కనౌజ్(యూపీ): ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి విరచుకుపడ్డారు. బీజేపీ బాండ్ల రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. చందాల ముసుగులో వసూళ్ల దందాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బలవంతపు వసూళ్ల కోసం సీబీఐ, ఈడీ ఐటీ వంటి సంస్థలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుందని మండిపడ్డారు.
కొందరు కాంట్రాక్టర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా బీజేపీ ఖాతాలోకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లతో ఇప్పు డు బీజేపీ ప్రతిష్ట మసకబారిందని పేర్కొన్నారు. భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని అఖిలేశ్ ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment