లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో రాజకీయ నాయకుడు నవాబ్ సింగ్ యాదవ్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నవాబ్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడని తెలుస్తోంది. మరోవైపు.. నవాబ్ సింగ్‌కు బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం.
ఈ ఘటనపై కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యూపీలోని అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 1.30 సమయంలో ఓ బాలిక 112 నంబర్‌కు కాల్ చేసింది. ఈ సందర్బంగా తనపై అత్యాచారం చేశారని, తన అత్తను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో, ఓ పోలీసు ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ నవాబ్ సింగ్, మరో మహిళ ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబ్ సింగ్‌పై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేశాము. కాగా, ఉద్యోగం పేరుతో ఆశ చూపించి నవాబ్ సింగ్ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
#WATCH | Uttar Pradesh: SP leader Nawab Singh Yadav arrested in Kannauj for allegedly attempting to rape a minor girl.
Kannauj SP, Amit Kumar Anand says, "Last night around 1.30 am, a call was received on UP 112 wherein a girl said that she had been stripped and an attempt of… pic.twitter.com/7nD114yei9— ANI (@ANI) August 12, 2024
మరోవైపు.. నవాబ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఎస్పీ అమిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవాబ్ సింగ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ, అతడిని రక్షించేందుకు కొందరు బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
The rape survivor minor girl herself called police and took them to the rapist Samajwadi party leader Nawab.
He's a close man to Dimple Yadav...
Some people really vote for these people? I mean why? pic.twitter.com/6XCIzO5szJ— Mr Sinha (@MrSinha_) August 12, 2024
Comments
Please login to add a commentAdd a comment