పెట్టారు. దీంతో, యూపీ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన రాంపూర్ ఎంపీ స్థానంలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారికి అఖిలేష్ యాదవ్ బంపరాఫర్ ఇచ్చారు. వాళ్లకు ఆఫర్ ఇచ్చేందుకు మేం ముందుకొచ్చాం. మా నుంచి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకోండి. మేం మీ వెంట ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం అవ్వండి అని కామెంట్స్ చేశారు. దీంతో, యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, అఖిలేష ఆఫర్‌పై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఆఫర్‌ను నేను తిరస్కరిస్తున్నాను. అఖిలేష్ యాదవ్ ఎప్పటికీ సీఎం కాలేదు. అఖిలేష్ ముందుగా.. తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమాజ్‌వాదీ పార్టీలో గూండాలు ఉన్నందున వారిని మా పార్టీలోకి తీసుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక, రాంపూర్ ఉప ఎన్నికలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి. "SP chief Akhilesh Yadav, you will not be able to become the chief minister, nor will you be able to make anyone (Chief Minister)," Uttar Pradesh Dy CM Keshav Prasad Maurya said. https://t.co/nYKynmoDPM — The New Indian Express (@NewIndianXpress) December 2, 2022 -
బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..
లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్‌పురి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది. ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్‌పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్‌పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్‌తో జతకట్టారు. కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. #WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022 -
తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయిన మరునాడే ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టారు అఖిలేశ్ యావద్. ఆయన లేని తొలి రోజు సూర్యుడు ఉదయించకుండానే తెల్లవారినట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ములాయం అంత్యక్రియలకు సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేశారు. आज पहली बार लगा… बिन सूरज के उगा सवेरा. pic.twitter.com/XlboMo8G2V — Akhilesh Yadav (@yadavakhilesh) October 12, 2022 ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యావద్(82) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం సైఫాయ్‌లో మంగళవారం నిర్వహించారు. భారీ జనసందోహం, అశ్రునయానాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. ములాయం అంత్యక్రియలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అఖిలేశ్ యాదవ్‌కు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానభూతి తెలిపారు. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్ -
అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరిగాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది. అంతకుముందు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ములాయం భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది వెళ్లారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకున్నారు. అనంతరం ములాయం భౌతికకాయాన్ని ఓ వాహనంలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3 — ANI (@ANI) October 11, 2022 గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశంలోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం భౌతికకాయాన్ని హోంమంత్రి అమిత్‌షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మూడుసార్లు సీఎంగా, రక్షణమంత్రిగా పనిచేసిన మూలయంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగాను ఆయన ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు. సొంత కుమారుడు, సీఎం హోదాలో ఉన్న అఖిలేశ్ యాదవ్‌నే ఓ సారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ములాయం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2012లో మొదలు 2012లో అఖిలేశ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. అయితే అఖిలేశ్ సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీలో కొందరు స్వాగతించగా.. ములాయం, ఆయన సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మాత్రం వ్యతిరేకించారు. తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను సీఎం చేయాలని ములాయం భావించడమే ఇందుకు కారణం. అంతేకాదు ఆ సమయంలో తన బాబాబ్ అయిన శివ్‌పాల్‌ను అఖిలేశ్ రెండు సార్లు కేబినెట్ నుంచి తొలగించారు. దీంతో కుటుంబ కలహాలు మరింత ముదిరాయి. అఖిలేశ్‌తో ములాయంకు, శివపాల్ యాదవ్‌కు దూరం పెరిగింది. సంచలన నిర్ణయం సమాజ్‌వాదీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో 2016లో సంచలన నిర్ణయం తీసుకున్నారు ములాయం సింగ్. తన కుమారుడు, సీఎం అఖిలేశ్ యాదవ్, తన బంధువు రామ్ గోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ రెండుగా చీలిపోకుండా కాపాడేందుకు, తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. కానీ ఆ మరునాడే సీఎం అఖిలేశ్ యాదవ్ తన బలమేంటో నిరూపించుకున్నారు. వెంటనే తన నేతృత్వంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ భేటికి మొత్తం 229 ఎస్పీ ఎమ్మెల్యేల్లో 200మంది హాజరయ్యారు. అలాగే కొందరు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అఖిలేశ్ యాదవ్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ వేలాది మంది సీఎం కార్యాలయం ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు అప్పుడు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్‌తో అఖిలేశ్, రామ్ గోపాల్ యాదవ్ వర్గం బాహాబాహీకి దిగింది. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెనక్కితగ్గి.. అయితే పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ములాయం సింగ్ వెంటనే అప్రమత్తయ్యారు. తన కుమారుడు అఖిలేశ్, సోదరుడు రామ్ గోపాల్‌పై సస్పెన్షన్‌ను 24 గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. ములాయంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2017 కొత్త ఏడాదికి ముందు ఇదంతా జరిగింది. కానీ పార్టీలో అంతర్గత విభేదాలు అక్కడితో ఆగిపోలేదు. 2017 జనవరి 1న జరిగిన పార్టీ జాతీయ సదస్సులో అఖేలిశ్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు రామ్ గోపాల్ యాదవ్. అప్పటికే ఆ పదవిలో ములాయంను పార్టీ సంరక్షుడి పదవికి పరిమితం చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించారు. మరో షాక్.. ములాయం సింగ్ యాదవ్ మాత్రం వీటికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడైన తాను లేకుండా ఈ సమావేశం నిర్వహించడం అక్రమం అన్నారు. తానే సమాజ్ పార్టీ అధినేత అని, అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అని, శివ్‌పాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాత్రం అఖిలేశ్ యాదవ్‌నే సమర్థించింది. ఆయన వర్గానికే ఎస్పీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఇదంతా జరిగింది. ఈసీ నిర్ణయం అనంతరం తాను కొత్తగా సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని స్థాపిస్తానని, ములాయం సింగ్ యాదవ్ దానికి నేతృత్వం వహిస్తారని శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. కానీ.. కొన్ని నెలల తర్వాత తాను కొత్త పార్టీ స్థాపించడం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలిపోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. చివరకు శివ్‌పాల్ యాదవ్ మాత్రం ఎస్పీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2018 ఆగస్టులో ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. కానీ అనూహ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేష్ యాదవ్ కూటమిలోనే చేరారు. ఎస్పీ గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. చదవండి: అర్బన్ నక్సల్స్ గుజరాత్లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త! -
సొంతంగా కారు కూడా లేదు.. ములాయం సింగ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి, మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు అక్టోబర్ 11(మంగళవారం) సౌఫయ్ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు. ములాయం సింగ్ ఆస్తులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ములాయం సింగ్ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు. చదవండి: ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బీఎఫ్సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566. చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు! కారు లేదు, కొడుకు నుంచి అప్పు ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు. ఎస్పీలో విషాదఛాయలు ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా 22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా! ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. -
ములాయం సింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనారోగ్యంత గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్‌కు మొదట ప్రవేటు వార్డులో చికిత్స అందించారు వైద్యులు. అయితే అకస్మాతుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం హూటాహుటిన ఐసీయూకు తరలించారు. దీంతో అఖిలేశ్ సహా ఇతర కుటుంబసభ్యులంతా ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్ ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు. ఆయనను చూసేందుకు ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక -
‘కేంద్రంలో అధికార మార్పునకు అదే సంకేతం’
లక్నో: బిహార్‌లో ఎన్డీఏ కూటమి అధికార పీఠాన్ని చేజార్చుకుందని, ఈ పరిణామం హస్తినలో అధికార మార్పునకు శుభసూచక మని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే బలమైన జాతీయస్థాయి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అఖిలేశ్ లక్నోలో పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సరిసాటి అయిన ప్రత్యామ్నాయ కూటమి అవతరిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వీపీ సింగ్‌ల నాటి స్వల్పకాలిక కూటమి ప్రభుత్వాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సుస్థిర, అభివృద్ది చోదక, ప్రభావవంతమైన నాయకత్వంలో కొనసాగే ప్రభుత్వాన్నే ప్రస్తుతం దేశం కోరుకుంటోంది’ అని అఖిలేశ్ అన్నారు. మీరు కోరింది ఇదేగా: రవిశంకర్ ప్రసాద్ ‘సుధృఢ ప్రభుత్వం కావాలనేదే మీ అభిలాష. ప్రధాని మోదీ సారథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అదే’ అంటూ అఖిలేశ్‌నుద్దేశిస్తూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. -
సర్వజ్ఞాని కోసమే వేడుకలు ఎత్తేశారు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తప్పక నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను మోదీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రద్దుచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘సెంట్రల్ హాల్ వేడుకలు అంతర్థానమవుతున్నాయి. సర్వజ్ఞాని కీర్తి ప్రతిష్టలు పెంచడం పైనే దృష్టిపెట్టారు. ఇదంతా ఆ సర్వజ్ఞాని పుణ్యమే’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘గతంలో 25వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సెంట్రల్ హాల్లో ప్రత్యేకంగా జరిగాయి. అలాగే 50వ, 60వ వేడుకలూ కొనసాగాయి. దురదృష్టంకొద్దీ ఈ సారి బీజేపీ సర్కార్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హాల్లో రద్దుచేసింది. సర్వజ్ఞానికే పేరొచ్చేలా వ్యవహరిస్తోంది. ఆ జ్ఞాని ఎవరో అందరికీ తెలుసు’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ విధానంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవడం కొనసాగుతోంది. చీకటి కోణాన్ని దాచేందుకే.. : అఖిలేశ్ బీజేపీ తనలోని చీకటి కోణాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా హర్ ఘర్ తిరంగా అని నినదిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ‘ స్వాతంత్య్రం సిద్ధించాకా జాతీయ జెండాను, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంగీకరించలేదు. బ్రిటిష్‌వారికి అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి ఆర్ఎస్ఎస్–బీజేపీ తమ చరిత్రలోని చీకటి అధ్యాయాలను వెనుక వైపు దాచేస్తూ ముందువైపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అఖిలేశ్ అన్నారు. -
నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్
Akhilesh Yadav.. బీహార్‌లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్‌కు ప్లాన్ చేస్తన్నారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ ఇంట తేజస్వీ యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. బీహార్‌లో రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా పొలిటికల్ చర్చ నడుస్తోంది. తాజాగా నితీష్ కుమార్ రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. "ఇది మంచి ప్రారంభం. నాడు 'అంగ్రేజో భారత్ చోడో'(ఆంగ్లేయులకు భారత్ నుంచి తరిమి కొట్టండి) నినాదం ఇవ్వబడింది. నేడు బీహార్ నుండి 'బీజేపీ భగావ్'(బీజేపీని వెళ్లగొట్టండి) అనే నినాదం వస్తోంది. త్వరలోనే రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని నేను భావిస్తున్నాను." అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. నితీష్ కుమార్ రాజీనామాపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇక, బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. ఇది నితీష్ జీ తీసుకున్న నిర్ణయం. మేము(బీజేపీ) ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని అనుసరిస్తాము. కూటమి గౌరవాన్ని కాపాడుతున్నాము" అని అన్నారు. It's a good start. On this day the slogan of 'Angrezo Bharat Chhodo' was given and today the slogan of 'BJP Bhagaon' is coming from Bihar. I think soon political parties and people in different states will stand against BJP: SP chief Akhilesh Yadav on political situation in Bihar pic.twitter.com/UXhlfWAhDx — ANI (@ANI) August 9, 2022 ఇది కూడా చదవండి: హీటెక్కిన బీహార్ పాలిటిక్స్.. తేజస్వీ యాదవ్‌కు కీలక పదవి! -
అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం
అయోధ్య: అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్, మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది భూకుంభకోణానికి పాల్పడినట్లు అయోధ్య అభివృద్ధి అథారిటీ(ఏడీఏ) ఆరోపించింది. వీరంతా స్థానికంగా ఇళ్ల ఫ్లాట్ల అక్రమ క్రయవిక్రయాలకు పాల్పడంతోపాటు, అనధికారికంగా కాలనీలను నిర్మించినట్లు ఏడీఏ తెలిపింది. కుంభకోణంతో సంబంధమున్న మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గోరఖ్‌నాథ్ బాబా తదితర 40 మంది పేర్లను శనివారం విడుదల చేశామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ చెప్పారు. వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కాషాయపార్టీ అవి నీతి నీడ పడకుండా కనీసం అయోధ్యనైనా కాపాడాలన్నారు. బీజేపీ నేతలు అయోధ్యలో 30 వరకు కాలనీలను అక్రమంగా ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఖజానాకు వందలాది కోట్ల రూ పాయల నష్టం కలిగించారని ఆరోపించారు. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ? -
ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి అఖిలేశ్
లక్నో: ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్‌ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజం ఖాన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, ఆస్పత్రిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు చెప్పారు. చదవండి: దర్యాప్తు సంస్థల దుర్వినియోగమే.. పార్లమెంట్లో రగడ -
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
-
హస్తిన వ్యూహం: అఖిలేష్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. గడిచిన ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం కేసీఆర్. తన ఇంట్లోనే పలువురు ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులతో చర్చలు జరిపారు. చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సింధియా సంచలన వ్యాఖ్యలు -
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్
-
ఈడీకి కౌంటర్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్.. రెస్పాన్స్ ఎలా ఉండనుంది?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయంలో ఈడీ దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడుల విషయంలో కూడా సుప్రీంకోర్టు వారికి మద్దతుగానే వ్యాఖ్యలు చేసింది. కానీ, ఈడీ దాడులపై ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఈడీని కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలను వేధించడానికే వాడుకుంటున్నదని విమర్శించారు. ఈడీ స్వతహాగా దాడులు చేస్తే.. బీజేపీ నేతలకు సంబంధించిన అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఈడీ ఎందుకు బయటకు తీయడంలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన నాలుగు రోజులకే వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. కాగా, ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదని అఖిలేష్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేత హత్య.. కేరళ నుంచి కుట్ర జరిగిందా? -
‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి డబుల్ షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఝలక్ తగిలింది. ఇచ్చింది ఎవరో కాదు.. ఆయన సొంత బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కాదని.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్సీ కూటమి పార్టీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. శుక్రవారం రాత్రి సీఎం యోగి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు ఇద్దరూ. ‘‘సమాజ్‌వాదీ పార్టీ నన్నేం పిలవలేదు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థికి ఓటేయమనీ అడగలేదు. సీఎం యోగి ఆదిత్యానాథ్ నన్ను ఆహ్వానించి.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని అడిగారు. అందుకే అంగీకరించాం’’ అని బాబాయ్-అబ్బాయ్ మధ్య నెలకొన్న గ్యాప్‌ను మరోసారి బయటపెట్టారు శివపాల్ యాదవ్. అఖిలేష్‌కు సరైన రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే.. తనను కీలక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, అందుకే కూటమిలోని పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయని శివపాల్ యాదవ్ మండిపడ్డారు. అఖిలేష్ గనుక నా సలహాలు గనుక పాటించి ఉంటే.. ఎస్పీ పరిస్థితి యూపీలో ఇవాళ మరోలా ఉండేదన్నారు ఆయన. ఇక ద్రౌపది ముర్ముకు మద్ధతు విషయంపై రాజ్‌భర్ కూడా స్పందించారు. ఎస్పీతో కూటమిలోనే తాము కొనసాగుతామని, ఒకవేళ అఖిలేష్ గనుక బలవంతంగా వెళ్లిపొమ్మంటే బయటకు వచ్చేస్తామని ప్రకటించారాయన. ముర్ముకు మద్దతు విషయం పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారాయన. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయమై.. గురువారం అఖిలేష్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ.. కూటమి పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రగతీశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు సైతం ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి.. తమవైపు తిప్పుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ సొంత బాబాయ్ అయిన శివపాల్ యాదవ్.. 2012-17 అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్న టైంలో ‘నెంబర్ టూ’గా కొనసాగారు. 2018లో అఖిలేష్‌తో పొసగక బయటకు వచ్చి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే.. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అబ్బాయితో కలిసి చేతులు కలిపారాయన. ఆ ఎన్నికల్లో.. జశ్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు శివపాల్ యాదవ్. అయితే ఆయన నెగ్గింది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గుర్తు మీదే కావడం గమనార్హం. మరోవైపు ఓంప్రకాశ్ రాజ్‌భర్ ఎస్బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు నెగ్గింది. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదంటూనే.. అఖిలేష్‌పై ఓంప్రకాశ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అఖిలేష్‌యాదవ్‌కు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఓంప్రకాశ్. 2012 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యింది కూడా కేవలం తండ్రి ములాయం వల్లేనని, అఖిలేష్ నిజానికి అంత అర్హత ఉన్నోడు కాదంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఓంప్రకాశ్. -
అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్! దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
లక్నో: మహ్మద్ ప్రవక్త పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి కార్చిచ్చులా రగిలిపోతుందే తప్ప ఇప్పట్లో ఎక్కడా చల్లబడేటట్లు లేదు. అల్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, సహారన్పూర్లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన వెంటనే నిరసనకారులు పోలీస్‌స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక గుంపు కొన్ని మోటార్‌సైకిళ్లను, బండ్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ప్రయోగించక తప్పలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే నిమ్మితం తొమ్మిది మంది పై గట్టిగా లాఠీ ఝళిపించారు. ఐతే ఈ ఘటన తాలుకా వీడియోని బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్ మీడియాలో ఇది "అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్" అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరు పై, బీజేపీ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.."ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పైగా ఇలాంటి పోలీస్స్టేషన్లను గట్టిగా నిలదీయాలి. కస్టడీ మరణాల్లో యూపీనే నెంబర్ వన్. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘన, దళితులపై వేధింపుల్లో కూడా యూపీనే అగ్రగామిగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ పోలీసు ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి సుమారు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. (చదవండి: బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?) -
సభలో యోగితో నవ్వులు పూయించిన అఖిలేష్.. అంతలోనే..!
లక్నో: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సభలో నవ్వులు పూయించారు. సీఎం యోగి సైతం విరగబడి నవ్వుకున్నారు. 25 కోట్ల జనాభా కలిగిన పెద్ద రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత వెనుకబాటుకు గురైందో చెప్తూ యోగి ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఓ ఘటనను ఆయన సోమవారం నాటి శాసనసభ సమావేశాల్లో గుర్తు చేసుకున్నారు. ‘విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు పాఠశాలలను సందర్శించేవాడిని. ఆ క్రమంలోనే ఓ ప్రాథమిక పాఠశాలకు తనిఖీలకు వెళ్లాను. ఓ పిల్లవాడిని నేను ఎవరిని అని అడిగాను. ఒక్క క్షణం ఆలోచించి అతను చెప్పిన సమాధానం నాకు మతిపోయేలా చేసింది. మీరు రాహుల్ గాంధీ అని ఆ విద్యార్థి చెప్పడంతో మన విద్యా వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందోనని బాధపడ్డా’ అని అఖిలేష్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంగుబాటుకు అందరూ కారకులే’ అని అఖిలేష్ పేర్కొన్నారు. చదవండి👉 మహానాడు వేదికపై చంద్రబాబు మేకపోతు గాంభీర్యం పాఠశాల విద్యాభివృద్ధిలో యూపీ చివరి నుంచి నాలుగో స్థానంలో ఉండటం కలవర పరచే విషయమని అన్నారు. దేశానికి ఎందరో ప్రధానులను అందించిన రాష్ట్రం యూపీ. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. అయినా తీరు మారలేదని అఖిలేష్ చురకలు అంటించారు. 2012 నుంచి 2017 వరకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. చదవండి👇 ఇప్పుడే షో మొదలైంది.. వారంలో ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా! రాజ్యసభ సీటు కోసం అలకబూనిన ‘సీఎం చంద్రూ’.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై! -
కమలం గూటికి బాబాయ్ శివపాల్ యాదవ్!
-
అనూహ్య నిర్ణయం తీసుకున్న అఖిలేష్!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు దగ్గరైన కొందరు నాయకులపై వేటు వేశాడు అఖిలేష్. దీంతో శివపాల్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘాజీపూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే, కైలాష్ సింగ్, ఘాజీపూర్ జిల్లా మాజీ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ సహా పలువురు పార్టీ సభ్యులను బహిష్కరించారు. ఇదిలా ఉండగా, పార్టీ మిత్రపక్షాలైన అప్నాదళ్ (కె), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) నాయకులతో యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జస్వంత్ నగర్ నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేసిన అఖిలేష్ బాబాయ్ , ఎమ్మెల్యే, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (పీఎస్పీ) నేత శివపాల్ యాదవ్ హాజరుకాలేదు. ఆయనతోపాటు అప్నాదళ్ (కె) నేత పల్లవి పటేల్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. అఖిలేష్ యాదవ్‌తో జరిగిన సమావేశానికి ఎస్‌బిఎస్‌పి అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఆర్ఎల్డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రాజ్‌పాల్ బలియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓటిమికి గల కారణాలు, సామాన్యుడి సమస్యలు, నిరుద్యోగం తదితర విషయాల పై చర్చించారు. అయితే సమావేశానికి శివపాల్ యాదవ్ గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా.. ఎలాంటి గొడవలు లేవని.. అందరం కలిసి ఉన్నామని అఖిలేష్ చెప్పారు. (చదవండి: బీజేపీపై ఉమ్మడి పోరు ) -
యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరస్పరం నవ్వుకుంటూ పలకరించుకున్నారు. యూపీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు కలిశారు. యోగి అసెంబ్లీలోకి రాగానే.. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముందు వరుసలో కూర్చున్న అఖిలేష్ కూడా తన సీటులోంచి లేచి యోగికి విష్ చేశారు. ఒకరినొకరు షేక్ హ్యండ్ ఇచ్చుకొని అత్మీయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న అఖిలేష్, యోగి.. ఇలా నవ్వుకుంటూ పలకరించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రమాణం చేశారు. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ #WATCH Uttar Pradesh CM Yogi Adityanath meets Leader of Opposition Akhilesh Yadav in the Legislative Assembly during oath-taking of newly-elected legislators #Lucknow pic.twitter.com/7r6fX7ErjX — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022 ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు కైవసం చేసుకొని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను గెలిచి ప్రతిపక్ష హోదా అందుకుంది. యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ అర్భన్ స్థానం నుంచి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్ అజంగఢ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కుమ్ములాటలు షురూ.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమాజ్‌వాదీపార్టీలో మళ్లీ కుటుంబ కలహాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశానికి తనను పిలవలేదని అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ ఆరోపించారు. సైకిల్ గుర్తుపైనే తానూ గెలిచానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శివపాల్ ఆరోపణలపై ఎస్పీ వివరణ ఇచ్చింది. లక్నోలో జరిగింది ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశమని యూపీ ఎస్పీ చీఫ్ నరేషోత్తమ్ అన్నారు. సోమవారం సాయంత్రం భాగస్వామ్యపక్షాలతో అఖిలేష్ భేటీ అవుతారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అఖిలేష్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయనను ఎస్పీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేష్ కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అజంఘడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. చదవండి: (కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?) కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో కుటుంబ కలహాలు భగ్గుమన్నాయి. పార్టీపై ఆధిపత్యం కోసం శివపాల్, అఖిలేష్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో 2019లో ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని పెట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బాబాయ్, అబ్బాయ్‌కి మధ్య రాజీ కుదిరింది. దీంతో జశ్వంత్‌నగర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీచేసి శివపాల్ 90వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అయితే తాజాగా సైకిల్ గుర్తుపై గెలిచిన తనను ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై శివపాల్ గుర్రుగా ఉన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శివపాల్ తెలిపారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ చీలిక తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
వరుస రాజీనామాలు.. మోదం, ఖేదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు అలా వెలుడ్డాయో, లేదో ఇలా రాజీనామాల పర్వం మొదలైంది. ఓడిపోయిన పార్టీలకు చెందిన నాయకులు నైతిక బాధ్యతగా పదవులు వదులుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొంత మంది ఎంపీలు.. పార్లమెంట్ సభ్యత్వాలను త్యజించారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. కాగా, కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమితో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవిని కోల్పోయారు. మండలికి యోగి రాజీనామా యూపీ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో పర్యాయం ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్.. శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో గోరక్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. దీంతో మార్చి 21న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూలై 6న ఎమ్మెల్సీ పదవి గడువు ముగియనుంది. ఎంపీ పదవిని వదులుకున్న అఖిలేశ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలిచారు. యూపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు. అఖిలేశ్ బాటలో ఆజంఖాన్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ కూడా అఖిలేశ్ బాటలో నడిచారు. రాంపూర్ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆయన విజయం సాధించారు. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!) పీసీసీ ప్రెసిడెంట్లకు షాక్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిరుత్సాహపూరిత ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల పదవులను పీకిపారేసింది. పదవుల నుంచి దిగిపోవాలని సోనియా గాంధీ అల్టిమేటం జారీ చేయడంతో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. అజయ్ కుమార్ లల్లూ(యూపీ), గణేశ్ గోడియాల్(ఉత్తరాఖండ్), నవజ్యోత్ సింగ్ సిద్ధూ(పంజాబ్), గిరీష్ చోడంకర్(గోవా), నమీరక్పామ్ లోకేన్ సింగ్(మణిపూర్) పదవులు కోల్పోయారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) ఎమ్మెల్యే పదవికి చద్ధా రాజీనామా ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా వ్యవహరించిన ఢిల్లీ యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. -
లోక్‌సభ సభ్యత్వానికి అఖిలేశ్ రాజీనామా
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలవడం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఖిలేశ్ చెప్పారు. ఎస్పీకి అఖిలేశ్ తండ్రి ములాయం సహా లోక్‌సభలో నలుగురు సభ్యులున్నారు. చదవండి: (చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్) -
మోదీ పవర్ఫుల్ లీడర్ అంటూ ప్రశంసించిన శశిథరూర్.. టెన్షన్లో కాంగ్రెస్..!
జైపూర్: ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఓటర్లు మరోసారి కాషాయ జెండాను ఎగురువేశారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ శక్తివంతమైనా నాయకుడు అంటూ ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. శశిథరూర్ సోమవారం జైపూర్‌లో లిచరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై శశిథరూర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ క్రమంలోనే మోదీ శక్తివంతమైన నాయకుడు, క్రియాశీల నేత అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపరంగా ఆయన చేసిన పనులు అభివర్ణించదగ్గవని అన్నారు. బీజేపీ విజయాన్ని మేము ఊహించలేదన్నారు. అంతలోనే తనదైన స్టైల్లో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ శక్తివంతమైన నాయకుడే కానీ.. మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు దేశ ప్రజలను మతం, వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయని సంచలన ఆరోపణలు గుప్పించారు. అది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం సాధించింది కానీ.. రానున్న రోజుల్లో మళ్లీ యూపీ ప్రజలే బీజేపీకి షాకిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ యూపీలో బలమైన ప్రత్యర్థిగా ఎదిగిందని కితాబిచ్చారు. అలాగే, యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రియాంక గాంధీ తన శాయశక్తుల కృషి చేశారని కొనియాడారు. కానీ, చివరకు ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. -
ఎమ్మెల్యే పదవికి అఖిలేష్ రాజీనామా? ఎందుకలా?
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చెందినప్పటికీ కమలం పార్టీకి కాస్త పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్ధానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ రాంపూర్ స్ధానం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్పీ నేతలు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్ శాసన సభ్యలుగానే కాకుండా లోక్‌సభ సభ్యులుగానే ఉన్నారు. (చదవండి: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు ) అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్‌సభ సభ్యులుగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు వరుసగా ఆజంఘఢ్, రాంపూర్ లోక్‌సభ స్ధానాల నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హాల్ అసెంబ్లీ స్థానంలో యాదవ్ 67,504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 1,48,196 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. కర్హల్ ఎస్పీకి కంచుకోటగా భావిస్తారు. పోలైన ఓట్లలో యాదవ్‌కు 60.12 శాతం ఓట్లు రాగా, బాఘేల్‌కు 32.74 శాతం ఓట్లు వచ్చాయి. యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. లోక్‌సభలో ఎస్పీకి ఐదుగురు సభ్యులుండగా సభలో తమ సంఖ్యాబలం మరింత బలహీనపడకుండా చూసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. దీంతో వీరిద్దరూ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి లోక్‌సభ ఎంపీలుగా కొనసాగుతారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. కాగా, మార్చి 21న లక్నోలోని పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశానికి అఖిలేష్ యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తర్వాత సమాజ్ వాదీ పార్టీ 111 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
బీజేపీ భారీ గెలుపు.. మమతా సంచలన ఆరోపణలు
లక్నో: గురువారం వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ఆమె నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై సంచలన ఆరోపణలు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన గెలుపు ప్రజా తీర్పు కాదని, ఈవీఎం మిషన్ల తీర్పని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు,ఏజెన్సీల సహాయంతో సాధించిన విజయమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. కలిసి పోరాడాలి 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని మమతా పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ కోరుకుంటే, ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సూచించారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తులో ఆ పార్టీకి నష్టదాయకమే అన్న మమతా... ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవు అని తెలిపారు. బీజేపీ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: Tamil Nadu: పార్టీ బలోపేతానికి కమల్ హాసన్ కీలక నిర్ణయం మరోవైపు కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోతుందని, కాంగ్రెస్‌పై ఆధారపడే పరిస్థితులు లేవన్నారు. చాలా ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయని, అందరూ కలిసి పనిచేయాలని కోరారు. దీనిపై ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. అఖిలేష్ యాదవ్ నిరుత్సాహపడొద్దు ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్లే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఓడిపోయారని మమతా అన్నారు. అయితే యూపీ ఫలితాలతో అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదని అన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఈసారి ఓటింగ్ పెరిగిందని, 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని వివరించారు. ప్రజల వద్దకు వెళ్లి బీజేపీని సవాల్ చేయాలని ఆమె సూచించారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు. చదవండి: కశ్మీర్ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ -
యూపీ ఫలితంపై అఖిలేష్ యాదవ్ స్పందన
-
Sakshi Cartoon: యూపీలో మళ్లీ బీజేపీ
యూపీలో మళ్లీ బీజేపీ..షాక్‌లో అఖిలేష్ యాదవ్ -
ఉత్తరప్రదేశ్ లో ప్రతిపక్షానికి పరిమితం అయిన అఖిలేష్ యాదవ్ పార్టీ
-
ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు
లక్నో: వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన ఈవీఎంలను తరలిస్తున్న ఓ ట్రక్కును వారణాసి వద్ద అడ్డగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ తెలిపారు. మరో రెండు ట్రక్కులు తప్పించుకున్నాయన్నారు. అధికార బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వారణాసి ఎన్నికల అధికారులు మాత్రం.. ఆ ఈవీఎంలు శిక్షణ కోసం వాడేవని స్పష్టంచేశారు. అఖిలేశ్ ఆరోపణలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునేందుకు వీలుగా అభ్యర్ధులందరికీ ఈసీ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. (చదవండి: మేయరైన ఆటోవాలా) -
ఉత్తర ప్రదేశ్ పీఠం దక్కేదెవరికి..ఎగ్జిట్ పోల్ అంచనాలు
-
ప్రధానికి టెన్షన్.. మోదీ కోటలో అఖిలేష్ పాగా వేస్తారా..?
యూపీ పీఠమెవరిదో తేల్చనున్న ఆఖరిదశ (7వ దశ) పోలింగ్ సోమవారం జరగనుంది. పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాలోని 54 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్‌లో భాగమే. దాంతో ఆయన మూడు రోజులు వారణాసిలోనే ఉండి శనివారం ప్రచారం ముగించారు. ప్రధాన పోటీదారులైన సమాజ్‌వాదీ, బీజేపీలు ఎవరికి వారే.. తామిప్పటికే యూపీ అసెంబ్లీ రేసులో గెలిచేశామని చెప్పుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ, అఖిలేశ్–మమతా బెనర్జీలు, రాహుల్– ప్రియాంక గాంధీల్లాంటి అగ్రనేతలు సీరియస్‌గా ప్రచారంలో మునిగిపోవడాన్ని బట్టి.. ఎవరికైనా విజయం అంత తేలిక కాదనే సంకేతాలను ఇస్తోంది. యాదవేతర బీసీల ఓట్లలో చీలిక! ప్రతీ ఓటూ ముఖ్యమేనని ముందే లెక్కలేసుకున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కులా ఆధారిత చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. సుహల్దేవ్ రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్‌బీ, మహాన్‌దళ్, జేపీ (ఎస్) లాంటి చిన్నాచితక పార్టీలతో మాల అల్లిన అఖిలేశ్.. బీజేపీకి అండగా నిలబడ్డ యాదవేతర కులాల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపారు. అల్పసంఖ్యాల కులాల్లో 2017లో బీజేపీ 61 శాతం ఓట్లను సాధించింది.అయితే ఈ యాదవేతర ఓబీసీలు బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కాదు. ఈ ఓబీసీల్లో 76 ఉపకులాలున్నాయి. ప్రతి కూలానికి వేర్వేరు అవసరాలు– ఆంకాక్షలు, డిమాండ్లు ఉన్నాయి. అందువల్ల యాదవేతర బీసీలను ఏకం చేయడం కష్టం.అప్నాదళ్ (ఎస్) ఇంటిపోరు, స్వామి ప్రసాద్ మౌర్య నిష్క్రమణలు పూర్వాంచల్‌లో బీజేపీకి మరిన్ని తలనొప్పులు తెస్తున్నాయి. పైన చెప్పిన ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్తగా నిషాద్ పార్టీతో జతకట్టింది. మల్లాల్లో ఈ పార్టీకి మంచి మద్దతుంది. ఏడోదశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎస్సీలతో పాటు కుర్మీలు, పటేళ్లు, బనియాలు, రాజ్భర్లు, నిషాద్‌లు, మౌర్యాల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ జిల్లాల్లో మైనార్టీ జనాభా 12 శాతముండగా, ఎస్సీ జనాభా 24 శాతం, బ్రాహ్మణ మరియు ఠాకూర్ల జనాభా 20 శాతం మేర ఉంది. జాతీయవాదం + హిందుత్వ.. 2017లో పూర్వాంచల్‌లో బీజేపీ ప్రదర్శన మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఈ ప్రాంతంలోని 50 సీట్లలో బీజేపీ 2017లో 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎస్పీ(11), బీఎస్పీ(6) నిలిచాయి. ఇతరప్రాంతాలతో పోలిస్తే బీఎస్పీ అత్యధిక ఓట్ల శాతం సాధించిన ప్రాంతం ఇదే కావడం గమనార్హం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈదఫా ఒక సమ్మిళిత సూత్రాన్ని అవలంబిస్తోంది. జాతీయవాదం (ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు), హిందుత్వ (కాశీ విశ్వనాధ కారిడార్ పనులు), మోడీ, యోగి కాంబినేషన్ విజయాలు.. అనే మూడు అంశాలను సమ్మిళితం చేసి చూపడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ఓబీసీకి చెందిన మోదీని చూపి వెనుకబడ్డవర్గాలకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని చెబుతోంది. మరోవైపు బీజేపీ ఓబీసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ వారిని ఆకట్టుకోవాలని అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారు. కులాలవారీ జనగణనను బీజేపీ పక్కనపెట్టిందని, తద్వారా రిజర్వేషన్లకు ముగింపు పలికే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీఎస్పీ మాత్రం గతంలో మాదిరే తమకు ఈ ప్రాంతంలో మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తోంది. కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానికి కీలకంగా మారిన ఈ ప్రాంతంపై పట్టు తమకే దక్కుతుందని ఎస్పీ, బీజేపీ ఆశిస్తున్నాయి. -
యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?
ఉత్తరప్రదేశ్‌లో ఆరు దశల ఓటింగ్ తర్వాత పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అన్ని దశల పోలింగ్‌లో తగ్గిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నదే ఆ చర్చ. దీనిపై బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు వాటికి అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ‘నిశ్శబ్ద నో షో’, అంటే ఓటేయని వారి వల్ల ఎవరికి నష్టమన్నదే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఇప్పుడు హాట్ టాపిక్. ‘తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాన్ని మారుస్తుందా అంటే, కచ్చితంగా తారుమారు చేస్తుంది. కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేలాలంటే 10వ తేదీ దాకా ఎదురు చూడాల్సిందే’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాలవీయ రీసెర్చి సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ కవితా షా అన్నారు. తగ్గిన పోలింగ్ శాతాలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. ఓటు వేయకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొలి, రెండో విడత పోలింగ్‌లో 2017 కంటే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. 2017లో తొలి దశలో 64.6 శాతం, రెండో దశలో 65.5 శాతం నమోదైతే ఈసారి 62.5, 64.7 శాతానికి తగ్గింది. మూడు, నాలుగో దశల్లో కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగలేదు. ‘ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుందంటారు. కానీ యూపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాను’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (జేఎన్‌యూ) హెచ్ఓడీ ఆర్.నరేంద్రకుమార్ విశ్లేషించారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిన జిల్లాల్లో ఆయన తన రీసెర్చి విద్యార్థులతో పర్యటిస్తున్నారు. రాజధాని లక్నోకు పొరుగున ఉన్న సీతాపూర్ పట్టణంలో 2017లో 61.8 శాతం పోలింగ్ జరిగితే ఈసారి 52.6కు పడిపోయింది. అంటే దాదాపు 35 వేల ఓట్లు పోలవలేదు. 2017లో ఇక్కడ బీజేపీ 24 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచింది. సీతాపూర్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సగటున 62.7% ఓటింగ్ నమోదైంది. ఇది కూడా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 శాతం తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో ఏడింటిని గెలుచుకుంది. అయితే, ‘గతంలో ఆగ్రా సౌత్, శ్రీనగర్, ఉన్నావ్ వంటిచోట్ల బీజేపీ పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. కాబట్టి అలాంటి చోట్ల ఓటింగ్ శాతం తగ్గినా బీజేపీ అభ్యర్థులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’ అని ఇండియన్ జర్నల్ అఫ్ పొలిటికల్ సైన్స్ (వారణాసి) డైరెక్టర్ వి.కె.బాజ్‌పేయి విశ్లేషించారు. 139 సీట్లలో తగ్గింది! తొలి నాలుగు దశల్లోని 231 స్థానాల్లో చూసుకుంటే ఏకంగా 139 చోట్ల ఓటింగ్ శాతం బాగా తగ్గింది. సీతాపూర్, సేవాత నియోజకవర్గాల్లో 2017తో పోలిస్తే 9 శాతం తగ్గుదల ఉంది. ఆరు స్థానాల్లో ఎటువంటి మార్పు కనిపించకపోగా 86 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. తక్కువ నమోదైన 139 సీట్లలో 28 చోట్ల దాదాపు 10 వేల చొప్పున ఓట్లు తగ్గాయి. వీటిలో 24 సీట్లను 2017లో బీజేపీ గెలుచుకుంది. అయితే వాటిలో చాలావరకు తక్కువ ఓట్ల తేడాతో గెలిచినవే. ఉదాహరణకు సీతాపూర్ జిల్లాలోని మహోలీలో కేవలం 3,700 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ 2017లో 68.7 శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 63.5కు తగ్గింది. ఇది ఎవరిపై, ఎలా ప్రభావం చూపుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హాల్ నియోజకవర్గంలోనేమో పోలింగ్ ఈసారి 7 శాతం పెరిగింది. తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా? 2017లో 403 సీట్లకు గాను బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 312 నెగ్గి అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఓవరాల్ ఓటింగ్ శాతం తక్కువే నమోదైంది. కాబట్టి ఈసారి మరో ఒకట్రెండు శాతం తగ్గినా అది మొత్తం ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటున్న వారూ లేకపోలేదు. ‘ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా లేదు. ఓటింగ్ శాతం తగ్గడానికి అదీ ఓ కారణం కావచ్చు. అంతమాత్రాన తక్కువ ఓటింగ్ శాతం వల్ల ఫలితాలే తారుమారు అవుతాయనుకోవడం పొరపాటు. మా ప్రభుత్వమే కొనసాగాలనుకునే వారు ఓటింగ్‌పై బహుశా ఆసక్తి చూపలేదేమో’ అని వారణాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓటేయకపోవడానికి కారణాలెన్నో ‘ఓటరు ఓటేయలేదంటే, లిస్ట్‌లో పేరు కనిపించకపోవడం, పోలింగ్ బూత్ దూరంగా ఉండటం వంటి అనేక కారణాలుండొచ్చు’ అని వారణాసి అదనపు జిల్లా మేజిస్టేట్, రిటర్నింగ్ అధికారి కౌశల్ రాజ్ శర్మ సాక్షి ప్రతినిధులతో చెప్పారు. ఓటేయాలని తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. -వారణాసి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి. -
Sakshi Cartoon: ప్రపంచంలో అతి పెద్ద అబద్ధాల పార్టీ..
దానికి అంత పెద్ద అబద్ధమాడాలని అంటున్నార్సార్! -
ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!
న్యూఢిల్లీ: బీజేపీ, సమాజ్‌వాద్ పార్టీల మధ్య విమాన ప్రయాణం పై మాటల యుద్ధం జరిగింది. ఉత్తరప్రదశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత నెలలో మార్చి 11న లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కి విమానం టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో యోగి మార్చి 11 వెంటనే టికెట్ బుక్ చేసుకుని పారిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు పై బీజేపీ నాయకులు ఎంతలా భయపడుతున్నారో అర్థం అవుతుంది అంటూ విమర్శించారు. బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలియదు మీరు భయపడి పారిపోయేవరకు అని బహ్రైచ్‌లో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గత నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధిఐపి సింగ్ యోగిని విమర్శిస్తూ..తాను మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో గోరఖ్‌పూర్‌కి బుక్ చేసినట్లు తెలిపిన విమాన టిక్కెట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల కోసం మార్చి 11న లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కి బయలుదేరుతంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లండన్‌కి ఎగరిపోతారంటూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. దీంతో అఖిలేశ్ యాదవ్ ఈ రోజు ర్యాలిలో ఆ మాటలకు కౌంటరిచ్చారు. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల ఓటింగ్‌లో నాలుగు రౌండ్లు జరగగా.. మార్చి 10న ఫలితాలు వెల్లడనున్న సంగతి తెలిసిందే. अखिलेश यादव के लंदन के टिकट को लेकर सनसनी, 11 मार्च को लंदन जाने का है टिकट क्या कोई सच्चाई बता सकता है❓ — Arun Yadav (@beingarun28) February 21, 2022 (చదవండి: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్) -
Sakshi Cartoon: ముందు నాకు సీఎం ఉద్యోగం రానీయండి! వెంటనే మీకు ఉద్యోగాలు...
ముందు నాకు సీఎం ఉద్యోగం రానీయండి! వెంటనే మీకు ఉద్యోగాలు... -
వాళ్ల వైఖరి ఆందోళనకరం..ఉగ్రవాదులని 'జీ అని పిలుస్తారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హర్దోయ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. "సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకుల వైఖరి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యక్తులు ఒసామా వంటి ఉగ్రవాదులను 'జీ' అని సంబోధిస్తున్నారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి ప్రస్తావిస్తూ...కొన్ని పార్టీలు ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించడమే కాక సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 14 ఉగ్రవాద దాడుల కేసులలో అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకులు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు అలీ జిన్నాకు మద్దతుదారులని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలపై అలక్ష్య పెట్టి 'కట్టా' (దేశంలో తయారు చేసిన పిస్టల్స్)ని వినియోగించే స్వేచ్ఛనిచ్చిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని, వారి కార్యకర్తలని హర్దోయి ప్రజలు తప్పక గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు బుజ్జగింపు రాజకీయాలతో పండుగలను ఆపేసే వారికి మార్చి 10న ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి సరైన సమాధానం వస్తుందని నొక్కి చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
యూపీ సీఎం వార్నింగ్.. వారి కోసం మార్చి 10 తర్వాత బుల్డోజర్లు వస్తాయి..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. రాష్ట్రంలో బుల్డోజర్ల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను అలా ఉపయోగించగలదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మెయిన్‌పురీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు బుల్డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని బుల్డోజర్లన్నింటిని రిపేర్ కోసం పంపించామన్నారు. బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా దాక్కున్న కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రకటన వెలువడగానే బయటకు వస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజుల క్రితం బుల్డోజర్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేన్నారు. ఓటు వేయని వారు యూపీ నుంచి వెళ్లిపోవాలని వీడియోలో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా బీజేపీకి ఓటు వేయని వారి కోసం జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని సృష్టించింది. #WATCH | I have come here to assure you that I have send the bulldozer for repair. 10 March ke baad jab ye fir se chalna prarambh hoga to jin logo me abhi jyada garmi nikal rahi hai, ye garmi 10 March ke baad apne aap shant ho jayegi: UP CM Yogi Adityanath in Karhal, Mainpuri pic.twitter.com/hvjcQsKbeE — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2022 -
రెండు దశల్లోనే సెంచరీ కొట్టాం
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తాము సెంచరీ కొట్టామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం(పూర్తి మెజారిటీ) నాలుగో దశ ఎన్నికల కల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజాబాద్ ప్రాంతంలోని నాసిర్పూర్లో గురువారం ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ మాట్లాడారు. మొదటి రెండు దశల్లో మొత్తం 113 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 100కు పైగా సీట్లు కచ్చితంగా గెలుకుంటామని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాల గణాంకాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబాసాహెబ్ అంబేడ్కర్ అందజేసిన రాజ్యాం గాన్ని కాపాడేందుకు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. చట్టాన్ని అతిక్రమించేవారు, చట్టప్రకారం నడుచుకోనివారు తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. తొలిసారి ములాయం ఎన్నికల ప్రచారం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఈ ఎన్నికల్లో తొలిసారిగా గురువారం మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖిలేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అమెరికా సహా ప్రపంచ దేశాల కళ్లు సమాజ్‌వాదీ పార్టీపైనే ఉన్నాయని చెప్పారు. ప్రచార వేదికపై అఖిలేశ్ యాదవ్ తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు పొందారు. కర్హాల్‌లో మూడో దశలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇక్కడ అఖిలేశ్‌పై బీజేపీ అభ్యర్థిగా ఎస్.పి.సింగ్ బఘేల్ పోటీకి దిగుతున్నారు. ములాయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. -
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
యోగి ఆదిత్యనాథ్‌పై మహిళ పోటీ.. ఆమే ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటుగా మహిళా నేత శుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి చేతనా పాండే, బీఎస్పీ అభ్యర్థిగా ఖ్వాజా శంషుద్దీన్ బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ తరపున యువ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ఎవరీ శుభావతి? దివంగత బీజేపీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా సతీమణి శుభావతి. ఉపేంద్ర దత్ గుండెపోటుతో 2020లో మరణించారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి గోరఖ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2018 లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఉపేంద్ర దత్ పోటీ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌తో విభేదాల కారణంగానే ఆయన ఓడిపోయారన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. తన భర్త జీవించి ఉన్న సమయంలో శుభావతి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోని మరో స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కుమారుడితో కలిసి గత నెలలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. బీజేపీ తమ పట్ల వ్యవహరించిన తీరుపై శుక్లా కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనీసం తమ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు వెల్లడించారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన ఉపేంద్ర కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిందని బాధ పడుతున్నారు. (హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ) సానుభూతి పనిచేస్తుందా? సీఎం యోగిపై శుభావతిని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఆమెను ఎంపిక చేయడం విశేషం. ఠాకూర్-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును చీల్చి బీజేపీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శుభావతిని పోటీకి పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ఉపేంద్ర శుక్లా గోరఖ్‌పూర్‌లోనే కాకుండా పూర్వాంచల్లోనూ పేరున్న బ్రాహ్మణ నాయకుడు. శుక్లా కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. బీజేపీ తమ కుటుంబానికి చేసిన అన్యాయం గురించే ఎన్నికల ప్రచారంలో శుభావతి, ఆమె కుమారుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆసక్తికర పోటీ చాలా కాలంగా యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యర్థిగా ఉన్న బీఎస్పీ మాజీ నేత హరిశంకర్ తివారీ కుమారుడు గతేడాది డిసెంబర్లో సమాజ్‌వాదీ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం. అయితే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోని యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమైందిగా పరిగణించబడుతోంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఇక్కడ పోలింగ్ జరగనుంది. (క్లిక్: ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు) -
అవసరమైతే ఆర్మీ రిక్రూట్మెంట్ని ప్రవేశ పెడతాం!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు చాల రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రవేశపెట్టి ఖాళీ స్థానాలను భర్తీ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తానని ఆగ్రా ప్రచార ర్యాలీలో అన్నారు. అంతేకాదు గతనెల 30న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషలో మీడియాలో... "సమాజ్‌వాద్ పార్టీ(తుపాకీ పార్టీ) నాయకులు కైరానా, ముజఫర్‌నగర్‌లలో తమ వేడి తగ్గలేదంటూ బెదిరిస్తున్నారు. మార్చి పది తర్వాత ఆ వేడి తగ్గిపోతుందిలే అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు." దీంతో అఖీలేశ్ యాదవ్ ఆయన వ్యాఖ్యల పై గత వారంరోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. అయినా సీఎం తమ పార్టీ వేడిని తగ్గించినా తాము అధికారంలోకి వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీ స్థానాలను తొలగిస్తామంటూ గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌సీఎం యోగికి హింసతోనే సాన్నిహిత్యం ఉంది తప్ప శాంతితో కాదు అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈసారి గోరఖ్‌పూర్ ఓటర్లు అతన్ని ఉత్తరాఖండ్‌కు తిరిగి పంపుతారని అన్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి మాట్లాడుతూ.."యోగి ఆదిత్యనాథ్ అసౌకర్య ప్రశ్నలను నివారించడానికి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తాడు. అయినా యోగి నిరుద్యోగ యువత వేడిని ఎలా తగ్గిస్తారో పేర్కొనాలి" అని అన్నారు. (చదవండి: యోగితో యూపీలో అభివృద్ధి!) -
ఆసక్తికర దృశ్యం: సలాం.. రామ్ రామ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పరస్పర అభివాద సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. బులంద్‌శహర్‌లో జయంత్ చౌదరితో కలిసి అఖిలేశ్ ప్రచారం నిర్వహిస్తుండగా... ప్రియాంక కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ఈలలు వేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్.. వీడియోను ప్రియాంక ట్విటర్లో షేర్ చేశారు. एक दुआ-सलाम ~ तहज़ीब के नाम pic.twitter.com/dutvvEkz5W — Akhilesh Yadav (@yadavakhilesh) February 3, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)తో కలిసి సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దిగింది. అధికార బీజేపీకి, ఈ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకుని ప్రియాంక గాంధీ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్, ప్రియాంక ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) हमारी भी आपको राम राम @jayantrld @yadavakhilesh pic.twitter.com/RyUmXS4Z8B — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 3, 2022 అయితే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడింటిని మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లతో సరిపెట్టుకుంది. 2012లో అఖిలేశ్ పార్టీ 224 సీట్లు సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అఖిలేశ్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. (క్లిక్: ఉత్తరప్రదేశ్‌లో తరతరాలుగా వీరిదే అధికారం!) -
ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం!
లక్నో: ఐదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ను మాఫియా, అల్లరి మూకలు పాలించేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో బాఘ్‌పత్, షమ్లీ, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్‌నగర్, శరణ్‌పూర్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాల ర్యాలీల నుద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు దోపిడీకి గురయ్యారని, ఆడపిల్లలు ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయిందన్నారు. ప్రభుత్వ అండదండలతో మాఫియా స్వేచ్ఛగా తిరిగేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని మాటల దాడి చేశారు. మూఢ నమ్మకాలతో అఖిలేశ్ యువత కలల ప్రపంచమైన నోయిడాకు రాలేదని, అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యక్తి యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. మన దేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌పై భరోసా ఉంచని వారు, పుకార్లకు ప్రాధాన్యమిచ్చినవారు ఉత్తరప్రదేశ్యువత ప్రతిభను, ఆవిష్కరణలను ఎలా గౌరవిస్తారని ప్రధాని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ యూపీ మార్పును కోరుకుంటుందని, కానీ ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్లు టికెట్ ఇచ్చిన వారిని చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. ప్రతీకారమే వారి సిద్ధాంతమని, అలాంటి వారి పట్ల యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందని మోదీ తెలిపారు. కృష్ణుడు తన కలలోకి వస్తాడన్న అఖిలేశ్ మాటలనుద్దేశించి ప్రస్తావిస్తూ... ఆయన నిద్రపోయి కలలు కంటూనే ఉంటారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం యూపీ అభివృద్ధికోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. బీజేపీలోకి నిదా ఖాన్, గంగారామ్ అంబేడ్కర్ మహిళా హక్కుల ఉద్యమకారిణి నిదా ఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఓఎస్డీగా పనిచేసిన గంగారామ్ అంబేడ్కర్ భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరికల కమిటీ నాయకుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్ ఆధ్వర్యంలో సోమవారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజ్‌పేయ్ మాట్లాడుతూ... ఇక అల్లరి మూకల రాజ్యం చెల్లదని, ప్రజలంతా నిర్భయంగా జీవించే యోగి ఆదిత్యనాథ్ పరిపాలన నడుస్తోందని అన్నారు. -
అఖిలేష్‌కు పోటీగా బలమైన అభ్యర్థి! బీజేపీ ఎత్తుగడ ఫలించేనా?
BJP Fields Union Minister SP Singh Baghel against Akhilesh Yadav from Karhal Seat: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు పోటీగా బీజేపీ బలమైన అభ్యర్థిని ప్రకటించింది. ఓబీసీ వర్గానికి చెందిన సత్యపాల్ సింగ్ బఘేల్ కర్హల్ నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది. పోలీస్ ఎస్ఐగా తన కెరీర్ ప్రారంభించిన ఎస్పీ సింగ్ బఘేల్.. మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎస్పీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన ఎస్పీ సింగ్ బఘేల్‌కు 2014లో మాయావతి రాజ్యసభ సీటు ఇచ్చారు. అనంతరం కమలం పార్టీలో చేరిన ఎస్పీ సింగ్ బఘేల్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తుండ్లా స్థానం నుంచి గెలిచి.. యోగి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ కేబినెట్లో న్యాయ శాఖ సహా మంత్రిగా పనిచేస్తున్నారు. మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అఖిలేష్‌కు పోటీగా బఘేల్‌ను రంగంలోకి దింపడంతో కర్హల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చదవండి: (అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నామినేషన్ దాఖలుచేశారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న అఖిలేష్.. మెయిన్‌పురి సబ్‌డివిజన్ ఆఫీస్‌లో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కర్హాల్ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో దాదాపు 3.5లక్షలమంది ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు లక్షన్నర వరకూ యాదవులే ఉన్నారు. కర్హాల్ స్థానానికి మూడోదశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. చదవండి: (బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?) -
బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్
లక్నో: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ కూటమి చివరి వరకు రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా, తాను, ఆర్ఎల్డీకి చెందిన నేత జయంత్ చౌదరి రైతుల మానస కుమారులుగా అఖిలేష్ అభివర్ణించుకున్నారు. ‘నేను ఎప్పుడూ నా జేబులో ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను.. లాల్ టోపి, లాల్ పొట్లీని’ ఉంచుకుంటానని తెలిపారు. బీజేపీని ఓడించడమే నా సంకల్పమని అఖిలేష్ తెలిపారు. 2017 నుంచి ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హమీని కాషాయపార్టీ నెరవేర్చలేదని అఖిలేష్ విమర్శించారు. అదే విధంగా జయంత్ చౌదరి కూడా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. జయంత్ షాను బీజేపీలో చేరాలని అమిత్ షా ఆహ్వనించారు. దీనిపై జయంత్ స్పందించారు. తాను నాణెంలా ఎగిరేవ్యక్తి కాదని తెలిపారు. పశ్చిమ యూపీలో జాట్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు షా.. ఆర్ఎల్డీ చీఫ్‌ను పార్టీలోని ఆహ్వనించినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే విధంగా.. జాట్ నాయకులతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని జయంత్ తెలిపారు. ఈ సమావేశంలో యూపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ సహా పార్టీ ప్రముఖ జాట్ నేతలు హజరయ్యారు. పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీ అధికారంలో ఉన్న అన్ని స్థానాల్లో జాట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాగా, మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి ప్రస్తుతం ఆర్ఎల్డీకి నేతృత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ ఎస్పీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుంది. చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
159 మందితో ఎస్పీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. -
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..
తొలిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బలమైన స్థానం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ వచ్చే నెలలో ఎన్నికలలో మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పార్టీ వర్గాల అందించిన ఈ సమాచారాన్ని అతని మామ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఆయన మేనల్లుడు మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే 1993 నుంచి కర్హాల్ వాసులు ప్రతి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ బీజేపి 2002 ఎన్నికలలో ఆ స్థానాన్ని గెలిచినప్పటికీ, 2007లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ప్రస్తుతం కర్హాల్ సోబరన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది. అంతేకాదు అఖిలేశ్ తండ్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఐదు అసెంబ్లీ స్థానాల్లో మైన్‌పురి లోక్‌సభ సీటు ఒకటి కావడం విశేషం. పైగా యూదవ్ స్వగ్రామమైన సైఫాయ్కి 5 కి.మీ దూరంలోనే కర్హాల్ ఉంది. అధికార పార్టీని గద్దె దింపేందకు ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఆయన గతేడాది నవంబర్ నెలలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనని చెప్పారు. కాగా, బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగనుండటంతో అఖిలేశ్ యాదవ్ సైతం ఒత్తిడిని అధిగమించేందుకు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలేశ్ ప్రస్తుతం యూపీలోని అజంగఢ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నా సంగతి తెలిసిందే. కాగా, అఖిలేశ్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎంఎల్సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే ఆదిత్యనాథ్ కూడా బలమైన స్థానం నుంచే పోటీచేస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి.. ఆ నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు. (చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’ -
బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!
లక్నో: ములాయం సింగ్ యాదవ్ చిన్న అపర్ణా యాదవ్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములాయం ఆశీస్సులు తీసుకున్న ఫొటోను శుక్రవారం ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మా నాన్న/నేతాజీ ఆశీస్సులు తీసుకున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘అంటే దీనర్థం నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నార’ని వ్యాఖ్యానించారు. బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేశ్ అపర్ణా యాదవ్.. గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘వారసత్వ భారాన్ని తగ్గించినందుకు బీజేపీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆమెను బీజేపీకి వెళ్లకుండా వారించేందుకు తన తండ్రి ములాయం సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరడం గమనార్హం. भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U — Aparna Bisht Yadav (@aparnabisht7) January 21, 2022 టిక్కెట్ దక్కదని తెలిసి.. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడి పోటీ చేయాలని భావించిన అపర్ణా యాదవ్.. సమాజ్‌వాదీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఈసారి టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సుముఖంగా లేకపోవడంతో తన దారి తను చూసుకున్నారు. మరి కంటోన్మెంట్ సీటును బీజేపీ ఆమెకు ఇస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ తన కుమారుడికి ఈ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. -
అఖిలేష్ యాదవ్ శ్రీకృష్ణ జపం ఫలిస్తుందా?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. అయితే మిగతా నాలుగు రాష్ట్రాల విషయం పక్కనబెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం విషయంలో దేశంలో ప్రత్యేక చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, ప్రతిష్ఠకు ఒక అగ్ని పరీక్ష లాంటివనీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించడం సులభవుతుందనీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులూ, ఆ పార్టీలకు అనుకూలంగా విశ్లేషణ చేసే మోదీ వ్యతిరేకులూ తల పోస్తు న్నారు. అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన ‘శ్రీకృష్ణ జపం’ (శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కలలోకి వచ్చి ‘నీవు రామరాజ్య స్థాపన చేస్తావు, ఈ ఎన్నికల్లో విజయం నీదే’ అంటున్నాడని అఖిలేష్ యాదవ్ చెప్పుకోవడం) ఈ ఎన్నికల్లో బాగా పని చేస్తుం దనీ, హిందువుల ఓట్లు చీలిపోతాయనీ, యాదవ కులపు ఓట్లు, ముస్లింల ఓట్లు గుండుగుత్తగా సమాజ్‌వాది పార్టీకి పోలవుతాయనీ మోదీ వ్యతిరేకులు ముందుస్తు అంచనాలు వేస్తున్నారు. (చదవండి: అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?) లౌకిక భావాలకు ప్రాతినిధ్యం వహించే సమాజ్‌వాది పార్టీ అనాలోచితంగా, అసందర్భంగా మథుర శ్రీకృష్ణుణ్ణి నెత్తికి ఎందుకు ఎత్తుకున్నట్లు? ముస్లిం పరిపాలనలో మథురలో శ్రీకృష్ణ ఆలయానికి అపచారం జరిగిందనీ, ఇది హిందూ సమాజానికి అవమానమనీ, ఈ అవమానాన్ని తుడిచి పెడతామనీ హిందూ సంస్థల ప్రతినిధులు, వారి మద్దతుతో రాజకీయాలు నడిపే భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తుందనే విషయం హిందువులకు బాగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న ఈ కృష్ణ నినాదం ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? (చదవండి: అధికారానికి ‘నిచ్చెన’ప్రదేశ్!) ఈ దేశ చరిత్రలో హిందూ సంస్కృతికి, హిందువులకు జరిగిన కష్టనష్టాలపై అఖిలేష్ యాదవ్‌గానీ, ఆయన తండ్రి ములాయంగానీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాగా వారిద్దరూ హిందూ వ్యతిరేకులనీ, జిహాదీ ఉగ్రవాదుల మద్దతుదారులను, సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించారనే వ్యూహాత్మక ప్రచారాన్ని హిందుత్వ శక్తులు... హిందుత్వ అభిమాన ఓటర్ల మెదళ్ళలోకి బాగా ఎక్కించారనే విషయం సత్యదూరమైనదేమీ కాదు. గత నెలలో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ ప్రతినిధుల సమావేశంలో హిందుత్వ ప్రతినిధుల మాటలు... జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపకుండా పోతాయా? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) ఇక ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ... మోదీ, యోగీ తర్వాత హిందువులను రక్షించేవారెవరని అడిగిన మాటల వల్ల... ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హిందుత్వ శక్తులు ఏకమవ్వడానికి దోహదం చేస్తాయి. మోదీ, యోగీ వ్యతిరేకుల దుష్ప్రచారాలు హిందు త్వాన్ని బలహీన పరుస్తాయా లేక బలపరుస్తాయా, లేదా సమాజ్‌వాది పార్టీ ఎన్నికల విజయాలను దెబ్బ తీస్తాయా అనే విషయాలను విశ్లేషకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. - ఉల్లి బాల రంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
పొలిటికల్ కారిడర్ 19 January 2022
-
బీజేపీ పెద్దలకు అఖిలేశ్ యాదవ్ గట్టి ఝలక్
-
కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీపార్టీ అన్నట్టుగా నడుస్తోంది ఎన్నికల రాజకీయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేక్రమంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు బీజేపీ హైకమాండ్ ఏ సీటు కేటాయిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీచేయాలని ప్రతిపాదించారు. ఆయన రావడానికి ఆసక్తిగా ఉంటే,.. గోరఖ్‌పూర్ అర్బన్ సీటును కేటాయించడానికి సిద్ధమని అన్నారు. 2002 నుంచి రాధా మోహన్‌దాస్ గోరఖ్‌పూర్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే ముగ్గురు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి 10న మొదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగనుంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది. (చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్) -
బీజేపీ రివర్స్ పంచ్! ఎస్పీ చీఫ్ సోదరుడి భార్య అపర్ణకు బీజేపీ గాలం?
ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేల (ఇందులో ఇద్దరు బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్–ఎస్’కు చెందిన వారు)ను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. అఖిలేశ్ సవతి సోదరుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్‌కు కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అపర్ణ కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విధానాలకు బాహటంగా మద్దతు పలుకుతున్నారు. ఆమెతో బీజేపీ టచ్‌లో ఉంది. ఇరుపక్షాల మధ్య అపర్ణ పార్టీ ఫిరాయింపుపై చర్చలు జరుగుతున్నాయని... ఇప్పుడవి ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి, సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఫిబ్రవరి– మార్చిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ సీటునే అడుగుతున్నట్లు వినికిడి. అయితే సీనియర్ రీటా బహుగుణను కదపడం ఇష్టం లేని బీజేపీ ములాయం సింగ్ కోడలిని మరో చోటు నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. కుంభస్థలాన్ని కొట్టాలని... బీజేపీ నుంచి ఎస్పీకి ఇటీవలి వలసలతో కమలదళం లోలోపల రగిలిపోతోంది. పెద్ద ఎత్తున ప్రతిదాడి చేయకపోతే బీజేపీ చేష్టలుగిడి చూస్తోందనే అభిప్రాయం బలపడుతుంది. అందుకే అపర్ణా యాదవ్‌కు గాలం వేసింది. తమ్ముడి భార్యను ఆపలేకపోతే... అఖిలేశ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో తనతో విబేధించి వేరుకుంపటి పెట్టుకున్న బాబాయ్ శివపాల్ యాదవ్ (ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ– లోహియా)తో అఖిలేశ్ ఇటీవలే సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే అన్నట్లుగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ అపర్ణను లాగేస్తే... మళ్లీ ఇంటిపోరు మొదలైనట్లే. ‘మా జోలికొస్తే ఊరుకుంటామా? మీ ఇంటికొస్తాం.. నట్టింటికొస్తాం’ అన్నట్లుగా బీజేపీ ప్రతిదాడికి దిగింది. ములాయంసింగ్ ఇంట్లో చిచ్చు పెట్టడం ద్వారా ఎస్పీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టవచ్చేనేది కమలనాథుల వ్యూహం. ములాయంసింగ్ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్ యాదవ్. – నేషనల్ డెస్క్, సాక్షి -
అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు'
లక్నో: బీజేపీ పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని, దళితులు, వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లు ప్రశ్నార్థకమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ఏ విధంగా ప్రైవేటుపరం చేస్తోందన్న విషయం దళితులు, వెనుకబడిన వర్గాలకు అర్థమైందన్నారు. యూపీ రాష్ట్రాభివృద్ధి సమాజ్‌వాదీ పార్టీనే సాధ్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మంత్రి ధారా సింగ్ చౌహాన్ ఆదివారం అఖిలేష్ సమక్షంలో ఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ లోకి ఫిరాయింపులు పెరుగుతున్నాయి. ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో మంత్రులు చేరిన నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..) పార్టీలో చేరిక సందర్భంగా దారాసింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. '2017లో బీజేపీ ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదాన్ని ఇచ్చింది. అందరి మద్దతును తీసుకుంది. అయితే అభివృద్ధి ఫలాలు మాత్రం కొందరికే దక్కాయి. మేము యూపీ రాజకీయాలను మార్చి అఖిలేష్ యాదవ్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాం. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం' అని చౌహాన్ అన్నారు. అఖిలేశ్‌కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తమతో కలిసొచ్చేందుకు చిన్నాచితకా పార్టీలు ముందుకు రావడం, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండటంతో సమాజ్‌వాదీ పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చినా.. వారందరికీ సీట్ల సర్దుబాటు అంశం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే. మిత్రపక్షాలతో పాటు కొత్తగా వచ్చి చేరుతున్న ఆశావహులకు టిక్కెట్ల కేటాయింపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు పెద్ద సవాల్ విసురుతోంది. ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమైన ఏడు మిత్రపక్ష పార్టీలతో చర్చలు చేసిన అఖిలేశ్, అతిత్వరలోనే కుల, వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే జాబితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 10 మంది ఎస్పీ అభ్యర్థులు, 19 మంది ఆర్ఎల్డీ అభ్యర్థులతో ఎస్పీ సారథ్యంలోని కూటమి తొలి జాబితా వెలువడింది. చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..) -
దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!
అఖిలేష్ యాదవ్‌కు దళితులు అక్కర్లేదు, దళితుల ఓటు బ్యాంకు మాత్రమే కావాలి అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు చర్చల అనంతరం మాట్లాడిన ఆజాద్.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎస్పీతో పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌పై మండిపడ్డారు ఆజాద్. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించాడు అని విమర్శించారు. పైగా అతను బహుజన సమాజ్ ప్రజలను కించపరిచాడని ఆరోపించారు. తాను గత ఆరు నెలలుగా యాదవ్‌తో అనేక చర్చలు నిర్వహించిన పొత్తు కుదరలేదని చెప్పారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో సమాజవాదీ పార్టీ(ఎస్పీ) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను బలోపేతం చేయడానికి అఖిలేష్ యాదవ్ అనేక చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారనేది గమనార్హం. అయితే వెనుకబడిన తరగతులు, దళితులు తమకు సామాజిక న్యాయం చేస్తాడనే నమ్మకంతో యాదవ్‌కు మద్దతు ఇస్తున్నారని ఆజాద్ అన్నారు. కానీ అఖిలేష్ యాదవ్‌కి సామాజిక న్యాయం అంటే అర్థం కావడం లేదని, అది మాటలతో జరగదంటూ ఆజాద్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై యాదవ్ మౌనం వహిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలసిందే. (చదవండి: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ)