లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీలో ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్‌తోపాటు, ఎమ్మెల్సీ కవిత, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ములాయంకు నివాళులు అర్పించారు. అనంతరం ములాయం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖలతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
#Telangana Chief Minister KCR paid respects and offered tributes to the mortal remains of the #SamajwadiParty patriarch #MulayamSinghYadav ji and consoles his son and former CM of UP #AkhileshYadav at Saifai today. #Saifai #UttarPradesh #Netaji #Dhartiputra #MulayamSingh #KCR pic.twitter.com/4dPPPlskDi
— Surya Reddy (@jsuryareddy) October 11, 2022
#WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh.
Comments
Please login to add a commentAdd a comment