Samajwadi Party
-
మైనర్‌పై అత్యాచారం.. ఎస్పీ నేత అరెస్ట్!
లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో రాజకీయ నాయకుడు నవాబ్ సింగ్ యాదవ్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నవాబ్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడని తెలుస్తోంది. మరోవైపు.. నవాబ్ సింగ్‌కు బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం.ఈ ఘటనపై కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యూపీలోని అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 1.30 సమయంలో ఓ బాలిక 112 నంబర్‌కు కాల్ చేసింది. ఈ సందర్బంగా తనపై అత్యాచారం చేశారని, తన అత్తను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో, ఓ పోలీసు ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ నవాబ్ సింగ్, మరో మహిళ ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబ్ సింగ్‌పై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేశాము. కాగా, ఉద్యోగం పేరుతో ఆశ చూపించి నవాబ్ సింగ్ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. #WATCH | Uttar Pradesh: SP leader Nawab Singh Yadav arrested in Kannauj for allegedly attempting to rape a minor girl. Kannauj SP, Amit Kumar Anand says, "Last night around 1.30 am, a call was received on UP 112 wherein a girl said that she had been stripped and an attempt of… pic.twitter.com/7nD114yei9— ANI (@ANI) August 12, 2024 మరోవైపు.. నవాబ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఎస్పీ అమిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవాబ్ సింగ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ, అతడిని రక్షించేందుకు కొందరు బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. The rape survivor minor girl herself called police and took them to the rapist Samajwadi party leader Nawab.He's a close man to Dimple Yadav...Some people really vote for these people? I mean why? pic.twitter.com/6XCIzO5szJ— Mr Sinha (@MrSinha_) August 12, 2024 -
ఈసారి ఓటు మార్పు కోసమే
మెయిన్‌పురి: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా మార్పు కోసమే ఓటేస్తారని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ధీమా వెలిబుచ్చారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామం సైఫైలో పీటీఐ ప్రత్యేక ముఖాముఖిలో పలు అంశాలపై డింపుల్ తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు... బీజేపీపై.. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోయింది. కులాల లెక్కన జనాన్ని విడగొడుతోంది. జనం మనోభావాలతో ఆడుకుంటోంది. కీలక సమస్యల నుంచి జనం దృష్టి మరల్చుతోంది. బీజేపీ రాజకీయ ఒత్తిళ్లతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. విభజన రాజకీయాలతో వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని వారికి తెలిసొచి్చంది. అందుకే కేంద్రంలో ఈసారి అధికార మార్పు కోసమే జనం ఓటేస్తారు.దర్యాప్తు సంస్థలు, ధరలపై.. ఈడీ, సీబీఐ, ఐటీ ఇలా ప్రతి దర్యాప్తు సంస్థనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దురి్వనియోగం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయిలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ జనాన్ని పీడిస్తోంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు జనాలకు చేరట్లేవు. వాగ్దానాలైతే జోరుగా చేస్తున్నారుగానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు అస్సలు కనిపించట్లేదు. దేశాన్ని బీజేపీ ఎటువైపు తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. పోషకాహార లోపం, ఆకలి చావుల రేటింగ్స్, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఏటికేడు దిగజారుతోంది. మళ్లీ బీజేపీ గెలిస్తే దేశం 15 ఏళ్లు తిరోగమనంలోకి వెళ్లడం ఖాయం. దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తరుణంలో వచ్చిన ఎన్నికలివి.మోదీ మంగళసూత్రం వ్యాఖ్యలపై ఇదొక్కటే వాళ్లకు ఆయుధంగా దొరికింది. జనం భవితకు సంబంధించిన ఏ అంశమూ బీజేపీకి పట్టదు. యూపీలో మొత్తం 80 సీట్లు గెలిచేస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అందులో నిపుణులు వాళ్లు. కానీ వాళ్ల మాటలను ఈసారి జనం నమ్మట్లేరు. గట్టి గుణపాఠమే చెప్తారు. అత్యంత అవినీతి నేతలను బీజేపీ లాగేసి డ్రై క్లీనింగ్ మెషీన్లో పడేస్తోంది. అంతా రాజకీయ లబ్దికోసమే చేస్తుంది. గెలుపు మెజారిటీ తగ్గడంపై.. మామ ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి చూస్తే భారీ మెజారిటీ అనేది తగ్గడం వాస్తవమే. 2019లో ఆ మెజారిటీ కేవలం 94000కు తగ్గింది. ఎన్నికలు ఎప్పుడూ ఒకేలా జరగవు. ప్రతిసారీ గెలుపును వేర్వేరు కారణాలు ప్రభావితం చేస్తాయి. తన ప్రచార సరళిపై.. రోజుకు ఎనిమిది, తొమ్మిది మీటింగ్‌లలో పాల్గొంటున్నా. విపక్షాల ‘ఇండియా’ కూటమికి జనం నుంచి వస్తున్న స్పందన అద్భుతం. నా కూతురు అదితి యాదవ్ సైతం తొలిసారిగా ప్రచారంలో పాల్గొంటోంది. గ్రామాలకు వెళ్తూ వారిని కలుస్తోంది. ములాయం మరణంతో వెల్లువెత్తిన సానుభూతి కారణంగానే 2022 మెయిన్‌పురి ఉపఎన్నికల్లో 2.8 లక్షల భారీ మెజారిటీతో ఎస్పీ గెలిచిందన్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజంలేదు. జనం మనసుల్లో మేమే ఉన్నాం. ఈసారీ గెలుపు మాదే. ఆర్మీలో పనిచేస్తున్న యువతతోపాటు వృద్ధులు, మహిళలు అంతా బీజేపీ వాగ్దానాలను నెరవేర్చలేదన్న నిస్పృహలో ఉన్నారు. -
ఎన్నికల్లో ఓటమి భయం.. బీజేపీపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం
లక్నో: త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఇండియా కూటమి అభ్యర్ధులకు బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి జరుగుతున్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భేషరుతుగా ఇండియా కూటమికి భేషరతుగా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో మా పాత్ర , ప్రచారం తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయిస్తారు’అని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇవి సాధారణ ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, నిరంకుశ పాలనను అంతం చేయడం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేం యూపీలో కలిసి పనిచేస్తున్నాం. కూటమిలో భాగంగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్న చోట మేము వారి కోసం పని చేస్తాము అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో భారత కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రతి కార్యకర్త తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఎస్పీ అభ్యర్థుల కోసం పనిచేస్తారని సంజయ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఎన్నికలకు ముందు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌లను జైలుకు పంపినందుకు కేంద్ర ప్రభుత్వంపై యాదవ్ మండిపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలా చేస్తోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరట్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి మార్పు?
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు. 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు. -
బాండ్లు కాదు.. బీజేపీ బలవంతపు వసూళ్లు: అఖిలేశ్
కనౌజ్(యూపీ): ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి విరచుకుపడ్డారు. బీజేపీ బాండ్ల రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. చందాల ముసుగులో వసూళ్ల దందాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బలవంతపు వసూళ్ల కోసం సీబీఐ, ఈడీ ఐటీ వంటి సంస్థలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుందని మండిపడ్డారు. కొందరు కాంట్రాక్టర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా బీజేపీ ఖాతాలోకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లతో ఇప్పు డు బీజేపీ ప్రతిష్ట మసకబారిందని పేర్కొన్నారు. భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని అఖిలేశ్ ఆక్షేపించారు. -
సీబీఐ విచారణకు అఖిలేశ్ గైర్హాజరు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల తవ్వకం కేసులో సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ ఇచి్చన సమన్లను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బేఖాతరు చేశారు. సీబీఐ సమన్ల ప్రకారం గురువారం ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌కు అఖిలేశ్ వెళ్లాలి. కానీ ఆయన లక్నోలోనే ఉండిపోయారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘ అంతకుముందే ఖరారైన షెడ్యూల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గురువారం మీ ఆఫీస్‌కు అఖిలేశ్ రావట్లేదు. కానీ అవకాశం ఉన్నంతమేరకు మీకు నా సహాయసహకారాలు ఉంటాయి’’ అని అఖిలేశ్ తరఫున న్యాయవాది సీబీఐకి వివరణ ఇచ్చారు. తర్వాత లక్నోలో పార్టీ ఆఫీస్‌లో జరిగిన వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సభలో అఖిలేశ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టడాన్ని అఖిలేశ్ ప్రస్తావించారు. -
చిన్న బుద్ధుల పెద్ద ఎన్నిక
అసెంబ్లీలో పార్టీలకు స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నచోట రాజ్యసభ ఎన్నికలనేవి అంతా సజావుగా సాగిపోయే మామూలు తంతు. కానీ, పార్టీ ఏదైనా సరే పాలకపక్షంతో అంటకాగడానికీ, జెండా కన్నా సొంత అజెండాకు పెద్ద పీట వేయడానికీ ప్రజాప్రతినిధులు దిగజారితే, పెద్దల సభకు ఎన్నికలు సైతం చిన్న బుద్ధులకు వేదిక అనిపించక మానవు. ఫిబ్రవరి 27న యూపీ (10 సీట్లు), కర్ణాటక (4 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (1)లలో ఎగువసభ ఎన్నికలు అలానే సాగాయి. హిమాచల్‌లో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు దిగడంతో ఆ పార్టీలు చెరొక స్థానాన్ని బీజేపీకి కోల్పోయాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేసిన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ నాలుగింట తనకు దక్కాల్సిన 3 స్థానాల్ని నిలబెట్టుకుంది. మంగళవారం 15 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగితే, బీజేపీ తన బలంతో గెలవగలిగిన వాటి కన్నా రెండు సీట్లు ఎక్కువగా 10 సొంతం చేసుకుంటే, కాంగ్రెస్, ఎస్పీలు తమ సంఖ్యాబలం కన్నా చెరొకటి తక్కువగా వరుసగా 3, 2 సీట్లే దక్కించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల్ని రకరకా లుగా ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్‌కు దిగజార్చే దుష్టసంస్కృతి పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు మరో సారి రుజువైంది. రాజ్యసభ ఎన్నికలకు విప్ల జారీ కుదరదు కానీ, తమ పార్టీ నియమించిన ఏజెంట్‌కు లెజిస్లేటర్లు తమ బ్యాలెట్ పేపర్లు చూపాలి. అయినా సరే, ఎమ్మెల్యేలు తామున్న పార్టీ వైఖరికి భిన్నంగా ఓటేయడం వర్తమాన రాజకీయాలలో విలువల పతనానికి విషాద నిదర్శనం. చిత్రమేమంటే, హిమాచల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మనుగడనే బీజేపీ ప్రశ్నార్థకం చేసింది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో గత ఏడాదే గెలిచి, హస్తం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి తమ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలే తమకున్నారని అధికార కాంగ్రెస్ పెద్దలు ఏమరుపాటుగా ఉంటే, అదను కోసం చూస్తున్న ప్రతిపక్ష బీజేపీ తమ ‘ఆపరేషన్ కమల్’కు పదును పెట్టింది. ఫలితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఫలితంగా, మెజారిటీతో ఇట్టే గెలవాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి – ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి కాస్తా ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థితో సమానంగా మాత్రమే ఓట్లొచ్చిన పరిస్థితి. లాటరీలోనూ అదృష్టం బీజేపీ పక్షాన నిలిచేసరికి, ఆ రాజ్యసభా స్థానం కాంగ్రెస్ చేజారింది. హిమాచల్‌లో కొద్దినెలలుగా కుతకుతలాడుతున్న అసంతృప్తిని అలక్ష్యం చేసి, బీజేపీ ‘ఆకర్షణ మంత్రాన్ని’ తక్కువగా అంచనా వేసి, కాంగ్రెస్ చేజేతులా ఈ ఓటమి కొనితెచ్చుకుంది. చివరకు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాల్సినవేళ సభలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే దుఃస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యంగానైనా బరిలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. సీనియర్ నేతలు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా తదితరుల్ని హిమాచల్ పంపింది. సుఖూ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఈ విషయంపై వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం తాజా బుజ్జగింపులతో అంతా సద్దుమణుగుతుందా అన్నది చూడాలి. ‘నేను పోరాట యోధుణ్ణి, రాజీనామా ప్రసక్తే లేదు’ అని సీఎం సుఖూ బింకంగా చెబుతున్నా, సభలో మెజారిటీ ఆయనకుందా, సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నందున ఆయన అధికారంలో కొనసాగగలరా అన్నది అనుమానమే. మొత్తం 68 మంది సభ్యుల హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలగం 40 మంది. ఆరుగురి క్రాస్ ఓటింగ్‌తో దాని బలం 34కు పడిపోయింది. ఇక, బీజేపికి 25 మంది ఉంటే, ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు. బీజేపీ పాలిత హర్యానాలో పంచ కులాలో మకాం వేసిన కాంగ్రెస్ రెబెల్స్‌తో కలుపుకొంటే కాషాయ బలమూ 34కు చేరింది. సభలో మెజారిటీ మార్కు 35. ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను సంప్రతిస్తున్నారని బీజేపీ అంటున్నందున ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో నాటకీయత పెంచుతూ బుధవారం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌తో ఇప్పటికి గండం గట్టె క్కాలన్నది తాపత్రయం. అదే జరిగినా, సుఖూను వ్యతిరేకిస్తూ, సీఎం పీఠానికై విక్రమాదిత్య సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమా రుడైన విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించడం కథలో కీలక మలుపు. ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీకి దక్కినా, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా, ఆఖరుకు అక్కడ బీజేపీయే అధికార చక్రం తిప్పడం కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధోరణి. సామ దాన భేద దండోపా యాలు ప్రయోగించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ఇప్పుడు తిరుగులేని రికార్డు. 2019లో కర్ణాటకలో జేడీ–ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం, 2020లో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, 2022లో మహారాష్ట్రలోని శివ సేన ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్... ఇలా గత నాలుగేళ్ళలో కాషాయపార్టీ పాలబడినవి ఎన్నో. తాజాగా హిమాచల్‌లోని సుఖూ సారథ్య కాంగ్రెస్ సర్కార్ ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సుఖూ పట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్. కానీ, ఒక పార్టీ అంతర్గత విభేదాల కుంపటిలో మరొక పార్టీ చలి కాచుకొని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. సంతలో ప్రజాప్రతినిధులను కొని, ప్రజాతీర్పు తమ వైపు ఉందని ఏ పార్టీ భావించినా అది అవివేకం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం చూసి సమాధానం చెబుతారు. -
భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేశ్
ఆగ్రా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆగ్రాలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు. భారీగా హాజరైన ఇరుపార్టీల కార్యకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల శక్తిని చూసి భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు తగు గౌరవం ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీలకు బీజేపీ తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొ న్నారు. అంతకుముందు నేతలు ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోడో యాత్రలో అఖిలేశ్ పాల్గొనడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. -
అలా అని కొంపదీసి మనల్ని బయటకు పంపరుగా..!
అలా అని కొంపదీసి మనల్ని బయటకు పంపరుగా..! -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
Parliament elections 2024: రాయ్‌బరేలీ, అమేథీల్లో సమరమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వారి కంచుకోటలుగా పేరొందిన లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు విఫలమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీని ఆహా్వనించాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలను నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), అప్నాదళ్ (కమేరావాదీ)తో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కొనసాగిస్తోంది. సర్వశక్తులూ ఒడ్డుతాం: అఖిలేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడుతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పారీ్టతో స్నేహాన్ని వదులుకొని, తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమను బాగా అవమానించిందన్న భావన ఆయనలో ఉందంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పారీ్టకి బలమైన క్యాడర్ ఉంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పారీ్టకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి నలుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సిట్టింగ్ ఎంపీ సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. రాయ్‌బరేలీ నుంచి ఉంచాహర్ ఎమ్మెల్యే మనోజ్ పాండేను, అమేథీ నుంచి గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్‌సింగ్‌ను బరిలో దింపే యోచనలో అఖిలేశ్ ఉన్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు లేనప్పుడు రాయ్‌బరేలీ, ఆమేథీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను పోటీ చేయించలేదు. ఈసారి మాత్రం పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
‘ఇండియా’ భారత్ అంత ఐక్యంగా ఉండాలేమో సార్!
‘ఇండియా’ భారత్ అంత ఐక్యంగా ఉండాలేమో సార్! -
వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్
లక్నో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’అధికార బీజేపీని ఓడిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీతోపాటు మిత్ర పక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2024లో బీజేపీని ఇండియా ఓడించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాలు ఎన్నికలు ముందొచ్చినా, తర్వాత వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని మీడియాతో అన్నారు. -
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్‌లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్‌లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్‌లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్‌లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్‌లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్‌ఫ్రంట్‌లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
విపక్ష కూటమి తథ్యం: అఖిలేశ్
ఇండోర్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఇదే నిజమైన నివాళి.. సీఎం యోగికి ధన్యవాదాలు..
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఓ హత్య కేసు(ఉమేశ్ పాల్‌కు సంబంధించిన కేసు)లో నిందితుడిగా ఉన్న అసద్‌ను.. ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే.. ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌పై ఉమేశ్ పాల్ తల్లి శాంతి దేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్కౌంటర్.. నా కొడుకు మరణానికి ఇచ్చిన నిజమైన నివాళి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నాకు, మా కుటుంబానికి న్యాయం చేసినందకు సీఎం యోగికి జీకి ధన్యవాదాలు. మున్ముందు కూడా మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం యోగిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ విధులను నిర్వర్తించిన ముఖ్యమంత్రికి, పోలీసు శాఖకు ధన్యవాదాలు అని అన్నారు. After the encounter of former MP Atiq Ahmed's son Asad and his aide, CM Yogi Adityanath took a meeting on law and order. CM Yogi praised UP STF as well as DGP, Special DG law and order and the entire team. Sanjay Prasad, Principal Secretary Home informed the CM about the… pic.twitter.com/4IzTxkLwxs — ANI (@ANI) April 13, 2023 మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఈ సందర్బంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి కోర్టులపై నమ్మకం లేదని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందని విమర్శించారు. ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు వారికి లేదన్నారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ అనే లాయర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అసద్‌తో పాటు గులాం అనే ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం వాళ్లను పట్టుకునే యత్నం చేసిన పోలీసులపై ఇద్దరూ కాల్పులు ప్రారంభించగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో అసద్‌తో పాటు గులాం కూడా చనిపోయాడు. వీళ్లిద్దరిపై ఐదేసి లక్షల రూపాయల రివార్డు ఉంది. మరోవైపు.. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను 2006లో కిడ్నాప్ చేశాడనే కేసు అతిఖ్ అహ్మద్‌పైనా ఉంది. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిఖ్ అహ్మద్‌కు నెలలో శిక్ష కూడా పడింది. సుమారు వంద కేసుల్లో నిందితుడైన అతిఖ్ అహ్మద్.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరుతో తననూ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. "Tribute to my son," Umesh Pal's mother thanks CM Yogi after Atiq Ahmed's son killed in encounter Read @ANI Story | https://t.co/i9jHYMPmaZ #UmeshPal #CMYogi #AtiqAhmed #Encounter pic.twitter.com/4Ifyz9Z8MQ — ANI Digital (@ani_digital) April 13, 2023 -
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్!
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్! -
సమాజ్‌వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు యూపీ అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. పదిహేనేళ్ల కిందటి నాటి కేసులో(2008).. సువార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌కు మోరాదాబాద్ కోర్టు రెండేళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన ఫిబ్రవరి 13వ తేదీ నాటి నుంచి అబ్దుల్లాపై అనర్హత వేటు అమలులోకి వస్తుంది అంటూ అసెంబ్లీ సెక్రెటరీ పేరిట ప్రకటన వెలువడింది. అబ్దుల్లా అజాం ఖాన్ ఎవరో కాదు.. ఎస్పీ దిగ్గజనేత, వివాదాస్పద అజాం ఖాన్ తనయుడు. ఏం జరిగిందంటే.. డిసెంబరు 31, 2007న రాంపూర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SEPF) క్యాంపుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. యూపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే 2008, జనవరి 29వ తేదీన అజాం ఖాన్, అబ్దుల్లా ఖాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని తనిఖీ చేయడం కోసం పోలీసులు ఆపారు. దీనిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు తండ్రీకొడుకులు. అయితే.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీళ్లిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులోనే మోరాదాబాద్ కోర్టు తాజాగా ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ.. రెండేళ్ల శిక్షలు ఖరారు చేసింది. మరో విశేషం ఏంటంటే.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొవడం అబ్దుల్లా అజాం ఖాన్‌కు ఇది రెండోసారి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గంలో ఎస్పీ తరపున పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. అయితే.. అప్పటికీ ఎమ్మెల్యేగా అర్హత వయసు(25 సంవత్సరాలు) నిండకుండానే నామినేషన్స్ దాఖలు చేశాడు అతను. ఈ పంచాయితీ కోర్టుకు ఎక్కింది. దీంతో.. 2020లో.. అలహాబాద్ హైకోర్టు అతని ఎన్నికను రద్దు చేసింది. అయితే తిరిగి 2022 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. చట్ట సభ్యులెవరైనా సరే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష గనుక పడితే.. వాళ్ల సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది. -
Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ భారీ విజయం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని 5 రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడుతున్నాయి. ఇందులో ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్ పూరి లోక్‌సభ స్థానం కూడా ఒకటి. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్‌లో మృతి చెందడంతో మెయిన్‌పూరి లోక్‌సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ఎస్పీ తరపున ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. మెయిన్‌పూరి ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడు లక్షల బంపర్ మెజార్టీతో మెయిన్‌పూరిని కైవసం చేసుకున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2,88,461 ఓట్ల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేశారు. మొయిన్‌పూరి విజయంపై డింపుల్ యాదవ్ స్పందించారు.. తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మినందుకు మెయిన్‌పురి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం నేతాజీకి (దివంగత ములాయం సింగ్ యాదవ్) అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దింపినా ఓటర్లు మాత్రం డింపుల్‌వైపు మొగ్గుచూపారు. ఒకానొక దశలో ఆమె వెనుకంజలో ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ పుంజుకొని మెజార్టీ సాధించారు. సమాజ్‌వాదీకి కంచుకోటగా పిలిచే మొయిన్‌పూరిలో సైకిల్ పరుగులు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సహంలో మునిగిపోయారు. చదవండి: గుజరాత్ ఎన్నికలతో చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్ కాగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్.. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
Dimple Yadav: మామ స్థానంలో బరిలో కోడలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ట్విటర్లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వీటితోపాటే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. समाजवादी पार्टी द्वारा लोकसभा क्षेत्र मैनपुरी उपचुनाव - 2022 हेतु श्रीमती डिंपल यादव पूर्व सांसद को प्रत्याशी घोषित किया गया है। pic.twitter.com/gZIvtETfLT — Samajwadi Party (@samajwadiparty) November 10, 2022 మామ ములాయంతో డింపుల్ (పాత ఫొటో) మోదీ 2.0 వేవ్‌ను తట్టుకుని ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థిపై 94వేల ఆధిక్యంతో 2019 ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి నెగ్గారు. అయితే 2014లో ములాయం ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గడం గమనార్హం. దీంతో మెయిన్‌పురి ఆయన ఇలాకాగా పేరు దక్కించుకుంది. భర్త అఖిలేష్‌తో డింపుల్ మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్(44).. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. -
దివంగత ములాయం సింగ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీలో ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్‌తోపాటు, ఎమ్మెల్సీ కవిత, పలువురు టీఆర్ఎస్ నాయకులు ములాయంకు నివాళులు అర్పించారు. అనంతరం ములాయం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖలతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. #Telangana Chief Minister KCR paid respects and offered tributes to the mortal remains of the #SamajwadiParty patriarch #MulayamSinghYadav ji and consoles his son and former CM of UP #AkhileshYadav at Saifai today. #Saifai #UttarPradesh #Netaji #Dhartiputra #MulayamSingh #KCR pic.twitter.com/4dPPPlskDi — Surya Reddy (@jsuryareddy) October 11, 2022 #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. -
ములాయం సింగ్ యాదవ్ అరుదైన (ఫొటోలు)
-
సొంతంగా కారు కూడా లేదు.. ములాయం సింగ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి, మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు అక్టోబర్ 11(మంగళవారం) సౌఫయ్ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు. ములాయం సింగ్ ఆస్తులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ములాయం సింగ్ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు. చదవండి: ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బీఎఫ్సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566. చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు! కారు లేదు, కొడుకు నుంచి అప్పు ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు. ఎస్పీలో విషాదఛాయలు ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా 22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా! ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. -
ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా!
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తు అయితే.. యూపీ రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారాయన. ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా.. భారతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. బీసీ నేతగా.. యూపీలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, ఔనత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు.. అభిమానుల చేత ముద్దుగా ‘నేతాజీ’ అని పిలిపించుకుంటూ.. లక్షల మంది ఎస్పీ కార్యకర్తలను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ► ములాయం సింగ్ యాదవ్.. 1939 నవంబర్ 22న ఎటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మూర్తి దేవి, సుఘార్ సింగ్‌లు. పేద కుటుంబం అయినప్పటికీ కష్టపడి బాగా చదువుకుని పైకొచ్చారు ములాయం. ► ములాయం సోదరి కమలా దేవి, శివపాల్ సింగ్ యాదవ్, రతన్‌సింగ్ యాదవ్, అభయ్ రామ్ యాదవ్, రాజ్‌పాల్ సింగ్ యాదవ్ సోదరులు. దగ్గరి బంధువు రామ్ గోపాల్‌యాదవ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ► ములాయం చదివింది ఎంఏ. సోషలిస్ట్ మూమెంట్లో, రాజకీయాల్లో చేరకముందు మెయిన్‌పురిలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెపారు ములాయం. ► సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు అంతా ములాయంను నేతాజీ( గౌరవ నేత) అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి దూరం అయ్యారో.. అప్పటి నుంచి అఖిలేష్‌కు ఆ పిలుపు సొంతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎస్పీ నుంచి ఆ గౌరవం అందుకునే అర్హత ఒక్క ములాయంకే పార్టీ శ్రేణులు బలంగా ఫిక్స్ అయిపోయాయి. ప్రొఫెషనల్ రెజ్లర్ ములాయం సింగ్ యాదవ్ ప్రొఫెషనల్ కుస్తీ వీరుడు కూడా. రాజకీయాలు ఛాయిస్ కాకుంటే ఆయన మల్లు యుద్ధవీరుడిగా గుర్తింపు దక్కించుకునేవారేమో. మెయిన్‌పురిలో ఓసారి జరిగిన కుస్తీ పోటీల్లో కుర్రాడిగా ములాయం పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నాథూ సింగ్.. ములాయం కుస్తీ పట్లకు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత జస్వంత్ నగర్ సీటును ములాయంకు ఇప్పిదామని నాథు సింగ్ ప్రయత్నాలు చేసినా అది ఎందుకనో కుదర్లేదు. ఇక ములాయంను ముద్దుగా పహిల్వాన్ అని పిలుస్తుంటారు. రెండు వివాహాలు.. ములాయం సింగ్ యాదవ్‌కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి వివాహం మాలతీ దేవి. వీరికి అఖిలేష్ యాదవ్ సంతానం. దీర్ఘకాలిక సమస్యలతో 2003లో మాలతీ దేవి కన్నుమూశారు. మొదటి భార్య బతికున్న సమయంలో.. 1980 సమయంలో సాధనా గుప్తాతో ఆయన సహజీవనం కొనసాగించారు. వీళ్లకు ప్రతీక్ యాదవ్ అనే కొడుకు ఉన్నాడు. 2007 ఫిబ్రవరిలో ములాయం చెప్పేదాకా వీళ్లిద్దరికీ వివాహం అయ్యిందనే విషయం ఈ సమాజానికి తెలియలేదు. జులై 9, 2022న సాధనా గుప్తా అనారోగ్యంతో కన్నుమూశారు. రాజకీయాలు ఇలా.. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలతో ఇటుగా అడుగులేశారు. పదిహేనేళ్ల వయసులో ములాయం.. జానేశ్వర్ మిశ్రా, రామ్ సేవక్ యాదవ్, కర్పూరీ థాకూర్.. ఇలా ఎందరినో కలిశారు. ► 1960లో జనతా దళ్‌లో చేరారు ములాయం. 1962లో ములాయం.. షికోహాబాద్‌లోని ఏకే కాలేజీ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ► 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977ల తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో ఏకంగా జనతా దళ్‌కు జాతీయాధ్యక్షుడు అయ్యాడు. ► 1982లో యూపీ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లపాటు అలా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1985లో జనతా దల్ చీలిపోయాక.. చంద్ర శేఖర్, సీపీఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారాయన. ► 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలాక.. చంద్ర శేఖర్ జనతా దల్(సోషలిస్ట్)లో చేరారు ములాయం. కాంగ్రెస్, జనతా దల్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. ► 1991 ఏప్రిల్‌లో.. కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోగా.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ములాయం.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. ► ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్సీ)తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ► ఆపై దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కొనసాగింది. పార్లమెంటేరియన్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో(1996లో) మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ములాయం. దీంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ► అయితే.. 1998లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన రక్షణ మంత్రి కోల్పోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంభల్, కన్నౌజ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నెగ్గారు ఆయన. అయితే తనయుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003, సెప్టెంబర్‌లో తిరిగి.. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో.. గున్నావుర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. రికార్డు స్థాయి బంపర్‌మెజార్టీతో 2004 జనవరిలో గెలిచారాయన. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అందుకే సైకిల్ సింబల్! పేద కుటుంబంలో పుట్టిన ములాయంకు.. చిన్నప్పుడు సైకిల్ నడపాలనే కోరిక విపరీతంగా ఉండేదట. కానీ, తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇక కొంచెం సంపాదన వచ్చాక.. అద్దె సైకిల్‌తో ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్తూ సరదా తీర్చుకున్నారాయన. ఎప్పుడైతే.. సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించారో.. అప్పుడే తన పార్టీకి సైకిల్ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయారట. ► తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా వ్యవహరించారు. ► ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. మొత్తం జీవిత కాలంలో వివిధ రకాల ఉద్యమాలు, ఇతరత్రాలతో తొమ్మిసార్లు జైలుకు వెళ్లారు. వివాదాలు.. ► అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు.. తరువాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పాయి. ► 2012 నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మగాళ్లు అన్నాక తప్పులు చేయడం సహజమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ సైతం స్పందించారు. ఇక ములాయం చేఏసిన వ్యాఖ్యలకు మోహాబా జిల్లా కోర్టు ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. ► టిబెట్ సార్వభౌమాధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. ► ఇక ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ 2012లో యూపీ సీఎం అయ్యాక.. కుటుంబ కలహాలు బయటపడ్డాయి. సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వేరు కుంపటితో వివాదం రచ్చకెక్కింది. ఒక గ్రూప్‌కు అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా.. మరో గ్రూప్‌నకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌లు, అమర్ సింగ్‌లు నేతృత్వం వహించారు. ► తండ్రికి ఎదురు తిరిగేలా అఖిలేష్ నిర్ణయాలు తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. చివరికి.. 2016 డిసెంబర్ 30న ఏకంగా కొడుకు అఖిలేష్, బంధువు రామ్ గోపాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే.. 24 గంట్లోలనే ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ.. ► దానికి బదులుగా తన తండ్రికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. తనను తాను పార్టీ చీఫ్‌గా ప్రకటించుకున్నారు. ఈ మేరకు జనవరి 1, 2017 నిర్వహించిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ములాయం బహిరంగంగా ఖండించారు. అయితే.. ఎన్నికల సంఘం కూడా అఖిలేష్ నిర్ణయానికి మద్దతుగా.. ములాయం ఆదేశాలను తప్పుబట్టడంతో.. అప్పటి నుంచి అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మీద 2021లో డైరెక్టర్ సువేందు రాజ్ ఘోష్ ‘మెయిన్ ములాయం సింగ్ యాదవ్’ అనే చిత్రాన్ని తీశాడు. అమిత్ సేథీ ఇందులో ములాయం పాత్రలో కనిపించారు. ఇక 2019లో విజయ్ గుట్టే డైరెక్ట్ చేసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో సుభాష్ త్యాగి, ములాయం సింగ్ యాదవ్ పాత్రలో కనిపించారు. -
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ములాయం సింగ్ యాదవ్.. 1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో పాటు సైఫయిలో అధికారిక లాంఛనాలతో ములాయం అంత్యక్రియలకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
విషమంగానే ములాయం ఆరోగ్యం
లక్నో/గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి వర్గాలు గురువారం తెలిపాయి. ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ములాయంను ఆదివారం మేదాంత ఐసీయూలో చేర్పించిన విషయం తెలిసిందే. -
‘కేంద్రంలో అధికార మార్పునకు అదే సంకేతం’
లక్నో: బిహార్‌లో ఎన్డీఏ కూటమి అధికార పీఠాన్ని చేజార్చుకుందని, ఈ పరిణామం హస్తినలో అధికార మార్పునకు శుభసూచక మని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే బలమైన జాతీయస్థాయి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అఖిలేశ్ లక్నోలో పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సరిసాటి అయిన ప్రత్యామ్నాయ కూటమి అవతరిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వీపీ సింగ్‌ల నాటి స్వల్పకాలిక కూటమి ప్రభుత్వాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సుస్థిర, అభివృద్ది చోదక, ప్రభావవంతమైన నాయకత్వంలో కొనసాగే ప్రభుత్వాన్నే ప్రస్తుతం దేశం కోరుకుంటోంది’ అని అఖిలేశ్ అన్నారు. మీరు కోరింది ఇదేగా: రవిశంకర్ ప్రసాద్ ‘సుధృఢ ప్రభుత్వం కావాలనేదే మీ అభిలాష. ప్రధాని మోదీ సారథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అదే’ అంటూ అఖిలేశ్‌నుద్దేశిస్తూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. -
అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: ముప్ఫై ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు సీనియర్ నేత కపిల్ సిబల్. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసి.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చాలారోజులైందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్‌ను వీడడంపై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. పార్లమెంట్లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. అందుకే బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి.. అని కపిల్ సిబల్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, తానేమీ తమాషా చేయదల్చుకోలేదని, సంకేతాలు ఇచ్చినా ముందస్తుగా ఎవరికీ తెలియకపోవడం అనేది తనను కూడా ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు. ఇదిలా కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జీ-23లో కపిల్ సిబల్ కూడా ఉండేవారు. గాంధీ కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం కూడా వినిపించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన కపిల్ సిబల్.. సీనియర్ లాయర్‌గా, న్యాయ నిపుణుడిగా కాంగ్రెస్ లీగల్ వింగ్‌ను పర్యవేక్షించారు కూడా. ఆయన నిష్క్రమణతో ఒకరకంగా కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: అంతా ఒక్కతాటిపైకి రావాలి-కాంగ్రెస్‌ను వీడాక కపిల్ సిబల్ -
Kapil Sibal: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్ బై
లక్నో: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, జి–23లోని కీలక సభ్యుడు కపిల్ సిబల్ (73) కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. మే 16వ తేదీనే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేగాక సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ఆయనతో పాటున్నారు. నామినేషన్ అనంతరం సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో తనది మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధమని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ నెల 16వ తేదీనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నేనిక ఆ పార్టీ నాయకుడిని కాదు’’ అని తేల్చిచెప్పారు. అంతా ఒక్కతాటిపైకి రావాలి ‘‘కాంగ్రెస్‌తో నాకు లోతైన అనుబంధముంది. 30–31 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగడం మాములు విషయం కాదు. నేను కాంగ్రెస్‌లో చేరడానికి ముఖ్య కారణం దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 31 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానంటే ఏం జరిగిందో ఆలోచించండి. అందుకే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు (పార్టీకి రాజీనామా) తీసుకోకతప్పదు. అయితే నా సిద్ధాంతం కాంగ్రెస్‌తో ముడిపడి ఉంటుంది. కాంగ్రెస్ సిద్ధాంతానికి నేను దూరం కాలేదు. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. పార్టీలో క్రమశిక్షణ పాటించాలి. అదేసమయంలో స్వతంత్రంగా గొంతుక వినిపించే అవకాశం ఉండాలి. మీరు గొంతెత్తినప్పుడు మరో పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శలు వచ్చే పరిస్థితి ఉండకూడదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి వ్యక్తిగతం కృషి చేస్తా. అన్ని సిద్ధాంతాలను కలుపుకొని ముందుకెళ్తాం. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం), స్టాలిన్ (తమిళనాడు సీఎం).. ఇలా ఎవరైనా కావొచ్చు. అందరూ చేతులు కలపాలి. 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలి’’ అని కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ: కె.సి.వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ నిష్కృమణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ అని, అందులో చాలామందికి చోటు ఉందని వ్యాఖ్యానించారు. హరియాణాలో రెండు రోజుల క్రితం 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, దానికి మీడియాతో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. అజంఖాన్ సిఫార్సుతోనే.. సిబల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సమాజ్‌వాదీ మద్దతు వెనక ఆ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మద్దతుందని చెప్తున్నారు. ఆయనకు బెయిల్ ఇప్పించడంలో సిబల్ కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని ఎస్పీ నాయకత్వాన్ని అజంఖాన్ కోరినట్లు తెలిసింది. ఎస్పీకి యూపీ నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపింత సంఖ్యాబలం ఉంది. సిబల్ వంటి సీనియర్ నేత, లాయర్ రాజ్యసభలో ఉండడం దేశానికి మంచిదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. సిబల్ రాజ్యసభ పదవీ కాలం జూలై 4తో ముగియనుంది. సిబల్ కొంతకాలంగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తి వార్తల్లోకెక్కారు. గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సునీల్ జాఖడ్, హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. #WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022 -
బీజేపీ కూటమిలోకి శివ్‌పాల్ యాదవ్?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చిన్నాన్న, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శనివారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. దీంతో ఎస్పీ నేతృత్వంలోని విపక్ష కూటమికి బీటలు వారుతున్నాయన్న వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ శనివారం తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. మార్చి 26న జరిగిన ఎస్పీ కొత్త ఎమ్మెల్యేల భేటీకి శివపాల్‌ను అఖిలేశ్ ఆహ్వానించలేదు. వారం క్రితం జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి శివపాల్ హాజరుకాలేదు. తర్వాత సీఎం యోగితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాంతో శివపాల్ బీజేపీ కూటమిలో చేరతారని వదంతులు ఎక్కువయ్యాయి. శివపాల్‌కు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికారంలోకి రాకపోవడంతో.. ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఎంపీగానే కొనసాగుతాడంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓ పుకారు వినిపించింది. అయితే ఆ ఊహాగానాల్ని పటాపంచల్ చేస్తూ.. ఎంపీ పదవికే రాజీనామా చేశారాయన. మంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయానికి వెళ్లిన అఖిలేష్.. తన సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కార్హల్ నిజయోకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి రాకపోయినా.. ప్రజా తీర్పును శిరసావహిస్తానని, ప్రతిపక్ష హోదా దక్కడంతో ఇకపై యోగి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటానని అన్నారాయన. అసెంబ్లీలో యోగి సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. #WATCH | Delhi: Samajwadi Party (SP) chief Akhilesh Yadav going to Lok Sabha Speaker Om Birla's office to resign from his membership of the House. In the recently held Uttar Pradesh elections, he was elected as an MLA from the Karhal seat. pic.twitter.com/IBjc4jqr8t — ANI (@ANI) March 22, 2022 బీజేపీ అభ్యర్థి సింగ్ బాఘెల్‌పై ఆయన 67 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు అఖిలేష్. యూపీ మాజీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అజాంఘడ్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. -
అమిత్ షాతో భేటీ పచ్చి అబద్ధం
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మార్చే వార్త ఒకటి గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టడమే కాదు.. ఆరు సీట్లు గెల్చుకుంది సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ SBSP. అయితే Suheldev Bharatiya Samaj Party అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, తిరిగి బీజేపీ భాగస్వామిగా చేరబోతున్నారంటూ కథనాలు వస్తుండడం ఊహాగానాలకు తెర తీసింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్, అమిత్ షాతో భేటీ అయిన యూపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. షాతో పాటు పలువురు బీజేపీ నేతలతో హస్తినలో ప్రకాశ్.. వరుస భేటీలు జరిగినట్లు శుక్రవారం కథనాలు వెలువడ్డాయి. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలంటూ కొన్ని వైరల్ అయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌భర్ తీవ్రంగా స్పందించారు. Those are old photos. Someone can repost the old photos and say whatever they want: Om Prakash Rajbhar, Suheldev Bharatiya Samaj Party chief on reports of him meeting Union HM Amit Shah pic.twitter.com/y6Gz0K0ZoP — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 19, 2022 ‘‘అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది పుకారు మాత్రమే. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు పాతవి. పాత ఫొటోలను పోస్ట్ చేసి.. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఎస్పీతోనే మా పొత్తు కొనసాగుతుంది. ఈ నెల 28న సంయుక్త కార్యచరణ కోసం భేటీ కాబోతున్నాం. స్థానిక ఎన్నికల్లోనూ ఎస్పీతో కలిసే పోటీ చేస్తాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది’’ అని ప్రకటించారాయన. पुरानी फ़ोटो लगाकर माहौल बनानें के चक्कर मे खबर ही फर्जी बन गयी.... कृपया अफवाहों पर सावधान रहें... — Arun Rajbhar (@ArunrajbharSbsp) March 19, 2022 ఇక ఈ పుకార్లను ఎస్బీఎస్పీ జాతీయ కార్యదర్శి అరవింద్ రాజ్‌భర్ కూడా ఖండించారు. ‘‘బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామనే వార్తలో నిజం లేదు. ఎస్పీతోనే మేం ఉంటాం. మరోవైపు పార్టీ ప్రతినిధి పీయూష్ మిశ్రా కూడా పుకార్లను ఖండిస్తూ ట్వీట్ చేశారు. सुहेलदेव भारतीय समाज पार्टी का भारतीय जनता पार्टी के साथ जाने की खबर निराधार है, पार्टी समाजवादी पार्टी के साथ थी,है और रहेगी ! — Piyush Mishra (@PMLUCKNOW) March 19, 2022 ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ SBSP గతంలో బీజేపీతో పొత్తు కొనసాగించింది. 2017 యోగి ఆదిత్యానాథ్ అధికారంలోకి వచ్చాక.. కేబినెట్లో రాజ్‌భర్ కూడా చేరారు. అయితే.. వెనుకబడిన వర్గాలను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ రెండేళ్ల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి కూటమి నుంచి బయటకు వచ్చేశారు. -
బీజేపీకే 54% హిందూ ఓట్లు
లక్నో: తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన ఓటింగ్ ధోరణి స్పష్టంగా కన్పించిందని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే పేర్కొంది. హిందూ ఓట్లలో సగానికి పైగా బీజేపీకి పడగా ఏకంగా మూడింట రెండొంతుల మంది ముస్లింలు సమాజ్‌వాదీకి ఓటేసినట్టు వివరించింది. అయితే బీజేపీకి ముస్లిం ఓట్లు, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీకి హిందూ ఓట్లు పెరిగినట్టు తెలిపింది. ‘‘2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి. ఎస్పీకి హిందూ ఓట్లు కూడా 18 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి’’ అని వెల్లడించింది. హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో అఖిలేశ్ యాదవ్ పలు హిందూ దేవాలయాలను సందర్శించడం తెలిసిందే. బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా 80 శాతం మంది ప్రజలు బీజేపీకే మద్దతుగా ఉన్నారంటూ పదేపదే ‘80–20’ ప్రచారం ద్వారా హిందూ–ముస్లిం భావోద్వేగాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. సమగ్రమైన శాంపిల్స్ ఆధారంగా సర్వే జరిగినట్టు సీఎస్డీఎస్ రీసెర్చ్ విభాగమైన లోక్‌నీతి కో డైరెక్టర్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. ► హిందూ ఓటర్లలో 54 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 2017లో ఇది 47 శాతమే. ► బీఎస్పీకి 14 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం హిందూ ఓట్లు దక్కాయి. ► ముస్లిం ఓటర్లలో ఏకంగా 79 శాతం మంది సమాజ్‌వాదీకే ఓటేశారు. 2017లో ఇది 46 శాతం మాత్రమే! ► బీజేపీకి 8 శాతం ముస్లిం ఓట్లు పడ్డాయి. 2017లో ఇది 5 శాతమే. ► బీజేపీ కూటమి నుంచి గెలిచిన 273 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ముస్లిం కూడా లేరు. ► బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెటివ్వలేదు. మిత్రపక్షం అప్నాదళ్ ఒకరికి అవకాశమిచ్చింది. ► బీఎస్పీకి 6 శాతం ముస్లిం ఓట్లు మాత్రమే పడ్డాయి. 2017లో ఇది 19 శాతం ► 2017 కంటే 10 మంది ఎక్కువగా ఈసారి 34 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ► వీరిలో 31 మంది ఎస్పీ అభ్యర్థులే. మిగతా ముగ్గురు కూడా ఎస్పీ మిత్రపక్షాలు ఆరెల్డీ, ఎస్బీఎస్పీ తరఫున పోటీ చేశారు. -
ఎస్పీని బోల్తా కొట్టించిందీ.. కమలాన్ని వికసింపజేసిందీ ఆ 10 అంశాలే!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉన్న కొన్ని పార్టీలకు ఓటర్లు భారీ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ బీజేపీకే యూపీ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2012 తరహాలో ఎలక్షన్ రిజల్ట్‌ను పునరావృతం చేయాలని భావించిన సమాజ్‌వాదీ పార్టీకి మరోసారి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. కానీ, 1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ రికార్డు సాధించింది. యూపీలో గతంలో ప్రతిపక్షానికి 50 సీట్లు దాటిన దాఖలాలు లేవు. బీజేపీ గెలుపునకు కారణాలు ఇవే.. 1. రామ మందిర నిర్మాణం.. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజు నుంచే అధికార బీజేపీ రామమందిర నిర్మాణం అంశాన్ని హైలెట్ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేసింది. పక్కా ప్లాన్‌తో ముందుకు సాగింది. 2. ఎన్నికల ప్రచారంలోకి కీలక నేతలు.. యూపీలో కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారింది. 3. యోగి కాంట్రవర్సీ కామెంట్స్.. ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. బూల్డోజర్ల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే సహించేది లేదంటూ.. నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వారి కోసం బూల్డోజర్లు రెడీగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారమే చెలరేగింది. కానీ, అదే చివరకు అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలు శిక్ష వంటి అంశాలు కూడా కలిసొచ్చాయి. 4. అట్రాక్ట్ చేసిన ఉచిత పథకాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ.. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్-2022 పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలకు ఓటర్లలు ప్రభావితం అయ్యారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాల కాన్సెప్ట్ కూడా ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించింది. 5. ఫలించిన గో సంరక్షణ మంత్రం.. యూపీలో గోవధపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గోవులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము అధికారంలోకి వస్తే గోవుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్టు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఓటమికి కారణాలు.. 1. స్టార్ క్యాంపెయినర్లు కరువు.. ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు కరువయ్యారు. ప్రచారంలో అఖిలేష్ యాదవ్‌తో పాటు కేవలం ఎస్పీకి చెందిన కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్, డింపుల్ చౌదరి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నప్పటికీ వారు ప్రచారంలోకి రాలేకపోయారు. ఇది పార్టీకి పెద్ద నెగిటివ్‌గా మారింది. 2. ప్రభావం చూపని ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు బూస్ట్ ఇస్తాయని భావించారు. ఈ ఘటనలపై ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. 3. యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర.. యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్‌వాదీ పార్టీపై ముద్రవేయడంలో అధికార బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. బీజేపీ లాజిక్‌తో మిగతా వర్గాలు ఎస్పీకి దూరమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు కూడా వైఫల్యం చెందడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. 4. బీజేపీ వైపే జాట్, బ్రహ్మణ వర్గాలు.. యూపీలో గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది జాట్, బ్రహ్మణ వర్గాలే. అయితే, రైతు చట్టాల రద్దు సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్లు పోరాటం చేశారు. ఈ క్రమంలో జాట్లు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం బీజేపీకి అనుకూలంగా మారడంతో ఓట్లు చీలిపోయాయి. చెరుకు పండించే జాట్ రైతులు, బ్రహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. దీంతో ఎస్పీకి ఓటు బ్యాంకు చీలిపోయింది. 5. ఫలించని మేనిఫెస్టో.. ఎన్నికల సందర్భంగా ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు వరాలు ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉచిత 2 గ్యాస్ సిలిండర్లు, బాలికలకు కేజీ టూ పీజ్ఉచిత విద్య, ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించిన ఓటర్లు ప్రభావితం కాలేదు. -
వాళ్ల వైఖరి ఆందోళనకరం..ఉగ్రవాదులని 'జీ అని పిలుస్తారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హర్దోయ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. "సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకుల వైఖరి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యక్తులు ఒసామా వంటి ఉగ్రవాదులను 'జీ' అని సంబోధిస్తున్నారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి ప్రస్తావిస్తూ...కొన్ని పార్టీలు ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించడమే కాక సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 14 ఉగ్రవాద దాడుల కేసులలో అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకులు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు అలీ జిన్నాకు మద్దతుదారులని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలపై అలక్ష్య పెట్టి 'కట్టా' (దేశంలో తయారు చేసిన పిస్టల్స్)ని వినియోగించే స్వేచ్ఛనిచ్చిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని, వారి కార్యకర్తలని హర్దోయి ప్రజలు తప్పక గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు బుజ్జగింపు రాజకీయాలతో పండుగలను ఆపేసే వారికి మార్చి 10న ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి సరైన సమాధానం వస్తుందని నొక్కి చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
ఉత్తరప్రదేశ్‌లో తరతరాలుగా వీరిదే అధికారం!
ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులు.. ఠాకూర్ (రాజ్‌పుత్)లు, వైశ్యులు... 19 శాతం ఉన్న ముస్లింలు... 9–10 శాతం దాకా ఉన్న యాదవులు... తరతరాలుగా వీరిదే అధికారం... వీరి మాటే వేదం... వీరు చెప్పిందే చట్టం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 2017లో యూపీలో కొత్త ప్రయోగం చేసింది. మోదీ చరిష్మా, 25 శాతం దాకా ఉన్న అగ్రకులాల ఓట్లలో అత్యధికం సాధించడం, యాదవేతర ఇతర వెనుకబడిన (ఓబీసీల్లో) వర్గాల్లో ... మరోవైపు ముస్లిం ఓట్లలో సాధ్యమైనంత చీలిక తేవడం ద్వారా బీజేపీ 39.67 శాతం ఓట్లతో ఏకంగా 312 సీట్లు సాధించింది. తిరుగులేని మెజారిటీతో యూపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 19.3 శాతం ఉన్న ముస్లిం ఓట్లలో చీలిక రావడం, అవి ఇతర లౌకిక పార్టీల మధ్య పంపిణీ కావడం , 10 శాతం యాదవ ఓట్లలో సింహభాగం తమకే పడ్డా... అధికార పీఠాన్ని అందుకోవాలంటే ఇవి సరిపోవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు తేలిగ్గానే అర్థమైంది. అందుకే ఈసారి ఆయన ఇతర ఓబీసీ నేతలకు గాలం వేస్తూ... ఆయా వర్గాలను మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. యూపీలో మొత్తం 42 నుంచి 45 శాతం దాకా ఓబీసీలు ఉంటే... ఇందులో యాదవులు పోను నికరంగా 32–35 శాతం ఇతర ఓబీసీలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలు ఇప్పుడిక్కడే తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఆయా కులాలకు ప్రాతినిధ్యంవహించే చిన్నాచితకా పార్టీలకు అర్హతకంటే ఎక్కువ సీట్లే ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నాయి. ఎంత అసంతృప్తి ఉన్నా... తగ్గేది కొంతే! బ్రాహ్మణ/ సామాజికవర్గంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని. కాషాయపార్టీ పట్ల వారు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చినా సరే... కనీసం 8 శాతం మంది బ్రాహ్మణులు ఇప్పటికీ బీజేపీతోనే ఉంటారని సీనియర్ జర్నలిస్టు బ్రిజేష్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఠాకూర్లు యూపీ జనాభాలో 7 శాతం ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఠాకూర్ వర్గానికి చెందిన వారు కాబట్టి వీరిలో కనీసం 6 శాతం ఓట్లు బీజేపీకే పడవచ్చు. వ్యాపారం ప్రధాన వృత్తిగా ఉండే వైశ్యులు (యూపీ జనాభాలో ఐదు శాతం) తరాలుగా కమలదళంతోనే ఉంటూ వస్తున్నారు. ఇక ఎస్పీ విషయానికి వస్తే ముస్లింలో అత్యధిక ఓట్లు, యాదవుల ఓట్లు కలిపితే... దాదాపు 28 శాతం సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటోంది. బీజేపీ ఇంచుమించు అలాగే ఉన్నా... కనీసపక్షం ఇరుపక్షాల ఓట్లు 25 శాతానికి తగ్గడం లేదు. అంటే అధికార పీఠాన్ని అందుకోవాలంటే ఎంతలేదన్నా... అదనంగా మరో 10 శాతం ఓట్లు రావాలి. రాజ్భర్లు– 4 శాతం రాజ్భర్లు యూపీ జనాభాలో 4 శాతం ఉంటారు. ప్రధానంగా తూర్పు యూపీలో కేంద్రీకృతమై ఉన్నారు. వీళ్లు 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహైల్దేవ్ను కొలుస్తారు. మహ్మద్ గజనీ మేనల్లుడిని ఓడించిన ఘన చరిత్ర రాజా సుహైల్దేవ్కు ఉంది. 2002లో çసుహైల్‌దేవ్ భారతీయ సమాజ్‌పార్టీని (ఎస్బీఎస్పీ)ని స్థాపించిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తమ సామాజికవర్గానికి ఏకైక నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు. 2017లో బీజేపీతో పొత్తుపెట్టుకొని ఎనిమిది స్థానాల్లో పోటీచేసి నాలుగింటిలో గెలుపొందారు. మంత్రిగా యోగి టీమ్‌లో చేరగా... తర్వాత విభేదాలు వచ్చి బీజేపీకి కటీఫ్ చెప్పారు. ఐదారు చిన్నాచితకా పార్టీలను కూడగట్టి అఖిలేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. వారికి పూలన్‌దేవి ఆరాధ్యం నిషాద్‌లు ప్రధానంగా మత్స్యకారులు. యూపీ జనాభాలో నాలుగు శాతం ఉంటారు. నదీ తీరాల్లోని 26 జిల్లాల్లో ప్రభావవంతంగా ఉంటారు. బందిపోటు రాణి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన పూలన్‌దేవి వీరికి ఐకాన్. 2022 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిషాద్ పార్టీని బుజ్జగించిన బీజేపీ ఆ పార్టీకి 15 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. లోధీలు (3.5 శాతం) లోధీలు యూపీలో నాలుగో అతిపెద్ద ఓబీసీ కమ్యూనిటీ. 16 జిల్లాల్లో ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్నారు. ప్రస్తుత యూపీ అసెంబ్లీలో 20–22 మంది లోధీ ఎమ్మెల్యేలు (అత్యధికులు బీజేపీ నుంచే) ఉన్నారు. లోధీలో శిఖరగ్ర సమానుడైన యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఇటీవల చనిపోవడం బీజేపీకి అతిపెద్ద లోటుగా పరిణమించింది. మౌర్యులు/ కుష్వాహాలు (6 శాతం) మౌర్యులు, కుష్వాహాలు కలిపి ఈసారి ఎస్పీని అధికారంలోకి తేవాలని కంకణం కట్టుకున్నారనేది స్థానిక పార్టీ మహాన్‌దళ్ నినాదం. తూర్పు యూపీలోని గాజీపూర్, వారణాసి, బలియా, కుశీనగర్, జౌన్పూర్ జిల్లాల్లో మౌర్యులు కేంద్రీకృతమై ఉన్నారు. కుష్వాహాలు ఇటావా, మెయిన్‌పురి, జలౌన్, ఝాన్సీల్లో ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి కుల ఆధారిత ఈ చిన్ని రాజకీయ పార్టీలను బుజ్జగించి విజయవంతంగా వారి ఓట్లను మళ్లించుకోగలిగితేనే ప్రధాన రాజకీయ పార్టీలకు విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు. కీలెరిగి వాత! ఇతర వెనుకబడిన వర్గాలు... ప్రధాన పార్టీలకు ఉన్న ఈ అవసరాన్ని బాగా గుర్తించాయి. తమ ఓట్లు దక్కాలంటే అడిగినన్ని సీట్లు, మంత్రి పదువులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్లు చేస్తూ మరీ ప్రధాన రాజకీయపక్షాల మెడలు వంచుతున్నాయి. యాదవుల తర్వాత కుర్మీలు యూపీలో రెండో అతిపెద్ద ఓబీసీ వర్గం. జనాభాలో ఐదు శాతం ఉంటారు. 16 జిల్లాల్లో దాదాపు 12 శాతం కుర్మీల జనాభా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఆయా జిల్లాల్లో వీరి మద్దతే కీలకం అవుతోంది. కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ (ఎస్)తోనే ఈ సామాజికవర్గం నిలబడుతోంది. అప్నాదళ్ 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ హవా నడిచిన కాలంలో కుర్మీలకు చెందిన బేణి ప్రసాద్ వర్మకు పెద్దపీట వేయడంతో ద్వారా ఈ సామాజికవర్గంలో ఎస్పీకి మంచి పట్టు సంపాదించగలిగారు. అయితే తర్వాతి కాలంలో బేణి ప్రసాద్ వర్మ మరణంతో కుర్మీల్లో ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం
Up Assembly elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపించిన కొద్దీ పార్టీలు ఓట్ల లెక్కల్లో తలమునకలైపోతున్నాయి. కిందటిసారి 2017లో యూపీలోని 47 సీట్లలో ఆయా పార్టీల అభ్యర్థులు ఐదు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయారు. పోటాపోటీగా ఎన్నికల జోరు జరుగుతున్న ప్రస్తుతం తరుణంలో పార్టీలు ఈ 47 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటును కూడా పక్కకు పోనివ్వకూడదనే పట్టుదలతో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నాయి. మెజారిటీలైనా, ఓడిన మార్జిన్లైనా స్వల్పంగా ఉన్నందువల్ల ఈసారి రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తున్నాయి. ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి అయితే మేలు... స్థానికంగా ఎవరికి పరపతి ఉంది, అభ్యర్థుల కలుపుగోలుతనం... తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకొని అలవాంటి వారినే ప్రోత్సహిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు సర్వేలు ద్వారా ధ్రువీకరించుకున్నాకే టికెట్లను కేటాయిస్తున్నారు. చదవండి: సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్ ఇవ్వండి ఏక్ ఔర్ దక్కా... స్వల్ప తేడాలతోనే గతంలో తామీ సీట్లను పొగొట్టుకున్నాం కాబట్టి ఈసారి మరింత కష్టపడితే గెలుపు తమదే అవుతుందని రాజకీయపక్షాలు లెక్కలేసుకుంటున్నాయి. హిందుత్వ కార్డు, అభివృద్ధి మంత్రానికి తోడు స్థానికంగా అభ్యర్థి ప్రభావం కలిసి తమను విజయతీరాలకు చేరుస్తుందని బీజేపీ నమ్ముతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిన్నాచితక పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నందువల్ల ఇలాంటి గెలుపొటముల మధ్య అతితక్కువ తేడాలున్న ఈ నియోజకవర్గాల సామాజికవర్గాల సమీకరణ తమకు లాభిస్తుందని ఎస్పీ చీఫ్ నమ్మకంతో ఉన్నారు. చదవండి: Punjab Assembly Election 2022: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్ ఓబీసీల్లో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందిన స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్లు బీజేపీని వీడి తమ పంచన చేరడం బాగా అనుకూలించే విషయమని అఖిలేశ్ నమ్ముతున్నారు. ఎందుకంటే మొత్తం యూపీ జనాభాలో 50 శాతం ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ తలరాత మార్చాలన్నా అది వీరిచేతుత్లోనే ఉంటుంది. కిందటి ఎన్నికల్లో దుమారియగంజ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్ కేవలం 171 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి సయేదా ఖాతూన్‌పై నెగ్గారు. ఐదు వందల ఓట్లలోపు తేడాతో ఐదు చోట్ల వివిధ పార్టీలు పరాజయం చవిచూశారు. కాగా, మరో ఇద్దరు 1,000 ఓట్లలోపు తేడాతో ఓడిపోయారు. -
సమాజ్‌వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి
లక్నో/ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల మధ్య వలసలు అధికంగా ఉన్నాయి. రెండు పార్టీలు పోటా పోటీగా ‘గోడ దూకుళ్ల’ను ప్రోత్సహిస్తున్నాయి. బీజేపీ నేత, జలాలాబాద్ అభ్యర్థి అనిల్ వర్మ తన మద్దతుదారులతో కలసి సోమవారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ కూడా సమాజ్ వాదీ పార్టీలోకి మారిపోయారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ తనకు టిక్కెట్ నిరాకరించడంపై స్పందిస్తూ... ‘బీజేపీ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేశాను, అయినప్పటికీ నాకు టిక్కెట్ నిరాకరించారు. యువతను ప్రోత్సహిస్తామని చెప్పి 75 ఏళ్ల వృద్ధుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామ’ని జితేంద్ర వర్మ అన్నారు. (చదవండి: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి...) జలాల్‌పూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, సుభాష్ రాయ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
బీజేపీది వన్ గేర్ కారు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరంగా ఓట్లను సంఘటితం చేసే రాజకీయాలకు ఇక చోటులేదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌధురి అన్నారు. హిందుత్వ ఎజెండా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ముస్లిం వ్యతిరేకతని తమ నైపుణ్యం అంతా ఉపయోగించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత చేసినా... ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి సవాల్ విసురుతున్న జయంత్ చౌధరి ఒక వార్తా సంస్థతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ప్ర: బీజేపీని వీడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎందుకు ఎస్పీలో చేరుతున్నారు ? జ: గత అయిదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకి ఏమీ చెయ్యలేకపోయామన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. సరైన ప్రత్యామ్నాయం కనిపించగానే వరసపెట్టి వస్తున్నారు. ప్ర: ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉందా? జ: విపక్షాల ఓట్లు చీలిపోయే ప్రసక్తే లేదు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు ఎస్పీ కూటమి వైపే చూస్తున్నారు. పాలనా వైఫల్యం, నాయకత్వ లోపాలు, కాగడావేసి చూసినా కనిపించని అభివృద్ధి.. వీటన్నింటితో ఓటర్లు బీజేపీకి దూరమవుతున్నారు. ప్ర: హిందూత్వ రాజకీయాలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? జ: గత అయిదేళ్లలో హిందుత్వ ఎజెండాతో ఎన్నో ఘటనలు జరిగాయి. విద్వేషం రాజేయడం, దాడులు జరపడం కళ్లారా చూశాం. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. మథురలో మందిరం అంశంపై బీజేపీ పిలుపునిస్తే పట్టుమని పది మంది కూడా రాలేదు. మతం, మందిరం అంటే ప్రజలు వినే రోజులు పోయాయి. బీజేపీ వన్ గేర్ కారులో వెనక్కి వెళుతోంది. ప్ర: ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలేమిటి? జ: రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కీలకం కానున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన నిరసనలతో వారు బీజేపీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోంది. ప్ర: ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విజయావకాశాలు ఎంత? జ: హిందుత్వ ఎజెండా ఓట్లను సంఘటితం చేస్తూ ఉండడం వల్ల ఇన్నాళ్లూ మేమెంతో నష్టపోయాం. ప్రజలెదుర్కొంటున్న అసలు సిసలు సమస్యలపై మేము దృష్టి పెట్టాం. ప్రజలు ఇప్పుడు మార్పుని కోరుకుంటున్నారు. దేశంలో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మరెక్కడా లేని విధంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని హామీ ఇచ్చాం. 22 తీర్మానాలతో మా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది.అందుకే మా గెలుపు ఖాయం. -
బీజేపీ పెద్దలకు అఖిలేశ్ యాదవ్ గట్టి ఝలక్
-
శ్రీకృష్ణుడితో నేను రోజు మాట్లాడతా: అఖిలేష్ యాదవ్
లక్నో: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదిపార్టీని ఏర్పాటు చేసి, రామ రాజ్యాన్ని నిర్మిస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి చెందిన బహ్రైచ్‌లోని నాన్పరా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధురీ వర్మ సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాగా, సమాజ్‌వాది పార్టీలో క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్లున్నారనే బీజేపీ ఆరోపణలపై.. అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ నేరస్థులను, మాఫియా డాన్లను ప్రక్షాళన చేయడానికి వాషింగ్మెషిన్లను కొనుగోలు చేసిందా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. శ్రీ కృష్ణుడు ప్రతిరోజు తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ గెలుస్తుందని కృష్ణుడు కూడా అన్నారని పేర్కొన్నారు. అదే విధంగా, పొరుగు దేశం చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లు మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. మన సీఎంని చూసి వారు కూడా గ్రామాల పేర్లు మారుస్తున్నారని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రాను యూపీ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఎస్పీ చీఫ్ స్పందించారు. యోగి నిద్రలో మత్తులో ఉండగా, ఆయన చీఫ్ సెక్రెటరీ మారిపోయారా.. అంటూ వ్యంగ్యంగా చమత్కరించారు. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గృహవినియోగ దారులకు 300ల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. అదేవిధంగా, 2012 నుంచి 2017 వరకు ఎస్పీ తమ హయంలో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తుచేశారు. బీజేపీ వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అఖిలేష్‌యాదవ్ స్పష్టం చేశారు. చదవండి: వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని.. -
ప్రధాని మోదీ నోట ‘పీయూష్ జైన్’ మాట
PM Modi And Amit shah Slams SP Chief Akilesh Yadav Over Piyusj Jain Issue: యూపీ కాన్ఫూర్ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం ఆర్థిక నేరంగానే కాదు.. రాజకీయంగానూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ అత్తరు వ్యాపారి అయిన పీయూష్ నుంచి దాదాపు 200 కోట్లకు పైనే విలువైన సంపదను అధికారులు రికవరీ చేసుకోవడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ తరుణంలో యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పీయూష్ వ్యవహారం ఆధారంగా ప్రతిపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాన్పూర్‌లో మంగళవారం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించిన ప్రధాన మోదీ.. సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేష్‌పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేసినా.. అది తాము చేసిందేనని, బీజేపీ క్రెడిట్‌ను ఊరికే లాక్కుంటోందని వాళ్లు(అఖిలేష్‌ను ఉద్దేశించి) అంటారు కదా. మరి ఇప్పుడు నోట్ల కట్టలు నిండిన డబ్బాలు బయటపడ్డాయి. మరి బాధ్యతగా ఎందుకు ముందుకు రావడం లేదు. నోళ్లు మూసుకుని కూర్చుకున్నారు వాళ్లంతా. 2017కి ముందు దాకా అత్తరు అవినీతి యూపీలో ఏ విధంగా గుభాలించిందో అందరికీ తెలిసిందే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా చూస్తోంది. ఇది వాళ్లు సాధించిన ప్రగతి. వాస్తవ పరిస్థితి. యూపీ ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. వాళ్లకు ప్రతీది అర్థమవుతోంది. గత ప్రభుత్వం ఎన్నికల గెలుపును.. దోచుకునేందుకు దొరికిన లాటరీగా భావించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో బాధ్యతాయుతంగా పని చేస్తోందని అని వ్యాఖ్యానించారు ప్రధాని. షా నేరుగా.. అయితే ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్స్ చేస్తే.. కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా పేర్లతో విమర్శించడం విశేషం. ఈమధ్య సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి దొరికాడు. మేమేందుకు దాడులు చేయించామా? అనుకుంటూ అఖిలేష్ గారు మెలికలు తిరిగిపోతున్నారు. 250కోట్ల డబ్బు. ఎక్కడిది అఖిలేష్గారూ అంటూ సూటిగా ప్రశ్నించారు షా. అఖిలేష్ ఏమన్నాడంటే.. ఇక ప్రధాని, షాల ఆరోపణలపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సాదాసీదాగా స్పందించాడు. పొరపాటున వాళ్లకు చెందిన వ్యాపారిపైనే బీజేపీ దాడులు చేయించుకుందంటూ కౌంటర్ ఇచ్చారు. అతని(పీయూష్) కాల్ రికార్డులు పరిశీలిస్తే.. అతనితో టచ్‌లు ఉన్న బీజేపీ నేతల పేర్లు బయటపడతాయి. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు.. బహుశా పీయూష్ జైన్ మీద దాడులు చేసి ఉంటారేమో అంటూ సెటైరిక్‌గా స్పందించారు అఖిలేశ్. -
యోగి నా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాపింగ్ చేయిస్తున్నారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను ప్రతిరోజు సాయంత్రం యోగి వింటున్నారని అన్నారు. యోగిని నిరుపయోగిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తూ ఆంగ్లంలో యూపీ, యోగి కలిస్తే ‘ఉపయోగి’ అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆదివారం అఖిలేఖ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది కాబట్టి తనతో మాట్లాడేటపుడు జాగురుకతతో ఉండాలని విలేకరులకుసూ చించారు. యోగి సర్కారు రాష్ట్రంలో ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నడుపుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే 12 మంది బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల వారణాసి, ఆయోధ్యల్లో పర్యటించారన్నారు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెనకేసుకొస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యూపీలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
ఎన్నికలొస్తున్నాయిగా..మీకోసమే ఐయామ్.. వెయిటింగ్
‘బీజేపీ.. అచ్చంగా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ఎవరినైనా భయపెట్టాలనుకుంటే వారిపైకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించేది. ఈ రోజు బీజేపీ అదే చేస్తోంది’ లక్నో/రాయ్‌బరేలి: ఎన్నికలు సమీపించగానే.. రాజకీయ ప్రత్యర్థులపైకి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను శాఖ (ఐటీ)ను ఉసిగొల్పుతుందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం అఖిలేశ్ సన్నిహితులు ముగ్గురిపై ఐటీ దాడులు జరిగాయి. దీనిపై ఎస్పీ చీఫ్ స్పందిస్తూ... ‘నేను ముందు నుంచీ చెబుతున్నాను. ఎన్నికలు దగ్గరపడగానే.. ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీల దాడులు మొదలవుతాయని. ఇప్పుడు ఐటీ వాళ్లొచ్చారు. తర్వాత సీబీఐ, ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)లు రంగంలోకి దిగుతాయి. వారి రాకకోసం ఎదురుచూస్తున్నా. వాళ్లు ఏంచేసినా సైకిల్ (ఎస్పీ ఎన్నికల చిహ్నం) ఆగదు... ఇదే వేగంతో ముందుకెళతాం. రథయాత్ర, పార్టీ తీసుకున్న ఇతర కార్యక్రమాలు యథాప్రకారం కొనసాగుతాయి. యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదు. ఇలాంటి వాటితో రాష్ట్ర ప్రజలను మాయ చేయలేరు. రాజీవ్ రాయ్‌పై ఇవే ఐటీ దాడులు నెల కిందట ఎందుకు జరగలేదు. ఇప్పుడెందుకు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి. బీజేపీకి ఓటమి భయం పెరిగేకొద్దీ ఈ దాడులూ పెరుగుతాయి’ అని కాషాయదళంపై ధ్వజమెత్తారు. రాజీవ్ రాయ్ ఎస్పీ జాతీయ కార్యదర్శి, అధికార ప్రతినిధి. కర్ణాటకలో పలు విద్యాసంస్థలను నడిపే గ్రూపునకు యజమాని. అఖిలేశ్ వ్యక్తిగత కార్యదర్శి జ్ఞానేంద్ర యాదవ్, ఎస్పీకి కంచుకోట నిలుస్తున్న మెయిన్‌పూరికి చెందిన వ్యాపారవేత్త (ఆర్సీఎల్ గ్రూపు యజమాని), అఖిలేశ్‌కు సన్నిహితుడైన మనోజ్ యాదవ్‌లపై కూడా శనివారం ఐటీ దాడులు జరిగాయి. రెండూ ఒకటే.. లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండను జలియన్‌వాలా భాగ్ ఊచకోతతో పోల్చారు అఖిలేశ్. ‘జలియన్‌వాలా భాగ్‌లో బ్రిటిషర్లు ప్రజలను ముందు నుంచి కాల్చారు.. లఖీంపూర్‌లో బీజేపీ నేతలు వెనకనుంచి రైతులపైకి జీపును తోలార’ని రాయ్‌బరేలీలో రథయాత్ర సందర్భంగా విలేకరులతో అన్నారు. -
యూపీలో ‘పొత్తు’ పొడుపులు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ‘పొత్తు’ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన రాజకీయపక్షాలైన బీఎస్సీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదని, చిన్నపార్టీలతో జట్టుకడతామని ఇదివరకే ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జయంత్ చౌదరి నేతృత్వంలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో ఒక అవగాహనకు వచ్చిన అఖిలేష్ గతంలో ఎన్డీయేతో ఉన్న సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఓం ప్రకాశ్ రాజ్‌భర్)నూ తమవైపునకు తిప్పేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం అఖిలేష్ లక్నోలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీ– ఆప్ పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ... భవిష్యత్తు పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆప్‌కు యూపీలో పెద్దగా బలం లేనప్పటికీ... కేజ్రీవాల్ అండ లభిస్తే నైతికంగా బలం చేకూరినట్లవుతుందనేది పరిశీలకుల అంచనా. మరోవైపు అఖిలేష్ యాదవ్ బుధవారం అప్నాదళ్ (కె) నాయకురాలు కృష్ణ పటేల్‌తో భేటీ అయ్యారు. పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా అప్నాదళ్ (కె) 20–25 సీట్లను ఆశిస్తోంది. కృష్ణ పటేల్ కూతురు అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్(ఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. ఆ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, అనుప్రియతో కలిపి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గమైన ‘కుర్మీ’లకు ప్రధానంగా అప్నాదళ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. తల్లి కృష్ణ పటేల్‌తో పొత్తుపెట్టుకొని... ఆమెకు సముచిత గౌరవమిస్తే కుర్మీ ఓట్లలో చీలిక తేవొచ్చనేది అఖిలేష్ ఎత్తుగడ. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ఎస్పీ, ఆర్ఎల్డీ సీట్ల చర్చ
లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పొత్తు కుదుర్చుకున్నాయి. సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీలు మంగళవారం లక్నోలో భేటీ అయ్యా రు. భేటీ తర్వాత ‘మంతనాలు ముగిశాయి’ అనే శీర్షికతో జయంత్ ఒక ట్వీట్ చేశారు. అఖిలేశ్‌ను కలిసినప్పటి ఫొటోను ట్వీట్‌కు జతచేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా ఖరారుకాలేదు. -
సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వినూత్న ఆలోచన చేశారు. త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అత్తర్ బ్రాండ్ పేరుతో పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు. ఈ అత్తర్ సీసాపై సైకిల్ గుర్తును కూడా ముద్రించారు. అంతేగాక కవర్‌పై అ ఖిలేష్ యాదవ్ బొమ్మ కూడా ఉండేలా రూపొందించారు. రెడ్, గ్రీన్ కలర్లో తయారు చేసిన ఈ 22 సహజసిద్ధ సుగంధాలతో రూపొందించారు. చదవండి: యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చదవండి: Navjot Singh Sidhu: పంజాబ్‌లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ అయితే ఎన్నికల్లో ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఆసక్తికర నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంచి ఆలోచన అంటూ మద్దతిస్తుంటే మరికొంతమంది ఎస్పీ పార్టీని తీవ్ర ట్రోల్స్‌తో ముంచెత్తుతున్నారు. ‘సమాజ్‌వాద్ అత్తర్ చాలా ఫన్నీగా ఉంది. బీజేపీలో మోదీ, యోగి సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటుంటే అఖిలేష్ యాదవ్ ‘సమాజ్ వాదీ అత్తర్’ అంటున్నాడు. ఈసారి యూపీ ఎన్నికల్లో నేను తటస్థంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. కానీ సమాజ్ వాదీ పార్టీ నన్ను బీజేపీకి ఓటు వేసేలా చేస్తుంది. సమాజ్‌వాదీ అత్తర్ ‘వాహ్ భాయ్ వాహ్’...’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి సమాజ్‌వాదీ అత్తరు..ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాబడుతుందో. చదవండి: బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్ Cc: @rohini_sgh @sakshijoshii I was thinking to be neutral this time for UP election..however SP is making sure that I must vote for BJP at all cost.. I mean political party launching perfume..I mean..कौन हैं ये लोग..कहां से आते हैं..next is fashion show in Saifai or what? — Anurag Guru 🚯🚱 (@anurag_guru) November 9, 2021 కాగా ఎస్పీ పార్టీ అత్తర్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో అఖిలేష్ యాదవ్ యూపీలో తన పార్టీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సమాజ్‌వాదీ సుగంధ్' పేరుతో పలు రకాల పెర్ఫ్యూమ్లను ప్రారంభించారు. ఈ పెర్ఫ్యూమ్ నాలుగు సువాసనలతో, ప్రతి సీసా నాలుగు వేర్వేరు నగరాల(ఆగ్రా, లక్నో, వారణాసి, కన్నౌజ్) సువాసనను అందిస్తుంది. Modi Yogi : Sabka sath, sabka vikas, Zero Tolerance for Mafia Meanwhile Akhilesh Yadav : Samajwadi Attar 😂😂😂😂😂 #SamajwadiAttar — Rosy (@rose_k01) November 9, 2021 pic.twitter.com/p1nQffTTdy — UdtaBadal (@Trishoo91277137) November 9, 2021 News 1: UP Govt Building beautiful Toilets News 2: Samajwadi party has launched Samjawadi perfumes Connect the dots. — Foreveridly (@foreveridly) November 9, 2021 -
సమాజ్‌వాదీ పార్టీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీతోపాటు బహుజన సమాజ్ పార్టీకి(బీఎస్పీ) చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే, బీఎస్పీ నుంచి ఆరుగురు బహిష్కృత ఎమ్మెల్యేలు శనివారం మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ తమ పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం అలీ, హకీంలాల్ బింద్, ముజ్తబా సిద్దిఖీ, హరగోవింద్ భార్గవ ఎస్పీలో చేరారు. -
వివాదస్పదంగా మారిన యూపీ సీఎం ‘అబ్బాజాన్’ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘అబ్బాజాన్’ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడేవారు యోగి ఎలా అవుతారని ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. యూపీలోని ఖుషీనగర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ అబ్బాజాన్ అని మాట్లాడేవారందరూ 2017కి ముందు రేషన్‌ని బొక్కేశారంటూ ముస్లింలను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు రేషన్ అందుతున్నట్టుగా అప్పట్లో అందలేదని అన్నారు. ఖుషీనగర్ రేషన్ నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలిపోయేదన్న యోగి ప్రస్తుతం నిరుపేదలకు చెందిన నిత్యావసర సరుకుల్ని ఎవరైనా మింగేయాలని చూస్తే ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు. అబ్బాజాన్ అని మాట్లాడేవారందరూ అంటూ యోగి పరోక్షంగా ముస్లింలను టార్గెట్ చేయడం వివాదానికి దారి తీసింది. ట్విటర్ వేదికగా పలువురు నేతలు యోగిని ఎండగడుతున్నారు. ఈ దేశం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, వర్గాలు, కులాలకు చెందినదని.. రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని జేడీ(యూ) అధ్యక్షుడు, ఎంపీ లలన్ సింగ్ యోగికి హితవు చెప్పారు. చదవండి: డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో... యూపీకి ప్రయోజనం బీజేపీ ప్రతీ ఎన్నికల్లోనూ మతం కార్డునే బయటకు తీస్తోందని, ఈసారి యోగి హిందువుల రేషన్‌ని ముస్లింలు తినేశారని ప్రచారం చేస్తూ తిరిగి సీఎం పీఠం ఎక్కడానికి చూస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ విమర్శించారు.ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే రేషన్ సరిహద్దులు దాటి వెళ్లిందంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యోగి అమర్యాదకరంగా మాట్లాడారని, చదువు లేకపోవడం వల్లే ఆయన ఇలా నోరు పారేసుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్సీ అశుతోష్ సిన్హా విరుచుకుపడ్డారు. -
బీజేపీ పాలనలో రైతులకు వేధింపులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో వేధింపులకు గురవుతున్నట్లు రైతులు భావిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 స్థానాలకు గాను 400 సీట్లను గెలుచుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ అమలు అసంభవంగా కనిపిస్తోందని తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు, రైతులు ప్రస్తుతం రైతుల ఆదాయం ఎంత అని బీజేపీని అడుగుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు కూడా పైకెగబాకాయి. అలాంటప్పుడు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఎప్పటికి నెరవేరుతుంది?’అని ఆయన ప్రశ్నించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘రైతులు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, వారు ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములకు సక్రమమైన పరిహారం అందజేస్తాం’అని చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి అనేక పథకాలు, హామీలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చెరకు రైతులకు చెల్లింపుల విషయమై ఆయన మాట్లాడుతూ..‘అసలు విషయం చెల్లింపులకు సంబంధించింది కాదు. పాత బకాయిల గురించి. రైతుల వేదన సీఎం యోగికి వినిపించడం లేదు’అని చెప్పారు. -
దుర్మార్గం: వెంటపడి చీర కొంగు లాగేసి..
ఉత్తర ప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. పార్టీల మధ్య, ప్రత్యర్థులతో కుమ్ములాటలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలిగించే ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. నామినేషన్‌ను అడ్డుకునేందుకు ఓ మహిళను చీరపట్టి లాగారు రాజకీయ ప్రత్యర్థులు. లక్నో: సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ప్రత్యర్థులు చీర కొంగు పట్టిలాగారు. పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ ఆమె నామినేషన్ సెంటర్లోకి వెళ్లాల్సి ఉంది. అయితే గడువు దగ్గర పడుతుండడంతో ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లు ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను సైతం లాక్కున్నారు. అక్కడే ఉన్న కొందరు ఆమెకు మద్ధతుగా రావడంతో వాళ్లు ఆగిపోయారు. pic.twitter.com/TqepdO3y4W — Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021 తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఎకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఇక దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్ ఖేరీలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఘటనపై స్పందించాడు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చెందిన గుండాలు చెలరేగిపోతున్నారు అంటూ క్యాఫ్షన్ ఉంచాడు. యూపీలో 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గురవారం చాలాచోట్ల నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. पीएम साहब और सीएम साहब इसके लिए भी बधाई दीजिए कि यूपी में आपके कार्यकर्ताओं ने ⭐कितनी जगह बमबाजी, गोलीबारी, पत्थरबाजी की ⭐कितने लोगों का पर्चा लूटा ⭐कितने पत्रकारों को पीटा ⭐कितनी जगह महिलाओं से बदतमीजी की कानून व्यवस्था की आंख पर पट्टी बांधकर, लोकतंत्र का चीरहरण चल रहा है। pic.twitter.com/6H9L390frB — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 8, 2021 -
UP Elections 2022: పొత్తు పై అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రకటించారు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విప్లవానికి దారి తీస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ పూర్తిగా మర్చిపోయిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ చెత్తబుట్టలో పడేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలు గాను తమ పార్టీ 350 పైగా స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. యూపీ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 3050 పంచాయితీల్లో స్వతంత్ర అభ్యర్థులు 1081 స్థానాల్లో గెలుపొందారు. సమాజ్‌వాది పార్టీ మద్ధతుతో బరిలో నిలిచినవారు 851 పంచాయితీలు గెలుచుకోగా.. బీజేపీ మద్ధతుతో పోటీచేసిన వారు 618 పంచాయితీలు గెలుచుకున్నారు. బీఎస్పీ మద్ధతుపొందిన అభ్యర్థులు 320 పంచాయితీల్లో విజయం సాధించారు. -
మా డౌట్లు తొలగించండి
లక్నో: కోవాగ్జిన్‌పై వస్తున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన∙కోవాగ్జిన్ టీకాకు కేంద్రప్రభుత్వ అనుమతి లభించడంపై కాంగ్రెస్ సహా పలువురు ప్రశ్నించడం తెల్సిందే. తానుగానీ, తన పార్టీగానీ శాస్త్రవేత్తలను ఎప్పుడూ ప్రశ్నించమని, కానీ ఏవైనా సందేహాలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే వాటికి సరైన సమాధానాలివ్వాలని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆదివారం అనుమతినిచ్చింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండా వాడుకకు అనుమతినివ్వడం రిస్క్ అని విమర్శించాయి. వ్యాక్సినేషన్ అనేది లక్షలాది మంది జీవితాలతో కూడిన విషయమన్నారు. పేదలకు వ్యాక్సిన్ అందించే తేదీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌నేత శశిధరూర్ సైతం వ్యాక్సిన్ అనుమతులను విమర్శించారు. -
యూపీలో బీజేపీకి 6 ఎంఎల్సీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన మండలిలోని 11 సీట్లకు జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ 6 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం 11 సీట్లలో బీజేపీ 6, సమాజ్‌వాదీ 3, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 100 మంది సభ్యులున్న మండలిలో తాజా ఫలితాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 25కు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల సంఖ్య 55కు పెరిగింది. బహుజన సమాజ్ పార్టీ తమ అభ్యర్థులను నిలపలేదు. తమ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో నలుగురిని బరిలోకి దించగా ముగ్గురు గెలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ తెలిపారు. ఇది చారిత్రక విజయమన్నారు. (చదవండి: ఎమ్మెల్యే హత్య.. వివాదంలో బీజేపీ కీలక నేత) -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ కన్నుమూత
-
గాయాలపాలైన ఎంపీ ఆజంఖాన్ భార్య
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ భార్య, ఎమ్మెల్యే తజీన్ ఫాతిమా గాయాలపాలయ్యారు. బాత్రూంలో జారిపడటంతో ఆమె భుజం ఫ్రాక్చర్ అయ్యిందని సీతాపూర్ జిల్లా జైలు అధికారులు తెలిపారు. కాగా తాజీన్ ఫాతిమా, ఆజంఖాన్, వారి తనయుడు అబ్దుల్లా బర్త్ సర్టిఫికెట్ ఫోర్జరీ కేసులో దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న వారి ముగ్గురిని సీతాపూర్ జైలుకు తరలించారు.(‘సోనియా గాంధీ మీ టిక్కెట్లకు డబ్బు చెల్లించారు’) ఈ నేపథ్యంలో శుక్రవారం ఫాతిమా జైలు స్నానాల గదిలో జారిపడ్డారని డీసీ మిశ్రా తెలిపారు. ‘‘అదుపుతప్పి బాతరూంలో ఆమె కిందపడ్డారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించాం. ఎక్స్ రే తీయగా.. భుజానికి ఫ్యాక్చర్ అయినట్లు తేలింది. అనంతరం తిరిగి ఆమెను జైలుకు తీసుకువచ్చాం. జైలు సిబ్బంది ఫాతిమాను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు’’అని పేర్కొన్నారు. కాగా ఫాతిమా ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.(వైరల్ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు) నన్నో టెర్రరిస్టులా చూస్తున్నారు: ఆజంఖాన్ -
మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!
‘అయ్యో.. మహాత్మా.. దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి.. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా.. ఇంత పెద్ద దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చావు. మా కోసం, మా పిల్లల కోసం స్వతంత్ర దేశాన్ని ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్లిపోయారు. ఎందుకు త్వరగా వెళ్లిపోయారు’ అంటూ.. ఈ కింది వీడియోలో కనిపిస్తున్న నాయకులు వెక్కివెక్కి ఏడ్చారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. సదరు నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ విగ్రహానికి తల ఆనించి.. కర్చీఫ్‌లు కళ్లకు అడ్డుపెట్టుకొని.. వెక్కివెక్కి ఏడ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ సంబాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, అతని అనుచరులు ఇలా గాంధీ జయంతినాడు కన్నీరు కార్చారు. వీరు కన్నీరు కారుస్తున్న తతంగాన్ని అక్కడే ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘అబ్బా.. ఇది ఏమన్నా యాక్టింగ్. వీరిని ఉత్తమ నటుడి కేటగిరి కింద ఆస్కార్‌కు భారత్ తరఫున అధికారికంగా పంపాలం’టూ నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు. మహాత్ముడికి మనస్ఫూర్తిగా నివాళులర్పించడం వేరు.. మీడియా అటెన్షన్ కోసం, ప్రజల దృష్టిలో పడేందుకు ఇంతగా నటించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ వీడియోలో సదరు నాయకుల ఎడుపుగొట్టు ఎక్స్ప్రెషన్స్ చూస్తే.. ఆస్కార్ అవార్డును స్వయంగా ఇంటికి మోసుకొచ్చి మరీ వీళ్లకు ఇస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అంటూ ఈ వీడియోను రీట్వీట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లకు కితకితలు పెడుతోంది. -
గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు
లక్నో : సాధారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, హత్యలు, హత్యాచారాలు లాంటి కేసులు నమోదు అవుతుంటాయి. వీటిల్లో ఏదో ఒక కేసు దాదాపు ప్రతి నాయకుడిపై ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో అది సర్వసాధారణం కూడా. కానీ ఓ ఎంపీపై వెరైటీగా దొంగతనం కేసు నమోదు అయింది. అది కూడా ఓ విచిత్రమైన దొంగతనం. ఆ ఎంపీ కోట్ల కొద్ది డబ్బులో లేదా తులాల కొద్ది బంగారమో దోపిడీ చేశాడని కేసు నమోదు కాలేదు. కేవలం ఓ గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు పెట్టారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. ఇక కేసు నమోదు అయిన ఎంపీ ఎవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్. ఇప్పటికే భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా ఈ విచిత్ర షాక్ తగలింది. ఎంజీ ఆజంఖాన్ రాంపూర్‌కు చెందిన అసిఫ్, జాకీర్ అనే వ్యక్తులు ఆజంఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తమ ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్‌పైఎఫ్ఐఆర్ నమోదు చేశారు. .ఎంపీతో పాటుమరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. కాగా ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ 50 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 28 కేసులు అలియాగంజ్ రైతులు పెట్టినవే కావడం గమనార్హం. -
అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం!
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి, జిల్లా, యూత్వింగ్ విభాగాలు అన్నింటినీ రద్దు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ మినహా మిగతా నాయకులందరినీ పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో.. పార్టీ ప్రక్షాళనకై అఖిలేశ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాలో కొట్టుకుపోయిన ఎస్పీ కేవలం ఐదు లోక్‌సభ స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019 ఎన్నికలకు ముందు బీఎస్పీతో జట్టుకట్టిన ఎస్పీకి అదే ఫలితం పునరావృతమైంది. ఉప ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి బీజేపీ విజయం సాధించిన ఎస్పీకి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62 సీట్లు గెలుచుకుని సత్తా చాటగా, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. ఇక కనౌజ్ నుంచి ఎన్నికల బరిలో దిగిన అఖిలేశ్ భార్య డింపుల్ ఓటమి పాలవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ ఘోర వైఫల్యానికి కారణాలను అన్వేషించే క్రమంలో అఖిలేశ్ ప్రక్షాళన చర్యలకు దిగినట్టు ఎస్పీ సీనియర్ నేత ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. ‘ రాష్ట్ర, జిల్లా, యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ విభాగాలను ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రద్దు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. బీజేపీ మీద పైచేయి సాధించాలంటే పార్టీలో ఉత్సాహం నింపాల్సి ఉంటుందని భావించారు. క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపడుతున్నారు. వివిధ విభాగాల ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు త్వరలోనే జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ మీడియా వింగ్‌కు చెందిన టీవీ ఛానెళ్ల అధికార ప్రతినిధులను అఖిలేశ్ తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే యోగి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బుధవారం తొలిసారిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించి ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టారు. చదవండి : మంత్రివర్గ విస్తరణ; కొత్తగా 18 మందికి చోటు! -
మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ లబ్ధి కోసమే ఆరెస్సెస్ ఆర్మీ పాఠశాలను ఏర్పాటు చేయాలనుకుంటుందని, ఆ పాఠశాలలో సామరస్యాన్ని దెబ్బతీయడం, మూక దాడులు చేయడమే నేర్పిస్తుందని దుయ్యబట్టింది. ఆరెస్సెస్ సమాజాన్ని విభజించే భావజాలాన్ని అనుసరిస్తోందని, స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదని, ఇప్పటికీ కూడా స్వాతంత్ర్య పోరాట ఆశయాలను ఆ సంస్థ పట్టించుకోవడం లేదని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరెస్సెస్ ఆర్మీ స్కూల్ ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తోందని, జాతీయస్థాయిలో కుట్రగా ఇది కనిపిస్తోందని, ఇది రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని ఎస్పీ ధ్వజమెత్తింది. యూపీ బులంద్‌షహర్ జిల్లాలోని శిఖర్‌పూర్‌లో ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలని ఆరెస్సెస్ భావిస్తోందని, ‘సైనిక్’ స్కూల్ తరహాలో ఈ పాఠశాలలో పిల్లలకు భారత సైన్యానికి పనికొచ్చేవిధంగా శిక్షణ ఇవ్వనున్నారని, దీంతోపాటు సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో బోధన ఉంటుందని కథనాలు వచ్చాయి. -
ఎన్నో పార్టీలు ఎప్పటికీ అంగీకరించవు!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కీలక అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణపై ఓ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోపాటు పలు పార్టీల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో పార్టీలు జమిలి ఎన్నికలను ఎప్పటికీ అంగీకరించబోవని ఆయన తేల్చిచెప్పారు. జమిలి ఎన్నికల పేరిట దేశ ప్రజల దృష్టిని మళ్లించడం కంటే ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఎక్కువ కష్టపడటంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎస్పీ, బీఎస్పీ అధినేతలైన అఖిలేశ్, మాయావతి పాల్గొనలేదు. -
ఇద్దరి ఎస్పీ నేతల కాల్చివేత
నోయిడా/జాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. శుక్రవారం నోయిడాలోని దద్రీ ప్రాంతంలోని తన ఇంటి సమీపంలోనే ఆయన్ను కాల్చి చంపారు. రామ్‌తేక్ కటారియా దద్రీ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నారు. ‘జర్చా రోడ్డు సమీపంలో 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆయన్ను 5 సార్లు కాల్చి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది’అని పోలీసు అధికారి వెల్లడించారు. దీనివెనుక ఎలాంటి రాజకీయ కుట్రలేదని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా జాన్‌పూర్‌లో శుక్రవారం ముసుగులు ధరించిన ఆరుగురు అగంతకులు జరిపిన కాల్పుల్లో మరో ఎస్పీ నేత లాల్జీ యాదవ్ (51) మరణించారు. ఖాన్పూర్ సమీపంలోని షాగంజ్–జాన్పూర్ రోడ్డుపై ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. -
పూర్వాంచల్‌లో ఎవరిది విజయం?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ఫలితాలను పూర్వాంచల్‌గా పిలిచే తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఎన్నికలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ ప్రాంతంలో 27 సీట్లు ఉండగా 2014 ఎన్నికల్లో బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌ను కలుపుకొని 26 సీట్లను గెలుచుకుంది. కనీసం పది సీట్లలో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై 20 శాతం అధిక ఓట్లతో విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 36 శాతం ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా 71 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు పూర్వాంచల్‌లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ. బద్ద వైరులైన ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపి మహా కూటమిగా పోటీ చేయడమే అందుకు కారణం. గత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతం మొత్తం బీజేపీకన్నా ఎక్కువ. గత ఎన్నికల్లో మొత్తంగా బీజేపీకి 42.23 శాతం ఓట్లు రాగా, ఎస్పీకి 20.82 శాతం, బీఎస్పీకి 26.25 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండింటి ఓట్ల శాతాన్ని కలిపితే దాదాపు 47 శాతానికిపైగా ఓట్లు, అంటే బీజేపీకన్నా దాదాపు ఐదు శాతం ఓట్లు ఎక్కువ. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి అనుకూల పవనాలు పెరిగితే సాధారణంగా బీజేపీకే ఓట్ల శాతం పెరిగి, ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమికి ఓట్ల శాతం తక్కువవుతాయి. అయితే అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రంతోపాటు దేశంలో గ్రామీణ ఆదాయం బాగా తగ్గిపోవడం, వేతనాలు పడిపోవడం, మున్నెన్నడులేని విధంగా నిరుద్యోగం పెరిగిపోవడం, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నష్టపోవడం, లక్షల సంఖ్యలో కార్మికులు రోడ్డున పడడం, అభివద్ధి కార్యక్రమాలు అంతంత మాతంగానే విజయం సాధించడం ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలు. ఇక మోదీ వ్యక్తిగత ప్రతిష్ట, హిందూత్వ జాతీయ వాదం ఎంతమేరకు పనిచేస్తాయో చెప్పలేం! -
ఎస్పీ, బీఎస్పీ మధ్య మోదీ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నాటి నుంచి విపక్షాల మహా కూటమిని మహా కలయిక అంటూ విమర్శిస్తూ వచ్చారు. ఇంతకాలం దోచుకున్న సొమ్మును కాపాడుకునేందుకు వారంతా ఒక్క చోట కూడారని కూడా ఆరోపిస్తూ వచ్చారు. గత వారం నుంచి ఆయన తన పంథా మార్చుకొని కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఏకమైన బీఎస్పీ, ఎస్పీ పార్టీల మధ్య చిచ్చు రేపడమే ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సమాజ్‌వాది పార్టీ నాయకులు నిర్వహిస్తున్న ప్రచార వేదికలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంగా పంచుకుంటున్నారని, ఈ విషయాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి కనీసం గుర్తించలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న చోట ఆ పార్టీకి ఎస్పీ మద్దతిచ్చేలా, ఎస్పీ పోటీ చేస్తున్న చోట కాంగ్రెస్ మద్దతిచ్చేలా వారి మధ్య లోపాయికారి ఒప్పందం కుదరిందనే అనుమానం తలెత్తాలని, తద్వారా ఎస్పీతో బీఎస్పీకి పొరపొచ్చాలు రావాలన్నది మోదీ ఎత్తుగడగా అర్థం అవుతోంది. 20 ఏళ్లపాటు ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యర్థులుగా కొనసాగిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసేందుకు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో చేరాలనుకున్న కాంగ్రెస్‌కు పొత్తు పొసగలేదు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ విషయంలోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ మహా కూటమిలో చేరకపోయినప్పటికీ వాటి మధ్య ఎన్నికల అవగాహన ఉన్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. ఎస్పీ–బీజేపీ కూటమి ఓట్లను చీల్చకుండా, బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్న చోటనే కాంగ్రెస్ పోటీ పెడుతోందని, తద్వారా బీజేపీని ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించడమే వాటి మధ్య అవగాహన అంటూ వార్తలు వచ్చాయి. వీటిని తొలుత ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గత వారం ఎన్నికల ప్రచారంలో, విజయం సాధించడం లేదా బీజేపీ ఓట్లను కత్తిరించడం లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. దీనికి ఎస్పీ–బీఎస్పీల నుంచి ఖండన లేదంటే ఆమె వ్యాఖ్యల్లో నిజం ఉందని భావించాలి. ఇది గ్రహించే మోదీ, ఎస్పీ–బీఎస్పీ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతుంది. ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌తో రాహుల్ గాంధీకి ఇప్పటికీ సత్సంబంధాలు ఉండడం, గత ఎన్నికల్లో ఇద్దరు కలిసి ‘యూపీకే లడ్కే’ అంటూ సంయుక్తంగా ప్రచారం కొనసాగించడం, ఉత్తరాది రాష్ట్రాల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి రాహుల్ గాంధీ ససేమిరా అనడం తదితర పరిణామాల నేపథ్యంలో మాయావతి మనస్సులో అనుమానపు బీజాలు నాటవచ్చని మోదీ భావించవచ్చు. నాయకుల మధ్య పొరపొచ్చాలు రాకపోయినా, పార్టీల కార్యకర్తలు, అభిమానుల మధ్య అనుమానాలు తలెత్తినా ఇరుపార్టీల మధ్య ఓట్ల బదిలి తగ్గుతుందన్న ఆశ కూడా ఉండవచ్చు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఓటర్ల నాడి ఎస్పీ–బీఎస్పీ కూటమికి అనుకూలంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. మొత్తంగా ఏడు విడతల పోలింగ్ పూర్తయి, ఫలితాలు ఏర్పడితేగానీ ఎవరి వ్యూహం పనిచేసిందో తేలిపోతుంది. -
అఖిలేష్ వైపే యాదవ యువతరం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలు నువ్యా, నేనా అన్నట్లు పోటీ పడుతున్న బీజేపీ, ఎస్సీ, బీఎస్సీ కూటములకు ప్రతిష్టాత్మకంగా పరిణమించడమే కాకుండా యాదవ్‌లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో యాదవ్‌ల మధ్య కూడా చర్చలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో యాదవ్‌ల ప్రయోజనాలను పరిరక్షించగలిగిన సత్తా ఒక్క అఖిలేష్ యాదవ్‌కే ఉందని, ఆయనకు ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్కన్నా పెద్ద నాయకుడు అయ్యే అవకాశం ఉందని అమర్ సింగ్ యాదవ్ వాదిస్తుండగా, మన కమ్యూనిటీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమని, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనే దేశం సురక్షితంగా ఉంటుందని వినోద్ సింగ్ యాదవ్ వాదిస్తున్నారు. వీరిద్దరు బాల్య మిత్రులు. ఇప్పటి వరకు వారు ఏ విషయంలో వారు విభేదించిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి వారిద్దరి మధ్య ఎవరిని సమర్థించాలనే విషయమై ప్రతిరోజు ఈ వాదన చెలరేగుతూనే ఉంది. ఓ చిన్న రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అమర్ సింగ్ యాదవ్ వద్దకు ప్రతిరోజు వినోద్ సింగ్ యాదవ్ వచ్చి ఓటు విషయమై వాదనకు దిగుతారు. వారి మిత్రులు చెరోవైపు చేరి పోతారు. చివరికి మెజారిటీ మిత్రులు అమర్ సింగ్ యాదవ్ పక్షం చేరిపోగా, వినోద్ సింగ్ యాదవ్ ససేమిరా అమర్ సింగ్ యాదవ్‌తో ఏకీభవించడం లేదు. దాంతో ఎన్నికలయ్యే వరకు తన షాపు వద్దకు రావద్దంటూ వినోద్ సింగ్‌ను అమర్ సింగ్ కోరారు. మోదీకి ఓటేస్తానని ఒప్పుకునే వరకు తాను వస్తూనే ఉంటానని వినోద్ సింగ్ స్పష్టం చేశారు. మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమిటో చెప్పమని అమర్ సింగ్ సవాల్ చేశారు. మోదీ వల్ల మన యాదవులతోపాటు, పేదలకు, మధ్య తరగతి కుటుంబాల వారికి పక్కా ఇళ్లు, కరెంట్ సదుపాయం, స్వచ్ఛ భారత సిద్ధించాయని వినోద్ సింగ్ తెలిపారు. ‘మన రాష్ట్రంలో మన యాదవ్‌లకు గత పదేళ్ల నుంచే పక్కా ఇళ్లు ఉన్నాయి. ఏ రోజున కరెంట్ పోయిన సందర్భాలు మనకు లేవు. ఇక స్వచ్ఛ భారత్ సంగతి దేవుడెరుగు! ఏ రోజున మన పరిసరాలు శుభ్రంగా లేవు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా నెరవేరలేదు. సబ్కా వికాస్ అన్నారు. ఎక్కడా కనిపించడం లేదు. అయోధ్యలో రామాలయాన్ని కడతామన్నారు. ఇంతవరకు లేదు. 370 అధికరణను రద్దు చేస్తానన్నా అదీ లేదు. ఇప్పుడేమో మోదీ వీటన్నింటిని విస్మరించి పాకిస్థాన్, హిందూ–ముస్లింలు అంటూ విద్వేష అంశాలను అందుకున్నారు’ అంటూ అమర్ సింగ్ యాదవ్ వాదించారు. ఫిరోజాబాద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో, ఎటావా లోక్‌సభ పరిధిలో నివసిస్తున్న సోను యాదవ్ అనే 23 ఏళ్ల యువకుడు అమర్‌సింగ్ యాదవ్ వాదనను విని తాను అఖిలేష్ యాదవ్ భయ్యా అభిమానినని చెప్పుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా రాఫెల్ ఆరోపణలైనా వచ్చాయని, అఖిలేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని, సమీప భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలు, సామర్థ్యం అయనకు ఉన్నాయని, అవకాశం వస్తే మోదీకన్నా మంచి ప్రధాని అవుతారని అన్నారు. మోదీ వచ్చిన తర్వాత జరిగిదల్లా మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమేనని, మోదీ కారణంగా మన రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదని, ఐదేళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో, ఇప్పుడలాగే ఉందన్నారు. అఖిలేష్ యాదవ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్‌లు ఇవ్వడం లాంటి మంచి కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. తాజ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ పూర్తవడం అఖిలేవ్ యాదవ్ పుణ్యమేనని చెప్పారు. అమర్ సింగ్ యాదవ్, వినోద్ సింగ్ యాదవ్‌లు ఫిరోజాబాద్ నియోజక వర్గానికి చెందిన వారు. ఇక్కడ రేపు, మంగళవారం పోలింగ్ జరుగుతోంది. ఇక యాదవ్‌లు ఎక్కువగా ఉన్న మైపూరి, ఎటావా, షాజహాన్‌పూర్, కన్నాజ్లకు ఈ నెల 29న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో యాదవ్‌లు మోదీకి, అఖిలేష్ యాదవ్‌కు మధ్య చీలిపోగా, ఇప్పుడు ఎక్కువ మంది అఖిలేష్ వైపే మొగ్గు చూపుతున్నారు. -
డింపుల్ యాదవ్ 30ఏళ్ల రికార్డు!
దేశంలో గత ముప్పయ్యేళ్లలో లోక్‌సభకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక మహిళ డింపుల్ యాదవ్. మొత్తం ఎన్నికల చరిత్రలో ఈ ఘనత సాధించిన 44వ వ్యక్తి కూడా ఆమే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అయిన డింపుల్ యాదవ్.. కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రుల పేర్లో లేదా కుటుంబ వారసత్వాన్నో ఉపయోగించుకుని రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్లుంటారు. డింపుల్ యాదవ్ భర్త అఖిలేశ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె మామ ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర రాజకీయ ప్రముఖుడు. అయితే, డింపుల్ వీరి సాయంతో రాజకీయాల్లో రాణించలేదు. తన సొంత ప్రతిభతో రాష్ట్రంలో, పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నా కంటే డింపుల్ ఎన్నికల సభలకే ఎక్కువ జనం వస్తార’ని స్వయంగా అఖిలేశ్ యాదవే అన్నారంటే ఆమె చరిష్మా ఎలాంటిదో అర్థమవుతుంది. 2012లో భర్త ఖాళీ చేసిన కనౌజ్ లోక్‌సభ స్థానంలో గెలవడంతో డింపుల్ రాజకీయ జైత్రయాత్ర మొదలైంది. కనౌజ్ నుంచి గెలిచిన అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీకి వెళ్లడం కోసం ఆ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో డింపుల్ సహా ముగ్గురు పోటీ చేశారు. వారిలో ఒక ఇండిపెండెంట్, సంయుక్త సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అసలు అభ్యర్థులనే పెట్టలేదు. దాంతో డింపుల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 2009లో ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా ఎన్నికల్లో అరంగేట్రం చేశారామె. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2014లో మోదీ హవాలో యూపీలోని 80 లోక్‌సభ సీట్లలో ఎస్పీకి ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. వాటిలో డింపుల్ పోటీ చేసిన కనౌజ్ ఒకటి. రాష్ట్ర ప్రజలు ‘బహు’, ‘భాభీ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే డింపుల్ రాజకీయంగా పరిణతి సాధించారు. కాగితంపై రాసుకుని ప్రసంగించే స్థాయి నుంచి సొంతంగా అనర్గళంగా ప్రసంగించే స్థాయికి ఎదిగారు. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. -
మహిళల ఓట్లు నాకే
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్’ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించకపోవడాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. ఈ అంశంలో అఖిలేశ్ మౌనం వహించడంతో ఇప్పుడు మహిళలు ఆ పార్టీకి దూరం అయ్యారనీ, ఇక స్త్రీలంతా తనకే ఓటు వేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్‌లో ఎస్పీ తరఫున ఆజంఖాన్, బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తుండటం తెలిసిందే. అఖిలేశ్ సమక్షంలోనే ఆజం ఖాన్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా అఖిలేశ్ ఏమీ అనలేదనీ, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఆజంఖాన్ లాంటిదేనని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే అభద్రతా భావంతోనే ఆజంఖాన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఉంటాడని జయప్రద పేర్కొన్నారు. ఆంజఖాన్ వ్యాఖ్యలు చేయడం చిన్న అంశమంటూ అఖిలేశ్ భార్య డింపుల్ అనడం పట్ల జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశం మొత్తం తనవైపు ఉంటే డింపుల్, జయా బచ్చన్, షబానా అజ్మీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్ ప్రచారం చేయకుండా 72 గంటలపాటు నిషేధించిన ఎన్నికల సంఘానికి, అలాగే ఈ అంశంపై స్పందించి ఆజంఖాన్‌కు నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్‌కు జయప్రద ధన్యవాదాలు తెలిపారు. అన్నా అని పిలిచి తప్పు చేశా.. ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచి తాను తప్పు చేశానని జయప్రద అన్నారు. ఖాన్ పైకి కనిపించేంతటి మంచి మనిషి కాదనీ, లోపల ఇంకో మనిషి ఉన్నాడని ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడన్నారు. ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని జయప్రద అన్నారు. ఖాన్ వ్యాఖ్యలతో రాంపూర్ మహిళలంతా తన పక్షాన నిలవనున్నారనీ, ఇప్పుడు పోటీలో ఉన్నది జయప్రద కాదు, ప్రజలేనని ఆమె అభివర్ణించారు. రాంపూర్ లోక్‌సభ స్థానానికి జయప్రద 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా అమర్‌సింగ్‌తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం రాంపూర్‌లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తనకు మద్దతు తెలపకపోవడంపై జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. -
కుటుంబ కథా చిత్రం
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలిచిన ఐదు సీట్లూ పార్టీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు పోటీ చేసినవే. ఈసారి ఈ ఐదు స్థానాల్లో మూడు చోట్ల ఎస్పీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నారు. మిగిలిన రెండు సీట్లలో (కనౌజ్, ఫిరోజాబాద్) ములాయం కోడలు డింపుల్, ఆయన అన్న మనవడు అక్షయ్ యాదవ్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో ములాయం సొంత స్థానం మైనపురీ, తూర్పు యూపీలోని ఆజమ్గఢ్ నుంచి పోటీచేసి గెలిచారు. మైన్‌పురీ సీటుకు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న రతన్‌సింగ్ యాదవ్ మనవడు తేజ్‌ప్రతాప్ విజయం సాధించారు. కోడలు డింపుల్ తమ కంచుకోటగా భావించే కనౌజ్ నుంచి మూడోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వరుసకు తమ్ముడైన ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్ కొడుకు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్‌లో తొలిసారి విజయం సాధించారు. బదాయూన్ నుంచి ములాయం మరో అన్న అభయ్‌రాం కొడుకు ధర్మేంద్ర యాదవ్ ఎస్పీ టికెట్‌పై విజయం సాధించారు. ఈ ఐదుగురూ మళ్లీ తమ పాత నియోజకవర్గాల నుంచే ఎస్పీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ మిత్రపక్షం బీఎస్పీ ఎస్పీకి మద్దతు ఇవ్వడం. అంతేకాదు, కాంగ్రెస్ ఈ స్థానాల్లో ఒక్కచోటే అభ్యర్థిని నిలిపింది. కనౌజ్లో డింపుల్‌కు గట్టి పోటీ? గతంలో రెండుసార్లు (2012 ఉప ఎన్నిక, 2014) కనౌజ్ నుంచి గెలిచిన డింపుల్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఎస్పీ, అధ్యక్షుడైన ఆమె భర్త అఖిలేశ్ అంతకు ముందు మూడు సార్లు, మామ ములాయం ఒకసారి విజయం సాధించిన స్థానం ఇది. 2019లో డింపుల్‌కు బీఎస్పీ మద్దతు ఉంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీ పెట్టలేదు. ములాయం తమ్ముడు, మాజీ మంత్రి శివపాల్‌సింగ్ కూడా తన సొంత పార్టీ ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) తరఫున మొదట అభ్యర్థిని ప్రకటించి తర్వాత నామినేషన్ వేయించకపోవడంతో డింపుల్ సునాయాసంగా గెలవాలి. అయితే, 2014లో ఆమె సమీప బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై కేవలం 19 వేలకు పైగా ఓట్లతోనే విజయం సాధించారు. మళ్లీ బీజేపీ టికెట్‌పై పాఠక్ పోటీచేస్తున్నారు. ఈ ముఖాముఖి పోటీలో పాఠక్ నుంచి డింపుల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 1999 నుంచీ ఎస్పీ గెలుచుకుంటున్న కనౌజ్లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 18.5 లక్షలు. వారిలో ముస్లింలు 3 లక్షలు, యాదవులు 2.5 లక్షలు, దళితులు మూడు లక్షలు, బ్రాహ్మణులు రెండు లక్షల మంది ఉన్నారు. బ్రాహ్మణుడైన బీజేపీ అభ్యర్థి పాఠక్ ఈసారి డింపుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఫిరోజాబాద్‌లో ముసలం ఫిరోజాబాద్ ప్రస్తుత ఎంపీ అక్షయ్ తండ్రి, ములాయంకు వరుసకు సోదరుడైన రాంగోపాల్ 2014లో తన కొడుకుకు పార్టీ టికెట్ ఇప్పించడంలో విజయం సాధించారు. కాని, ములాయం తమ్ముడు శివపాల్ తన కొడుకు ఆదిత్యకు ఫిరోజాబాద్ టికెట్ వస్తుందని ఆశించారు. ఫలితంగా తమ్ముడు, వరుసకు తమ్ముడి మధ్య అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలు అఖిలేశ్ చేతుల్లోకి పోవడంతో ఇవి ముదిరాయి. పీఎస్పీ పార్టీ పెట్టిన శివపాల్ ఇప్పుడు తానే స్వయంగా ఫిరోజాబాద్‌లో అక్షయ్‌పై పోటీకి దిగి రాంగోపాల్‌పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్షయ్‌కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చంద్రసేన్ జాదోన్ నుంచి గట్టి పోటీ ఉంది. శివపాల్‌సింగ్ కూడా రంగంలో ఉండటంతో ఎస్పీ మద్దతుదారుల ఓట్లు చీలి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏర్పడింది. అయితే, తమ ఎన్నికల ప్రచారం లక్ష్యం శివపాల్‌ను గెలిపించడమేనని, ఆయన విజయం ఖాయమని పీఎస్పీ నేత రాందర్శన్ యాదవ్ చెప్పారు. శివపాల్ పోటీ వల్ల ఇక్కడ యాదవులు, ముస్లింల ఓట్లు చీలిపోయే మాట నిజమేగాని అక్షయ్ గెలుస్తారని జిల్లా ఎస్పీ నేత సుమన్ దేవి భర్త రఘువీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంపీగా ఎన్నికయ్యాక అక్షయ్ నియోజవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వారు కోపంతో ఉన్న మాట వాస్తవమే. కాని, ఈ సమస్య పరిష్కరించాం’ అని ఆయన వివరించారు. బీజేపీ అభ్యర్థి జాదోన్ ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. 2014లో ఓడిన బీజేపీ అభ్యర్థి ఎస్పీ బాఘేల్‌ను ఇక్కడ పోటీకి దింపకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొన్నది. ఈ సీటులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపలేదు. 2009లో కనౌజ్‌తో పాటు ఫిరోజాబాద్ నుంచి కూడా ఎన్నికైన అఖిలేశ్ రాజీనామా చేశాక ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డింపుల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. ఆజంగఢ్‌లో అఖిలేశ్.. ఆజంగఢ్‌లో తొలిసారి పోటీచేస్తున్న అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు దినేశ్‌లాల్ యాదవ్ ‘నిరాహువా’ను బీజేపీ బరిలోకి దింపింది. అఖిలేశ్ సీఎంగా ఉన్న కాలంలోనే ఈ నటుడికి సీఎం చేతుల మీదుగా ‘యశ్భారతీ’ అవార్డు ప్రదానం చేశారు. ఇక్కడ మాత్రం శివపాల్‌యాదవ్ పార్టీ పీఎస్పీ తన అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఇక్కడ అఖిలేశ్ విజయం నల్లేరు మీద నడకగా సాగిపోతుందని అంచనా. మైన్‌పురీ నుంచి ములాయం మళ్లీ.. 2014 ఎన్నికల్లో ములాయం సొంత నియోజకవర్గం మైన్‌పురీలో బీజేపీ ప్రత్యర్థి శత్రుఘన్సింగ్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించారు. అనంతరం ములాయం రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న మనవడు తేజ్‌ప్రతాప్ తన బీజేపీ ప్రత్యర్థి ప్రేంసింగ్ శాక్యాను మూడు లక్షల 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు మళ్లీ ములాయం ఇక్కడి నుంచే బరిలోకి దిగగా, ఆయనపై బీజేపీ నుంచి ప్రేంసింగ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పోటీలో లేదు. బదాయూన్‌లో త్రిముఖ పోటీ ములాయం అన్న మనవడు, సిట్టింగ్ సభ్యుడు ధర్మేంద్ర మళ్లీ పోటీ చేస్తున్న బదాయూన్‌లో బీజేపీ తరఫున యూపీ కేబినెట్ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కూతురు సంఘమిత్ర బరిలోకి దిగారు. 2014లో ఆమె బీఎస్పీ అభ్యర్థిగా మైన్‌పురీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2016లో సంఘమిత్ర తన తండ్రితోపాటు బీజేపీలో చేరారు. ఇక్కడ పీఎస్పీ అభ్యర్థిని నిలపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సలీం షేర్వానీ పోటీ చేస్తున్నారు. ఆయన 1996 నుంచి ఎస్పీ తరఫున మూడుసార్లు పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. -
‘‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకు టికెట్ ఇవ్వలేదు’
లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మైభీ చౌకీదార్’ ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ నాయకులంతా ట్విటర్ అకౌంట్లో తమ పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకుంటున్నారు. అయితే తాను పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకే పార్టీ తనకు టిక్కెట్ నిరాకరించిందని బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఆరోపించారు. బుదవారం బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన అన్షుల్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ట్విటర్లో నా పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోలేదు. అదికాక ఈ మధ్య పార్టీ చేస్తోన్న కొన్ని పనులను వ్యతిరేకించాను. ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు మద్యం సరఫరా చేయడాన్ని తప్పు పట్టాను. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాను. అందువల్లే నాకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. దీని గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సైతం లేఖ రాశాను. కానీ ఆయన స్పందించలేద’ని అన్షుల్ వర్మ తెలిపారు. అంతేకాక బీజేపీలో నిరంకుశత్వం రాజ్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఎస్పీలోకి ఎలాంటి షరతులు లేకుండా చేరానని అన్షుల్ తెలిపారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని అన్షుల్ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో అన్షుల్ వర్మ హర్దోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ ఈ టికెట్‌ను జై ప్రకాశ్ రావత్‌కు కేటాయించింది. -
తండ్రి స్థానం నుంచి తనయుడు పోటీ
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. 2014లో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసి గెలిచిన ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. ఆదివారం రెండు స్థానాలకు ట్విటర్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఆజంగఢ్ నుంచి అఖిలేష్, రాంపూర్ నుంచి పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. ప్రస్తుతం ఆజం ఖాన్ రాంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ జాబితాతో ములాయం మరోసారి తన స్థానం నుంచే పోటీ చేస్తారన్న పుకార్లకు తెర పడింది. కాగా ఎస్పీ కురువృద్ధుడు ములాయంసింగ్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి ములాయం పోటీ చేయనున్నారు. మొదట అఖిలేష్ తన భార్య డింపుల్ యాదవ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కన్నౌజ్ నుంచి పోటీ చేస్తారని పుకార్లు వెలువడినాయి కానీ, ఆయన తన తండ్రి స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఆజంగఢ్ కంచుకోటగా ఉంది. ఇక ములాయంసింగ్ పోటీ చేయనున్న మొయిన్‌పురి కూడా ఎస్పీకి కంచుకోటగానే చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో ములాయం ఇక్కడ నుంచి గెలిచి రాజీనామా చేశారు. ఇక ఎస్పీ మిత్ర పక్షమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అజంగఢ్‌లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు. (ఆరు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన) -
24 ఏళ్ల తర్వాత తొలిసారి ములాయం కోసం
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ రాజకీయాల్లో దిగ్గజాలైన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మధ్య దశాబ్దాలు సాగిన బద్ధవైరానికి త్వరలోనే అధికారికంగా ముగింపు పడబోతోంది. ములాయం సింగ్‌తోనే వేదిక పంచుకోవడమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో ఆయన తరఫున మాయావతి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 19వ తేదీన ఎస్పీ మెయిన్‌పురిలో నిర్వహించనున్న సభకు హాజరుకావాలని మాయావతి నిర్ణయించారు. యూపీ రాజకీయాలను కుదిపేసిన 1995 నాటి గెస్ట్‌హౌస్ సంఘటన తర్వాత మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అప్పట్లో గెస్ట్‌హౌస్‌లో మాయావతి ఉండగా.. ఎస్పీ కార్యకర్తలు, నేతలు దాడులు జరిపారు. అయితే, ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ శత్రుత్వాన్ని పక్కనబెట్టి.. ఎస్పీ-బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. యూపీలో మోదీని, బీజేపీని నిలువరించేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. అయితే, గెస్ట్‌హౌస్ అవమానాన్ని మరిచిపోయి.. మాయావతి ఎస్పీతో చేతులు కలిపిందని బీజేపీ చేస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు ములాయంతో వేదిక పంచుకునేందుకు మాయావతి సిద్ధమయ్యారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తులో భాగంగా అఖిలేశ్, మాయావతి కలిసి యూపీలో మొత్తం 11 ర్యాలీల్లో సంయుక్తంగా పాల్గొనబోతున్నారు. -
యంగ్ అండ్ డైనమిక్ అఖిలేశ్ భాయ్!
సాక్షి వెబ్ ప్రత్యేకం : యూపీ రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అఖిలేశ్ యాదవ్... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకుడిగా ఎదిగారు. ఒకానొక సమయంలో తండ్రిపైనే తిరుగుబాటు చేసి.. కుటుంబ పోరులో పైచేయి సాధించి సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నారు. పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఈ డైనమిక్ లీడర్.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎంపీగా రాజకీయ ఓనమాలు దిద్దిన ఎస్పీ కింగ్...కేంద్రంలో చక్రం తిప్పడమే ధ్యేయంగా ఒకప్పుడు తమకు బద్ధశత్రువైన బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ‘సిసలైన’ రాజకీయ నేత అనిపించుకుంటున్నారు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ఆగాల్సిందే! పర్యావరణ ప్రేమికుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్- మాలతీ దేవి దంపతులకు జూలై 1, 1973లో ఇటావా జిల్లాలోని సైఫీ గ్రామంలో అఖిలేశ్ జన్మించారు. రాజస్తాన్‌లోని ధౌలాపూర్ సైనిక్ స్కూళ్లో విద్యనభ్యసించారు. అనంతరం మైసూరు యూనివర్సిటీ నుంచి సివిల్ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అఖిలేశ్... సిడ్నీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందే నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు పలు ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రాజకీయ ప్రస్థానం తన 27వ ఏట అఖిలేశ్ యాదవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. 2000వ సంవత్సరంలో కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లో కనౌజ్, ఫిరోజాబాద్ నియోజకవర్గాల్లో జయభేరి మోగించి అఖిలేశ్ కనౌజ్ ఎంపీగా కొనసాగారు. ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేసి అక్కడ తన భార్య డింపుల్ యాదవ్‌ను నిలబెట్టగా.. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎస్పీ యూత్ వింగ్‌కు నాయకత్వం వహించిన అఖిలేశ్.. 2009లో యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో గూండాగిరీని అంతం చేసి.. విద్యాభివృద్ధి చేస్తామంటూ యువతే లక్ష్యంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు పంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఈ క్రమంలో ములాయం, అఖిలేశ్‌ల నాయకత్వంలో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 224 స్థానాల్లో ఎస్పీ విజయ బావుటా ఎగురవేసింది. దీంతో ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేశ్‌కు సీఎంగా పగ్గాలు అప్పగించారు. తద్వారా అతిపిన్న వయస్సులోనే అఖిలేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. బాబాయ్- అబ్బాయ్‌ల మధ్య వివాదం 2017 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన విషయంలో ములాయం సోదరుడు శివపాల్ యాదవ్, అఖిలేష్ మధ్య వివాదం ప్రారంభమైంది. శివ్‌పాల్ యాదవ్ ప్రకటించిన పేర్లను పక్కకు పెట్టి అఖిలేశ్ మరికొన్ని పేర్లను సూచించడం పార్టీ చీలికకు దారి తీసింది. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో అప్పటి ఎస్పీ చీఫ్ములాయం సింగ్ యాదవ్.. అఖిలేశ్, ఆయన మద్దతు దారుడు రాంగోపాల్ యాదవ్ పై సస్సెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. దీంతో ఆగ్రహించిన అఖిలేశ్ మద్దతుదారులు అదే ఏడాది జనవరి 1న లక్నోలో ఎస్పీ జాతీయ సదస్సును ఏర్పాటు చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ములాయంను పదవీచ్యుతుడిని చేశారు. అనంతరం తండ్రీ- కొడుకుల వర్గాలు పార్టీ గుర్తు సైకిల్ కేటాయింపుపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో తొలుత పార్టీ గుర్తును స్తంభింపజేయాలని యోచించిన ఈసీ చివరికి అఖిలేష్‌కే పార్టీ గుర్తును కేటాయించి ములాయంకు షాకిచ్చింది. ఇక 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే 224 సీట్లను గెలుచుకున్న అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్‌వాది పార్టీ 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేసి కేవలం 54 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో తిరిగి పునర్వైభవం పొందేందుకు, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఎస్పీ మద్దతు తీసుకున్న అఖిలేశ్... ఉప ఎన్నికల్లో గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు గెలుచుకున్నారు. ఈ క్రమంలో అఖిలేశ్ తన హయాంలో ఇసుక మాఫియాకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న అఖిలేశ్.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోవడం ద్వారా రాష్ట్రంలోను తిరిగి పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబం ఉన్నత చదువులు ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అఖిలేశ్.. అనేక అవరోధాలు అధిగమించి... 1999లో డింపుల్ రాజ్‌పుత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తొలుత కుమార్తె అదితి తర్వాత కవలలు అర్జున్- టీనా జన్మించారు. ఇష్టాయిష్టాలు తనను తాను సోషిలిస్టుగా చెప్పుకునే అఖిలేశ్ యాదవ్‌కు రామ్ మనోహర్ లోహియా అంటే అభిమానం. - యాళ్ల సుష్మారెడ్డి -
విపక్షాలకు షాకిచ్చిన ములాయం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారు. బుధవారం ఆయన పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. మోదీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని అభినందించారు. ఆయన పాలన బాగుందని.. ఆయనను ఎవరు వెలేత్తి చూపలేరని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మోదీ చిన్నగా చిరునవ్వులు చిందించారు. ములాయం వ్యాఖ్యలతో ఎస్పీ సభ్యులు షాక్‌కు గురయ్యారు. కాగా, మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీఎస్పీతో సైతం అఖిలేశ్ జత కట్టారు. మోదీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రస్తుతం ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు తలెత్తినప్పటి నుంచి అఖిలేశ్, ములాయం మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. -
యూపీలో కులం ఓటు ఎటు?
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎటువైపు నిలవనుంది? రాష్ట్రంలో ఓట్ల సాధనలో ప్రధాన అంశమైన ‘కులం’ ఈ సారి ఎవరిని గెలిపించనుంది? అగ్రవర్ణ మద్దతుదారు బీజేపీనా? దళిత, యాదవ మద్దతుదారు ఎస్పీ– బీఎస్పీ కూటమినా? ఈ మూడు పార్టీలకు చెందని కులాలతో పాటు ప్రియాంకను రంగంలోకి దింపి గతంలో మద్దతిచ్చిన కులాలను ఆకర్షించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్నా?.. మాకూ చాన్స్ ఉంది.. యూపీలో బీజేపీ వెనుక అగ్రవర్ణాలు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పక్షాన వెనుకబడిన వర్గాలు(యాదవులు), బీఎస్పీ వైపు దళితులు (అత్యధిక జనాభా ఉన్న జాటవులు సహా) నిలుస్తారనేది సాధారణ సమీకరణం. బీజేపీ 2014 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యాదవేతర బీసీలు, జాటవేతర ఎస్పీలను కూడా తన వైపు తిప్పుకుని ఘనవిజయం సాధించింది. రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం ద్వారా ఈ వర్గాల్లో అత్యధిక జనాభాను ఆకర్షించగలిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆ వ్యూహాన్నే అమలు పరచనుందని తెలుస్తోంది. ఓటర్లు సామాజికవర్గాలవారీగా చీలిన యూపీలో కాంగ్రెస్‌కు ఇంకా తగినంత చోటు ఉందని ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం గమనార్హం. తమ పాత పునాదివర్గాలైన బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులను చెప్పుకోదగ్గ సంఖ్యలో మళ్లీ కాంగ్రెస్ గూటికి రప్పించడం పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. కులం ప్రభావం తక్కువేం కాదు! 1990ల నుంచీ యూపీలో రాముడి పేరుతో అత్యధిక హిందువులను బీజేపీ సమీకరించగలిగినా కులం ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని గత 30 ఏళ్ల రాజకీయాలు, ఎన్నికలు నిరూపించాయి. 1991 నుంచి 2002 వరకూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అత్యధిక సీట్లతో ఆధిపత్యం చెలాయించింది. కానీ, 2007, 2012 ఎన్నికల్లో కులాల ఆధారంగా పనిచేసే ఎస్పీ, బీఎస్పీలు మెజారిటీ సీట్లు సాధించాయి. అయినా తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా కులం ప్రభావం ఎక్కువే ఉందని అనేక ఎన్నికల సర్వేల్లో తేలింది. హిందీ రాష్ట్రాల్లో 55 శాతం ఓటర్లు తమ కులానికి చెందిన అభ్యర్థులకే ఓటేసే అవకాశాలు ఎక్కువని సీఎస్డీఎస్–అజీమ్ ప్రేమ్‌జీ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చెబుతోంది. మొదట్లో అగ్రవర్ణాలు కాంగ్రెస్‌కు మద్దతుదారులు. గత మూడు దశాబ్దాలుగా వారిలో అత్యధికులు బీజేపీకి దగ్గరయ్యారు. దళితులు బీఎస్పీ వైపు, యాదవులు ఎస్పీ వైపు వెళ్లారు. యాదవేతర కులాలైన కుర్మీ, కోయిరీ, లోధ, గుజ్జర్, రాజ్‌భర్, నిషాద్‌ల జనాభా 29% వరకూ ఉంది. వీరిని ఆకర్షించడం ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా మారింది. ప్రియాంక పాచిక పారుతుందా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం ప్రియాంక గాంధీ ముందున్న తక్షణ లక్ష్యం. అందుకు ముందుగా, ఆమె గతంలో కాంగ్రెస్‌కు పునాదిగా నిలిచి, ఇటీవలి దశాబ్దాల్లో పార్టీకి దూరమైన కులాలను మళ్లీ వెనక్కు తీసుకురావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే, మొదట్నుంచీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన బ్రాహ్మణ నేతల కుటుంబ సభ్యులను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల్లోని బ్రాహ్మణ నేతలతో కూడా ప్రియాంక గాంధీతో భేటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. -
‘సైకిల్’ కోసం న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సైకిల్ గుర్తునే కేటాయించాలని కోరుతున్న సమాజ్‌వాదీ పార్టీ ఈ విషయంలో న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు హైకోర్టులో కేసు వేయనున్నట్లు తెలిసింది. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో విజయం సాధిం చినందున.. ఆ గుర్తును కేటాయించలేమని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. బుధవారం ఎస్పీకి ఓ తాత్కాలిక గుర్తును ఖరారు చేయనుంది. అయితే, జాతీయ పార్టీ అయిన తమకే సైకిల్ గుర్తును ఇవ్వాలని ఎస్పీ వాదిస్తోంది. టీడీపీ పోటీచేసే 13 నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన 106 స్థానాల్లో తమకు ఆ గుర్తును ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ పోటీ చేసే 13 చోట్ల తాత్కాలిక గుర్తుతో పోటీచేసేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు ఈసీ అంగీకరించకపోవడంతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి న్యాయపోరాటా నికే మొగ్గుచూపుతున్నారు. వీలైనంత త్వరగా కేసు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రచారానికి అఖిలేశ్.. ఎస్పీ తరఫున ప్రచారం చేయడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ త్వరలోనే రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, వరంగల్, జనగామ, కరీంనగర్‌తోపాటు ఉత్తర భారతీయులు అధికంగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్‌లలోనూ అఖిలేశ్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని ఆ పార్టీ జనగామ అభ్యర్థి ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య వెల్లడించారు. -
సైకిల్ పేచి
-
కాంగ్రెస్ కోసం ఎదురుచూడలేం
లక్నో: మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయాన్ని కాంగ్రెస్ తొందరగా తేల్చాలని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ స్పందించకుంటే బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కలిసి పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోబోమని బీఎస్పీ ప్రకటించడం తెల్సిందే. ‘పొత్తు విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కోసం ఇప్పటికే చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఇలా ఎంత కాలం వేచి చూడాలి? అని ప్రశ్నించారు. బీఎస్పీతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్న గోండ్వానా గణతంత్ర పార్టీతో చర్చలు జరుపుతామన్నారు. -
గెలవాలంటే ‘చీల్చాల్సిందేనా!’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటీష్ పాలకులు భారతీయులను అన్నేళ్లు పీడించడానికి కారణం వారు అనుసరించిన ‘విభజించు పాలించు’ సూత్రమే కారణం అంటారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రానున్న సార్వత్రికల్లో మరోసారి విజయం సాధించి మరిన్నేళ్లు పాలించేందుకు ప్రతిపక్షా పార్టీలను చీలుస్తోంది. మొన్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్‌ను ప్రోత్సహించి ‘సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా’ పార్టీని పెట్టించగా, ఇప్పుడు తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం బహిష్కత నాయకుడు అళగరిని పార్టీని చీల్చాల్సిందిగా ప్రోత్సహిస్తోంది. యూపీలో అఖిలేష్ యాదవ్‌తో విభేదించిన శివపాల్ యాదవ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. ఆయన తరఫున ఒకప్పుడు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమర్ సింగ్ బీజేపీ అధినాయకత్వంతో సంప్రతింపులు జరపడం, కొత్త పార్టీ పెట్టినట్లయితే తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం తెల్సిన పరిణామాలే. ఈ కారణంగానే శివపాల్ యాదవ్‌కు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండదండలు లభిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ అధిష్టానం కన్ను తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ ద్రావిడ మున్నేట్ర కళగం నాయకత్వంపై పడింది. కరుణానిధి వారసుడిగా డీఎంకే పార్టీ అ«ధ్యక్షుడిగా స్టాలిన్నే ఎన్నుకుంది. స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న అళగిరిని పార్టీ బహిష్కరించింది. దాంతో అళగిరి తన మద్దతుదారులతో తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అళగిరి తన బలప్రదర్శన కోసం నిర్వహించిన ర్యాలీకి కూడా బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలే ఎక్కువగా జన సమీకరణ చేశారని తెల్సింది. నిజమైన పార్టీ క్యాడర్ తన వెంట ఉందని చెబుతున్న అళగిరి మరోసారి తండ్రి కరుణానిధికి నివాళి పేరిట జన సమీకరణకు సిద్ధ మవుతున్నారు. అళగిరి ద్వారా వీలయితే డీఎంకేను చీల్చాలని, లేదంటే ఆయనతోని కూడా కొత్త పార్టీ పెట్టివ్వాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో గట్టిగానే పునాదులు వేసుకున్న బీజేపీకి తమిళనాడులో నామ మాత్రపు బలం కూడా లేదు. 2016లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించినప్పటి నుంచి పాలకపక్ష అన్నాడీఎంకేలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెల్సిందే. రానున్న ఎన్నికల్లో డీఎంకేదే విజయమని సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ఈ నేపథ్యంలో డీఎంకేలో చీలిక తీసుకరావడం ద్వారా తాము బలపడాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తమిళనాడులోని 39 పార్లమెంట్ సీట్లలో కొన్నింటినైనా గెలుచుకోవాలని కోరుకుంటోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 పార్లమెంట్ సీట్లకుగాను 71 సీట్లను బీజేపీ గెలుచుకున్న విషయం తెల్సిందే. వచ్చే ఎన్నికల్లో వీటిలో మెజారిటీ సీట్లను నిలబెట్టుకుంటేనే కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాగలదు. యూపీలో సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఏకమయితే బీజీపీకి పరాభవం తప్పదని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ అసెంబ్లీ, కైరానా లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. అందుకనే బీజీపీ ఇలా విభజన రాజకీయాలను ఆశ్రయించింది.